Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మార్పిడి యొక్క ఆది మూలము

(ప్రసంగము నంబరు 1 తప్పిపోయిన కుమారుడు)
THE ARCHETYPE OF CONVERSION
(SERMON NUMBER 1 ON THE PRODIGAL SON)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము ఉదయము, ఆగష్టు 25, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, August 25, 2013

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు" (లూకా 15:17).


తప్పిపోయిన కుమారుని గూర్చిన ఉపమానము బైబిలులో ఎక్కువగా ప్రేమింపబడే కథ. కాని తరుచూ తప్పుగా చెప్పబడుతుంది. ఆ తప్పును ఈ రాత్రి ప్రసంగములో నేను సవరించడానికి ప్రయత్నిస్తాను, "తప్పిపోయిన కుమారుడిని తప్పుగా చూపించుట." వినడానికి తిరిగి 6:30 కి వస్తారని ఆశిస్తున్నాను. తరువాత మీకు భోజనం ఉంటుంది, కాబట్టి రాత్రికి మళ్ళీ రండి!

పాత వ్యాఖ్యానాలన్నీ చెప్పుతున్నాయి తప్పిపోయిన కుమారుడు నశించి పోయాడని. వారు అన్నారు ఈ ఉపమానము తన మార్పును వివరిస్తుందని. కాని బిల్లీ గ్రేహం ఇతరులు అన్నారు ఇది మార్పిడికి సంబంధించిన చిత్రము కాదని. నిర్ణేతలు అన్నారు వెనుదిరిగిన క్రైస్తవుని తిరుగు సమర్పణను చూపిస్తున్న చిత్రమని. పాత వ్యాఖ్యానాలన్నీ ఎలా తప్పవుతాయి? సరే, అవి తప్పు కావు. ఆధునిక తర్జుమా తప్పు. చూసారా, ఆధునిక బోధకులు తిరుగు సమర్పణగా చేసారు ఎందుకంటే ఇలాంటి మార్పిడి వారు చూడలేదు. అందుకే గొప్ప బైబిలు భోధకుడు మెక్ గీ కూడా తప్పపోయాడు – అది ఈ రాత్రి ప్రసంగములో వివరిస్తాను.

ఇరవైవ శతాబ్దములో, "నిర్ణేతలు" మార్పిడిని చులకన విషయంగా చేసారు – చెయ్యి ఎత్తితే నీవు రక్షింపబడతావు. చిలుక వలే ఒక పద్యము వల్లిస్తే నీవు రక్షింపబడతావు. కనుక, ఇరవైవ శతాబ్దములో, భోధకులు మార్పిడిని తప్పి పోయినడిగా చూడరు. "నిర్ణేతల" ఫలితంగా బిల్లీ గ్రేహం ఇతరులు ఉపమానాన్ని తిరిగి తర్జుమా చేయవలసి వచ్చింది మార్పిడి కాదు తిరుగు సమర్పణ అని. ఉపమానాన్ని ఉన్నట్టుగా మాట్లాడ నివ్వకుండా, దానిని "నిర్నయత్వము" "అద్దాల" ద్వారా చదువుతారు. గొప్ప బైబిలు బోధకుడైన డాక్టర్ మెక్ గీ కూడా నిర్ణయత్వంతో తికమక అయ్యాడు. ఆయన అన్నడు, "ఇది రక్షింపబడిన పాపి చిత్రము కాదు... అసలు ఉపమానాన్ని అర్ధం చేసుకుందాం. పాపి ఎలా రక్షింపబడతాడు; అది తెలియ పరుస్తుంది తండ్రీ హృదయాన్ని ఆయన పాపిని రక్షించడమే కాదు పాపం చేసిన కుమారున్ని తిరిగి తీసుకోవడం" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume IV, p. 314; notes on Luke 15:14).

