Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
డాక్టర్ జాన్ సంగ్ యొక్క నిజమైన మార్పు
(చైనీయ మిడ్ – ఆటమ్న్ పండుగలో ఇవ్వబడిన ప్రసంగము)

THE REAL CONVERSION OF DR. JOHN SUNG
(A SERMON GIVEN AT THE CHINESE MID-AUTUMN FESTIVAL)
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే,
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము ఉదయము, సెప్టెంబర్ 23, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, September 23, 2018

"ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, తన ప్రాణమును పోగొట్టుకొనుట, వానికేమి ప్రయోజనము?" (మార్కు 8:36).


జూన్ 4, 2018 "టయానామెన్ స్క్వేర్ దారుణము" యొక్క ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. 1989 లో ఆరు వారములు, వేలకొలది చైనీయ విద్యార్ధులు శాంతియుతంగా ప్రదర్శన చేసారు, ఆలోచనల స్వతంత్రము కొరకు. అప్పుడు, జూన్ 4 ప్రాతఃకాల సమయాన్న, ప్రభుత్వమూ సైన్యము ప్రదర్శకులపై కాల్పులు జరిపారు, వేలమంది చనిపోయారు వేలకొలదీ ప్రజలు గాయపడ్డారు. హాంగ్ యంజియాన్ టెలివిజన్ లో విద్వంసాన్ని చూసాడు అప్పుడు అతడు పెన్సిలేవేనియా విశ్వ విద్యాలయములో విద్యార్ధిగా ఉన్నాడు. టయాన్ మెన్ స్క్వేర్ దారుణము సామాన్య శాస్త్రము రాజకీయాలలో తనకున్న నిరీక్షణను ప్రశ్నించేదిగా చేసి క్రైస్తవునిగా మారడానికి దారి చూపింది అని అతడు చెప్పాడు.

టియాన్ మెన్ దారుణము అతడు ఇతరులు వారి పాపములు చూడడానికి క్రీస్తు అవసరత తెలుసుకోవడానికి సహాయపడిందని అతడు చెప్పాడు: "చైనీయ ప్రజల హృదయాన్ని సిద్ధ పరచడానికి అది దారి చూపించని దైవ కార్యముని నేననుకుంటున్నాను" (World Magazine, June 6, 2009, p. 38).

"అంతా యేసు కొరకు." ఈ పల్లవి పాడండి!

అంతా యేసు కొరకే! అంతా యేసు కొరకే! నా దినములన్నియు నా ఘడియలన్నియు;
అంతా యేసు కొరకే! అంతా యేసు కొరకే! నా దినములన్నియు నా ఘడియలన్నియు.
("అంతా యేసు కొరకే" మేరీ డి. జేమ్స్ చే, 1810-1883).
    (“All For Jesus,” Mary D. James, 1810-1883).

ప్రపంచ పత్రిక చెప్పింది,

గత 20 సంవత్సరాలలో చైనాలో క్రైస్తవ్య ఎదుగుదల లెక్క బాగా పెరిగింది. వేగవంతమైన పట్టణ అభివృద్ధి క్రీస్తును హత్తుకొనే వారి సంఖ్య గణనీయంగా పెరగడం నిపుణులు చూసారు (ఐబిఐడి.).

1949 లో, కమ్యునిష్టులు చైనాను ఆక్రమించుకున్నప్పుడు, 1 మిలియనుల కంటే తక్కువ స్థానిక చైనీయ క్రైస్తవులు ఉన్నారు. ఈనాడు చైనాలో 160 మిలియనుల కంటే ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారని అంచనా వేయబడింది! చైనాలో ఇప్పుడు ఆదివారము గుడిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు అమెరికా, కెనడా, గ్రేట్ బ్రిటన్ ఆస్ట్రేలియా మొత్తముతో కలిపి పోలిస్తే! డాక్టర్ సి. ఎల్. కాగన్, గణాంకవేత్త, ఇప్పుడు క్రైస్తవ్యములో ప్రతి గంటా, రోజులో 24 గంటలు, చైనాలో 700 కంటే ఎక్కువగా మార్పిడులు జరుగుతున్నాయని అంచనా వేసాడు. "అంతా యేసు కొరకే." ఆ పల్లవి మళ్ళీ పాడండి!

