Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 42 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
చైనాలో విజయానికి రహస్యము

(చైనీయ మధ్యంతర పండుగలో ఇవ్వబడిన ప్రసంగము)
THE SECRET OF SUCCESS IN CHINA
(A SERMON GIVEN AT THE CHINESE MID-AUTUMN FESTIVAL)
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే,
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంకాలము, సెప్టెంబర్ 30, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles Lord's Day Evening, September 30, 2018

"నీ శ్రమను, దరిద్రతను, నేనెరుగుదును, (అయినను నీవు ధనవంతుడవే)..." (ప్రకటన 2:9).


చైనీయ క్రైస్తవ పితురుడైన సంఘ కాపరి వాంగ్ మింగ్ డావ్ ఇలా అన్నాడు,

చైనీయ ప్రభుత్వమూ ఏ విధానమును అవలంభించినప్పటికినీ, చైనాలోని సంఘము రాబోవు తరములలో ప్రపంచమంతటా క్రైస్తవ్యము రూపును ప్రగాడముగా ప్రభావితము చేస్తుంది. [సుమారు] డభై మిలియనుల ఆత్మలతో [ఇప్పుడు 160 మిలియనులు] సాంవత్సరిక 7 శాతము అభివృద్ధితో, చైనాలోని క్రైస్తవుల సంఖ్య భూమిపై ఉన్న దేశాలలో ఉన్న క్రైస్తవుల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నది. అభివృద్ధి చెందుచున్న దేశాలలోని క్రైస్తవుల వలే, చైనీయ క్రైస్తవులు ఇరవై ఒకటవ శతాబ్దములో [మొదటి స్థానము] ఉన్నారు (Thomas Alan Harvey, Acquainted With Grief, Brazos Press, 2002, p. 159).

తన పుస్తకము భైజింగ్ లో యేసులో, డేవిడ్ అయిక్ మాన్, ఇలా అన్నాడు,

సంఖ్యను లెక్కించము కాదు గాని, విజ్ఞాన కేంద్రమును గూర్చి ఆలోచించాలి... క్రైస్తవ్యము యూరపు ఉత్తర అమెరికాలను వదిలి చైనాలో క్రైస్తవీకరణము కొనసాగుతుంది చైనా విశ్వములోనే అగ్ర రాజ్యముగా కాబోతుంది... ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించబడి ఉంటుంది చైనా ఇంటి సంఘ నాయకుల ద్వారా (David Aikman, Jesus in Beijing, Regnery Publishing, 2003, pp. 291, 292).

స్ముర్న సంఘమును గూర్చి క్రీస్తు ఇచ్చిన వివరణ ఈనాడు చైనాలో "ఇంటి సంఘము" ఉద్యమము ద్వారా జరుగుతుంది,

"నీ శ్రమను, దరిద్రతను, నేనెరుగుదును, (అయినను నీవు ధనవంతుడవే)..." (ప్రకటన 2:9).

స్ముర్న సంఘమును గూర్చి, డాక్టర్ జేమ్స్ ఓ. కోంబ్ ఇలా అన్నాడు,

స్ముర్న, ఉత్తర ఎఫెస్సులో ఉంది, దశాబ్దాలుగా సంఘమునకు పోలికార్ప్ కాపరిగా ఉన్నాడు అతడు 155 ఏ.డి. లో హత సాక్షిగా మరణించాడు అతని 90 వ ఏట... వారు చాలా శ్రమను సహించారు, కాని వారు ఆత్మీయంగా గొప్పవారు (James O. Combs, D.Min., Litt.D., Rainbows From Revelation, Tribune Publishers, 1994, p. 33).

స్ముర్నలోని సంఘము వలే, చైనాలోని ఇంటి సంఘములలోని నమ్మకస్తులైన క్రైస్తవులు చాలా హింసను "శ్రమలు" అనుభవించారు అయినను వారు ఆత్మీయంగా చాలా "గొప్పవారు" వారి సువార్త సేవ "7 శాతము సాంవత్సరిక" వృద్ధిరేటును కనుపరిచింది (థామస్ అలాన్ హార్వీ, ఐబిఐడి.). అలా, చైనాలోని క్రైస్తవులు ఇప్పటికే "భూమిపై ఉన్న చాలా దేశములలోని క్రైస్తవులను సంఖ్యలో మించిపోయారు." చైనాలోని 160 మిలియనులలో చాలామంది క్రైస్తవులు నిజంగా మారిన వారని నేననుకుంటున్నాను, వారు అమెరికాలోని క్రైస్తవుల కంటే చైనాలోని వారు నిజ క్రైస్తవులు. ఇది ఆశ్చర్యము! మనలను ప్రశ్నించుకోవాలి, "వారి విజయానికి కారణము ఏమిటని? వారి సువార్తసేవకు రహస్యము ఏమిటి అని?" ఎందుకు వారిని గూర్చి ఇలా చెప్పబడింది,

"నీ శ్రమను, దరిద్రతను, నేనెరుగుదును, (అయినను నీవు ధనవంతుడవే)..."? (ప్రకటన 2:9).

