Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
అధిగమించు వానిగా ఎలా ఉండాలి!

HOW TO BE AN OVERCOMER!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
పాష్టర్ ఎమెరిటస్
by Dr. R. L. Hymers, Jr.,
Pastor Emeritus

జీవితాన్ని మార్చే ప్రసంగము నుండి తీసుకొనబడినది
తిమోతి లిన్ గారిచే, పి.హెచ్.డి., 24 సంవత్సరాలు నా సంఘ కాపరి.
లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము మధ్యాహ్నము, జూలై 26, 2020
Adapted from a life-changing sermon
by Timothy Lin, Ph.D., my pastor for 24 years.

A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Afternoon, July 26, 2020

ప్రసంగమునకు ముందు పాట:
"నేను సిలువ సైనికుడినా?" (ఐజాక్ వాట్స్ చే, 1674-1748).

"లెమ్ము, ఉత్తర వాయువు; ఏతెంచుము, దక్షిణ వాయువు; వేంచేయుము నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింప చేయుడి" (పరమ గీతము 4:16).


నా జీవితములో నేను విన్న అతి ప్రాముఖ్యమైన ప్రసంగము ఇది. మీరు నా స్వీయ చరిత్ర చదివితే ఈ ప్రసంగము నా జీవితాన్ని ఎందుకు మార్చిందో తెలుస్తుంది. డాక్టర్ రోబర్ట్ ఎల్. సమ్ నర్ ఇలా అన్నాడు, "సత్యము కొరకు నిలబడడానికి ఇష్టపడే వ్యక్తిని నేను పొగుడుతాను హర్షిస్తాను – ప్రతికూల పరిస్థితులు అతనికి వ్యతిరేకముగా ఉన్నప్పటికినీ. ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ అలాంటి క్రైస్తవుడు" (The Honor Was All Mine: Giants of the Faith Whose Paths Crossed Mine, Biblical Evangelism Press, 2015, pp. 103-105). ఇండోనేషియా వెళ్ళిన మా మిస్సెనరీలలో ఒకరు అన్నారు, "డాక్టర్ హైమర్స్ ఒక కథా నాయకుడు అతడు మరణాంతక యుద్ధాల ద్వారా పయనించాడు." డాక్టర్ తిమోతి లిన్ ఇచ్చిన ఈ ప్రసంగము ఒక అధిగమించువానిగా పనిచేయడానికి నాకు స్పూర్తిని ఇచ్చింది. ఈ ప్రసంగము మీ జీవితాలను కూడ మారుస్తుందని నిరీక్షిస్తున్నాను.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +
ఈ ప్రసంగము ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. వెళ్ళండి WWW.SERMONSFORTHEWORLD.COM.
ఆకుపచ్చ బటను నొక్కండి "యాప్" అనే పదము ఉన్న దానిపై. వచ్చే సూచనలను గైకొనండి.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

డాక్టర్ తిమోతి లిన్ ఇలా చెప్పారు, "మానవుడు అవకాశము ద్వారా సృజింపబడలేదు; దేవుని సృష్టి మీద ఆధిపత్యము కలిగి యుండడానికి ప్రత్యేకముగా సృష్టింపబడ్డాడు...భవిష్యత్తు ఆధిపత్యము కొరకు విశ్వాసి సిద్ధపాటును యేసేపు జీవితమూ బయలు పరుస్తుంది [రాబోవు క్రీస్తు రాజ్యములో]."

ఐగుప్తుకు పరిపాలకుడు అయ్యే ముందు యేసేపు, దేవుడు అతనిని సుదీర్ఘ కష్టతర మార్గము ద్వారా నడిపించాడు ఒక అధిగమించే వ్యక్తిగా సిద్ధ పరచడానికి [అతని] జీవితాంతము ఆయన వాక్యమును గైకొనే వ్యక్తిగా నిలబెట్టడానికి. యేసేపు చేసిన గొప్ప కార్యములు ఐగుప్తునకు మాత్రమే కాక, ఇశ్రాయేలుకు, మరియు తరతరాలకు దేవుని సంఘమునకు వర్తింపబడుతున్నాయి. యేసేపు పరిపాలన లేనట్లయితే, ఐగుప్తీయులు ఆకలితో చనిపోయేవారు, ఇశ్రాయేలు దేశము హతమయ్యేది, అంతేకాక ఆదికాండములో చెప్పబడిన దేవుని విమోచనా ప్రత్యక్షత పూర్తి అయి ఉండేది కాదు.

