Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ప్రసంగమునకు ముందు పాట: "గొప్ప నేల"(జాన్ సన్ ఓట్ మాన్ చే, 1856-1926).

కరోనా వైరస్ మనలను ఆపగలదా?

SHALL THE CORONAVIRUS STOP US?
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
పాష్టర్ ఎమెరిటస్
by Dr. R. L. Hymers, Jr.,
Pastor Emeritus

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము మధ్యాహ్నము, మే 10, 2020
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Afternoon, May 10, 2020


దయచేసి లూకా 21:8-11 చూడండి.

"ఆయన అన్నాడు, మీరు మోసపోకుండ చూచుకొనుడి: అనేకులు నా పేరట వచ్చి. నేనే ఆయన, అనియు; కాలము సమీపించెనని చెప్పుదురు: మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు, జడియకుడి: ఇవి మొదట జరగవలసి యున్నవి; గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము లేచును: అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును, కరువులును తటస్థించును; ఆకాశము నుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలను పుట్టును" (లూకా 21:8-11).

ఇప్పుడు మత్తయి 24:4-8 చూడండి.

"యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోస పరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి, నేనే క్రీస్తునని, చెప్పి; మరియు పలువురిని మోసము చేసెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారము గూర్చియు వినబోదురు: మీరు కలవర పడకుండ చూచుకొనుడి: ఇవి జరగవలసి యున్నవి, గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును: అక్కడక్కడ తెగుళ్ళు, కరువులను, భూకంపములును, కలుగును. ఇవన్ని వేదనలకు ప్రారంభము" (మత్తయి 24:4-8).

ఈ పాఠ్యభాగములో – "అంటు రోగములు" అనే మాటను గమనించండి. తరువాత మత్తయి 24:8 లో చెప్పబడింది, "ఇవన్నియు వేదనలకు ప్రారంభము."

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఈ ప్రసంగము ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. వెళ్ళండి WWW.SERMONSFORTHEWORLD.COM.
ఆకుపచ్చ బటను నొక్కండి "యాప్" అనే పదము ఉన్న దానిపై. వచ్చే సూచనలను గైకొనండి.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఇప్పుడు పదము "అంటురోగము" ప్రాముఖ్యమైనది, అది గ్రీకులో (బహువచనము). ఉంగర్ బైబిలు వ్యాఖ్యానము చెప్తుంది ఆ పదము "తెగులుకు...అన్వయింపవచ్చు." యేసు ఎయిడ్స్ అనే అంటు వ్యాధిని ఊహించాడు. ఈ పదము మహమ్మారి కరోనా వైరస్ ను గూర్చి కూడ చెప్తుంది. 8 వ వచనములో ఈ అంటు రోగములను గూర్చి క్రీస్తు ఏమి చెప్పాడో చూడండి, "ఇవన్నియు వేదనలకు ప్రారంభము." గ్రీకు పదము అర్ధము "ప్రసవ వేదనకు ప్రారంభము" (మెక్ ఆర్డర్).

మన దినాలను గూర్చి, జే. ఎన్. డార్బి ఇలా చెప్పాడు, "ఒక అబద్ధపు సంఘము ఉంటుంది: కరువులు, అంటురోగాలు, భూకంపములు ఉంటాయి." వైన్ వివరణాత్మక నిఘంటువు అంటురోగాన్ని ఇలా నిర్వచిస్తుంది "లూకా 21:11 లో చెప్పబడిన, బహు వచన భయంకర అంటు వ్యాధి."