సువార్తిక క్రైస్తవ్యము అమెరికాలో ఏ మాత్రము పెరుగుట లేదు అనే వాస్తవాన్ని మనము ఆలోచిస్తున్నప్పుడు, వాస్తవము చాలా మంది అంటున్నారు ఇక్కడ సువార్తిక క్రైస్తవ్యము చనిపోతుందని, ఇక్కడ అమెరికాలో మనము లోతుగా ఆలోచించాలి దేనిని గూర్చి అంటే మనకు ఉన్నది వారికి లేనిది, మనకు లేనిది వారికి ఉన్నది.

I. మొదటిది, వారికి ఏమి లేదో అది మనకు ఉంది.

వారికి సంఘ భవనములు లేవు! కేవలము "మూడు అరల" సంఘములు భవనములు కలిగి ఉండేవి. కాని "ఇంటి సంఘములు" ఎదుగుచున్నాయి, అవి కొన్ని సంఘ భవనములు కలిగి ఉండేవి. వాటిలో చాలా వాటికి మనకు వలే సంఘ భవనములు ఉండేవి కావు!

వారికి ప్రభుత్వ అనుమతి లేదు. చైనా ప్రభుత్వముచే వారు హింసింపబడేవారు. మన వలే వారికి మత స్వాతంత్ర్యము లేదు!

మన వలే సంఘ కాపరులకు నేర్పించడానికి వారు వేదాంత పాఠశాలలు లేవు. చైనాలో కాపరులకు ఇళ్ళల్లోనే తర్ఫీదు పొందేవారు – అది సంక్షిప్తము పూర్తి స్థాయి కాదు. "కొనసాగుతూనే" కొంత తర్ఫీదు పొందేవారు.

వారికి సబ్బాతుబడి భవనాలు లేవు. "బస్సు పరిచర్యకు" బస్సులు లేవు. వారికి "క్రైస్తవ టివి" లేదు. వారికి "క్రైస్తవ రేడియో" లేదు. వారికి క్రైస్తవ ముద్రణా గృహాలు లేవు. "శక్తి ప్రదర్శనకు" వారికి సామాగ్రి లేదు. పెద్ద తెరపై బోధకుని చూపడానికి వారికి టివి ప్రొజెక్టర్ లేవు. వారికి "క్రైస్తవ రాక్ బ్యాండ్" లేదు. వారికి ఆర్గన్ లు కాని, పియానోలు కాని లేవు. వారికి ముద్రింపబడిన సబ్బాతు బడి వనరులు లేవు. వారికి బైబిల్లు కాని, పాటల పుస్తకాలు గాని లేవు. లేవు, మనకున్నవి వారికి లేవు! బదులుగా, వారికి ప్రభుత్వము నుండి భయంకరమైన హింస శ్రమ ఉండేవి. క్రైస్తవులయినందుకు వారు చెరసాలకు వెళ్ళవలసివచ్చేది. నిజ క్రైస్తవులకు ఆ భయము ఎప్పుడు ఉండేది! చైనాలో క్రైస్తవుల చిత్రహింసలను గూర్చి చదవడానికి www.persecution.com చూడండి. అయినను చైనాలో క్రైస్తవులు ఆత్మలను సంపాదించడములో బాగా జయవంతులయ్యారు. ఆధునిక ఉజ్జీవ చరిత్రలో, చైనాలో క్రైస్తవుల సంఖ్య విపరీతముగా పెరిగింది!

"నీ శ్రమను, దరిద్రతను, నేనెరుగుదును, (అయినను నీవు ధనవంతుడవే)..." (ప్రకటన 2:9).

లవొదికయ సంఘములో చెప్పిన మాటలు అమెరికాలో చాలా సంఘాలకు వర్తిస్తాయని నేను అనుకుంటున్నాను,

"నీవు దౌర్భాగ్యుడవును, దిక్కు మాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును; దిగంబరుడవువై యున్నానని యెరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదవలేదని, చెప్పుకొనుచున్నావు" (ప్రకటన 3:17).

