Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
వారు ఆయనను విడిచి పారిపోయిరి

THEY FORSOOK HIM AND FLED
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువుదినము సాయంకాలము, మార్చి 4, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 4, 2018

"అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు, ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి, పారిపోయిరి" (మత్తయి 26:56).


గెత్సమనే వనములో యేసు తన ఏకాంత ప్రార్ధన ముగించాడు. నిద్రించుచున్న శిష్యులను ఆయన లేపాడు. ఆయనన్నాడు, "లెండి, వెళ్లుదము: ఇదిగో, నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడని వారితో చెప్పెను" (మత్తయి 26:46). తరువాత యూదా వానితోపాటు "బహుజన సమూహము [గుంపులు], కత్తులు గుడియలు పట్టుకొని ప్రధాన యాజకుల యెద్ద నుండి ప్రజల పెద్దల యెద్ద నుండి వచ్చెను" (మత్తయి 26:47).

గెత్సమనేలో అంధకారములో శిష్యులంతా ఒకేలా కనిపించి యుండేవారు. యూదా దేవాలయపు పెద్దలతో అన్నాడు, "నేనెవనిని ముద్దు పెట్టుకుందునో, ఆయనే యేసు: ఆయనను పట్టుకొనుడి" (మత్తయి 26:48). యూదా యేసు బుగ్గపై ముద్దు పెట్టుకొనెను. "అంతట వారు దగ్గరకు వచ్చి, ఆయన మీదపడి, ఆయనను పట్టుకొనిరి" (మత్తయి 26:50). "సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున, అతడు దానిని దూసి ప్రధాన యజకుని దాసుని కొట్టి, అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు ముల్కు" (యోహాను 18:10). యేసు "వాని చెవి ముట్టి, వానిని బాగు చేసెను" (లూకా 22:51). తరువాత యేసు కత్తిని విడిచిపెట్టమని పెతురుతో చెప్పాడు. యేసు తనతో అన్నాడు, "ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేనని, వేడుకొనిన యెడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువమంది దూతలను ఇప్పుడే నాకు పంపడని అనుకొనుచున్నవా? [72,000 దూతలు!] ఈలాగు జరుగవలెను అను లేఖనము ఏలాగు నేరవేరునని, అతనితో చెప్పెను?" (మత్తయి 26:53-54). తరువాత యేసు తనను బంధించుట వచ్చిన వారితో ఇట్లనెను, "బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియల తోనూ [గుంపులుగా] నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చిండి బోధించుచున్నప్పుడు, మీరు నన్ను పట్టుకొనలేదు" (మత్తయి 26:55). ఇది మనలను మన పాఠ్యభాగానికి నడిపిస్తుంది,

"అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు, ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి, పారిపోయిరి" (మత్తయి 26:56).

వందల సంవత్సరాల క్రితమే ఈ సంఘటనలు జరుగుతాయని ప్రవక్తలు వివరించారు. డాక్టర్ ఆర్. సి. హెచ్. లెన్ స్కీ అన్నాడు, "ఇదంతా ఒక కారణము నిమిత్తము జరిగింది: ‘ప్రవక్తలు లేఖనాలు...నెరవేరునట్టు.’ ఆ రాత్రి జరగబోయేదానికి: ఇవి నిజ శక్తులు దేవుడు తన ప్రవచానాత్మక ప్రణాళికను జరిగించుకున్నాడు, యేసు ఐచ్చికంగా తనను తండ్రి చేతికి అప్పగించుకుంటున్నాడు...ఇప్పుడు 56 వచనము నెరవేరింది. యేసు బంధింపబడి [నప్పుడు], శిష్యులంతా పారిపోయారు" (R. C. H. Lenski, Ph.D., The Interpretation of St. Matthew’s Gospel, Augsburg Publishing House, 1964 edition, p. 1055; note on Matthew 26:56).

"అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు, ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి, పారిపోయిరి" (మత్తయి 26:56).

ఈ ప్రసంగములో, ఈ వచనము లోతుకు వెళ్తాను, శిష్యులు "ఆయనను విడిచి, పారిపోవడానికి" కారణాలు తెలుసుకోవడానికి. డాక్టర్ జార్జి రిక్కర్ బెర్రీ ప్రకారము, గ్రీకు పదము "విడిచి పెట్టుట" కేజేవిలో (KJV) అర్ధము "బహిష్కరించుట" (గ్రీకు ఇంగ్లీష్ లెక్సికాన్ నూతన నిబంధన పర్యాయ పదాలు). శిష్యులు యేసును విడిచి పారిపోవడానికి, చాలా కారణాలు ఉన్నాయి.

