Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మనము చేసేది ఎందుకు చేస్తాము – సువార్త సేవలో

WHY WE DO WHAT WE DO – IN EVANGELISM
(Telugu)

డాక్టర్ సి. ఎల్. కాగన్ చే వ్రాయబడిన ప్రసంగము
మరియు రెవ. జాన్ సామ్యూల్ కాగన్ చే బోధింపబడినది
లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము ఉదయము, అక్టోబర్ 28, 2018
A sermon written by Dr. C. L. Cagan
and preached by Rev. John Samuel Cagan
at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, October 28, 2018

"రాజ మార్గములోనికి కంచెలలోనికి వెళ్లి, లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము" (లూకా 14:23).


ప్రజలు మన సంఘములోనికి వచ్చి సువార్త వినునట్టుగా మనము సువార్త పని చేస్తాము. ఇతర సంఘాలలో, సభ్యులు "పాపి ప్రార్ధన" ప్రజలతో చేసి వీధులలో వారు ఈ "నిర్ణయము" తీసుకున్న తరువాత గుడికి వారిని ఆహ్వానిస్తారు. కాని మనము చేసే మొదటి పని ప్రజలను గుడికి ఆహ్వానించడం. అప్పుడు వారిని గుడికి తీసుకొని వస్తాము. వారు వచ్చినప్పుడు, వారు గుడిలో స్నేహితులను పొందుకుంటారు. బోధింపబడిన సువార్త వింటారు. వారిలో కొందరు ఉండి క్రీస్తును విశ్వసిస్తారు. వారు అద్భుత క్రైస్తవులవుతారు. ఈ కొత్త పద్ధతి మన సంఘ కాపరి, డాక్టర్ హైమర్స్ నుండి వచ్చినది. ఆయన దానిని ఏర్పాటు చేసాడు ఎందుకంటే నశించు ప్రజలను మన గుడికి నడిపించడంలో మిగిలిన పద్ధతులన్నీ విఫలమయినట్టు ఆయన గ్రహించాడు.

డాక్టర్ హైమర్స్ పద్ధతి ఏమిటి? మనము సువార్త సేవలో ఏమి చేస్తాము? బుధవారము రాత్రి, గురువారము రాత్రి మరియు మిగిలిన సమయాలలో ఇద్దరిద్దరముగా మనము కళాశాలకు, లాస్ ఎంజిలాస్ ప్రాంతములో ఉన్న వ్యాపార కేంద్రాలకు బహిరంగ ప్రదేశాలకు వెళ్తాము. చాలామంది మనలలో ఇది మనము స్వంతముగా చేస్తాము. ఈ ప్రదేశాలలో, ప్రజల దగ్గరకు వెళ్లి వారిచే మాట్లాడతాము. అప్పుడే వారు క్రీస్తును నమ్మేటట్టు చెయ్యము. వారిని "పాపి ప్రార్ధన"కు నడిపించుము. బదులుగా, మన సంఘములో ఎలా ఉంటుందో చెప్తాం. గుడిలో చాలామంది యువతీ యువకులుంటారు వారితో స్నేహము చేసుకోవచ్చు. వారు ప్రసంగము వింటారు. (ఉదయాన వస్తే) మధ్యాహ్న భోజనము చేస్తారు లేక (సాయంకాలమైతే) రాత్రి భోజనము చేస్తారు. ఒక సినిమా చూస్తారు. ఒక సందడిలో ఉంటారు – మనము మన గుడిలో అందరి పుట్టిన రోజులు చేస్తాము. వారికి మంచి సమయము ఉంటుంది. వారిలో చాలామంది రావాలనుకుంటారు!

