Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




క్రమము మరియు ప్రార్ధనలో వాదము – II భాగము

ORDER AND ARGUMENT IN PRAYER – PART II
(Telugu)

జాన్ సామ్యూల్ కాగన్ గారిచే
by Mr. John Samuel Cagan

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్
నందు ప్రభువు దినము సాయంకాలము, సెప్టెంబర్ 3, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Saturday Evening, September 3, 2016

"ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరినట్లుగా! ఆయనను ఎక్కడ కనుగొందునో ఆదినాకు తెలియ చేయబడును గాక! ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను, వాదములతో నానోరు నింపు కొనెదను" (యోబు 23:3-4).


క్రమమైన వాదనతో కూడిన ప్రార్ధనలు ఎలా చెయ్యాలో మనము చర్చిస్తూ ఉన్నాము. అలా చెయ్యడానికి, కథలు భైబిలు వచనాలు మన మనసులో ఉండడం అవసరము. వివరణతో కూడిన వాదన గట్టి విషయాన్నీ చెప్పడానికి శక్తివంతమైనది. రెండు విషయాల మధ్య పోలికలను చేయడమే విశ్లేషణ. పెద్దదైన అద్భుతమైన దానికొరకు మీరు ప్రార్ధించేటప్పుడు, దేవుని వాక్యంలో ఉన్న అలాంటి పెద్దదైన అద్భుతమైన దానిని గూర్చి చెప్పాలి. తక్కువ ప్రాధాన్యత గల విషయాలు గూర్చి ప్రార్ధించేటప్పుడు, దేవుడు ప్రతి వివరాన్ని పట్టించుకుంటాడని చెపుతుండాలి. ఇది అంతా అర్ధవంతము ఎందుకంటే దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు కాబట్టి. బైబిలులో చాలా సందర్భాలున్నాయి దేవుడు క్రమమైన, సహోతుకమైన, వాదనతో కూడిన ప్రార్థనకు జవాబివ్వడం. దేవునితో వాదించిన వారిని గూర్చిన ఉదాహరణలు బైబిలులో చాలా ఉన్నాయి.

I. మొదటిది, క్రమమైన ప్రార్ధకు దేవుని స్పందన.

అరణ్యంలో ఇశ్రాయేలీయుల నిమిత్తము మోషే ప్రార్ధించాడు. ప్రజలు దేవుని నుండి వైదొలిగి బంగారు దూడను ఆరాధించారు. దేవుడు వారిని నాశనము చేస్తానని భయపెట్టాడు. మోషే ప్రజల కొరకు ప్రార్ధించాడు. బైబిలు చెప్తుంది,

"మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహా శక్తి వలన, బహువలము వలన ఐగుప్తు లోనుండి రప్పించిన, నీ ప్రజల మీద నీ కోపము మండనేల, అన్నాడు? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి, వారిని నశింప చేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయెనని, ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్లుకొని, నీవు నీ ప్రజలకు ఈకీడు చేయక దాని గూర్చి సంతాప పడుము" (నిర్గమకాండము 32:11-12).

మోషే దేవునితో చెప్తున్నాడు, "ప్రభువా, ప్రజలు నిన్ను గూర్చి ఏమనుకుంటారు? ఈ ప్రజలను నీవు నాశనము చేస్తే నీ గొప్ప నామమును బట్టి వారేమనుకుంటారు?" తరువాత మోషే దేవునికి ఆయన వాగ్దానము గుర్తు చేస్తాడు:

"నీ సేవకులైన, అబ్రాహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును, జ్ఞాపకము చేసికొనుము, నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలే మీ సంతానము అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీసంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరమూ దానికి హక్కు దారుల గుదురనియు, వారితో నీ తోడని ప్రయాణము చేసి చెప్పితివనెను" (నిర్గమ కాండము 32:13).