I. మొదటిది, ప్రవక్తల లేఖనాల నెరవేర్పు కొరకు వారు యేసును విడిచి పారిపోయారు.

మన పాఠ్యభాగము చెప్తుంది, "ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు, ఇదంతయు జరిగెను..." ఇందులో శిష్యులు ఆయన విడిచి పారిపోతారు అనే ప్రవచనము కూడ కలిసిఉంది. జేకర్యా 13:6-7 చెప్తుంది,

"నీ చేతులకు గాయము లేమని వారినడుగగా? ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా, నాకు కలిగిన గాయములు....గొర్రెలు చెదరి పోవునట్లు, కాపరిని హతము చేయుము" (జేకర్యా 13:6-7).

ఈ మాటలను గూర్చి "గొర్రెలు చెదరి పోవునట్లు, కాపరిని హతము చేయుము," డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు,

ఈ వచనము మత్తయి 26:31 మరియు మార్కు 14:27 లలో క్రీస్తు చెప్పాడు. ఆయన, మంచి కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు (యోహాను 10:11), కాని ఈ లోకము మారే సంఘటనలలో, కొంతసేపు గొర్రెలు చెదిరి పోతాయి (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, World Publishing, 1995 edition, p. 993; note on Zechariah 13:7).

జేకర్యా 13:7 ప్రవచనము నెరవేరునట్లు శిష్యులు ఆయనను విడిచి పారిపోయారని ప్రభువైన యేసు క్రీస్తు చెప్పాడు. మత్తయి 26:31 లో క్రీస్తు అన్నాడు,

"అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడిదేరు: గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరి పోవును, అని వ్రాయబడి యున్నది గదా" (మత్తయి 26:31).

మళ్ళీ, మార్కు 14:27 లో,

"అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడెదరు: గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరి పోవును, అని వ్రాయబడి యున్నది గదా" (మార్కు 14:27).

శిష్యులు ఆయనను విడిచి పారిపోవడం జేకర్యా 13:7 ప్రవచనము నెరవేర్పు.

"అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు, ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి, పారిపోయిరి" (మత్తయి 26:56).

II. రెండవది, వారు పడిపోయిన తెగ సభ్యులు కనుక వారు యేసును విడిచి పారిపోయారు.

మానవ జాతి పడిపోయిన జాతి. మనం అది మర్చిపోకూడదు. మీరు పాపులు – ఎందుకంటే మీరు పాపపు జాతిలో భాగము – ఆదాము శిశువు. బైబిలు చెప్తుంది,

"ఒక మనష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించెనో; అలాగుననే మనష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయెను" (రోమా 5:12).

అందుకే "పాపములలో చచ్చిన వారుగా" అందరు పుట్టారు (ఎఫెస్సీయులకు 2:5). అందుకే ప్రజలంతా "స్వాభావికంగా ఉగ్రత పుత్రులు" (ఎఫెస్సీయులకు 2:3). అందుకే మీరు స్వాభావికముగా పాపులు. ప్రతి దానికి సాతానును నిందించవచ్చు! స్వాభావికంగా మనము పాపులము కాకపొతే సాతాను మనలను బానిసలుగా చేయలేదు. ఆదాము సంతతి వారంతా స్వాభావికంగా పాపులు. స్వాభావికంగా మీరు పాపులు. అవును, మీరు పాపులు!

శిష్యులు మిగిలిన వారికంటే మంచి వారు కాదు. వారు, కూడ, "స్వాభావికంగా ఉగ్రతకు పాత్రులు." వారు, కూడ, "పాపములలో చచ్చిన వారు." వారు, కూడ, ఆదాము కుమారులే. పాత కొత్త ఇంగ్లాండ్ పిల్లల పుస్తకము చెప్తుంది,

"ఆదాములో పడిపోయాము
మనమందరము పాపులము."