అప్పుడు వారిని వారి పేర్లు ఫోను నంబర్లు ఇవ్వమంటాము. తరువాత, ఈ పేర్లు నంబర్లు మన పరిచారకులకు ఇతర అనుభవనీయులైన క్రైస్తవ కార్యకర్తలకు ఇస్తాము. ఈ కార్యకర్తలు ప్రజలకు ఫోను చేసి, మన సంఘమును గూర్చి చెప్పి, వారిని ఆహ్వానించి, మన సంఘ సభ్యులు ఒకరితో ఆదివారము రావడానికి ఏర్పాటు చేస్తాము. ఆదివారము, వారిని తీసుకొని, గుడికి తెచ్చి, తిరిగి ఇంటికి తీసుకేళ్తాము. ఫోన్ చేసిన తరువాత చాలామంది మొదటి ఆదివారము గుడికి వస్తారు. మిగిలిన వారు తీరిక లేక తరువాత వస్తారు. వారు గుడికి వచ్చాక, సువార్త వింటారు భోజన సమయములో తరువాత చాలామంది స్నేహితులవుతారు – వారిలో చాలామంది తిరిగి వస్తారు!

ఈ పద్దతి పనిచేస్తుంది! గత ఐదు వారాలలో, వందమందికి పైగా మన గుడికి మొదటిసారి, రెండవసారి లేదా మూడవసారి వచ్చారు. కొంతమంది గుడిలో ఉండి క్రీస్తును విశ్వసించారు. ఈ పద్దతి వాస్తవానికి మన గుడిలోనికి ప్రజలను తెస్తుంది. ఇది పని చేస్తుంది!

క్రీస్తు లూకా 14:23 లో చెప్పినది అనుకరించి డాక్టర్ హైమర్స్ సువార్త సేవ చేయడానికి మార్గము కనిపెట్టారు, "రాజ మార్గములోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు, అక్కడి వారిని బలవంతము చేయుము." మొదటిగా, నశించు వారిని గుడికి తీసుకొని వస్తాము. అక్కడ వారు సువార్త విని క్రీస్తును విశ్వసిస్తారు. ఆధునిక అమెరికా సంఘాలు దీనిని వేరుగా చేస్తాయి. వారు వీధులలో త్వరిత "నిర్ణయానికి" ప్రజలను నడిపిస్తారు. కాని వారిలో ఎవరు గుడికి రారు. ఈ పద్దతి నిర్ణయాలు చేస్తుంది, కాని మార్పిడులు కాదు. ఈరోజు వారి చేసే దానికి వేరుగా మనము ఎందుకు సువార్త సేవ వేరుగా చేస్తామో నేను వివరిస్తాను.

ఎందుకు మనము బయటకి వెళ్లి పేర్లు తీసుకొని వారిని గుడికి ఆహ్వానిస్తాము, మనము వారితో మాట్లాడుచున్నప్పుడు ఎందుకు రక్షింప ప్రయత్నించము?

మొదటిది, ఎందుకంటే మన మార్గము బైబిలు పరమైనది. ఇది నూతన నిబంధనలో ఉంది. అంద్రేయ పన్నెండు మంది శిష్యులలో ఒకడు. బైబిలు చెప్తుంది,

"యోహాను మాట విని [బాప్టిస్టు] ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు, ఆయనను వెంబడించి, సీయోను, పేతురు సహోదరుడైన అంద్రేయ. యితడు మొదట తన సహోదరుడైన సీయోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని, అతనితో చెప్పి, యేసు నొద్దకు అతని తోడుకోనివచ్చెను, మెస్సియా అనుమాటకు అభిషక్తుడని అర్ధము, యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీయోనువు. నీవు కేఫా అనుబడుదువని చెప్పెను కేఫా అనుమాటకు రాయి అని అర్ధము" (యోహాను 1:40-42).

ఆంద్రియకు ఏమి తెలియదు. కాని యేసు మెస్సియా అని తెలుసుకున్నాడు. అంద్రేయ ప్రజలతో పాపి ప్రార్ధన చెయ్యలేదు. కాని తన సహోదరుడైన సీయోను పేతురును యేసు నొద్దకు తెచ్చాడు. పేతురు శిష్యుడయ్యాడు. తరువాత పేతురు మార్చబడి పెంతేకొస్తు దినాన బోధించినప్పుడు మూడువేల మంది క్రీస్తును విశ్వసించారు. కాని ఇది అంతా అతడు తన సహోదరునితో యేసును కలిసినప్పుడు ప్రారంభమయింది.