యేసేపు ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి దేవుడు తీసుకున్న మెట్లు పరమగీతము 4:16 వాక్యపు వెలుగులో ఆలోచింపవచ్చును.

"లెమ్ము, ఉత్తర వాయువు; ఏతెంచుము, దక్షిణ వాయువు; వేంచేయుము నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింప చేయుడి" (పరమ గీతము 4:16).

యేసేపు జీవితాన్ని జాగ్రత్తగా చదివితే, అతని సుగంధ గుణశీలత బయటికి ప్రవహించే వరకు దేవుడు ఉత్తర వాయువును, దక్షిణ వాయువును అతనిపై ఎలా ప్రసరింప చేసాడో మనము గమనించవచ్చును. దేవుడు అతని గుణశీలతను శ్రమల ద్వారా సిద్ధ పరిచాడు, అతని శరీరాన్ని హింస ద్వారా వెళ్ళనిచ్చాడు, నిర్దయకు అవమానానికి అతనిని గురిచేశాడు, అన్యాయము, కృతఘ్నత ద్వారా కృంగ చేసాడు, తద్వారా అతని మనస్సు దున్నబడింది, అతని బుద్ధి స్థిర పరచబడింది, అతని స్వేచ్చ బలపరచబడింది, అతని విశ్వాసము గుణశీలత అభివృద్ధి పొందాయి ప్రభువు నందు అతని విశ్వాసము బాగా పెరిగింది. యేసేపు జీవితములో ఉత్తర వాయువు దక్షిణ వాయువుల కార్యములు చాలా తేటగా చూడవచ్చును.

దక్షిణ వాయువు – తల్లిదండ్రుల మమకారాన్ని అనుభవించుట

దయచేసి ఆదికాండము 37:1-4 చూడండి.

"యాకోబు తన తండ్రి పరదేశవాసిగా, ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యేసేపు, పడునేడేండ్ల వాడై, తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను; అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన, బిల్హా కుమారుల యోద్దను, జిల్ఫాకుమారుల ఉండెను: అప్పుడు యేసేపు వారి చెడు తనములను గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరి కంటే ఎక్కువగా అతని ప్రేమించి: అతని కొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు, వారు అతని మీద పగబట్టి, అతనిని క్షేమసమాచారమైనను అడుగలేకపోయిరి" (ఆదికాండము 37:1-4).

డాక్టర్ లిన్ ఇలా చెప్పారు, "పిల్లల భవిష్యత్తు గుణ లక్షణాలపై తల్లిదండ్రుల ప్రేమ చాలా ప్రభావము చూపుతుంది... "

"ప్రేమకు చెడుతనమునకు తేడా యేసేపునకు తెలుసు... ప్రేమ మరియు సత్యము రెండు ప్రభావిత పదాలు, కాని ప్రేమ చెడుతనము విషయములో ఇది నిజము కాదు, అవి రెండు వేరువేరు తెగలు. చేడుతనమును బహిర్గతము చేయకుండా ఉండడం ప్రేమ కాదు, కాని పిరికితనము... ఒక వ్యక్తి ఉద్దేశము నిస్వార్ధ పూరితమైనంత వరకు చేడుతనమును బహిర్గతము చేయడము, గొప్ప విషయము దానిని ప్రోత్సహించాలి... యేసేపు రెండు కళల వివరాలు అతని సహోదరుల గర్వమును దెబ్బతీసాయి మరియు వారి అసూయను ప్రేరేపించాయి; అయినను యేసేపు అతని సహోదరులను ప్రేమిస్తూనే ఉన్నాడు అంతేకాక తన తండ్రికి విధేయుడైన కుమారునిగా కొనసాగాడు."