శిష్యులకు శారీరక మనస్సు ఉంది అది "దేవునికి విరోధము" (రోమా 8:7). అలా వారు క్రీస్తు బోధించినప్పుడల్లా సువార్తను తిరస్కరించారు. అలాగే మీరు కూడ సువార్త తిరస్కరిస్తున్నారు! డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ అన్నాడు,

[క్రీస్తు] ఆయన చనిపోవడానికి యేరూషలేమునకు వెళ్తున్నట్టు ఐదు సార్లు చెప్పాడు (మత్తయి [16:21]; 17:12; 17:22-23; 20:18-19; 20:28). ఇంతగా ఉపదేశించినా, శిష్యులు [సువార్త] ప్రాధాన్యతను గుర్తించడంలో విఫలమయ్యారు ఆయన పునరుత్థానము వరకు (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume IV, p. 93; note on Matthew 16:21).

ఎందుకు సువార్త "ప్రాధాన్యతను" శిష్యులు గ్రహింపలేదు? జవాబు చాలా సులువైనది,

"మా సువార్త మరుగు చేయబడిన యెడల, నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడియున్నది" (II కొరింధీయులకు 4:3).

యోహాను 20:22 పై గమనికలో, డాక్టర్ మెక్ గీ అన్నాడు శిష్యులు తిరిగి జన్మించలేదు (మార్పు నొందలేదు) వారు క్రీస్తు పునరుత్థానము ఎదుర్కొనే వరకు, ఆయన వారిపై ఊది, అన్నాడు, "పరిశుద్ధాత్మను పొందుడి" (J. Vernon McGee, Th.D., ibid., p. 498; note on John 20:22). (క్లిక్ చెయ్యండి నా ప్రసంగము చదవడానికి శీర్షిక – "శిష్యుల భయము"" ఈ సంగతి వారికి మరుగు చేయబడెను," " పేతురు యొక్క మార్పు," "ఒప్పుకోలు పొందిన పేతురు," మరియు " యూదా యొక్క తప్పుడు పశ్చాత్తాపము." )

"అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పెట్టి, పారిపోయిరి" (మత్తయి 26:56).

వారు పాపుల్ని తెలుసుకోవడానికి దీని ద్వారా వెళ్ళారు. జాన్ కాగన్ మరియు ఏమి జబలగ నశించిన పాపులు. మీరు కూడ నశించు పాపులని తెలుసుకోవాలి!

కొందరనవచ్చు నేను చాలా దూరము వెళ్లి శిష్యులు క్రీస్తు పునరుత్థానము వరకు మార్పు చెందలేదని చెప్పడానికి. శిష్యులకు మీకు తేడా ఉందనుకుంటున్నారా? నాకు వారికి తేడా లేదని నాకు తెలుసు! యేసు రక్తము లేకుండా ఈ రాత్రి మీ ముందు నిలబడే వాడిని కాను! యేసు రక్తము లేకుండా నేను నరకానికి వెళ్ళే నశించు పాపినే!

యేసు నన్ను వెదికాడు నేను అపరిచితుడుగా ఉన్నప్పుడు,
   దేవుని నుండి దూరముగా తిరుగుచున్నప్పుడు;
ఆయన, అపాయము నుండి నన్ను రక్షించడానికి,
   ఆయన ప్రశస్త రక్తము కార్చాడు.
("రమ్ము, మీ ప్రవాహానికి" రోబర్ట్ రాబిన్ సన్ చే, 1735-1790).
(“Come, Thou Fount” by Robert Robinson, 1735-1790).

అయాన్ హెచ్. ముర్రే పుస్తకము, పాత సువర్తీకరణమును నేను పొగడుతాను (ద బేనర్ ఆఫ్ ట్రూత్ ట్రస్ట్, 2005). మార్పును గూర్చి మాట్లాడుచూ, అయాన్ హెచ్. ముర్రే అన్నాడు, "మార్పును గూర్చిన సత్యము కనుగొనవలసిన అత్యవసర అవసరత ఉంది. ఈ అంశముపై ఉన్న వివాదము వేల విషయాలు కొట్టుకుపోవడానికి సహాయము చేస్తుంది" (పేజీ 68). దీనిని గూర్చి నాకు వ్రాయండి. మీ దగ్గర నుండి వినాలనుకుంటున్నాను, ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా జవాబు ఇస్తాను! నా ఈ మెయిల్ rlhymersjr@sbcglobal.net.

"అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి, పారిపోయిరి" (మత్తయి 26:56),

వారు ఇంకను వారి పాపముల నుండి యేసు రక్తముచే కడుగ బడలేదు! యేసు రక్తముచే వారు కడుగబడ్డారా? కడుగబడ్డారా? కడుగబడ్డారా? యేసు రక్తముచే కడుగబడకపోతే మీకు నిరీక్షణ ఉండదు!

III. మూడవది, ఈ సమయమునకు ముందు వారికి నిజమైన ఒప్పుకోలు లేదు కాబట్టి వారు యేసును విడిచిపెట్టి పారిపోయారు.

వారి స్వంత సామర్ధ్యముపై వారికి గొప్ప నమ్మకం ఉంది. అది మనము చాలాసార్లు చూస్తాము క్రీస్తు మృతులలో నుండి లేచి వారికి కనబడి వారిపై ఊదకముందు. ఉదాహరణకు, యేసు పేతురుతో ఆ రాత్రే బొంకుతాడని చెప్పాడు. వారు ఇంకా పరిశుద్ధాత్మ కార్యము ద్వారా వెళ్ళాలి – వారి పాపాలు తెలుసుకోవడానికి!

"పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడ చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను. అదే ప్రకారము శిష్యులందరు అనిరి" (మత్తయి 26:35).

ఒక్క శిష్యులు కూడ మారలేదు! మీరు కూడ మారలేదు! పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మీరు వెళ్ళాలి – మీ పాపాలు గ్రహించడానికి! డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ –జోన్స్ అన్నాడు,

నిజమైన సువార్త సేవలేదు పాపపు సిద్ధాంతము లేకుండా, పాప అవగాహన లేకుండా...సువార్త సేవ దేవుని పరిశుద్ధతతో ప్రారంభమవ్వాలి, మానవుని పాపము మరియు చెడు తప్పుడు పనుల పర్యవసానము. మానవుడు తన నేరమును గమనించి విడుదలకు విమోచనకు క్రీస్తు నొద్దకు రావాలి [డాక్టర్ హైమర్స్ గమనిక: ఈస్టరు నాటికలో యూదా పాత్రను చేస్తూ లోతుగా పాపపు ఒప్పుకోలు పొందాను!] (D. Martyn Lloyd-Jones, M.D., Studies in the Sermon on the Mount, InterVarsity, 1959, volume 1, p. 235; emphasis mine).

వారంతా ఆయనను "విడిచి, పారిపోయే వరకు" శిష్యులకు నిజమైన పాపపు ఒప్పుకోలు రాలేదు. అంతకు ముందు శిష్యులు అన్నారు, "నీవు దేవుని దగ్గర నుండి వచ్చాడని నమ్ముచున్నాము,"

"యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో, మీలో ప్రతీవాడును, ఎవని ఇంటికి వాడు, చెదరిపోయి, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది..." (యోహాను 16:30-32).

క్రీస్తును కాదన్న తరువాత, పేతురు విచారము ఒప్పుకోలు, ఇతర శిష్యులు కూడ గ్రహించారు. "అంతట పేతురు బయటకు వెళ్లి, సంతాపపడి ఏడ్చెను" (లూకా 22:62). డాక్టర్ డబ్ల్యూ. జి. టి. షెడ్ వ్యాఖ్యానించాడు, "పరిశుద్ధాత్మ మానవుని ఒప్పుకోలు తరువాతనే అతనిని మారుస్తుంది" (Shedd, Dogmatic Theology, volume 2, page 514). యేసును అప్పగించే వరకు శిష్యులకు పాపపు ఒప్పుకోలు కలుగలేదు. తరువాత ఆయన పరిశుద్ధ రక్తముచే కడుగబడాలని వారు తెలుసుకున్నారు! పాపపు ఒప్పుకోలు లేకుండా మార్పు పొందవచ్చని మీలో కొందరు అనుకొనుచున్నారు! మీ పాపపు ఒప్పుకోలు లేకుండా మీరు మార్పు నొందలేరు! పేతురు బయటికి వెళ్లి సంతాపపడి ఏడ్చెను. మారకముందు పేతురులా చాలామంది ఏడ్చారు. మీరు సంతాపపడి ఏడ్చారా?