శిష్యుడు ఫిలిప్ప అదే విషయము నతాని మేలుకు చెప్పాడు. అతడు నతానియేలుతో అన్నాడు, "వచ్చి చూడుము" (యోహాను 1:46). ఫిలిప్పుకు ఎక్కవ ఏమి తెలియదు. కాని అతడు నతానియేలును యేసు నొద్దకు తెచ్చాడు, తద్వారా తేడా చూపించాడు.

ఒకరోజు యేసు సమరయ ద్వారా వెళ్తూ ఒక స్త్రీని రక్షణలోనికి నడిపించాడు. ఆమెకు బైబిలు తెలియదు. ఆమె యూదురాలు కాదు. కాని ఆమె యేసును విశ్వసించింది. ఆమె తన పట్టణానికి వెళ్ళి పాపి ప్రార్ధన చెయ్యమని ప్రజలతో చెప్పలేదు. కాని ఆమె యేసును వచ్చి చూడమని వారిని ఆహ్వానించింది. బైబిలు చెప్తుంది,

"ఆ [సమరయ] స్త్రీ తనకుండ విడిచి పెట్టి, ఊరిలోనికి వెళ్లి, మీరు వచ్చి, నేను చేసిన వన్నియు, నాతో చెప్పిన, మనష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కదా: అని ఆ ఊరి వారితో చెప్పెను?" (యోహాను 4:28, 29).

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +
మా ప్రసంగములు ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.
వెళ్ళండి www.sermonsfortheworld.com.
గ్రీన్ బటన్ "యాప్" అనే పదముపై క్లిక్ చెయ్యండి.
వచ్చే సూచనలను గైకొనండి.
+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ప్రతి ఒక్కడు అలా చెయ్యవచ్చు – మీరు రక్షింప బడక పోయినను. మీరు బైబిలు సిద్ధాంతము నేర్చుకోవడానికి తరగతికి వెళ్లనక్కర లేదు. మీరు ప్రజల ప్రశ్నలకు జవాబులు చెప్ప ప్రయత్నించడం లేదు. వారు వీధిలో రక్షింపబడేలా చెయ్యడం లేదు. మీరు గుడికి రావాలని వారిని ఆహ్వానిస్తున్నారు, స్నేహితులుగా చేసుకొని మంచి సమయము గడపాలని. ప్రతి ఒక్కరు అలా చెయ్యవచ్చు – మనము అది చేస్తున్నాము.

రెండవది, మన పద్ధతి పనిచేస్తుంది కాబట్టి. చాలా సంఘాలు అసలు సువార్త సేవే చెయ్యరు. కాని వారు చేస్తే, బయటకి వెళ్లి వీధిలో ప్రజలతో మాట్లాడతారు. త్వరగా నశించు వారికి "రక్షణా ప్రణాళిక" యిస్తారు మరియు అక్కడే "పాపి ప్రార్ధన" చెయ్యమంటారు. ఇది "నిర్ణయత్వము." "నిర్ణయము" తీసుకున్న వ్యక్తిని మారిన వానిగా లెక్కిస్తారు. ఆ వ్యక్తిని "రక్షింపబడిన" వానిగా లెక్కిస్తారు. తరువాత, సంఘాలు ఈ ప్రజలను "వెంబడిస్తారు" – కాని వారిలో ఎవరు గుడికి రారు. నా తండ్రి, డాక్టర్ కాగన్ ఒకసారి ఒక ప్రాధమిక బాప్టిస్టు సంఘాన్ని దర్శించారు అక్కడ ఒక వారములో వారు 900 మందితో ప్రార్ధిస్తారు – కాని గుడిలో 125 మందే ఉంటారు. 900 మంది నిర్ణయము తీసుకున్నారు, కాని వారు ఎన్నడు గుడికి రారు. వారు ప్రార్ధన చేసారు కాని, క్రీస్తు నొద్దకు రాలేదు.

