Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ప్రశ్నలకు జవాబిచ్చుట

ANSWERING QUESTIONS
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.,
పాష్టర్ ఎమెరిటస్
by Dr. R. L. Hymers, Jr.,
Pastor Emeritus

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము మధ్యాహ్నము, అక్టోబర్ 4, 2020
A lesson given at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Afternoon, October 4, 2020

ప్రసంగమునకు ముందు పాట:
     "ఓ వేవేల నాలుకల కొరకు" (చార్లెస్ వెస్లీ గారిచే, 1707-1788).


ఒక వ్యక్తి మిమ్ములను ప్రశ్న అడిగితే మీరు అభ్యంతర పడతారా? తప్పక కాదు. అపోస్తలుడైన పేతురు ఇలా అన్నాడు,

"మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు: ప్రతి వారికిని సాత్వికముతోనూ భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుడి" (I పేతురు 3:15).

సాధారణ ప్రశ్నలు

1. నేను బైబిలును నమ్మను.

నమ్మని గ్రీకు వారికి అపోస్తలుడైన పౌలు బైబిలును గూర్చి చెప్పాడు. తాను సాక్ష్యము చెప్పిన వారిని పౌలు ఒప్పించ ప్రయత్నించలేదు. సాక్ష్యము చెప్పడంలో మన ముఖ్య పని ప్రకటించడం, సమర్దించుకోవడం కాదు.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +
ఈ ప్రసంగము ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. వెళ్ళండి WWW.SERMONSFORTHEWORLD.COM.
ఆకుపచ్చ బటను నొక్కండి "యాప్" అనే పదము ఉన్న దానిపై. వచ్చే సూచనలను గైకొనండి.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

బైబిలులో ముఖ్య సందేశము ఒక వ్యక్తి నిత్య జీవము ఎలా పొందగలడు. నిత్య జీవమందు నమ్మకము లేదని అతడు చెబితే, మీరు అనవచ్చు, "ఆ అంశముపై బైబిలు చెప్పిన దానిని గూర్చి మీరు ఏమి అర్ధము చేసుకున్నారు? బైబిలు మీకు చెప్పిన ఆ అంశము గూర్చి మీకు ఏమి అర్ధం అయింది?"

98 శాతము వారంటారు, "పది ఆజ్ఞలు గైకొనడం లేక గ్రీస్తు ఉదాహరణను అనుకరించడం." అప్పుడు మీరు అనవచ్చు, "అందుకే నేను భయపడుచున్నాను. ముఖ్య సందేశము అర్ధము చేసుకోకుండా మీరు బైబిలును తిరస్కరిస్తున్నారు, ఎందుకంటే మీ జవాబు తప్పు మాత్రమే కాకుండా, బైబిలు బోధించే దానికి అది భిన్నముగా ఉంది. ఇప్పుడు, తెలివైన జవాబు ఈ అంశముపై బైబిలు ఏమి బోధిస్తుందో నేను చెప్తాను అనడం సబబు అనిపించడం లేదా? అప్పుడు మీరు దానిని తిరస్కరించాలా అంగీకరించాలా విషయముపై తెలివైన నిర్ణయము తీసుకోవచ్చు."

ఇప్పుడు నేను యేసును గూర్చిన 10 ఊహాగానాలు చదువుతాను.

(1) వెక్కిరించుట,

"వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి; నాకు తప్పిక యైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి" (కీర్తనలు 69:21).

(2) ఇతరుల కొరకు శ్రమపడుట

"నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను... మన అతిక్రమములను బట్టి, అతడు గాయపరచబడెను... మన సమాధానార్ధమైన శిక్ష అతని మీదపడెను" (యెషయా 53:4-6).

(3) అద్భుతాలు జరుగుట

"గ్రుడ్డి వారి కన్నులు తెరువబడును, చెవిటి వారి చెవులు విప్పబడును" (యెషయా 35:5 – 713 బిసి).