అంతా యేసు కొరకే! అంతా యేసు కొరకే! నా దినములన్నియు నా ఘడియలన్నియు;
అంతా యేసు కొరకే! అంతా యేసు కొరకే! నా దినములన్నియు నా ఘడియలన్నియు.

చైనాలో క్రైస్తవ్య చరిత్ర ప్రతిచోట ఉన్న క్రైస్తవులకు చాలా ఆసక్తికరంగా ఉంది. ఆధునిక మిస్సెనరీ ఉద్యమము చైనాలో రోబర్ట్ మోరిసన్ చే ప్రారంభించబడింది (1782-1834). 1807 లో లండన్ మిస్సెనరీ సమాజముచే మోరిసన్ చైనాకు పంపబడ్డాడు. అతని సహోద్యోగులు, మిలియం మిల్నే సహాయముతో, అతడు 1821 బైబిలు అంతటిని చైనీయ భాషలోనికి అనువదించారు. చైనాలో అతనున్న 27 సంవత్సరాలలో కొంతమంది చైనీయులు మాత్రమే బాప్తిస్మము పొందారు – అయినను అందరు నమ్మకస్తులైన క్రైస్తవులుగా ఉన్నారు. మోరిసన్ బైబిలు చైనీయ అనువాదము, సువార్త సాహిత్య ముద్రణ, చైనాలో సువార్తిక క్రైస్తవ్యానికి పునాది వేసింది.

1853 లో ఆంగ్ల వైద్యునిగా, జేమ్స్ హడ్ సన్ టేలర్, చైనాకు వెళ్ళాడు. 1860 లో అతడు చైనా ద్వీప మిస్సల్ ను కనుగొన్నాడు, అప్పుడు అది ఓవర్ సీస్ మిస్సెనరీ సహవాసముగా పిలువబడుతుంది. డాక్టర్ టేలర్ సమకాలికులు చైనా అంతా క్రైస్తవ్యానికి వ్యాపింపచేసాడు. హడ్ సన్ టేలర్ 1905 లో చాంగ్ షాలో మరణించాడు.

1901 లో జాన్ సంగ్ జన్మించాడు. చైనా చరిత్రలోనే గొప్ప సువార్తికునిగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన ద్వారా మారిన వేలమంది క్రీస్తు పట్ల నమ్మకస్తులుగా ఉన్నారు 1949 లో కమ్యునిష్టులు స్వాధీన పరచుకొన్న తరువాత. ఆధునిక చరిత్రలో గత 60 సంవత్సరాలలో చైనాలో క్రైస్తవుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఉదయము నేను డాక్టర్ జాన్ సంగ్ ప్రసిద్ధ కధను మీకు చెప్పతోతున్నాను. డాక్టర్ ఎల్జిన్ ఎస్. మోయర్ అతని జీవితమును గూర్చి ఇచ్చిన సమాచారముతో నేను ప్రారంభిస్తాను.

జాన్ సంగ్ (1901-1944), జాతీయంగా ప్రసిద్ధ చైనీయ సువార్తికుడు; అతడు చైనాలో, హింగ్ వా, ఫుకీన్ లో జన్మించాడు; మెథడిస్ట్ సంఘకాపరి కుమారుడు. [తొమ్మిదవ ఏట అతడు తప్పుడు "మార్పిడి" పొందాడు.] చక్కని విద్యార్ధి; అతడు వేస్లీయన్ విశ్వ విద్యాలయములో, ఓహియ రాష్ట్ర విశ్వ విద్యాలయములో, యూనియన్ వేదాంత కళాశాలలో విద్య నభ్యసించారు. రసాయనిక శాస్త్రములో పిహెచ్.డి. పొందుకున్నాడు. సామాజిక శాస్త్ర బోధన బదులు సువార్త ప్రకటించడానికి చైనాకు తిరిగి వచ్చాడు. విశిష్ట శక్తితో ప్రభావముతో పదిహేను సంవత్సరాలు చైనా పరిసర ప్రాంతాలలో సువార్త సేవ చేసాడు (Elgin S. Moyer, Ph.D., Who Was Who in Church History, Moody Press, 1968 edition, p. 394).

