Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
తప్పిపోయిన కుమారుని తప్పుగా చూపించుట

(ప్రసంగము నంబరు 2 తప్పిపోయిన కుమారుడు)
MISINTERPRETING THE PRODIGAL SON
(SERMON NUMBER 2 ON THE PRODIGAL SON)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము సాయంత్రము, ఆగష్టు 25, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, August 25, 2013

"ఈ నాకుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పి పోయి, దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడ సాగిరి" (లూకా 15:24).


తప్పిపోయిన కుమారుని ఉపమానము బైబిలులో అత్యధికముగా ప్రేమింపబడే వాటిలో ఒకటే. కానీ ఈ రోజుల్లో చాల ఎక్కువగా అపార్ధం చేయబడుతుంది. సంక్షిప్తంగా ఉపమానం గూర్చి చెప్పి, నేను మీకు చెప్తాను ఎలా అది మర్చబడిందో మల్లింపబడిందో, మంచి-బోదకులచే కూడ.

ఈ సాయంకాలము బోధిస్తూ, రెండు విధాలుగా ఉపమానాన్ని గూర్చి చెప్తాను. మొదటిది, నేను చూపిస్తాను "నిర్టేతలచే" ఏవిధంగా మల్లింపబడిందో. రెండవది, నేను చూపిస్తాను అసలు అర్ధాన్ని. తరువాత చూపిస్తాను నీకు ఎలా అన్వయిస్తుందో. పూర్తీ ఉపమానముతో ప్రారంభిద్దాం.

యేసు అన్నాడు ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. చిన్నవాడు తండ్రి యొద్దకు వచ్చి, తన స్వాస్ద్యమిమ్మని అడుగుతాడు, తండ్రి మరణము ముందే. తండ్రి అంగీకరించి, చిన్నవానికి ఆస్తిలో సగభాగము యిస్తాడు. చిన్నకుమారుడు సమస్తాన్ని తీసుకొని యింటిని విడిచి వెళ్తాడు. దూరప్రాంతానికి వెళ్లి తన ఆస్తీ అంతయు పాడుచేసి పాప జీవితం జీవిస్తాడు.

తనకున్నదంతయు ఖర్చు పెట్టాక, కరువు వచ్చి ఇబ్బంది పడతాడు. ఆ దేశ వలలో ఒకని చెంత చేరితే పందులను మేపుటకు పంపుతాడు. అతడు ఎంతో ఆకలిగొని పందులు తినే పొట్టును తినాలనుకుంటాడు, తినడానికి ఎవ్వరూ ఏమి ఇవ్వడంలేదు.

అతనికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద కూలి వాండ్రకు సమృద్ధిగా అన్నము ఉన్నది, నేను ఆకలితో అలమటించిపోతున్నాను. తండ్రి యింటికి తిరిగివద్దామని నిర్ణయించుకొని, "తండ్రీ, పరలోకమునకు విరోధముగా నీ యెదుట పాపము చేసియున్నాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు; నీ పని వారిలో ఒకనిగా పెట్టుకో." అతడు లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. తను వచ్చుచుండగా, తండ్రి పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. తన తండ్రి ఖరీదైన వస్త్రాన్ని తొడిగించి, ఉంగరము తొడిగించి, పాదరక్షలు యిస్తాడు. తండ్రి దూడను వధించి గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు. తండ్రి అంటాడు,

"ఈ నాకుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పిపోయి, దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోష పడసాగిరి" (లూకా 15:24). ఇది ఉపమానము సారాంశము. ఇప్పుడు, నేను మీకు చూపిస్తాను ఈ రోజుల్లో అది ఏ విధంగా తప్పుగా చూపబడిందో, దాని అస్సలు అర్ధం ఏమిటో మీకు చూపిస్తాను.

I. మొదటిది, ఆధునిక బోధకులచే ఈ ఉపమానము ఎలా తప్పుడుగా చూపించబడింది.

నాకు అసత్యం చెప్పడానికి డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ ఈ ఉపమానాన్ని తప్పుగా చెప్పారని, కానీ ఆయన అలా చేసారు. డాక్టర్ మెక్ గీ అన్నారు, "పాపి రక్షింపబడడంకి సంబందించిన చిత్రము కాదిది...ఈ కధలో ప్రభువు అన్నాడు ఆ బాలుడు కుమారుడా కదా అనే విషయం ప్రస్తావింపబడలేదు...అన్ని సమయాల్లో కుమారుడే...ఒకే ఒక్కడు తండ్రి ఇంటికి వెళ్దామనుకున్నాడు కుమారుడు; ఒక రోజు కుమారుడంటాడు, ‘నేను లేచి తండ్రి యొద్దకు వెళ్తాను’’’ (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume IV, pp. 314, 315; notes on Luke 15:11-19).