(4) స్నేహితునిచే అప్పగించబడుట

"నేను నమ్ముకొనిన, నా వివాహితుడు, నా ఇంటి భోజనము చేసినవాడు, నన్ను తన్నుటకై తన మడిమె నెత్తేను" (కీర్తనలు 41:9).

(5) ముప్పై వెండి నాణెములను అమ్మబడుట

"నా కూలి నాకియ్యుడి... అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి ఇచ్చిరి" (జెకర్యా 11:12 – 487 బిసి).

(6) ఉమ్మివేయబడి కొట్టబడుట

"కొట్టువారికి నా వీపును అప్పగించితిని... ఉమ్మి వేయు వారికిని అవమాన పరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు" (యెషయా 50:6 – 712 బిసి).

(7) సిలువ వేయబడుట

"వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు" (కీర్తన 22:16).

(8) దేవునిచే విడువబడుట

"నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి?" (కీర్తనలు 22:1).

(9) ఆయన పునరుత్థానుడగుట

"నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు" (కీర్తన 16:10).

(10) అన్యజనులు ఆయన వైపు మార్చబడుట

"ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు... అతడు అన్య జనులకు న్యాయము కనపరచును" (యెషయా 42:1 – 712 బిసి).

ఇవి యేసుని గూర్చి 10 ప్రవచనాలు. బైబిలులో రెండు వేలకు పైగా ప్రత్యేక ప్రవచనాలు ఇప్పటికే నెరవేర్చబడ్డాయి.

చాలా సంవత్సరాల క్రిందట నేషనల్ ఎన్ క్వయిరర్ పత్రిక ఆధునిక "ప్రవక్తలచే" చెప్పబడిన 61 ప్రవచనాలు చెప్పారు. ఆ సంవత్సరపు ఆఖరి ఆరు నెలలలో ఆ 61 ప్రవచనాలు నేరవేరాలి. ఎంత బాగా చేసారు? నమ్మితే నమ్మండి, ఆ 61 ప్రవచనాలు తప్పిపోయాయి! పోప్ పౌలు పదవీ విరమణ పొందుతాడని కేథలిక్ సంఘమును సామాన్య గుంపు తీసుకుంటారని చెప్పారు; జార్జి ఫోర్ మేన్ తన బరువైన కిరీటమును ఆఫ్రికాలో మహామత్ ఆలీకి ఇస్తాడు; టెడ్ కెన్నెడీ అధ్యక్షుని కొరకు ప్రచారము చేస్తారు! ఆధునిక ప్రవచనాలకు బైబిలులోని ప్రవచనాలకు తేడా ఆధునిక "ప్రవచనాలు" తప్పనిసరిగా తప్పుతాయి, బైబిలు ప్రవచనాలు తప్పని సరిగా ఉంటాయి!

2. పరిణామము సృష్టిని తిరస్కరిస్తుందా?

డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ అన్నారు, "బైబిలు నమ్మేమనము విశ్వము ఒక సృష్టి అని నమ్ముతాము. ఆరంభము ఉంది కనుక అది నిత్యము కాదు. కొన్ని కలిసి వచ్చిన విషయాలు, వాటి స్థానాలలో ఉండడం పరిణామము, ఫలితము కాదు. దానిని నమ్మడానికి కొంతమంది వ్యక్తులు వ్యక్తత కావాలి."

ఒక యవనస్తునికి ఈ ప్రశ్న వేయబడింది, "పరిణామము నిజమని ఏ ఋజువు నిన్ను ఒప్పించింది?" అతడు ఇలా జవాబిచ్చాడు, "జంతువులకు మనష్యులకు ఉండే పోలికలు. ఇది నాకు, పరిణామాన్ని ఋజువు చేస్తుంది."

1950 లో జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రెన్సిస్స్ క్రిక్ జీవ అణువు కనుగొన్నారు, డిఎన్ఏ – అది వారికి నోబెల్ బహుమానము నిచ్చింది. మానవ శరీరములో కోట్లాది డిఎన్ఏ అణువులు ఉన్నాయి. అతి అతి కష్టతర స్థితి.

