Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సువార్తీకరణ విస్పోటము

THE EVANGELISM EXPLOSION
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంకాలము, నవంబర్ 3, 2019

A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, November 3, 2019

"మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు: దేవుని వరమే: అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయ పడ వీలు లేదు" (ఎఫెస్సీయులకు 2:8, 9).


గత గురువారము రాత్రి మన సంఘంలో జరిగే ప్రార్ధన కూటమునకు వచ్చాను. నేను బోధించలేదు నడిపించలేదు. కాని నేను ఆవరానములో వెనుక కూర్చున్నప్పుడు నశించిపోయిన ఒక యవనస్తుడు గూర్చి గమనిక కలిగి యున్నాను. ఆరాధన అనంతరము అందరు వెళ్ళిపోయిన తరువాత అతనిని వచ్చి నా ప్రక్క కూర్చోమన్నాను.

నేను డాక్టర్ డి. జేమ్స్ కెన్నెడీ వ్రాసిన సువర్తీకరణ విస్పోటము చదువుతూ ఉన్నాను. కనుక డాక్టర్ కెన్నెడీ చెప్పింది ఈ యవనస్తునిపై ప్రయత్నించాలనుకున్నాను. అతనికి నేను చాలా సామాన్యముగా కనిపించాను. అతడు జీవితమంతా, మన గుడికి హాజరు అవుచున్నాడు. అతడు లెక్కింపలేనన్ని సువార్తిక సందేశాలు విన్నాడు. డాక్టర్ కెన్నెడీ సామాన్య తలంపులు ఇప్పటి వరకు ఎన్నో గొప్ప ప్రసంగాలు విన్న అతనికి ఎలా ఉపయోగపడ్డాయి? కాని, మనము చెప్పినదంతా అతడు రక్షింపబడడానికి సహాయ పడలేదు కాని నేననుకున్నాను డాక్టర్ కెన్నెడీ సామాన్య వివరణ అతనికి ఇవ్వాలనుకున్నాను.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఈ ప్రసంగము ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. వెళ్ళండి WWW.SERMONSFORTHEWORLD.COM.
ఆకుపచ్చ బటను నొక్కండి "యాప్" అనే పదము ఉన్న దానిపై. వచ్చే సూచనలను గైకొనండి.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

నేనతనితో చెప్పాను, "ఈరాత్రి చనిపోతే, పరలోక ద్వారము దగ్గర దేవుని ముందుకు వస్తే – దేవుడు నీతో ఇలా చెప్తే, ‘నేనెందుకు నిన్ను పరలోకములోనికి రానివ్వాలి?’ నీవు దేవునికి ఏమని జవాబిస్తావు?" అతడు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. తరువాత అన్నాడు, "నేను మంచి వాడనని దేవునితో చెప్తాను అని."

రోమా 6:23 చెప్తుంది, "దేవుని కృపావారము నిత్య జీవము." పరలోకము ఉచిత బహుమానము. అది సంపాదించినది కాదు లేక అర్హతతో వచ్చినది కాదు. నేనన్నాను, "నీవు ఏమి చేస్తావో అని చాలా సంవత్సరాలు అనుకుంటున్నాను. నేను మంచిగా ఉండాలి, నేను పరలోకాన్ని ‘సంపాదించుకొని’ దాని కొరకు పనిచేయాలి."

అతడు చెప్పినది నేను నమ్మలేకపోయాను. కనుక ప్రశ్న మళ్ళీ అడిగాను. "దేవుడు నీతో ఇలా చెప్తే, ‘నేను నిన్ను పరలోకములోనికి ఎందుకు రానివ్వాలి?’ నీవు దేవునితో ఏమి చెప్తావు?" ఈసారి అతని కళ్ళలో కన్నీరు చూసాను. కాని అదే జవాబు చెప్పాడు, "నేను మంచి బాలుడనని దేవునితో చెప్తాను." ఈ యవనస్తుడు జీవిత కాలమంతా మన గుడిలోనే ఉంటున్నాడు – ఆదివారము ఉదయము ఆదివారము రాత్రి, వారము మధ్య ప్రార్ధనా కూటాలలో ఉంటున్నాడు. అయినను అతని జవాబు తేటగా ఉంది – మంచి క్రియల ద్వారా రక్షణ అని అతడు నమ్మాడు. అతడు ఎఫెస్సీయులకు 2:8, 9 ని నమ్మలేదు!!!