మోషే దేవుడు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు (ఇశ్రాయేలు), లకిచ్చిన వాగ్దానము గుర్తు చేస్తున్నాడు, వారి సంతానమును ఆశీర్వదించి కనాను దేశాన్ని వారికిస్తానన్న మాట. "నీవు ఇప్పుడు ప్రజలను నాశనము చేస్తే, మీ వాగ్దానము నెరవేరదు." మోషే ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. బైబిలు చెప్తుంది, "అంతటా యెహోవా [మనస్సు మార్చుకున్నాడు] తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను" (నిర్గమ కాండము 32:14). దేవుడు తన మనసు మార్చుకున్నాడు. ఆయన తన ప్రజలను నాశనము చెయ్యలేదు. దేవుడు మోషే ప్రార్థనకు జవాబు ఇచ్చాడు.

ఒక వాదనలో దేవుని ప్రజల విచారమును గూర్చి చెప్పవచ్చు. మనమంతా మనషులము. భయంకర పరిస్థితులు సంభవిచినప్పుడు, వాటిని నొప్పి బాధ ద్వారా అనుభవిస్తాము. యేసు కూడా ఏడ్చాడు, లాజరు చనిపోయినప్పుడు. ఒక ప్రియుడు మీ దగ్గరకు వచ్చి, వారి బాధను మీకు గుర్తు చేసి, సహాయము కోరినప్పుడు, ఇది శక్తివంతమైన అవకాశము. మనము ఇంకొక వ్యక్తిని ప్రేమించే దాని కంటే దేవుడు మనలను ఎక్కువగా ప్రేమిస్తాడు. మీ హృదయ వేదనలను, మీ స్నేహితుల బాధలను, దేవుని ప్రజల విషయమును మీ వాదనలలో వినిపించండి.

యెరూషలేము నాశనమయ్యాక ఇర్మయా ప్రార్ధించాడు, "గుర్తుంచుకోండి, యెహోవా, మాకు కలిగిన శ్రమను జ్ఞాపకము చేసికొనుము: దృష్టి మామీదికి వచ్చిన, నింద ఎట్టిదో చూడము" (మీప వాక్యములు 5:1). యెరూషలేము నాశనమయ్యాక, కీర్తనకారుడు అన్నాడు,

"దేవా, అన్యజనులు నీ స్వాస్థములోనికి చొరబడియున్నారు; వారు నీ పరిశుద్ధాలయమును; అపవిత్ర పరచియున్నారు యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసియున్నారు. వారిని సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూ జంతువులకు ఆహారముగా పారవేసియున్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూష లేము చుట్టూ వారి రక్తము పారబోసియున్నారు; వారిని పాతి పెట్టు వారు ఎవరును లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యలమైతిమి, మా చుట్టునున్న వారు మమ్మును అపహసించి ఎగతాళి చేసెదరు" (కీర్తనలు 79:1-4).

ఆయన యూదా జనాంగము శ్రమపడుట అతడు దేవునికి చెప్పాడు. తన ప్రతిష్టను, తన పేరును సమర్ధించుకోవాలని అతడు దేవునికి ప్రార్ధించాడు. అతడు దేవునితో అన్నాడు, "మా రక్షణ, కర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము: నీ నామమును బట్టి, మా పాపములను పరిహరించి, మమ్మును రక్షింపుము" (కీర్తనలు 79:9). తరువాత అతడు ప్రార్ధించాడు, "వారి దేవుడెక్కడున్నాడని [ఎందుకు], అన్య జనులు పలకనేలా?" (కీర్తనలు 79:10). నశించు ప్రజలలో తన మహిమను నామమును సమర్ధించుకోమని అతడు దేవునికి ప్రార్ధించాడు.