నా తండ్రి ప్రేమ నా పట్ల లేదు, కాని నా తల్లి ప్రేమ అంగీకారము నా తండ్రిపై ద్వేషము పెంచుకోకుండా చేసాయి. నా తల్లి పరిపూర్ణురాలు కాదు, కాని "ఆమె చాలా దయగలది, మధురమైనది, వివేకము కలది యువకునిగా అది చూసాను. ఆమె పుస్తకాలను ప్రేమించమని, కారు నడపడం ఇష్టపడమని, మరి చాలా ప్రాముఖ్యముగా చెప్పదలచుకున్నది నిలబడి కచ్చితంగా చెప్పాలని నాకు నేర్పింది, ఒంటరిగా ఉన్ననూ" (నా స్వీయ చరిత్రలో 16 వ పేజీ). అలా, నా తల్లి ఎప్పుడు నాకు అండగా న్యాయవాదిగా ఉండేది. నా తల్లి చివరి మాటలు నాతో, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను, రోబర్ట్" (181 వ పేజీ). నా తల్లి 80 వ యేట రక్షింపబడినప్పుడు, నా జీవితములో అది చాలా గొప్ప విషయము.

ఉత్తర వాయువు – బానిసగా అమ్మబడుట –
ఆదికాండము 37:18-36

దయచేసి ఆదికాండము 37:23-28 నేను చదువుచుండగా నిలబడండి.

"యేసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు, వారు యేసేపు అంగీని అతడు తొడుగుకొనిన, ఆ విచిత్రమైన నిలువు టంగీని, తీసివేసిరి; అతని పట్టుకొని, ఆ గుంటలో పడద్రోసిరి: ఆ గుంట వట్టిది, అందులో నీళ్ళు లేవు. వారు భోజనము చేయగూర్చిండి: కన్నులెత్తి చూడగా, మరియు, ఐగుప్తునకు తీసుకొని పోవుటకు, గుగ్గిలము మస్తకియ బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన, మర్గాస్తుల గిలాచునుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి గాని, మరణమును దాచి పెట్టినందున, ఏమి ప్రయోజనము? రండి, ఈ ఇష్మాయేలీయులకు, వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంది కదా. వానికి హాని ఏమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి: మిధ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా; వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి, ఆ ఇష్మాయేలీయులకు ఇరువతి తులముల వెండికి అతనిని అమ్మివేసిరి: వారు యేసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి" (ఆదికాండము 37:23-28).

కూర్చోండి.

డాక్టర్ లిన్ ఇలా చెప్పాడు, "యదార్ధత, విధేయత, ఓర్పు, నమ్మకత్వము, పట్టుదల, ఆలోచన, మరియు జ్ఞానము సులభ జీవనము ద్వారా పొందుకోలేము, కాని కష్టములు ఆటంకములు సహించడం ద్వారా వస్తాయి. యేసేపు ఇంటిలోనే ఉండిపోతే అతడు [అధిగమించువాడు] గా అవడానికి పూర్తిగా సమర్ధత పొంది ఉండేవాడు కాదు. 20 తులముల వెండికి అమ్మబడుట చాలా మందికి శారీరకంగా అనారోగ్యము కలిగించును. కాని యేసేపు అతని సహోదరులను నిందించలేదు శపించలేదు, ఈ పరిస్థితుల ద్వారా దేవుడు తన రెండు కలలను ఎలా నెరవేరుస్తాడా అని ఆశ్చర్యపోతూ ఉండిపోయాడు."

దక్షిణ వాయువు – నమ్మకము గౌరవము సంపాదించుకొనుట -
ఆదికాండము 39:1-6

దయచేసి నేను ఆదికాండము 39:1-6 చదువుచుండగా చూడండి.