నేను అతనిని తిట్టలేదు. నేనిలా అన్నాను, "కొన్ని నిమిషాలలో నేవేప్పుడు వినని గొప్ప వార్త నీకు చెప్తాను." తరువాత నా బైబిలులో ఎఫెస్సీయులకు 2:8, 9 అతనితో చదివించాను.

"మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు: దేవుని వరమే: అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయ పడ వీలు లేదు" (ఎఫెస్సీయులకు 2:8, 9).

తరువాత నేనన్నాను, "బైబిలులోని ఆ మాటలు దగ్గరగా చూద్దాం." అది ఇలా మొదలవుతుంది "కృప చేతనే మీరు రక్షింపబడియున్నారు." కృప బహుమానము, "అది దేవుని బహుమానము." పరలోకము బహుమానము – నిత్య జీవము బహుమానము. తరువాత రోమా 6:23లో రెండవ భాగము వివరించాను, "దేవుని కృపా వరము నిత్యజీవము." పరలోకము ఉచిత బహుమానము. అది సంపాదించినది కాదు అర్హత బట్టి వచ్చినది కాదు. తరువాత నేను చెప్పాను, "చాలా సంవత్సరాలు నీవేమి చేస్తావని నేను ఆలోచించాను. నేను మంచిగా ఉండాలి, పరలోకము ‘సంపాదించుకోవడానికి’ మరియు దాని కొరకు పని చెయ్యాలి. చివరకు నేను తెలుసుకున్నాను పరలోకము ఉచిత బహుమానము అని – పూర్తిగా ఉచితమని! అది నన్ను ఆశ్చర్య పరిచింది! బైబిలు చెప్తుంది, ‘మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు – ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయ పడ వీలులేదు’ (ఎఫెస్సీయులకు 2:8, 9)."

తరువాత నేనతనితో చెప్పాను "అందరును పాపము చేసి, దేవుని మహిమను పొందలేక పోవుచున్నారు" (రోమా 3:23). మనము మన మాటలలో, తలంపులలో క్రియల్లో పాపము చేసాము. పరలోకము పొందుకోవడానికి మనమెవ్వరము మంచి వారము కాము. మనము పరిపూర్ణులుగా ఉండలేము.

కాని దేవుడు కృపగలవాడు. మనలను శిక్షించాలని ఆయన ఇష్టపడడం లేదు. కాని దేవుడు న్యాయవంతుడు కూడ –కనుక ఆయన పాపాన్ని తప్పక శిక్షిస్తాడు. ఆయన జ్ఞానములో దేవుడు పరిష్కారము చూసాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి, మనలను రక్షించడానికి ఆయన కుమారుడైన, యేసును పంపాడు. యేసు ఎవరు? యేసు దైవ మానవుడు. బైబిలు ప్రకారము, యేసు క్రీస్తు దేవుడు, త్రిత్వములో రెండవ వ్యక్తి. బైబిలు చెప్తుంది యేసు "శరీర ధారియై, మన మధ్య నివసించెను" (యోహాను 1:1, 14). యేసు, దైవ మానవుడు, సిలువపై మరణించి మృతులలో నుండి లేచి మన పాప పరిహారము చెల్లించి పరలోకములో నిత్య జీవము ఇచ్చాడు. యేసు సిలువపై, మన పాపము మోసాడు. క్రీస్తు "తన స్వంత శరీరములో మన పాపములను భరించెను" (I పేతురు 2:24). ఆయన సమాధిలో మూడు రోజులు ఉన్నాడు. కాని మృతులలో నుండి లేచి పరలోకానికి వెళ్లి, మన కొరకు స్థలము సిద్ధ పరిచాడు. యేసు పరలోకము నిత్య జీవము అనుగ్రహిస్తాడు – ఉచిత బహుమానముగా. దాని మనము ఎలా పొందుకుంటాము? విశ్వాసము ద్వారా ఆ బహుమానము అందుకొంటాము! "విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడియున్నారు" (ఎఫెస్సీయులకు 2:8).

యేసు నందలి విశ్వాసము పరలోకానికి ద్వారము తెరుస్తుంది. విశ్వాసము తెలివితో కూడిన సమ్మతి కాదు. సాతాను దెయ్యములు కూడ యేసు దేవత్వమును నమ్ముతాయి. కాని అవి రక్షింపబడలేదు. విశ్వాసము అంటే జీవితములో విషయాలు పొందుకోవడం కాదు –ఆరోగ్యము, డబ్బు, సంరక్షణ నడిపింపు లాంటివి – అవన్నీ అంతరించి పోతాయి.

