Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
బైబిలు ప్రవచనములో తప్పిపోయిన భాగము
ఈనాడు మనకు ప్రత్యక్ష పరచబడియున్నది

A MISSING PIECE OF BIBLE PROPHECY
ILLUMINATED FOR US TODAY
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంకాలము, సెప్టెంబర్ 22, 2019
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, September 22, 2019

"దానియేలు, నీవు, ఈ మాటలను మరుగు చేసి, అంత్యకాలము వరకు, ఈ గ్రంధమును ముద్రింపుము..." (దానియేలు 12:4; పేజీ 919 స్కఫీల్డ్).

"నేను వాటిని వింటిని, గాని గ్రహింప లేకపోతిని: నా యేలినవాడా, వీటికి అంతమేమని నేనడుగగా, అతడు ఈ సంగాట్లు అంత్య కాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి? మరియు ఆయన చెప్పాడు, గనుక, దానియేలు: నీవు ఊరకుండు మని చెప్పెను" (దానియేలు 12:8, 9; పేజీ 920).


"అంత్యకాలము " వివరాలు ప్రవక్త దానియేలుకు అర్ధము కాలేదు. 8 వ వచనములో, మనకు చెప్పబడింది, "నేను వింటిని, గాని గ్రహింపలేకపోతిని." తరువాత దేవుడు దానియేలుకు ఇలా చెప్పాడు, "ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి" (దానియేలు 12:9).

ప్రవచనములోని మాటలు దానియేలుకర్ధమయ్యాయి. కాని అంత్య కాలపు సంఘటనలు ఎలా ఉంటాయి అతనికి అర్ధము కాలేదు. "ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి" (దానియేలు 12:9). ప్రేరేపణ ద్వారా అతనికి మాటలు ఇవ్వబడ్డాయి. కాని వాటి అర్ధము అతనికి ప్రత్యక్షము కాలేదు. "అంత్యకాలము" వరకు పదములు అర్ధము ప్రత్యక్ష పరచబడదు. మనము యుగాంతమును సమీపిస్తూ ఉండగా, ప్రవచనములో లోతైన అర్ధము దాగి ఉన్నది.

నేను "ఎత్తబడుట" అను పదాన్ని మొదటిగా ఎప్పుడు విన్నానో నాకు తేటగా గుర్తు ఉంది. నా బోధకుడు మాకు చెప్పాడు ఏడు సంవత్సరాల శ్రమ కాలమునకు ముందు ఎత్తబడుట జరుగుతుందని. నా బోధకుని అడిగాను శ్రమల ముందు ఎత్తబడుట జరుగుతుందని బైబిలు ఎక్కవ బోధిస్తుందని. అతడు జవాబివ్వలేకపోయాడు. అలా, దశాబ్దాలుగా "ఎప్పుడైనా" ఎత్తబడుటను, ప్రశ్నిస్తూ ఉన్నాను. తరువాత శ్రమల ముందు ఎత్తబడుట జె. ఎన్. డార్బీ ప్రసిద్ది చెందించాడు, మరియు ఆయన మార్గరెట్ మెక్ డోనాల్డ్ అనే 15 సంవత్సరాల అమ్మాయి నుండి "పొందుకున్నాడు", ఆ అమ్మాయి "కలలో" చూసింది. జె. ఎన్. డార్బీ అది ప్రకటించడం ప్రారంభించాడు. తరువాత అది స్కఫీల్డ్ బైబిలులో సి. ఇ. స్కోఫీల్డ్ దానిని పొందుపరిచాడు. నూతన సువార్తికులలో చాలా మందిది అదే పరిస్థితి.

తరువాత మార్విన్ జె. రోసేంతల్ ఉగ్రతకు ముందు సంఘము ఎత్తబడుట అను పుస్తకము వ్రాసాడు (థామస్ నెల్ సన్ 1990). రోసెంతల్ వ్రాసిన దంతటితో నేను అంగీకరించనప్పటికీ, "ఎత్తబడుట" ఎప్పుడు జరుగుతుంది దానిపై మెరుగైన అవగాహనకు ద్వారము తెరచాడు. రోసెంతల్ అభిప్రాయాన్ని విమర్శించే ముందు అతని పుస్తకము జాగ్రత్తగా చదవండి. అతడు ఏమి బోధించాడు "ఎత్తబడుట" అనేది శ్రమల కాలము తరువాత సంభవిస్తుందని, "తీర్పులో" దేవుడు తన ఉగ్రతను క్రుమ్మరింపక ముందు, ప్రకటన 16 అధ్యాయము ఆధారముగా. దానిలో కొంత అర్ధము ఉంది – ఒక యవనస్తురాలి కళను మించిన అర్ధము ఇక్కడ ఉంది!