నేను నమ్ముతాను డాక్టర్ మెక్ గీ దీని మీద తికమక అయ్యాడు, డాలస్ వేదాంత సెమినరీ వ్యవస్థాపకుడు లూయిస్ స్పెర్రీ చాఫర్ ద్వారా. డాక్టర్ చాఫర్ పాత క్లిష్ట మార్పిడికి గట్టి వ్యతిరేకి – ఆయన ఫ్యాషన్ సంక్షోభం మార్పిడి. ఆయన "చాందసవాదము" బోధించాడు – క్రీస్తును గూర్చి బైబిలు చెప్ప దానిని నమ్మడం ద్వారా రక్షింపబడడం. అనిపిస్తుంది డాక్టర్ మెక్ గీ తప్పిపోయిన కుమారుని గూర్చిన తలంపు "తిరుగు సమర్పణ" లూయిస్ స్పెర్రీ చాఫర్ వలన వచ్చింది. తప్పిపోయిన కుమారుని గూర్చి డాక్టర్ చాఫర్ అన్న విషయాలు పరిశోధించి, దానికి మూలం తెలుసుకొని నాకు పంపితే, నేను ప్రసంశిస్తాను. ఈ తప్పుడు అభిప్రాయము ఇరవై శతాబ్దములో విస్తరించింది. బెల్లీ గ్రేహం తప్పి పోయిన కుమారుడిని వెనుదిరిగి తిరిగి దేవుని దగ్గరకు వచ్చినట్టుగా మాట్లాడాడు. ఆయన అన్నాడు, "నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ నిర్ధారణను తిరిగి నిర్ధారించాలని. నేను మిమ్మల్ని తిరిగి దేవుని వద్దకు రావాలని అడుగుచున్నాను." ఆయన ఆ విషయాన్ని కూటల్లో తప్పిపోయిన కుమారుడిని గూర్చి ఎప్పుడూ బోధించిన గుర్తు చేసేవాడు, యాబై సంవత్సరాల పాటు అవి అమెరికా అంతా ప్రసారం చేయబడ్డాయి. కనుక ఈ రోజు సగటు సువార్తికుడు అమెరికాలో తప్పిపోయిన కుమారుని గూర్చి అదే అనుకుంటాడు. కాని అది చాలా తికమకగా ఉంటుంది! ఎందుకు? ఎందుకంటే తప్పిపోయిన కుమారుని ఉపమానం తిరుగు సమర్పణను గూర్చి మాట్లాడ లేదు కాబట్టి! అది నిజ మార్పిడిని గూర్చి మాట్లాడుతుందిరెండూ ఒకటి కాదు! మార్పిడి నీకు దేవుడు చేసేది. తిరుగు సమర్పణ నీవు చేసేది. మార్పిడిలో, దేవుని ఆత్మ పాపిని మేల్కొలుపుతుంది, పాపపు బంధకాల నుండి విడుదల పొందాలని చెప్తూ క్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది. ఒక వ్యక్తీ కేవలం తన జీవితాన్ని తిరిగి సమర్పించుకుంటే నరకానికి వెళ్తాడు. ఎందుకు? ఎందుకంటే రక్షణ కృప ద్వారా, తిరుగు సమర్పణ క్రియలద్వారా. క్రియలు ఎవ్వరినీ రక్షింపలేవు!

అన్ని పాత వ్యాఖ్యానాలు, నిర్నయత్వము ముందు వ్రాయబడినవి అన్నాయి, తప్పిపోయిన కుమారుడు నశించి పోయాడని. ఉదాహరణకు, మాత్యూ హెన్రీ కామెంటరీ చెప్పింది పదము "కుమారుడు" అంటే అతడు రక్షింపబడ్డాడు అని కాదు, కాని "దేవుడిని సర్వ మానవాళికి తండ్రీగా చూపిస్తుంది." హెన్రీ కూడా అన్నడు ఉపమానం చెప్పబడింది "పాపి యొక్క మార్పు దేవుని కెంత ప్రీతి పాత్రమో" (Hendrickson Publishers, 1996 edition, volume 5, p. 598; notes on Luke 15:11-32). అలా శాస్త్రీయ వ్యాఖ్యానాలు, ఇరవై శతాబ్దం ముందు ఉపమానాన్ని అలా వర్ణించారు.

