Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
అబద్దపు క్రైస్తవుడు కనుగొనబడ్డాడు!

THE FALSE CHRISTIAN DISCOVERED!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము ఉదయము, జూలై 7, 2019
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, July 7, 2019

"ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును, పరలోక రాజ్యములో ప్రవేశింపడు; గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు, నన్ను చూచి ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున దెయ్యములు వెళ్ళగొట్ట లేదా? మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు? అప్పుడు నేను మిమ్మును, ఎన్నడును ఎరుగును: అక్రమము చేయు వారలారా, నా యెద్ద నుండి పొండని వారితో చెప్పుదును" (మత్తయి 7:21-23).


నేను నా పాఠ్యభాగము 21 వచనము నుండి తీసుకుంటాను,

"ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును, పరలోక రాజ్యములో ప్రవేశింపడు: గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును" (మత్తయి 7:21).

ఈ ప్రసంగము నా స్వంత తలంపుల మీద ఆధారపడలేదు. ఇది క్రీస్తు మాటలపైన, ప్రముఖ వ్యాఖ్యాత మేత్యూ మీడ్ (1629-1699) వ్యాఖ్యల మీద ఆధారపడి ఉంది. మీడ్స్ పుస్తకము, చాలా వరకు క్రైస్తవుడు కనుగొన బడ్డాడు బైబిలు వ్యాఖ్యాన కర్త జాన్ మెక్ ఆర్డర్ సరిగా అందచేసాడు, నేను కూడ దానిని అంగీకరిస్తున్నాను.

"ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును, పరలోక రాజ్యములో ప్రవేశింపడు: గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును" (మత్తయి 7:21).

ఒక వ్యక్తికి గొప్ప జ్ఞానము, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము ఉండవచ్చు, అయినను నశించిపోవచ్చు. పరిశయ్యలు గొప్ప జ్ఞానము కలవారు, కానివారు వేషధారుల తరమునకు చెందినవారు. అయ్యో! చాలామంది గొప్ప జ్ఞానముతో నరకానికి వెళ్ళిపోయారు! తెలుసుకొనుట ఎక్కువగా తెలుసుకొనుట ఆతృతపై ఆధార పడుతుంది. మీకు తెలుసినది చూపించుకోవడం అది వృధా మహిమ. తెలుసుకొనుట దానిని అమలు పరచుట నిజమైన క్రైస్తవ్యము!

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఈ ప్రసంగము ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. వెళ్ళండి WWW.SERMONSFORTHEWORLD.COM.
ఆకుపచ్చ బటను నొక్కండి "యాప్" అనే పదము ఉన్న దానిపై. వచ్చే సూచనలను గైకొనండి.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఒక వ్యక్తికి చాలా గొప్ప ఆత్మీయ వరములు ఉండి కూడ నశించి పోవచ్చు. ప్రార్ధనా వరము ఆత్మీయ బహుమానము. ఒక వ్యక్తి అద్భుతముగా ప్రార్ధన చెయ్యవచ్చు అయినను నశించిపోవచ్చు. ఒక వ్యక్తికి బోధించే వరము ఉండవచ్చు కాని రక్షింపబడకపోవచ్చును. యూదా గొప్ప బోధకుడు. యూదా అన్నాడు, "ప్రభువా, ప్రభువా, మేము మీ నామములో [బోధించాము], మీ నామములో దెయ్యములను వెళ్ళగొట్టాం." అతడు బయటికి ప్రార్ధించవచ్చు, నిజ క్రైస్తవులకు బోధింపవచ్చు అయినను నిజ క్రైస్తవుడు కాకపోవచ్చును. ఒక వ్యక్తి తన ప్రార్ధనల ద్వారా బోధ ద్వారా ఇతరులకు సహాయ పడవచ్చు, అయినను తనకు సహాయము చేసుకోలేకపోవచ్చును.