అన్వయింపు

ఇంకా మారని మీకు ఇది అన్వయిస్తాను. మీరు నశించిన పాపియని, మీ హృదయము "మోసకరమైనది...దుష్టమైనదని" మీకు అనిపించిందా? (యిర్మియా 17:9). మీకనిపించిందా, "అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?" (రోమా 7:24). మీలో ఉన్న నమ్మకమంతా కోల్పోయారా? మన పాపముల నిమిత్తము మీరు ఏడ్చి దుఃఖించారా? మీరు ఏడ్చి మీ పాపము నిమిత్తము దుఃఖించే వరకు మీకు నిరీక్షణ లేదు! మీరు అనవచ్చు, "పాపినైన నన్ను కరుణించుము దేవా!" డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "[వ్యక్తి] తన నేరమును చూడగలగాలి ఈ విధంగా, అతడు విడుదల కొరకు విమోచన కొరకు క్రీస్తు నొద్దకు రావాలి" (ఐబిఐడి.).

యేసు నామములో, ఒకే కంఠంతో, పరిశుద్ధ కీర్తన ఎత్తండి,
ప్రతి కారుచున్న అవయవము నుండి ఎలాంటి స్వస్థత ప్రవాహము పొర్లిందో ఆలోచించండి.

ఓ, అపవిత్ర రక్తము కారుచున్నప్పుడు, ఎంత శ్రమను అనుభవించాడో ఎవరు చెప్పగలరు,
మన పాప భారముతో ఆయన శరీరము చిత్ర హింసలకు గురి అయింది ఎంతగానో?

‘అవమానము అపహాసము లోతుగా ఆయన హృదయాన్ని తొలిచాయి;
చొచ్చుకుపోయే మేకు, సూది ముళ్ళు, విషాదానికి గురిచేసాయి.

కాని ప్రతి శ్రమ భారమైన నిట్టూర్పుకు దారితీసింది,
ఆయన భారమైన ఆత్మపై మన పాప భారము ఎలా మోపబడింది.
("ప్రభువు ఆయనపై మోపాడు" విలియమ్ హైలీ బాతర్ట్స్ చే, 1796-1877;
   స్వరమునకు "అద్భుత కృప.")
(“The Lord Hath Laid on Him” by William Hiley Bathurst, 1796-1877;
      to the tune of “Amazing Grace.”)

మీ పాప భారము మీకు తెలియాలి మీరు ఏడ్చి నిట్టూర్చాలి ఉజ్జీవము సమయంలో చైనాలో చేసినట్టు.

ఇంకొక క్షణంలో నేను మిమ్మును ముందుకు వచ్చి మొదటి రెండు వరుసలలో కూర్చోమని అడుగుతాను రక్షణ కొరకు. చాలామంది వస్తారు, కాని చాలామందికి మంచి జరుగదు. నశించు పాపిగానే వెళ్ళిపోతారు. ఇక్కడకు రావడానికి అది ఎందుకు సహాయపడదు? ఎందుకంటే నశించినట్టు మీకు అనిపించదు. మీరు శిష్యులు లాగే ఉన్నారు. మీలో ఎక్కువ నమ్మకము ఉంది. మీకు నచ్చినట్టుగా క్రైస్తవునిగా జీవించవచ్చని అనుకుంటున్నారు. మీది తప్పు. ఇప్పుడో తరువాతో సాతాను వచ్చి మిమ్మును శోధిస్తాడు. శిష్యులు చేసిందే మీరు కూడ చేస్తారు. మీరు క్రీస్తును విడిచి పెడతారు. మీరు ఈ గుడిని విడిచి పెడతారు. పాపపు జీవితములోనికి వెళ్ళిపోతారు. నాకు ఎలా తెలుసు? 60 సంవత్సరాలుగా భోధిస్తున్నాను కాబట్టి. మీలాంటి వారిని వందల మందిని చూసాను. అందుకే నాకు తెలుసు ఆ రాత్రి శిష్యుల వలే మీరు కూడ క్రీస్తును విడిచి పెట్టేస్తారని. వారు చేసినట్టే మీరు కూడ చేస్తారు. కాదు అని మీరు అనవచ్చు. కాని మీరు తప్పు! యదార్ధంగా ఉండండి. గుడిని విడిచిపెడదామని ఇప్పటికే అనుకున్నారు. యదార్ధంగా ఉండండి. వదిలెయ్యాలని ఇప్పటికే అనుకున్నారు, అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునని మీకు తెలుసు.