ఇరవై శతాబ్దపు నిర్నయత్వపు బ్రాంతిని ప్రక్కన పెట్టి, ఉపమానం నిజ అర్ధాన్ని గూర్చి ఆలోచిద్దాం. యేసు పరిశయ్యలకిచ్చిన మూడు ఉపమానాలలో ఇది మూడవది. వారును యేసును అపహసిస్తున్నారు ఎందుకంటే "ఆయన పాపులను చేర్చుకొని, వారితో కూడా భోజనం చేస్తున్నాడని" (లూకా 15:2). పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం ఎందుకు చేస్తున్నాడనే విషయం వివరించడానికి, యేసు మూడు ఉపమానాలను చెప్పాడు – మూడు చిన్న కథలు గాని గుణపాఠం ఉంది. మొదటిది, తప్పిపోయిన గొర్రె ఉపమానం ఇచ్చాడు (లూకా 15:3-7). రెండవది, ఆయన తప్పిపోయిన నాణెం ఉపమానం ఇచ్చాడు (లూకా 15:8-10). మూడవది, తప్పిపోయిన కుమారుని ఉపమానము చెప్పాడు – దానిని మనం "తప్పిపోయిన" అని పిలుస్తాం (లూకా 15:11-32). ఈ మూడు ఉపమానాలు నశించు వ్యక్తీ రక్షించబడడం గూర్చి. మొదటి రెండు ఉపమానరీతిలో అందరూ కోల్పోయిన వ్యక్తి రక్షింపబడ్డాడు అని అంటారు. ఇరవై శతాబ్దం ముందు ప్రతీ వ్యాఖ్యాత అన్నాడు మూడవ ఉపమానము నశించు వ్యక్తీ రక్షింపబడడానిని గూర్చి! ద స్కో ఫీల్డ్ నోట్ చెప్పుతుంది "నశించు కుమారుని గూర్చిన ఉపమానము" (ద స్కో ఫీల్డ్ స్టడీ బైబిలు, 1917 ప్రతి). సరిగ్గా అదే అది. లూకా 15:24 లో కుమారుని తండ్రీ అంటాడు తను ఆత్మీయంగా చనిపోయాడు, అలా నశించి పోయాడు!

"ఈ నా కుమారుడు చనిపోయి, మరల బ్రతికెను [కొత్త జీవితం]; ఆయన తప్పిపోయిన, దొరికెనని చెప్పెను..." (లూకా 15:24).

తప్పిపోయిన కుమారుని ఉపమానము క్రీస్తుచే ఇవ్వబడింది ఆది మూలముగాఒక మాదిరి, నిజ మార్పిడికి ఒక ఉదాహరణ. పౌలు మార్పు కూడా ఈ మాదిరిగానే ఉంటుంది. తప్పిపోయిన కుమారుని మార్పిడి ఉదాహరణ ఇరవై శతాబ్ధము వరకు గొప్ప భోధకులచే అనుభవింపబడింది – పెలేజియన్ హెరేటిక్ ఫిన్నీ తప్ప. కొంత క్రైస్తవ చరిత్ర చదివితే మీరు చూస్తారు ఎలా గొప్ప క్రైస్తవ నాయకులు తప్పిపోయిన కుమారుని మాదిరి మార్పిడినే పొందారని. అగష్టీన్ మార్పు ఈ మాదిరే. అలాగే లూథర్, బన్యన్, వైట్ షీల్డ్, ఇద్దరు వెస్లీ సోదరులు, వీరంతా ఒకటి రెండు మేల్కొల్పులలో మార్పు పొందారు (1730-1840), అలాగే సి.హెచ్. స్పర్జన్, ఆర్.ఎ.టోరీ, మరియు గొప్ప భోధకుడు డాక్టర్ జాన్ సంగ్, చైనా సువార్తీకుడు. వీళ్ళందరూ మార్పు నొందారు తప్పిపోయిన కుమారుని మాదిరి మార్పిడిని అనుభవించారు.

