Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మీ మహిమను నాకు చూపుము

SHOW ME THY GLORY
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారము సాయంకాలము, ఆగష్టు 12, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Saturday Evening, August 12, 2017


దయచేసి మీ బైబిలులో నాతో పాటు నిర్గమ కాండము, 33 వ అధ్యాయము తెరవండి. అది స్కోఫీల్డ్ పఠన బైబిలులో 115 వ పుటలో ఉన్నది. ఇప్పుడు నిలబడి నిర్గమ కాండము 33:18 చూడండి. ఇది దేవునికి మోషే ప్రార్ధన,

"అతడు, నేను బ్రతిమాలుచున్నాను [మోర పెట్టుచున్నాను], మీ మహిమను నాకు చూపుము" (నిర్గమ కాండము 33:18).

కూర్చోండి. మీకు జాన్ సామ్యూల్ ప్రసంగము, "ప్రార్ధనలో క్రమము మరియు వాగ్వివాదము, " జ్ఞాపకముంటే నిర్గమ కాండము, 32 మరియు 33 అధ్యాయములలో అలాంటి చాలా ప్రార్ధనలు మీరు కనుగొంటారు. వచనము 15 మరియు 18 లో, మోషే దేవునికి ప్రార్ధిస్తాడు. 15 వ వచనములో మోషే అన్నాడు, "నీ సన్నిధి రాని యెడల, ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము." 18 వ వచనములో మోషే అన్నాడు, "నేను మిమ్మును బ్రతిమాలుచున్నాను, మీ మహిమను నాకు చూపుము." "మహిమకు" హెబ్రీ పదము కవోడ్, దాని అర్ధము "దేవుని బరువు." నా జీవితంలో కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఆ "బరువును" అనుభవించాను. 15 వ ఏట ఫారెస్ట్ లాన్ స్మశానంలో గడ్డిపై నేను కూర్చున్నప్పుడు, తేలిక దుప్పటి వలే దేవుని బరువు నాపై వచ్చినట్టుగా అనిపించింది. నేను చూచిన మూడు వేరువేరు ఉజ్జీవాలలో, నా చుట్టూ గాలిలో కవోడ్ అనుభవించాను. బ్రెయిన్ హెచ్. ఎడ్వర్డ్స్ అన్నాడు, "దేవుని ‘సన్నిధి’ మానవ వివరణను అపవిత్ర పరుస్తుంది, కాని అది సాధారణ ఉజ్జీవపు అనుభవాన్ని ఇస్తుంది" (Revival: A People Saturated With God, p. 136). "ఆదాము హవ్వలు దేవుని సన్నిధి నుండి దాగుకున్నారు, కయీను ‘ప్రభువు సన్నిధి నుండి పారిపోయాడు’" (ఐబిఐడి., పేజి 135). "ఉజ్జీవములో దేవుని సన్నిధి కనుపించే [తాకగలిగే] అనుభవముగా మారుతుంది" (ఐబిఐడి., పేజి 134). "ఉజ్జీవములో [దేవుని సన్నిధి] చాలా స్పష్టముగా ఉండి కొన్నిసార్లు పొంగి పోర్లేదిగా ఉంటుంది" (ఐబిఐడి., పేజి 135).

"ఉజ్జీవము ఏమిటో అర్ధము చేసుకోవడానికి ఇది తాళము. ఈనాడు ఆరాధనలో ఒక అంశము ఉంటే అది ఉండడం లేదు, దేవుని సన్నిధి అనుభూతి...అందుకే ఆరాధనలో మనము నిర్లక్ష్యముగా ప్రవర్తిస్తాము. లోతైన ఆత్మకార్యము ఉజ్జీవములో అనుభవము ద్వారా గమనింపబడుతుంది దేవుడు ఉన్నాడని మనము ఒప్పింప బడతాము... ఉజ్జీవము వేరు. దేవుడు అక్కడ ఉన్నాడని తెలుస్తుంది, అవిశ్వాసి కూడ ఒప్పుకోవడానికి బలవంత పెట్టబడతాడు ‘దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడు,’ I కొరింధీయులకు 14:25" (ఐబిఐడి., పేజి 134). "దేవుని ఆత్మ [దిగి] వచ్చినప్పుడు ఆయన సంఘ ప్రార్ధనలు తీసుకొని కొత్త జీవమును వారిలో ఊదుతాడు" (ఐబిఐడి., పేజి 129). "ఉజ్జీవములో, ప్రార్ధన ఆనందముగా సంతోషముగా మారుతుంది" (ఐబిఐడి., పేజి 128) ఒప్పుకోలు తరువాత క్రైస్తవులు క్రీస్తు రక్తములో కడుగ బడుతారు.