క్రిక్, నాస్తికుడు మరియు పరిణామకుడు, 4.6 బిలియన్ సంవత్సరాల నుండి వస్తున్న డిఎన్ఏ పరిమాణువుల ప్రక్రియ కనుక్కొందామనుకున్నాడు. భూమి చరిత్రలో డిఎన్ఏ పరమాణువులలో ఒక అణువు అవకాశము ఎంత? అతని ముగింపు తెలుసా? శూన్యము. 4.6 బిలియన్ సంవత్సరములో, అది జరిగి ఉండేది కాదు!

ఫ్రేన్సిస్ క్రిక్ దేవుడు దానిని చేసాడని చెప్పాడా? చెప్పలేదు.

ఈ శాస్త్రవేత్తలు వారి సిద్ధాంతము తప్పు అని, ఒప్పుకోకపోవడం, విచిత్రము అనిపించడము లేదా? వారిలో ఎవరు ఇలా చెప్పలేదు, "డార్విన్ నుండి, అసత్యాన్నే బోధిస్తున్నాము. మేము బోధించాము కొన్ని రసాయనాల ద్వారా కణము ఏర్పడి జీవము వస్తుంది. మరియు, బిలియన్ ఏళ్ల తరువాత, మేమిక్కడ ఉన్నాము. అలా సంభవించిందని అనుకున్నాం. కాని మా సిద్ధాంతము ఋజువు కాలేదు. మిమ్మును తప్పు తోవ పట్టించినందుకు మేము చింతిస్తున్నాము."

ఫ్రేన్సిస్ క్రిక్ ఏమి చేసాడో మీకు తెలుసా? అసాధ్యమైన ఒక సిద్ధాంతము తీసుకొచ్చాడు. అతని కొత్త సిద్ధాంతము ఆధునిక జాతి జీవులు, దూర ఉపగ్రహములో, వారి వీర్య కణములతో వాయు నౌకలను పంపి, వివిధ ఉపగ్రహాలు చేసారు. దాని నుండి మనం వచ్చాం. ఇది నక్షత్ర యుద్దాలగా అనిపిస్తుంది!

నిర్జీవము నుండి జీవము రాదు. అందుకే బైబిలు చెప్తుంది, "ఆది యందు దేవుడు భూమ్యాకాశామును సృష్టించెను" (ఆదికాండము 1:1).

దేవుని ఉనికిని గూర్చి నమ్మడానికి మూడు ఋజువులు నాకు సహాయపడ్డాయి:

(1) కారణ పరిణామ శాస్త్రము.

     విశ్వములో నేను కారణాల వెనుక కనిపించని గొప్ప కారకుడే దేవుడు అని నమ్ముతాను.

(2) నిర్ణీతత ఋజువు.

     మీరు మార్స్ కు వెళ్ళి పరిపూర్ణంగా నిర్మింపబడిన గడియారాన్ని చూస్తే, ఆ గడియారాన్ని తయారు చేసే వ్యక్తి ఉన్నాడని తెలుస్తుంది. కనుక విశేషంగా నిర్మింపబడిన ప్రపంచము ప్రపంచ శిల్పిని చూపిస్తుంది, ఆయనే దేవుడు.

(3) వ్యక్తిత్వ ఋజువు.

     మోనాలిసా చిత్రపటము చూస్తాం. వ్యక్తిత్వ ఋజువు చూస్తాము. వ్యక్తి లేకుండా చిత్ర పటము ఉండదు. ఈ మూడవ ఋజువు ప్రాముఖ్యము ఎందుకంటే కారణము శక్తికి లెక్క ఉంటుంది, కాని మన పాపాలకు ఒక వ్యక్తి మనలను భాధ్యులను చేస్తాడు.

3. నా దేవుడు అలాంటి వాడు కాదు.

