Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ప్రార్ధనలో కన్నీళ్లు

TEARS IN PRAYER
(Telugu)

డాక్టర్ క్రిష్టాఫర్ ఎల్. కాగన్ గారిచే
by Dr. Christopher L. Cagan

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడినది
ప్రభువుదినము సాయంకాలము, జూన్ 2, 2019
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, June 2, 2019

"శరీరధారియైయున్న దినములలో, మహారోదనముతోను కన్నీళ్ళతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి, భయ భక్తులు కలిగి యున్నందున ఆయన [క్రీస్తు] అంగీకరింపబడెను" (హెబ్రీయులకు 5:7).


ఆయన సిలువ వేయబడక మునుపు రాత్ర్రి, గెత్సమనే వనములో యేసు ప్రార్ధించుట గూర్చి మన పాఠ్యభాగము చెప్తుంది. ఆయన గొప్ప ఒత్తిడిలో ఉన్నాడు అక్కడ మన పాపము ఆయనపై మోపబడినందుకు, మరునాడు ఆ పాపమును తన శరీరములో సిలువకు మోసికొని వెళ్ళాల్సి ఉంది. లూకా సువార్త మనకు ఇలా చెప్తుంది,

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

ఆ రాత్రి క్రీస్తు "గొప్ప వేదనతో" ప్రార్ధించాడు. మన పాఠ్యభాగము చెప్తుంది ఆయన "మహా రోదనము తోనూ కన్నీళ్ళతోనూ ప్రార్ధనలను యాచనములను సమర్పించాడు." యేసు ప్రార్ధన భావోద్రేకముతోనూ, రోదనతోను కన్నీళ్ళతోనూ నిండుకొని యున్నది. ఈ రాత్రి నేను ప్రార్ధనలోని భావోద్రేకములను గూర్చి మాట్లాడ ఇష్ట పడుచున్నాను.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఈ ప్రసంగము ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. వెళ్ళండి WWW.SERMONSFORTHEWORLD.COM.
ఆకుపచ్చ బటను నొక్కండి "యాప్" అనే పదము ఉన్న దానిపై. వచ్చే సూచనలను గైకొనండి.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

I. మొదటిది, భావనతో కూడిన అబద్ధపు ప్రార్ధన.

చాలామంది పెంతేకొస్తుల వారు ఆకర్షితులు అరవడం ఏడవడం, భావోద్రేకాలు, ప్రార్ధనలో ప్రాముఖ్య భాగాలు అనుకుంటారు. అరచి కేకలు పెడితే ప్రార్ధనలో పరిశుద్ధాత్మ ఉందని, ఊగిపోవడం గీయపెట్టడం లేకపోతే పరిశుద్ధాత్మ లేదని వారనుకుంటారు. వారంటారు ప్రార్ధన విషయములోనే కాదు, పాడేటప్పుడు ప్రజలు ఎలా కదలాలి, ప్రసంగము వినేటప్పుడు, గుడిలో వారు చేసే ప్రతి విషయములోను అది ఉండాలి అంటారు. కాని వారిది తప్పు. ఉద్రేకము దాని నిమిత్తము అయితే అది వ్యర్ధము. అది ప్రార్ధన నుండి తప్పిస్తుంది. అది సాతాను పరము కూడ.