ప్రార్ధనకు లేచేముందు, మన పరిస్థితులకు అన్వయించుకునేది దేవుడు బైబిలు ఏమి చేసాడు నేను ఆలోచింప ప్రయత్నిస్తున్నాను. బైబిలు వచనములు దేవుని ముందు రుజువుకు ఉపోద్ఘాతము. మీరు బైబిలు చదవడం దానిపై దృష్టి పెట్టడం ప్రాముఖ్యము. తరుచు, ప్రతీ వచనము గుర్తుండకపోయినా, బైబిలు నుండి ఒక అభిప్రాయము గుర్తు వస్తుంది, దానిని మీరు మీ వాదనకు ఉపయోగించవచ్చు. దానికి సృజనాత్మకత ఆలోచన అవసరము, ప్రత్యేకంగా దేవునితో వాదించడానికి, అది అవసరము. అప్పుడు ఇప్పుడు దేవుడే ఆయనే. దావీదు ప్రార్ధించాడు, "నా సహాయకుడవు; నీవే రక్షణ కర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము" (కీర్తనలు 27:9).

మోషే ప్రార్ధించాడు, "నీవు మహా శక్తి వలన బాహుబలము వలన, ఐగుప్తులోనుండి రప్పించిన [నీ] ప్రజల మీద నీ కోపము మండనేల?" (నిర్గమ కాండము 32:11). అతడు అంటున్నాడు, "ఓ దేవా, ఐగుప్తు దేశము నుండి మమ్ములను బయటకు తెచ్చావు. అరణ్యములో మమ్ములను చంపడానికి మీరు మమ్ములను తీసుకొని రాలేదు!" దేవుడు ఇతరులకు ఏమి చేసాడు? బైబిలు కాలములో? చరిత్రలో? మన సంఘములో? మీ కొరకు? ఈ వాదనలు విని గతంలో దేవుడు ఏమి చేసాడో ఆలోచించండి.

ఓ దేవా, 18 వ శతాబ్దంలో వెస్లీ వైట్ ఫీల్డ్ కు మీరు ఉజ్జీవము పంపించారు. లూయిస్ దీవికి, చైనాకు మీరు మీ ఆత్మను పంపించారు.
      మీరు ఇక్కడకు కూడ మీ ఆత్మను పంపించగలరు!
మీరు నా ఆత్మను రక్షించారు. ఇక్కడ మిగిలిన వారి ఆత్మలను రక్షించారు.
      ఈ వ్యక్తిని కూడా రక్షించండి!
భయంకర చీలిక నుండి మా సంఘాన్ని రక్షించారు. మేము
      చనిపోవడానికి దాని నుండి తీసుకొని రాలేదు.       కాబట్టి, ప్రభు, మా సంఘమును జీవింప చేయండి!
మీరు మా సంఘానికి గొప్ప విషయాలు చేశారు (ఉదాహరణలు). మీరు నా ప్రార్థనలకు జవాబు ఇచ్చారు. ఇతరుల ప్రార్థనలకు జవాబిచ్చారు (మీ ప్రార్ధనలు ఇతరుల ప్రార్ధనలు చెప్పండి). కనుక ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వండి!

ఎల్లప్పుడూ యేసు క్రీస్తు యొక్క శ్రమలు, మరణము, రక్తము, విజ్ఞాపన ప్రార్ధనను గూర్చి మాట్లాడండి. ఆయన నామములో ప్రార్ధించడానికి క్రీస్తు ఆహ్వానిస్తున్నారు. యేసు మన నీతి. తండ్రి దేవునికి ఆయనే మార్గము. యేసు అన్నాడు, "నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6). యేసు శిష్యులతో అన్నాడు, "నా నామమున మీరు నన్నేమి అడిగిననను, నేను చేతును" (యోహాను 14:4). మీకు నీతిలేదు. మీలో మీరు పాపి మాత్రమే మీరు ఏమి కాలేరు. మీరు క్రీస్తును విశ్వసిస్తే, దేవుడు మిమ్మును పాపములు క్షమింపబడిన వారీగా చూస్తాడు, యేసు రక్తములో కడుగబడిన వారీగా చూస్తాడు. మీరు క్రీస్తు నీతిని పొందుకుంటారు. మీరు దేవునికి యేసు నామములో ప్రార్ధించవచ్చు మీరు పాపి కానట్టే దేవుడు వింటాడు – వాస్తవానికి, మీరు యేసు అన్నట్టు చూస్తాడు. బైబిలు చెప్తుంది,

"ఆకాశమండలము గుండా వెళ్లిన... దేవుని కుమారుడైన, యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు... గనుక మనము కనికరింప బడి, సమయోచితంగా సహాయము కొరకు, కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము" (హెబ్రీయులకు 4:14, 16).