కనుక, డాక్టర్ మెక్ గీ తప్పుగా చెప్పాడు ఈ యవనస్థుడు రక్షింపబడ్డాడు. అతడు తిరుగుబాటు చేసి లోతైన, దీర్ఘ పాపపు జీవితంలో వెళ్లి, కాని రక్షింపబడ్డాడు. తరువాత పశ్చాత్తాప పడి పాపాన్ని బట్టి జీవితాన్ని తిరిగి సమర్పించుకున్నాడు.

నేను విచారిస్తున్నాను చెప్పడానికి డాక్టర్ మెక్ గీ ఆధునిక "నిర్ణేతలచే" ప్రభావితమయ్యారు. ఆ విధంగా ఆధునిక బోధకులు, బిల్లీ గ్రేహం లాంటి వారు, ఉపమానాన్ని తర్జుమా చేసారు. అలా ఎందుకు చేసారు? ఎందుకంటే వేల కొలది ప్రజలు "నిర్ణయాలు" తీసుకొని తిరిగి పాపంలో పడిపోయారు. ఒకే మార్గం ఈ బోధకులు అలా వివరించడానికి వారు తప్పిపోయిన కుమారుని వలే ఉన్నారు, ఒక రోజు వారు లేచి తిరిగి సమర్పించుకుంటారు. మీరు ఇలా అనడం మీరు వింటారు కొంత మంది "రక్షింపబడిన" త్రాగు బోతులు, "రక్షింపబడిన" మత్తు మందు తీసుకొనే వారు, "రక్షింపబడిన" వేశ్యలు. "సంఘ బిడ్డలు" 88% (పిల్లలు) మంది సంఘాలు వదిలేసి "తిరిగి ఎప్పుడూ రాలేదు" వాళ్ళంతా ఒక "నిర్ణయం" తీసుకున్నారు, కాపరులు తప్పుడు నిరీక్షణ వారి తల్లిదండ్రులకు ఇచ్చారు బిడ్డలు తప్పిపోయిన కుమారులనీ, రక్షింపబడి వెనుతిరిగారని. వాళ్ళంటారు వీళ్ళంతా, లోతుగా పాపంలో జీవించి గుడికి హాజరు కాకుండా, "రక్షింపబడ్డారు" కానీ అలాగే ఉన్నారు. వాళ్ళు చేయవలసింది తిరిగి వచ్చి తిరిగి సమర్పించుకోవాలి భవిష్యత్తులో. అలా చెయ్యకపోయినా, వారు రక్షింపబడినవారే. డాక్టర్ మెక్ గీ చెప్పినట్టు, "ఆ బాలుడు కుమారుడా కాదా అనే ప్రశ్న ఉండింది. అన్ని వేళల్లో ఆయన కుమారుడే." కాబట్టి, బిల్ క్లింటన్, బాప్టిష్టు, "కుమారుడు" ఓవల్ ఆఫీసులో మొనికా లెవెన్స్ కీతో శృంగారము చేస్తున్నప్పటికినీ. కాబట్టి, ఇంకొక, బాప్టిష్టు జిమ్మీ కార్టర్, "కుమారుడు" అతను బైబిల్ కొట్టిపారేసిన మరియు మార్మన్స్ నిజమైన క్రైస్తవులు అని మాట్లాడుతూ జరిగినది! వ్యభిచారుల నాయకురాలు లాల్ ఏంజలిస్ లో "తిరిగి జన్మించిన క్రైస్తవురాలు" అని చెప్పబడింది. ఒక సువార్తికుడన్నాడు, "ఆమెను తీర్పు తీర్పవద్దు." ఏమి పిచ్చి! ఈ తికమక సువార్తీకరణనే "వస్తావ తిరస్కరణ," ఏ నమ్మకం నుండి వస్తుందంటే ఒకేసారి ఒకడు పాపంలో జీవిస్తూ దేవుని కుమారుడని పిలువబడవచ్చు. వారు "శారీరక క్రైస్తవులు." కాని డాక్టర్ మార్టిన్-లూయిడ్ జోన్స్ అన్నాడు, "అది తప్పుడు తర్జుమా [రోమా 8:5-8] ‘శారీరానుసారులు’ ‘శారీరక’ క్రైస్తవులు; అపోస్తలుడంటాడు వారిని గూర్చి వారు క్రైస్తవులు కానే కారు...క్రైస్తవత్వము, తరుచూ అపోస్తాలుడు చెప్పాడు, మానవునిలో, తన శైలితో గొప్ప మార్పు తెచ్చింది" (D. Martyn Lloyd-Jones, M.D., Exposition of Romans 8:5-17, “The Sons of God,” The Banner of Truth Trust, 2002 reprint, p. 3).