ప్రార్ధనలో అబద్ధపు ఉద్రేకమును గూర్చి బైబిలు నుండి ఒక ఉదాహరణ ఇస్తాను. బయలు ప్రవక్తలను ఏలియా ఎదుర్కొంటాడు. బయలుకు మొరపెడుతూ ఒకరోజు గడపమని వారితో చెప్తాడు, తాను ఇశ్రాయేలు దేవునికి ప్రార్దిస్తానని చెప్తాడు. అగ్నితో జవాబిచ్చు దేవుడు నిజమైన దేవుడు. బయలు ప్రవక్తలు వారి ప్రార్ధనలలో భావోద్రేక్తులవుతారు. ఈనాడు చాలా సంఘాలలో అది మంచిగా కనిపిస్తుంది! వారు "బయలు నామమును ఉదయము నుండి మధ్యాహ్నము వరకు, పిలుస్తున్నారు, ఓ బయలా, విను అని. కాని స్వరము లేదు, జవాబు లేదు. వారు తాము చేసిన బలిపీఠం నొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి" (I రాజులు 18:26). మధ్యాహ్నము "బిగ్గరగా ఏడ్చారు, వస్త్రములతోను మరియు కత్తులతోను తమ దేహములను, రక్తము వచ్చేంత వరకు కోసికొనుచు నుండిరి" (I రాజులు 18:28). కాని "మంటయైనను, ప్రత్యుత్తరమైనను లేదు" (I రాజులు 18:29). తరువాత ఏలియా దేవునికి సామాన్య ప్రార్ధన చేసాడు దేవుడు ఆకాశము నుండి అగ్ని పంపాడు. సాతాను పర ఉద్రేకము, పైకి క్రిందికి దూకుట, అరవడం మరియు ఏడవడం, అబద్ద ప్రవక్తలు చేసారు. ఉపయోగము లేదు అనుకోవడంలో ఏమి అర్ధము ఉండదు.

నేను చాలా సార్లు భావోద్రేకము దాని నిమిత్తమే అని చూసాను. అది ఎన్నడు మంచి చెయ్యలేదు. ఒకసారి విచారణ గదిలో ఒక అమ్మాయిని కౌన్సిల్ చేస్తున్నాను, క్రీస్తు నొద్దకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆమె ఏడుస్తుంది వణికిపోతుంది. ఆమె ఆపలేక పోతుంది. తన పాపముల నిమిత్తము ఏడుస్తున్నానని చెప్పింది, కాని ఏడుపు ఆపలేదు. క్రీస్తుపై తన దృష్టి పెట్టలేదు. తను రక్షింపబడలేక్పోయింది. తరువాత గుడిని వదిలిపెట్టి లోతైన పాపపు జీవితములోనికి వెళ్ళిపోయింది.

కొంతమంది చాలా ఉద్రేకంగా ఉంటారు. వారి దేని గూర్చయినా ఎంతో ఏడుస్తారు. అలాగే చేసిన ఇంకొక అమ్మాయి నాకు గుర్తుంది. ప్రసంగము తరువాత కాదు, క్రీస్తును గూర్చి ఉపదేసించినప్పుడు కాదు. ఎప్పుడైనా అంతే. ఆమె కన్నీళ్లు కార్చి ఏడ్చేది. ఆమె తన మనసును క్రీస్తుపై కాని, గుడిపై కాని, బైబిలుపై కాని పెట్టలేక పోయింది. ఒకరోజు విచారపడింది. తన భావాలను వెంబడించి గుడి విడిచి పెట్టింది. నేను ఆమెను తిరిగి చూడలేదు.

ఏడ్చుట కేకలు పెట్టుట "వాస్తవాన్ని" జరిగించవు. అది ప్రార్ధనను నిజము చెయ్యదు. మిమ్ములను అరిచేటట్టు ఎడ్చేటట్టు చేయడం ఏమి సహాయపడవు. మీరు ప్రార్ధించేటప్పుడు, ప్రార్దించే దానిని గూర్చి ఆలోచించండి. మీరు కన్నీటితో ప్రార్ధించవచ్చు కాకపోవచ్చు. గెత్సమనే వనములో యేసు ఉద్రేకము చూపించాడు. ఆయన "మహా రోదనముతోనుకన్నీటితోను" ప్రార్ధించాడు. కాని కోసరము ఏడ్చుట కాదు. ఆయన కన్నీళ్లు ప్రార్ధనను మంచిగా చెయ్యలేదు. ఆయన ప్రార్ధన ద్వారా కన్నీళ్లు వచ్చాయి. ఆయన ప్రార్ధన నుండి వెలువడ్డాయి. ఆయన తన దుస్థితిలో ఒత్తిడిలో, బాధలో దేవునికి మొరపెట్టాడు, మానవాళి పాపము ఆయనపై మోపబడింది కాబట్టి. ఆయన తీవ్రతను బట్టి కన్నీరు వచ్చింది, ఆయన శ్రద్ధ, ఆయన అవసరత, ఆయన భారము, ఆయన శ్రమను బట్టి ప్రార్ధించండి. అది మీతో ఉండవచ్చు. ఏడవడానికి ప్రయత్నించకండి. ఏడవడానికి ప్రణాళిక చేసుకోకండి లేదా ఏడవడానికి సిద్ధ పడకండి. కేవలం ప్రార్ధించండి. దేవుడు మిమ్మును ఏడవడానికి నడిపించవచ్చు, కాకపోవచ్చు, కాని రెండు విధాలుగా అది నిజమైన ప్రార్ధన అవుతుంది.