"అంతా యేసుకే." మళ్ళీ పాడండి!

అంతా యేసు కొరకే! అంతా యేసు కొరకే! నా దినములన్నియు నా ఘడియలన్నియు;
అంతా యేసు కొరకే! అంతా యేసు కొరకే! నా దినములన్నియు నా ఘడియలన్నియు.

ఇది డాక్టర్ జాన్ సంగ్ జీవిత సంక్షిప్త సమాచారము. తొమ్మిదవ ఏట నమ్మడని నేను అనుకోను. 1927 ఫిబ్రవరి వరకు, అతడు మారాడని నేను అనుకోను.

డాక్టర్ సంగ్ స్వయంగా చెప్పాడు 26 వ యేట అమెరికాలో అతడు ఆత్మీయ సంక్షోభము ద్వారా వెళ్ళేంత వరకు అతడు మారలేదని. తొమ్మిది సంవత్సరాల ప్రాయములో హింగ్ వా లో ఉజ్జీవము చోటు చేసుకుంది. ఒక నెల రోజులలో 3,000 మంది క్రీస్తు విశ్వాసములోనికి వచ్చారు. శుభ శుక్రవారము ఉదయము "గెత్సమనే వనములో యేసుపై" ప్రసంగము విన్నాడు. బోధకుడు నిద్రపోవు శిష్యులు యేసు ధైర్యము మధ్య విభిన్నత చూపిస్తూ మాట్లాడాడు. ప్రసంగము ముగింపులో చాలామంది ఏడ్చాడు. మేథడిష్టు బోధకుని కొరకు, తొమ్మిది సంవత్సరాల జాన్ సంగ్ వారిలో ఒకడు. అప్పుడు జాన్ సంగ్ క్రీస్తుకు తన జీవితాన్ని "అంకితము" చేసుకున్నాడు కాని అప్పుడు పూర్తిగా మారలేదు. నా మునుపటి సంఘ కాపరి, డాక్టర్ తిమోతి లిన్ (అతని తండ్రి కూడ భోధకుడు) వలే, జాన్ సంగ్ పదమూడవ ఏట నుండి బోధిస్తూ అతని తండ్రికి సహాయ పడేవాడు. కాని, డాక్టర్ లిన్ వలే, నిజ మార్పు పొందలేదు. జాన్ సంగ్ పట్టుదల కలిగిన విద్యార్ధి ఉన్నత పాఠశాలలో తరగతి మొదటి స్థానములో వచ్చాడు. ఆ సమయములో "చిన్న సంఘ కాపరి" అని గుర్తింపబడ్డాడు. కాని అతని ఉత్సాహము అతని హృదయ ఉత్సాహము సంపూర్ణము కాలేదు. పరిచర్యలో అతని పనిని అతడు "కింగ్ ఫిషర్ ఈక వలే, వేసవి ఆకుల వలే ఉన్ననూ, యేసు క్రీస్తుకు తాజాఫలము ఇచ్చింది లేదు అని అభివర్ణించాడు" (Leslie T. Lyall, A Biography of John Sung, China Inland Mission, 1965 edition, p. 15).

