Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మూడవ ప్రపంచములో పెంతెకోస్తలత్వము

PENTECOSTALISM IN THE THIRD WORLD
(Telugu)

డాక్టర్ క్రిష్టాఫర్ ఎల్. కాగన్
by Dr. Christopher L. Cagan

పాఠము తలంపు లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము ప్రభువు దినము మధ్యాహ్నము, నవంబర్ 21, 2021
A lesson taught at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Afternoon, November 21, 2021

Hymn Sung Before the Lesson: “Hallelujah, What a Saviour!”
(by Philip P. Bliss, 1838-1876).
పాఠము కంటే ముందు పాట "హల్లెలూయా, ఎంతటి రక్షకుడవు!" (ఫిలిప్ పి. బ్లిస్ చే, 1838-1876).

"నేనే మార్గమును, సత్యమును, జీవమునై, యున్నాను: నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6; పేజీ 1135 స్కఫీల్డ్లో).


క్రీస్తు చెప్పాడు దేవుని చేరడానికి ఆయనే మార్గమని. రక్షణకు యేసు అత్యవసరము. ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు బుద్ధ ద్వారా గాని హైందవ దేవుళ్ల ద్వారా కాని దేవుని దగ్గరకు రాలేరు. మీ సత్ర్కియల చేత మీరు రక్షింపబడరు. పరిశుద్దాత్మ ద్వారా కూడ రక్షింపబడరు – యేసు ద్వారా మాత్రమే! అపోస్తలుడైన పేతురు అదే విషయాన్నీ చెప్తున్నాడు,

"మరి ఏనామమున రక్షణ లేదు: ఆకాశము క్రింద ఏ నామమందైన, రక్షణ లేదు" (అపోస్తలుల కార్యములు 4:12; పేజీ 1153).

యేసు క్రీస్తును నమ్మకుండా ఎవడును పరలోకమునకు వెళ్ళడు. ఆయన ఆయన మాత్రమే పరిపూర్ణ దైవ కుమారుడు మన పాపముల నిమిత్తము సిలువపై మరణించి, మన పాపాలు కడగడానికి రక్తము కార్చి, మనకు జీవాన్ని ఇవ్వడానికి మృతుల నుండి లేచాడు. ఇది చిన్న వివరణ కాదు. ఇది ప్రాధమిక క్రైస్తవ సిద్ధాంతము, దీనిని తరాల నుండి నిజ క్రైస్తవులు అందరు నమ్ముతారు. విచారము, పెంతేకోస్తలులు దీనిని తీవ్రముగా పరిగణించరు వీరు మూడవ ప్రపంచపు "క్రైస్తవ" మతాన్ని ఆధిపత్యము వహిస్తారు. అవును, కొన్ని సంఘాలు పెంతకోస్తువి కావు, కాని వాటిని కనుగోనలేము. పెంతేకోస్తలత్వము క్రైస్తవ్యములో ప్రాముఖ్యభాగము. ఈ సంఘాలు ఏమి భోధిస్తారు? వారు ఏమి చేస్తారు?

భారతదేశము కొన్ని ఆఫ్రికా దేశాలకు నేను మిసను ప్రయాణముపై వెళ్ళాను. నేను చెప్పినట్టుగా, అక్కడ సంఘాలన్నీ పెంతేకోస్తులవే. కానివి చాలా తక్కువ. వాటిని గూర్చి ఎవ్వరు మాట్లాడరు. క్రైస్తవ్యముగా భావించే వన్ని పెంతేకోస్తులవే. కాని కొద్ది మంది మారారు. నేను చూసినది మీతో చెప్తాను.

ఈ సంఘాలలో యేసును గూర్చి సువార్తను గూర్చి చాలా తక్కువ విన్నాను. బదులుగా, ప్రసంగీకులు "మాంత్రికులు"గా మారి ప్రజలను దీవిస్తారు, ఆఫ్రికాలో మంత్ర వైద్యుడు చేసినట్టు భారతదేశములో గురువు చేసినట్టు. చిన్న సంఘపు కాపరి తనను తాను కాపరి భోధకుడు అని పిలుచుకుంటాడు. అతడు పెద్ద సంఘాన్ని పరిచర్యను నడిపిస్తే, "బిషప్" అని పిలుచుకుంటాడు. ఆయన విజయవంతుడైతే, అతడు "అపోస్తలుడు" అవుతాడు. కొంతమంది బోధకులకు మంత్రశక్తులు ఉంటాయి. కొంతమంది చాలాధనవంతులు, పేద దేశములో.