II. రెండవది, భావన లేకుండా అబద్ధపు ప్రార్ధన.

ఈనాటి "ప్రార్ధన" అసలు ప్రార్దనే కాదు. అది కేవలము ఒక వ్యక్తి చెప్పేది, దేవునికి చేసే నిజ ప్రార్ధన కాదు. పదాలు బాగుంటాయి, మతపరంగా ఉంటాయి, కాని అవి కేవలం నానుకహా, అర్ధ రహితము, దేవుని వైపు తిరగకుండా ఆయనను ఏదో అడగడము.

నేను చాలా పట్టభద్ర కార్యక్రమాలు చూసాను. కార్యక్రమ ప్రారంభములో "వేడుకోవడము" ఉంటుంది. అది ప్రార్ధన, కాని అది అలా ఉండదు. వ్యక్తి కొన్ని మాటలు వల్లిస్తాడు కార్యక్రమము మంచిగా ఉండాలని, విధ్యార్ధులు మంచి జీవితాలు కలిగి ఉండాలని. కాని ఎవరు దేవుడు జవాబివ్వాలని ఆశించరు ఏదైనా చెయ్యాలని గాని లేదా మార్చాలని గాని కోరరు – "ప్రార్ధన" ద్వారా. అలాంటి వేడుకోవడములో భావన కాని హృదయ ఉచ్చారణ కాని కనిపించవు.

ఒకసారి మన దేశ రాజధాని వాషింగ్ టన్ డి.సి. దర్శించాను. అక్కడ జాతీయ పెద్ద గుడిలో ప్రవేశించాను. అధ్యక్షుడు రీగన్ అప్పుడే చనిపోయాడు, అక్కడ వారు ఆయన భూస్థాపన కార్యక్రమానికి సిద్ధ పడుచున్నారు. అక్కడ యాజకుడు చేసిన "ప్రార్ధన" మాటలు విన్నాను. కాని అతడు ప్రార్దనే చేయడం లేదు. పుస్తకము నుండి మాటలు చదువుతున్నాడు. అంతే. ఏదైనా చేయమని దేవునిని అడగడం లేదు. అతడు జవాబు కోరడము లేదు. అతడు కొన్ని మాటలు చెప్పాడు అతడు అంతే చెయ్యాలి. హృదయము నుండి భావన లేదు.

యేసు ప్రార్ధించడానికి దేవాలయానికి వెళ్ళిన పరిశయ్యుని గూర్చి చెప్పాడు. అతడిలా అన్నాడు, "దేవా, నేను చోరులను, అన్యాయస్థులను, వ్యభిచారులునైన, ఇతర మనష్యుల వలనైనను, ఈ సుంకరి వలెనైనను, ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నాను" (లూకా 18:11, 12). అతడు ప్రార్దనే చెయ్యడం లేదు. అతడు దేవుని ఏమి అడగడం లేదు. బదులుగా అతడు ఎంత మంచివాడో దేవునికి చెప్తున్నాడు. అతడు "తనలోతాను" ప్రార్ధించు కొనుచున్నాడని క్రీస్తు చెప్పాడు (లూకా 18:11). అతడు భావన చూపలేదు. అతడు తన హృదయము నుండి ప్రార్ధించలేదు.