1919 లో సంగ్, 18 వ యేట, అమెరికా వెళ్ళడానికి నిర్ణయించుకొని, ఒహియా వేస్లీయన్ విశ్వ విద్యాలయములో ఉచిత చదువుగా అంగీకరింపబడ్డాడు. అతడు వైద్యపర మరియు వేదాంత పర చదువు ప్రారంభించాడు, కాని వేదాంత పర చదువు ఆపేసి లెక్కలు రసాయనిక శాస్త్రాలలో నిపుణుడవడానికి నిర్ణయించుకున్నాడు. అతడు క్రమముగా గుడికి వెళ్లి విద్యార్ధుల మధ్య సువార్తిక బృందాలు ఏర్పరిచాడు. కాని చివరికి నిర్ణీత కాలములో బైబిలు పఠనము నిర్లక్ష్యము చేసాడు ప్రార్ధనను కూడ, పరీక్ష పత్రాలలో మోసము చేసాడు. 1923 లో అతడు పట్టభద్రుడై, మూడు వందల మందిలో మొదటి నలుగురిలో ఒకడుగా నిలిచాడు. భౌతిక శాస్త్రము రసాయనిక శాస్త్రాలలో అతనికి బంగారు పతకము వచ్చింది. అతడు ఫి బేతా కప్పా ప్రేటర్నిటికీ, ఎన్నిక అయి, ప్రముఖ స్థానము పొంది, విశిష్టత పొందుకున్నాడు.

అతడు చాలా విశ్వ విద్యాలయము నుండి స్కాలర్ షిప్ లు పొందుకున్నాడు, హార్వర్డ్ విశ్వ విద్యాలయము నుండి కూడ. ఒహియో రాష్ట్ర విశ్వ విద్యాలయములో సామాజిక పట్టాకు స్కాలర్ షిప్ అంగీకరించాడు. తొమ్మిది నెలలలో పట్ట భద్రుడయ్యాడు! హార్వార్డ్ లో వైద్య విద్యకు స్కాలర్ షిప్ ఇవ్వబడింది. వేదాంత కళాశాలలో చదవడానికి ఇంకొక అవకాశము వచ్చింది. వేదాంత విద్య చదవాలనుకున్నాడు, కాని అతని పేరు ప్రతిష్ట మంత్రి అవాలని ప్రోత్సాహించింది. బదులుగా రసాయనికంగా శాస్త్రములో ఒహియో రాష్ట్ర విశ్వ విద్యాలయములో వైద్య కార్యక్రమములో ప్రవేశించాడు. ఇరవై ఒక నెలలో అతడు పిహెచ్.డి. పూర్తి చేసాడు! అలా అతడు అమెరికాలో పిహెచ్.డి. పొందిన తొలి చైనీయుడయ్యాడు. అతడు వార్తా పత్రికలో "ఒహియో అతి ప్రసిద్ధ విద్యార్ధిగా" అభివర్ణించబడ్డాడు. "కాని అతని హృదయాంతరంగములో సమాధానము లేదు. ఆత్మీయ అసమాధానము అతనిని లోతైన మనస్తాపానికి గురి చేసింది" (లియాల్, ఐబిఐడి., పేజీ 22).

ఆ సమయములో అతడు స్వతంత్ర వేదాంతముతో ప్రభావితము చేయబడ్డాడు, వారి బోధ "సామాజిక సువార్త." స్వతంత్ర వేదాంతము యేసు ఒక మంచి మాదిరి అని, రక్షకుడు కాదు అని చెప్తుంది. నాకనిపిస్తుంది జాన్ సంగ్ యేసును ఒక "మంచి మాదిరిగా" చూసాడు, తొమ్మిది ఏళ్లు అప్పుడు అందుకే అతనిది అబద్ధపు మార్పు. కాని దేవుడు ఇంకను అతని పిలుచుచున్నాడు. ఒక సాయంకాలము ఒంటరిగా కూర్చున్నప్పుడు అతడు దేవుని స్వరము విన్నాడు, "ఒకడు సర్వ లోకమును సంపాదించుకొని, తన ప్రాణమును పోగొట్టుకొనుట, వానికేమి ప్రయోజనము?"