ఎందుకు ఇది ప్రాముఖ్యము? ఎందుకో చెప్తాను. ఏడు సంవత్సరాల శ్రమల కాలము ముందు ఎత్తబడుట జరిగితే, క్రైస్తవులు ఏమి చేయ్యనక్కర లేదు. ఆదివారము ఉదయము ఒక గంట జనాలతో వెళ్ళాలి! మీరు ఆత్మలను రక్షింపనక్కరలేదు. దైవ భక్తీ లేని వారి నుండి మిమ్ములను వేరు పరచుకోనక్కర లేదు. ఇది మతదూరత్వమునకు దాని తీస్తుంది (చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి).

ఈ ప్రసంగము శీర్షిక, "బైబిలు ప్రవచనములో తప్పిపోయిన భాగము ఈనాడు మనకు ప్రత్యక్ష పరచబడియున్నది." ఆ "తప్పిపోయిన భాగము ఏంటి?" అది "స్వధర్మత్యాగము." 50 సంవత్సరాలకు పైగా నేను బైబిలు ప్రవచనము చదువుచున్నాను. అంత ప్రాముఖ్యమైన "స్వధర్మ త్యాగము" మన కాలములో నిర్లక్ష్యము చేయబడుట నాకు వింతగా అనిపిస్తుంది. బైబిలు ప్రవచనముపై నా దగ్గర మూడు ప్రాముఖ్య పుస్తకాలు ఉన్నాయి – ప్రాముఖ్య విషయాలన్నీ అందులో చెప్పబడ్డాయి. అవి మంచి దైవజనులచే వ్రాయబడ్డాయి, ఈ విషయముపై వారు నమ్మదగిన వారు. కాని వారిలో ఒక్కరు కూడ "స్వధర్మ త్యాగము" ప్రస్తావించలేదు. మరియు "స్వధర్మత్యాగము" ఈనాడు మనకు చాలా ప్రాముఖ్యమైనది.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఈ ప్రసంగము ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. వెళ్ళండి WWW.SERMONSFORTHEWORLD.COM.
ఆకుపచ్చ బటను నొక్కండి "యాప్" అనే పదము ఉన్న దానిపై. వచ్చే సూచనలను గైకొనండి.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

"దయచేసి II దెస్సలోనీకయులకు 2:3 చూడండి. కింగ్ జేమ్స్ తర్జుమాలో ఉంది,

"ఎవరూ మిమ్మల్ని మోసం చేయరు అనగా: మొదట భ్రష్టత్వము సంభవించి, నాశన పాత్రుడగు పాప పురుషుడు, బయలుపడి తేనే, గాని ఆ దినము రాదు" (II దెస్సలోనీకయులకు 2:3; పేజీ 1272 స్కఫీల్డ్).

ఆ వచనము, కొత్త అమెరికాను ప్రమాణ బైబిలులో ఇలా తర్జుమా చేయబడినది,

"ఎవరును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, [ప్రభువు దినము] స్వధర్మ త్యాగమునకు ముందు రాదు, పాప పురుషుడు, న్యాయము లేని మనిషి ముందు ప్రత్యక్షమగును" (II దెస్సలోనీకయులకు 2:3; ఎన్ఏఎస్ బి NASB).

"స్వధర్మ త్యాగము" అను పదము "హి అపోష్టాషియ" నుండి అనువదింపబడినది. కింగ్ జేమ్స్ అనువాదములో "పడిపోవుట" అని తర్జుమా చేయబడినది.

డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ లూస్ వెళ్ళి కెన్ టక్కీలో ఉన్న, దక్షిణ బాప్టిస్టు వేదాంత కళాశాల నుండి వేదాంత విద్య పట్టా పొందాడు. డాక్టర్ క్రీస్ వెల్ నూతన నిబంధనలోని గ్రీకు పదాలపై ఎక్కువ దృష్టి సారించాడు. డాక్టర్ క్రీస్ వెల్ అన్నాడు, "ప్రభువు దినమునకు ముందు, విశ్వాసము పడిపోవుట సంభవిస్తుంది. [అతడు] అనే పదము పౌలు మనసులో ఒక ప్రత్యేక స్వధర్మ త్యాగము ఉంది." ఇది తెలిసి, మనము రెండు ప్రాముఖ్య విషయాలు II దెస్సలోనీకయులకు 2:3 నుండి నేర్చుకుంటాము,


1. ప్రభువుదినమునకు ముందు, ఈ స్వధర్మ త్యాగము చోటు చేసుకుంటుంది.