అవునట్టు, ఆ కారణాన్ని బట్టి క్రీస్తు తప్పిపోయిన కుమారుని ఉపమానము ఇచ్చాడు – మార్పిడిని గూర్చిన చిత్రాన్ని ఇవ్వడానికి. నాలుగు సువార్తలలో ఎక్కడా కూడా క్రీస్తు ఇంత వివరంగా మార్పును గూర్చి వివరించలేదు. అవును, పౌలు సాక్షము అపోస్తలుల కార్యములలో మూడు సార్లు వ్రాయబడింది – కాని నేననుకుంటాను క్రీస్తుచే చూపబడిన నమూనాను బట్టి, పౌలు మార్పిడి నొందాడు, పౌలు మారడానికి కొన్ని సంవత్సరాల ముందు, ప్రభువు తప్పిపోయిన కుమారుని ఉపమానము ఇవ్వక ముందు.

(ఇక్కడ క్లిక్ చెయ్యండి నా ప్రసంగము చదవడానికి, "తప్పిపోయిన కుమారుని గూర్చిన తప్పుడు సమాచారము." ఈ ప్రసంగముతో పాటు చదవాలి).

నేను ఆరంభంలో చెప్పినట్టు, తప్పిపోయిన కుమారుని ఉపమానము బైబిలులో అత్యధికంగా ప్రేమింపబడే వాక్య భాగములో ఒకటి. కారణం తప్పిపోయిన పాపి రక్షింపబడుటకు ఏ మాదిరి అనుభవము పొందాలో చెప్పబడింది. ఈ దీర్ఘ ఉపోద్ఘాతముతో, మనం ప్రసంగము ప్రాముఖ్య భాగంలోనికి వచ్చాం, వాక్య భాగము,

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

నేనంటాను తప్పిపోయిన కుమారుని మార్పు ఆది మూలము ఎందుకంటే ఒక వ్యక్తీ నిజంగా మారినప్పుడు ఉంటే కారకాలన్నీ అందులో ఉన్నాయి. పాఠము సామాన్యం,

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

మార్పిడిలో చాలా విభాగాలున్నాయి, వాటిని తప్పిపోయిన కుమారుని అనుభవముతో చూస్తాము. మొదటిది, ఒక దశలో యవనస్థుడు తండ్రీ నుండి స్వతంత్రుడుగా ఉండాలని కోరుకుంటాడు. తండ్రి ఆదిపత్యము వద్దనుకుంటున్నాడు. అతడు "స్వతంత్రుడుగా" ఉండాలనుకుంటున్నాడు. తను దేవుని ఉనికిని తిరస్కరించలేదు. తల్లిదండ్రులతో మతపర కార్యక్రమాలు హాజరయ్యాడు. కాని హృదయంత రంగములో - "స్వతంత్రత" పట్ల కోరిక కలిగియున్నాడు. తండ్రి నియమావళిని ఉల్లంఘించాలనుకున్నాడు. కొన్ని ఉత్తేజపు అనుభవాలు పొందుకోవాలనుకున్నాడు. హేయలోకపు ఫలాలు రుచి చూడాలను కున్నాడు. అతడు మగాడు, తనే అధిపతిగా స్వంత నియమాలతో, తండ్రి నియంత్రణ లేకుండా ఉండాలనుకున్నాడు. ఇలాంటి తలంపులు నీకుంటే, "నీ ఆధిపత్యము" లోనికి వస్తావు, ఇలాంటి తిరిగుబాటు ఉద్దేశాలుంటే.

కాని ఆ కుమారుడు మరియొక స్థితికి వచ్చాడు. స్వాస్థ్యాన్ని ముందుగా పొందుకున్నాడు, తండ్రి మరణానికి ముందు. దూర ప్రాంతానికి పారిపోయాడు. ఇప్పుడు తన కలలన్నీ అమలు చేస్తున్నాడు. తను రాత్రింబవళ్ళు "ఈ లోకపు భోగాలు అనుభవించాడు" (హెబ్రీయులకు 11:25).