మరునాడు అతడు స్వతంత్ర మేథడిష్టు అధ్యాపకునితో సంభాషించాడు. అధ్యాపకునితో వేదాంత విద్య చదవడానికి అమెరికా వచ్చినట్టు చెప్పాడు. అధ్యాపకుడు న్యూయార్క్ వెళ్లి స్వతంత్ర యూనియన్ వేదాంత కళాశాలలో మతముపై పఠన చేయమని సవాలు చేసాడు. క్షణము సంకోచించి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. యూనియన్ సెమినరీలో పూర్తి స్కాలర్ షిప్ భత్యము ఇచ్చారు. తరువాత పరిచర్యలో ఆసక్తి లేదని, తండ్రిని తృప్తి పరచడానికి, వేదాంత విద్య చదవాలనుకున్నాడని అతడు చెప్పాడు. అతని హృదయము శ్రమ అంధకారముతో నిండుకొని ఉన్నది.

1926 లో డాక్టర్ జాన్ సంగ్ యూనియన్ వేదాంత కళాశాలలో నమోదు చేసుకున్నాడు. స్వతంత్ర డాక్టర్ హెన్రీ స్లోన్ కాఫిన్ అధ్యక్షునిగా ఏర్పాటు చేయబడ్డాడు. అధ్యాపకులలో స్వతంత్రులు డాక్టర్ హేరీ ఎమర్ సన్ ఫోస్ డిక్ ఉన్నారు, అతడు బైబిలు నమ్మే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చాలా పుస్తకాలు వ్రాసాడు. "బైబిలు ఆధునిక వినియోగము" మరియు "యజమాని మానవ రూపము" లాంటి పుస్తకాలు వ్రాసాడు. ఫోస్ డిక్ ప్రసిద్ధ ఉపన్యాసము "ప్రాధమికులు నెగ్గుతారాపై?" (1992). ఫోస్ డిక్ క్రీస్తు శారీరక పునరుత్థానము బైబిలు నమ్మకత్వములకు వ్యతిరేకంగా ప్రతివారము అతని రేడియో కార్యక్రమములో చెప్పేవాడు. ఆ వేదాంత కళాశాల బైబిలు విమర్శకు సువార్తిక వేదాంతము విమర్శలకు వేదికగా ఉండేది. "శాస్త్రీయంగా నిరూపించబడని బాబిలులో ఏ విషయమైనా తిరస్కరించబడేది! ఆదికాండము చారిత్రాత్మకము కాదని అద్భుతాలలో నమ్మకము అశాస్త్రీయమైనదని భావించే వారు. చారిత్రాత్మక యేసు అనుకరించడానికి మాత్రమే అని చెప్పేవారు, ఆయన సిలువపై మరణము, ఆయన శారీరక పునరుత్థానము నిరాకరింపబడ్డాయి. ప్రార్ధన సమయము వృధాగా భావింపబడేది. వాటితో [ఏకీభవించకపోవడం] జాలికి ఎగతాళికి గురిచేసేది" (లియాల్, ఐబిఐడి., పేజీలు 29-30).

డాక్టర్ సంగ్ తన తెలివి తేటలతో స్వతంత్ర వేదాంత విద్యను చదివాడు. ఆ సంవత్సరము మంచి మార్కులు పొందాడు, కాని క్రైస్తవ్యాని నుండి వైదొలగాడు బుద్దిజం టావోయిజం చదివాడు కాబట్టి. అతడు తరగతి గదిలో బుద్దిజము లేఖనాలను వల్లించే వాడు, ఉపేక్షించుకొనుట శాంతినిస్తుందనుకున్నాడు, కాని అలా జరగలేదు. "నా ఆత్మ అరణ్యములో సంచరించింది" అనే, పుస్తకము వ్రాసాడు.

ఆయన జీవితమూ భరించలేనిదిగా తయారయింది. "నేను నిద్ర పోలేకపోతున్నాను తినలేక పోతున్నాను... లోతైన ఆనందము లేని స్థితిలో నా హృదయము నింపబడింది" అని, వ్రాసాడు. వేదాంత కళాశాల అధికారులు అతడు మనస్థాప స్థితిలో ఉన్నాట్టు గమనించారు.