2. ప్రభువు దినమునకు ముందు, అంత్య క్రీస్తు "బయలు పరచబడతాడు."


ఈరెండు విషయాలు ప్రభువు దినమునకు ముందు సంభవిస్తాయి, శ్రమల కాలము దేవుని ఉగ్రత, మరియు యుగాంతములో సంభవిస్తాయి. శ్రమల ముందు ఎత్తబడుట క్రైస్తవులు ఇప్పటికే గ్రహించారు. అందుకే "స్వధర్మ త్యాగము" ఈనాడు సువార్తిక క్రైస్తవులకు బోధింపబడుట లేదు, అందుకే "స్వధర్మ త్యాగము" పై బైబిలులో చాలా గ్రంథములో వ్రాయబడలేదు!

కాని మార్విన్ రోసెంతల్ సరిగానే చెప్పితే, మరియు అతడు సరియే, అప్పుడు మనము ఇప్పుడు "స్వధర్మ త్యాగము"! ప్రారంభములో ఎలా ప్రభావితము చేస్తుంది? "మూడవ ప్రపంచములో" మునుపెన్నడూ లేనంత ఎక్కువగా వారు హింసింపబడుతున్నారు. "పాశ్చాత్య ప్రపంచములో" మనము సాతాను అతని దెయ్యములతో ఎక్కువగా బాధింపబడుతున్నాము. దానియేలుకు ఈ విషయాలు చెప్పబడ్డాయి, కాని అతడు అన్నాడు, "నేను గ్రహింపలేను." దేవుడు దానియేలుతో అన్నాడు, "ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి" (దానియేలు 12:8, 9).

జాన్ ఎస్. డికర్ సన్ ఒక మంచి పుస్తకము వ్రాసాడు దాని శీర్షిక, గొప్ప సువార్తిక మాంద్యము (బేకర్ బుక్స్, 2013). డికర్ సన్ గాబె లైయాన్స్ ను ప్రస్తావిస్తూ, ఇలా చెప్పాడు,

"చరిత్రలో ఇలాంటి సమయము మునుపెన్నడూ లేదు. దీని విశిష్ట మూల స్పందన కావాలి. మనము వేరే మార్గము ఇవ్వడములో విఫలమయితే, మనము తరమును సానుభూతికి [అప్పగిస్తాం]...మన స్నేహితులు ఇతర ఆరాధనల [కు] మరలిపోతారు...తక్కువ సమయము, కాని ఎక్కువ ఆకర్షనీయం (The Next Christians, Doubleday, 2010, p. 11; emphasis mine).

డికర్ సన్ పుస్తకములో ముందు మాట ఇలా చెప్తుంది,

"అమెరికాను సంఘము...క్షీణించి పోతుంది. యవన క్రైస్తవులు ఎగిరిపోతున్నారు. మన విరాళములు అంతరించి పోతున్నాయి... అమెరికా సంస్కృతి త్వరగా విరుద్ధ మవుతుంది. మనము దారుణ పతనమును ఎలా తప్పించుకోగలము?"

జాన్ డికర్ సన్ పుస్తకములో మొదటి సగ భాగము నాకు ప్రీతి పత్రము, కాని చివరి భాగము ఎలా సిద్ధ పడాలి అనే దానిపై, నేను అంగీకరించను.

సిద్ధపడడానికి మనం గ్రహించాలి, మనము ఇప్పుడు, "స్వధర్మ త్యాగము" నకు ప్రారంభములో ఉన్నామని. ఎక్కువ శ్రమ లేకుండా మనము ఎత్తబడుతాము అని అనుకుంటే, తరువాత సంభవించే దానికి మనము సిద్ధపడము.

