Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




మనష్యులు చెట్ల వలే ఉండి నడుచుచున్నట్టు అతడు చూచెను!

HE SAW MEN AS TREES WALKING!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే,
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంకాలము, ఆగష్టు 26, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, August 26, 2018

"అంతలోవారు బెత్సయిదాకు వచ్చిరి; అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గ్రుడ్డి వాని తోడుకొనివచ్చి, వానిని ముట్టవలేనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డి వాని చెయ్యి పట్టుకొని, ఊరి వెలుపలికి తోడుకొని పోయిరి; వాని కన్నుల మీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానినడుగెను. వాడు కన్నులెత్తి చూడగా, నాకు మనష్యులు కనబడుచున్నారు, వారు చెట్లవలే నుండి నడుచుచున్నట్టుగా, నాకు కనపడుచున్నారనెను. అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా, వాడు తేరి చూచిరి: మరియు కుదుర్చబడి, సమస్తమును తేటగా చూడసాగెను" (మార్కు 8:22-25).


క్రీస్తు బెత్సయిదాకు వచ్చాడు. కాని ఆయన బెత్సయిదాలో బోధించలేదు. ఆయన శిష్యులు బెత్సయిదాలో ఒక గ్రుడ్డి వానిని తన వద్దకు తీసుకొని వచ్చాడు. కాని క్రీస్తు ఆ పట్టణంలో అతని స్వస్థ పరచలేదు. బెత్సయిదాలో యేసు 5,000 మందికి ఆహారము పెట్టాడు ఐదు రొట్టెలు రెండు చేపలను 5,000 మంది పురుషులకు భోజనముగా మార్చాడు (మార్కు 6:38-44). యేసు అక్కడ సముద్రము మీద నడిచాడు, ఆయన అక్కడ చాలా అద్భుతాలు చేసాడు. అయినను బెత్సయిదా ప్రజలు పశ్చాత్తాప పడి యేసును నమ్మలేదు. కనుక క్రీస్తు ఆ పట్టణాన్ని శపించాడు. "తీర్పు దినమున" ఆ పట్టణము దేవునిచే తీవ్రముగా తీర్పు తీర్చబడుతుందని క్రీస్తు చెప్పాడు.

ఇప్పుడు క్రీస్తు ఆయన శిష్యులు ఆ శపించబడిన పట్టణానికి వచ్చారు.

"అంతలోవారు బెత్సయిదాకు వచ్చిరి; అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గ్రుడ్డి వాని తోడుకొనివచ్చి, వానిని ముట్టవలేనని ఆయనను వేడుకొనిరి" (మార్కు 8:22).

పాపపు పట్టణమైన లాస్ ఎంజిలాస్ లో ఒక యవనస్తుడు ఎలా మార్పు చెందాడో ఇది చూపిస్తుంది.

I. మొదటిది, పట్టణము శపింపబడింది, కాని ఎన్నుకొనబడిన గ్రుడ్డి బాలుడు కాదు!

దేవునిచే "ఎన్నుకొనబడిన" ప్రజలు రక్షింపబడుటకు ఆయన లోకమును సృష్టించకమునుపే ఏర్పాటు చేసాడు, "ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, మిగిలిన వారు గ్రుడ్డి వారైరి" (రోమా 11:7). పట్టణమంతా గ్రుడ్డిదయింది, దేవుడు విడిచి పెట్టాడు, ఎందుకంటే వారు యేసు క్రీస్తును తిరస్కరించారు కాబట్టి – అయినను, పట్టణమంతా శపింపబడినప్పటికి, ఎన్నుకొనబడిన వ్యక్తి ఆ పట్టణములో ఉన్నాడు, శిష్యులు అతనిని యేసు నొద్దకు తెచ్చారు!

"ఎన్నుకొనబడినవాడు" అనగా తీసుకొనుట లేక ఎన్నిక చేయుట. సృష్టికి ముందు మానవ జాతి నుండి ఆయన విమోచింపదలచిన వారిని ఎన్నుకున్నాడు.”

