Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




బైబిలు పర పరిచారకులు

BIBLICAL DEACONS
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.,
పాష్టర్ ఎమెరిటస్
by Dr. R. L. Hymers, Jr.,
Pastor Emeritus

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము మధ్యాహ్నము, జనవరి 10, 2021
A lesson taught at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Afternoon, January 10, 2021

ప్రసంగమునకు ముందు పాట:"పరిశుద్ధముగా ఉండుటకు సమయము తీసుకొనుడి"
(విలియమ్ డి. లాంగ్ స్టాఫ్ గారిచే, 1822-1894; 1, 2 మరియు 4 చరణము).


ఈ మధ్యాహ్నము పరిచారకులను గూర్చి దేవుడు చెప్పిన విషయాలు మీరు చూడాలని కోరుచున్నాను. దయచేసి అపోస్తలుల కార్యములు 6:1-7 చూడండి).

"ఆ దినములలో, శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, అనుదిన పరిచర్యలో తమలోని విధవ రాండ్రును చిన్నచూపు చూచిరని, హేబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదుల సణుగసాగిరి. అప్పుడు పన్నెండుగురు అపోస్తలులు తమ యొద్దకు, శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచి పెట్టుట యుక్తము కాదు. కాబట్టి, సహోదరులారా, మేము ఈ పను కొరకు వేరొక వారిని నియమింతుము. ఆత్మతోను, జ్ఞానము తోనూ నిండుకొని మంచి పేరు పొందిన యేడు గురు మనుష్యులను మీలో ఏర్పరచు కొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము అయితే మేము ప్రార్ధన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి: ఈ మాట జన సమూహ మంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసము తోనూ, పరిశుద్ధాత్మ తోనూ నిండుకొనిన వాడైన స్తేఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీ కారోరు, తిమోను, పర్మినాను, యూదుల మత ప్రవిష్టుడను అందియోక వాడును అగు నీకొలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల యెదుట నిలబెట్టిరి: వీరు ప్రార్ధన చేసి, వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై; శిష్యుల సంఖ్య యేరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి" (అపోస్తలుల కార్యములు 6:1-7).

మీరు కూర్చోండి.

నా దీర్ఘకాల మొదటి చైనీయ బాప్టిస్టు సంఘ కాపరి, డాక్టర్ తిమోతి లిన్, పది విషయాలు గూర్చి ప్రతిజ్ఞ చేయించేవారు.

"తప్పనిసరి పది" సంఘములో పరిచారక అభ్యర్ధికి"

(1) పరిచారకునిగా ప్రభువును సేవించడానికి వాంచ ఒకరినొకరు గౌరవించుకునే ఇష్టత.

(2) I తిమోతి 3:1-10 లో ఉన్న విషయాలు తప్పక గైకొనాలి.

(3) రోజు బైబిలు చదవాలి ప్రార్ధించాలి దశమ భాగాలు ఇష్ట పూర్వకంగా క్రమంగా ఇవ్వాలి.

(4) వివాహితుడై యుండి భార్య తన భర్తకు శాయశక్తులా మద్దతు ఇవ్వాలి.

(5) ఆదివారపు బడిలో బోధించగలగాలి.

(6) ఏ సమర్ధతలోనైనా ప్రభువును సేవించగలిగి ఉండాలి, సందర్శనలలో.

(7) sఆరాధనలలో తప్పక పాల్గొనాలి, ప్రార్ధనా సేవలు, సబ్బాతు బడి, ప్రార్ధనా కూటములు, కానుకల కూటములు మరియు వ్యాపారా కూటములు హాజరు కావాలి; మరియు సంస్థలు మరియు ప్రాజెక్ట్ లకు చర్చిలు తప్పనిసరిగా సపోర్ట్ గా ఉండాలి.

(8) తర్భీదు కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు తప్పక పాల్గొనాలి.

(9) యవన క్రైస్తవుల ముందు మంచి మాదిరి ఉండాలి. కారణము లేకుండా వారితో వాదించవద్దు కోప పడవద్దు.

(10) కాపరులతో కలిసి పనిచేయాలి.
(డాక్టర్ తిమోతి లిన్, సంఘ ఎదుగుదలకు రహస్యము, పేజీలు 45, 46).
(Dr. Timothy Lin, The Secret of Church Growth, pp. 45, 46).


డాక్టర్ లిన్ సరిగ్గా చెప్పాడు. డాక్టర్ లిన్ చెప్పినట్టు పరిచారకులు చేస్తే, వారు సంఘ చీలికలకు కారకులు కారు. ఈనాడు అలా లేదు.