"మరియు యేసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు; ఫరో యొక్క ఉద్యోగస్థుడను, రాజ సంరక్షక సేనాధిపతియునైన, పోతీఫరను, ఒక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన, ఇష్మాయేలీయుల యెద్ద అతని కొనెను. యెహోవా యేసేపునకు తోడై యుండెను, గనుక అతడు సంపన్నుడు ఆయెను; మరియు వర్దిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. మరియు యెహోవా అతనికి తోడై యుండేననియు, అతడు చేసిన దంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. అతని యజమానుడు చూచినప్పుడు, యేసేపు మీద అతనికి కటాక్షము కలిగెను: మరియు అతడు తన ఇంటి మీద విచారణ కర్తగా అతనిని నియమించి, తనకు కలిగిన దంతయు అతని చేతి కప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దంతటి మీదను, అతని విచారణ కర్తగా నియమించిన కాలము మొదలుకొని, యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను; యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యేసేపు చేతికప్పగించెను; తాను ఆహారము తినుట తప్ప, తనకేమి ఉన్నదో ఏమి లేదో, విచారించిన వాడు కాదు" (ఆదికాండము 39:1-6).

చూడండి.

యేసేపు ఫరో సేనాధిపతి పోతీఫరుడు అమ్మబడ్డాడు. ఫిర్యాదు చేసే బదులు యేసేపు పనికి వెళ్లి అతని విధులు సక్రమంగా నెరవేర్చాడు. అతని యజమానియైన పోతీఫరు అనుగ్రహాన్ని పొందుకొని, విజయవంతమైన వ్యక్తిగా, పేరెన్నికగొన్నాడు. కాని యేసేపుకు ఇంకా తర్ఫీదు కావాలి. కనుక అతడు అవమానింపబడడానికి దేవుడు అనుమతించాడు.

ఉత్తర వాయువు – శోధనకు అన్యాయమును ఎదుర్కొనుట –
ఆదికాండము 39:7-20

ఇప్పుడు నిలబడి ఉండగా ఆదికాండము 39:1-18 నేను చదువుతాను. డాక్టర్ లిన్ ఇలా అన్నారు, "వారి జీవితాలలో ఉత్తర వాయువు వీచినప్పుడు, చాలామంది యనవస్తులు అది విషాదము అని అనుకుంటారు... కాని అలాంటి శ్రమ తరుచు దేవుని కృపను ప్రత్యక్ష పరుస్తూ ఉంటుంది. యిర్మియా ఇలా చెప్పాడు, ‘యౌవన కాలమున కాడి మోయుట నరునికి మేలు’ (విలాప వాక్యములు 3:27). శ్రమలేని సాక్ష్యము యవనస్థుని నాశనము చేస్తుంది. కాని యవ్వన కాలమున కాడి మోస్తే ఉన్నత స్థితికి వెళ్ళడానికి గట్టి మెట్ట అవుతుంది."