మేథడిష్టు సంఘ స్థాపకుడు, జాన్ వెస్లీ జీవితమూ, రక్షణ కొరకు యేసు క్రీస్తును విశ్వసించుట చాలా ప్రాముఖ్యమని సూచిస్తుంది. అతడు ఐదు సంవత్సరాలు ఆక్స్ ఫర్డ్ సెమినరీకి వెళ్ళి ఇంగ్లాండ్ సంఘానికి పరిచారకుడయ్యాడు, అక్కడ పదేళ్ళు సేవ చేసాడు. ఆ సమయం చివరి వరకు, అనగా సుమారు 1735లో, అతడు ఇంగ్లాండ్ నుండి జార్జియాకు మిస్సెనరీ అయ్యాడు.

జీవితమంతా, అతని పరిచర్యలో విఫలుడయ్యాడు, అతడు, చాలా భక్తీ, పరుడైనప్పటికినీ. ఉదయము నాలుగు గంటలకు లేచి రెండు గంటలు ప్రార్ధించేవాడు. తరువాత గంట బైబిలు చదివేవాడు తరువాత పరిచర్యకు, జైళ్లకు, మరియు ఆసుపత్రులకు వెళ్ళేవాడు. అర్ధరాత్రి వరకు అతడు బోధిస్తూ, ప్రార్ధిస్తూ ఇతరులకు సహాయము చేసేవాడు. చాలా ఏళ్లు యిలా చేసాడు. వాస్తవానికి, వెస్లీ అతని స్నేహితుల భక్తి జీవితాన్ని బట్టి మెథడిస్టు సంఘానికి మంచి పేరు వచ్చింది.

అమెరికా నుండి తిరుగు ప్రయాణంలో, సముద్రములో గొప్ప తుఫాను వచ్చింది. వారు ప్రయాణిస్తున్న చిన్న ఓడ మునిగిపోబోతుంది. పెద్ద అల ఓడను కొట్టి, గాలి బాగా విసిరింది. వెస్లీ చనిపోతాననుకున్నాడు, చాలా భయపడ్డాడు. చనిపోతే ఏమవుతుందో తెలియదు. అన్ని ప్రయత్నాలకు భిన్నంగా, మరణము ఒక పెద్ద, నల్ల, భయపెట్టే ప్రశ్నగా మిగిలింది.

ఓడలో కొందరు పాటలు పాడుచున్నారు. వారి నడిగాడు, "ఈ రాత్రి చనిపోతుండగా మీరెలా పాడగలరు?" వారు జవాబిచ్చారు, "ఈ ఓడ క్రిందికి మునిగితే, ఎల్లప్పుడు ప్రభువుతో ఉండడానికి మేము పైకి వెళ్తాము."

వెస్లీ తల ఊపుతూ ఇలా అనుకున్నాడు, అతనికతనే ఆలోచిస్తూ, "వారికెలా తెలుసు? నాకంటే వారు ఎక్కువ ఏమి చేసారు?" తరువాత అతడు అన్నాడు, "అన్యులను నేను మారుస్తున్నాను. హా, నన్ను ఎవరు మురుస్తాడు?"

దేవుని కాపుదలలో, ఆ ఓడ ఇంగ్లాండ్ చేరుకుంది. వెస్లీ లండన్ వెళ్లి అక్కడ చిన్న గుడికి వెళ్ళాడు. అక్కడ ఒక ప్రసంగము విన్నాడు రెండు శతాబ్దాల క్రిందట మార్టిన్ లూథర్ రాసింది, దాని శీర్షిక "రోమా గ్రంథానికి ముందు మాట." ఈ ప్రసంగము నిజ విశ్వాసాన్ని వివరించింది. అది రక్షణ కొరకు యేసు క్రీస్తు నందు మాత్రమే విశ్వసించుట – మన చూచి క్రియలలో కాదు.