ఆ సంఘాలు చేసినట్టు మనము ఎందుకు చెయ్యము? అని పని చెయ్యదు. సంఘస్తులు వందలాది మందిని పాపి ప్రార్ధనకు నడిపిస్తారు. కాని వారిలో ఏ ఒక్కరు గుడికి రారు. వారు క్రైస్తవులు అవరు. వారు "నిర్ణయము" తీసుకున్నారు కాని మారలేదు.

మనము మాట్లాడిన వెంటనే పాపులను క్రైస్తవులుగా ఎందుకు చెయ్యము? ఎందుకంటే వారు క్రైస్తవులు అవరు! బదులుగా, మనము బయటికి వెళ్ళి గుడికి ప్రజలను ఆహ్వానిస్తాము. మనము వారి పేర్లు ఫోన్ నంబర్లు అడుగుతాము. మన పరిచారకులు నాయకులు వారికి ఫోన్ చేసి ఆదివారము దగ్గరుండి గుడికి తీసుకొని వస్తారు. వారిని మన స్వంత కారులలో గుడికి తెస్తాము. వారితో స్నేహము చేసుకుంటాము. ఆదివారము ఉదయపు ఆరాధన తరువాత, ఆదివారము సాయంకాలము ఆరాధన తరువాత వారితో భోజనము చేస్తాము. మనము గుడిలో వారిని సంతోష పెడతాము. తరువాత మన పరిచారకులు కార్యకర్తలు వారికి ఫోన్ చేసి మళ్ళీ గుడికి రమ్మని ఆహ్వానిస్తారు.

మనము చేసేది ఎందుకు చేస్తాము? అది పని చేస్తుంది కాబట్టి. మన పద్దతి ప్రజలను గుడికి, గుడిలోనికి తెస్తుంది. గుడిలో వారు సువార్త బోధ వింటారు. కొందరు క్రీస్తును నేరుగా నమ్ముతారు, కాని చాలామంది మారేముందు వారాలు నెలలు సువార్త బోధ వినాలి. అప్పుడు వారు గుడిలో వారి శేష జీవితములో క్రైస్తవులుగా జీవిస్తారు. ఇంకొక పద్ధతి ఫోన్ చెయ్యడం అది ఎవరినీ సంపాదించదు!

కొన్ని నెలల క్రితము నేను నా తండ్రి డాక్టర్ కాగన్ తో పాటు నోవాసాంగ్ తో పాటు ఆఫ్రికా వెళ్ళాను. మేము యుగాండా, కెన్యా ర్వాండాలలో సంఘాలలో బోధించాము. కెన్యాలో కాపరుల సదస్సులో మాట్లాడాము. మధ్యాహ్నము ఆలస్యంగా కూటము ముగిసింది. డాక్టర్ కాగన్ కాపరులతో చెప్పాడు, "బయటికి వెళ్ళి పేర్లు తెద్దాం." మేము నైరోబి, కెన్యా వీధులలో కాపరులతో వెళ్ళాం వారు స్వహిలిలో తర్జుమా చేసారు. మేము ప్రజలతో మాట్లాడి ఫోన్ నంబర్లు తీసుకున్నాం. మేము వారిని గుడికి ఆహ్వానించాం. కాపరులు వారికి ఫోన్ చేసి వారు వచ్చేటట్టు ఏర్పాటు చేసారు. మరునాడు ఐదుగురు సందర్శకులు వచ్చారు! మేము ర్వాండాకు వెళ్ళినప్పుడు, సంఘ కాపరులు అది మళ్ళీ చేసారు ఆదివారము ఇంకొక ఐదుగురు సందర్శకులు వచ్చారు!

బోధకులు ఉత్సాహ భరితులయ్యారు. పనిచేసే పద్ధతి వారు కనుగొన్నారు! వారు మాతో చెప్పారు వారు చాలా డబ్బు అద్భుత ప్రయాస కూటముల కొరకు వెచ్చించి చూపించారు, నిర్ణయాలు తీసుకున్న వారు గుడికి రాలేదు. సువార్త సేవకు అది ఒకటే మార్గమని కాపరులు అనుకున్నారు. మన పద్దతి నేర్చుకుని వారు సంతోషించారు, అది చాలా మందిని గుడికి నడిపించింది.