"మరియు యేసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు; ఫరో యొక్క ఉద్యోగస్థుడను, రాజ సంరక్షక సేనాధిపతియునైన, పోతీఫరను, ఒక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన, ఇష్మాయేలీయుల యెద్ద అతని కొనెను. యెహోవా యేసేపునకు తోడై యుండెను, గనుక అతడు సంపన్నుడు ఆయెను; మరియు వర్దిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. మరియు యెహోవా అతనికి తోడై యుండేననియు, అతడు చేసిన దంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. అతని యజమానుడు చూచినప్పుడు, యేసేపు మీద అతనికి కటాక్షము కలిగెను: మరియు అతడు తన ఇంటి మీద విచారణ కర్తగా అతనిని నియమించి, తనకు కలిగిన దంతయు అతని చేతి కప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దంతటి మీదను, అతని విచారణ కర్తగా నియమించిన కాలము మొదలుకొని, యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను; యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యేసేపు చేతికప్పగించెను; తాను ఆహారము తినుట తప్ప, తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యేసేపు రూపవంతుడును, సుందరుడవైయుండెను. అటు తరువాత అతని యజమాని భార్య యేసేపు మీద కన్నువేసి, తనతో శయనించుదుని చెప్పెను; మరియు ఆమె చెప్పింది, నాతో అబద్దమని. కాని అతడు తిరస్కరించబడ్డాడు, మరియు అతడు నాయక మానవుడు, తనకు కలిగినదంతయు, నా చేతికప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ ఇంటిలో నా కంటే పైవాడు ఎవరును లేడు; నీవు అతని భార్యవైనందున, నిన్ను తప్ప మరిదేనిని నాకప్పగించక యుండలేదు: కాబట్టి నేనెట్ల ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను? దినదినము, యేసేపుతో ఆమె మాటలాడుచుండెను, అతడు ఆమెతో శయనించుటకైనను, ఆమెతో ఉండుటకైనను, ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా, ఒకనాడు అతడు తన పనిమీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు; ఇంటి మనష్యులలో ఎవరును అక్కడ లేదు. అప్పుడామె అతని వస్త్రము పట్టుకొని, తనతో పయనింపుదుని, అబద్దము చెప్పెను: అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి, తప్పించుకొని, బయటకు వెళ్ళెను. ఆమె చూచినప్పుడు, తన ఇంటి మనష్యులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు, ఒక హేబ్రీయుని మన వద్దకు తెచ్చియున్నాడు, నాతో శయనింపవలెనని, వీచు నా యొద్దకు రాగా, నేను పెద్ద కేకవేసితిని; అతడు నా దగ్గర రాగానే, మరియు నేను గట్టిగా ఏడ్చాను: మరియు నేను బిగ్గరగా కేకవేయుట విని, నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి, తప్పించుకొని, బయటికి పారిపోయెనని, వారితో చెప్పెను. అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు, అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడామె తన భర్తతో, ఈ మాటల చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు, నన్ను ఎగతాళి చేయుటకు, నా యొద్దకు వచ్చెను: నేను బిగ్గరగా కేక వేసినప్పుడు, వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి, తప్పించుకొని, బయటికి పారిపోయెననెను." (ఆదికాండము 39:1-18).

కూర్చోండి.

ఒకరోజు యేసేపు ఫోతీఫరు ఇంటిలో పనిచేయుచుండగా, అతని భార్య యేసేపును పట్టుకొని తనతో శయనించమంది. కాని యేసేపు ఆమె నుండి విడిపించుకొని, తన వస్త్రము ఆమె చేతిలో వదిలి, పారిపోయాడు.

ఈ శోధన ఇతర యవనస్తులకు తట్టుకోలేనిదిగా ఉంటుంది, కాని యేసేపు దానిని జయించాడు. త్వరగా పారిపోయి త్వరగా జయించాడు. కొన్ని శోధనలు వాటిని ఎదుర్కోవడం ద్వారా జయిస్తాం, కాని లైంగిక కామ సంబందిత శోధనలు పారిపోవుట ద్వారానే జయించగలము (II తిమోతి 2:22 ఇలా చెప్తుంది, "యవనేచ్చల నుండి పారిపొమ్ము"). యేసేపు విజయము – అతని నమ్మకత్వము – దేవుని పట్ల, ఎంతో నమ్మకముంచిన పోతీఫరు పట్ల, తనమట్టుకు, కాబట్టి అపవిత్రమవకుండా తన పవిత్రత కాపాడుకున్నాడు. దేవుని నిమిత్తము దుష్ట స్త్రీ కోరికకు లొంగకుండా జైలుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. పోతీఫరు నిమిత్తము తనను సమర్ధించుకోలేదు, తన యజమాని భార్య నిర్దయకు గురికాకుండా. అతడు మౌనము వహించాడు. పోతీఫరు ఇంటికి వచ్చినప్పుడు, అతడు తన భార్య చేసిన అభియోగమును నమ్మి, యోసేపును చెరసాలలో వేసాడు.