అభివృద్ధి బోధకులు దృష్టిని పొందుకుంటారు. పెద్ద ఎత్తున వారి కొరకు ప్రకటనలు చేస్తారు. వారికి టెలివిజన్ కార్యక్రమాలు ఉంటాయి. భారతదేశములో టెలివిజన్ లో ఒకరు అభివృద్ధిపై పెద్ద ప్రసంగము చేసారు. చివరలో అతనన్నాడు నీవు రక్షించబడకపోతే ఈ ధనము ఉండదని. తరువాత పాపి ప్రార్ధన చేయించాడు రక్షింప బడడానికి. కాని ప్రజలు పాప క్షమాపణ కొరకు ప్రార్ధించలేదు. దానిని అభివృద్ధికి ప్రవేశము కొరకు చేసారు. వారు గొప్ప వారవడానికి యేసును "విశ్వసించారు."

కొన్నిసార్లు నేను చెప్తాను, "డబ్బు సార్వత్రిక భాష అందరికి అర్ధమవుతుంది." ఇది పెంతెకోస్తు బోధకుల విషయములో సత్యము! వారు సువార్తను బోధింపక పోవచ్చు, కాని డబ్బును అర్ధం చేసుకుంటారు! ఒక కూటములో, ఒక బోధకుడు ప్రజలను చేతులెత్తి గట్టిగా, "నేను గొప్పవాడను. నేను గొప్పవాడను" అని చెప్పించాడు. కాని ప్రసంగీకుడు ఒక్కడే గొప్పవాడయ్యాడు. అభివృద్ధి వేదాంతము పనిచేయదు. అది గమ్మత్తు మాత్రమే!

ఒక ప్రశ్న అడుగుతాను. పేద ప్రజలకు గ్రామాలకు, అభివృద్ధి బోధకుడు ఎందుకు అవసరము? డబ్బు వారికి అవసరము లేదా? దేశములో ఒక్క అభివృద్ధి బోధకుని నేను చూడలేదు. ఎందుకు? అక్కడి పేదవారు ఆ బోధకులకు ఇచ్చే అంత గొప్పవారు కాదు! అతని గొప్ప కారుకు, విమానానికి, పెద్ద ఇంటికి, భార్యకు కొత్త బట్టలకు, వారి దగ్గర డబ్బు ఉండదు. అందుకు బోధకుడు పేదవారిని పట్టించుకోడు. అతని బోధ విన్నా వారు గొప్పవారవరని అతనికి తెలుసు. వారు అంత ఇచ్చుకోలేరని అతనికి తెలుసు. అభివృద్ధి బోధకులను డబ్బు ఉన్న చోట చూసాను. కోడులు ఉన్నచోటికే నక్క వెళ్తుంది!

నేను చూసింది ఇంకా ఉంది. బోధకుడు ముట్టాలని ప్రజలు నిలబడతారు. వారు క్రింద పడి అపస్మారక స్థితిలో ఉండి, కొన్నిసార్లు ఊగుతారు. దానిని "ఆత్మ వశులవుట" అంటారు. కాని పరిశుద్దాత్ముడు వారికి ఏమి చేయడు. బోధపడు తాకకముందే, ప్రజలు మోకాళ్ళని, వంగి, తలలు వెనుకకు వంచుతారు. బోధకుడు నుదుటిపై చెయ్యిపెట్టి వెనుకకు నెట్టుతాడు. అది నిజమైతే, వారు కాళ్ళు వంచినా లేకున్నా పరిశుద్దాత్మ పనిచేస్తుంది! అది మొత్తం - అవాస్తవము. అది సాతాను సంబందితము.