వారి అబద్ధపు ప్రార్ధనలను బట్టి క్రీస్తు పరిశయ్యలను గద్దించాడు. ఆయన అన్నాడు, "అయ్యో, శాస్త్రులారా పరిశయ్యలారా, వేశాదారులారా! మీరు విధవ రాండ్ర గృహాలు దోచుకుంటారు, దీర్ఘ ప్రార్ధనలు చేస్తారు" (మత్తయి 23:14). పరిశుద్దులమని చూపించుకోవడానికి వారు దీర్ఘ ప్రార్ధనలు చేస్తారు. కాని వారు వాస్తవానికి వృద్ధ స్త్రీల నుండి ఇళ్ళు డబ్బు దోచుకోవడం వారి అభిమతం. అది అంత తేటగా ఉంది. వారిది అబద్ధపు భావన మంచిగా కనబడాలని ఆశ. వారు హృదయము నుండి ప్రార్ధించలేదు. వారి హృదయాలు సరిగా లేవు.

మీరనవచ్చు, "నేను వారిలా లేను." కాని మీరు అబద్ధంగా ప్రార్దిస్తున్నారా, మాటలు వల్లిస్తున్నారా? నేనలా చేసాను. మీ వ్యక్తిగత ప్రార్ధన సమయములో, మీరు ప్రజల పేర్లు చెప్పి విషయాలు అడిగారా, వారిని గూర్చి ఆలోచించకుండా, జవాబులు దేవుని నుండి ఆశించకుండా ప్రార్ధించారా? గుడిలో ప్రార్ధన కూటాలలో అలా చేసారా? నేనలా చేసాను. ఏదో ప్రార్ధించాలి కాబట్టి ప్రార్ధించారా – ప్రార్ధించడానికి మీకు సమయము వచ్చింది కాబట్టి అనా? కూటము అయిపొయింది ప్రార్ధించే పని తప్పింది అని మీరు సంతోషిస్తారు. అది నిజమైన ప్రార్ధన కాదు. దాని ద్వారా వెళ్ళారు అంతే. ఎవరినో మెప్పించడానికి "బాగా ప్రార్ధించడానికి" ప్రయత్నించారా? ముందే ప్రార్ధనకు సిద్ధపడే ఒకరు నాకు తెలుసు. అది నిజ ప్రార్ధన కాదు, అది వల్లించడం, మాట్లాడడం. నేనంటాను, "మీ ప్రార్ధనలు మీరు ప్రణాళిక చేసుకోవద్దు, వారి కొరకు ప్రార్ధించండి!" ప్రార్ధనా కూటమునకు ముందు, ప్రార్ధించడానికి సహాయము చేయమని కొన్ని నిమిషాలు దేవుని అడగండి. ఒక కూటములో ప్రార్ధించేటప్పుడు, ఏమి ప్రార్దిస్తున్నారో దాని గూర్చి ఆలోచించండి. దేవుడు సహాయము చెయ్యకపోతే పరిస్థితి ఎంత చెడ్డగా ఉంటుందో ఆలోచించండి. దేవుని ప్రత్యుత్తరము ఎంత అవసరమో ఆలోచించండి. ఉపవాసము మీ ప్రార్ధనలకు సహాయ పడుతుంది, మీ తీవ్రత అది దేవునికి తెలియచేస్తుంది. ప్రార్ధనలో దేవునికి వైపు తిరగండి మీరు అడిగేది ఇవ్వమని. దేవుని బ్రతిమాలాడి భావనతో మీరు ఏడవవచ్చు. ఆగకండి. దేవుడు దాని కొరకు మిమ్మును కదిలించాడు. కొన్నిసార్లు మీరు ఏడవకపోవచ్చు. బలవంతముగా ఏడవకండి. ఏడుపు వలన ప్రార్ధన మంచిగా అవదు – ప్రార్ధన ఏడవడం వలన మంచిగా మార్చబడదు. ప్రార్ధన మంచిది దేవుడు అందులో ఉన్నప్పుడు!

III. మూడవది, భావనతో భావన లేకుండా నిజమైన ప్రార్ధన.

క్రీస్తు "రోదనముతోను మరియు కన్నీటితోను" తోటలో ప్రార్ధించాడని మన పాఠ్యభాగము చెప్తుంది. కాని కొన్నిసార్లు నిజ ప్రార్ధనకు చిన్న లేక అసలు భావన లేకుండా కూడ ప్రత్యుత్తరము రావచ్చు. బయలు ప్రవక్తలు అబద్ధపు దేవుళ్ళకు ఎలా ప్రార్దించాలో నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఏలియా ఎలా ప్రార్ధించాడో చెప్తాను. ఆయనన్నాడు,

"యెహోవా, అబ్రహాము, ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవైయున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితివాణియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా దేవా, నా ప్రార్ధన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్ధన అంగీకరించుము" (I రాజులు 18:36, 37).