వెస్లీ అకస్మాత్తుగా గ్రహించాడు జీవితమంతా తప్పుడు మార్గములో ఉన్నాడని. ఆరాత్రి అతని పత్రికలో ఈ మాటలు వ్రాసాడు: "తొమ్మిది ముందు, క్రీస్తు నందు విశ్వాసము ఉంచడము ద్వారా హృదయములో కలిగిన మార్పు, క్రొత్త వెచ్చదనాన్ని ఇచ్చింది. క్రీస్తు, క్రీస్తు నందే నమ్మిక ఉంచాను అనిపించింది రక్షణ కొరకు; ఆయన నా పాపాలు తీసాడని నిశ్చయత కలిగింది, నేను కూడ, నన్ను పాప మరణ నియమము నుండి రక్షించాడు."

ఇది అక్కడ. ఇది రక్షించే విశ్వాసము. పాపాలు ఒప్పుకొని. రక్షణ కొరకు యేసు క్రీస్తును మాత్రమే విశ్వసించాడు. ఇప్పుడు, ఆ రాత్రి ముందు యేసు క్రీస్తును వెస్లీ నమ్మలేదంటారా? బహుశా, నమ్మాడు. అతడు బైబిలు పండితుడు క్రీస్తును గూర్చి ఇంగ్లీష్, లాటిన్, గ్రీకు, మరియు హెబ్రీయ భాషలలో చదివాడు. ఈ భాషలన్నింటిలో క్రీస్తును విశ్వసించాడు. కాని రక్షణ కొరకు జాన్ వెస్లీని నమ్మాడు.

తరువాత, అతడు 18 వ శతాబ్దములో గొప్ప బోధకుడయ్యాడు. కాని అదంతా యేసు క్రీస్తు నందు మాత్రమే రక్షణ అని నమ్మడం ద్వారా ఆయనను ప్రభువుగా అంగీకరించడం ద్వారా ఆరంభమయ్యింది. (Dr. D. James Kennedy, Evangelism Explosion, fourth edition, Tyndale House Publishers, 1996, pp. 183-184).

వేదాంతమునకు సంబందించిన పరిశోధనా శాస్త్రము ఈ ప్రశ్నను తెలియచేస్తుంది – మనకు ఎలా తెలుసు? దేవుని గూర్చి ఏమనుకుంటున్నారో ప్రజలు రెండు విధాలుగా చెప్తారు.

1. సహేతుకత. సహేతుకత మానవాళిని ఆశ్చర్యపరిచే మత మార్గాలకు నడిపించాయి.

2. ప్రత్యక్షత. ఇప్పుడు, క్రైస్తవ సంఘము దేవుడు బైబిలు ద్వారా తనను బయలు పరచుకున్నాడని, ప్రాముఖ్యంగా ఆయన కుమారుడైన, యేసు క్రీస్తు ద్వారా అని చెప్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వారిద్దరు అనుకునేది కాదు. ప్రశ్న ఏమిటంటే, "బైబిలు లో దేవుడు తన కుమారుడైన, యేసు క్రీస్తుని గూర్చి ఏమి చెప్పాడు?"

4. అన్యజనులు నశించిపోయారా?

ఇలా అనవచ్చు, "ఇక్కడ మనం ఏమి చేస్తున్నాము వేదాంత చర్చకంటే చాలా గొప్ప ప్రాముఖ్య విషయము ఉంది."

మీరనవచ్చు, "బాబు, అది మంచి ప్రశ్న, కాని నేను నమ్ముతాను మనము నిజంగా ఆఫ్రికాలో దేవుని చేతిలో అన్యులను వదిలేద్దాము, ఆయన అనంతముగా గొప్పవాడు అనంతముగా కృప గలవాడు. ఈరోజు తప్పక మీరు నిత్యజీవము ఉందని తెలుసుకోవాలి. బహుశ తరువాత మనం చూడవచ్చు ఎన్నడు సువార్త వినని వారిని గూర్చి ఏమి చెప్పాడో అని... ప్రశ్న చుట్టూ జవాబు తిరుగుతుంది, ‘వారు వినని క్రీస్తును గూర్చి నమ్మలేదని దేవుడు అన్యజనులను నరకడానికి పంపిస్తాడా?’