డాక్టర్ మెక్ గీ సవరించడాన్ని అసహ్యించుకుంటున్నాను. 1960 మరియు 1970 లలో ఎక్కువ బైబిలు నాకు బోధించాడు, ప్రతీ రోజు రేడియోలో వినేవాడిని. తప్పిపోయిన కుమారిని పై ఆయన అభిప్రాయాన్ని నేను కచ్చితంగా సరిదిద్దుతాను. నాకు వేరే ఎన్నిక లేదు. డాక్టర్ మెక్ గీ అన్నాడు తానూ రక్షింపబడిన వాడినని "చాలా యేళ్ళ క్రితం దక్షిణ ఒక్ల హొమాలొ సువార్తీకునిగా ఉంటూ సువార్త చెప్పడానికి ఈ ఉపమానాన్ని వాడాడు...ఒక రాత్రి దీనిపై బోధించాడు, ఆ రాత్రే నేను ముందుకు వెళ్ళాను" (ఐబిఐడి., పేజి 314). అప్పుడు డాక్టర్ మెక్ గీ అన్నాడు, "పాపి ఏలా రక్షింపబడ్డాడో దానిపై ఈ ఉపమానము కాదు" (ఐబిఐడి.). తానూ అన్నాడు అది "ప్రాముఖ్యంగా" "పాపం చేసిన కుమారుడ్ని వెనక్కితీసుకోవడంను గూర్చి."

డాక్టర్ మెక్ గీ కి ఆ తలంపు రాలేదు తన రక్షణకు కారకుడైన ఒక్ల హొమాలొనీ పాత కలం బోధకుడి నుండి. కాదు, తనకు ఆ తలంపు ఆధునిక-కొత్త సువార్త బోధకులు బిల్లీ గ్రేహం లాంటి వారి నుండి వచ్చింది, "తిరుగు సమర్పణ" చెప్తాడు తేట మార్పిడి బదులు. ఈ "కొత్త" విధానము ఉపమానము చూడడంలో "ఎన్నడూ మార్పు చెందని" పడిపోయిన క్రైస్తవులను తయారు చేస్తుంది. డాక్టర్ లూయిడ్-జోన్స్ చెప్పినట్టు, "వారు క్రైస్తవులవుట అసాధ్యము."

ఈ మద్య ఒక పుస్తకం చదివాను సువార్తికుడు వ్రాసాడు అన్నాడు,

నేను దక్షిణ కెరోలినాలో ఉంటాను, దక్షిణాదని ప్రేమిస్తాను, నేను ఎవ్వరిని గేలి చేయడం లేదు, కాని ప్రతి ఒక్కరి లాగే అక్కడ చెప్తారు అతడు రక్షింపబడ్డాడు అని!...కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో, ప్రతీ వీధిలో ఒక గుడి ఉంది. మన రాజకీయ నాయకులు సినీతారలు అంటారు వారు రక్షింపబడ్డారని...కానిహత్య, అరాచకము, మత్తు మందు, అశ్లీల చిత్రాలు, విడాకులు, అబద్దాలు, దొంగతనాలు చాల ఎక్కువయ్యాయి …ఏది తప్పు? మన స్థానిక సంఘాలు అభివృద్ధిలో సువార్తలో ఎందుకు తగ్గు ముఖం పడుతున్నాయి?...సమస్య ఏంటి? (Jerry Sivnksty, “Gospel Soaked or Gospel Thirsty?”, Frontline Magazine, July/August 2013, p. 38).

