Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఒక ఆత్మను క్రీస్తు నొద్దకు నడిపించుట ఎలా –
మార్పిడిల కొరకు ఉపదేశము!

HOW TO LEAD A SOUL TO CHRIST –
COUNSELING FOR CONVERSIONS!
(Telugu)

క్రిష్టాఫర్ ఎల్. కాగన్ చే, పిహెచ్.డి. (యుసిఎల్ ఏ) చే వ్రాయబడిన ప్రసంగము,
యం.డీవ్. (టాల్బట్ సెమినరీ), పిహెచ్.డి. (ద క్లెర్ మూట్ పట్ట భద్ర పాఠశాల),
మరియు రెవరెండ్ జాన్ సామ్యూల్ కాగన్ చే
లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము ఉదయము, ఆగష్టు 26, 2018
A sermon written by Christopher L. Cagan, Ph.D. (UCLA),
M.Div. (Talbot Seminary), Ph.D. (the Claremont Graduate School),
and preached by Rev. John Samuel Cagan
at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, August 26, 2018

"మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని... పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను"
(మత్తయి 18:3).


ఒక వ్యక్తి మార్పు చెందాలి – మార్పిడి పొందుకోవాలి – లేనిచో పరలోకమునకు వెళ్ళడని యేసు చెప్పాడు. "మార్పిడి" కి గ్రీకు పదము "ఎఫేస్ట్రేఫో" గా అనువదింపబడినది. దాని అర్ధము "తిరుగుట." ఇది పాపి ప్రార్ధన కాదు చెయ్యి ఎత్తుట కాదు. ఇది హృదయ మార్పిడి దేవుడి పాపికి అనుగ్రహించేది నూతన జన్మలో. యేసు నికోదేముతో చెప్పాడు, "ఒకడు కొత్తగా జన్మించితేనే గాని, పరలోక రాజ్యము చూడనేరడు" (యోహాను 3:3). మళ్ళీ, క్రీస్తు చెప్పాడు, "మీరు కొత్తగా జన్మించవలెను" (యోహాను 3:7). ఇది సృజనాత్మక హృదయ మార్పు. బైబిలు చెప్తుంది, "ఒకడు క్రీస్తు నందున్న యెడల వాడును, తన కొత్త [సృష్టి]: ఇదిగో, పాతవి గతించెను, సమస్తములను కొత్తవాయెను" (II కొరింధీయులకు 5:17). ఇది పాపి ప్రార్ధన వల్లించుట కాదు. ఇది మార్పిడి! ఈ ఉదయకాలము నేను ఒక పాపిని క్రీస్తులో మార్పిడికి ఎలా తీసుకురావాలి దానిపై ఉపదేశిస్తాను.

మార్పిడి అంటే ఏమిటి? ఏమి జరగాలని అనుకుంటాము? పాపికి మార్పు కావాలి, నిర్ణయము కాదు. చార్లీ ఫిన్నీ కాలము నుండి (1792-1875) ప్రపంచమంతటా "నిర్ణయత్వము" చాలా సంఘాలలో మార్పిడి స్థానాన్ని తీసుకుంది. లక్షలాది మంది నిర్ణయము తీసుకున్నారు, కాని వారు మార్పు చెందలేదు.

"నిర్ణయత్వము" అంటే ఏమిటి? మార్పు అంటే ఏమిటి? ఈనాటి స్వధర్మముపై నిర్వచనము, డాక్టర్ హైమర్స్ మరియు నా తండ్రి, డాక్టర్ కాగన్ చే ఇవ్వబడినది.

     నిర్ణయత్వము ఒక నమ్మకము ఒక వ్యక్తి రక్షింపబడడం ముందుకు రావడం ద్వారా, చెయ్యి ఎత్తుట ద్వారా, ప్రార్ధన చెప్పుట ద్వారా, ఒక సిద్ధాంతము నమ్ముట ద్వారా, ప్రభువని ఒప్పుకోవడం ద్వారా, లేక ఒక బహ్యపు క్రియ చేయడం ద్వారా, మానవ క్రియల ద్వారా, దానిని ఒక రుజువుగా, అంతరంగిక మార్పునకు, ఒక అద్భుతముగా అభివర్ణించడం; ఇది ఒక నమ్మిక ఒక వ్యక్తి కేవలము బాహ్యపు నిర్ణయము ద్వారా రక్షింప బడతాడనుకోవడము; ఒక నమ్మకము ఇలాంటి మానవ క్రియలు చేయడం ద్వారా ఒక వ్యక్తి రక్షింప బడ్డాడు అని నమ్మడము.
     మార్పిడి పరిశుద్ధాత్మ కార్యము ఇది ఒక నశించు పాపిని యేసు క్రీస్తు నొద్దకు నడిపిస్తుంది న్యాయము కొరకు పునర్నిర్మాణము కొరకు, మరియు ఇది దేవుని ముందు నశించు వానిని రక్షింపబడిన వానిగా నిలబెడుతుంది, దిగజారిన ఆత్మకు దైవిక జీవితము ఇస్తుంది, ఈవిధముగా మారిన వ్యక్తి జీవితములో ఒక కొత్త దిశా నిర్దేశాన్ని చూపిస్తుంది. రక్షణ ప్రధాన ఉద్దేశము నీతిమంతునిగా తీర్చబడడము. రక్షణ అనగా పునర్నిర్మాణము. దాని ఫలితము మార్పు. (ఈనాటి స్వధర్మము, పేజీలు 17,18).