ఏలియా ఏడ్చినట్టు వ్రాయబడలేదు. క్రిందికి పైకి దూకినట్టు వ్రాయబడలేదు. తన్ను తాను కోసుకోలేదు! దేవునికి తీవ్రముగా ప్రార్ధించాడు. ఆయనే నిజ దేవుడని ప్రజలకు కనుపరచమని ప్రార్ధించాడు. దేవుడు ఆ ప్రార్ధనకు జవాబిచ్చి ఆకాశము నుండి అగ్ని దిగి ఏలియా అర్పణను దహించినది. ప్రజలన్నారు, "యెహోవాయే, దేవుడు; యెహోవాయే, దేవుడు" (I రాజులు 18:39). ఏలియా తీవ్ర ప్రార్ధన, ఎలాంటి ఉద్రేకము లేకుండా, బయలు ప్రవక్తల భీకరత్వానికి భిన్నంగా నిలిచింది. నిజ ప్రార్ధనకు భావన అక్కరలేదు. దానికి దేవుడు కావాలి!

కాని చాలాసార్లు భావన, కన్నీళ్లు కూడ, నిజ ప్రార్ధనలో కనిపిస్తాయి. మీ అవసరత గమనిస్తే, అనుభూతి సహజము. మీరు దేవుని తపనతో, అత్యవసరత, ఏడ్పుతో పిలుస్తారు. మీరు ఏడ్చి కన్నీటితో ఆయనను బ్రతిమాలతారు. చాలాసార్లు బైబిలు కన్నీటిని ప్రార్ధనతో కలుపుతుంది. కీర్తన కారుడు ప్రార్ధించాడు, "యెహోవా, నా ప్రార్ధన ఆలకింపుము, నా మొరకు చెవి మొగ్గుము; నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము" (కీర్తనలు 39:12).

రాజైన హిజ్కయా మరణకర రోగముతో ఉన్నాడు. హిజ్కయా దేవునికి ప్రార్ధించాడు. అతడెట్ల ప్రార్ధించాడు? బైబిలు చెప్తుంది, "హిజ్కయా కన్నీళ్లు విడిచెను" (II రాజులు 20:3). అతడు ఏడ్చాడు. చనిపోబోతున్నాడు. అతడు చాలా ఏడ్చాడు. ప్రార్ధనలో ఏడ్చాడు. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త యెషయాకు వచ్చింది. యెషయా అన్నాడు, "నీవు తిరిగి, అధిపతి యైన హిజ్కయా యొద్దకు పోయి ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు, యెహోవా నీవు సెలవిచ్చున దేమనగా, నీ ప్రార్ధనను నేను అంగీకరించి యున్నాను, నీవు కన్నీళ్లు విడచుట చూచితిని: ఆగుము, నేను నిన్ను బాగు చేసెదను" (II రాజులు 20:5). "కన్నీళ్లు నేను చూసాను." హిజ్కయా నిస్సహాయ, మొరపెట్టు ప్రార్ధనలో కన్నీళ్లు దేవుడు చూసాడు. మరియు దేవుడు జవాబిచ్చి రాజు జీవితాన్ని రక్షించాడు.

కొత్త నిబంధన గ్రంథములో, ఒక వ్యక్తి యేసు నొద్దకు వచ్చాడు. అతని కుమారుడు దెయ్యము పట్టిన వాడు. క్రీస్తు అడిగాడు తన కుమారుడు బాగు పడతాడని నమ్ముచున్నావా అని. "ఆ చిన్న వాని తండ్రి నమ్ముచున్నాను, మరియు ఏడుస్తున్నాడు, దేవా, నేను నమ్ముతున్నాను; నాకు అపనమ్మకము ఉండకుండునట్లు సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను" (మార్కు 9:24). యేసు ఆ బాలుని నుండి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. తరచూ ఆ వాక్య భాగము విశ్వాసములో బలహీనుడు జవాబులు పొందుకుంటాడు అని చెప్పడానికి వాడుతుంటారు. "అపనమ్మకము ఉండకుండా సహాయము చేయుము." ఈ పాఠ్య భాగము చెప్తుంది తండ్రి "ఏడ్చి" క్రీస్తుతో "కన్నీళ్ళతో" మాట్లాడాడని. యితడు శిష్యులలో ఒకడు కాదు. అతడు మారిన వాడు కూడ కాదు. "జన సమూహములో ఒకడు," గుంపులో ఒకడు (మార్కు 9:17). అయినను అతడు తన కుమారుని యేసు నొద్దకు తెచ్చి కన్నీటితో మోర పెట్టాడు.