ఇప్పటికే శిక్షింపబడిన వారిని శిక్షించడానికి క్రీస్తురాలేదని బైబిలు బోధిస్తుంది. ఒక్క విషయమును గూర్చి మనష్యులు శిక్షింపబడతారు – వారి పాపములు."

5. మరణము తరువాత జీవితమును గూర్చి నేను నమ్మను.

(1) ప్లాటో. ప్రాచీన వేదాంతి ప్లాటో చూపించాడు ఒక చెట్టు పెరిగి రుచికర ఫలము ఇవ్వాలంటే ముందు అది చనిపోవాలి. ప్లాటో చివరకు మనవ శరీరము తప్పక చనిపోవాలి తరువాత ఇంకొక ప్రపంచములో మరియొక జీవితముగా ఉద్భవిస్తుంది.
     ఫ్లాటో క్రీస్తుకు అపోస్తలుడైన పౌలుకు నాలుగు శతాభ్దాల ముందు జీవించాడు. కాని పౌలు క్రీస్తు I కొరింధీయులకు 15:35-36 మరియు యోహాను 12:24 లో చెప్పిన విషయంలే ప్లాటో బోధించాడు.

(2) వేదాంతి ఇమ్మానుయేలు కాంత్ గమనించాడు మానవులంతా మంచి చెడులను గూర్చి పట్టించుకుంటారు, నైతిక భాద్యతగా అతనన్నాడు. అతడు చెప్పాడు, "న్యాయము ఉండకపోతే మంచి ఎందుకు?" ఇంకొక మాటలలో, భాద్యత అర్ధవంతంగా ఉండాలంటే, న్యాయము ఉండాలి, మంచి ఎందుకు న్యాయము ఉండకపోతే? అతని వాదము ఈ జీవితములో న్యాయము లేదు, కనుక దానికి ఇంకొక స్థలము ఉండాలి. ఇంకొక మాటలలో, వేదాంతి కాంత్ వాదము మరణము తరువాత జీవితమూ న్యాయము కోరుకుంటుంది. బైబిలులో హెబ్రీయులకు 9:27 లో చెప్పినట్టే ఇది అనిపిస్తుంది.
     అలా ఇమ్మానుయేలు కాంత్ కు, నీతికి మరణము తరువాత జీవితము ఉండాలి, బైబిలులో దేవుని లాంటి తీర్పరి కావాలి.

(3) ఐన్ స్టీన్ విప్లవాత్మక, మొదటి ఉష్ణ గతిక సిద్ధాంతము. శక్తి విషయము సృష్టించబడనేరదు లేక నాశనము అవదు. మనిషి అంతరిస్తే, విశ్వములో అతనికే అలా అవుతుంది. I కొరింధీయులకు 15:49-51 లో ఇలా వివరింపబడింది ఎలా క్రైస్తవుని శరీరము సహిస్తుంది. అలా ఐన్ స్టీన్ నాస్తికుడు కాదు.

(4) చనిపోయే వారి ఆఖరి మాటలు.
     నాస్తికుడు గిబ్బన్, తన మరణ పడకపై, ఇలా కేక వేసాడు, "అంతా అంధకారము." ఇంకొక నాస్తికుడు ఆడమ్స్ చనిపోయే ముందు కేకలు విన్నాడు, "దయ్యాలు ఈ గదిలో ఉన్నాయి అది నన్ను లాగుతున్నాయి."
     భిన్నంగా, క్రైస్తవ పాటల రచయిత టాప్ లేడీ ఇలా అరిచారు, "అంతా వెలుగు, వెలుగు, వెలుగు!" ఎవరెట్, చనిపోయే ముందు 25 నిమిషాల పాటు ఇలా, అన్నాడు, "మహిమ, మహిమ, మహిమ." వేలమంది జరగబోయేది చూడగలిగారు, వారు వెళ్తున్న జీవితమును గూర్చి.