ఒక నిర్ణయము తీసుకోవడం మానవ పని ఎవరైనా, ఎప్పుడైనా చెయ్యవచ్చు. మార్పిడి అనేది అసాధారణ ప్రక్రియ అది ఒక వ్యక్తి జీవితాన్ని తన జీవిత నిత్యత్వ గమ్యాన్ని మార్చేస్తుంది.

ఒక ఆత్మను మార్చడం అంటే ఒక నిర్ణయము తీసుకోవడం సులభము. బోధకుడు చాలామంది "నిర్ణయాలు" తీసుకున్నట్టు లెక్కించవచ్చు. మీరు ఒక నిర్ణయము ఎప్పుడైనా, ఎక్కడైనా తీసుకోవచ్చు. మీరు పాపి ప్రార్ధన ప్రజలతో ద్వారము దగ్గర గాని, విమానములో కాని, ఎక్కడైనా చేయవచ్చును. మీరు వారిని లెక్కించవచ్చు, కాని మీరు బహుశా వారిని మళ్ళీ చూడలేరు. వారు ఒక నిర్ణయము తీసుకున్నారు, కాని వారు మార్పును పొందుకోలేదు.

మార్పిడి కొరకు, చాలామంది గుడికి రావాలి చాలాసార్లు సువార్త వినాలి దానిని అర్ధం చేసుకోవాలి అప్పుడు క్రీస్తును విశ్వసించాలి. కొంతమంది గుడికి వారు మార్పు నొందక ముందు కొన్ని నెలలు లేక కొన్ని సంవత్సరాలు రావలసి ఉంటుంది.

ప్రజలను క్రీస్తు నొద్దకు నడిపించడానికి మీరు వారితో వ్యక్తిగతముగా మాట్లాడాలి, మీరే మాట్లాడాలి, మీ ఆహ్వానానికి స్పందించిన తరువాత. వారితో మాట్లాడడానికి వేరే చోటుకి తీసుకెళ్ళాలి. తొందరపాటుగా త్వరపడి వారిని ప్రార్ధనలో నడిపించవద్దు. పాపి ప్రార్ధన చేయడం యేసును విశ్వసించడం కాదు. చేతులు ఎత్తడం, ముందుకు నడిచిరావడం, బాప్టిస్మము పొందడం యేసును విశ్వసించడం కాదు. ఆ పనులు చేయడం ఒక వ్యక్తి యేసును నమ్మాడు అనే దానిని నిరూపించలేవు. యేసును విశ్వసించడం అది చాలా వేరు, విశిష్టమైనది అది చాలా ప్రత్యేకతలు కలదు. యేసును విశ్వసించడము వారిని విశ్వసించడమే.

ఒక వ్యక్తిని క్రీస్తును విశ్వసించి నిజ మార్పును అనుభవించేలా చేయడానికి సమయము పడుతుంది, ప్రయత్నము, దృష్టి, ప్రార్ధన, దేవుని దయ కావాలి. డాక్టర్ హైమర్స్ మరియు డాక్టర్ కాగన్ ముప్పై సంవత్సరాలకు పైగా మార్పిడి కొరకు ప్రజలకు ఉపదేశము చేస్తున్నారు. ఈ క్రింది విషయాలు వారు నేర్చుకున్నారు.

1. మొదటిది, సంఘ కాపరులు పాపులు చెప్పేది తప్పక వినాలి.

ఊహించవద్దు – చాలామంది సువార్తిక బోధకులు చేసేటట్టు – పాపి అప్పటికే సువార్తను అర్ధం చేసుకున్నాడని ఊహించకూడదు. అతడు చెప్పేది వినాలి అతడు నమ్మేది ఏమిటో తెలుసుకోవాలి. అతని మత పరగతము ఏమిటి? యేసును గూర్చి అతడు ఏమి నమ్ముచున్నాడు? క్రీస్తును ఒక ఆత్మగా అనుకుంటున్నాడా? ఇప్పటికే క్రీస్తు తన హృదయములోజీవిస్తున్నాడని అనుకుంటున్నాడా? యేసు తనతో కోపంగా ఉన్నాడని అనుకుంటున్నాడా? పరలోకానికి వెళ్తానని అనుకుంటున్నాడా, లేదా? అతడు ఏమి అనుకుంటున్నాడో గ్రహించాలి. అప్పుడు అతనికి సత్యమును కనుపరచి నిజ క్రీస్తు నొద్దకు అతనిని నడిపించాలి.