మనలాంటి, స్వతంత్ర సంఘాలలో పరిచారకులు, సంఘ చీలికలకు కారకులవుతున్నారు. మన సంఘాలలో 92 శాతము పరిచారకులు చీలికకు కారకులు. మన దక్షిణ బాప్టిస్టు సంఘాలలో 93 శాతము మంది వలన మన సంఘాలలో చీలిక వస్తుంది. ఇవి డాక్టర్ రోయ్ ఎల్. బ్రాన్ సన్ రాసిన సంఘ చీలిక నుండి ఇవి తీసుకోబడ్డాయి. డాక్టర్ డబ్ల్యూ. ఏ. క్రీస్ వెల్ డాక్టర్ బ్రాన్ సన్ వ్రాసిన సంఘ చీలిక పుస్తకమును, గూర్చి చెప్పాడు,

మీరు నా పుస్తకము చూడకపోయినా, సంఘ చీలిక చదవండి.

ప్రతి సంఘ కాపరి అది చదివాలి.


– డాక్టర్ డబ్ల్యూ. ఏ. క్రీస్ వెల్,
  దీర్ఘకాల సంఘ కాపరి
  మొదటి బాప్టిస్టు సంఘములు,
  డాలస్, టెక్సాస్.


డాక్టర్ లీ రాబర్ సన్, టెన్నెసి టెంపుల్ విశ్వ విద్యాలయము, చాన్సలర్, డాక్టర్ బ్రాన్ సన్ పుస్తకమును గూర్చి ఇలా చెప్పాడు,

కాపరులు నాయకులు ఈ పుస్తకము చదవడం ద్వారా మేలు పొందుకుంటారు.

డాక్టర్ బ్రాన్ సన్ ఇలా అన్నాడు, "చాలామంది పరిచారకులు ప్రమాదకరము ఎందుకంటే అర్హత లేని వారు పనిచేస్తున్నారు" (బ్రాన్ సన్ పేజీ 51).

భవిష్యత్తులో మనం ఎలా చీలికలు తప్పించుకోవాలి? డాక్టర్ బ్రాన్ సన్ అంటారు మొదటి సూత్రాలకు మనం రావాలి. డాక్టర్ బ్రాన్ సన్ ఇలా అన్నాడు

a. వారి పని బోధించుట, ప్రార్ధించుట, నేర్పించుట మరియు సువార్తీకరణ.

b. వారి సంఘ కాపరులచే నడిపించబడాలి.

"మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొనుడి, వారు విశ్వాసము వాక్యము బోధిస్తారు: ఎవరైతే విశ్వాసాన్ని నమ్ముతారో వారి సంభాషణ పూర్తవుతుంది" (హెబ్రీయులకు 13:7).

"మీ పైన నాయకులుగా ఉన్నవారు, లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలే: మీ ఆత్మలను కాయుచున్నారు, వారు దుఃఖములతో, ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు, వారి మాట విని వారికి లోబడియుండుడి: అది మీకు లాభదాయకం కాదు" (హెబ్రీయులకు 13:17).

c. నశించు వారిని రక్షించి తపన కనుపర్చుట.

d. సమస్తము సామాన్య పరచుట!
   బోధించుట, ప్రార్ధించుట, మరియు సువార్తీకరణ తప్ప మిగిలినవి ప్రక్కన పెట్టుట.


1. నెలవారీ వ్యాపార కూటాలు విడిచిపెట్టుట.

2. పరిచారకుల కూటములు మానుట.

3. మిగిలినవి (పేజీలు 228, 229, 230 బ్రాన్ సన్).

4. వ్యాపార కూటములు మానుట.


డాక్టర్ బ్రాన్ సన్ అన్నాడు, "కేవలము ‘వ్యాపార కూటములు’ బైబిలులో కాపరులు/ప్రవక్తలు ప్రజలను సమావేశ పరిచినప్పుడు, ‘ఇవే మనం చేస్తాం.’ దీనికి ప్రజలు స్పందించారు, ‘బాగుంది, మేము చేస్తాము.’"

డాక్టర్ బ్రాన్ సన్ ఇలా అన్నాడు, "చాలామంది పరిచారకులు ప్రమాదకరము ఎందుకంటే అర్హత లేని పరివారు చేస్తున్నారు" (పేజీ 51).

పరిచారకులు పరిపాలకులు కాదు; బైబిలులో నిర్ణయాలు తీసుకొనే అధికారము లేదు. సంఘ పరిపాలన కాపరికే ఇవ్వబడింది. దేవుడు ఇలా అన్నాడు,

"మీపై నాయకులుగా ఉన్నవారు, లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలే: మీ ఆత్మలను కాయుచున్నారు, మీరు దుఃఖముతో ఆ పని చేసిన యెడల, మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు: వారి మాట విని వారికి లోబడి యుండుడి" (హెబ్రీయులకు 13:17).