6. పునరుజ్జీవింపబడిన ప్రజల జ్ఞాపకాలు.

చాలామంది శాస్త్రవేత్తలు ఇటీవల సామాన్య శాస్త్ర లోకములో వారి పరిశోధనలు సమాధి తరువాత జీవితాన్ని గూర్చి మాట్లాడడం ఆసక్తికర విషయము. చాలా మంది ప్రముఖ శాస్త్రవేత్తలు పరలోకము నరకమును ముందుగా రుచి చూడడము నాకు తెలుసు. ఈ అనుభవాలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. కాని అది ఆసక్తికర సాక్ష్యము ఇస్తున్నాయి.

ఎలిజబెత్ కుబ్లేర్-రాస్ క్రైస్తవేతరుడు, కాని ఇది ఆమె నివేదన, "ఋజువు తేటతెల్లము. మరణము తరువాత జీవితమూ ఉంది." డాక్టర్ కుబ్లేర్-రాస్ అన్నాడు చనిపోయే ముందు అనుభవాలు శాస్త్రీయంగా దృవీకరించారు. "దాని గూర్చి మాట్లాడడానికి భయపడుచున్నాము," అని ఆమె చెప్పారు.

డాక్టర్ రేమండ్ మూడీ అన్నారు, "చనిపోయే క్షణములో ఒక గంట మోగుతుంది." శరీరము నుండి బయటికి వచ్చి వైద్యుల వైపు చూడడం వారంతా నివేదించారు. కొద్ది మంది కాదు, ఐదు వందల మందికి పైగా, ప్రపంచమంతటా. వీరంతా ఒక వ్యక్తి ఆకారాన్ని చూసారు. ఇవి నాస్తికుల విషయములో వాస్తవము.

డాక్టర్ కుబ్లేర్–రాస్ చెప్పారు వందలాది మంది వైద్యులు విన్నారు, "నేను అనే దానిని, ‘నీ మరణము తరువాత జీవితమూ నమ్ముతాను.’ కాని ఇప్పుడు నాకు తెలుసు."

వెయ్యి మంది వైద్య నిపుణులు పండితులు ఈ వైద్యానికి నిలబడి వందనము చేసారు ఆమె ప్రసంగము ముగిసాక.

7. పునర్జన్మ సంగతేంటి?

ఇది హిందువుల మరియు బుద్ధుల నమ్మకము, కాని క్రైస్తవులు నమ్మరు! నేను స్పందిస్తాను, "బైబిలు చెప్తుంది, ‘మనష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును" (హెబ్రీయులకు 9:27).

ఈ అభిప్రాయాలు యేసు క్రీస్తు నెరవేర్పు ఆయన పరిపూర్ణ నీతిని పట్టించు కోవడం లేదు. సిలువపై ఆయన, మరణము ద్వారా, ఆయన మన పాపములను తీసేస్తున్నాడు. కనుక మనము యేసును నమ్మినప్పుడు, ఆయన సిలువపై కార్చిన రక్తము ద్వారా మనము కడుగబడతాము!

8. నరకము నిజము కాదు.

కొన్నిసార్లు ఇలా చెప్తే మంచిది, "మీకు తెలుసా, మనస్తత్వ శాస్త్రములో వాస్తవము మనం భయపడే వాటిని మనం ఒప్పుకోము. మీరు నరకాన్ని ఎందుకు నమ్మరంటే మీ హృదయ అంతరంగములో మీకు భయముంది అక్కడికి వెళ్తారేమోనని." తరచూ జవాబు, "నీవు సరియే అనుకుంటున్నాను."