పాపి ఎలా జీవిస్తాడు? క్రైస్తవ జీవితమూ జీవించకుండా ఏదైనా అతనిని పట్టుకొని ఉందా – అశ్లీల చిత్రాలు, వ్యభిచారము, కుటుంబ సభ్యులను వ్యతిరేకించడం లాంటివి? రక్షించబడడానికి పాపులు వారిని వారు పరిపూర్ణులుగా చేసుకోనక్కరలేదు – వారు అలా అవలేరు. కాని ఎవరైనా బుద్ధి పూర్వకంగా నిలకడగా ఒక పాపాన్ని పట్టుకొని ఉంటే అతడు క్రీస్తును విశ్వసించలేదు. బదులుగా, అతడు తననే నమ్ముకుంటున్నాడు.

మీరు పాపుల మాటలు వినకపోతే, వారికి సహాయము చేయలేరు. మీతో మాట్లాడడానికి పాపి ఎందుకొచ్చాడో తెలుసుకోండి. యేసు తనకు ఏమి చేయాలని కోరుతున్నాడు? అతడు ఎందుకు వచ్చాడు? ఒక వ్యక్తి చెప్పాడు యేసు తనకు ఉద్యోగము ఇవ్వాలని. కాని అది రక్షణ కాదు! యేసు అతనికి ఉద్యోగమూ ఇచ్చినప్పటికిని, అతడు ఇంకను నశించిపోవచ్చు. యేసు రక్తము ద్వారా ఆవ్యక్తి పాపములు క్షమించబడాలి.

2. రెండవది, పాపులు యేసు క్రీస్తును గూర్చి తప్పిదములు చేస్తారు.

యేసును గూర్చి పాపి ఏమని అనుకుంటున్నాడు? అతడిని అడగండి, "యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని?" బైబిలు చెప్తుంది యేసు పరలోకములో ఉన్నాడని తండ్రి "దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడైయున్నాడు" (రోమా 8:34). కాని చాలామంది నశించిన బాప్టిస్టులు అనుకుంటారు యేసు వారి హృదయాలలో ఉన్నాడని, లేక ఆయన గాలిలో సంచరించు ఆత్మయని. యేసు ఎక్కడ ఉన్నాడో మీకు తెలియకపోతే మీరు యేసు నొద్దకు రాలేరు.

"యేసు ఎవరు?" అని పాపిని అడగండి, చాలామంది అనుకుంటారు ఆయన నీతిమంతుడని, చరిత్రలో గొప్ప బోధకుడని. కాని "యేసు" మిమ్ములను రక్షింపనేరడు. కొందరనుకుంటారు ఆయన ఆత్మయని, లేక ఆ యేసే పరిశుద్ధాత్మ అని. కాని క్రీస్తు ఆత్మ కాదు. యేసు మృతులలో నుండి లేచిన తరువాత, బైబిలు చెప్తుంది,

"అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడేనని తలంచిరి. అప్పుడాయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహాములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులు, నా పాదములు చూడుడి: నన్ను పట్టి, చూడుడి; నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును, భూతమునకు ఉండవని చెప్పెను. ఆవిధంగా వారికి చెప్పి, తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత, ఇంకను నమ్మక ఆశ్చర్య పడుచుండగా, ఆయన ఇక్కడ, మీ యెద్ద ఏదైనా ఆహారము కలవా అని వారినడిగెను? వారు కాల్చిన చేప ముక్కను, ఆయనకు ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని, వారి యెదుట భుజించెను" (లూకా 24:37-43).

మృతులలో నుండి లేచిన తరువాత, యేసు భోజనము చేసాడు. ఆత్మ భుజించదు. క్రీస్తుకున్నట్టు ఆత్మకు శరీరము ఎముకలు ఉండవు. మరియు ఆత్మ – పరిశుద్ధాత్మ – పాపము కడిగివేయడానికి రక్తము కలిగి ఉండదు!

పాపిని అడగండి, "యేసు మీతో కోపముగా ఉన్నాడా అని?" చాలామంది కేథలిక్కులు ఇతరులు ఆయన కోపముగా ఉన్నాడని అనుకుంటారు. వారు కోపముగా ఉన్న "క్రీస్తును" నమ్ముతారు – నూతన నిబంధన యేసు అలా కాదు. యేసు పాపులను ప్రేమిస్తాడని బైబిలు చెప్తుంది. ఆయన సిలువపై ఉన్న దొంగను క్షమించాడు వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని క్షమించాడు. తనతో కోపముగా ఉన్న వ్యక్తిని పాపి ఎలా నమ్మగలడు? ఈ పొరపాట్లను సరిదిద్ది పాపిని నిజ యేసు వద్దకు నడిపించాలి.

3. మూడవది, పాపులు రక్షణ విషయములో పొరపాట్లు చేస్తారు.

రక్షణ విషయంలో మూడు రకాల పొరపాట్లు ఉన్నాయి. చాలామంది పాపులు అనుకుంటారు వీటిలో ఒకటి చేస్తే, వారు రక్షణ పొందుతారని – లేక వీటిలో ఒకటి చేసి ఉండి ఉంటే, వారు రక్షింపబడడానికి ఋజువు అని. క్రీస్తును బదులు పాపులు ఈ క్రింది వాటిని నమ్ముతారు.