గ్రుడ్డివాడు ఎన్నుకొనబడినవాడు. గనుక ఈ ఒక్క వ్యక్తి దగ్గరకు శిష్యులు పంపబడ్డారు, ఆయనను యేసు నొద్దకు తీసుకొని రావడానికి!

ఇప్పుడు పట్టణమంతా యేసును తిరస్కరించినందుకు, తీర్పు తీర్చబడింది. ప్రజలను గుడికి ఆహ్వానించడానికి మనము బయటకి వెళ్తాము. వారిలో చాలామంది రారని మనకు తెలుసు. మనకు తెలుసు వారు ఇప్పటికే రక్షింపబడ్డారని అనుకుంటారని. మనకు తెలుసు లాస్ ఎంజిలాస్ లో చాలామంది సాతాను అదుపులో ఉన్నారు. యేసును గూర్చి వినడానికి గుడికి రావాలనే తలంపును వారు అసహ్యించుకుంటారు! అయినను గుడికి ప్రజలను ఆహ్వానించడానికి బయటకి వెళ్తాం, వారిలో చాలామంది రక్షింపబడరని మనకు తెలుసు, వారు రక్షింపబడరు ఎందుకంటే దేవుడు ఇప్పటికే వారిని తిరస్కరించాడు. బైబిలు చెప్తుంది, "దేవుడు వారిని విడిచి పెట్టాడు... దేవుడు వారిని తుచ్చమైన మనసుకు అప్పగించాడు...[వారు] దేవుని అసహ్యించుకొనువారు, గర్విష్టులు, పొగుడుకొనువారు, తల్లిదండ్రులకు అవిధేయులు... మంచి వారిని విడిచి పెట్టువారు... దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారు" (రోమా 1:26-30; II తిమోతి 3:3, 4).

అవును, మన పట్టణము వేశధారులతో, మత్తు పదార్ధాలు సేవించు వారితో, లైంగిక బానిసలతో, తప్పిపోవు వారితో, విచలనమైన వారితో, మరియు యేసు క్రీస్తును అసహ్యించుకొనువారితో నిండి యుందని మనకు తెలుసు. అది మీకంటే నాకు బాగా తెలుసు. నేను ఈ దేవుడు లేని పట్టణానికి అరవై సంవత్సరాలుగా భోదిస్తున్నాను!

కాని నాకు తెలుసు ఇక్కడ, ఈ భవనాలలో ఈ నిమిషాలలో, ఈ ప్రాంతాలలో, ఈ పాఠశాలలో – నాకు తెలుసు ఇక్కడ ఒక ప్రదేశములో దేవునిచే ఎన్నిక చేయబడిన ఒక యవనస్తుడు, యవనస్తురాలు ఉన్నారని నాకు తెలుసు, అతడు వేలాది మంది తిరస్కరించబడిన వారి నుండి ఎన్నిక చేయబడిన వాడు, రక్షింపబడుటకై యేసు క్రీస్తుచే ఎన్నుకొనబడిన వాడు!!! మీరు ఆ ఎన్నిక చేయబడిన వారు అని నేను నమ్ముచున్నారు!

మరియు యవనస్తుడు లేక యువతి తిరిగి గుడికి వస్తారు, ఆత్మచే ప్రేరేపించబడతారు, సాతాను నుండి విడుదల పొందుకుంటారు, సిలువపై యేసు క్రీస్తు కార్చిన రక్తములో కడుగబడతారు!!!

సిలువవేయబడిన వాని రక్తముచే రక్షింపబడితిని!
   ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి నూతన కార్యము ప్రారంభమయింది,
తండ్రికి స్తుతి పాడండి కుమారునికి స్తుతి పాడండి,
   సిలువ వేయబడిన దాని రక్తముచే రక్షింపబడితిని!
రక్షింపబడితిని! రక్షింపబడితిని! నా పాపాలన్ని క్షమింపబడ్డాయి, నానేరారోపణ పోయింది!
రక్షింపబడితిని! రక్షింపబడితిని! సిలువ వేయబడిన వాని రక్తముచే రక్షింపబడితిని!
      ("రక్తముచే రక్షింపబడ్డాను" ఎస్. జే. హెండేర్ సన్ చే, 1902).
      (“Saved by the Blood” by S. J. Henderson, 1902).