దక్షిణ వాయువు – పదోన్నది మరియు స్నేహము –
ఆదికాండము 39:21-40:22

నేను ఆదికాండము 39:19-22 తెరవండి. చదువుచుండగా నిలబడండి.

"కాబట్టి, అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని, తన భార్య తనతో, చెప్పిన మాటలు విన్నప్పుడు; కోపముతో మండిపడిరి. యోసేపు గురువు అతనిని పట్టుకొని, రాజు ఖైదీలు బందింపబడు చెరసాలలో, వేయించెను: అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా, యేసేపునకు తోడై యుండి అతని యందు కనికరపడి, అతని మీద జాలితో చెరసాలలో ఉంచారు. ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరిని యోసేపు చేతికప్పగించెను; వారక్కడ ఏమి చేసిరో, అదంతయు అతడే చేయించేవాడు" (ఆదికాండము 39:19-22).

కూర్చోండి.

యేసేపు భౌతిక వాతావరణము క్షీణించినప్పటికినీ, ఆయన ఆత్మీయ ఒప్పుకోలు మారలేదు. దేవుని సన్నిధి జైలులో అతనికి ఆశీర్వాదముగా కొనసాగింది.

యేసేపు చెరసాలలో స్నేహ పూరిత వాతావరణాన్ని నెలకొల్పాడు. ఫరో పానదాయకుడు భక్షకారుడు, చెరసాలలో, వారి కలలచే కలవరపడ్డాడు. కలల భావము ఎవరు చెప్పలేకపోయారు. యేసేపు మనసులో దేవుడు ఏమైనా చేయగలడు. పాన దాయకుడు భక్షకారుని కలలకు భావము చెప్పాడు. మూడు రోజుల తరువాత కలల భావాలు నెరవేరాయి. పాన దాయకుడు పునరుద్దరింపబడ్డాడు, భక్ష్యకారుడు ఉరి తీయబడ్డాడు. ఇది యేసేపు దక్షిణ వాయువు విసరుట, చెరసాలలో కూడ.

ఉత్తర వాయువు – కృతఘ్నతను మందమును సహించుట -
ఆదికాండము 40:23

ఆదికాండము 40:23 చూడండి.

"అయితే పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకము చేసికొనక, అతని మరచిపోయెను" (ఆదికాండము 40:23).

యేసేపు రెండు సంవత్సరాల జైలు శిక్ష తప్పకుండా అతనికి ఉత్తర వాయువే. "అయితే పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకము చేసికొనక, అతని మరచిపోయెను" (ఆదికాండము 40:23). ఇది పానదాయకుని కృతఘ్నతను చూపిస్తుంది. అలాంటి పరిస్థితి తన కృతఘ్నతను బట్టి ప్రపంచాన్ని అసహ్యించుకునేలా చేస్తుంది, కాని యేసేపు అలా చేయలేదు. దేవుని కార్యము కొరకు ఎదురు చూచే ధర్మము నేర్చుకున్నాడు. దేవుడు జైలులో అతని సమయాన్ని పొడిగించాడు వేచి యుండడంలో యేసేపుకు సహనము నేర్పడానికి, దేవుని నమ్మకత్వములో ఇతని నమ్మకాన్ని పెంపొందించదానికి. దేవుని మందము అధిగమించువానికి ఆయన చూపించే అధిక కృపకు ఋజువు. తరువాత దావీదు చెప్పాడు, "ప్రభువు కొరకు కనిపెట్టుకొని యుండుము: ధైర్యము తెచ్చుకొని, నీ హృదయమును నిబ్బరముగా నున్చుకోనుము: యెహోవా, కొరకు కనిపెట్టుకొని, యుండుము" (కీర్తనలు 27:14).

దక్షిణ వాయువు – రాజుగా పరిపాలించుట -
ఆదికాండము 47:12-31

నేను ఆదికాండము 47:12-17 వరకు చదువుచుండగా నిలబడండి.