శారీరక క్రియ: బాప్తిస్త్మము, ముందుకు వెళ్ళడం, చెయ్యిఎత్తడం, ప్రభువుతో ఒప్పందము చేసుకోవడం, కొన్ని పాపాలు విడిచి పెట్టడం (ఇది బైబిలు పశ్చాత్తాపము కాదు, మనసు మారడం మాత్రమే), లేక పాపి ప్రార్ధన చెప్పడం. ఈ మానవ క్రియలు ఎవరిని రక్షింపలేవు. బైబిలు చెప్తుంది, "మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే ఆయన మనలను రక్షించెను" (తీతుకు 3:5).

మానసిక క్రియ: మంచి తలంపులు కలిగి యుండడం, యేసును గూర్చి రక్షణను గూర్చి కొన్ని బైబిలు సత్యాలు నమ్మడం లాంటివి. పాపులు తరుచు చెప్తారు, "యేసు నా నిమిత్తము సిలువపై మరణించాడని అది నేను నమ్ముతున్నాను." కాని లక్షలాది మంది ఆ సత్యాన్ని నమ్ముతారు. సాతాను సైతము యేసు దేవుని కుమారుడని సిలువపై మరణించి తిరిగి లేచాడని నమ్ముతుంది. అతడు దానిని చూసాడు. బైబిలు చెప్తుంది, "సాతాను [దెయ్యములు] నమ్ముతాయి, వణుకుతాయి" (యాకోబు 2:19). పాపి యేసు క్రీస్తును నమ్మాలి, ఆయనను గూర్చిన సత్యాలు కాదు.

భావపూరిత క్రియలు: అనుభూతులు మరియు అనుభవాలు, "నిశ్చయత" కొరకు చూడడం క్రీస్తు బదులు, జీవితములో మంచిగా అనిపించడం. అనుభూతులు పైకి క్రిందికి అవుతాయి. ప్రతి ఒక్కరికి మంచి తలంపులు అనుభూతులు ఉంటాయి. ప్రతి ఒక్కనికి చెడు తలంపులు అనుభూతులు ఉంటాయి. పాపికి ఇది తెలుసు. అనుభూతులు అతడు కలిగి యున్నాడు. మీ అనుభూతులను నమ్ముకుంటే, మీరు రక్షింపబడ్డారని అనుకుంటారు తరువాత నశిస్తారు, నశించి మళ్ళీ రక్షింపబడడం, జీవితమంతా ఇలాగే ఉంటుంది. రక్షణ క్రీస్తులోనే, అనుభూతుల యందు కాదు. గొప్ప పాతపాట ఇలా చెప్తుంది,

నా నిరీక్షణ నిర్మింపబడింది
   యేసు రక్తము నీతిపైన మాత్రమే.
మధుర అనుభూతిని నేను నమ్మధైర్యము చెయ్యను [మనసు స్థితి, అనుభూతి]
   కాని యేసు నామము పైననే ఆనుకుంటాను.
క్రీస్తు అనే, గట్టి బండపై, నేను నిలబడుతాను,
   మిగిలిన మైదానమంతా మునిగిపోయే ఇసుక;
మిగిలిన మైదానమంతా మునిగిపోయే ఇసుక.
   ("గట్టి బండ" ఎడ్వార్డ్ మొట్ చే, 1797-1874).
   (“The Solid Rock” by Edward Mote, 1797-1874).

ఈ తప్పులను సరిదిద్ది పాపిని యేసు నోద్దకే నడిపించాలి, ఆయన రక్తముచే పాపము క్షమింపబడడానికి.

చాలా తప్పుడు అభిప్రాయాలు క్రీస్తును గూర్చి చెప్తాయి, కాని అది "ఆయనను క్రిందకు లాగుతాయి" లేక "ప్రక్కకు నెడతాయి." కొంతమంది అనుకుంటారు మీరు బాప్తిస్మము పొందితే, మీరు క్రీస్తు నందు రక్షణ పొందుకుంటారని. ఇది క్రీస్తుకు బాప్తిస్మము నీళ్ళ "క్రింద" గాని "ద్వారా" కాని ఉంచుతాయి. చాలామంది అనుకుంటారు మీరు పాపి ప్రార్ధన వల్లిస్తే మీరు రక్షింపబడతారని, ఆ ప్రార్ధన చేయడమే యేసును విశ్వసించడం అని. కనుక వారు వారితో ప్రార్ధన చేయింది వారిని లెక్కపెడతారు, దీని అర్ధము క్రీస్తును ప్రార్ధనా పదముల మార్పు చెందడం. అది క్రీస్తును "క్రింద" లేక "ద్వారా" పదాలు ప్రార్ధనలో ఉంచడం. బైబిలు ఇలా చెప్తుంది "యేసు క్రీస్తు మాత్రమే" ముఖ్యమైన మూలరాయి (ఎఫెస్సీయులకు 2:20), పాపి ప్రార్ధన పలుకులు కాదు. యేసు క్రీస్తును మాత్రమే పాపి నమ్మేటట్టు చూపాలి.