ఆమెన్, దేవునికి స్తోత్రం! హల్లెలూయ! సిలువ వేయబడిన వాని రక్తముచే రక్షింపబడితిని!

ఈవ్యక్తి దేవునిచే ఎన్నిక చేయబడిన వాడు. శిష్యులు వచ్చి, పాప భూఇష్ట నరక పాత్ర పట్టణము నుండి అతని రక్షించారు – మేము మిమ్ములను తెచ్చినట్టు! మరియు వారు గ్రుడ్డి బాలుని యేసు వద్దకు తెచ్చారు! ఆమెన్! ఆ పట్టణము శపింపబడింది, కాని ఎన్నుకొనబడిన గ్రుడ్డి బాలుడు కాదు! వారు అతనిని యేసు వద్దకు తెచ్చారు!

II. రెండవది, యవనస్థుడు గ్రుడ్డివాడు.

అతడు అంధుడు – పూర్తిగా గ్రుడ్డివాడు! టర్కీ వలే పూర్తిగా గుడ్డివాడు!!! అతడు పూర్తిగా గ్రుడ్డివాడే! అవును, యవనస్థుడు గ్రుడ్డివాడు – గ్రుడ్డివాడు!

ఇప్పుడు, దాని అర్ధము ఉంది! దాని అర్ధము అతడు గ్రుడ్డివాడు, అవును! కాని కొత్త నిబంధన దానికి ఇంకా ఎక్కువ అర్ధము ఉంది! అంటే, మేత్యూ హెన్రీ ఇలా చెప్పాడు, "ఆత్మీయ గ్రుడ్డి తనము." లూకా సువార్త మనకు చెప్తుంది యేసు యెషయా 61:1 నెరవేర్చాడు "గ్రుడ్డి వారికి దృష్టి కలుగ చేయుట" (లూకా 4:18).

యేసు ఆ గుడ్డి వాని చెయ్యి పట్టుకొని, "ఊరి అవతలికి తీసుకెళ్ళాడు" (మార్కు 8:23). దీని అర్ధము గ్రుడ్డి పాపులు ఇతర పాపుల నుండి వేరు చేయబడాలి యేసు వారి గ్రుడ్డి తనము బాగు చేయాలంటే. బైబిలు చెప్తుంది,

"మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి... కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, ప్రత్యేకంగా ఉండుడి అని, ప్రభువు చెప్పుచున్నాడు... నేను మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలనై యుందురు అని, సర్వ శక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు" (II కొరింధీయులకు 6:14, 17-18).

చాలాసార్లు యవనస్తులు రక్షింపబడాలనుకుంటారు, దేవుని తెలుసుకోవాలనుకుంటారు, కాని వారు పాపపు స్నేహితులచే అడ్డగింపబడతారు – యేసు నిమిత్తము వారిని బదులుకోలేరు. దేవునికి వందనాలు, యేసు "అతని పట్టణము వెలుపలికి తీసుకొని వెళ్ళాడు" అతనికి దృష్టి ఇచ్చేముందు. ఆ నరక పాత్ర స్నేహము నుండి అతడు బయట పడాలి. వెళ్ళండి! బయటికి వెళ్ళండి! బయటికి వెళ్ళండి! అతడు అతనిని గ్రుడ్డివానిగా ఉంచే దుష్ట స్నేహితుల నుండి బయటకు రావాలి! యేసు అతని చెయ్యి పట్టుకొని "అతని పట్టణము వెలుపలికి తీసుకొని వచ్చెను." అతడు బెత్సయిదాలో దుష్టులతో స్నేహము కలిగియుంటే అతడు రక్షింపబడి ఉండేవాడని నేను అనుకోను!

III. మూడవది, అతని గమనిక క్రమేణా ఉంది.

"ఆయన అతని కాళ్ళపై ఉమ్మివేయగా [నిజంగా, "కళ్లపై ఇమ్మివేయగా"], ఆతనిపై చేతులుంచినప్పుడు, [ఏమైనా] చూసావా అని అడిగాడు. అతడు పైకి చూచి, అన్నాడు, నేను మనష్యులను చెట్ల వలే చూచుచున్నాను, నడుచుమన్నట్లు. తరువాత ఆయన మరల అతని కళ్లపై చేతులుంచి, చూడమని చెప్పాడు: అతడు స్వస్థత నొంది, ప్రతి వ్యక్తిని తేటగా చూసాడు" (మార్కు 8:23-25). సామెతలు గ్రంథము మంచి వ్యాఖ్యానము దీనిపై చేస్తుంది,

"పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును" (సామెతలు 4:18).

