Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఈ సంగతి వారికి మరుగు చేయబడెను

THIS SAYING WAS HID FROM THEM
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలం, మార్చి 22, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 22, 2015

"వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు" (లూకా 18:34).


ఇది మూడవసారి, లూకా సువార్తలో, యేసు పన్నెండు మంది శిష్యులకు తానూ చనిపోతున్నానని చెప్పడం (లూకా 9:22; 9:44). లూకా 18:31-33 లో, యేసు దానిని, చాలా తేటగా ఇలా చెప్పాడు,

"ఇదిగో, యేరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనష్యు కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనుల కప్పగింపబడును, వారు ఆయనను అపహసించి, అవమాన పరిచి, ఆయన మీద ఉమ్మివేసిరి: ఆయనను కొరడాలతో కొట్టి, చంపుదురు: మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను" (లూకా 18:31-33).

ఇది ఎలా తేటపరచబడుతుంది? అయినను, "వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు" (లూకా 18:34). మార్కు 9:32 చెప్తుంది, "అది వారికి అర్ధం కాలేదు." డాక్టర్ ఎ. టి. రోబర్ట్ సన్ మార్కు 9:32 ను ఇలా వ్యాఖ్యానించాడు, "అర్ధం చేసుకోలేకపోవడం కొనసాగింది. వారు అజ్నేయులు [అవిశ్వాసులు] [క్రీస్తు] మరణ పునరుత్థాన విషయాలలో" (A. T. Robertson, Litt.D., Word Pictures in the New Testament, Broadman Press, 1930, volume I, p. 344; note on Mark 9:32).

క్రీస్తు సువార్త అపోస్తలుడైన పౌలుచే సంక్షిప్తంగా తేటగా చెప్పబడింది,

"లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను; సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను" (I కొరిందీయులకు 15:3-4).

అయిననూ, ఈ సమయంలో, పన్నెండు మంది శిష్యులు సువార్తను అర్ధం చేసుకోలేదు నమ్మలేదు.

"వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు" (లూకా 18:34).

డాక్టర్ ఎ. టి. రోబర్ట్ సన్ అన్నాడు, "వారు అజ్నేయులు [అవిశ్వాసులు] [క్రీస్తు] మరణ పునరుత్థాన విషయాలలో" (ఐబిఐడి.). పన్నెండు మంది శిష్యులు సువార్తను ఇంకా నమ్మలేదు! మార్కు 9:30-32 పై, డాక్టర్ జె. వెర్నోన్ ఇలా వ్యాఖ్యానించాడు, "ఆయన మరణ పునరుత్థానములను గూర్చి ఆయన ప్రకటించడం మొదటిసారి కాదు, అయిననూ వారికి అర్ధం కాలేదు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume IV, p. 201; note on Mark 9:30-32).

"వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు" (లూకా 18:34).

పాఠ్యభాగములో మూడు పదాలు సువార్తలో వారి అవిశ్వాసాన్ని తెలియ చేస్తున్నాయి.

I. మొదటిది, వారికి సువార్త అర్ధము కాలేదు.

"వారికి ఈ విషయాలు ఏమి అర్ధము కాలేదు." గ్రీకులో "అర్ధమవడం" అంటే "మానసికంగా గ్రహించడం" (బలంగా). క్రీస్తు తేటగా వాస్తవంగా మాట్లాడినప్పటికినీ, శిష్యులు ఆయన చెప్పిన దానిలో అర్ధాన్ని గ్రహించలేదు. పాఠ్యభాగము చెప్తుంది, "వారికి ఈ విషయాలు ఏమి అర్ధం కాలేదు." మేత్యూ పూలే అన్నాడు, "పదాలు అర్ధం చేసుకోవడానికి సులభంగా ఉన్నాయి" (A Commentary on the Whole Bible, The Banner of Truth Trust, 1990 reprint, volume 3, p. 258; note on Luke 18:34), అయిననూ వారికి ఈ విషయాలు ఏమి అర్ధం కాలేదు! శిష్యులకు అర్ధం కాలేదు క్రీస్తు "అన్య జనులకు అప్పగింపబడతాడని." వారికి అర్ధం కాలేదు ఆయన "అపహసింప బడతాడని, ఘోరంగా హింసింపబడతాడని, ఉమ్మివేయబడతాడని." వారికి అర్ధం కాలేదు ఆయన "దున్నబడతాడని," వీపుపై కొట్టబడతాడని. వారికి అర్ధం కాలేదు ఆయన సిలువపై "మరణిస్తాడని." వారికి అర్ధం కాలేదు ఆయన మృతులలో నుండి "మూడవ దినాన" లేస్తాడని. మనకు మార్కులో చెప్పబడినట్లు,

"మనష్య కుమారుడు మనష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదురు; చంపబడిన మూడు దినములకు, ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింప లేదు, గాని ఆయన నడుగ భయపడిరి" (మార్కు 9:31-32).