కాపరి రిచర్డ్ వార్మ్ బ్రాండ్ సువార్త పరిచారకుడు 14 సంవత్సరాలు కమ్యూనిస్టు చెరసాలలో ఉన్నాడు, రొమేనియాలో క్రీస్తు కొరకు చిత్ర హింసలను అనుభవించాడు. అమెరికాలో క్రైస్తవులు అనుభవించిన శ్రమలకంటే అతీతంగా అతడు చెరసాలలో శ్రమలను అనుభవించాడు. చెరసాలలో ఎలుకలు అతని పాదములు తినేశాయి. అతడు కొట్టబడ్డాడు. అతని శరీరము మెడ భయంకరముగా గుచ్చబడ్డాయి. మరణ పర్వంతము అతడు మాడ్చబడ్డాడు. అలా 14 సంవత్సరాలు భయకంపితుడయ్యాడు. ఇది పాస్టరు వార్మ్ బ్రాండ్ ను శ్రమల సిద్ధాంతము "శ్రమీయమును," కనుగొనడానికి దారితీసింది. అతడు (అద్భుతంగా) అమెరికా వచ్చినప్పుడు చాలా సంఘాలలో శ్రమల కొరకు ఎలా సిద్ధపడాలి అని బోధించాడు – మన సంఘములో కూడ. కాపరి వార్మ్ బ్రాండ్ అమెరికాలో క్రైస్తవులు శ్రమ పడుటకు సిద్ధంగా ఉన్న్డాలి అని నేర్పించాడు. అతనన్నాడు, "ఇప్పుడు మనము సిద్ధ పాటు చేసుకోవాలి, మనము చెరసాలకు వెళ్ళకముందు. చెరసాలలో మీరు సమస్తము కోల్పోతాము...జీవితాన్ని ఆనందంగా ఉంచేది ఏమి మిగలదు. జీవిత భోగాలు వదిలి పెట్టలేని వాడు ఆ శ్రమలు తట్టుకోలేడు" (quoted by John Piper in Let the Nations Be Glad, Baker Books, 2020, p. 10).

డాక్టర్ పాల్ నిక్విష్ట్ ఇలా చెప్పాడు, "సిద్ధంగా ఉండండి. సాంస్కృతిక మార్పులు మన దేశాన్ని తుడిచేస్తున్నాయి, కనుక బైబిలు చెప్పిన ప్రకారము జీవించడానికి సవాలుగా ఉండాలి...శ్రమలలో స్పందించాలి" (J. Paul Nyquist, Prepare: Living Your Faith in an Increasingly Hostile Culture, Moody Publishers, 2015, p. 14).

నోవాహు దినములు స్వధర్మ త్యాగమునకు చెందినవి

యేసు చెప్పాడు,

"[నోవాహు] దినములు ఎలాగుండెనో, మనష్య కుమారుడు రాకడ ముందు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందు దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు పెండ్లి కిచ్చుచు, నుండి జల ప్రళయము వచ్చి, [నోవాహు] అందరు ఓడలోనికి కొట్టుకొని పోవు వరకు, ఎరుగక పోయిరి; అలాగునే మనష్యు కుమారుని రాకడ ఉండును" (మత్తయి 24:37-39; పేజీ 1034).

చాలా మంది సువర్తికులు అనుకుంటారు నోవాహు దినములు అంటే గొప్ప శ్రమల కాలమని. కాని ఇంకా ఉంది. నోవాహు దినములలో ప్రజలు "తినుచు త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు పెండ్లి కిచ్చుచు, నోవాహు ఓడలోనికి వెళ్ళు వరకు ఆలాగు చేయు చుండిరి" (మత్తయి 24:38).

అమెరికా పాశ్చాత్య ప్రపంచము ఇలానే జరుగుతుంది! "మూడవ ప్రపంచములో" చాలా శ్రమలు ఉన్నాయి. చైనాలో ఉజ్జీవము కూడ ఉంది. కాని అమెరికా పాశ్చాత్యములో అలా కాదు! ఇక్కడ ప్రజలు భౌతిక వాదాన్ని కలిగియున్నారు. వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు పెండ్లి కిచ్చుకొనుచున్నారు. ఇవి మామూలు విషయాలుగా అనిపిస్తున్నాయి. కాని ఇంకా ఉంది. ఇది వారి జీవితాలలో కేంద్ర బిందువు – "తినుట త్రాగుట, పెండ్లి చేసుకొనుట పెండ్లి కిచ్చుకొనుట." జీవించడానికి ఇవి అవసరము అని వారు అనుకుంటున్నారు! వారి జీవితాలలో దేవుడు కేంద్ర బిందువు కాదు! భౌతిక విషయాలు వారికి చాలా ప్రాముఖ్యంగా భావిస్తున్నారు!