భారతదేశములో ఒకడు పరుగెత్తి కొనివచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకు అని అడిగాను. నన్ను ముట్టుట ద్వారా, రక్షణ పొందుకోవాలనుకుంటున్నానని, చెప్పాడు. నేను తనకు రక్షణ ఇవ్వలేదని చెప్పాను. నేను మనిషిని, పాపిని అని చెప్పాను. నాకంటే గొప్పవాడు ఉన్నాడు అతని దగ్గరకు వస్తే రక్షణ ఇస్తాడు అని చెప్పాను. అతని పేరు యేసు. యేసును గూర్చి, ఆయన చేసిన దానిని అతనికి చెప్పాను. ఆ భారతీయుని క్రీస్తు నొద్దకు నడిపించాను. అతడు యేసును విశ్వసించాడు. నెల తరువాత అతడు చనిపోయి పరలోకానికి వెళ్ళాడు.

భారతదేశపు పెంతెకొస్తూ బోధకులు, ఆత్మీయ "గురువు" గా మారుతున్నారు. ఇది చాలాసార్లు చూసాను. ప్రసంగము తరువాత ప్రజలు ముందుకొచ్చి బోధకునితో (నాతో!) వారి మనవి చెప్తారు – స్వస్థత, డబ్బు, లేక ఇంకేదో. చేతులు జోడించి హిందూ గురువుకు చేసినట్టు చేస్తారు. వారి నుదుటిపై చేయి ఉంచి ప్రార్ధించమని నన్ను అడిగారు. వారు మాట్లాడేటప్పుడు, గురువుకు చెప్పినట్టే క్రైస్తవ బోధకునికి కూడ చెప్తారు. వారు "దైవజనుడు" అని – ఇద్దరికీ పలుకుతారు. వీరికి, ప్రసంగము ప్రాముఖ్యము కాదు. తరువాత వచ్చేది వారికి ముఖ్యము – బోధకులు ముట్టుట ద్వారా వచ్చే ఆశీర్వాదము.

భారతదేశములో కాని ఆప్రికా లో కాని నేను శాస్త్రీయ పాట వినలేదు. నాకు భాష రాదు, కాని స్వరములను గుర్తు పడతాను! పెద్ద సంఘములో రాక్ సంగీతము, అమెరికాలో జరిగినట్టు. ప్రజలు తరచూ పల్లవులు పాడుతుంటారు. భారతదేశములో పేద సంఘములో రాక్ బాండ్ కి విద్యుత్తు గిటారులకు స్పీకరులకు వారికి డబ్బులేదు. కాని డ్రమ్ము ఉంది. "యేసయ్య" అని ఇరవై నిమిషాలు పాడడం విన్నాను. ఒక ఏనుగు వస్తున్నట్టు అనిపించింది – డ్రమ్ము అలా వాయించారు. యేసుకు "యేసయ్య" అని పేరు. కాని ఆ పేరును వల్లించారు, స్తుతిస్తూ పాడలేదు.

యేసు అని పలికినా, క్రీస్తు గాని ఆయన సువార్త గాని ఈ సంఘాలలో కేంద్రముగా లేదు. మిగిలిన విషయాలు కేంద్రంగా ఉన్నాయి – పరిశుద్ధాత్మ, బోధకుని ముట్టుట, అభివృద్ధి – అవి తప్ప పాపమూ నిమిత్తము క్రీస్తు సిలువపై రక్తము కార్చుట లేదు.

ఆఫ్రికాలో ఒక కుటుంబములో ప్రసంగము ముందు గంట సంగీతము విన్నాను, ప్రజలు వేదికపై నాట్యమాడుచున్నారు. సంగీతము అనంతరము కాపరి నా దగ్గరకు వచ్చి తిరిగి రక్షింపబడడానికి కొందరున్నారు అన్నాడు. వారు సువార్త వినలేదు! ఏమి "కొత్త జన్మ" వారు పొందుకుంటారు? ముందు సువార్త వినని వారితో నేను కౌన్సిల్ చేయనని కాపరితో చెప్పాను. అతడు ఆశ్చర్య పడ్డాడు! ప్రసంగము తరువాత వారితో మాట్లాడి క్రీస్తు నొద్దకు నడిపించాను.