కోవిడ్ అంటువ్యాధి తరువాత ప్రజలు "సంఘాన్ని ఎలా జరిగిస్తారో" ఆలోచించండి. onenewsnow.com (ఏప్రిల్ 24, 2020)లో ఒక నివేదికకు ఇలా శీర్షిక ఇవ్వబడింది, "కోవిడ్ క్లిష్టత తరువాత ప్రజలు ఎలా ‘గుడిని జరిగిస్తారు’?" చాలామంది "వీక్షించే ఆరాధనలు హాజరవుతారని" అది చెప్పింది. ఆ నివేదిక చెప్పింది "మహమ్మారి తరువాత సంఘ జీవితమూ మునపటి కంటే చాలా వేరుగా ఉంటుంది." "42% మంది అంటున్నారు మహమ్మారి ముందు ఇచ్చుట అధ్వానముగా ఉండేది." "సంఘ నాయకులలో ఆతృత నెలకొంది లాక్ డౌన్ తరువాత ఏమి ఎదుర్కోవాలని భయపడుతున్నారు." "చాలా పెద్ద సంఘాలు హాజరయ్యే వారు ఎక్కువ శాతము, అందుకు అమెరికా అంతటిలో సంఘ నాయకులకు భయము ఉంది." "ప్రవర్తన శాస్త్రవేత్తలుగా, మనం నమ్ముతాం ‘బదులు’ అనేది శ్రేయస్కరము అని - దానిని గూర్చి చాలా సంఘకాపరులు శ్రద్ధ కలిగియున్నారు." "సంస్కృతి ప్రజలకు నేర్పింది...అందుబాటులో ఉన్న వాటిని ఊహించాలని."

సేవలో 62 సంవత్సరాలు గడిపిన తరువాత, ఈ భయములు బాగా పాతుకు పోయాయని నేను నమ్ముచున్నాను. అంత్యకాలపు ప్రవచనములో ఇది భాగమని నేననుకుంటాను ఇది II దెస్సలోనీకయులకు 2:3 లో చెప్పబడింది, "ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి: పాప పురుషుడు బయలు పడితేనే కాని ఆ దినము రాదు" (అపోష్టేషియ" – స్వధర్మత). డాక్టర్ మెర్రిల్ ఎఫ్. ఉంగర్ ఇలా అన్నాడు, "పాక్షిక పడిపోవుట పూర్తిగా పడిపోవడానికి దోహదపడుతుంది - క్రైస్తవ్యములో విశ్వాసము మాయమవుట ద్వారా" (బైబిలు పర భూతశాస్త్రము, పేజీ 207). లేఖనాలలో ఈ ప్రాముఖ్య వచనానికి విధేయులమవనిచో మనము నిజ క్రైస్తవులుగా ఉండగలమా?

"కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక; ఒకని నొకడు హెచ్చరించాడు: ఆ దినము సమీపించుట మీరు చూచినా కొలది, మరి ఎక్కువగా ఆలాగు చేయవలెను" (హెబ్రీయులకు 10:25).

డాక్టర్ డబ్ల్యూ. ఏ. క్రీస్ వెల్ ఈ వచనాన్ని గూర్చి ఇలా చెప్పాడు, "హెబ్రీయులకు పత్రిక రచయిత సమాజముగా కూడుట పెరగాలని చెప్పాడు...క్రీస్తు రాకడ దినము సమీపించు చుండగా...స్థానిక సంఘ క్లిష్ట ప్రాముఖ్యత, పరిశుద్ధుల స్థానిక సమాజములో ప్రతి క్రైస్తవుడు నమ్మకముగా ఉండాలి" (The Criswell Study Bible; note on Hebrews 10:25).

ఈ మాటలకు ఈ రోజులలో గొప్ప అర్ధము ఉందని నేను నమ్ముతాను, క్రీస్తు రెండవ రాకడ సమీపించుచుండగా. నూతన సువార్తికులు ఈ వచనానికి లోబడరు. మహాశ్రమల కాలములో ఇంకా ఎక్కువగా తిరస్కరించబడుతుంది. స్థానిక సంఘాల నుండి నిజ క్రైస్తవులను వేరు చేసి వారిని బలహీన పరచాలని సతానుకు తెలుసు, తద్వారా అంత్య క్రీస్తుకు వారు అప్పగించుకుంటారు.

డేవిద్ జెర్మియా లాంటి వారు స్థానిక సంఘాలలో క్రమంగా హాజరు అవాలనే విషయాన్ని నొక్కి చెప్పనందుకు చింతిస్తున్నాను. మహాశ్రమలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయము చెప్పడంలో డాక్టర్ జెర్మియా విఫలమయ్యాడు.

ఇప్పుడు మత్తయి 24:6-8 చూడండి.

"మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారము గూర్చియు వినబోదురు: మీరు కలవర పడకుండ చూచుకొనుడి: ఇవి జరగవలసి యున్నవి, గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును: అక్కడక్కడ తెగుళ్ళు, కరువులను, భూకంపములును, కలుగును. ఇవన్ని వేదనలకు ప్రారంభము" (మత్తయి 24:6, 7, 8).

"అంతము వెంటనే రాదు" (24:6).

"జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును: అక్కడక్కడ తెగుళ్ళు, కరువులను, భూకంపములును, కలుగును. ఇవన్ని వేదనలకు ప్రారంభము" (మత్తయి 24:7, 8).

"ఇవన్నియు వేదనలకు ప్రారంభము" (24:8).

నేను డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ తో 24:9 విషయములో అంగీకరిస్తున్నాను. ఇది మహా గొప్ప శ్రమలకు ఆరంభమని. డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ చెప్పాడు,

"తప్పకుండా దినములు చెడ్డవి సమయాలు (పెరుగుతున్నాయి), నిజ క్రైస్తవుడు పట్టబడుట లేదు. ముందుగానే అతనికి హెచ్చరింపబడింది వాటిని ఊహించాలని" ("దేవుని మనష్యుల నుండి," పేజీ 131).

మత్తయి 24:7-14, నేను చదువు చుండగా దయచేసి నిలబడండి.

"జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును: అక్కడక్కడ తెగుళ్ళు, కరువులను, భూకంపములు, కలుగును. ఇవన్నియు వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి, చంపెదరు: మీరు నా నామము నిమిత్తము సకల సనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతర పడి, ఒకనినొకడు అప్పగించి, ఒకనికొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి పలువురిని, మోస పరచెదరు. అక్రమము విస్తరించుట, అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో, వాడే రక్షింప బడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్ధమై లోకమంతట ప్రకటించబడును; అటు తరువాత అంతము వచ్చును" (మత్తయి 24:7-14)

నేను మీతో చెప్పాలి శ్రమల కాలము ముందు ఎత్తబడుట నేను నమ్మను. దేవుని ఉగ్రత రాకమునుపు ఎత్తబడుట ఉంటుందని నమ్ముతాను. అలా, మామూలుగా, ఉగ్రత ముందు సంఘము ఎత్తబడుట నేను నమ్ముతాను, మార్విన్ రోసేంతాల్ వలే తన పుస్తకము ఉగ్రత ముందు సంఘము ఎత్తబడుటలో చెప్పాడు (థామస్ నెల్సన్ ముద్రణ, 1990). మొదట చదవకుండా మొదటగా రోసెంత్ లాల్ పుస్తకాన్ని తీర్పు తీర్చకండి.

మార్విన్ డి. రోసెంతాల్, నా వలే, శ్రమల ముందు సంఘము ఎత్తబడుటను నమ్ముతాడు. రోసెంతాల్, తన పుస్తకములో, ప్రకటన గ్రంథము 16 లో చెప్పబడిన తీర్పు అయ్యే వరకు ఎత్తబడుట జరగదు. అలా, నేను ఎత్తబడుట నమ్ముతాను, ఇది ఒక నాస్తికత్వము కాదు ప్రకటన గ్రంథము 16 లో చెప్పబడిన తీర్పు అయ్యే వరకు ఎత్తబడుట. ఇది అలాంటిది కాదు, కాని బైబిలు దీనిని ఊహిస్తుంది. గొప్ప చైనీయ సువార్తికుడు జాన్ సంగ్ దీనిని నమ్మాడు. గత 24 సంవత్సరాలుగా, నా గురువు డాక్టర్ తిమోతి లిన్ కూడ నమ్మాడు. డాక్టర్ క్రిష్టాఫర్ ఎల్. కాగన్ కూడ దీనిని నమ్మాడు.

రోసెంతాల్ సరిగా చెప్పాడా? వాస్తవానికి సమీపంగా ఉన్నాడు. రోసెంతాల్ ను తిరస్కరించే ముందు, తన పుస్తకము పదహారవ అధ్యాయము చదవాలి, "అంతము వచ్చుట."