ప్రజలు ఒక తప్పు నుండి మరొక తప్పుకు పరుగెత్తడం నేను చూసాను. ఒక అనుభూతి కొరకు చూస్తారు. తరువాతసారి వారంటారు, "నాకు అనుభూతి లేదు. నేను అది నమ్ముతాను క్రీస్తు నా నిమిత్తము చనిపోయాడు అని." పాపి ఒక అనుభూతి కొరకు చూడడం అనే తప్పు నుండి క్రీస్తును గూర్చిన వాస్తవాన్ని నమ్మడం అనే తప్పుకు వెళ్ళిపోతాడు. పాపి అబద్ధాల నుండి బయటపడి క్రీస్తు వైపు మల్లేటట్టు వెంటాడాలి.

4. నాల్గవది, వారి హృదయముల పాపమును గూర్చి ఒప్పుకోలు పాపులకు అవసరము.

అతని హృదయ పాపమును గూర్చిన ఒప్పుకోలు పాపికి కావాలి. ప్రతి ఒక్కరు తాము పాపులమని ఏదోలా ఒప్పుకుంటారు. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు వారు పరిపూర్ణులు కాదని, కొన్ని తప్పుడు పనులు చేసారని. నేను దానిని గూర్చి మాట్లాడడం లేదు.

వాస్తవిక లేక ప్రత్యేక పాపములను గూర్చిన గ్రహింపును గూర్చి నేను మాట్లాడుట లేదు. అవును, పాపి చాలా పాపాలు చేసాడు. కాని వాటిని గూర్చి ఆలోచిస్తూ ఉండడం అతనిని రక్షింపలేదు. ప్రత్యేక పాపములను గూర్చిన జాబితాను గూర్చి ఆలోచిస్తే, ఆ పాపి అనుకోవచ్చు, "నేను వాటిని చేయడం లేదు, కనుక నేను రక్షింపబడాలి." లేక అతననుకోవచ్చు, "నేను ఆ పనులు చేయడం ఆపేస్తాను నేను రక్షింపబడినట్లు చూపించుకుంటాను."

పాపము దానికంటే లోతుగా వెళ్తుంది. ప్రతి ఒక్కరు లోపల పాపే, ఆదాము నుండి వచ్చిన పాపము స్వభావము ద్వారా. ప్రతి ఒక్కరు దుష్ట హృదయము కలిగియున్నాడు. బైబిలు ఇలా చెప్తుంది, "హృదయము అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాది కలది" (యిర్మియా 17:9). ప్రతి పాపి లోపల స్వార్ధపరుడు. ప్రతి పాపి తన హృదయములో దేవునికి వ్యతిరేకి. ఇది ఒక వ్యక్తి చేసిన ప్రత్యేక పాపముల కంటే ఇది చాలా లోతైనది. వారు ఎలాంటి వారో అదే వారు చేస్తారు. పాపి చేసే ప్రతి దానికంటే లోతుగా, అతని హృదయము, అతని ఆంతర్యము, పాప భూఇష్టమైనది, తప్పుతో కూడినది. పాపి తన హృదయ పాపము గమనించాలి. మీ బోధలో ప్రసంగము తరువాత మీరు అతనితో మాట్లాడేటప్పుడు, తన హృదయ పాపమును గూర్చి అతనికి తెలియచేయాలి.

ఒక పాపి తన స్వంత హృదయమును మార్చుకోలేడు, ఒక మేక గొర్రె కాలేనట్టు. అదే దీని అర్ధము అతడు నశించి తనను తాను రక్షించుకొనలేదు. క్రీస్తును తనకు తానుగా విశ్వసించలేదు. కేవలము దేవుడు మాత్రము అతని యేసు నొద్దకు చేర్చగలడు. క్రీస్తు చెప్పాడు, "నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, ఎవడును నా వద్దకు రాలేడు" (యోహాను 6:44). ఇదే "సువార్త పరమైనది" పాపి క్రీస్తు నొద్దకు తప్పక రావాలి, కాని అతడు అలా చెయ్యలేదు. తనను రక్షించుకోవడానికి ఏమి చెయ్యలేదు. బైబిలు చెప్తున్నట్టు, "యెహోవా వద్దనే రక్షణ దొరుకును" (యోనా 2:9). పాపి తప్పనిసరిగా యెషయా చెప్పినట్టు, "అయ్యో! నేను నశించితిని" (యెషయా 6:5). తన హృదయ పాపములను అతనికి చూపించాలి. తనకు తాను రక్షించుకోలేడని అతనికి చూపాలి. తనకు కృప కావాలని చూపించాలి. అప్పుడు అతడు క్రీస్తు నొద్దకు రాగలడు.

5. ఐదవది, పాపి ఒకవేళ తన హృదయ పాపమును గూర్చి ఒప్పించబడితే, అతనిని క్రీస్తు నొద్దకు నడిపించప్రయత్నించాలి.

నాతో మాటలాడడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని క్రీస్తు నొద్దకు నేను నడిపించలేను! కొంతమంది కేవలము ఆతృత కలిసి ఉంటారు. వారి పాపము క్షమించబడడము ఇష్టము ఉండదు. ఇతరులు రావడం చూసి కొంతమంది వస్తుంటారు. కొంతమందికి వారి పాపము గ్రహింపు ఉండదు దేవుడిచ్చే మేల్కొలుపు ఉండదు. ప్రార్ధనలో క్రీస్తును నమ్మునట్టు నడిపించుట వారిని వారు మోస పుచ్చుకునే వారు అబద్దపు మార్పును పొందుకుంటారు. ఒక వ్యక్తి క్రీస్తును నమ్ముట ఎప్పుడు వీక్షించగలము?