విశ్వాసము, బైబిలు ప్రకారము, యేసును మాత్రమే నమ్ముట. మనలను పరలోకానికి తీసుకెళ్ళడానికి క్రీస్తు వచ్చాడు, మనకు నిత్య జీవము ఉండునట్లు! బైబిలు చెప్తుంది, "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31).

ప్రజలు రెండు నమ్ముతారు – వారిని వారు నమ్ముతారు లేక యేసు క్రీస్తును నమ్ముతారు. మంచి జీవితమూ కొరకు నా స్వంత ప్రయత్నాలను నమ్మేవాడిని. తరువాత గ్రహించిన నన్ను నమ్ముకోవడం మాని, యేసును నమ్మాలని. నేనలా చేసాను – యేసు నాకు నిత్య జీవపు బహుమానము ఇచ్చాడు. అది బహుమానము, "క్రియల మూలముగా కాదు."

అది ఎలా పరిచేస్తుందో ఈ కుర్చీ సహాయముతో చూపిస్తాను. మీరు దీనిపై కూర్చుంటే, ఈ కుర్చీ ఆగుతుందని మీరు నమ్ముతారా? (అవును).

కాని అది నన్ను కాయడం లేదు – ఎందుకంటే నేను దానిపై కూర్చోలేదు కాబట్టి. నేను కుర్చీని నమ్ముతానని ఎలా ఋజువు చేయగలను? దానిపై కూర్చోవడం, ద్వారానే కదా!

యేసుతో అదే మనము చేయాలి. పరలోకానికి వెళ్ళడానికి మీరు ఆయనపై ఆధారపడాలి. నీవు అన్నావు, "నేను మంచి బాలుడనని దేవునితో చెప్తాను అని." నీ జవాబులో వ్యక్తి ఎవరు? (నీవే).

మీరలా చెప్తున్నప్పుడు పరలోకానికి ఎవరు తీసుకెలతారని నమ్ముతున్నారు? (అవును, మీరే).

నిత్య జీవము పొందుకోవడానికి మిమ్ములను మీరు నమ్ముకోవడం మాని, యేసును నమ్మాలి. (ఖాళీ కుర్చీల కూర్చోవడం).

అది మీకు గ్రహింపు ఇస్తుందా? ఇప్పుడు దేవుడు మిమ్మును అడుగుచున్న ప్రశ్న ఇది – "ఇప్పుడే నిత్యజీవము బహుమానము పొందుకోవాలని మీరు ఇష్ట పడుచున్నారా?" (అవును, ఇష్ట పడుచున్నాను).

ఇప్పుడు నేను ప్రార్ధిస్తాను, "ఇప్పుడే నా స్నేహితునికి నిత్యజీవము బహుమానము ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను."

ఇప్పుడు, యేసు ఇక్కడ ఉన్నాడు, ఆయన మిమ్ములను వింటున్నాడు. మీకు నిజంగా నిత్యజీవము కావాలని యేసుతో మీరు చెప్పాలని ఆశ పడుచున్నాను. నేను చెప్పే మాటలు చెప్పండి, కాని వాటిని యేసుతో చెప్పండి,

"యేసు, ఇప్పుడే నేను నిన్ను నమ్మాలనుకుంటున్నాను. నేను పాపిని. ఇంతకాలము నేను నన్ను నా మంచితనాన్ని నమ్ముతూ వచ్చాను. ఇప్పుడు నేను యేసు ప్రభూ, నిన్ను విశ్వసించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడే నిన్ను నమ్ముతాను. నీవు నా పాపాలకు పరిహారం చెల్లించదానికి చనిపోయావని నమ్ముతాను. యేసు ప్రభూ, నిన్ను విశ్వసించాలనుకుంటున్నాను. నేను నా మంచితనం నుండి మరియు పాపాల నుండి వైదొలుగుతాను. నేను నిన్ను విశ్వసిస్తాను. ఉచిత పరలోక రాజ్య బహుమానాన్ని అంగీకరిస్తున్నాను. యేసు మీ నామములో ప్రార్ధిస్తున్నాను. ఆమెన్."