సమస్య ఏంటో నేను చెబుతాను – వేలమంది "నిర్ణయాలు" తీసుకున్నారు కాని మారలేదు! అదీ సమస్య! అది దక్షణంలో కాదు. అమెరికా అంతా! ఈ మధ్య ఒక బోధకుడు నాకు చెప్పాడు సువార్త నిమిత్తము ఆయన తట్టిన ప్రతి తలుపు, ప్రజలు అన్నారు వెళ్ళిపోమని ఎందుకంటే వారు ఇప్పటికే రక్షింపబడ్డారని! తను అన్నాడు వారు గుడికి రారు పశ్చాత్తాప రుఎందుకంటే ఇప్పటికే రక్షింపబడ్డారుని వారను కుంటున్నారు! అది దశాబ్దాలుగా "నిర్నయత్వము" ఫలితము "తప్పిపోయిన కుమారులు" నిజక్రైస్తవులు అనేది పూర్తిగా తప్పుడు తలంపు! నేనంటాను, "అలాంటి తప్పుడు సువార్త నుండి వెళ్లిపొండి! అది వాస్తవంగా అమెరికాను నాశనం చేసింది!" వదిలేయండి! పట్టించు కోకండి! పార వేయండి! లక్షల ఆత్మలను ముంచి, సంఘాలను అవిటి వాటిగా చేసి, మన దేశానికి ఆత్మీయ పతనం తీసుకొచ్చాయి! వాటిని ప్రోత్సహించే వారిని నేను లెక్క చెయ్యను - డాక్టర్ మెక్ గీ, బిల్లీ గ్రేహం, పోప్ ప్రేన్సిస్, అంత్యక్రీస్తు - అది నరక సిద్ధాంతము, పూర్తిగా సాతాను విషముతో నిండినది! మన పాఠ్యభాగము తెలుపుతుంది,

"ఈ నాకుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పిపోయి, దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోష పడసాగిరి" (లూకా 15:24).

(ఇక్కడ క్లిక్ చెయ్యండి నేను బోధించిన ఇంకొక ప్రసంగము చదవడానికి, తప్పిపోయిన కుమారుని పై శీర్షిక, "మార్పిడి యొక్క మూలత్వము. " ఈ ప్రసంగములో అది కూడా చదవాలి).

II. రెండవది, ఈ ఉపమానము క్రీస్తుచే ఇవ్వబడినది తప్పిపోయిన పాపులు, అతి క్రమముల చేత పాపముల చేత చచ్చినవారు, ఎలా రక్షింపబడ్డారో చూపడానికి!

నాకు భార్యను విడిచి వేరే స్త్రీ తో వెళ్ళిపోయినా ఒక వ్యక్తి తెలుసు. తుపాకీతో బ్యాంకును దోచి, చాలా సంవత్సరాలు జైలులో ఉన్నాడు. తానూ ఒక వ్యభిచారి, దొంగ, బ్యాంకు దోపిడీ దారుడు. కాని తానూ రక్షింపబడిన వారునని చెప్పాడు! నేను అడిగాను తుపాకీతో బ్యాంకు దోపిడీ చేస్తున్నప్పుడు రాకడవస్తే నీకేమయ్యేది. అది నేరుగా చెప్పాడు, "తుపాకి నెల మీద పడి ఆకాశములో ప్రభువు కలవడానికి నేను ఎత్తబడే వాడిని!" నేను చెప్పాను అది తప్పని, తను మారలేదని. తప్పిపోయిన కుమారుని చూపించి, తప్పుడు తర్జుమా యిచ్చాడు కొన్ని క్షణాల క్రిందట చెప్పాను, అంతటా అతడు ఒక “కుమారుడు” అని. బైబిలు తెరిచి అతనికి చూపాను. వేలును లూకా 15:24 పై ఉంచి. నేను అన్నాను, "చదువు." మూడు నాలుగు సార్లు చెప్పాల్సి వచ్చింది చివరకు ఆపుకుంటూ చదివాడు,

"ఈ నాకుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పిపోయి, దొరికెనని చెప్పెను…" (లూకా 15:24).

నన్ను కోపం కళ్ళతో చూసాడు, దొరికిపోయాడని! అప్పుడు చెప్పుతున్నాడు, "కాని దాని అర్ధం అది కాదు!" అని నేనన్నాను, "దాని అర్ధం ఏంటి నీకు చెప్పలేదు. చదవమని చెప్పాను అంతే." అప్పుడు దానిని అతని కోసం చదివాను,

"ఈ నా కుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పిపోయి, దొరికెను..."