అతడు ఎందుకు కన్నీటితో యేసుకు మొరపెట్టుకున్నాడు? అతడు ప్రార్ధనా యోధులు కాదు. అతడు రక్షింపబడలేదు. క్రీస్తుతో సహజంగా మాట్లాడాడు, తన నిస్సహాయతనుబట్టి. తనకుమారుడు దెయ్యము పట్టినవాడు యేసు కాక ఎవరు విడుదల చెయ్యలేరు. అతడు తన్ను తానుగా ఏడవలేదు. అవసరతను బట్టి, నిరాశలో, కన్నీళ్లు వచ్చాయి. అవసరత, నిరుత్సాహము నిస్సహాయత, తరచూ కన్నీటికి దుఃఖానికి దారితీస్తాయి. అతడు నిజ ప్రార్ధనతో, భావనతో మాట్లాడాడు.

అది తిరిగి మన పాఠ్య భాగానికి తీసుకొస్తుంది. క్రీస్తు "మహా రోదనములతోనూ కన్నీళ్ళతోనూ" తోటలో ప్రార్ధించాడు. ఏడ్చే బాలుడు కాదు. ఆయన భావోద్రేక బాలిక కాదు ఆమె ప్రతిదానికి ఏడిచిన వ్యక్తి. ఆయన ఎదిగిన వాడు, ముప్ఫై సంవత్సరాల వయసు. ఆయన ఎందుకు ఏడ్చాడు? హృదయములో కదిలింపబడ్డాడు కాబట్టి. ప్రతి పురుషుడు స్త్రీ పాపము ఆయనపై ఉన్నట్టుగా భావించాడు. మరునాడు సిలువపై భయంకర శ్రమను గూర్చి ఆయన ఆలోచించాడు, లేనిచో ఎవరు రక్షింపబడలేరు. అయినను మానవ పాప భారము ఆయనను చంపింది. దేవుని కృప లేకుండా, సిలువకు వెళ్ళకుండా తోటలోనే చనిపోయేవాడు. క్రీస్తు హృదయములో భారము పొందాడు. అందుకే ఇలా ప్రార్ధించాడు "మహా రోదనము తోనూ మరియు కన్నీళ్ళతోనూ." అది సర్వ సాధారణము ఆ పరిస్థితిలో. ఆయన భావనతో ప్రార్ధించకపోతే ఆశ్చర్యము. యేసు "మహా రోదనముతోనూ మరియు కన్నీళ్ళతోనూ" ప్రార్ధించాడు. మన పాఠ్యభాగము చెప్తుంది "ఆయన ప్రార్ధన వినబడింది." దేవుడు ప్రార్ధనకు ప్రత్యుత్తరము ఇచ్చి మరునాడు సిలువకు వెళ్ళడానికి సజీవునిగా ఉంచాడు. దేవుడు ఆయన "రోదనములను కన్నీళ్లను" జవాబిచ్చాడు.