II. రెండవది, వారు కలిగియున్నది మనకు లేదు.

వారికి ఉన్నది మనకు లేదు. ఇక్కడ వారి విజయ రహస్యము ఉంది – మన వైఫల్యానికి కారణము కూడ ఉంది!

వారికి శ్రమ ఉంది – సిలువను మోయడం నేర్చుకున్నారు! చాలామంది అమెరికా క్రైస్తవులు వారములో ఒక సాయంత్రము ప్రార్ధనా కూటానికి వెళ్ళడానికి శ్రమపడడానికి అఇష్ట పడుతున్నారు. చాలామంది అమెరికా క్రైస్తవులు ఆత్మల సంపాదనకు వారములో ఒక రోజు శ్రమ పడడానికి ఇష్టపడడం లేదు. చాలామంది అమెరికా క్రైస్తవులు ఆదివారం సాయంత్రం గుడికి వచ్చి శ్రమ పడడానికి ఇష్టపడడం లేదు! అమెరికాలో చాలామంది సంఘ కాపరులు బరువు తగ్గాలి. కొన్ని కేలరీలు తగ్గడానికి శ్రమ పడాలి. కాని చైనాలో ప్రసంగీకులు సన్నగా ఉంటారు. అందుకే వారు ఉత్సాహముతో శక్తితో బోధిస్తారు. మనము బరువు తగ్గాలి, లేకపోతే మనము ఉత్సాహంగా బోధించలేము. చైనాలో సన్నగా ఉన్నవారు బోధించేటప్పుడు ఆత్మతో నింపబడ్డారు. చైనీయ "ఇంటి సంఘము" సంఘ కాపరి ఎక్కువ బరువు కలవారిని ఎవరినీ నేను చూడలేదు. చైనాలో గొప్ప ఉజ్జీవము ఉంది అందులో ఆశ్చర్యము లేదు, కాగా అమెరికాలో, పాశ్చాత్య ప్రపంచమంతటా క్రైస్తవ్యము ఎండిపోతుంది అంతరించిపోతుంది! వ్యాయామము చేయడానికి కొంత శ్రమ పడాలి. బరుగు తగ్గే వరకు తక్కువగా తినడం కష్టమే! దేవుడు కోరుకున్నట్టుగా మీరుండడానికి శ్రమపడక తప్పదు! గొప్ప చైనీయ సువార్తికుడు డాక్టర్ జాన్ సంగ్ అన్నాడు,

గొప్ప శ్రమ గొప్ప ఉజ్జీవము తెస్తుంది... వారిని దేవుడు ఎక్కువగా వాడుకుంటాడు... కష్ట పరిస్థితులలో నిలబడగల వారిని... ఎక్కువ శ్రమ ఎక్కువ ప్రయోజనాలను తెస్తుంది... శిష్యుల జీవితాలు ఒలీవల లాంటిది: మనము గట్టిగా నొక్కబడితే, ఎక్కువ నూనె మన నుండి వస్తుంది. శ్రమల ద్వారా వెళ్ళిన వారు సూత్రమే [ప్రేమను] చూపగలరు ఇతరులను ధైర్య పరచగలరు (John Sung, Ph.D., The Journal Once Lost, Genesis Books, 2008, p. 534).

యేసు చెప్పాడు,

"ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడించవలెను" (మత్తయి 16:24).

మళ్ళీ, యేసు అన్నాడు,

"నీ శ్రమను, దరిద్రతను, నేనెరుగుదును, (అయినను నీవు ధనవంతుడవే)..." (ప్రకటన 2:9).

చైనాలో వారికి శ్రమ ఉంది! అందుకే వారికి ఉజ్జీవములో మెండుగా దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి! మన సంఘములో కూడ మనలను మనము ఉపేక్షించుకొని, సిలువ ఎత్తుకొని క్రీస్తును వెంబడిద్దాం – ఎంత ఖర్చయినప్పటికి!

రెండవది, నశించు వారి కొరకు వారు కన్నీటితో ప్రార్ధించారు! నాకు తెలిసిన, సహోదరుడు, అన్నాడు, "చైనాలో చాలా కన్నీళ్లు ఉన్నాయి." అతడు సరిగ్గా చెప్పాడు! నశించు వారి కొరకు ప్రార్ధించేటప్పుడు వారు ఏడుస్తారు. క్రీస్తు కొరకు చాలా మార్పులు జరిగాయి! బైబిలు చెప్తుంది,

"కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు"
   (కీర్తనలు 126:5).