మూడవది, మన పద్ధతి మీకు మంచిది, ఆహ్వానించబడిన వారికి మాత్రమే కాదు. అది మిమ్ములను బలమైన క్రైస్తవునిగా చేస్తుంది. మీరు సువార్త సేవ క్రమముగా చేస్తే మీరు ఆహ్వానించిన వారు గుడికి వచ్చి, గుడిలో ఉండి, క్రీస్తును విశ్వసిస్తే అది మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. మీరు ఆహ్వానించిన వారు గుడికి రావడం చూడడం గొప్ప ఆనందాన్ని మీకు కలిగిస్తుంది. వారు రక్షణ పొందడం చూడడం ఇంకా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందము మీకుండాలని నా ఆశ!

మనం కరపత్రాలు ఎందుకివ్వకూడదు? కొంతమంది చేస్తారు. కరపత్రము అంటే మీకు తెలియకపోవచ్చు. కరపత్రము ఒక కాగితము, మడత పెట్టబడి ఉంటుంది, తీసుకునే వారికి ఎక్కువ సంఖ్యలో ఇవ్వబడతాయి. కరపత్రము ఒక కథ చెప్పి రక్షణ ప్రణాళిక ఇస్తుంది. చివరిలో క్రీస్తును నమ్మాలని చెబుతుంది ప్రార్ధన చేయించి లేక కర పత్రముపై సంతకము చేయించడం ద్వారా.

చాలా సంఘాలలో ప్రజలు కరపత్రాలు ఇస్తారు. వారు ప్రజలను క్రీస్తు నొద్దకు తెస్తున్నట్టు అనుకుంటారు. కాని కరపత్రాలు ప్రజలను క్రీస్తు నొద్దకు రప్పించవు. అవి వారిని గుడిలోనికి రప్పించవు. వారు ఎక్కడ ఉన్నారు? కరపత్రాలు వలన సమయము ధనము వృధా అవుతుంది. అందుకే మనము వాటిని వాడము.

మనకెలా తెలుసు? దానిని ప్రయత్నించాము. లక్షల కరపత్రాలు ఇచ్చాము. ప్రజలు వాటిని చదివారు. కాని ఎవరు గుడికి రాలేదు! ఆ కాగితము చదివినప్పుడు వారు మారలేదు. ఆ పద్దతి బైబిలు ప్రకారము కాదు. బైబిలు క్రైస్తవులను కరపత్రాలు పంచమని చెప్పలేదు. కాని బైబిలు చెప్తుంది బయటికి వెళ్లి లోపలికి వచ్చునట్లు పాపులను బలవంతము చెయ్యమని – స్థానిక సంఘములోనికి! అది మనము చేస్తున్నాము.

మనము ఇద్దరిద్దరముగా ఎందుకు బయటికి వెళ్తాం? ఎందుకంటే యేసు తన శిష్యులను అలా పంపాడు కాబట్టి. బైబిలు చెప్తుంది క్రీస్తు "ఆయన పన్నెండుగురు శిష్యులను తన వద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపెను" (మార్కు 6:7). మళ్ళీ, బైబిలు చెప్తుంది "ప్రభువు డెబ్బదిమంది ఇతరులను [నియమించి] ఎన్నుకొని, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటకిని తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపెను" (లూకా 10:1).

బహుశా, మీరు మీకు మీరుగా సువార్త సేవకు వెళ్ళవచ్చును. బైబిలు ఎన్నడు దానిని వ్యతిరేకించలేదు. దానిలో తప్పులేదు. కాని ఇద్దరిద్దరు వెళ్ళడం బైబిలు ప్రకారము, అది పని చేస్తుంది!