ఈ ప్రసంగపు నా ఉద్దేశము "క్రైస్తవులమైన" మనము మహాశ్రమల ముందు ఉండే "అంటు వ్యాధులను" ఎదుర్కోలేకపోతే, గొప్ప శ్రమల సమయములో ఎలా తట్టుకోలరు?

"లోకారంభము నుండి ఇప్పటి వరకును, అట్టి శ్రమ కలుగలేదు, లేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకబోయిన యెడల, ఏ శరీరము తప్పించుకొనదు: ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును" (మత్తయి 24:21, 22).

ఈ వచనాలు "మహా శ్రమలను" చూపిస్తున్నాయి. డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ చెప్పారు, "ప్రకటన గ్రంథములో చదువుతాము మహాశ్రమల కాలములో భూమిపై మూడువంతులలో ఒక వంతు జనాభా నాశనమవుతుందని...ఆ కాలము తగ్గింపబడును. ఇది అతిశయోక్తి అని అనిపించవచ్చు. ఏది ఏమైనా, ప్రపంచములో చాలా దేశాలు అణుబాంబులు కలిగి ఉన్నాయి, ప్రపంచ జనాబాను నాశనము చేస్తుంది, ఇది అతిశయోక్తి కాదు" (బైబిలు ద్వారా; గమనిక మత్తయి 24:22).

యేసు చెప్పాడు, "కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా, చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు, పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, (చదువు వాడు, గ్రహించుగాక:)" (మత్తయి 24:15). డాక్టర్ మెక్ గీ చెప్పాడు, "మన ప్రభువు నిస్సందేహంగా... అంత్యక్రీస్తు ఆకారమును గూర్చి చెప్తున్నాడు (దానియేలు 12:11 చూడండి). అది తిరిగి [కట్టబడిన] దేవాలయములో పెట్టబడుతుంది."

"లోక ఆరంభము నుండి, ఇప్పటి వరకును, అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడు కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల, ఏ శరీరము తప్పించుకొనడు: ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును" (మత్తయి 24:21, 22).

డాక్టర్ మెక్ గీ చెప్పాడు, "దేవుడు మనష్యులను ఆత్మహత్యలు చేసుకోనివ్వాడు. ఆ కారణమును బట్టి ఇది తక్కువ కాలము ఉంటుంది" (మెక్ గీ, ఐబిఐడి., మత్తయి 24:22 పై గమనిక). గమనించండి "ఎన్నిక చేయబడిన" క్రైస్తవులు ఇక్కడ ఉంటారు, ఇది మార్విన్ జె. రోసెంతాల్ తన పుస్తకము, ఉగ్రతకు ముందు సంఘము ఎత్తబడుటలో చెప్పాడు.

ఇప్పుడు దయచేసి II దెస్సలోనీకయులకు 2:3 చూడండి.

"ఎవడును మిమ్మును మోస పరచకుండా చూచుకొనుడి: పాప పురుషుడు బయలు పడితేనే గాని, ఆ దినము రాదు" (II దెస్సలోనీకయులకు 2:3).

"స్వధర్మత ముందు రావాలి" (ఆధునిక అనువాదము).

స్వధర్మ దినాలలో చాలా బోధకులు, క్రైటన్ మరియు వాల్ డ్రిప్ లాంటి వారు, I తిమోతి 4:1, 2 లో ఇవ్వబడిన హెచ్చరిక మర్చిపోతారు. I తిమోతి 4:1, 2 చూడండి.

"అయితే కడవరి దినములలో, కొందరు అబద్ధికుల వేషధారణ వలన, మోసపరచు ఆత్మల యందును, దయ్యముల బోధ యందును లక్ష్యముంచిరి; వేషధారణలో అబద్ధమాడుదురు; విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు" (I తిమోతి 4:1, 2).

వారు ఈ ప్రవచనమును గూర్చి మరిచిపోయి, వారు "మోసపరచు ఆత్మలకు, దెయ్యముల బోధకు (దెయ్యము); వేషధారణతో అబద్దమాడుట; వాత వేయబడిన మనస్సాక్షి కలిగి యుంటారు." అందుకే అలాంటి వారు సంఘాలను చీల్చుతారు. ఎందుకు? ఎందుకంటే వారు గుడ్డిగా "దయ్యాల సిద్ధాంతాలకు తావిస్తారు," అందువలనే!