నేను అన్నాను, "ఆ మనిషి స్వంత తండ్రే అన్నాడు అతడు ‘మృతుడు.’ ఆ మనిషి స్వంత తండ్రే అన్నాడు అతడు ‘తప్పిపోయాడని.’ స్వంత తండ్రి చెప్పినప్పుడు, దానిని విభేదించడానికి నీ వెవరవు?" అవునట్టు, మీరు డాక్టర్ మెక్ గీ వ్యాఖ్యానము చూస్తే, మీరు చూస్తారు ఆయన లూకా 15:24 పై ఏ వ్యాఖ్యానము ఇవ్వలేదు! చెయ్యలేక పోయాడు! అది అతని తప్పుడు విషయాన్ని పూర్తిగా నాశనము చేసేది! లూకా 15:24 లో తండ్రి అన్నాడు తన కుమారుడు "చనిపోయాడని" – అంటే, "అపరాధములలొను పాపములోను చచ్చుట" (ఎఫీసియులకు 2:1, 5). తండ్రి అన్నాడు, "అతడు తప్పిపోయాడు." ఏది తేట అయింది? నశించిన పాపిని ఇది చిత్రీకరిస్తుంది!

యేసు లూకా 15 వ అధ్యాయములో పరిశయ్యలకు జవాబిచ్చుటకు ముందు ఉపమానాలు చెప్పాడు. వారు పిర్యాదు చేస్తారు ఆయన పాపులతో భోజనం చేసాడని (లూకా 15:2). ఒక పాపి రక్షింపబడితే దేవుడు ఎలా సంతోషిస్తాడో చూపడానికి ఆయన ఈ మూడు ఉపమానాము ఇచ్చాడు! మూడింటిలో ప్రతి ఉపమానము దేవుడు తప్పిన పాపులను ఎలా స్వీకరించి క్షమిస్తాడో చూపుతుంది. వచనాలు 3 నుండి 7 వరకు తప్పిపోయిన గొర్రె ఉపమానము ఇచ్చాడు. వచనాలు 8 నుండి 10 వరకు తప్పిపోయిన నాణెము ఉపమానము ఇచ్చాడు. తరువాత 11 నుండి 32 వరకు వచనాలలో తప్పిపోయిన కుమారుని ఉపమానము ఇచ్చాడు. ఈ మూడు ఉపమానాల్లో ప్రాముఖ్య విషయం "పశ్చాత్తాపపడు ఒక్క పాపి" పట్ల దేవుడు అధికంగా ఆనందించుట (లూకా 15:7, 10, 24). ఆశ్చర్యంగా, డాక్టర్ రైరీ కూడా డాక్టర్ మెక్ గీ తో బిల్లీ గ్రేహం తో ఏకీభవించలేదు. డాక్టర్ రైరీ సరిగ్గా తీసుకున్నాడు. లూకా 15:4 పై, ఆయన ప్రస్తావనలో, తను అన్నాడు, "తప్పిపోవుట. ఎనిమిది సార్లు ఈ అధ్యాయములో మానవుని తప్పిపోవుటను, గూర్చి వక్కనింపబడింది. వచనము 4 [రెండు సార్లు], 6, 8, 9, 17, 24, 32" (Charles C. Ryrie, Th.D., Ph.D., The Ryrie Study Bible, Moody Press, 1978, p. 1576; note on Luke 15:4). "మానవుని తప్పిపోవడం వక్కాణింపబడింది." సరిగ్గా వాస్తవం!

డాక్టర్ మెక్ గీ తప్పిపోయిన కుమారుడు "కుమారుడు" అనే విషయం ఎక్కువగా నొక్కి చెప్పాడు. ఈ ఉపమానంలో "కుమారుడు" రక్షింపబడ్డాడు అని అర్ధం కాదు. డాక్టర్ జాన్ మాక్ ఆర్డరు ఈ విషయం పై సరియే ఆయన అన్నాడు ఈ ఉపమానము "పాపులందరినీ చిత్రీ కరిస్తుంది (తండ్రి దేవునిచే సృష్టింపబడిన వారు) వారు ఆదిక్యతలు వ్యర్ధ పరిచి సహవాసాన్ని [దేవుని] తిరస్కరించారు, పాప భూయిష్టమైన జీవితాన్ని ఎన్నుకున్నారు" (John MacArthur, D.D., The MacArthur Study Bible, Word Bibles, 1997, p. 1545; note on Luke 15:12).