ఇద్దరిద్దరుగా వెళ్ళడం ఎక్కువ మందిని గుడికి నడిపిస్తుంది. లాస్ ఎంజిలాస్ మరియు పెద్ద పట్టణాలలో, ప్రజలు అనుమానస్తులు. తెలియని వారితో మాట్లాడరు. యవనస్తులు పెద్దవారిని అనుమానిస్తారు. అమ్మాయిలు అబ్బాయిలను అనుమానిస్తారు. ఇద్దరు వెళ్తే వారి భయాలు తొలగి ఎక్కువ పేర్లు వస్తాయి.

ఇద్దరిద్దరిగా వెళ్ళడం మీకు మంచిది. ఎక్కువ అనుభవమున్న క్రైస్తవునితో వెళ్ళితే, గుడికి ప్రజలను ఎలా ఆహ్వానించాలో మీరు నేర్చుకుంటారు. ఆరంభములో, మీరు భయపడవచ్చు. ఏమి చెయ్యాలో తెలియదు. ఇంకొకరితో వెళ్ళడం వలన అది ఎలా చెయ్యాలో మీకు తెలుస్తుంది. త్వరలో పేర్లు మీరే తెస్తారు!

మీకు మంచి క్రైస్తవ సహవాసము ఉంటుంది. యేసు కొరకు పని చేయడం మీతో పనిచేసే క్రైస్తవులతో మిమ్మును సన్నిహితంగా ఉంచుతుంది. "సహవాసపు పని" నిజంగా అద్భుత సహవాసము.

వేరే విధానము పని చేయదని మాకు ఎలా తెలుసు? సంవత్సరాలుగా ప్రయత్నించాం! ఇంటింటికి వెళ్లి బిల్లి గ్రేహము కరపత్రాలతో రక్షణ ప్రణాళిక ప్రజలకు తెలియ చేసాం. వారి గుమ్మం దగ్గర, వీధిలో వారితో పాపి ప్రార్ధన చేయించాము. లక్షలాది కరపత్రాలు ఇచ్చాం. కాని ప్రజలు రాలేదు. వారు మారలేదు. ఆ మార్గము పనిచేయదు.

కాని మా పద్ధతి పనిచేస్తుంది! లాస్ ఎంజిలాస్ నడిబొడ్డున మా సంఘము ఉంది. లాస్ ఎంజిలాస్ దేవుడు లేని దుష్ట పట్టణము. అన్ని పాపాలు ఇక్కడ జరుగుతాయి. ప్రజలు పని పాఠశాల కుటుంబము స్నేహితులతో తీరిక లేకుండా ఉంటారు. టెలివిజన్ అంతర్జాలము ఐఫోనులతో, దృష్టి మరలుతుంది. చాలా కొద్దిమంది గుడికి వెళ్తారు. కొద్దిమంది నిజ క్రైస్తవులు. వీధిలో ప్రజలను ప్రార్ధనలో నడిపించు ప్రయత్నించాము. కాని అది గుడిని కట్టలేదు. అది క్రీస్తు కొరకు ప్రజలను సంపాదించదు.

మేము అనుభవము ద్వారా నేర్చుకున్నాం. మేము బయటకు వెళ్లి ప్రజలను గుడికి ఆహ్వానించాం. వారిని గుడికి తీసుకొచ్చాం అక్కడ వారు స్నేహితులను కనుగొని సువార్త విన్నారు. మన గుడిలో ప్రతి ఆదివారము నశించు వారు వస్తారు. వేరే సంఘాల నుండి రారు. వారు క్రైస్తవ గృహముల నుండి రారు. వారు పాపలోకము నుండి వస్తారు. కొంతమంది అద్భుత క్రైస్తవులవుతారు. అందుకే మన సంఘము ఆత్మీయంగా జీవంతో ఉంటుంది. మన పద్ధతి నిజ క్రైస్తవులను తయారు చేస్తుంది, వారిని బట్టి మేము దేవునికి వందనస్తులము! ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట జాక్ గ్నాన్ గారిచే:
"వారిని లోనికి రప్పించుము" (అలెక్సేనా థామస్ చే, 19 వ శతాబ్దము).
“Bring Them In” (by Alexcenah Thomas, 19th century).