పాపి "తనతో తాను విసిగిపోవాలి," మన సంఘములో ఒక అమ్మాయి చెప్పినట్టు. అతడు "తనపై నమ్మకం కోల్పోవాలి." అతడు "తన అంతమునకు రావాలి." యెషయా తన అంతము మట్టుకు వచ్చి ఇలా అన్నాడు, "అయ్యో! నేను నశించితిని" (యెషయా 6:5). అప్పుడు క్రీస్తును విశ్వసించడం సులభము. అతడు ఏదో నేర్చుకోవడం లేదు. తనను రక్షించడానికి క్రీస్తు అతనికి అవసరము.

పాపి తప్పక క్రీస్తునే విశ్వసించాలి. యేసు క్రీస్తు నోద్దకే పాపిని నడిపించాలి తన పాపము ఆయన రక్తముచే క్షమించబడడానికి. సామాన్య ప్రార్ధన ద్వారా ఒక వ్యక్తిని మీరు నడిపించవచ్చు ఇలా "యేసు, నేను నిన్ను విశ్వసిస్తాను. మీ రక్తముతో నా పాపము కడిగి వేయుము." లేక ప్రార్దనే లేకపోవచ్చును, నేరుగా క్రీస్తు వైపు మల్లుట ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ కొరకు. పాపి ప్రార్ధించవలసిన అవసరము లేదు. పాపి యేసు చిత్రపటమును తన మనసులో వేసుకోనక్కర లేదు. పదాలు "సరిగ్గా" ఉండనక్కర లేదు. కొంతమంది కంఠస్తము చేసి – అదే తిరిగి చెప్తారు – "సరియైన" మాటలే కాని క్రీస్తును విశ్వసించరు. సిలువపై దొంగ పరిపూర్ణ పదాలు పలుకలేదు. అతనన్నాడు, "ప్రభువా, మీరు మీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము" (లూకా 23:42). కాని తాను నిస్సహాయ పాపియని అతనికి తెలుసు అతడు క్రీస్తు వైపు తిరిగాడు. అది అంత సులభము! ప్రభువు అతనితో అన్నాడు, "నేడు నీవు నాతో కూడ పరడైనులో ఉందువు" (లూకా 23:43). క్రీస్తును విశ్వసించడం పదాలు చెప్పడం కంటే చాలా ప్రాముఖ్యము!

6. ఆరవది, మీరు పాపితో మాట్లాడిన తరువాత, అతనిని కొన్ని సామాన్య ప్రశ్నలు అడగండి.

అతనిని అడగండి, "నీవు యేసును విశ్వసించావా?" అతడు "లేదు" అంటే, మళ్ళీ తనతో మాట్లాడండి. అతడు "ఔను" అంటే ఎప్పుడు యేసును విశ్వసించాడో అడగండి. అతడు, "నా జీవితమంతా నేను ఆయనను విశ్వసించాను" లేక "చాలాకాలము క్రితము నేను ఆయనను విశ్వసించాను" అంటే, అతడు మార్పు చెందలేదు.

అతడు, "నేను క్రీస్తును ఇప్పుడే విస్వసించాను" అని చెప్తే, అతడేమి చేసాడో అడగండి. అతని స్వంత మాటలలో విశ్వాస క్రియను వివరించనివ్వండి. ప్రజలు "సంఘపు మాటలు" విన్నవి కంఠస్థ పెట్టి మారకపోయినా అదే తిరిగి చెప్తారు. అతని నమ్మికలో పాపి ఏమి చేసాడు? క్రీస్తును గూర్చి ఏదైనా విశ్వసించాడా? ఒక అనుభూతిని విశ్వసించాడా? లేక నేరుగా క్రీస్తునే విశ్వసించాడా?

అతడిని అడగండి, "యేసు క్రీస్తు నీ కొరకు ఏమి చేసాడు?" ఒకవేళ అతడు ఆయన రక్తము ద్వారా క్రీస్తు తన పాపము క్షమించాడు అని చెప్పకపోతే, అతని స్వంత తలంపులను గూర్చి అనుభూతులను గూర్చి లేక మంచి తనమును గూర్చి మాట్లాడితే, అతడు రక్షింపబడలేదు!