డాక్టర్ మెక్ ఆర్డరు సరిగ్గా చెప్పాడు తప్పిపోయిన కుమారుడు "రక్షణ కొరకు వ్యక్తి" "బుద్ధి వచ్చినప్పుడు" (ఐబిఐడి., గమనిక లూకా 15:17). మెక్ ఆర్డరు సరిగ్గా చెప్పాడు తప్పిన వారు నశించాడని. నేను డాక్టర్ మెక్ గీ తో ఉంటాను డాక్టర్ మెక్ ఆర్డరు కంటే చాలా విషయాలపై, ప్రత్యేకంగా క్రీస్తు రక్తము విషయంలో. డాక్టర్ మెక్ గీ ఈ విషయంలో సరియే, కాని జాన్ మెక్ ఆర్డరు సరికాదు. తప్పిపోయిన కుమారుని మార్పిడి విషయములో, మన పాఠ్య భాగము నన్ను బలవంత పెడుతుంది జాన్ మెక్ ఆర్డరుతో అంగీకరించమని,

"ఈ నా కుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పిపోయి, దొరికెనని చెప్పెను..." (లూకా 15:24).

అవునట్టు, పాత వ్యాఖ్యనాలన్నీ చెప్తున్నాయి తప్పిపోయిన కుమారుడు నశించి పోయాడని, ఈ ఉపమానం లో మార్చబడ్డాడని. పాత వ్యాఖ్యానాలేవి చెప్పలేదు "తిరిగి సమర్పించుకున్నాడని" ఆయన జీవితాన్ని అంతటా రక్షింపబడ్డాడని! మేత్యూపూలే (1624-1679) అన్నాడు మన పాఠ్యము, "ఒక పాపపు ఆత్మ…ఒక పాపాత్ముని మార్పిడి మరణం నుండి పునరుత్థాన వంటి ఉంది. మర్మానికి సరి తూగదు, క్రీస్తు రక్తము ద్వారా దేవునితో సమాధాన పరిచే వరకు" (note on Luke 15:24; A Commentary on the Holy Bible, The Banner of Truth Trust, 1990 reprint, volume III, p. 247).

మాధ్యూ హెన్నీ (1662-1714) అన్నాడు, "దేవుని తండ్రి మానవాళికి, ఆదాయ సంతతికి దేవుని తండ్రిగా ఉపమానము కనుపరుస్తుంది..." మేత్యూ హెన్రీ ఇంకా అన్నాడు తప్పిపోయిన కుమారుడు " ఒక పాపి, మా సహజత్వములో ఉన్న పాపిని...వృధా చేయునట్టి పాపి పరిస్థితి...మాకు ఒక పాపాత్మకమైన పరిస్థితి, మనిషి తప్పుదారిలో ఇది ఆ నికృష్ట పరిస్థితి సూచిస్తుంది." మేత్యూ హెన్రీ తొమ్మిది విషయాలు చెప్పాడు తప్పిన వ్యక్తి చిత్ర పటమును గూర్చి (Matthew Henry’s Commentary on the Whole Bible, Hendrickson Publishers, 1996 reprint, volume 5, pp. 599-600).

డాక్టర్ జాన్ ఆర్ రైస్ పాత వ్యాఖ్యానల వైపే చూసాడు. డాక్టర్ ఆర్ రైస్ డాక్టర్ మేక్ గీ చెప్పిన విషయముపై అంగీకరించలేదు "రక్షింపబడిన పాపి చిత్ర పటము కాదిది." డాక్టర్ రైస్ కేవలం వ్యతిరేఖంగా అన్నారు. డాక్టర్ రైస్ అన్నాడు, "కోల్పోయిన కొడుకు పాపి వృధా చేయునట్టి చిత్రాలు" (John R. Rice, D.D., The Son of Man, Sword of the Lord Publishers, 1971, p. 372; note on Luke 15:11-16).

సి.హెచ్. స్ఫర్జన్, బోధకులలో రారాజు, అదే విషయాన్నీ తప్పిన వాని “ముగింపు ప్రసంగములో” చెప్పాడు (The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1975 reprint, volume XLI, pp. 241-249). పాఠం చెప్తుంది,

“ఈ నాకుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పిపోయి, దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోష పడసాగిరి" (లూకా 15:24).

స్పర్జన్ అన్నాడు, "ఆత్మ మార్పు నీతిమంతుల హృదయాల్లో నిత్య ఆనందం కుసరిపోతుంది" (ఐబిఐడి., ఎక్స్ పోజసన్ అధ్యాయముపై, పేజి 251). ఈ వ్యాఖ్యానాల సారాంశము ఏంటంటే తప్పినవాడు నశించాడు, ఉపమానం చూపిస్తుంది అతడు ఎలా మారాడో. ఆ ఉద్దేశము తరాలుగా ప్రముఖ వేత్తలు చెప్పారు – "నిర్ణయత్వము" మనకాలంలో మార్చాడని "గజిబిజిగా" అస్పష్టంగా మార్చింది!