ఈ భావోద్రేక పరిస్థితిలో ఇతర విధ్యార్ధులతో కలిసి అతడు డాక్టర్ ఐ. యం. హాల్డ్ మాన్ చెప్పినది వినడానికి వెళ్ళాడు, అతడు ప్రాధమికుడు, బైబిలు నమ్మే, న్యూయార్క్ మొదటి బాప్టిస్టు సంఘ కాపరి. "కన్య జన్మను తిరస్కరించేవాడు బైబిలు క్రైస్తవ్యాన్ని తిరస్కరిస్తాడు" అని, డాక్టర్ హాల్డ్ మాన్ చెప్పేవాడు. డాక్టర్ హాల్డ్ మాన్ యూనియన్ వేదాంత కళాశాలలో ఉన్న హేరీ ఎమెర్ సన్ ఫోస్ డిక్ తో నేరుగా ఘర్షణకు దిగాడు. జాన్ సంగ్ ఆతృతతో అతడు బోధించేది వినడానికి వెళ్ళాడు. కాని డాక్టర్ హాల్డ్ మాన్ ఆ రాత్రి బోధించలేదు. బదులుగా పదిహేను సంవత్సరాల అమ్మాయి సాక్ష్యము చెప్పింది. ఆమె లేఖనాలు చదివి సిలువపై క్రీస్తు ప్రత్యామ్నాయ మరణమును గూర్చి మాట్లాడింది. సంగ్ ఆ ఆరాధనలో దేవుని సన్నిధి అనుభవించడానికి చెప్పాడు. అతని అనుచరులు నవ్వి గెలిచేసారు, కాని అతడు మరి నాలుగు సువార్తిక కూటాలకు హాజరయ్యాడు. "అంతా యేసు కొరకే." మళ్ళీ పాడండి.

అంతా యేసు కొరకే! అంతా యేసు కొరకే! నా దినములన్నియు నా ఘడియలన్నియు;
అంతా యేసు కొరకే! అంతా యేసు కొరకే! నా దినములన్నియు నా ఘడియలన్నియు.

మొదటి బాప్టిస్టు సంఘములో సువార్త కూటములలో తను కనుగొన్న శక్తిని గూర్చి తెలుసుకోవడానికి అతడు జాన్ వెస్లీ, జార్జి వైట్ ఫీల్డ్ మరియు ఇతర గొప్ప బోధకులు, స్వీయ చరిత్రలు చదవడం ప్రారంభించాడు. వేదాంత కళాశాలలో ఒక తరగతిలో ఒక అధ్యాపకుడు గట్టిగా సిలువపై క్రీస్తు ప్రత్యామ్నాయ మరణానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. జాన్ సంగ్ నిలబడి విద్యార్ధులందరి సమక్షంలో అతనికి జవాబు ఇచ్చాడు.

చివరకు, ఫిబ్రవరి 10, 1927 నాడు, అతడు నిజమైన మార్పు అనుభవించాడు. "అతని ముందున్న తన పాపాలన్నీ చూసాడు. మొదట అనిపించింది పాపములు వదులుకోవడానికి మార్గము లేదని నరకానికే పోవాలని. పాపములను మరచిపోవాలనుకున్నాడు, కాని వీలు పడలేదు. అవి అతని హృదయములో దూసుకుపోయాయి. అప్పుడు లూకా XXIII లో సిలువ కథను అతడు చదివి, వాస్తవికతను తెలుసుకున్నాడు...అతడు సిలువ చెంత ఉండి [క్రీస్తు] ప్రశస్త రక్తములో తన పాపాలు కడగమని ప్రాధేయ పడ్డాడు...అర్ధరాత్రి వరకు ఏడుస్తూ ప్రార్ధించాడు. అప్పుడు అతడు స్వరము [విన్నట్టు అనిపించింది], ‘కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవి,’ తన పాప భారమంతయు తన భుజాల నుండి వైదొలగింది...’హల్లెలూయా!’ అని అరచి నిలబడ్డాడు" (లియాల్ ఐబిఐడి., పేజీలు 33-34). కేకలు వేయుచు దేవుని స్తుతిస్తూ గది అంతా తిరిగాడు. ఇప్పుడు అతడు క్రీస్తు అవసరతను గూర్చి అందరితో మాట్లాడడం ప్రారంభించాడు, తన తరగతి వారితో సెమినరీలో అధ్యాపకులతో. హేరీ ఎమర్ సన్ ఫోస్డిక్ తో కూడ చెప్పాడు రక్షింపబడాలని. "అంతా యేసు కొరకే." మళ్ళీ పాడండి!

