Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
భూలోక రాజ్యాన్ని క్రీస్తు ఎలా ఏర్పాటు చేస్తాడు

HOW CHRIST WILL SET UP HIS EARTHLY KINGDOM
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంకాలము, జనవరి 13, 2019
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, January 13, 2019

"ఆ దినమున యేరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒళీవ కొండమీద ఆయన పాదములు ఉంచగా, ఒళీవ కొండ తూర్పు తట్టునకు, పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకు సగము కొండ దక్షిణ తట్టునకు జరుగును, గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును; కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా. మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు: మీరు, యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు, మీరు పారిపోవుదురు: అప్పుడు నీతో కూడ పరిశుద్ధులందరును వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును... యెహోవా సర్వ లోకమునకు రాజైయుండును: ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కటే అని తెలియబడును" (జేకర్యా 14:4-5, 9).


సుమారు ప్రతి ఒక్కరు క్రీస్తు మొదటి రాకడను గూర్చి విన్నారు, ఆయన కన్య మరియ గర్భములోనికి దేవునిచే పంపబడ్డాడని, బెత్లెహేములో జన్మించాడని. అవును, మీరందరూ క్రీస్తు మొదటి రాకడను గూర్చి విన్నారు. అయినను బైబిలులో ఆయన రెండవ రాకడను గూర్చి మొదటి రాకడ కంటే ఎక్కువగా ఎనిమిది ఒకటి నిష్పత్తిలో వచనాలు చెప్పబడ్డాయి. డాక్టర్ డేవిడ్ జెర్మియా అన్నాడు,

రెండవ రాకడను గూర్చి బైబిలులో 1,845 వచనాలు ఇవ్వబడ్డాయి, అందులో 318 క్రొత్త నిబంధనలో ఇవ్వబడ్డాయని పండితులు చెప్పారు. ఆయన రాకడ పాత నిబంధనలో పదిహేడు పుస్తకాలలోనూ పదిహేడు పుస్తకాలలోను నూతన నిబంధనలో పదిలో ఏడు అధ్యాయాలలోను నొక్కి వక్కాణింపబడింది. [క్రీస్తే] స్వయంగా తన రాకడను గూర్చి ఇరవై ఒక్కసార్లు ప్రస్తావించాడు. విశ్వాసము తరువాత స్థానము రెండవ రాకడది నూతన నిబంధనలో బాగా ఎక్కువగా కనబడే అంశము ఇది (David Jeremiah, D.D., What in the World is Going On?, Thomas Nelson Publishers, 2008, page 217).

క్రీస్తు రెండవ రాకడను గూర్చి తేటయైన లేఖన భాగము, జెకర్యా 14:4-5, 9. ఈ పాఠ్యభాగము నుండి మనము మూడు గొప్ప పాఠాలు నేర్చుకుంటాము.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +
మా ప్రసంగములు ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.
వెళ్ళండి www.sermonsfortheworld.com.
గ్రీన్ బటన్ "యాప్" అనే పదముపై క్లిక్ చెయ్యండి.
వచ్చే సూచనలను గైకొనండి.
+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

I. మొదటిది, క్రీస్తు ఒలీలవ కొండపైకి తిరిగి వస్తాడు.

స్కోఫీల్డ్ గమనిక సరియైనదే అని నేను ఒప్పింపబడ్డాను.

జెకర్యా 14 పూర్తి విషయ వివరణము. [సంఘటనల] క్రమము: (1) రాజ్యములు సమకూర్చబడడం, వచనము 2 (చూడండి "ఆర్మ గెడ్డాన్," ప్రకటన 16:14; 19:11, గమనిక); (2) విడుదల, వచనము 3; (3) ఒలీవల కొండపైకి క్రీస్తు తిరిగి వచ్చుట, భౌతిక మార్పు, వచనము 4-8; (4) రాజ్యము స్థాపించడం, పూర్తి భూలోకపు ఆశీర్వాదము, వచనములు 9-21 (The Scofield Study Bible, 1917 edition, p. 978; note on Zechariah 13:8).

అన్యజన ప్రపంచ శక్తులు, అంత్య క్రీస్తు ఆధ్వర్యములో, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తమ సైన్యములను, ఆర్మ గెడ్దన్ అనబడే మెగిడ్దో లోయలోనికి పంపిస్తాయి. అంత్య క్రీస్తు సైన్యములు యేరూషలేమును సమీపిస్తాయి, కాని క్రీస్తు ఆకాశము నుండి అకస్మాత్తుగా తిరిగి వచ్చి వాటిని జయిస్తాడు. దయచేసి నిలబడి జెకర్యా 14:3-4 వరకు చదవండి.