వారి అవివేకానికి మానవ జవాబు విలియం మెక్ డోనాల్డ్ వివరించాడు,

వారి తలంపులు ఆలోచనలతో నింప బడ్డాయి తాత్కాలిక విమోచాకుడు వారిని రోము నుండి తప్పించి, వెంటనే రాజ్యము స్థాపించి, వేరే కార్యక్రమమేమి ఉండదని (William MacDonald, Believer’s Bible Commentary, Thomas Nelson Publishers, 1989 edition, p. 1440; note on Luke 18:34).

వారి మనసులు శ్రమపడే మేస్సియాను నమ్మకుండా ప్రలోభ పెట్టబడ్డాయి (మెస్సీయా బెన్ జోసఫ్) ఎందుకంటే ఆ రోజుల్లో చాల మంది యూదులు రోము నుండి వారిని విమోచిస్తాడని ఎదురు చూసేవారు (మెస్సీయా బెన్ డేవిడ్). ఇద్దరు మెస్సీయాలు ఒకరని గ్రహింపలేదు. నా ప్రసంగము చూడండి, "శిష్యుల భయము" – చదవడానికి ఇది క్లిక్ చెయ్యండి. సువార్త అవివేకానికి ఇంకొక కారణముంది.

II. రెండవది, సువార్త వారికి మరుగు చేయబడింది.

"ఈ విషయాలేమి వారికి అర్ధం కాలేదు: ఇది వారికీ మరుగు చేయబడింది..." (లూకా 18:34).

పదము "మరుగు చేయబడుట" గ్రీకు పదము నుండి అనువదింప బడింది దాని అర్ధము "గోప్యంగా ఉండుట, దాచబడుట" (బలమైనది). అదే గ్రీకు పదము యోహాను 8:59 లో ఇలా చెప్తుంది, "యేసు మరుగు చేయబడ్డాడు." కనుక, మన పాఠ్యభాగములో, "ఈమాట వారికి మరుగు చేయబడింది." యేసు ఆయనను మరుగు చేసుకున్నప్పుడు అసాధారణ విషయం చోటు చేసుకుంది, దేవాలయమలో వారు ఆయనపై రాళ్ళు రువ్వేటప్పుడు (యోహాను 8:59). మన పాఠ్య భాగములో ఇంకొక అసాధారణ విషయముంది, "ఈవిషయం వారికి మరుగు చేయబడింది." లూకా 18:34 పై, డాక్టర్ ఫ్రేంక్ గయబెలీన్ ఇలా వ్యాఖ్యానించాడు, "శిష్యుల అవివేకాన్ని లూకా అసాధారణంగా అవివేకాన్ని దాచిపెట్టడంగా అభివర్ణించాడు" (Frank E. Gaebelein, D.D., general editor, The Expositor’s Bible Commentary, Zondervan Publishing House, 1984 edition, volume 8, p. 1005; note on Luke 18:34). ఇది పాఠ్య భాగము అసలు అర్ధము. ఇది అసాధారణ కప్పివేత అవగాహన. "ఇది (సువార్త) వారికి మరుగు చేయబడింది."

మనం చూస్తాం అప్పటిలో శిష్యులు గొప్ప పరిశుద్దులు కాదు. వారు మనష్యులు మాత్రమే. మనలాంటి, మనష్యుల్లా, వారు ఆదాము నుండి వచ్చినవారు. అలా, వారు "అపరాధములలోను పాపములలోను చచ్చిన వారు" నా వలే గుడిలో ఏడూ సంవత్సరాలు, నేను రక్షింపబడక మునుపు; మీలో చాల మంది వలే (ఎఫెస్సీయులకు 2:1, 5). ఆదాము సంతతిగా, వారి శారీరక మనసులు "దేవునికి శత్రువులు" (రోమా 8:7). ఆదాము వారసులుగా వారు సహజ మానవులు, "దేవుని ఆత్మ విషయాలు సహజ మానవుడు గ్రహింపడు" (I కోరిందీయులకు 2:14). ఆదాము వారసులుగా, "సిలువను గూర్చిన బోధ నశించు [నశించిన] వారికి వెర్రితనము" (I కోరిందీయులకు 1:18). క్రీస్తు నికోదేముతో చెప్పినట్టు, "నీవు తిరిగి జన్మించాలి" (యోహాను 3:7), కనుక శిష్యులు "తిరిగి జన్మించాలి." వారి పనులు విడిచి క్రీస్తును వెంబడిస్తే వారు తిరిగి జన్మించలేరు. అది క్రియల ద్వారా రక్షణ! ఇలా రోమను కేథలిక్ లు అనువదించారు! కాని మనం కృప ద్వారా రక్షణ నమ్ముతాను, కనుక వారు ఆయనను వెంబడించడం ద్వారా వారు రక్షింపబడలేరు!

"మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి యున్నారు; ఇది మిమ్మును కలిగినది కాదు: దేవుని వరమే: అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలులేదు" (ఎఫెస్సీయులకు 2:8-9).

యూదా పన్నెండు మంది శిష్యులలో ఒకడు. అతడు తిరిగి జన్మించాడా? క్రీస్తు అన్నాడు అతడు "నశించాడని," అతడు "నాశన పుత్రుడు" అని పిలువబడ్డాడు (యోహాను 17:12). తోమా తిరిగి జన్మించాడా? పునరుత్థానము తరువాత, తోమా నిక్కచ్చగా అన్నాడు, "నేను నమ్మను" (యోహాను 20:25). నాకు తెలుసు పేతురు దేవుని గూర్చి కొన్ని భ్రమలు కలిగియున్నాడు (మత్తయి 16:17) కొన్ని నిమిషాల తరువాత అతడు యేసును గద్దిస్తాడు ఆయన వారికి చెప్తున్నందుకు "ఆయన చనిపోయి, మూడవ దినాన లేస్తానని" (మత్తయి 16:21-22), యేసు "పేతురుతో అన్నాడు, సాతాను, నా వెనుకకు పొమ్ము: నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు: నీవు మనష్యుల సంగతులు తలంచుచున్నావు, కాని దేవుని సంగతులు తలంచకయున్నావు" (మత్తయి 16:23). తేటగా పేతురు సువార్తను తిరస్కరించాడు, సాతానుచే ప్రభావితం చెయ్యబడ్డాడు క్రీస్తు సిలువ మరణము పునరుత్థానము తిరస్కరించడానికి.

"వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింప లేదు: ఈ సంగతులు [సువార్తలు] వారికి మరుగు చేయబడెను..." (లూకా 18:34).

అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"మా సువార్త మరుగు చేయబడిన యెడల, నశించుచున్న వారి విషయాలలోనే మరుగు చేయబడియున్నది: దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింప కుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత [సాతాను] అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు గుడ్డితనము కలుగచేసేను..." (II కోరిందీయులకు 4:3-4).

అవును, "అసాధారణ" అంధత్వము ఉంది, శిష్యులకు సాతానుచే అధత్వము, మరియు సువార్త గుడ్డితనము, ఆదారము శారీరక స్వభావమును బట్టి. యేసు అన్నాడు, "మీరు మారి, పిల్లల వంటి వారైతే తప్ప, పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు" (మత్తయి 18:3). ఆయన ఎవరికీ చెప్పాడు? ఆయన తన "శిష్యులకు" చెప్పాడు (మత్తయి 18:1). దయచేసి నిలబడి మత్తయి 18:1-3 చదవండి,

"ఆ కాలమున శిష్యులు యేసు నొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో, ఎవడు గొప్పవాడని అడుగగా? ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, వారి మధ్య నిలబెట్టి, ఇట్లనెను, మీరు మార్పు, నొంది బిడ్డల వలే వారైతేనే గాని, పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను" (మత్తయి 18:1-3).

కూర్చోండి. శిష్యులు తెలుసుకోవాలనుకున్నారు పరలోక రాజ్యములో ఎవరు గొప్ప వారో అని (మత్తయి 18:1). యేసు శిష్యులకు చెప్పాడు, "మీరు మారితే తప్ప...మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప లేరు" (మత్తయి 18:3).

"వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింప లేరు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను కనుక [సువార్తను గూర్చి] ఆయన చెప్పిన సంగతులు వారికి బోధ పడలేరు..." (లూకా 18:34).

III. మూడవది, వారికి అనుభవము ద్వారా సువార్త తెలియదు.

మన పాఠ్యభాగము చివరిలో చెప్తుంది, "ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడ లేదు" (లూకా 18:34). గ్రీకు పదము "ఎరుగుట" అనగా "తెలియుట, కచ్చితంగా, అనుభవ పూర్వకంగా గమనించుట" (George Ricker Berry, A Greek-English Lexicon of New Testament Synonyms, coded to Strong, number 1097). అదే పదము పిలిప్ఫీ 3:10 లో వాడబడింది, "నాకు ఆయన తెలియనట్లు, ఆయన పునరుత్థాన శక్తి, ఆయన శ్రమలలో సహవాసము..." అనుభవ పూర్వకంగా శిష్యులకు సువార్త తెలియదు. వారు మాటలు విన్నారు, సువార్త వాస్తవికత వారు అనుభవించ లేరు. మనం నిలబడి వాక్య భాగము మళ్ళీ గట్టిగా చదువుతాం. లూకా 18:31-34.