III. మూడవది, నిజమర్పులో ఏమి సంభవించాలి అనేది ఈ ఉపమానము చూపిస్తుంది.

నీవు మార్చబడి, నిజ క్రైస్తవుడవాలంటే, తప్పినవాడు దేవుని ద్వార పయనించారో నీవు కూడ అలాగే వెళ్ళాలి. అలాకాకపోతే, దేవుడు నీతో అనలేడు,

"ఈ నా కుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పిపోయి, దొరికెనని చెప్పెను..." (లూకా 15:24).

ఇప్పుడు నీవు వివరణ ద్వారా గతం ద్వారా వింటున్నప్పుడు, నీ మనసు తత్తర పడుతుంది. ఓ పురుషుడా! ఓ స్త్రీ! నీతో మాట్లాడుతున్నాను! తప్పిన కుమారుడు వెళ్ళిన దానిలో కొంతైనా నీవు పయనించాలి లేక పొతే నరకానికి వెళ్తావు! అతను అనుభవించింది నీవు అనిభావించాలి, లేకపొతే నిత్యత్వాన్ని అగ్ని జ్వాలల మధ్య దెయ్యాలతో హింసించబడడం, నీ మనస్సాక్షి ముక్కలవడం సంభవిస్తుంది! రక్షింపబడదానికి దేనిద్వారా, కొంతైనా నీవు వెళ్ళాలి, రక్షింపబడడానికి. యేసు నీ స్థానంలో చనిపోయాడు, సిలువపై నీ పాపాలకు వేలు చెల్లించాడు, సిలువపై. నీకు జీవాన్ని ఇవ్వడానికి మృతులలో నుండి లేచాడు. కానీ సాధారణంగా క్రీస్తు నోద్దకు రావడంలో శ్రమ ఉంటుంది. తప్పిపోయిన కుమారుని ఉపమానము నుండి క్రింది విషయాలు వెలువడుతున్నాయి:

1.  నీ హృదయము నిజంగా స్వార్ధముతో కూడుకోని యున్నదిని దేవుని నుండి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలని కోరుకుంటుందని నీవు ఒప్పుకోవాలి. సమాచార గదికి వచ్చే కొంతమంది మాకు తెలుసు, వారికీ రక్షింపబడాలని ఉంది, గుడిని విడిచి వెళ్ళిపోవాలని కూడ ఉంది! ఏది లోతైన స్వార్ధ-పూరిత మోసము. తిరిగి లోకములోనికి వెళ్ళిపోవాలని అనుకునే వ్యక్తికి దేవుడు రక్షించే కృపను ఎందుకు ఇవ్వాలి? "ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల, తండ్రి ప్రేమ వానిలో ఉండదు" (I యోహాను 2:15). "ద్విమనస్కుడు తన సమస్త మార్గముల యందు ఆస్తిపరుడు" (యాకోబు 1:8).

2.  లోకంలోని వెలితిని నీకు చూపాలని దేవునికి ప్రార్ధించు. అక్కడకు వెళ్ళకూడదు అనే విషయం గ్రహించడానికి, నీవు వాస్తవంగా వీధి వ్యక్తివి కానక్కరలేదు! అవాస్తవిక జీవిత విధానంలోని శూన్యతను దేవుడు నీకు చూపగలడు. దేవుడు లేని జీవితంలోని శూన్యతను చూపించమని దేవున్ని అడుగు. "మీరు అడగడం లేదు, కాబట్టి పొందు కోలేరు" (యాకోబు 4:2).

3.  లేచి! సృహలోనికి రా! శాంతి సమాధానాలకు బదులు "ఆకలితో నశిస్తున్నావు," అనే విషయాన్ని చూపమని దేవుని అడుగు! ఇప్పుడు, నీకు అంతరంగిక సమాధానము లేదు! క్రీస్తు నిన్ను క్షమిస్తున్నప్పుడు పాపంలో ఎందుకుంటావు? "దుష్టులకు నెమ్మది యుండదని, నా దేవుడు, సెలవిచ్చుచున్నాడు" (యెషయా 7:21).

4.  నీ పాపం గూర్చి ఆలోచించు. వ్యక్తిగత పాపాలను గూర్చి, పాపపు హృదయాన్ని గూర్చి ఆలోచించు. నీ పాపాన్ని గూర్చి లోతుగా ఆలోచించు నీవు తప్పిన వానితో చెప్పేవరకూ, "నేను పర లోకము నకు విరోధముగాను, నీ యెదుటను పాపమూ చెసితిని" (లూకా 15:18). నా కాపరి డాక్టర్ తిమోతి విన్ అతని పాపాల పట్టీ వ్రాసుకునే వరకూ రక్షణ పొందలేదు. దేవుడు ఒప్పుకోలు ఇచ్చేవరకూ ఆ పాపాల పట్టీ ద్వారా వెళ్ళాడు, తనకు తెలుసు నశించినపాపియని! అలాగే చేయమని చెప్పడం లేదు, కానీ అది కొందరికి ఉపయోగపడవచ్చు.