సంఘాలను చీలిక చేసే "నాయకుల" గుణ లక్షణాలు ఇవ్వబడ్డాయి. ఇవి డాక్టర్ రోమ్ బ్రాన్ సన్ చే ఇవ్వబడ్డాయి, తన సంఘ చీలిక పుస్తకములో. (పేజీలు 29-31).


1.  వారు అహంకారులు. అందరి కంటే, సంఘ కాపరి కంటే కూడ, వారే తెలివైన వారు అనుకుంటారు.

2.  వారు స్వార్ధపరులు. ఎవరు ఎలా శ్రమపడిన వారిదే, నెగ్గాలనుకుంటారు.

3.  వారు తప్పు ఒప్పుకోరు. అహంకారి మరియొక లక్షణము.

4.  వ్యక్తిగత గుర్తింపు కొరకు మహిమ కొరకు వారు ఆకలిగొని ఉంటారు.

5.  ఎవరికీ లోబడరు. బైబిలు బోధ తేటగా లేదు సంఘ కాపరి అధికారానికి లోబడి అతని వెంబడించాలని. వారు క్రీస్తుకు లోబడుతారని చెప్తారు. సంఘ కాపరి క్రూర నియంత అని వారంటారు.

6.  వారు మోస గాండ్రు. సంఘము పట్ల శ్రద్ధ ఉన్నట్లు నటిస్తారు. కాని నిజానికి వారి ఆధిపత్యానికి స్థానానికి ప్రాముఖ్యత ఇస్తారు.

7.  వారు పదాలను దుర్వినియోగము చేస్తారు, "నేను సంఘ కాపరిని ప్రేమిస్తాను, కాని..." తరువాత వారు సంఘ కాపరిపై దాడి చేస్తారు.

8.  వారు సంఘ కాపరిని తప్పు బడతారు, ఆయన మాటలకు తప్పుడు ఉద్దేశాలు అన్వయిస్తారు.

9.  సంఘ కాపరి చేసే ప్రతి దానికి తప్పుడు ఉద్దేశాలు అంటకడతారు.

10. వారు బోధను అంగీకరించరు. బైబిలు చెప్పేదానికి "వేరుగా ఉంటారు."

11. సంఘ కాపరిపై ఫిర్యాదులు చేస్తారు. అలా, వారు సంఘ చీలికకు మనష్యులను వాడుకుంటారు.


ఈ లక్షణాలన్నీ క్రైటన్ /వాల్ డ్రిప్ చీలికలో ఉన్నాయి.

నేను ఇక బోధిస్తూ నిలబడలేను. ఈ క్రైటన్. యితడు పిరికివాడు, కాని అతని ముఖ్య ప్రసంగీకుని చేయలేదని నా మీద అతనికి కోపము. అతడు నిరుత్సాహ పడలేదని మళ్ళీ మళ్ళీ చెప్పాడు. అతడు డాక్టర్ కాగన్ కు వ్రాసి "తృప్తి పొందడానికి" అతడు బోధించనక్కర లేదన్నాడు. బోధించడానికి అతనికి అనుమతించలేదు అతనికి వరాలు లేవు కాబట్టి. నాతో ఏకీభవించానని చెప్పాడు. కాని అలా చెప్పినాతో అబద్దమాడాడు. చాలామంది యవనస్తుల వలే, తన తండ్రితో తనకు చెడు సంబంధము ఉంది. కాబట్టి, నేను రోగినైనప్పుడు, తన తండ్రిపై తిరుగుబాటు నాపై చూపించాడు. కాని రహస్యంగా చేసాడు. నాతో మాట్లాడకుండా, ఇంకొక బోధకుడైన జాన్ వాల్ డ్రిప్ తో, రహస్య సమావేశాలు పెట్టాడు. వాల్ డ్రిప్ తో తన కూటములు నాకు తెలియదు. ఈ "రహస్య" కూటాలలో వాల్ డ్రిప్ తన వైపు ఉన్నాడు.