"ఆయన తన పన్నెండు మంది శిష్యులను, పిలిచి, ఇదిగో, యేరూష లేమునకు వెళ్ళుచున్నాను, మనష్యు కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్య జనుల కప్పగింపబడును, వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసిరి: ఆయనను కొరడాలతో కొట్టి, చంపుతారు: మూడవ దినాన ఆయన మరల లేచునని చెప్పెను. వారు తన మాటలలో ఒకటైనను గ్రహింప లేరు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధ పడలేదు" (లూకా 18:31-34).

కూర్చోండి.

ఇప్పుడు చూస్తున్నారా? "వారికి ఏమి అర్ధము కాలేదు: ఇది వారికి మరుగు చేయబడింది, వారికి మాట్లాడబడిన విషయాలు [అనుభవ పూర్వకంగా] తెలియదు కూడా."

సి. హెచ్. స్పర్జన్ సాక్ష్యము వినండి. సువార్త బోధించే కాపరి – అతని తండ్రి దగ్గర పెరిగాడు. సువార్త బోధకుడు అయిన అతని తాత దగ్గర వేసవి దినాలు గడిపాడు, అతను కూడా సువార్త కాపరి. జీవితమంతా, ప్రతి ఆదివారము సువార్త విన్నాడు. అయిననూ అతడు మారలేదు పునరుత్థానమునకు ముందు శిష్యుల వలే. స్పర్జన్ అన్నాడు,

యేసు త్యాగము ద్వారా రక్షణ ప్రణాళికను గూర్చి నా యవన దశ నుండి వింటున్నాను, కాని నా అంతరంగములో నాకు ఏ మాత్రమూ తెలియదు ఒకవేళ [అన్య భూభాగములో] నేను జన్మించి ఉంటే. కొత్త ప్రత్యక్షతగా నాకు వచ్చింది, లేఖనాలు చదివినట్లుగా...[అప్పుడు] నాకు అర్ధము అయింది విశ్వాసము ద్వారా చూసాను దైవ కుమారుడు మానవుడయ్యాడు, తన స్వంత ఆశీర్వదపు వ్యక్తీ ద్వారా, తన స్వంత శరీరంలో చెట్టుపై నా పాపాన్ని భరించాడు [సిలువపై]...అది చూడగలిగావా? (C. H. Spurgeon, How Can a Just God Justify Guilty Man?, Chapel Library, Pensacola, Florida).

క్రీస్తును గూర్చి స్పర్జన్ కు తెలుసు. రక్షణ ప్రణాళికను గూర్చి ఆయన విన్నాడు. కాని అతడు "ఈ విషయాలు అర్ధం చేసుకోలేదు: [ఈ సువార్త విషయము] [అతనికి] మరుగు చేయబడింది, మాటలాడబడిన విషయాలను గూర్చి [అనుభవము ద్వారా] అతనికి తెలియదు." అకస్మాత్తుగా ఒక శక్తి వలే సువార్త అతని దగ్గరకు వచ్చింది, అతడు అన్నాడు, "నాకు నూతన ప్రత్యక్షతగా వచ్చింది, ఎన్నడు లేఖనాలు చదవనట్లుగా."

అది నిజమైన మార్పు – నీ పాప భారము నీ ఆత్మకు తెలియ పరచబడినప్పుడు – పునరుత్థాన క్రీస్తు నొద్దకు నీవు చేర్చబడినప్పుడు. ఒకరు అన్నారు, "ఎక్కడ బైబిలులో చెప్పబడింది పునరుత్థాన క్రీస్తును సంధించడం ద్వారా శిష్యులు మారినట్లు?" జవాబు సామాన్యం – అన్ని సువార్తల ఆఖరిలో – మత్తయి 28; మార్కు 16; లూకా 24 లో (ప్రత్యేకంగా తేటగా ఉంది, 36-45 వచనాలలో); మరియు యోహాను 20:19-22 లలో. డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ, అమెరికా ప్రసిద్ధ బైబిలు బోధకుడు, యోహాను 20:22 ను గూర్చి ఇలా అన్నాడు, "నేను వ్యక్తిగతంగా నమ్ముతాను ప్రభువు వారిపై ఊడిన క్షణమే, ఆయన అన్నాడు, "పరిశుద్ధాత్మను పొందుకోండి,’ ఈ మనష్యులు పునర్ణిర్మానింపబడ్డాను [తిరిగి జన్మించారు]. దానికి ముందు, వారు దేవుని ఆత్మను కలిగి యుండలేదు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, volume IV, p. 498; note on John 20:21). మీరు డాక్టర్ మెక్ గీ గారిది వినవచ్చు అంతర్జాలములో `www.thruthebible.org.