నశించు ఆత్మల నిమిత్తము పగిలిన హృదయముతో ప్రార్ధిద్దాం! (అందరు ప్రార్ధించండి).

మూడవది, వారి "ఇంటి సంఘాలకు" నడిపించడానికి వారు శక్తి వంచన లేకుండా చేస్తారు. డి. ఎల్. మూడీ అన్నాడు, "లోనికి వచ్చు వారిని ప్రేమించండి." అలా వారు ప్రజలను ఇంటి సంఘాలలోనికి నడిపిస్తారు చైనాలో – అదే మనము కూడ చెయ్యాలి! "లోనికి వచ్చు వారిని ప్రేమించండి." ఆత్మల సంపాదన అంటే ప్రాధమికంగా క్రీస్తులోనికి ప్రజలను ప్రేమతో నడిపించడం – స్థానిక సంఘములోనికి రాబట్టడము. "లోనికి వచ్చు వారిని ప్రేమించండి." అది స్వతంత్రత కాదు! అది "జీవిన శైలి" సువార్త పని కాదు! అది డి. ఎల్. మూడీ చెప్పినది! అతడు చాలా సరిగ్గా చెప్పాడు. అది చైనాలో పనిచేసింది – ఇక్కడ కూడ పని చేస్తుంది! "లోనికి వచ్చు వారిని ప్రేమించండి."

మనము సేవల నుండి పారిపోతే మనము ఆత్మలను సంపాదించలేము. తృష్ణకలవారు మాత్రమే ఆత్మలను సంపాదిస్తారు. నశించు వారి పట్ల స్నేహంగా ఉన్నవారు మాత్రమే ఆరాధనకు ముందు తరువాత వారే ఆత్మలను సంపాదించగలరు. నశించు వారిని సంఘములో కలపడానికి అది తప్ప వేరే మార్గము లేదు! మనము "లోనికి వచ్చు వారిని ప్రేమించాలి" – చైనాలో చేసినట్టు! పాడండి "ఆశీర్వాదానికి మార్గముగా చేయుము"! మీ పాటల కాగితము 4 వ పాట.

ఆశీర్వాదమునకు కర్తగా నను చేయుము నేడు,
   ఆశీర్వాదమునకు కర్తగా నను చేయుము, నేను ప్రార్ధిస్తున్నాను;
నా జీవితమూ అంతా కలిగియున్నది, నా సేవ దీవెన,
   ఆశీర్వాదమునకు కర్తగా నను చేయుము నేడు.
("ఆశీర్వాదమునకు కర్తగా నను చేయుము" హార్పర్ జి. స్మిత్ చే, 1873-1945).
      (“Make Me a Channel of Blessing” by Harper G. Smyth, 1873-1945).

ఇంకా మారకుండా ఉన్నవారితో కొన్ని మాటలు చెప్పకుండా ఈ ఆరాధన నేను ముగించకూడదు. గుడికి రావడం అంటే మారు మనస్సు పొందుట కాదు. బైబిలు చదవడము మిమ్ములను మార్చలేదు. మీ పాపములను ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు వైపు తిరిగి ఆయన యొద్దకు రావాలి. మీ ఆత్మను రక్షించడానికి ఆయన వేదనతో సిలువపై రక్తము కార్చాడు. ఆయన రక్తముచే మీరు శుద్ధి చేయబడాలి. యేసు నొద్దకు వచ్చి పాపము, మరణము మరియు నరకము నుండి రక్షింపబడండి. అట్టి అనుభవము మీరు పొందుకోవాలని, నా ప్రార్ధన. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
" యేసు నన్ను ప్రేమిస్తున్నాడు" (అన్నా బి. వార్నర్ చే, 1820-1915).
“Jesus Loves Me” (Anna B. Warner, 1820-1915).ద అవుట్ లైన్ ఆఫ్

చైనాలో విజయానికి రహస్యము

THE SECRET OF SUCCESS IN CHINA

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే,
by Dr. R. L. Hymers, Jr.

"నీ శ్రమను, దరిద్రతను, నేనెరుగుదును, (అయినను నీవు ధనవంతుడవే)..."
(ప్రకటన 2:9).

I.    మొదటిది, వారికి ఏమి లేదో అది మనకు ఉంది, ప్రకటన 3:17.

II.   రెండవది, వారు కలిగియున్నది మనకు లేదు, మత్తయి 16:24; కీర్తన 126:5.