తరువాత క్రైటన్ నాతో ఏకీభవించడం లేదని సంఘములో ఇతరులకు తెలియనిచ్చాడు. కాని నాకు ఒక్కసారి కూడ ఈ విషయము చెప్పలేదు. క్రైటన్ తిరుగుబాటును గూర్చి తెలుసుకునే సరికి చాలా ఆలస్యమయిపోయింది. అతడు మూడింటిలో రెండు వంతుల మంది యవనస్తులను తీసుకెళ్ళి వారితో తన "స్వంత" సంఘాన్ని ప్రారంభించాడు. 35 మంది నమ్మకస్తులు మిగిలారు.

ఆ చీలిక సమయానికి, నాకు 80 సంవత్సరాలు, నేను రోగిగా ఉన్నాను. వీటి ద్వారా వెళ్తూ, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి, నేను ఎక్కువ చింతపడలేదు.

ఒక పరిచారకుడు నాతో పోట్లాడాడు. ఇంకొక పరిచారకుడు స్త్రీతో అశ్లీల చిత్రాలు తన వెబ్ సైట్ లో పెట్టాడు. ఇంకొక నాయకుడు నేను మన సంఘములో ఉన్న నల్ల వారిని వ్యతిరేకిస్తున్నానని. ఇంకొక నాయకుడు ఫిర్యాదు చేసాడు నేను వీధులలో బోధించడం లేదని, ఎల్ జిబిటిక్యూఎస్ (LGBTQS) ప్రజల దాడి కారణంగా.

ఇవన్ని సంభావించాక, నేను సంఘ కాపరిగా రాజీనామా చేసాను డాక్టర్ కాగన్ కాపరిగా నియమించబడ్డాడు. అతని స్వంత కుమారుడు, తరువాత కాపరిగా తర్ఫీదు పొందినవాడు, వెళ్ళిపోయాడు, అతని చాలా సన్నిహిత స్నేహితునిగా భావించినప్పటికినీ.

తరువాత కరోనా వైరస్ వచ్చింది! కనుక పాత సంఘ భవనము నుండి మేము బయటికి వచ్చి, గృహాలలో కూటాలు ప్రారంభించారు, నేను కాపరి ఎమెరిటస్ గా, ప్రతి ఆదివారము గృహాలలో టివిలలో ప్రసంగిస్తున్నాను.

మేము లాస్ ఏంజిలాస్ సరిహద్దులలో ఒక కొత్త సంఘ భవనము కొన్నాను. నేను ఒక యవన చైనీయుని సిద్ధ పరస్తున్నాను నేను బోధించలేనప్పుడు బాధ్యత తీసుకోవడానికి.

నేను దెయ్యాలు సంఘ చీలికలపై బోధిస్తున్నందుకు విమర్శింప బడుచున్నాను, కాని నాకు "మూడవ ప్రపంచ" బోధకుల నుండి గొప్ప సమూహమున్నారు వారు ప్రపంచమంతటిలో 43 భాషలలో నా ప్రసంగాలు చదువుతున్నారు. ఈ సంఘ చీలికలు అమెరికాలోను "మూడవ ప్రపంచ" దేశాలలోను చోటు చేసుకుంటున్నాయి, కనుక ఈ ప్రసంగాలు మనకు వారికి కూడ సహాయ పడతాయని నాకనిపించింది. మనము కొత్త చైనీయ సంఘము ప్రారంభిస్తుండగా దేవుడు ఈ అంశముపై మాట్లాడమన్నట్టు నాకనిపించింది.

19 సంవత్సరాల వయస్సులో చైనీయులకు మిస్సెనరీగా పిలిచినందుకు నేను దేవునికి వందనస్థుడను. 60 సంవత్సరాల తరువాత కూడ దేవుడు దేనికైతే పిలిచాడో ఆ పనే చేస్తున్నాను. ప్రభువు కృపను బట్టి నేను ఇంకను మిస్సెనరీనే. నేను ఎదిగా ఉండ కూడదని చాలా దినముల క్రితమే అనుకున్నాను! జాన్ వెస్లీ తన పుస్తకములో రాసిన ఒక చిన్న పద్యము చూడండి,

ఒక చిన్న ఉత్సాహము, ఒక చిన్న ఆట,
చలి రోజున ఒక సూర్య కిరణము,
వీటిని గొప్ప అధికులు పొందుకుంటారు
ఉయ్యాల సమాధికి మధ్య!