5.  కుమారుడైన దేవునిపై ఆధారపడు, "దేవుడొక్కడే, దేవునికినీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, క్రీస్తు యెసదు నరుడు" (I తిమోతి 2:5). యేసు అన్నాడు, "నా ద్వారా తప్ప ఎవడును, తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6). క్రీస్తులో "ప్రవేశించడానికి పోరాడండి" (లూకా 13:24). క్రీస్తు నోద్దకు రావడం సమన్యమని తలస్తే వారు రక్షింపబడలేరు. నీ జీవితంలో అది అతి ప్రాముఖ్య విషయమై ఉండాలి! "ప్రవేశించడానికి పోరాడు"! క్రీస్తును కనుగొన్నప్పుడు, అది ప్రయాసం కంటే "పోరాటం" కంటే గొప్పది. యేసు అన్నాడు, "నా యొద్దకు రండి...నేను మీకు విశ్రాంతి కలుగజేతును" (మత్తయి 11:28). "యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును" (I యోహాను 1:7).


ఈ రాత్రి ఈ పాత పాట మీ ప్రార్ధన కానివ్వండి –

దేవునికు దూరంగా తిరుగులాడెను,
     ఇంటికి తిరిగి వస్తున్నాను;
సుదీర్ఘ పాప మార్గాల ద్వారా పయనించాను,
     ప్రభువా, ఇంటికి వస్తున్నాను.

నేను చాల ప్రశస్త సంవత్సరాలు పాడు చేసుకున్నాను,
     ఇప్పుడు ఇంటికి వస్తున్నాను;
నేను ఇప్పుడు కన్నీటితో పశ్చాత్తాప పడుతున్నాను,
     ప్రభువా, ఇంటికి వస్తున్నాను.
ఇంటికి వస్తున్నాను, ఇంటికి వస్తున్నాను,
     ఇక తిరుగులాడను,
నీ ప్రేమపూరిత హస్తాలు తెరువబడ్డాయి,
     ప్రభువా, ఇంటికి వస్తున్నాను.
(“Lord, I’m Coming Home” by William J. Kirkpatrick, 1838-1921).

నీవు క్రైస్తవుడవాలనుకుంటే, నీ స్థలము వదిలి ఆవరణ వెనుక వైపు వెళ్ళు. డాక్టర్ కాగన్ ప్రార్ధన కోసం మౌన స్థలానికి తీసుకెళ్తాడు. డాక్టర్ కాగన్, ఇప్పుడే వారు యేసును అంగీకరించినట్లు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమే చే: లూకా 15:21-24.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"నేను ఇప్పుడు యేసు వాడను" (నార్మల్ జె. క్లేటన్ చే,1903-1992).
“Now I Belong to Jesus” (by Norman J. Clayton, 1903-1992).


ద అవుట్ లైన్ ఆఫ్

తప్పిపోయిన కుమారుని తప్పుగా చూపించుట

(ప్రసంగము నంబరు 2 తప్పిపోయిన కుమారుడు)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

"ఈ నాకుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పి పోయి, దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడ సాగిరి" (లూకా 15:24).

I.   మొదటిది, ఆధునిక బోధకులచే ఈ ఉపమానము ఎలా తప్పుడుగా చూపించబడింది, లుకా 15:24.

II.  రెండవది, ఈ ఉపమానము క్రీస్తుచే ఇవ్వబడినది తప్పిపోయిన పాపులు, అతి క్రమముల చేత పాపముల చేత చచ్చినవారు, ఎలా రక్షింపబడ్డారో చూపడానికి! ఎఫీస్సీయులకు 2:1, 5; లుకా 15:7, 10, 24.

III. మూడవది, నిజమర్పులో ఏమి సంభవించాలి అనేది ఈ ఉపమానము చూపిస్తుంది, I యోహాను 2:15;
యాకోబు 1:8; 4:2; యెషయా 57:21; లుకా 15:18;
I తిమోతీ 2:5; యోహాను 14:6; లుకా 13:24;
మత్తయి 11:28; I యోహాను 1:7.