మీ హృదయము చూచుకోవాలి. మీ పాపమును అనుభవించాలి. యేసు నందు విశ్వాసము లేదని మీకు అనిపించాలి. నశించిన పాపులని మీకు అనిపించాలి! నేరారోపణ అనిపించాలి – యేసును నమ్మలేదనే భావన. అది అన్నింటిలో భయంకరమైన పాపము –యేసును విశ్వసించకపోవడం. యేసు అన్నాడు, "విశ్వసింపని వానికి ఇంతకూ ముందే తీర్పు తీర్చబడెను" (యోహాను 3:18). నరకానికి వెళ్ళే వరకు మీరు కనిపెట్టనవసరము లేదు. మీరు ఇప్పటికే తీర్పు తీర్చబడ్డారు! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఎప్పుడైతే [మీరు] మీ నేరారోపణను చూచి [అనుభవిస్తారో] అప్పుడే [మీరు] విడుదల రక్షణలకు క్రీస్తు నొద్దకు వస్తారు." మీ పాపము మీకు తెలుస్తుందా? మీ పాపము మీకు అనిపిస్తే, అది మిమ్మును తొందర చేస్తే, అప్పుడే మీరు యేసు నొద్దకు వచ్చి ఆయనను విశ్వసించి, ఆయనచే రక్షింపబడి, ఆయన కార్చిన రక్తముతో మీ పాపాలు కడుగుకుంటారు. రక్షింపబడడానికి వేరే మార్గము లేదు. యేసు రక్తముపై నేను బోధించని ఆదివారము ఉండకూడదని నా ప్రార్ధన. దీనికి మించిన సువార్త నాకు తెలియదు – యేసును నమ్మండి మీరు శుద్దులవుతారు. యేసు కల్వరి సిలువపై కార్చిన రక్తమే మీకు ఒకేఒక నిరీక్షణ! అయినను మీరు యేసు ఆయన రక్తాన్ని గూర్చి చెప్పరు! ఎందుకు? ఎందుకంటే మీ పాపము మీకు తెలియడం లేదు – అందుకే! అందుకే! అందుకే! మంచి పదాలు నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓ, మీరు అవివేకులు! అగస్టీన్ అన్నాడు, "మీలో విశ్రాంతి పొందే వరకు మీ హృదయాలకు విశ్రాంతి ఉండదు." రక్తముతో నిండిన ప్రవాహము ఉంది, రక్షకుని నరకముల నుండి వచ్చినది. పాపులు, ఆ ప్రవాహము క్రింద, వారి మరకలు పోగొట్టుకుంటారు. ఇప్పుడే యేసు నొద్దకు రండి. ఆయన పరిశుద్ధ రక్తములో మీ ప్రతి పాపము శుద్ధి చేసుకోండి! ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ఒంటరిగా" (బెన్ హెచ్. ప్రైస్ చే, 1914).
“Alone” (by Ben H. Price, 1914).ద అవుట్ లైన్ ఆఫ్

వారు ఆయనను విడిచి పారిపోయిరి

THEY FORSOOK HIM AND FLED

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు, ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి, పారిపోయిరి" (మత్తయి 26:56).

(మత్తయి 26:46, 47, 48, 50; యోహాను 18:10; లూకా 22:51;
మత్తయి 26:53-54, 55)

I.    మొదటిది, ప్రవక్తల లేఖనాల నెరవేర్పు కొరకు వారు యేసును విడిచి పారిపోయారు, జేకర్యా 13:6-7; మత్తయి 26:31; మార్కు 14:27.

II.   రెండవది, వారు పడిపోయిన తెగ సభ్యులు కనుక వారు యేసును విడిచి పారిపోయారు, రోమా 5:12; ఎఫెస్సీయులకు 2:5, 3; రోమా 8:7;
II కొరింధీయులకు 4:3.

III.  మూడవది, ఈ సమయమునకు ముందు వారికి నిజమైన ఒప్పుకోలు లేదు కాబట్టి వారు యేసును విడిచిపెట్టి పారిపోయారు, మత్తయి 26:35; యోహాను 16:30-32;
లూకా 22:62; యిర్మియా 17:9; రోమా 7:24; యోహాను 3:18.