లవోదికయ సంఘము అమెరికా పాశ్చాత్య దేశాలలోనికి
సంఘాలకు ప్రతిబింబముగా ఉంది

యేసు చెప్పాడు,

"లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము; ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు, చెప్పు సంగతులేవనగా; నీక్రియలను నేనెరుగుదును, నీవు చల్లగా నైనను వెచ్చగానైనను లేవు: నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను, చల్లగానైనను ఉండక, నులి వెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నానోలు నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసియున్నాను, నాకేమియు, కొదువలేదని చెప్పుకొనుచున్నావు; నీవు ధనవృద్ధి చేసికొనినట్లు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడను, దరిద్రుడను, గ్రుడ్డి వాడవును దిగంబరుడవై యున్నాను: అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, చాలా గొప్పగా ఉండును; మరియు నీదిసమోల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకోనుటకు తెల్లని వస్త్రమునలను, నీకు దృష్టి కలుగునట్లు; నీ కన్నులకు కాటుకను నా యొద్దకొనమని, నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరిని, గద్దించి శిక్షించుచున్నాను: కనుక నీవు ఆశక్తి కలిగి, మారు మనస్సు పొందుము" (ప్రకటన 3:14-19; పేజీ 1334).

ఇది మత భ్రష్ట సంఘమునకు ప్రతిబింబము. ఈ సంఘము నులివెచ్చనగా ఉంది, "చల్లగానైనను వెచ్చగానైనను ఉండక" (ప్రకటన 3:16). ఈ సంఘము మారని ప్రజలతో నింపబడియున్నది (ప్రకటన 3:17). ఈ సంఘము పశ్చాత్తాప పడడానికి నిరాకరించింది (ప్రకటన 3:19).

గత 40 సంవత్సరాలలో మనము రెండు పెద్ద సంఘ చీలికలు చూసాం. రెండుసార్లు "నులివెచ్చన" గా ఉన్నవారు వెళ్ళిపోయారు. వారు ఆత్మల సంపాదనలో "నులివెచ్చన" గా ఉన్నారు. వారు తీవ్ర క్రైస్తవ్యమును తిరస్కరించారు. మనల నుండి, వారు వెళ్ళిపోవడానికి కారణము, మనము "చాలా కచ్చితము" గా ఉండడం మరియు మనలను విడిచి వెళ్తే వారు ఎక్కువ "వినోదము" పొందుకుంటారు అని అనుకున్నారు. "అగ్ని" తో ఉండే సంఘాన్ని వారు పోగొట్టుకున్నారు. వారు వారి ప్రజలు నులివెచ్చని స్థితితో ఉండకూడదనే విషయాన్ని (చాలా ఆలస్యము)గా తెలుసుకున్నారు. చివరకు వారు విఫలులయ్యారు. యేసు చెప్పాడు, "నేను నానోట నుండి మీపై [ఉమ్మి] వేయనుద్దేశించుచున్నాను" (ప్రకటన 3:16). వారు లోకము నుండి వేరవడానికి ఇష్ట పడలేదు, కాబట్టి వారు లోకము, శరీరము, సాతానుచే కబలించబడ్డారు. వారు సైనిక ప్రాధమికంగా ఉండడం ఇష్టపడలేదు, కనుక వారు త్వరగా నులివెచ్చని కొత్త సువార్తికులైనారు! ఆత్మీయంగా వారు త్వరగా సగటు జీవులైనారు – లేక ఇంకా అధ్వానముగా!

మిమ్ములను మీరు అడుగుకోండి. చాన్ ను విడిచి పెట్టి వెళ్ళిన వారు చైనాలోనే ఉండి ఉంటే, వారు సొరంగము గుడిలో ఉండేవారా, లేక వారు కమ్యూనిస్టు "స్వతంత్ర సంఘాలకు" వెళ్ళేవారా? మీకు జవాబు తెలుసు! మీకు ఇప్పటికే జవాబు తెలుసు! వారు కమ్యూనిస్టు గుడికి తప్పక వెళ్ళేవారు. ఎందుకు? ఎందుకంటే వారికి నిజ క్రైస్తవ్యము అక్కరలేదు. వారి నోళ్ళు సుకుమార, నూతన సువార్తిక "సంఘము" కొరకు ఆకలిగొని ఉన్నాయి. అదే చాన్ వారికి ఇచ్చాడు! సుకుమార, కొత్త సువార్తిక "సంఘము." మీకు అది తెలుసు! మీకు ఇప్పటికే తెలుసు!!! కొత్తదేమీ నేను మీకు చెప్పడం లేదు!!!