"అప్పుడు యెహోవా బయలు దేరి, తాను యుద్ధ కాలమును యుద్ధము చేయు రీతిగా, అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యేరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న, ఒలీవల కొండమీద ఆయన పాదములు ఉంచగా, ఒళీవ కొండ తూర్పు తట్టునకు, పడమటి తట్టునకు నడిమికి విడిపోయి; సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును, కనుక విశాలమైన లోయ యొకటి ఏర్పడును" (జెకర్యా 14:3-4).

కూర్చోండి.

"ఆ దినమున ఒలీవకొండ మీద ఆయన పాదములుంచును" (జేకర్యా 14:4). ఒలీవకొండ యేరూషలేము తూర్పు దిక్కున ఉంది. ఆయన బంధింపబడక ముందు రాత్రి ఈకొండపైకే యేసు ప్రార్ధించడానికి వెళ్ళాడు. అపోస్తలుల కార్యములు 1:9-12 లో వ్రాయబడినట్టుగా, ఈ ఒలీవల కొండ మీద నుండే యేసు పరలోకమునకు ఆరోహణమయ్యాడు.

"ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, ఆయన, ఆరోహణమాయెను; అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను. ఆయన వెళ్ళుచుండగా, వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనష్యులు వచ్చిరి; వారి యెద్ద నిలిచి, గలిలయ మనష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి, పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమున బడిన కొండనుండి యేరూషలేమునకు తిరిగి వెళ్ళిరి, ఆ కొండ యేరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత, సమీపమున ఉన్నది" (అపోస్తలుల కార్యములు 1:9-12).

"ఆ దినమున ఒలీవకొండ మీద ఆయన పాదములుంచును" (జెకర్యా 14:4). ఏ పాదములైతే సిలువకు మేకులతో కొట్టబడ్డాయో పరలోకమునకు ఆరోహణమైన కొండమీద అవే పాదములు పెట్టబడతాయి అపోస్తలుల కార్యములు 1:9 ప్రకారము.

"ఒలీల కొండ తూర్పు తట్టునకు పడమర తట్టునకు నడిమికి విడిపోయి, విశాలమైన లోయ ఒకటి ఏర్పడును; సగము కొండ ఉత్తర తట్టునకు, సగము కొండ దక్షిణ తట్టునకు జరుగును" (జెకర్యా 14:4). డాక్టర్ మెక్ గీ అన్నాడు,

చోటు చేసుకోబోయే గొప్ప భౌతిక మార్పులు ఇక్కడ చెప్పబడ్డాయి. గొప్ప భూకంపము వస్తుంది, ఒళీవ కొండ నడిమికి విడిపోవును. సగము పడమటి వైపు సగము దక్షిణ తట్టుకు జరుగును. "విశాలమైన లోయ ఒకటి ఏర్పడును" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1982, volume III, p. 986).

కనుక, ఇది మొదటి విషయము – క్రీస్తు ఆకాశము నుండి ఒలీవకొండపైకి దిగి వచ్చును.

II. రెండవది, క్రీస్తు తన పరిశుద్ధులందరితో తిరిగి వచ్చును.

ఐదవ వచనము చివరి భాగము చూడండి.

"అప్పుడు నీతో కూడ, పరిశుద్దులందరును వచ్చెదరు" (జెకర్యా 14:5).

దీని అర్ధము ముందుగా ఎత్తబడిన క్రైస్తవులు ఆకాశము నుండి, క్రీస్తుతో పాటు, ఒలీవకొండ మీదికి దిగి వస్తారు. ఈ సంఘటన మొదటిగా ఏనోకుచే ప్రవచింపబడినది.

"ఆదాము మొదలుకొని, ఏడవ వాడైన, హనోకు, కూడ వీరిని గూర్చి ప్రవచించి, ఇట్లనెను, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను" (యూదా 14).

దీనిని గూర్చి అపోస్తలుడైన యోహాను ప్రకటన 19:14 లో మాట్లాడాడు, "పరలోకమందున్న సేనలు ఆయనను వెంబడించుచుండిరి," ఆయన అంత్య క్రీస్తు సైన్యమును నాశనము చేయడానికి ఒలీవకొండ మీదికి దిగి వచ్చును. డాక్టర్ జెర్మియా అన్నాడు,

రెండవ రాకడ సమయంలో పరిశుద్ధుల దూతల సమూహము క్రీస్తుతో పాటు వచ్చును - మీరు నేను అధిక శక్తి గల పరలోక వాసులతో వారి ప్రక్క నిలబడతాం... వారు యుద్ధము చేయరు. తిరుగుబాటు దారులను యేసే సంహరించును (డేవిడ్ జెర్మియా, ఐబిఐడి., పేజీ 224).