ఒక పరిచారకుడు అడిగాడు, "పరిచారకులు ఏమి చెయ్యాలి?"

కాపరి అపోస్తలుల కార్యములు 6:1-6 లో ఇలా అన్నాడు. సంఘ కాపరి అన్నారు, "బైబిలులో ఒక విషయము స్పష్టంగా చెప్పబడింది." పరిచారకుడన్నాడు, "బైబిలులో పరిచారకులకే ఎక్కువ అధికారము ఉంది!"

ఇంకొక పరిచారకుడన్నాడు, "బైబిలులో పరిచారకులకు చాలా పని ఇవ్వబడింది."

కాపరి అన్నాడు, "దానిపై ఇదే చివర వినడం. ఎందుకు? బైబిలు లో ఉన్నది కనుగొనబడలేదు."


పరిచారకులు అభిషేకము పొందలేరు కాపరి ఏమి చెయ్యాలో చెప్పలేరు, కనుక వ్యవస్థాపకునిగా పాస్టరు ఎమిరిటీస్ గా, ఇప్పుడే ఒక సంవత్సరానికి ముగ్గురుని పరిచారకులుగా చేస్తున్నాను. నేను మెన్సిషయ, గ్నాన్ మరియు జాన్ వెస్లీ హైమర్స్ ను ఒక సంవత్సరానికి పరిచారకులుగాను, డాక్టర్ కాగన్ ను రెండు సంవత్సరాలకు ఏర్పాటు చేస్తున్నాను.

జనవరిలో ఒక వ్యాపార కూటము ఉంటుంది, దానిలో మళ్ళీ పరిచారకులను నియమిస్తాను, అవసరాన్ని బట్టి.

నేను మళ్ళీ వాక్య భాగము చదువుతాను. దయచేసి అపోస్తలుల కార్యములు 6:1-7 చూడండి.

"ఆ దినములలో, శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, అనుదిన పరిచర్యలో తమలోని విధవ రాండ్రును చిన్న చూపు చూచిరని, హేబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. అప్పుడు పన్నెండుగురు అపోస్తలులు, తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి, సహోదరులారా, ఆత్మతోను మరియు జ్ఞానముతోను నిండుకొని, మంచి పేరు పొందిన ఏడుగురు మనష్యులను, మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము, అయితే మేము ప్రార్ధనయందును వాక్య పరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున: వారు విశ్వాసముతోనూ పరిశుద్దాత్మతోనూ నిండుకొనిన వాడైన, స్తేఫేను, మరియు ఫిలిప్పు, మరియు ప్రోకారు, మరియు నీకానోరు, మరియు తీమోను, మరియు పల్మెనాను, మరియు నికొలాస్ యూదుల మత ప్రసిద్ధుడు అంతియోకయు వాడును: నీకొలాను అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల యెదుట నిలబెట్టిరి: వీరు ప్రార్ధన చేసి, వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రభలమైనది; శిష్యుల సంఖ్య యోరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి" (అపోస్తలుల కార్యములు 6:1-7).

దయచేసి నిలబడి ఈ పాట పాడుదాం,

పరిశుద్ధంగా ఉండడానికి సమయము తీసుకోండి, ప్రభువుతో తరచూ మాట్లాడు;
   ఎల్లప్పుడూ ఆయన యందు నిలచియుండుము, వాక్యముతో బలపడుము.
దేవుని పిల్లలతో స్నేహము చేయుము, బలహీనులకు ఊతనీయుము,
   ఆయన ఆశీర్వాదములు వేటిని మరవద్దు.

పరిశుద్ధంగా ఉండడానికి సమయము తీసుకోండి, ప్రపంచము దూసుకుపోతుంది;
   యేసుతో మాత్రమే రహస్యముగా సమయము గడుపుము.
యేసు వైపు చూచుచు, ఆయన సారుప్యములో ఉండుము;
   మీ స్నేహితులు ఆయన సారూప్యము మీలో చూచునట్లు.

పరిశుద్ధంగా ఉండడానికి సమయము తీసుకోండి, ఆత్మలో మౌనము వహించు,
   ప్రతి తలంపు ప్రతి ఉద్దేశము ఆయన ఆధిపత్యములో ఉండనిమ్ము.
అలా ప్రేమ ప్రవాహానికి ఆయన ఆత్మతో నడిపించబడు,
   పై సేవలకు నీవు సరిపోతావు.
("పరిశుద్ధంగా ఉండుటకు సమయము తీసుకో" విలియమ్ డి. లాంగ్ స్టాప్ చే, 1822-1894; చరణములు 1,2 మరియు 4).
(“Take Time to be Holy” by William D. Longstaff, 1822-1894; stanzas 1, 2 and 4).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.