మొదటిగా మీరు ఆత్మీయంగా గ్రుడ్డివారు. మీరు గుడికి వస్తారు, కాని మీరు వినేదాని విషయంలో అస్పష్టతలో ఉంటారు. తరువాత క్రీస్తు మీకు సహాయము చేయగలడని గ్రహిస్తారు. ఆయన మీకు సహాయము చేయగలడని నిరీక్షిస్తారు. కాని మీరు ఆయన చూడలేరు, ఆయనను గమనించలేరు. అప్పుడు మీరు గ్రహిస్తారు "విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమును, అదృష్యమైనవి ఉన్నవి అనుటకు ఋజువునై యున్నది" (హెబ్రీయులకు 11:1).

అపోస్తలుడైన తోమా అన్నాడు, "నేను నమ్మను." అప్పుడు యేసు వచ్చాడు తోమా ఆయనను, "నా ప్రభువా నా దేవా" అని పిలిచాడు. అప్పుడు యేసు తోమాతో చెప్పాడు, "చూడక పోయినను, నమ్మని వారు ధన్యులు." రెండు వేల సంవత్సరాలుగా యేసు లక్షలాది మందిని రక్షించాడు "వారు చూడక పోయినను నమ్మారు."

జాన్ కాగన్ చెప్పినది వినండి. అతనన్నాడు, "నాలో శాంతిలేదు చనిపోవాలనిపించింది. నేను చనిపోయాను అనిపించింది... [అప్పుడు] నాకు తేట తెల్లమయింది నేను చేయగలిగిన దల్లా [యేసును] విశ్వసించడం. శారీరక భావన లేదు, నాకు భావన వద్దు, నాకు క్రీస్తు ఉన్నాడు! నేను ఒంటరిగా యేసు వైపే చూసాను! విశ్వాసము ద్వారా నాకు తెలుసు యేసు నా పాపాలన్నీ కడిగాడని, నాకు ఋజువు లేకుండా ఎలా నమ్మాలని నాకనిపించింది... కాని జాగ్రత్తగా ఆలోచించి యేసు నందు విశ్వాసము ఉంచి సమాధానము కలిగి యున్నాను. కేవలం యేసు మాత్రమే నా సమాధానం."

ఫిలిప్ కాగన్ చాన్ చెప్పింది వినండి. "నేను మారలేనని అనుకున్నాను. మార్పు నిజమేనా అని సందేహాము కూడ కలిగింది... [అప్పుడు] డాక్టర్ హైమర్స్ యేసును నమ్మని వారిని సాతాను ఎలా గ్రుడ్డి వారిని చేస్తుందో భోధించారు. ఒక మార్గము సాతాను చేసేది ఒక నశించు వ్యక్తి మనసులో ప్రవేశించి, నిశ్చయత భావము కలిగి యుండాలి అని అనిపింపచేస్తుంది. అప్పుడు డాక్టర్ హైమర్స్ చెప్పారు నేను యేసును మాత్రమే విశ్వసించాలని. ఏదీకాదు, ఎవరు కాదు. [నా మనసు] సందేహాలలో స్వవిచారణలో తిరుగుతున్నప్పుడు... ఇప్పుడు యేసు ఉన్నాడు. ఇప్పుడు యేసు గన్ను తన హస్తాలలోనికి తీసుకోడానికి వేచియున్నాడు! నేను ఎలా యేసును చూడకుండా నేను ఎలా పాపాన్ని హత్తుకొని ఉంటాను, ఆయన నా ఆత్మను ప్రేమించాడు కదా? నేను మొకాల్లని యేసు క్రీస్తునే విశ్వసించాను. ఒక అనుభూతి కొరకు వేచి యుండలేదు. సాతాను అబద్ధాలు వినదలుచుకోలేదు. నా పాపాలు కడగబడడానికి యేసు నొద్దకు వెళ్లాను. నేను వేచి ఉండకూడదు! నిశ్చయత కొరకు ఎదురు చూసే తలంపులు పోయాయి. నేను యేసును విశ్వసించాను. యేసు [ఆయనే] నా నిశ్చయత నా నిరీక్షణ అయ్యాడు. నా పాప బరువును యేసు తీసివేసాడు. ఆయన తన స్వరక్తముతో నా గతమును కడిగాడు. అప్పుడు నేను "యేసు, నా ఆత్మప్రియుడు" లాంటి పాటలు గుర్తు చేసుకుంటున్నాను, యేసులో నాకు స్నేహితుడున్నాడని గుర్తు చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రము ఆయన తన కుమారుడు, యేసును, ఆయన రక్తములో నా పాపములు క్షమించడానికి అనుగ్రహించాడు!"