"అప్పుడు నీతోకూడ, పరిశుద్ధులందరును వచ్చెదరు" (జెకర్యా 14:5).

డాక్టర్ మెక్ గీ చెప్పాడు,

ఇది చాలా ఆసక్తికరమైన లేఖన భాగము. ఇది ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి భూమి మీదికి వచ్చు చిత్ర పఠము. ఇది ప్రకటన 19 లో కూడ చూస్తాము పరలోకపు సేన ఆయనను వెంబడించునని చెప్పబడింది (జే. వెర్నోన్ మెక్ గీ, ఐబిఐడి.).

జెకర్యా ప్రవచానములో ఇది రెండవ ప్రధాన విషయము – క్రీస్తు తన పరిశుద్దులందరితో అంత్య క్రీస్తు సేనను జయించడానికి తిరిగి వస్తాడు. నిజ మార్పు నొందిన వారు, తరాలుగా, ఆ సమయములో క్రీస్తుతో పాటు తిరిగి భూమి పైకి వస్తారు.

పదివేలు పదివేలు రెట్లు
   ప్రకాశమైన వెలుగులో,
విమోచింపబడిన పరిశుద్ధుల సమూహము
   వెలుగు ఉన్నత శిఖరాలలో;
'సమాప్తమైనది, అంతా సమాప్తమైనది,
   వారి పోరాటము మరణములో పాపముతో;
బంగారపు తలుపులు పూర్తిగా తెరువబడ్డాయి,
   విజయవంతులు ప్రవేశిస్తారు.
("పదివేలు పదివేల రెట్లు" హెన్రీ ఆల్ ఫోర్డ్ చే, 1810-1871).
(“Ten Thousand Times Ten Thousand” by Henry Alford, 1810-1871).

జాన్ కెన్నిక్ చార్లెస్ వెస్లీ ఇలా వ్రాసారు,

ఓ! ఆయన మేఘారూదుడై వచ్చును,
   మన రక్షణ కొరకు వధింపబడ్డాడు;
వేలు, వేలాది మంది పరిశుద్ధులు హాజరవుతారు,
   ఆయన వాహనము విజయోత్సాహము చూడండి;
హల్లెలూయ! హల్లెలూయా!
   పాలించడానికి దేవుడు భూమిపైకి వచ్చును.
("ఓ! ఆయన వచ్చును" జాన్ కెన్నిక్, 1718-1755;
   చార్లెస్ వెస్లీచే మార్చబడినది, 1707-1788).
          (“Lo! He Comes” by John Cennick, 1718-1755;
          altered by Charles Wesley, 1707-1788).

III. మూడవది, ఆయన భూరాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి క్రీస్తు తిరిగి వచ్చును.

దయచేసి నిలబడి జెకర్యా 14:9 గట్టిగా చదవండి.

"యెహోవా సర్వలోకమునకు రాజైయుండును: ఆ దినమున యెహోవా ఒక్కడే అని, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియబడును" (జెకర్యా 14:9).

కూర్చోండి. ఆ దినమున క్రీస్తు లోకమంతటికి రాజు కానున్నాడు. చివరకు, రెండు వెల సంవత్సరాలుగా క్రైస్తవులు చేయుచున్న ప్రార్ధనలకు జవాబు ఇవ్వబడుతుంది,

"మీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచుండునట్లు, భూమి మీద నెరవేరును గాక" (మత్తయి 6:10).

ఆయన భూ రాజ్యము వేయి సంవత్సరములు నిలుచును. దయచేసి ప్రకటన గ్రంథము, 20 అధ్యాయము, 4 నుండి 6 వచనాలు చూడండి. ఆ వచనాలు గట్టిగా చదవండి.

"అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆశీనులై యుండు వారికి, విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను: మరియు క్రూర మృగమునకైనను, వాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నోసళ్ళ యందు గాని, చేతుల యందు గాని, వాని ముద్ర వేయించుకొనిన వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్చేధానము చేయబడిన వారి ఆత్మలను చూచితిని; వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసిరి. ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్దులునై యుందురు: ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు, వీరు దేవునికి క్రీస్తునకు, యాజకులై క్రీస్తుతో కూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు" (ప్రకటన 20:4-6).