"మరియు యేసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారినందరిని, వారి వారి పిల్లల లెక్కచొప్పున, వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటను ఆహారము లేకపోయెను; కరువు వలన ఐగుప్త దేశమును, కనాను దేశమును క్షీణించేను. వచ్చిన వారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను, కనాను దేశములోను, దొరికిన ద్రవ్యమంతా యేసేపు సమకూర్చెను: ఆ ద్రవ్యమంతటిని యేసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును, కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత, ఐగుప్తీయులందరు యేసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారము ఇప్పించుము, అని అడిగారు: నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. అందుకు యేసేపు, మీ పశువులను ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయిన యెడల మీ పశువులకు ప్రతిగా, నేను మీకు ధాన్యమిచ్చేదనని చెప్పెను. కాబట్టి వారు తమ పశువులను యేసేపు నొద్దకు తీసుకొని వచ్చిరి: యేసేపు గుర్రములను గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకొని, వారికి ఆహారమిచ్చెను: ఆ సంవత్సరమందు వారి మండలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహరమిచ్చి సంరక్షించెను" (ఆదికాండము 47:12-17).

కూర్చోండి.

డాక్టర్ లిన్ ఇలా చెప్పారు, "పుచ్చుకొన్నప్పుడు ఏ వేగవంతయు అనుభవింప తగినదిగా ఉండదు; అది నొప్పిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాని అది నీతిఫలము తీసుకొని వస్తుంది దానిలో తర్భీదు పొందిన వారికి." హెబ్రీయులకు 12:11 చూడండి,

"ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే, కాని సంతోష కరముగా కనబడదు: అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధాన కరమైన [పెరుగును] ఫలమిచ్చును" (హెబ్రీయులకు 12:11).

పైకి చూడండి.

ఈ రెండు సుదీర్ఘ సంవత్సరాలు గడిచాక, దేవుడు ఫరో కలకనేటట్టు చేసాడు తద్వారా పానదాయకుడు గుర్తు చేసుకున్నాడు యేసేపు తన కల భావము చెప్పాడని. పానదాయకుడు ఫరోతో తన కల భావమును చెప్పడానికి యేసేపును అడుగుతున్నాడు! ఆ కల అర్ధము ఏడు సమృద్ధి సంవత్సరాల తరువాత ఏడు కరవు సంవత్సరాలు వచ్చునని. ఫరో పథకానికి ఏడు కరవు సంవత్సరాల సిద్ధపాటుకు, యేసేపును నియమించాడు. ఈ పని చేయడానికి యేసేపుకు అసాధారణ వరముందని ఫరో చూసాడు. అలా యేసేపు ఐగుప్తు దేశమంతటి మీద పరిపాలకుడయ్యాడు (41:38-43). యేసేపు ఐగుప్తీయులను జ్ఞానముతో సానుభూతితో పరిపాలించెను – తన సహోదరులను క్రమశిక్షణతో ప్రేమతో పరిపాలించెను. చివరకు యేసేపు తన సహోదరుల కంటే ఎక్కువగా గౌరవింపబడ్డాడు (49:26).

డాక్టర్ లిన్ ఇలా చెప్పారు, "దేవుడు యేసేపును భూలోక రాజ్యాన్ని పరిపాలించడానికి తర్ఫీదు చేసినట్టు, దేవుడు తన అధిగమించు వారిని ఆయన తన రాబోవు రాజ్యములో అధికారానికి తర్ఫీదు ఇస్తాడు. రక్షణ షరతులు లేనిది, అందులో పనులు ఇమిడి లేవు. కాని క్రీస్తు ఆయన రాబోవు రాజ్యములో పరిపాలించడానికి షరతులు ఉన్నాయి." బైబిలు ఇలా చెప్తుంది,

"[సహించిన వారమైతే], ఆయనతో కూడ ఏలుదుము" (II తిమోతి 2:12).