సేక్సోని పట్టణములో, "ఒకే క్షణములో మన అందరికి క్రీస్తు సమీపంగా ఉన్నాడని అనిపిస్తుంది...ప్రభువు [అక్కడ] చేసినది, అప్పటి నుండి చలికాలము వరకు, అది వర్ణనాతీతము. ఆ స్థలమంతా దేవుని గుడారము మనష్యులతో ఉన్నట్టు కనిపిస్తుంది" (ఐబిఐడి., పేజి 135). కొరియాలో, 1907 లో, "ప్రతి [వ్యక్తి] గుడిలో ప్రవేశిస్తున్నప్పుడు, దేవుని సన్నిధితో ఆగది అంతా నిండియున్నట్టు అనిపించింది...ఆ రాత్రి దేవుని సమీపత్వము వారు గమనించారు అది వర్ణించుట అసాధ్యము" (ఐబిఐడి., పేజీలు 135, 136).

1980 నవంబరులో నా స్నేహితుడు నేను కలిసి టెన్నెసీలోని మర్ ఫ్రీస్ బోరోకు వెళ్ళాము, మేము చేస్తున్న టెలివిజన్ కార్యక్రమములో డాక్టర్ జాన్ ఆర్. రైస్ ను దర్శించడానికి. డాక్టర్ రైస్ చాలా వృద్ధుడు, గుండె పోటు వచ్చింది. 85 సంవత్సరాల వయసులో చక్రాల కుర్చీలో మా దగ్గరకు వచ్చాడు. ఆయన వస్తుండగా, నా స్నేహితుడు నేను గమనించాం బరువైన గాలి రూపములో "కవోడ్" దిగి వస్తున్నట్టుగా. దేవుడు దిగి వచ్చినట్టు నాకు తెలుసు ఎందుకంటే నేను చూచినా మూడు శాస్త్రీయ ఉజ్జీవాలలో అలానే జరిగింది.

ఆ పట్టణములో ఒక కెమెరాను మనిషిని అద్దెకు తీసుకున్నాము. కెమెరా వాడుతున్న వ్యక్తి కేథలిక్, కాని గుడిని విడిచిపెట్టాడు. మేము డాక్టర్ రైస్ ను ప్రశ్నలడుగుచుండగా కెమెరా వాడుచున్న వ్యక్తికి కన్నీళ్లు వచ్చాయి, వాటిని తుడుచుకుంటూ ఉన్నాడు డాక్టర్ రైస్ ఆగుతూ ఆగుతూ ఆయన జరిగించిన సువార్తిక కూటములను గూర్చి మాట్లాడారు. ప్రశ్నలు అడగడం అయిపొయింది డాక్టర్ రైస్ కారులో వెళ్ళిపోయారు. నా స్నేహితుడు నేను గదిలో కెమెరా వ్యక్తితో ఒంటరిగా ఉన్నాము. అతడు ఇంకా ఏడుస్తున్నాడు. అతడు డాక్టర్ రైస్ గురించి అడిగాడు, ఆయన గొప్ప దైవ జనుడని వివరించాను. నేను మాట్లాడుచుండగా, చాలా తేటగా దేవుని సన్నిధిని అనుభవించాను. అతడు ఏడుస్తున్నాడు. నేను ఇదే చెప్పాను, "యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనను విశ్వసించు ఆయన నీ పాపాలు కడిగేస్తాడు." నేనతనికి చెప్పలేదు. అతడు మోకాళ్ళని యేసును విశ్వసించి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది కనుక అది సులభంగా ఉంది. నాకు ఒక బైబిలు వచనము గుర్తు వచ్చింది, "ఎక్కడ ప్రభువు ఆత్మ ఉండునో, అక్కడ స్వాతంత్ర్యము ఉండును" (II కొరింధీయులకు 3:17). సందర్శకులు మారడం సులభము, మొదటిసారి వచ్చినవారు, డాక్టర్ జాన్ ఆర్. రైస్ వలే మనము కూడ దేవుని ఆత్మ శక్తిని కలిగియుంటే!