అతడిని అడగండి, "ఈరోజు నీవు మరణిస్తే, పరలోకానికి వెళ్తావా లేక నరకమునకు వెళ్తావా?" ఒకవేళ అతడు "పరలోకానికి" అని చెప్తే, ఎందుకు అని అడగండి. అతడు దేవునికి ఏమి చెప్తాడు దేవుడు పరలోకానికి ఎందుకు వచ్చావు అని అడిగితే? ఆ వ్యక్తి మంచి క్రియలను గూర్చి లేక క్రీస్తు ఆయన రక్తము మినహాయించి ఏమి మాట్లాడినా, అతడు రక్షింపబడలేదు! తరువాత అతనిని అడగండి, "సంవత్సరము తరువాత, ఒక చెడ్డ తలంపుకలిగి చనిపోతే, ఎక్కడికి వెళ్తావు అని అడగండి?" అతడు "నరకము" అని చెప్తే, అతడు మంచిగా ఉండడంపై ఆధార పడుచున్నాడు కాని క్రీస్తుపై కాదు. తరువాత మీరు అతనిని అడగవచ్చు, "సంవత్సరము తరువాత, గుడిని విడిచిపెట్టి తిరిగి రాకపోతే, వివాహము కాకుండా స్త్రీతోనో (పురుషుని తోనో) ఉంటే, ఆమెతో శృంగారము చేస్తే, మరియు ప్రతిరోజూ మత్తు పదార్ధాలు తీసుకుంటే, నీవు క్రైస్తవుడవా కాదా అని అడగండి?" అతడు "ఔను" అని చెప్తే అతడు పాపము సమస్యను తేల్చుకోలేదు, అతడు ఇంకను నశించి ఉన్నాడు.

అతనిని అడగడం ప్రాముఖ్యము ఏదో, "నేను యేసును విశ్వసించాను" అని చెప్పించడానికి కాదు, కాని విశ్వాసము ఉంచే సమయంలో అతడు యేసుతో ఏమి చేసాడో అతడు వివరించ గలగాలి. అతని విశ్వాస సమయమును గూర్చి అతని నుండి వినాలి, అతని జీవిత కథ అంతా కాదు లేక ఆ రోజు జరిగినది అంతా కాదు. ప్రత్యేక తలంపులు లేక అనుభూతుల కొరకు నేను చూడను. కాని అతని పాపము క్రీస్తు రక్తము ద్వారా ఆ పాపము క్షమించబడుట క్రీస్తును విశ్వసించుట ఇవి తప్పక ఉండాలి. అనుభవము వివరాలు వేర్వేరు మందికి వేర్వేరుగా ఉండవచ్చును. నేను కచ్చితత్వము, వ్యక్తి చెప్పే దానిలో నిజత్వము నేను చూస్తాను.

ఆ వ్యక్తి ఒక పొరపాటు చేస్తే, ఆ తప్పు సరిదిద్ది మళ్ళీ అతనితో మాట్లాడండి. కాని ఒక వ్యక్తి అదే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే అతడు మార్పు నొందడానికి సుముఖంగా లేడు అని అర్ధము. రక్షణ యొద్దకు దేవునిచే చేర్చబడేవారు ప్రసంగాలు విని మీ సలహా తీసుకుంటారు. వినని వారు మార్పు చెందలేరు.

అతనితో మాట్లాడిన తరువాత వ్యక్తి రక్షింపబడకపోతే నిరుత్సాహ పడవద్దు. తొలిసారి సువార్త విన్న వెంటనే కొంతమంది మారతారు, కాని చాలా మంది అలా మారరు. చాలామంది క్రీస్తును విశ్వసించే ముందు మళ్ళీ మళ్ళీ రావాలి.

ప్రతి వ్యక్తిని ఒకసారి కంటే ఎక్కువగా తనిఖీ చెయ్యండి. నేరుగా ప్రజలకు బాప్తిస్మము ఇవ్వవద్దు. ఒక సంవత్సరమైనా కనిపెట్ట మనండి, బహుశా ఈనాటి సంఘ స్వధర్మత స్థితిని బట్టి రెండు సంవత్సరాల కాలము నయము. బహుశా రెండు మూడు సంవత్సరాలు మెరుగు. వారి విశ్వాస కచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి అది మీకు తగిన సమయము ఇస్తుంది. ఆ సమయంలో ఆయా విధాలుగా ఒక వ్యక్తిని గమనించవచ్చును. తన సాక్ష్యము కొరకు మీరు అతనిని అడగవచ్చు – సంఘ ఆరాధనకు బదులు. వారాలు నెలల తరువాత మీరు అతనిని అడగవచ్చు. క్రీస్తును నమ్మిన వారు వారి "సాక్ష్యము" మర్చిపోతారు ఒకటి రెండు సంవత్సరాల తరువాత పొరపాట్లు చేస్తారు. వారు "దాటాలను" కుంటారు అనుమతి కోరుతారు, కాని వారు యేసును విశ్వసించరు. ఇతరులు కొన్ని పదాలు కంఠత పెట్టి అవే తిరిగి మళ్ళీ చెప్తారు, కాని వేరే సమయములో వేరుగా అడిగితే ఏమి చెప్పాలో వారికి తెలియదు, ఎందుకంటే యేసును విశ్వసించిన వ్యక్తిగత అనుభవము వారికి లేదు.

అతని వైఖరి నడవడి చూడండి. మీ సంఘమును విడిచి పెట్టాలనుకునే వ్యక్తికి మీ మాట తిరస్కరించే వ్యక్తి తన పాపమును గూర్చి పట్టింపు లేదు అతడు క్రీస్తును విశ్వసించడు. నిలకడగా చెడు వైఖరి కలిగి సంఘము క్రైస్తవ జీవితము విషయాలలో అలాంటి వాడు పాపమును గూర్చి తీవ్రత లేదు క్రీస్తును విశ్వసించలేదు.