బైబిలు చెప్తుంది, "ఆయన రక్తము వలన, పరిశుద్ధ స్థలము నందు, ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది" (హెబ్రీయులకు 10:19). మనము దేవుని ముందు నిలబడడానికి మనకు హక్కు లేదు, కానీ ఆయన రక్తము ద్వారా క్రీస్తులో ఆయన సన్నిధిలోనికి నేరుగా వెళ్ళవచ్చు.

క్రీస్తే మన కొరకు ప్రార్ధిస్తున్నాడు. బైబిలు చెప్తుంది, "ఆయన [విజ్ఞాపన] చేయుటకు నిరంతరమూ జీవిస్తున్నాడు [మన కొరకు]" (హెబ్రీయులకు 7:25).

గుర్తుంచుకోండి దేవుడు వ్యక్తి, యంత్రము కాదు శక్తి కాదు. దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు, మీరు అడుగుతూనే ఉన్నప్పటికినీ – కొన్నిసార్లు చాలా సంవత్సరాలుగా. డాక్టర్ హైమర్స్ తన తల్లికొరకు రక్షణ కొరకు చాలా సంవత్సరాలు ప్రార్ధించాడు. మారి మోన్సన్, చైనా మిసేనరీ, ఇరవై సంవత్సరాలకు పైగా ఉజ్జీవము కొరకు ప్రార్ధించారు వచ్చింది. చాలాసార్లు ప్రజలు ఉజ్జీవము కొరకు ముఫై నలభై సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రార్ధించారు.

ఎలా ప్రార్ధించాలో శిష్యులకు బోధిస్తున్నప్పుడు, యేసు స్నేహితుని ఉపమానము చెప్పాడు. ఆయనన్నాడు, "అతడు తన స్నేహితుడైనందుకు లేచి, ఇయ్యక పోయినను, సిగ్గు మాలి [మాటిమాటికి, అడుగుటవలనైనను] లేచి అతనికి కావలసిన ఇచ్చును" (లూకా 11:8). జవాబు వచ్చేనంత వరకు ప్రార్ధిస్తూ ఉండాలి.

యేసు అన్నాడు, "అడుగుడి, మీకివ్వబడును; వెదకుడి, దొరుకును; తట్టుడి, మీకు తీయబడును" (మత్తయి 7:7). గ్రీకు అర్ధము "అడుగుతూ ఉండాలి," "వెదుకుతూ ఉండాలి," "తట్టుచు ఉండాలి." జవాబు రావడానికి సమయము పట్టవచ్చు. క్రీస్తు అన్నాడు, "దేవుడు తానూ ఏర్పరచుకొనిన వారు, దివారాత్రులు తన్ను గూర్చి మోర పెట్టుకొనుచుండగా, వారికి న్యాయము తీర్చడా? " (లూకా 18:7). జవాబుకు కొన్నిసార్లు ఎక్కువ సమయము ఎందుకు పడుతుంది? ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి, శక్తి కాదు. దేవుడు యంత్రమో శక్తో అయితే, మీరు ఒకసారి ప్రార్ధిస్తే జవాబు వచ్చేస్తుంది. దేవుడు ఒక వ్యక్తి. కొన్నిసార్లు జవాబిచ్చేముందు దేవుడు చాలాకాలము కనిపెడతాడు.

ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి, శక్తి కాదు, కొన్నిసార్లు జవాబు "కాదు" అని వస్తుంది. ప్రార్ధన మంత్రము కాదు. అది దేవుని మార్చడం కాదు. ప్రార్ధన దేవుడు పనులు చేసేలా చెయ్యదు? ప్రార్ధన అంటే పనులు చేయమని దేవుని అడగడం. దేవుడు శక్తి కాదు. ఆయన వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రేమించే పట్టించుకునే దేవుడు, ఆయన జవాబిచ్చేవాడు; ఒక శక్తిలా కాదు, కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి స్పదింస్తున్నట్టుగా.

మీరు ప్రార్ధించినదెల్లా పొందుకోలేరు. దేవుడు ఒక వ్యక్తి. ఆయన "కాదు" అని చెప్పవచ్చు. యవ్వనస్థులారాలిగా, మిసేనరీ ఆమీ కార్మిక యేలు తన కాళ్ళ రంగును మార్చమని దేవుని అడిగింది. అలా జరగలేదు, తన ఆశ్చర్య పోయింది కానీ దేవుడు తనకు చెప్పాడా "కాదు" అనేది జవాబు "ఔను" బదులు.

II. రెండవది, క్రమమైన ప్రార్ధన దేవుని వాగ్ధానాలను ఎత్తి పట్టుకుంటుంది.

దేవుడు సత్యము. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాలు నిలబెట్టుకుంటాడు. బైబిలు అంతా సత్యము. బైబిలులో దేవుడు చెప్పినదంతా సత్యము ప్రార్ధనలో పొందుకోవచ్చు. యేసు అన్నాడు, "మీ వాక్యము సత్యము" (యోహాను 17:17). ఆయన అన్నాడు, "లేఖనము నిరర్థకము కానేరాదు" (యోహాను 10:35).

దేవుని మాటలు ఇలా పొందుకోండి:

"మీరు సెలవిచ్చితిరి" (ఆదికాండము 32:12).
"మీరు చెప్పినట్టు చెయ్యండి" (II సమూయేలు 7:25).

డాక్టర్ హైమర్స్ కు నచ్చిన కీర్తన 27. రెండేళ్లకు తన తండ్రి విడిచి పెట్టాడు. పన్నెండేళ్లకు తల్లితో ఉండలేకపోయాడు, చాలా సంవత్సరాలు బంధువులతో జీవించాడు వారు తనను పట్టించుకోలేదు. కీర్తనలు 27:10 లో ఆదరణ పొందాడు, "నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును."

యేసు అన్నాడు, "మీలో ఏమనష్యుడైనను, తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల, వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన యెడల, పామునిచ్చునా? మీరు, చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి ఇయువుల నియ్య నెరిగియుండగా, పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవుల నిచ్చును?" (మత్తయి 7:9-11). నా తండ్రి, డాక్టర్ కాగన్, చాలాసార్లు ఈ వచనాలు ఎత్తి పట్టుకున్నారు. అతనన్నాడు, "దేవా, నాకుమారుడు నన్ను చేపనడిగితే పామును ఇవ్వను. రొట్టె నడిగితే రాతి నివ్వను. దేవా, మీరు నాకు అలా చెయ్యరు. దేవా, నాకేది కావాలో, నాకు ఇవ్వండి." దేవుడిలా చేసాడు.

నా తండ్రి మంచి విషయాలకు దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకున్నాడు – ఆయనకు కావలసినవి. మీ అవసరాల కొరకు మీరు దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకోవచ్చు. ఆయన సహాయము కొరకు సన్నిధి కొరకు – పరిశుద్ధాత్మ నిమిత్తము మీరు దేవుని వాక్యాన్ని ఎత్తి పెట్టుకోవచ్చు. క్రీస్తు అన్నాడు, "మీరు, చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి ఇయువులనియ్య ఎరిగి యుండగా: పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును?" (లూకా 11:13).