ప్రభువు సన్నిధిని కలిగి ఉండడంలో ఇంకొక గొప్ప మేలు ఉంది. అది పరలోకాన్ని రుచి చూడడం. పరలోకము మీలో చాలామందికి అవాస్తవము అని నాకు తెలుసు. కాని దేవుని యొక్క "కవోడ్" మన సంఘములోనికి దిగి వచ్చినప్పుడు, అది మిమ్మును తాకినప్పుడు, పరలోకానికి వెళ్లినట్టు మీకు అనిపిస్తుంది. అది "దైవిక మహిమను ముందుగా రుచి చూడడం." పరలోకము ఒక అంశముగా మీరు ఎన్నడు ఆలోచింపరు. మీరు మన గుడిలో ప్రవేశించినప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు, మీరు వాస్తవంగా పరలోక ఆనందమును వాస్తవికతను "రుచి" చూస్తారు. అప్పుడు మీరు జాన్ డబ్ల్యూ. పీటర్ సన్ యొక్క చిన్న పాటను గొప్ప సంతోషముతో పాడగలరు!

పరలోకము దిగి వచ్చింది మహిమ నా ఆత్మను నింపింది,
సిలువ చెంత రక్షకుడు నన్ను శుద్ధి చేసాడు.
నా పాపము కడిగి వేయబడ్డాయి, నా రాత్రి పగలు మారింది –
పరలోకము దిగి వచ్చింది మహిమ నా ఆత్మను నింపింది.
("పరలోకము దిగి వచ్చింది" జాన్ డబ్ల్యూ. పీటర్ సన్ చే, 1921-2006).
(“Heaven Came Down” by John W. Peterson, 1921-2006).

ఇప్పుడు నేను విపరీత, అవాస్తవ పెంతే కోస్తులుల మూఢత్వమును గూర్చి కాని, ఆకర్షనీయుల కొన్ని తప్పుడు అభిప్రాయాలను గూర్చి కాని మాట్లాడడం లేదు. ఓ, కాదు! వారు తరుచు దేవుని ఆత్మను వాయిద్యము వాయించడం ద్వారా లేక భాషలలో మాట్లాడడం ద్వారా రప్పించాలని ప్రయత్నిస్తారు. వారి అర్ధము బాగుండొచ్చు, కాని అలా దేవుడు దిగి రాలేదు కూటాలలో ప్రజలను ఉజ్జీవింప చేయలేదు 1905 పెంతేకోస్తులత్వము ప్రారంభమునకు ముందు. పాత మార్గానికి మనము వెళ్ళాలి – ఎందుకంటే పాతమార్గము నిజమైన మార్గము – అది ఇంకను నిజమైన మార్గమే!

నేలమీద పడడం ద్వారా, కవోడ్ దిగి రావాలని ప్రయత్నించకూడదు, ఒకవేళ దేవుడు దిగి వచ్చినప్పుడు ఎవరైనా నేలమీద పడవచ్చు. కాని మనము అతి భావోద్రేకములో గట్టిగా అరవడంలో మనము సంతోశించము. ఓ, కాదు! మనం ఆనందిస్తాము క్రైస్తవ ప్రజలు పాపమును గమనించినప్పుడు వారి జీవితంలో ప్రవేశించిన దానిని, పాపమును గూర్చి వారు సిగ్గు పడాలి, కాని ఆ పాపమును వారు దేవునితో ఒప్పుకోవాలి – మన పాపములను ఒకరితో ఒకరము ఒప్పుకోవాలి, తద్వారా మనము ఆత్మీయంగా దేవునిచే స్వస్థత పొందుతాము, పరలోకపు తండ్రి ద్వారా! దయచేసి నిలబడి మీ పాటల కాగితంలోని 10 వ పాటను పాడండి.

"నన్ను పరిశోధించు, ఓ దేవా, నా హృదయమును తెలుసుకొనుము:
నన్ను శోధించి నా తలంపును తెలుసుకొనుము:
నా హృదయమును తెలుసుకొనుము;
నన్ను శోధించి నా తలంపులను తెలుసుకొనుము;
నీకాయసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము,
నిత్య మార్గమున నన్ను నడిపించుము."
      (కీర్తనలు 139:23, 24).
      (Psalm 139:23, 24).