ఇప్పుడు మా ప్రార్ధన పరిశుద్ధాత్మ ద్వారా మీరు పాపపు ఒప్పుకోలు పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలు తెరిచి, యేసు క్రీస్తు నొద్దకు చేరుస్తాడు, పునరుత్థాన దైవ కుమారుడు, ఆయన ప్రశస్త రక్తము ద్వారా పాపాలు శుద్ధి చేస్తాడు.

ప్రతి డాక్టర్ మెక్ గీ కార్యక్రమము ఒక పాటతో ముగుస్తుంది, "యేసు అంతా చెల్ల్లించాడు." అది పాటల కాగితములో నాల్గవ పాట. లేచి పాడండి.

రక్షకుడు చెప్పడం విన్నాను, "నీ శక్తి నిజంగా తక్కువ,
బలహీన బిడ్డా, మెలకువతో ప్రార్ధించు, మిమ్ములను పూర్తిగా నాలో కనుగొన్నాను."
యేసు అంతా చెల్లించాడు, అంతా ఆయనకు రుణస్థుడను;
పాపము మరక మిగిల్చింది, ఆయన హిమము కంటే తెల్లగా కడిగాడు.

ప్రభూ, ఇప్పుడు నిజంగా నీ శక్తిని కనుగొన్నాను, నీది మాత్రమే,
కుష్టు రోగి మరకలను మారుస్తుంది, బండ హృదయాలను కరిగిస్తుంది.
యేసు అంతా చెల్లించాడు, అంతా ఆయనకు రుణస్థుడను;
పాపము మరక మిగిల్చింది, ఆయన హిమము కంటే తెల్లగా కడిగాడు.

నాలో మంచి లేదు నీ కృపను పొందుకోడానికి –
నా వస్త్రాలను కల్వరి గొర్రె పిల్ల రక్తములో తెల్లగా కడుగు కుంటాను.
యేసు అంతా చెల్లించాడు, అంతా ఆయనకు రుణస్థుడను;
పాపము మరక మిగిల్చింది, ఆయన హిమము కంటే తెల్లగా కడిగాడు.

ఎప్పుడైతే, సింహాసనం ముందు, సంపూర్ణంగా నిలబడినప్పుడు,
"యేసు నా ఆత్మను రక్షించడానికి మరణించాడు, "నా పెదవులు మళ్ళీ మళ్ళీ చెప్తాయి.
యేసు అంతా చెల్లించాడు, అంతా ఆయనకు రుణస్థుడను;
పాపము మరక మిగిల్చింది, ఆయన హిమము కంటే తెల్లగా కడిగాడు.
("యేసు అంతా చెల్లించాడు" ఎల్వినా యం. హాల్ చే, 1820-1889).
(“Jesus Paid It All” by Elvina M. Hall, 1820-1889).

డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: లూకా 18:31-34.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"నా కళ్ళు తెరువు" (క్లారా హెచ్. స్కాట్ చే, 1841-1897)
“Open My Eyes” (by Clara H. Scott, 1841-1897).


ద అవుట్ లైన్ ఆఫ్

ఈ సంగతి వారికి మరుగు చేయబడెను

THIS SAYING WAS HID FROM THEM

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు" (లూకా 18:34).

(లూకా 18:31-33; మార్కు 9:32; I కొరిందీయులకు 15:3-4)

I. మొదటిది, వారికి సువార్త అర్ధము కాలేదు, లూకా 18:34ఎ; మార్కు 9:31-32.

II. రెండవది, సువార్త వారికి మరుగు చేయబడింది, లూకా 18:34బి; యోహాను 8:59;
ఎఫెస్సీయులకు 2:1, 5; రోమా 8:7; I కొరిందీయులకు 2:14; 1:18; యోహాను 3:7; ఎఫెస్సీయులకు 2:8-9; యోహాను 17:12; 20:25; మత్తయి 16:17;
మత్తయి 16:21-22, 23; II కొరిందీయులకు 4:3-4; మత్తయి 18:1-3.

III. మూడవది, వారికి అనుభవము ద్వారా సువార్త తెలియదు, లూకా 18:34సి;
ఫిలిప్పీయులకు 3:10.