ఆయన నామములో ప్రార్ధిస్తే క్రీస్తు జవాబిస్తానని, వాగ్దానము చేసాడు. యేసు అన్నాడు, "మీరు నా నామమున ఏమి అడిగినను, అది మీకు చేతును" (యోహాను 14:4). మీరు ప్రార్ధించేటప్పుడు ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి.

యేసు వాగ్దానము చేసాడు ప్రత్యేకంగా గుంపులతో, సంఘములో ప్రార్ధనా కూటములలో ప్రార్ధన కొరకు చిన్న గుంపులో చేయబడిన ప్రార్థనలకు ఆయన జవాబిస్తానని చెప్పాడు. క్రీస్తు చెప్పాడు, "మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చియైనను భూమి మీద ఏకీభవించిన యెడల, అది పరలోక మందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను" (మత్తయి 18:19). మళ్ళీ, యేసు చెప్పాడు, "ఇద్దరు ముగ్గురు నానామమున ఎక్కడ కూడియుందురో, అక్కడ నేను వారి మధ్యను ఉందును" (మత్తయి 18:20). మీరు ప్రార్ధించునప్పుడు ఆ వాగ్దానము ఎత్తిపట్టుకోండి.

మన అవసరాలు తీరుస్తానని దేవుడు వాగ్దానము చేసాడు. బైబిలు చెప్తుంది, "కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమతో మీ ప్రతి అవసరమును తీర్పును" (ఫిలిప్పీయులకు 4:19). మీరు డబ్బు గురించి అడిగితే మిమ్ములను దేవుడు గొప్పవారిని చేస్తారని అర్ధము కాదు. దాని అర్ధము మీ అవసరత దేవుడు తీరుస్తాడు. ఆయన తీరుస్తాడు! మీరు ప్రార్ధిస్తున్నప్పుడు దేవుని వాక్యంలో ఆ వాగ్దానము ఎత్తిపట్టండి!

మీరు చెయ్యడానికి కావలసిన శక్తి ఇస్తానని దేవుడు వాగ్దానము చేసాడు. బైబిలు చెప్తుంది, "యెహోవా కొరకు ఎదురు చూచువారు [‘ఎదురు చూడడమంటే’ ప్రార్ధించడం!] నూతన బలము పొందుతారు; వారు పక్షి రాజుల వలే రెక్కలు చూపి పైకి ఎగురుదురు; ఆలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు; మరియు వారు నడుస్తారు, మరియు అలసిపోరు" (యెషయా 40:31). ప్రార్ధించేటప్పుడు ఆ వాగ్దానము అడగండి!

మీరు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను పిలిస్తే వింటానని దేవుడు వాగ్దానము చేసాడు. దేవుడున్నాడు, "ఆ పత్కాలమున నీవు నన్ను గూర్చిన మోర పెట్టుము: నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరచెదవు" (కీర్తనలు 50:15). ఆ వాగ్దానము అడగండి. తన వాక్యంలో ఏమి చెప్పాడో దేవునికి చెప్పండి. ఆయనకు పిలవండి. "దేవా, నేను శ్రమలో ఉన్నాను. దయచేసి నాకు సహాయము చేయుము."

దేవుడు వాగ్దానము చేసాడు – ఉజ్జీవము మీరు చూడనిది – దాని గూర్చి ప్రార్ధించినా వింటానని. దేవుడున్నాడు, "నాకు మోర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింప లేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును" (యిర్మీయా 33:3). ఉజ్జీవము గూర్చి ప్రార్ధించేటప్పుడు ఆ వాగ్దానము ఎత్తి పట్టుకోండి.

అసంభవమైన వాటి కొరకు ప్రార్ధించడానికి భయపడవద్దు. క్రీస్తు చెప్పాడు, "దేవునికి సమస్తము సాధ్యము" (మార్కు 10:27). యిర్మీయా దేవునితో చెప్పాడు, "నీకు అసాధ్యమైనది ఏదియు లేదు" (యిర్మీయా 32:17).