అంతా యేసు కొరకే! అంతా యేసు కొరకే! నా దినములన్నియు నా ఘడియలన్నియు;
అంతా యేసు కొరకే! అంతా యేసు కొరకే! నా దినములన్నియు నా ఘడియలన్నియు.

వేదాంత కళాశాల అధ్యక్షుడు అనుకున్నాడు యితడు మనసు పాడయిందని అతిగా చదవడం వలన, మానసిక వ్యాధుల గదిలో చేర్పించాడు. ఆరు నెలలు అక్కడ ఉన్నాడు. ఒక అంగీ అతనికి తోడిగించారు. ఆ సమయంలో నలభై సార్లు బైబిలును మొదటి నుండి చివరి వరకు చదివాడు. "మానసిక ఆసుపత్రి జాన్ సంగ్ కు నిజమైన వేదాంత కళాశాల అయింది!" (లియాల్, పేజీ 38). తిరిగి చైనాకు రావాలనే షరతుపై చివరకు విడుదల చేయబడ్డాడు – అమెరికాకు రాకూడదు. జాన్ సంగ్ యూనియన్ సెమినరీతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాడు స్వతంత్ర వేదాంత పుస్తకాలు కాల్చేసాడు, వాటిని "దయ్యాల పుస్తకాలు" అన్నాడు.

తిరిగి చైనాకు వస్తున్నప్పుడు తనకు తెలుసు తప్పక చైనీయ విశ్వ విద్యాలయములో రసాయనిక శాస్త్ర అధ్యాపకుడు అవుతాడని. "ఒకరోజు, ఓడ ప్రయాణము అంతము కొచ్చే సరికి, జాన్ సంగ్ తన గదికి వెళ్ళాడు, తన దృవ పత్రాలను తీసుకొని, పతకాలను [సముద్రములో] పడేసాడు. వైద్య పత్రమును మాత్రము, తన తండ్రిని సంతోష పెట్టడానికి ఉంచుకున్నాడు." (లియాల్, పేజీ 40).

డాక్టర్ జాన్ సంగ్ 1927 లో పడవ నుండి ఘంగాయ్ లో అడుగు పెట్టాడు, చైనీయ చరిత్రలోనే ప్రసిద్ధ సువార్తికుడు కావాలని. "వెస్లీ ఆఫ్ చైనాగా" అతడు పిలువబడ్డాడు. జాన్ సంగ్ శక్తివంతమైన సువార్త బోధకునిగా అయ్యాడు. మూడు సంవత్సరాలలో 100,000 మందికి పైగా అతని బోధల వలన చైనాలో మార్చబడ్డారు! బర్మా, కంబోడియా, సింగపూర్, కొరియా, ఇండోనేషియా మరియు ఫిలిప్ఫీన్స్ లో కూడ అతడు బోధించాడు. ఎప్పుడు ఒక అనువాదకుని పెట్టుకొనేవాడు, చైనాలో కూడ, ఎందుకంటే అతని రీతి అంతగా తెలియదు. జార్జి వైట్ ఫీల్డ్ వలే, జాన్ సంగ్ వ్యక్తిగతంగా చాలామందిని ఉపదేశించాడు. "ఈనాడు చైనా తైవాన్ లలో క్రైస్తవులు సంగ్ పరిచార్యకు ఋణపడి ఉండాలి; ఇరవై శతాబ్దంలో తూర్పు దేశాలకు యితడు దేవుని గొప్ప బహుమానము" (T. Farak, in J. D. Douglas, Ph.D., Who’s Who in Christian History, Tyndale House, 1992, p. 650). డాక్టర్ సంగ్ శ్రేష్ట స్వీయ చరిత్ర రెవరెండ్ విలియమ్ ఇ. స్కబెర్ట్ చే ఇవ్వబడింది, "నేను జాన్ సంగ్ ను గుర్తుంచుకుంటాను," అది www.strategicpress.org నందు లభ్యమగును. ఇక్కడ క్లిక్ చెయ్యండి రెవరెండ్ స్కబెర్ట్ స్వీయ చరిత్ర కొనడానికి. ఇక్కడ క్లిక్ చేయండి డాక్టర్ జాన్ సంగ్ స్వీయ చరిత్ర లెస్లీ లియాల్ చే (స్కబెర్ట్ అంత ఆసక్తికరము కాదు కాని విమర్శనాత్మకము). ఇక్కడ క్లిక్ చేయండి డాక్టర్ జాన్ సన్ డైరీ కొనడానికి, దానిపేరు "ఒకసారి పోయిన పత్రిక." ఇక్కడ క్లిక్ చెయ్యండి డాక్టర్ సంగ్ పై వికిపీడియా శీర్షిక చదవడానికి.