బహు "చెడ్డవారు" మారడానికి అవకాశము ఉంది. కొంతమంది మంత్రక్రియలు చేసేవారున్నారని విన్నాను. ప్రసంగము తరువాత వారికి ప్రత్యేక ఆహ్వానము ఇవ్వమని కాపరికి చెప్పాను, కాని అతడు చేయలేదు. నాల్గవసారి అతడు ఆహ్వానము ఇచ్చారు ఆంగ్లములో తరువాత స్థానిక భాషలో. ఆరేడుగురు వచ్చారు. వారు తప్పు చేసారని తెలుసు. వారు మునుపు క్రైస్తవులు కారు. శ్రమలో ఉన్నారని వారికి తెలుసు. వారిని కౌన్సిల్ చేసారు. తరువాత సువార్త చెప్పి క్రీస్తు నొద్దకు నడిపించాను.

పెంతెకోస్తులత్వములో ఎక్కువ భావోద్రేకము ఉంది, తక్కువ రక్షణ ఉంది. సంవత్సరాలు, దశాబ్దాలు, జీవితమంతా వెళ్ళొచ్చు, మార్పు లేకుండా. హైందవునిగా అన్యుడిగా నరకానికి వెళ్ళినట్టే పెంతెకోస్తులను కూడ నరకానికి వెళ్ళవచ్చు.

పెంతెకోస్తు సంఘాలకు శాస్త్రీయ క్రైస్తవ్యానికి తేడా ఏమిటి? శాస్త్రీయ పెంతెకోస్తు సంఘుములో, ప్రసంగము ప్రాముఖ్యము. కాపరి వాక్యము బోధిస్తాడు. సువార్త ఇవ్వబడుతుంది.

పెంతెకోస్తు సంఘములో ప్రాముఖ్యమైనవి భావోద్రేకాలు అనుభవాలు. ప్రజలు సంగీతముతో మురిసిపోతారు. చివరలో కాపరి ప్రార్ధిస్తాడు. దానానికి దారి చూపిస్తారు. కొన్నిసార్లు "ఆత్మతో" తాకబడి పడిపోతారు. అంతా భ్రమలు మాత్రమే. అది రక్షణ కాదు! సమయము వృధా, దయ్యము సంబందితమైనది.

కొంతమంది అనుకోవచ్చు, "మూడవ ప్రపంచములో ఇదే చూస్తాము. ఆమెరికాలో మనము నయము." కాదు, కాదు! ఇక్కడేమి వ్యత్యాసముంది? తరువాత, మూడవ ప్రపంచపు పెంతెకోస్తులు మన దేశపు పెంతెకోస్తుల వలన పిచ్చి వారిగా మారారు.

కొన్ని సంవత్సరాల క్రితము జాక్ నాన్ మరియు నేను ఒక పెంతెకోస్తు కూటము దర్శించాము. అది ఉజ్జీవ కూటము వాస్తవానికి. అది పెద్ద సంగీత శబ్దముతో మొదలయింది. చివరకు సర్కస్ లో వలే ఒక పురుషుడు స్త్రీ వచ్చి వెనుకకు ముందుకు తాడుపై నడిచారు. పైకి ఊగినప్పుడు, ఉజ్జీవము అనే పదాలు! పెద్ద అక్షరాలలో తెరపై చూపిస్తారు. అది ఉజ్జీవమే కాదు! కాని ప్రజలు హర్షించారు. తరువాత కొంతమంది కాపరులు మాట్లాడారు. గంటల తరబడి ప్రసంగాలలో, ఒకసారే ప్రభువు మాట ఉచ్చరించారు. సువార్త చెప్పబడలేదు. ఆరిజోనా నుండి వచ్చిన కాపరి అతని ప్రజలు "అగ్ని గుండాల" ద్వారా వెళ్తున్నారని చెప్పాడు. నేను అలా ఆలోచిస్తున్నాను, "బైబిల్ లో అగ్ని గుండాలు లేవు." కాని జరిగిన వాటిని బట్టి వారంతా ఉత్సాహించారు! చివరకు నడిపించే కాపరి ప్రజలతో చెప్పాడు ప్రార్ధన చేయించుకో దలచిన వారు, వేదికపైకి రావచ్చని. ప్రజలు వచ్చారు కాపరులు వారిపై చేతులుంచి ప్రార్ధించారు. ప్రజలు వణుకుతూ మెలికలు తిరుగుతూ, క్రింద పడ్డారు. ఒక కాపరి అరిచాడు, "పట్టుకునేవారు!" పడేవారిని పట్టుకోవడానికి అప్పటికే వీరు సిద్ధంగా ఉన్నారు. అది ఒక పథకము! 9:30 కి కూటము ముగిసింది. మీరు చూసారు, అద్దె గది కనుక 09:30 గంటలకు ముగించాలి. కనుక అద్దె "పరిశుద్ధాత్మ" 09:30 గంటలకు గదిని విడిచి వెళ్ళిపోయింది. ప్రజలు వచ్చినట్టే, వెళ్ళారు, ఎక్కువగా దయ్యాలతో ప్రభావితులయ్యారు. అది "ఉజ్జీవము"గా ఉండాలి, కాని ఇలా లేదు.