యెహోవా సాక్ష్యులు 1,000 ఏళ్ల పాలన నమ్ముతారు. కాని అందులో ఎలా ప్రవేశించాలో వారికి తెలియదు! నా కార్యాలయములో యెహోవా సాక్షి కరపత్రము చూసాను దాని శీర్షిక "శ్రమ అంతా త్వరలో ముగియును!" ఆ కర పత్రము చివరలో ఇలా చెప్పబడింది, "అంతము వచ్చినప్పుడు, ఎవరు జీవిస్తారు?...యెహోవా చిత్తము నేర్చుకోనువారు అది చేస్తారు" (“All Suffering Soon to End!,” Watch Tower Bible and Tract Society of Pennsylvania, 2005, p. 6). కనుక, యెహోవా సాక్ష్యులు నేర్పిస్తారు రాజ్యములోనికి ప్రవేశము దేవుని సత్యము "నేర్చుకొనుట" మరియు "చేయుట." అది గొప్ప పొరపాటు. క్రియల ద్వారా రక్షణ ఒక పొరపాటు – "నేర్చుకొనుట" ద్వారా రక్షణ దానిని "చేయడము" ఒక పొరపాటు! వింత ఏమిటంటే, యెహోవా సాక్షుల పొరపాటు రోమన్ కేథలిక్కుల పొరపాటు ఒకటే దాని వ్యతిరేకంగా వారు మాట్లాడుతారు. కేథలిక్కులు యెహోవా సాక్షుల రక్షణ, క్రియల ద్వారా రక్షణ నేర్చుకొనుట ద్వారా చేయడం ద్వారా అని నేర్పిస్తారు!

కాని బైబిలు బోధిస్తుంది రక్షణ కృప ద్వారా అని, నేర్చుకొనుట చేయుట ద్వారా కాదు; మానవ ప్రయత్నముతో కాదు, కాని కృప చేతనే.

"మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు: దేవుని వరమే: అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలులేదు" (ఎఫెస్సీయులకు 2:8-9).

జాన్ న్యూటన్ అన్నాడు,

అధ్బుత కృప! ఆ స్వరము ఎంత మధురము
   నాలాంటి దౌర్భాగ్యుడిని రక్షించింది!
నేను ఒకసారి తప్పిపోయాను, కాని ఇప్పుడు కనుగొనబడ్డాను;
   ఒకప్పుడు గుడ్డివాడను, కాని ఇప్పుడు చూస్తున్నాను.

కృప భయపడమని నా హృదయానికి భోధించింది,
   కృప నా భయాలను తొలగించింది;
ఆ కృప ఎంత ప్రశస్తమైనది
   నేను మొదట నమ్మిన ఆ ఘడియ!
   ("అద్భుత ప్రేమ" జాన్ న్యూటన్ చే, 1725-1807).
          (“Amazing Grace” by John Newton, 1725-1807).

దేవుడు మీకు కృపను అనుగ్రహించును గాక

"ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, నీవు రక్షించ బడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట జాక్ గ్నాన్ గారిచే:
     "ఆయన తిరిగి వచ్చుచున్నాడు" (మాబెల్ జాన్ స్టెన్ కెంప్ చే, 1871-1937).
      “He is Coming Again” (by Mabel Johnston Camp, 1871-1937).ద అవుట్ లైన్ ఆఫ్

భూలోక రాజ్యాన్ని క్రీస్తు ఎలా ఏర్పాటు చేస్తాడు

HOW CHRIST WILL SET UP HIS EARTHLY KINGDOM

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"ఆ దినమున యేరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒళీవ కొండమీద ఆయన పాదములు ఉంచగా, ఒళీవ కొండ తూర్పు తట్టునకు, పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకు సగము కొండ దక్షిణ తట్టునకు జరుగును, గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును; కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా. మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు: మీరు, యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు, మీరు పారిపోవుదురు: అప్పుడు నీతో కూడ పరిశుద్ధులందరును వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును... యెహోవా సర్వ లోకమునకు రాజైయుండును: ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కటే అని తెలియబడును" (జేకర్యా 14:4-5, 9).

I.   మొదటిది, క్రీస్తు ఒలీలవ కొండపైకి తిరిగి వస్తాడు, జెకర్యా 14:3-4;
అపొస్తలుల కార్యములు 1:9-12.

II.  రెండవది, క్రీస్తు తన పరిశుద్ధులందరితో తిరిగి వచ్చును, జెకర్యా 14:5;
యూదా 14; ప్రకటన 19:14.

III. మూడవది, ఆయన భూరాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి క్రీస్తు తిరిగి వచ్చును,
జెకర్యా 14:9; మత్తయి 6:10: ప్రకటన 20:4-6; ఎఫెస్సీయులకు 2:8-9;
అపొస్తలుల కార్యములు 16:31.