చాలా సంవత్సరములు యేసును తిరస్కరించిన ఒక అమ్మాయి మాటలు వినండి. ఆమె చెప్పింది, "నాలో లోతైన పాపపు ఒప్పుకోలు కలిగింది నిస్సహాయత అనిపించింది. ప్రతి రోజు ప్రార్ధించాను. ప్రతి రోజు ప్రసంగ ప్రతులు చదివాను. అవి నాకు సహాయపడలేదు ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ అనుభూతుల కొరకు ఎక్కువ విశ్వాసము కొరకు ఎదురు చూస్తున్నాను. నేను డాక్టర్ కాగన్ తో చెప్పాను నాకు తికమక మనసు ఉందని, నేను యేసు నొద్దకు రాలేనని. డాక్టర్ కాగన్ అన్నాడు, ‘నీ తికమక మనసుతోనే యేసు నొద్దకు రమ్ము!’ నా మార్పునకు ముందు, గ్రిఫిత్ గారు ఈ పాట పాడారు, ‘మంచిగా అయ్యేవరకు కనిపెడితే, నీవు రానే రానేరావు.’ [నాకు తెలుసు] నా భావనలు [ఉద్రేకాలు] నిరాదారములని, నేను వాటిని నమ్మలేనని. నేను యేసును విశ్వసించినప్పుడు, ఆయన నన్ను క్షమించి నా పాపాలన్నింటిని కడిగి వేసాడు. ఆయన నన్ను కడిగి ఆయన ప్రశస్త రక్తములో నా పాపాలు కడిగి వేసాడు. యేసు నన్ను సాతాను నుండి విడిపించి విడుదల చేసాడు! సాతానుకు బానిసగా ఉండే బదులు, నన్ను ప్రేమించి నన్ను పట్టించుకునే యేసుకు బానిసగా ఉండుట మేలు, సాతాను నన్ను నాశనం చేసి, చివరికి నన్ను నరకానికి పంపిస్తుంది." ఇది పాటల కాగితము 2 వ పాటలో ఉంది. నిలబడి పాడండి!

యేసు, నా ఆత్మ ప్రియుడు,
   మీ బాహువులకు నన్ను ఎగర నిమ్ము,
సమీప జలములు దొర్లుచుండగా,
   కష్టము ఇంకా ఎత్తుగా ఉండగా :
నన్ను దాచుము, ఓ నా రక్షకా, దాచుము,
   జీవిత తుఫాను దాటి పోయే వరకు;
భద్రముగా పరలోకములోనికి;
   ఓ చివరకు నా ఆత్మను అందుకొనుము!
("యేసు, నా ఆత్మ ప్రియుడు" చార్లెస్ వెస్లీచే, 1707-1788).
       (“Jesus, Lover of My Soul” by Charles Wesley, 1707-1788).

కూర్చోండి.

నాకు తెలుసు యేసుచే మీ పాపములు కడగబడాలని! యేసు మిమ్ములను రక్షించాలని నాకు తెలుసు! పరిపూర్ణుడుగా ఉండాలని ఆశింపవద్దు. యేసు మీనేరారోపణ నుండి పాపము నుండి మిమ్ములను రక్షించాలని ఆశించుడి. పరిపూర్ణత తరువాత వస్తుంది. యేసు మాటలు వినండి. ఈ మాటలు యేసు నోట నుండి వచ్చాయి.