మూడవ దశకు వచ్చాక, "అంతా ఖర్చు పెట్టాడు." తన ఆకలిని ఏదీ తృప్తి పరచలేకపోతుంది. అతని పాపాలు తృప్తి నివ్వలేదు. ఈ భయంకర స్థితిలో నాల్గవ దశకు వచ్చాడు – "బుద్ధి వచ్చినప్పుడు" (లూకా 15:17) – ఆధునిక తర్జుమాలో, "స్పృహలోనికి వచ్చినప్పుడు."

ఎంత అవివేకి! పిచ్చివాడిలా ఉన్నాడు, రకరకాల పాపాలు చేసాడు. యవనస్థులు విపరీత, కొత్త విషయాలు చేస్తున్నారు. యవనస్థులు పాపములో దూరస్తులై సంఘాన్ని వదిలేస్తారు. లోతైన పాపంలోనికి చొచ్చుకుపోయారు. ఎవ్వరూ వాళ్ళను ఆపలేరు. పాపంలో అంత లోతుగా వెళ్ళారని వారు ఊహించరు. వ్యాపారంలో ఫలించవచ్చు బాహ్యంగా బావుండోచ్చు, కాని దేవుని విషయాల్లో మృగాలు, హృదయంలో శాంతి లేకుండా, లోకంలో నిరీక్షణ లేకుండా.

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

నశించిన పాపిలో ఇది కృప మొదటి పని. కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే ఒక పాపిని స్పృహ లోనికి తెచ్చి జీవితాన్ని గూర్చి తెలివిగా ఆలోచింప చేస్తుంది, నిత్య గమ్యము వైపు. సాతాను మాట వినవద్దు నీవు తిరిగి రాగలవని, తప్పిపోయిన వాని వలే. దానిని లెక్కించవద్దు! దేవుడు ఆకర్షిస్తేనే వస్తావు, నీవు కావాలని పాపంలోనికి వెళ్తే, నిన్ను ఆయన వెనుకకు తీసుకొస్తాడు అనే హామీ లేదు! ఆయన అనవచ్చు, "ఎస్రాయిము విగ్రహములతో కలిసికొనెను: వానిని ఆలాగువనే ఉండనిమ్ము" (హోషేయా 4:17). కొన్ని నిమిషాలు చూద్దాం ఎలా తప్పిపోయిన కుమారుని ఉపమానం నశించిన పాపి మార్పును గూర్చి ఏమి తెలిపిందో.

I. మొదటిది, తప్పిపోయిన పాపికి బుద్ధి వచ్చింది.

"అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు" – స్పృహ వచ్చినప్పుడు. దేవుని కృప అతని జీవితంలో పనిచేయడానికి ఇది మొదటి గుర్తు.
కొన్ని సార్లు ఈ మానసిక మార్పు హఠాత్తుగా వస్తుంది. గ్రిఫిత్ కు అలాగే సంభవించింది, పాట పాడినతను, "ప్రభువా, నేను ఇంటికి వస్తున్నాను." అతడు పాత – ఆకస్మిక, మార్పు అనుభవించాడు. స్నేహితునితో గుడికి వచ్చాడు. నేను పాపము తీర్పుపై ప్రసంగిస్తున్నాను. స్నేహితుడన్నాడు, "బయటకు పోదాం." అలాంటిదే. గ్రిఫిత్ అన్నాడు, "ఆగు, నేను ఇది వినాలనుకుంటున్నాను." వేరే అతడు వెళ్ళిపోయాడు, వాస్తవానికి నా స్వరము నుండి పారిపోయాడు. గ్రిఫిత్ ఉన్నాడు. అతడు పాపపు ఒప్పుకోలు పొందుకున్నాడు. "అయితే అతనికి బుద్ధి వచ్చింది." అనుకున్నాడు, "బోధకుడు సరిగ్గానే చెప్పాడు. నేను పాపిని." అప్పుడే, యేసును నమ్మి రక్షింపబడ్డాడు. ఇది విని నేను చాలా సంతోషించాను! మునుపు పాపం పట్ల మక్కువ ఇప్పుడు దేవుని పట్ల ఆసక్తి అతనిని తెలిసిన వారు చెప్తారు. అతని హృదయ మార్పు నిజమని, సువార్త మొదటిసారి విన్నప్పుడు హఠాత్తుగా వచ్చింది. అలాగే డాక్టర్ చాన్ మారాడు. నా జీవితం అలాగే మారింది. అలాగే మెలీస్సా సాండర్స్ మారారు. అలాగే కాగన్, మన గుడిలో చాలా మంది మారారు. స్పృహలోనికి హఠాత్తుగా వచ్చాడు – యేసును హఠాత్తుగా నమ్మారు. మొట్ట మొదటి సారిగా నా బోధ విని వారు రక్షింపబడ్డారు!