బోధించే శక్తి ప్రార్ధించే శక్తి బోధకుని అధికారముపై ఆధార పడదు కాని, దాని ఆశీర్వదించు దేవుని అధికారముపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి బోధ ద్వారా ఒకరు మార్పిడి చెందవచ్చును, అయినను బోధకుడు నరకములో పడవేయబడవచ్చును! పెండేల్టాన్ రాణి మేరీ రోజుని సాండర్స్ కు బోధించాడు, అతడు బోధించిన సువార్తకు నిలబడమని, కాని తరువాత అతడు మత బ్రష్టుడై నరకానికి వెళ్ళిపోయాడు! శక్తివంతమైన ప్రసంగీకులైన యవనస్తులు నాకు తెలుసు, కాని తరువాత వారు వేశాదారులుగా నిరూపించబడ్డారు! ఒక వ్యక్తి అపోస్తలుని వలే బోధింపవచ్చు దేవదూత వలే ప్రార్ధించవచ్చు, అయినను దెయ్యపు హృదయము కలిగియుండవచ్చు! ఒక వ్యక్తికి గొప్ప తలంపులు ఉండవచ్చును అయినను నశించి పోవచ్చును. ఒక గొప్ప బిషప్ చెప్పాడు, "పేద, విధ్యావిహీనులు పరలోకానికి వెళ్తారు, కాని మనము, మన విజ్ఞానమంతటితో నరకములో పడతాము." ఒక వ్యక్తికి చాలా గొప్ప తలంపులు ఉండవచ్చు, కాని నశించిన వ్యక్తిగా ఉండవచ్చు. కొంచెము నిజ కృప పది పౌనుల విలువైన బహుమానముల కంటే విలువైనది. యూదా క్రీస్తును వెంబడించాడు! అతడు క్రీస్తు సువార్తను బోధించాడు, అతడు క్రీస్తు నామములో, దెయ్యములను వెళ్ళగొట్టాడు, క్రీస్తుతో పాటు ఒకే బల్లపై భుజించి సేవించాడు; అయినను యూదా ఒక వేషధారి మాత్రమే, "తన స్థలానికి" నరకానికి వెళ్ళిపోయాడు! పరిశుద్ధుడుగా నటించే వాడు దైవత్వాన్ని సాధన చేయనివాడు "అతడు దైవత్వమును కలిగియున్ననూ, శక్తిని నిరాకరించువానిగా ఉంటాడు."

ఒక వ్యక్తి క్రైస్తవుడని చెప్పుకుంటాడు, అయినను తన హృదయము ఎన్నడు మారదు. అతడు వేశాదారి మంచి క్రైస్తవునిగా కనిపిస్తాడు, కాని గర్వముతో తిరుగుబాటుతో నింపబడి ఉంటాడు. చాలామంది నీతిమంతులుగా కనిపిస్తారు, కాని నీతిని వారు ముసుగుగా ధరిస్తారు, వారి హృదయములలోని గర్వమును తిరుగుబాటు తనమును దాచి పెట్టుకోడానికి. ఒక వ్యక్తి వేదాంత కళాశాల విద్యనభ్యసించి అభిషేకింపబడ్డాడు. కాని అతని హృదయము మార్పు చెందలేదు. కనుక అతడు మన గుడిని విడిచిపెట్టి నశించిన అందమైన అమ్మాయిని వెంబడించాడు. "ధేమా నన్ను విడిచిపెట్టి, ప్రస్తుత లోకమును ప్రేమించాడు" (II తిమోతి 4:10). అది డాక్టర్ క్రైటన్ ఎల్. చాన్ ను వర్ణిస్తుంది, అతడు ఒక వేషధారిగా నిరూపించబడ్డాడు అతని గర్వము తిరుగుబాటు బహిర్గతమయ్యాయి, అతని ముసుగు చిరిగిపోయింది అతనిని ఒక వేషధారిగా చూసాము.

"ఆ రోజున నాతో చాలామంది చెప్పుతూ ఉంటారు, ప్రభువా, ప్రభువా, మీ నామమున [నేను] బోధింపలేదా? నేను వారితో చెప్తాను: అక్రమము చేయువారలారా, మీరు నా యెద్ద నుండి తొలగి పోవుడి."

ఎలుకలు సుంచులు ఒకే ఇంటిలో నివాసము చేయవచ్చును. కాని ఆ ఇళ్ళు పడిపోయేటప్పుడు, అయి పారిపోతాయి, అవి వేరే సురక్షిత ప్రాంతాన్ని చూసుకుంటాయి. ఒక సంఘములో మంచి దినాలు అనేకమంది అబద్ధపు వేషదారులను లోనికి తీసుకొని వస్తాయి. కాని సంఘము కదిలినప్పుడు, వారు పారిపోతారు – వారు నిజ క్రైస్తవులు కాదని నిర్ధారణ అవుతుంది వారు మునుపు ఏమి చెప్పినప్పటికినీ. వారిలో కొంతమంది ఇక్కడ ఉన్నారు.