"ప్రయాసపడి భారము మోసుకోనుచున్న వారలారా, నా వద్దకు రండి, నేను మీరు విశ్రాంతి ఇచ్చెదను" (మత్తయి 11:28).

"ప్రయాసపడి భారము మోసుకోనుచున్న వారలారా, నా వద్దకు రండి." రాత్రి నిద్రకు వెళ్ళేముందు తరుచు మీరు పాపులని నశించిపోయారని మీకు అనిపిస్తుంది. రాత్రి పాపాలను గూర్చి చింతిస్తూ నిద్రలోనికి వెళ్తారు. ఈ రాత్రి కూడ చింత పడుతూ నిద్రలోనికి ఎందుకు వెళ్ళాలి? యేసు చెప్పాడు,

"ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును."

మీకు నిశ్చయత అవసరము లేదు. మీకు విశ్రాంతి అవసరము. మీ ఆత్మకు విశ్రాంతి. పాటల కాగితములో 3 వ పాట చూడండి. పాడండి.

నేను మీ ఆహ్వానపు స్వరాన్ని వింటున్నాను,
   అది, ప్రభూ, మీ వద్దకు నన్ను పిలుస్తుంది
మీ ప్రశస్త రక్తములో కడుగడానికి
   అది కల్వరిలో ప్రవహిస్తుంది.
నేను వచ్చుచున్నాను, ప్రభూ! ఇప్పుడు మీ దగ్గరకు వచ్చుచున్నాను!
   నన్ను కడుగుము, మీ రక్తములో నన్ను శుద్ధి చేయుము
అది కల్వరిలో ప్రవహించినది.
("నేను వచ్చుచున్నాను, ప్రభూ" లూయిస్ హార్ట్ సాంగ్ చే, 1828-1919).
      (“I Am Coming, Lord” by Lewis Hartsough, 1828-1919).

యేసును విశ్వసించడం విషయంలో మీరు మాతో మాట్లాడాలనుకుంటే, దయచేసి వచ్చి మొదటి రెండు వరుసలలో కూర్చోండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"నేను వచ్చుచున్నాను, ప్రభూ" (లూయిస్ హార్ట్ సాంగ్ చే, 1828-1919).
“I Am Coming, Lord” (by Lewis Hartsough, 1828-1919).



ద అవుట్ లైన్ ఆఫ్

మనష్యులు చెట్ల వలే ఉండి నడుచుచున్నట్టు అతడు చూచెను!

HE SAW MEN AS TREES WALKING!

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే,
by Dr. R. L. Hymers, Jr.

"అంతలోవారు బెత్సయిదాకు వచ్చిరి; అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గ్రుడ్డి వాని తోడుకొనివచ్చి, వానిని ముట్టవలేనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డి వాని చెయ్యి పట్టుకొని, ఊరి వెలుపలికి తోడుకొని పోయిరి; వాని కన్నుల మీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానినడుగెను. వాడు కన్నులెత్తి చూడగా, నాకు మనష్యులు కనబడుచున్నారు, వారు చెట్లవలే నుండి నడుచుచున్నట్టుగా, నాకు కనపడుచున్నారనెను. అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా, వాడు తేరి చూచిరి: మరియు కుదుర్చబడి, సమస్తమును తేటగా చూడసాగెను" (మార్కు 8:22-25).

I.    మొదటిది, పట్టణము శపింపబడింది, కాని ఎన్నుకొనబడిన గ్రుడ్డి బాలుడు కాదు! రోమా 11:7; రోమా 1:26-30; II తిమోతి 3:3, 4.

II.   రెండవది, యవనస్థుడు గ్రుడ్డివాడు, లూకా 4:18; మార్కు 8:23; II కొరింధీయులకు 6:14, 17-18.

III.  మూడవది, అతని గమనిక క్రమేణా ఉంది, మార్కు 8:23-25; సామెతలు 4:18; హెబ్రీయులకు 11:1; మత్తయి 11:28.