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

ఇంకో వైపు, కొన్ని సార్లు ఈ మార్పు క్రమేణా వస్తుంది, నెమ్మదిగా. అలా సాంగ్ మారాడు. గుడికి వచ్చి ప్రసంగము తరువాత కనుక్కునే గదికి వెళ్ళాడు. మళ్ళీ మళ్ళీ వచ్చాడు. ఆయన స్వంత తలంపులున్నాయి. మాతో తర్కించేవాడు మేము క్రీస్తు గురుంచి చెప్పేటప్పుడు. ఒక రోజు నాతో గట్టిగా వాదించాడు నేను గద్ధించాను. మా గుడిని వదిలేసి వేరే కాపరి దగ్గరకు వెళ్లి మార్పిడిని అర్ధం చేసుకున్నాడు. నాకు గుర్తుంది, కథొలిక్ పాదిరి దగ్గరకు వెళ్ళాడు. తను సహాయ పడలేదు. స్వతంత్ర ప్రొటెస్టెంట్ పాదిరి దగ్గరకు వెళ్ళాడు, అక్కడ కూడా సహాయం లేదు. చివరకు టివిలో సినిమాలో యేసును గూర్చి చూసాడు. దేవుడు మాట్లాడాడు, కన్నీరు కార్చాడు. తరువాత ఆదివారం గుడికి రావడం చూసాను, నేను ఆనందించాను! విరామ గదికి వచ్చినప్పుడు, అతని గర్వము అణిగింది. యేసును నమ్ముకున్నాడు. అతడు మార్చబడ్డాడు,

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

మన యవనస్థులలొ ఒకడు మన గుడిలో ఎదిగాడు. అతడు చైనీయుడు. చాలా శ్రమ పడ్డాడు. యేసును త్రోసి పుచ్చాడు - అనుభూతి కొరకు చూసాడు, పాప క్షమాపణకు బదులు. ఒక రోజు ఉదయం ఆయన కళ్ళలో కన్నీళ్లు చూసాను. ఒత్తిడి నుండి బయటపడ్డాడు. తల్లి ప్రక్క మోకరింప చేసాను, యేసును నమ్మాడు. అతడు మార్చబడ్డాడు,

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

ఇంకొక యవనస్థుడు మళ్ళీ మళ్ళీ పరామర్శ గదికి వచ్చాడు. అతనికి లోతైన ఒప్పుకోలు ఉంది, కాని విశ్వాసంతో యేసు నోద్దకు రావడానికి నిరాకరించాడు. పరామర్శ గదికి ఎప్పుడు వచ్చినా ఏడుస్తాడు కాని, రక్షణ పొందలేదు. చివరకు ఎంతో ఏడుస్తూ మూలుగుతున్నాడు చాలా ఎక్కువగా అతనికి మూర్చ వచ్చింది అనుకున్నాను. విశ్రాంతి గదికి వెళ్లి ముఖం కడుక్కోమన్నాను. తిరిగి వచ్చినప్పుడు, ఒక పాత పాట అతనికి చెప్పను,

నా ఉత్సాహము నిరుపయోగమా,
   నా కన్నీళ్లు నిరంతరం ఉంటాయా,
పాపము అపరిహారార్ధం;
   నీవే రక్షించాలి, నీను మాత్రమే.
నాకై చీల్చబడ్డ, ఓ బండా,
   నా దాగు చోటు నీవే.
(“Rock of Ages, Cleft For Me” by Augustus M. Toplady, 1740-1778).