క్రైస్తవుడా, నేను నిన్నడుగుతాను, "నీవు రోదనముతోను మరియు కన్నీటితోను ప్రార్దిస్తావా?" నీవు చేసే ప్రతి ప్రార్ధన గురించి నేను మాట్లాడడం లేదు. మళ్ళీ అడుగుతున్నాను, "నీవు ఎప్పుడైనా రోదనతోను మరియు కన్నీళ్ళతోనూ ప్రార్దించావా?" నేను, అంతగా చెయ్యలేదు. కొన్నిసార్లు నీవు అవసరత భారముతో, దేవుని నుండి జవాబు కొరకు ప్రార్దిస్తున్నావా – కొన్నిసార్లు రోదనతో కన్నీటితో? నీవు ఎన్నడు చెయ్యకపోతే, నీకు మంచి ప్రార్ధనా జీవితమూ లేదు. నీవు అలా ఉంటే, ప్రార్ధించడం మానవద్దు మీ ప్రార్ధనలు మెరుగు పడే వరకు. దేవుడది కోరడం లేదు. కాని దేవుడు నీకు ఒప్పుకోలు ఇచ్చునట్లు ప్రార్ధించు, అప్పుడు నీవు భావనతో ప్రార్దిస్తావు. నీవు ఉపవసిస్తే, ఎప్పుడు ఆకలివేసినా, దేనిని గూర్చి ప్రార్దిస్తున్నావో ఆలోచించు. దేవుని వైపు తిరిగి ప్రార్ధించు.

మీలో కొంతమంది నశించిపోయారు. మీరు యేసును విశ్వసించలేదు. నేను నిన్నడుగుచున్నాను, "రోదనతోనూ మరియు కన్నీటితోను నీ పాపమును బట్టి బాధ పడుచున్నావా – కనీసము కొంత సమయమైనా?" నీకు పాపపు ఒప్పుకోలు ఉందా? ఏడ్చుట గురి కాదు – యేసు గురి. ఏడ్చినా ఎడవకున్న ఆయనను నమ్ము. కాని నేను చెప్తాను, "నీ హృదయ పాపమును గూర్చి నీకు విచారము అనిపిస్తుందా?" మీరు మీ హృదయము "మోసకరమైనది" (యిర్మియా 17:9). నీ హృదయ భయంకర పాపము చూపించమని దేవునికి ప్రార్ధించు. తరువాత దేవుడు నిన్ను క్రీస్తు దరికి చేర్చునట్టుగా ప్రార్ధించు.

నీ అవసరతకు యేసు జవాబు. నీ పాపమునకు ఆయనే పరిష్కారము పరిహారము. నీ ప్రతి పాపము కొరకు, నీ హృదయ పాపము నిమిత్తము ఆయన సిలువపై మరణించాడు. ఆయన నీ పాపమును కప్పడానికి నిరంతరము దానిని తుడిచివేయడానికి ఆయన తన రక్తము కార్చాడు. ఆయన ఆయన నిమిత్తము, నీ కొరకు మరణము జయించడానికి ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. నీవు యేసును విశ్వసిస్తే, నీవు నిత్యత్వములో రక్షింపబడతావు. క్రీస్తును నమ్ముట విషయములో మాతో మాట్లాడాలనుకుంటే, దయచేసి వచ్చి మొదటి రెండు వరుసలలో కూర్చోండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట జాక్ గ్నాన్ గారిచే:
"ప్రార్ధించుటకు నాకు నేర్పుము" (ఆల్ బెర్ట్ ఎస్. రిట్జ్, 1879-1966).
“Teach Me to Pray” (by Albert S. Reitz, 1879-1966).



ద అవుట్ లైన్ ఆఫ్

ప్రార్ధనలో కన్నీళ్లు

TEARS IN PRAYER

డాక్టర్ క్రిష్టాఫర్ ఎల్. కాగన్ చే
by Dr. Christopher L. Cagan

"శరీరధారియైయున్న దినములలో, మహారోదనముతోను కన్నీళ్ళతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి, భయ భక్తులు కలిగి యున్నందున ఆయన [క్రీస్తు] అంగీకరింపబడెను" (హెబ్రీయులకు 5:7).

(లూకా 22:44)

I.   మొదటిది, భావనతో కూడిన అబద్ధపు ప్రార్ధన, I రాజులు 18:26, 28, 29.

II.  రెండవది, భావన లేకుండా అబద్ధపు ప్రార్ధన, లూకా 18:11, 12; మత్తయి 23:14.

III. మూడవది, భావనతో భావన లేకుండా నిజమైన ప్రార్ధన, I రాజులు 18:36, 37, 39; కీర్తనలు 39:12; II రాజులు 20:3, 5; మార్కు 9:24, 17; యిర్మియా 17:9.