ఇప్పుడు, నేను మీ కొరకు ప్రార్ధిస్తాను. "యేసు, నా స్నేహితుడు చేసిన ప్రార్ధన మీరు విన్నారు. తన ఆత్మలో ఈ మాటలు వినాలని నేను ప్రార్ధిస్తున్నాను, స్వరము పలుకుతుంది, ‘నీ పాపములు క్షమించబడినవి.’ ‘నా యందు విశ్వాసము ఉంచు వాడు, నశింపక నిత్యజీవము పొందును.’ యేసు’ నామమున ప్రార్ధిస్తున్నాను, ఆమెన్."

ఇప్పుడు మీరు యోహాను 6:47 గట్టిగా చదవండి.

"విశ్వసించువాడే నిత్యజీవము కలవాడు, నేను మీతో చెప్పుచున్నాను."

భావన కొరకు చూడకండి. విశ్వాసముతో యేసు క్రీస్తు నందు నమ్మిక యుంచారు. అవునా?

రక్షణ కొరకు ఇప్పుడు ఎవరిని నమ్ముతారు? (యేసు క్రీస్తు).

రక్షించే విశ్వాసమనగా నిత్య రక్షణ కొరకు యేసును నమ్ముట. అదే నా ఇప్పుడు మీరు చేసారు? (అవును).

యేసు అన్నాడు అలా చేసినవాడు నిత్యజీవము గలవాడు. అదే నా మీరు ఇప్పుడు చేసింది? (అవును).

ఇప్పుడు, ఈ రాత్రి నిద్రలో మీరు చనిపోతే దేవుడు మిమ్ములను ఎందుకు మిమ్ములను పరలోకములో ప్రవేశించనివ్వాలని అడిగితే, మీరు ఏమి చెప్తాను? (నిత్యజీవము కొరకు నేను యేసును నమ్ముచున్నాను).

స్నేహితుడా, ఇప్పుడు మీరు ప్రార్ధించింది నిజంగా మీరు నమ్మితే, యేసు మీ పాపాలు క్షమించాడు, ఇప్పుడే మీరు నిత్యజీవము పొందుకున్నారు!

యోహాను సువార్త రోజుకు, ఒక అధ్యాయము చొప్పున చదవండి. యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉన్నాయి. రోజుకో అధ్యాయము చదివితే, యోహాను సువార్త మూడు వారాల్లో చదివేస్తారు.

ఈ రాత్రి జరిగినది ఒక వ్యక్తికి చెప్పాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరై ఉండవచ్చు? (నా సహోదరుడు).

మీరు అతనితో చెప్తారా ఈ రాత్రి మీరు యేసును విశ్వసించారని?(అవును).

ఇప్పుడు, నేను నిమ్మును తీసికొని వచ్చే ఆదివారము నాతోపాటు గుడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నేను మిమ్మును ఆదివారము ఉదయము గుడికి తీసుకెళ్ళవచ్చు? (అవును). దానికంటే ముందు మాట్లాడాలనుకుంటే, ఫోను చెయ్యండి. అది నా ఫోను నంబరు.

ఇప్పుడు, ఒక క్షణం, మనం యేసుకు వందనాలు చెల్లిద్దాం మీ ఆత్మలను రక్షించినందుకు మీకు నిత్యజీవము ఇచ్చినందుకు? (ప్రార్ధించండి).

ఇప్పుడు, మీరు ఎఫెస్సీయులకు 2:8, 9 గట్టిగా చదవండి.

"మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింప బడియున్నారు; ఇది మీ వలన కలిగినవి కాదు: దేవుని వరమే: అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలులేదు" (ఎఫెస్సీయులకు 2:8, 9).

ఈ పద్ధతి ద్వారా ప్రపంచములో వేలాది మంది నిజంగా మార్పు నొందారు అని గుర్తించుకోండి. వారికి ఇంకా నమ్మిక లేకపోతే, ఈ కూటము ముఖముపై నవ్వుతో ముగించి, దయచేసి యోహాను సువార్త రోజుకొక అధ్యాయము చొప్పున చదవండి. వారితో మాట్లాడడానికి మరియొక అవకాశము మీకు ఉంటుంది.

ఈ ప్రసంగాన్ని మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళండి. తలంపులు పుట్టే వరకు ఇది బాగా చదవండి. స్నేహితునిపై గాని బంధువుపై గాని నేరుగా ఇది ప్రయోగించండి. మీరు ఆశ్చర్యపోవచ్చు వారికి ఆసక్తి కలుగుతుంది వారు మీతో పాటు గుడికి వస్తారు!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.