నేను ఈ ప్రసంగాన్ని నేటి నూతన సువార్తిక సంఘాలలోని మత భ్రష్టత్వము రెండు వివరణతో ముగిస్తాను,

"అంత్య దినములలో, అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఎలాగనగా మనష్యులు స్వార్ధ ప్రియులు, ధనపేక్షులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు; పైకి భక్తీ గలవారి వలే ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు: ఇట్టి వారికి విముఖుడవై యుండుము" (II తిమోతి 3:1-5, పేజీలు 1280, 1281).

"ఎల్లప్పుడును నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందరు" (II తిమోతి 3:7; పేజీ 1281).

"అవును, మరియు క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించు వారందరూ హింస పొందుదురు" (II తిమోతి 3:12; పేజీ 1281).

"వాక్యమును ప్రకటించుము; సమయమందును, అసనమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుము గడ్డించుము, బుద్ధి చెప్పుము. వారు ధ్వని సిద్ధాంతాన్ని భరించలేని సమయం వస్తుంది; కాని జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై యుందురు; తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుచేసుకొని, సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపు తిరుగుకాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో, మితముగా ఉండుము, శ్రమ పడుము సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము" (II తిమోతి 4:2-5; పేజీ 1281).

"దేమా ఈ లోకమును స్నేహించి, నన్ను విడిచి వెళ్ళెను" (II తిమోతి 4:10; పేజీ 1281).

"సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా, భేదములను ఆటంకములను కలుగచేయు వారిని కనిపెట్టి యుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను; దారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక, తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు" (రోమా 16:17, 18; పేజీ 1210).

నా ప్రియ సహోదరీ సహోదరులారా, గొప్ప ప్రవక్త దానియేలు ఈ రాత్రి నేను మీకు బోధించిన విషయాలను పూర్తిగా గ్రహించలేదు. దేవునికి వందనాలు ఆయన ఒక మిస్సెనరీ మార్విన్ రోసెంతల్ ను తయారు చేసాడు ఆయన "ఎత్తబడుటను గూర్చిన కొత్త అవగాహన మనకు ఇచ్చాడు. యేసు యొక్క శ్రమలు మరియు రెండవ రాకడ" (jacket cover of The Pre-Wrath Rapture of the Church, Thomas Nelson, 1990).

అవును, మనము అంత్యకాలపు మత భ్రష్టత్వపు ప్రారంభ దశలో ఉన్నాము. అవును, మనము కూడ శ్రమల ద్వారా వెళ్ళాలి, చైనా ప్రజల వలే, రిచర్డ్ వార్మ్ బ్రాండ్ వలే, "మూడవ ప్రపంచపు" ప్రజల వలే. కాని క్రీస్తును ప్రేమించు వారు అంతములో ఉత్సాహిస్తారు, యేసు ఇలా చెప్పాడు,

"నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి, గనుక భూనివాసులను శోదించుటకు, లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో, నేనును నిన్ను కాపాడెదను. చూడండి, నేను త్వరగా వచ్చుచున్నాను: ఎవడును నీ కిరీటమును అపహరించ కుండునట్లు, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నడును వెలుపలికి పోడు: మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యెద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యేరూషలేమును, నా దేవుని పట్టణము పేరును వ్రాసెదను: నా కొత్త పేరును దాని మీద వ్రాసెదను. సంఘములలో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినును గాక" (ప్రకటన 3:10-13; పేజీ 1334).

దయచేసి నిలబడి "నేను క్రీస్తు సైనికుడనా?" అనే పాటలో 1, 2 మరియు 4 చరణములు పాడదాం.

నేను సిలువ సైనికుడను, గొర్రె పిల్లను వెంబడించువాడను,
ఆయనను ధరించుటకు భయపడుదునా, లేక ఆయన నామమును మాట్లాడుటకు సిగ్గుపడుదునా?

నేను పూల పాన్పు మీద విశ్రాంతి తీసుకొనుటకు ఆకాశమునకు కొనిపోబడుదును,
ఇతరులు బహుమానము కొరకు పోట్లాడుదురు, భయంకర సముద్రముల గుండా ప్రయాణిస్తారు?

నేను తప్పక పోరాడాలి, పరిపాలించడానికి; నా ధైర్యమును పెంచు, ప్రభూ;
నేను కష్టాన్ని భరిస్తాను, నొప్పిని తాలుకుంటాను, మీ వాక్యముచే బలపరచబడతాను.
   ("నేను క్రీస్తు సైనికుడను?" డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748).
   (“Am I a Soldier of the Cross?” by Dr. Isaac Watts, 1674-1748).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.