జరుగుతాయని నమ్మలేని వాటిని గూర్చి, మీరు ప్రార్ధన చెయ్యవచ్చు. ఒక వ్యక్తి క్రీస్తుతో చెప్పాడు తన కుమారుడు దయ్యము పట్టి బాధింపబడుతున్నాడని. క్రీస్తు అతనితో చెప్పాడు, "నమ్ముట నీ వలననైతే, నమ్మువానికి సమస్తము సాధ్యము" (మార్కు 9:23). అతనన్నాడు, "ప్రభువా, నేను నమ్ముచున్నాను; అపనమ్మకం ఉండకుండునట్లు సహాయము చేయుము" (మార్కు 9:24). క్రీస్తు దురాత్మా నుండి ఆబాలుని విడుదల చేసాడు తండ్రి నమ్మనప్పటికినీ. మీ విశ్వసము బలహీనంగా ఉన్నప్పటికినీ మీరు ప్రార్ధించాలని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు, మీరు నమ్మకపోయినా జవాబు వస్తుంది.

డాక్టర్ హైమర్స్ ఒక ప్రసంగము చేశారు "అపనమ్మకం మరియు ఉజ్జీవము – నూతన దృక్పధము." ఆయన చూపించారు, మీరు ఉజ్జీవము అనే అద్భుతమును గూర్చి ప్రార్ధింపవచ్చని, మీరు దానిని చూడనప్పటికినీ. బైబిలులో దేవుడు చెప్పాడు, "నేను దప్పి గలవాని మీద, నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెను: నీ సంతతి మీద నా ఆత్మను క్రుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వరించెదను" (యెషయా 44:3 ). లూయిస్ దీవిపై ఒక వ్యక్తి ప్రార్ధనలో ఈ వాగ్దానము అడిగాడు. దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని అక్కడకు పంపించాడు.

బైబిలులో చాలా చాలా, వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు తన వాక్యాన్ని ఘన పరుస్తాడు. ఆ వాక్యాన్ని ప్రార్ధనలో అడగండి. ఆయన వాగ్ధానాలను ఎత్తి పట్టుకోండి! దేవుడు మీ వాదములతో కూడిన ప్రార్ధన వింటాడు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ద అవుట్ లైన్ ఆఫ్

క్రమము మరియు ప్రార్ధనలో వాదము – II భాగము

ORDER AND ARGUMENT IN PRAYER – PART II

జాన్ సామ్యూల్ కాగన్ గారిచే
by Mr. John Samuel Cagan

"ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరినట్లుగా! ఆయనను ఎక్కడ కనుగొందునో ఆదినాకు తెలియ చేయబడును గాక! ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను, వాదములతో నానోరు నింపు కొనెదను" (యోబు 23:3-4).

I.   మొదటిది, క్రమమైన ప్రార్ధనకు దేవుని స్పందన, నిర్గమకాండము 32:11-12, 13, 14; మీప వాక్యములు 5:1; కీర్తనలు 79:1-4, 9, 10; కీర్తనలు 27:9; యోహాను 14:6, 14; హెబ్రీయులకు 4:14, 16; 10:19; 7:25; లూకా 11:8; మత్తయి 7:7; లూకా 18:7.

II.  రెండవది, క్రమమైన ప్రార్ధన దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టుకుంటుంది, యోహాను 17:17; యోహాను 10:35; ఆదికాండము 32:12; II సమూయేలు 7:25; కీర్తనలు 27:10; మత్తయి 7:9-11; లూకా 11:13; యోహాను 14:14; మత్తయి 18:19, 20; ఫిలిప్పీయులకు 4:19; యెషయా 40:31; కీర్తనలు 50:15; ఇర్మియా 33:3; మార్కు 10:27; ఇర్మియా 32:17; మార్కు 9:23, 24; యెషయా 44:3.