ఒక వ్యక్తి చెప్పాడు, "ఆయన నన్ను ఎక్కడికి నడిపిస్తే నేను ఆయనను వెంబడిస్తాను. శ్రమలు కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ యేసు...నాకు జీవితాన్ని ఇచ్చాడు. ప్రశస్తమైన యేసు నామమునకు స్తుతి." అయినను ఈ వ్యక్తి మన సంఘము చీలినప్పుడు బయటకు వెళ్ళిపోయిన వారిలో మొదటివాడు.

ఒక చైనీయ అమ్మాయి చెప్పింది, "దేవుడు నాకు చేసిన గొప్ప కార్యములు ఇతరులు తెలుసుకోవాలని నా ఆశ. దేవుడు ఆయనకు సాక్షిగా ఉండునట్లు నా జీవితాన్ని వాడుకొనును గాక." కాని చీలిక చోటు చేసుకోక మునుపే ఆమె సంఘము నుండి బయటికి వెళ్ళిపోయింది!

ఇంకొక యవన చైనీయ వ్యక్తి ఇలా చెప్పాడు, "యేసుచే రక్షింపబడడం ఎంత గొప్ప విషయమో నేను మాటలలో వ్యక్త పరచలేను... క్రీస్తు నా కొరకు చేసిన గొప్ప విషయాలు ఇతరులు తెలుసుకోవాలని నేను ఆశ పడుచున్నాను." అయినను కొంతకాలము తరువాత అతడు గుడిని విడిచిపెట్టి చాన్ ను వెంబడించాడు, తద్వారా అతని మాటలు అర్ధ రహితమని చూపించాడు. అతడు ఇంకను తప్పిన వేషధారిగా ఉండి, నరకానికి వెళ్ళుతున్నాడు!

వియత్నాం నుండి ఒక యవనుడు ఇలా అన్నాడు, "యేసు నా కొరకు కలిగిన ప్రేమ అంతటిని బట్టి, నేను ఆయనను అంతగా ప్రేమించలేను. నా రక్షకుడైన యేసుకు, నా జీవితాన్ని ఇస్తాను." ఒక సంవత్సరము తరువాత అతడు రక్షకుని అప్పగించి, గుడిని విడిచి మత బ్రష్ట చాన్ తో వెళ్ళిపోయాడు.

ఇంకొక యవన కళాశాల విద్యార్ధి ఇలా చెప్పింది, "ప్రశస్తమైన యేసు క్రీస్తు రక్తము ద్వారా నన్ను శుద్ధి చేసినందుకు నేను దేవునికి వందనస్తుడను. ప్రభువుకు స్తోత్రము!" మంచిగా ఉంది, కదా? కాని అలా చెప్పిన తరువాత, ఆమె లోక పాపముల వెంట వెళ్లి మన గుడిని విడిచి పెట్టింది.

ఒక జపానీయ/అమెరికా అమ్మాయి ఇలా చెప్పింది, "నా సాక్ష్యము చాలా సామాన్యము. నేను యేసును విశ్వసించాను, ఆయన నన్ను రక్షించాడు" – ఆమె ఆయనకు గుడిని విడిచి పెట్టడం ద్వారా మత బ్రష్ట చాన్ తో వెళ్ళడం ద్వారా తిరిగి చెల్లించింది!

ఒక మెక్సికన్ వ్యక్తి అన్నాడు, "ప్రేమించు రక్షకునిచే నేను కృప చూపించబడ్డాను, నేను దీనిని ఎన్నడు మర్చిపోను" – కాని కొంతకాలము తరువాత తను అన్నది మర్చిపోయాడు, మత బ్రష్ట చాన్ వెంట వెళ్ళిపోయాడు. మత బ్రష్ట చాన్ తో పాటు తిరుగుబాటు వేశాధారులతో నిలబడి తీయించుకున్న అతని ఫోటో, నా దగ్గర ఉంది.

ఒక యవన స్త్రీ చైనా నుండి ఇలా చెప్పింది, "యేసు నన్ను ప్రేమిస్తున్నాడు! రక్షకుడైన యేసు క్రీస్తు కొరకు, నేను పాడాలనుకొనుచున్నాను!" బాగా ఉంది, కదా? కాని త్వరలోనే మన గుడికి ద్రోహము చేసి, మత బ్రష్ట చాన్ తో వెళ్ళిపోయింది!

ఒకరు నాతో అన్నారు, "డాక్టర్ హైమర్స్ గారు, ఎక్కువమంది చైనా ప్రజలను లోనికి తీసుకు రాకండి. వారంతా రెండు ముఖాల వేషధారులు!" వాస్తవమే, వారు నిజమార్పు అనుభవించకపోతే నేను చెప్పిన వారి వలే వారు కూడ నశించినట్లే. యేసు చెప్పాడు, "నీవు తిరిగి జన్మించాలి" (యోహాను 3:7).