ఆయన యేసును నమ్మి రక్షింపబడ్డాడు,

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

లీ గారు గుడికి వచ్చి యేసుని నమ్మినట్లు అనిపించాడు. కాని అది ఒట్టి నిర్నయత్వము. తరువాత తెలిసింది క్రీస్తు నుండి జీవితం పొందుకో లేదని. అతడు "మాటలు లేవు," చెప్పడానికి. తిరిగి పరామర్శ గదికి వచ్చాడు. యేసు నోద్దకు కన్నీళ్ళతో పశ్చాత్తాపముతో వచ్చాడు. త్వరలో మార్చబడ్డాడు,

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

చాలా సంవత్సరాలకు భాహటంగా ప్రార్దిస్తున్నాడు ఉత్సాహంతో ప్రేమతో 18 మరియు 19 శతాబ్దాలలో 1907 లో కొరియా ఉజ్జీవములొ వారి మేల్కొలుపు వలే. దేవుణ్ణి ప్రార్ధించు! అతడు పూర్తిగా మార్చబడ్డాడు,

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

జాన్ కాగన్ గుడిని అసహ్యించుకున్నాడు, గుడికి రమ్మన్నందుకు తండ్రిని అసహ్యించుకున్నాడు. ఒక ఉదయం వరిశుద్ధాత్మ అతని హృదయాన్ని పగులగొట్టింది. మోకాల్లపై పొక్కులు అంటూ, వేదిక దగ్గరకు వచ్చాడు. పాత-మెధడిస్టు వలే మారాడు! ఓ, దేవునికి స్తోత్రం! అతడు మారాడు,

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

ఇప్పుడు ఒక అమ్మాయిని గూర్చి ఆలోచిస్తున్నాను. ఆమె చాలా మతపరం! ఆమెలోనే బంధింపబడింది. యేసు నోద్దకు ఎలా రావాలో తెలియలేదు. నిరాశ చెందింది. నిరీక్షణ లేనేలేదు. నిరీక్షణ అంతా నేలపాలు అయినప్పుడు, అద్దంలా పగిలినప్పుడు, సౌమ్యంగా యేసు నోద్దకు వచ్చి, ఆమె రక్షింపబడింది,

"అతనికి [ఆమె] బుద్ధి [ఆమెకి] వచ్చినప్పుడు" (లూకా 15:17).

II. రెండవది, నీవు త్వరగా వచ్చి త్వరిత నిర్ణయం తీసుకునేలా చేయగలనా?

బహుశా చేయగలను! రప్పించగలను, "పాపి ప్రార్ధన" చేయించగలను. నీవు సంతోసిస్తావు – కొంత సేపు. అప్పుడు ఆలోచిస్తావు, "ఇది అంతా అంతేనా? నాకు వాస్తవముగా అనిపించడం లేదు నాకు." అప్పుడు తప్పిపోయిన కుమారుని తలంపులు వస్తాయి. మళ్ళీ ఆలోచిస్తావు, "ప్రపంచంలో నేను పొందుకోనిది ఏదో ఉంది బహుశా." "ఇది అవాస్తవము!" "నేను నిజ ఆనందం కోల్పోతున్నాను." నేను చూసాను! నేను చూసాను! బైబిలు చెబుతుంది, "ఆరంభం కంటే అంతం భయంకరము" (II పేతురు 2:20). ఇప్పుడే అది అందుకోవాలి! ఇప్పుడే అందుకోవాలి! ఇప్పుడు కాకపొతే, "అంతం" "ఆరంభం" కంటే భయంకరంగా ఉంటుంది. నీ హృదయం బండ తేరి దేవుని ఏ మాట నిన్ను కదిలించలేదు! శ్రమించి విలపించు, ఇప్పుడే మొరపెట్టు, "చేయరాని కార్యములు చేయుటకు భ్రష్టు మనస్సుకు, వారినప్పగించెను" (రోమా 1:28). ఇప్పుడే శ్రమించి క్రీస్తును వెదకు ఇలా చెప్పించుకోకుండా, "నిన్ను నీవే నిర్మూలం చేసుకొనుచున్నావు" (హోషేయా 13:9). కన్నీరు, సిద్ధ మనసు ఇప్పుడు కలిగి యుండడం మేలు, ఒక రోజు క్రీస్తు యిలా అనకముందే,