ప్రతి పెంతెకోస్తు ఆకర్షిత సంఘము అంత విపరీతముగా ఉండదు. కాని ఒక్కానించేది ఒక్కటే – సువార్త కాదు వినోదము ఉత్తెజము. అమెరికాలో, చాలా సంఘాలలో సువార్త చెప్పబడదు బోధింపబడదు. వారికి, ప్రభువు ఒక సహాయకుడు పరలోకానికి సులువుగా టికెట్టు ఇచ్చేవాడు. ఆయన ముఖ్యపని పాపాలు క్షమించడం కాదు ప్రజలను సంతోష పరచడం. పెంతెకోస్తు సంఘాలు భావాలు అనుభవాలు ఇస్తుంది. ప్రజలను ఉత్తేజ పరచడానికి సంగీతాన్నిస్తాయి! పెంతెకోస్తు భాషలు, ధన నిరీక్షణ, స్వస్థత ఇస్తాయి. కాని అవి సిలువ క్రీస్తును అందించవు.

జవాబు ఏమిటి? యేసు క్రీస్తు జవాబు ఇచ్చాడు,

"నేను మార్గమును, సత్యమును, జీవమును: నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి యొద్దకురాడు" (యోహాను 14:6).

కాపరి, యేసును నమ్మావో లేదో నీకు నువ్వు చూసుకో. తరువాత యేసు క్రీస్తుని గూర్చి బోధించు ప్రకటించు! యేసు ఎవరో ఆయన మన కొరకు ఏమి చేసాడో తేటగా చెప్పాలి. సువార్తను జాగ్రత్తగా బోధించాలి – సువార్త చెప్పాలి. ఆదివారం స్కూలు బైబిలు పఠనాలలో చెప్పే దానిని చూడాలి. మీ సంఘములో క్రీస్తును మరియు సువార్తను ప్రధానమైన విషయాలుగా చేయాలి. ఆత్మీయ బహుమానములను గూర్చి అభివృద్ధి ఆశీర్వాదాలను గూర్చి మనసున పెట్టవద్దు. ప్రజలు గొప్ప వారవురు అనుకోవద్దు. గొప్ప వారవరు కూడ. భాషలను గూర్చి బాదపడవద్దు. భాషలు ఎవరికీ ఉపయోగపడలేదు. యేసు క్రీస్తును బోధించండి ప్రకటించండి!

మీ సంఘములో వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తితో మాట్లాడండి. ప్రజలు సువార్తను అర్ధం చేసుకోవడానికి యేసును అంగీకరించునట్లు సర్వదా ప్రయత్నించండి. అప్పుడు వారు నిజమైన క్రైస్తవులవుతారు. అది మీ నిజ సేవా పరిచర్య. అది మీరు చేస్తుండగా దేవుడు మిమ్మును దీవించు గాక. యేసు నామమున అడుగుచున్నాము, ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.