"చౌక కృప" మరియు "సులభతర నమ్మిక" కొత్త పదాలు, కాని "మత దూరత్వము" కాదు. మార్టిన్ లూథర్ (1483-1546) ఈ పదాన్ని ఇచ్చాడు. దీని అర్ధము కొందరికి రక్షణలో ఉన్న లాభాలన్నీ కావాలి కాని బాద్యతలు కాదు (Soli Deo Gloria Publications, jacket cover of Matthew Mead’s The Almost Christian Discovered, foreword by John MacArthur).

మత బ్రష్ట చాన్ వ్యక్తి ఇలా అన్నాడు, "డాక్టర్ హైమర్స్ అనుకుంటున్నారు గుడికి హాజరు కాకుండా ఎవరు రక్షింపబడలేరని." మత బ్రష్టులు ఏ అబద్ధమైనా చెప్తారు వారి దుష్ట పాపములు కప్పి పుచ్చుకోవడానికి. ఈ వ్యక్తి అలా అబద్ధమాడి నందుకు నేను ఆశ్చర్యపోను, అతనికి పరిపూర్ణంగా తెలుసు నేనలా చెప్పలేదని – లేక నేనది నమ్ముతానని.

కాని నేను నమ్ముతాను ఆలయము "క్రీస్తు శరీరము" అని (ఎఫెస్సీయులకు 4:12). ఆయన సంఘాన్ని విడిచిపెట్టేవారు ఆయన శరీరాన్ని బలహీన పరుస్తారు. సంఘముపై దాడి చేసే వారు, ఆయన శరీరానిపై దాడి చేస్తారు. సంఘమును చీల్చువారు, ఆయన శరీరాన్ని చీల్చుతారు. సంఘములో సభ్యులు కాని వారు, ఆయన శరీరములో సభ్యులు కారు. చాలామంది క్రొత్త సువార్తికులు లేఖనాలను తీవ్రముగా పరిగణించరు. అందుకే వారు క్రీస్తు శరీరము నుండి వేరై పోతారు!

కొంతమంది దానిని "మైలురాయి" దృక్పధము అంటారు. మీరు ఏమని పిలుస్తారో నాకు అనవసరము, అది బైబిలు పరిస్థితి. సంఘము "క్రీస్తు శరీరము!"

మీరు యేసు నొద్దకు రావాలని ఈ ఉదయాన మిమ్మును అడుగుచున్నాను. ఆయన మృతులలో నుండి లేచాడు. ఆయన పరలోకములో, దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. యేసు నొద్దకు రండి. లోకతీరు నుండి పాపము నుండి తొలగండి. యేసును నమ్మండి, ఆయన తన ప్రశస్త రక్తముతో మీ పాపాలను కడిగివేస్తాడు! యేసును విశ్వసించండి ఆయన శరీరములో భాగమవుతారు, అది ఆయన సంఘము. ఆమెన్.

యేసును నమ్ముట విషయంలో మీరు మాతో మాట్లాడాలనుకుంటే దయచేసి వచ్చి ముందు కుడి భాగాన్న నిలబడండి. 5 వ సంఖ్య పాట పాడుచుండగా మీరు రండి, "నేను ఉన్నపాటున," అనే పాట.

ఉన్నపాటున నేను, హేతువు లేకుండా, మీ రక్తము నాకై కార్చబడింది,
మీరు మీ యొద్దకు నన్ను రమ్మనుచున్నారు, ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వస్తాను! నేను వస్తాను!

ఉన్నపాటున నేను, వేచియుండకుండా, పాప అంధకారము నుండి నా ఆత్మను తప్పించడానికి,
మీ రక్తము ప్రతి మచ్చను శుభ్రము చేస్తుంది, ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వస్తాను! నేను వస్తాను!

ఉన్నపాటున నేను, సంఘర్షణలో ఉన్నప్పటికినీ, సందేహము ఉన్ననూ,
లోలోపల పోరాటములు భయములు, బయట కూడ, ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వస్తాను! నేను వస్తాను!
   ("ఉన్నపాటున నేను" చార్లెట్ ఎలియట్ చే, 1789-1871, కాపరిచే మార్చబడినది).
    (“Just As I Am” by Charlotte Elliott, 1789-1871, altered by the Pastor).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.