నా 62 సంవత్సరాల బాధలో నేను చాలా సంఘాలు ప్రారంభించాను "ఏమి లేని స్థితి నుండి." తిరిగి ప్రారంభించడానికి దేవుడు నాకు డాక్టర్ కాగన్ కు తప్పక సహాయము చేస్తాడు.

అది, అంత సులభం కాదు. మనము, దేవుని కృపను బట్టి, మేము నూతన సంఘమును అంత్య దినములలో ప్రారంభిస్తాము. గట్టి ప్రాధమికునిగా ఉండగలిగాలి. చాలా మొండిగా ఉండాలి చిన్న కరోనా వైరస్ యేసు క్రీస్తు కొరకు మీరు చేసేది ఆపలేదు, మనం డాక్టర్ తిమోతి లిన్ పాస్టర్ రిచర్డ్ వార్మ్ బ్రాండ్ వలే ఉండాలి. గుర్తుంచుకోండి, "మనము గొప్ప శ్రమల ద్వారా దేవుని రాజ్యములో ప్రవేశిస్తాం" (అపోస్తలుల కార్యములు 14:22).

నేను పైపైకి ఎగబాకుతున్నాను, ప్రతి దినము నూతన శిఖరాలు పొందుకుంటున్నాను;
   ఇంకను ప్రార్దిస్తున్నాను కొనసాగుతూ, "ప్రభూ, ఉన్నత స్థలముపై నా పాదము నిలుపు."
ప్రభూ, నన్ను పైకెత్తు నిలబెట్టు, విశ్వాసము ద్వారా, పరలోక స్థలముపై,
   ఉన్నత వాయు వాహనము నేను కనుగొన్నాను; ప్రభూ, ఉన్నత స్థలముపై నా పాదము నిలుపు.

సందేహలు పుట్టు చోట భయాలు క్రుమ్ముచోట నా హృదయము నిలువ ఇష్ట పడడము లేదు;
   కొంతమంది వీటిలోనే నివసిస్తున్నప్పటికినీ, నా ప్రార్ధన, నా గురి, ఉన్న స్థలము.
ప్రభూ, నన్ను పైకెత్తు నిలబెట్టు, విశ్వాసము ద్వారా, పరలోక స్థలముపై,
   ఉన్నత వాయు వాహనము నేను కనుగొన్నాను; ప్రభూ, ఉన్న స్థలముపై నా పాదము నిలుపు.

ప్రపంచానికి పైన నివసించాలనుకుంటున్నాను, సాతాను కుతంత్రాలు నన్ను భయ పెట్టినను;
   విశ్వాసము ఆనంద సునాదాన్ని పట్టుకుంది, పరిశుద్ధుల గీతము ఉన్నత స్థలముపై.
ప్రభూ, నన్ను పైకెత్తు నిలబెట్టు, విశ్వాసము ద్వారా, పరలోక స్థాలముపై,
   ఉన్నత వాయు వాహనము నేను కనుకోన్నాను; ప్రభూ, ఉన్నత స్థలముపై నా పాదము నిలుపు.

ఉన్నత శిఖరాలను అందుకోవాలని మహిమాయుక్త వెలుగును పట్టుకోవాలని అనుకుంటున్నాను;
   కాని ఇంకను ప్రార్ధిస్తున్నాను పరలోకము కనుగొను వరకు, "ప్రభూ, ఉన్నత స్థలమునకు నడిపించు."
ప్రభూ, నన్ను పైకెత్తు నిలబెట్టు, విశ్వాసము ద్వారా, పరలోక స్థలముపై,
   ఉన్నత వాయు వాహనము నేను కనుగొన్నాను; ప్రభూ, ఉన్నత స్థలముపై నా పాదము నిలుపు.
      ("ఉన్నత స్థలము" జాన్ సన్ ఓట్ మాన్, జూనియర్ చే, 1856-1926).
       (“Higher Ground” by Johnson Oatman, Jr., 1856-1926).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.