అతడు 1944లో, నలభై రెండు సంవత్సరాలకు కేన్సర్ తో చనిపోయాడు.

"ఒకడు సర్వ లోకమును సంపాదించుకొని, తన ప్రాణము పోగొట్టుకొనుట, వానికేమి ప్రయోజనము?" (మార్కు 8:36).

డాక్టర్ సంగ్ వలే, మీరు కూడ నిజమైన మార్పు పొందాలని నా ప్రార్ధన. ఈ జీవితపు వెలితిని దేవుడు మీకు చూపాలని నా ప్రార్ధన; దేవుడు మిమ్ములను లోతైన పాపపు ఒప్పుకోలుకు తీసుకొని రావాలి; ఆయన రక్తము ద్వారా పాపము కడగడానికి దేవుడు క్రీస్తు నొద్దకు మిమ్మును చేర్చాలి. మీరు క్రీస్తును విశ్వసించినప్పుడు, మీరు తిరిగి జన్మిస్తారు. ఆయనతో అద్భుత కొత్త జీవితమూ ఉంటుంది. ఈ రాత్రి తిరిగి 6:15 కు మీరు రావాలని నా ప్రార్ధన ఇంకొక ప్రసంగము వినడానికి దాని పేరు, "డాక్టర్ జాన్ సంగ్ తో స్వతంత్ర సెమినరీ" (చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి). ఆమెన్. దయచేసి లేచి నిలబడి పాటల కాగితములో మొదటి పాట పాడతాం, "యేసు అంతా చెల్లించాడు."

నేను రక్షకుడు అనడం వింటున్నాను, "నీ శక్తి నిజంగా చాలా తక్కువ,
బలహీన బిడ్డా, మెలకువగా ప్రార్ధించు, నాలో నీ సమస్తము కనుక్కో."
యేసు అంతా చెల్లించాడు, ఆయనకే అంతా ఋణపడి ఉన్నాను;
పాపము ఒక మరకను ఉంచింది, ఆయన దానిని హిమము కంటే తెల్లగా కడిగాడు.

ప్రభూ, ఇప్పుడు నిజంగా నేను మీ శక్తిని కనుగొన్నాను, మీశక్తిని మాత్రమే,
అది చిరుత మచ్చలను మారుస్తుంది, బండ హృదయాలను కరిగిస్తుంది.
యేసు అంతా చెల్లించాడు, ఆయనకే అంతా ఋణపడి ఉన్నాను;
పాపము ఒక మరకను ఉంచింది, ఆయన దానిని హిమము కంటే తెల్లగా కడిగాడు.
("యేసు అంతా చెల్లించాడు" ఎల్వినా యం. హాల్ చే, 1820-1889).
    (“Jesus Paid It All,” Elvina M. Hall, 1820-1889).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"అంతా యేసు కొరకే" (మేరీ డి. జేమ్స్ చే, 1810-1883).
“All For Jesus” (by Mary D. James, 1810-1883).