"మీరెవరో నాకు తెలియదు: నా యొద్ద నుండి తొలగిపోవుడి" (మత్తయి 7:23).

"అబ్రహాము ఇస్సాకు యాకోబులును సకల వక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు, [మీరు వెలుపలికి త్రోయబడుటయు] మీరు చూచునప్పుడు, మీరు ఏడ్చుచూ పండ్లు కోరుకుదురు" (లూకా 13:28).

క్రీస్తు ఇలా చెప్పడం మీరు వింటారు,

"పనికి మాలిన…ఆ దాసుని వెలువట చీకటిలోనికి త్రోసి వేయుడి: అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుటయు ఉండును" (మత్తయి 25:30).

ఓ! ఓ! నేను బ్రతిమాలుతున్నాను, ఇప్పుడే ఆలోచించు! ఇప్పుడే ఆలోచించు! ఇప్పుడే ఆలోచించు! "అతడు స్పృహలోనికి వచ్చినప్పుడు." ఓ, నీవు స్పృహలోనికి ఈ రోజే వస్తావా! నీ గురుంచీ చెప్పబడాలి,

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు"
       (లూకా 15:17).

అతడు హృదయంలో అనుకున్నాడు, "లేచి యేసు నోద్దకు వస్తాను"–

నీ ప్రశస్త రక్తములో కడుగ బడడానికి
   కల్వరిపై కారిన.
నేను వస్తున్నాను, ప్రభూ! ఇప్పుడే వస్తున్నాను!
   కడుగు, రక్తంలో కడుగు
కల్వరిలో ప్రవహించిన.
   (“I Am Coming, Lord” by Lewis Hartsough, 1828-1919).

నీవు క్రైస్తవుడవాలనుకుంటే, నీ స్థలము వదిలి, ఆవరణ వెనుక వైపు వెళ్ళు. డాక్టర్ కాగన్ ప్రార్ధన కోసం మౌన స్థలానికి తీసుకెళ్తాడు. ఇప్పుడే ఆవరణ వెనక్కి వెళ్ళండి. డాక్టర్ కాగన్, ఇప్పుడే వారు యేసు ను అంగీకరించినట్లు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమే చే: లూకా 15:11-19.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ప్రభువా, ఇంటికి వస్తున్నాను" (విలియం జె.కిర్కి పేట్రిక్ గారిచే, 1838-1921).
“Lord, I’m Coming Home” (by William J. Kirkpatrick, 1838-1921).


ద అవుట్ లైన్ ఆఫ్

మార్పిడి యొక్క ఆది మూలము

(ప్రసంగము నంబరు 1 తప్పిపోయిన కుమారుడు)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు" (లూకా 15:17).

(లూకా 15:2, 24; హెబ్రీయులకు 11:25; హోషేయా 4:17)

I.   మొదటిది, తప్పిపోయిన పాపికి బుద్ధి వచ్చింది,
లూకా 15:17.

II.  రెండవది, నీవు త్వరగా వచ్చి త్వరిత నిర్ణయం తీసుకునేలా
చేయగలనా? II పేతురు 2:20; రోమా 1:28; హోషేయా 13:9; మత్తయి 7:23; లూకా 13:28; మత్తయి 25:30.