కానీ మీరు మీ ఉద్దేశము చెప్పాలి, "మీరు నరకము నమ్మాలని కాదు. మీరు నరకానికి వెళ్ళరు అని తెలుసుకోవాలి. అదే సువార్త అంటే. నేను నరకము నమ్ముతాను, కాని నాకు తెలుసు నేను అక్కడికి వెళ్ళను దేవుని వాగ్ధానమును బట్టి. అది మెరుగు, ‘నేను నరకానికి వెళ్లనని తెలుసు ఎందుకంటే అలాంటి స్థలము లేదు అనేకంటే.’"

9. భూమిమీద మన నరకము ఉంది.

మీరు తెలుసా, సగమే సరిగా చెప్తున్నారు. భూమిపైనే నరకము అనుభవించిన మత్తు పదార్ధ గ్రహీతలు నాకు తెలుసు. మద్యపానముచే బానిసలైన తాగుతోతులు నాకు తెలుసు.

పాస్టరు మార్కు బక్లీ మత్తు మందు వాడి మానసిక ఆసుపత్రి పాలవడం గూర్చి చెప్పాడు. యేసును నమ్మడం ద్వారా పాస్టరు బక్లీ నరకాన్ని తప్పించుకున్నాడు. యేసు రెవరెండ్ ని రక్షించాడు. భూమిపై నరకమైన మత్తు పదార్ధాల బారినుండి – యేసు రెవరెండ్ బక్లీని రక్షించాడు. అతని మార్పును గూర్చిన ప్రతి మీరు తీసుకోవచ్చు – యేసు క్రీస్తు నందు – జీవితాన్ని మార్చిన రక్షణ. అమెజాన్.కామ్ కు వెళ్లి మార్కు పుస్తకము తీసుకోండి. దాని శీర్షిక, "చీకటి నుండి వెలుగులోనికి: నా ప్రయాణము" పాస్టరు మార్కు బక్లీచే. మొదటి కొన్ని పేజీలు మీరు చదివితే, పుస్తకమంతా చదువుతారు. నేను రెండు సార్లు చదివాను.

మనము రాజీపడము, కాని పాష్టరు బక్లీతో ఏకీభవిస్తాము, అతడు ఇలా అన్నాడు,

"మనము దేవుని విశ్వసించి నెమ్మదిగా ఉంటే, ఆయన మనకు అవగాహన ఇస్తాడు అది మనలను ఫలబరితులనుగా చేస్తుంది... నేను ఆత్మీయ నీతిత్వమును చూపుట లేదు. మీరు విశ్రాంతికి సమయము కేటాయించి ఆరోగ్యముగా ఉండాలని నేను ప్రోత్సహిస్తున్నాను" (చీకటి నుండి వెలుగులోనికి: నా ప్రయాణం, మార్కు బక్లీచే).

నిలబడి మన పాట పాడండి!

ఓ వేవేల నాలుకలు పాడుతాయి
   నాగోప్ప విమోచకుని స్తుతి,
నా దేవుని రాజు యొక్క మహిమలు,
   ఆయన కృప యొక్క ఆర్భాటాలు.

నా కృప గల యజమాని నా దేవుడు,
   ప్రకటించడానికి నాకు సహాయము చేయుము,
ప్రపంచమంతటా వ్యాపింపచేయడానికి,
   మీ నామము మహిమలు.

యేసు! మా భయములు వెళ్ళగొట్టే నామము,
   మా విచారములు ముగుస్తాయి;
‘పాపుల చెవులలో సంగీతము,
    ‘అది జీవితమూ, మరియు ఆరోగ్యము, మరియు శాంతి.

కొట్టివేయబడిన పాపము శక్తిని ఆయన విరుగగొడతాడు,
   ఆయన బందీలను విడుదల చేస్తాడు;
ఆయన రక్తము అపవిత్రులను శుద్ధి చేస్తుంది;
   ఆయన రక్తము నా కొరకు అందుబాటులో ఉంది.
("ఓ వేవేల నాలుకలు పాడుతాయి" చార్లెస్ వెస్లీచే, 1707-1788).
(“O For a Thousand Tongues” by Charles Wesley, 1707-1788).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.