పాస్టరు రిచర్డ్ వార్మ్ బ్రాండ్ కమ్యూనిష్టు చెరసాలలో 14 సంవత్సరాలు శ్రమ అనుభవించారు. పాస్టర్ వార్మ్ బ్రాండ్ ఇలా అన్నారు, "ప్రతికూల పరిస్థితులలో అంతర్గత సంఘర్షణలలో నమ్మకముగా నిలబడే క్రైస్తవుని నేను ఎరుగను. అతడు వాటి నుండి జయవంతముగా బయట పడడు" (ముందు మాట "చెరసాల గోడలు మాట్లాడగలిగితే").

మళ్ళీ, పాస్టరు వార్మ్ బ్రాండ్ ఇలా అన్నారు, "నా సహోదరీ సహోదరులారా, మీ జీవితాలు దేవుని చేతిలో మట్టిలాంటివని మీరు నమ్మాలి. ఆయన ఎప్పుడు పొరపాట్లు చెయ్యడు. కొన్నిసార్లు ఆయన కఠినంగా ఉంటే... నమ్మిక మాత్రము ఉంచండి. ఆయన ఎందు నిమిత్తము మిమ్ములను మలుస్తున్నాడో ఆ సందేశము కనుగొనండి. ఆమెన్." (16వ పేజీ).

నీవు యేసేపు వలే అధిగమించే వానిగా ఉంటే, దేవుని నుండి నీకు ఇది వాగ్ధానము. ప్రకటన 2:26 చూడండి.

"జయించుచు, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు వానికి, జనుల మీద అధికారము ఇచ్చెదను" (ప్రకటన 2:26).

వందనాలు, డాక్టర్ తిమోతి లిన్ గారు, మీ గొప్ప ప్రసంగము ద్వారా మీకు భోధించినందుకు. ప్రియ పాస్టరు గారు, అది నా జీవితాన్ని మార్చేసింది. ఈ బోధకు నా జీవితాంతము ఋణపడి ఉంటాను!

దయచేసి నిలబడి నేటి మన పాట పాడదాం, "నేను సిలువ సైనికుడినా?"

నేను సిలువ సైనికుడినా, గొర్రె పిల్లను వెంబడించువాడనా;
ఆయన నిమిత్తము నేను భయపడుచున్నానా, లేక ఆయన నామమును గూర్చి మాట్లాడుటకు సిగ్గు పడుచున్ననా?

పూలపాన్పుపై ఆకాశమునకు కొనిపోబడవలెను కదా,
ఇతరులు బహుమానము నిమిత్తము పోరాడుచున్నప్పుడు, కష్టతర సముద్రముల ద్వారా పయనిస్తుండగా?

ఎదుర్కోడానికి నాకు శత్రువులు లేరా? నేను ప్రవాహమును తొక్కవద్డా?
ఈ నీచ ప్రపంచము కృపకు స్నేహితుడా, దేవుని దగ్గరకు వెళ్ళడానికి నాకు సహాయ పడడానికి?

నేను తప్పక పోరాడాలి, నేను పరిపాలించాలంటే; నా ధైర్యము పెంచు, ప్రభూ!
నేను శ్రమ భరిస్తాను, నొప్పి సహిస్తాను, మీ వాక్యము మద్దతుతో.
("నేను సిలువ సైనికుడినా?" డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748).
     (“Am I a Soldier of the Cross?” by Dr. Isaac Watts, 1674-1748).

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

నీవు ఇంకను రక్షింపబడకపోతే, నీవు యేసు క్రీస్తును విశ్వసించాలని కోరుచున్నాను. ఆయన పరలోకము నుండి దిగివచ్చి నీ పాప పరిహారర్ధము సిలువపై మరణించాడు. నీవు యేసును నమ్మిన క్షణమే, ఆయన రక్తము సమస్త పాపము నుండి నిన్ను కడుగును. నీవు యేసును విశ్వసించాలని నేను ప్రార్ధిస్తున్నాను.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.