భయపడకండి! దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు. మీరు ఒప్పుకుంటే ఆయన మీకు తీర్పు తీర్చడు. భయపడకండి. నీ పాపము ఎంత చెడ్డ దయినను, దేవుడు దానిని స్వస్థ పరచగలడు. యేసు రక్తముతో దేవుడు దానిని కడిగి వేయగలడు. వేదిక దగ్గరకు రండి. ఒకరి చెయ్యి పట్టుకొని ఇద్దరిద్దరు ఒకరి కొరకు ఒకరు ప్రార్ధన చెయ్యండి. ఈ రాత్రి ఒప్పుకోలు కొరకు ఒకరికోరకు ప్రార్ధించండి. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను! దేవుడు మిమ్ములను దీవించును గాక! మీరు ఎంతగానో ప్రేమింపబడిన వారు ఈ రాత్రి మీరు ఏమి చెప్పినా, మేము మిమ్మును ప్రేమించడం మానము! మమ్ములను నమ్మండి భయపడకుడి. యేసు నొద్దకు తిరిగి రండి, తిరిగి వచ్చి మీ పాపాలు ఒప్పుకోండి రక్షకుడైన యేసు, రక్తములో కడుగబడతారు. మీరు యుక్త వయస్కులు కాకపోయినను, ఈ సాయంకాలము మీరు రావచ్చు. వేదిక ప్రక్క రెండు కుర్చీలు ఉన్నాయి. బాహాటంగా మీ ఒప్పుకోలు ఉండకూడదనుకుంటే, ఇక్కడకు వచ్చి ఆ విషయము నాకు చెప్పండి, అది మీరు ఇవ్వాలో లేదో మీకు నేను చెప్పగలను.

నా 76 వ పుట్టిన రోజు సందర్భంగా మన సహోదరుడు జాక్ గ్నాన్ ఈ క్రింది మాటలు వ్రాసాడు.

ప్రియమైన డాక్టర్ హైమర్స్ గారు,

     ఇన్ని సంవత్సరాలు మీ నమ్మకత్వమును బట్టి నేను మీకు వందనములు తెలియ చేస్తున్నాను. నేను తరుచు అనుకున్నాను గొప్ప స్వధర్మము ఉన్న కాలములో శేషము మిగిలినదంటే [కొంత వరకు] దేవుడు మిమ్ములను ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి... మీరు బోధిస్తున్న సత్యాలు మెరుపులా ఉజ్జీవపు మంటలను వెలిగిస్తాయి...మీ పరిచారి ఇంకను వికసించాలి, మీ బోధ [అంతర్జాలములో] నిత్యత్వములో మారు మ్రోగాలి. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను, కాపరి గారు.

క్రీస్తు నందు,
జాక్ గ్నాన్

చూడండి. "క్రీస్తు నందు" అని ఎందుకు ముగించాలంటే మీ పరిచర్య [క్రీస్తు నందు రక్షణలోనికి మమ్ములను నడిపిస్తుంది].

సహోదరుడు జాక్ గ్నాన్ కు తెలుసు సంఘము గూర్చి, నేను లోతుగా పట్టించుకుంటానని. అందుకే ఉజ్జీవము అవసరతను నొక్కి వక్కనిస్తాను. ఏ ఒక్కరు మార్పిడి సాక్ష్యముపై ఆధారపడి క్రైస్తవ జీవితాన్ని జయప్రదముగా జీవించలేరు. కృప యందు మీరు ఎదగాలి – తరుచు అది బాధతో కూడినది. మీరు మీ జీవితాలలో పాపములు అతిక్రమములు ఎదుర్కొంటారు. ఈ పాటను గూర్చి ఆలోచించడం మీకు ఇష్టము ఉండదు, " నన్ను పరిశోధించు, ఓ దేవా, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను శోధించు నా తలంపులను గ్రహించు, నాయందు ఆయాసకరమైన మార్గము ఉన్నదేమో చూడుము..." కానీ మీరు దానిని గూర్చి ఆలోచించాలి. నొప్పితో కూడిన దైనప్పటికినీ, మిమ్ములను మీరు పరీక్షించుకోవాలి. మీ పాపములను ఒప్పుకొని యేసు రక్తములో కడుగబడాలి. అప్పుడు మీరు దేవుని సన్నిధి అనుభవిస్తారు, కవోడ్, ఉజ్జీవములో దేవుని అద్భుత అనుభవమును!

"నేను బ్రతిమాలుచున్నాను, మీ మహిమను నాకు చూపుము."

ఆయన మోషేకు జవాబు ఇచ్చినట్టు మీకు కూడ జవాబు ఇస్తాడు ప్రార్ధించి ఒప్పుకొండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము డాక్టర్ క్రైటన్ ఎల్. చాన్ గారిచే: యెషయా 64:1-3.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసు క్రీస్తు స్తుతింప బడును గాక" (ఎడ్వర్డ్ కాస్వాల్ చే అనువదింప బడినది, 1814-1878).
“May Jesus Christ be Praised” (translated by Edward Caswall, 1814-1878).