7. ఏడవది, ఉపదేశపు పరిచర్య నిజ పరీక్షను జ్ఞాపకము ఉంచుకోండి.

ఉపదేశపు పరిచర్య నిజ పరీక్ష ఇది: మీరు ఒక వ్యక్తికి చెప్పగలరా అతడు క్రీస్తును విశ్వసించ లేదని మరియు ఆ రోజు మార్పు నొందలేదని? మీరు ఒక వ్యక్తితో చెప్పగలరా అతడు తిరిగి మళ్ళీ రావాలని అతని రక్షణను గూర్చి మీతో అతడు తిరిగి మాట్లాడాలని? ఇలా చేస్తున్న సంఘ కాపరులు నాకు తెలియదు. అందుకే మన సంఘాలు నశించు వారితో నిండిపోతున్నాయి, సబ్బాతు బడి ఉపాధ్యాయులు, పరిచారకులు, సంఘ కాపరుల భార్యలు, మరియు సంఘ కాపరులు. సంఘ కాపరులు వారి ఆహ్వానమునకు స్పందించిన ప్రతి ఒక్కరితో ఒక ప్రార్ధన చెయ్యమని బలవంత పెడతారు. బాప్తిస్త్మముల సంఖ్య తెలుసుకోవడానికి వారు ఇలా చేస్తారు. బాప్తిస్మము పొందిన వారిలో చాలామంది రక్షింప బడిన వారు కాదు. వారు తిరిగి జన్మించలేదు కనుక సంఘములో వారు నమ్మకముతో ఉండలేరు. వీరు "వెనుదిరిగినవారు" కాదు. వారు నశించారు ఎందుకంటే బోధకుడు వారు మారారో లేదో తెలుసుకోవడానికి సమయము తీసుకోలేదు. ఒక వ్యక్తి ఇంకా నశించి ఉన్నాడని తిరిగి రావాల్సిన అవసరము ఉందని చెప్పగలగడం మీ పరిచర్యకు నిజ పరీక్ష. వారు "దేవుని మెప్పు కంటే మనష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించు వారు?" వలే మీరు ఉన్నారా (యోహాను 12:43). లేక ప్రజలకు నచ్చిన నచ్చకపోయినా మీరు నిజమే మాట్లాడతారా?

ఇలా ఒక నానుడి ఉంది: నిజ మార్పిడిలలో మీరు నమ్ముచున్నారా – నిజమైన విశ్వాసము క్రీస్తు నందు అది నిజమైన క్రైస్తవ జీవితాన్ని ఇస్తుంది? ప్రతి ఒక్కరిని ప్రార్ధనలో నడిపించాలి అని పట్టు బడితే, లేక చేతులెత్తమంటే, ఒక కార్డుపై సంతకము చేయమంటే, మీరు ఒక "నిర్ణయత్వ వ్యక్తివి." దేవుడు మీ దగ్గరకు పంపించిన మానవ ఆత్మలను మీరు సరిగ్గా చూసుకోవడం లేదు.

మీలో కొందరు నిజ మార్పిడిని నమ్ముతారని నేను నిరీక్షిస్తున్నాను. ప్రతి వ్యక్తితో కొంత సమయము గడపడానికి, అతడు క్రీస్తును నమ్మి మార్పు చెందాడు అని నిర్ధారణ చేసుకోవడం అవసరం అని మీలో కొందరు తలంచాలని నా నిరీక్షణ. ఇది ఒక నమ్మకత్వ సంఘ కాపరి చేస్తాడు. ఈ నమ్మకత్వ గొర్రెల కాపరి గొర్రెలను పట్టించుకుంటాడు. మీరు మీ ప్రజలు క్రీస్తును విశ్వసించి మార్పు చెందారు అని నిర్ధారించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారని నేను నిరీక్షిస్తున్నాను.

నేను చాలా వివరాలకు వెళ్ళానని మీరు అనుకోవచ్చు, మార్పిడి నిజంగా సామాన్య విషయము దానికి అంత ఆలోచించడం అవసరము లేదు. కాని వైద్య వృత్తి ప్రసూతి వైద్యులకు ఒక శిశువుకు ఎలా పురుడు పోయాలో వివరాలు చెప్పకుండా ఉంటే ఎలా? ఒకవేళ అదే పని చేసి, చేతులు కడుగుకోకపోయినా, లేక తలక్రిందుల పుట్టుక మొదలగు విషయాలు, ఏమి చెయ్యాలో తెలియక పోతే ఎలా ఉంటుంది.? పిల్లలు పుట్టడం విధానము ఆత్మల పుట్టుక విదానముగా మనం చేస్తే, లక్షలాది మంది పిల్లలు అనవసరంగా చనిపోయి ఉండేవారు – ఎందుకంటే ఇప్పుడు లక్షల ఆత్మలు చనిపోయి అనవసరంగా నరకానికి పోతున్నాయి ఎందుకంటే వారి మార్పు కచ్చితత్వము తెలుసుకోవడానికి మనము సరిపడే సమయము వినియోగించడం లేదు, లేక మన బైబిలు పాఠశాలలో సెమినరీలలో ప్రజలకు బోధించడం లేదు – అక్కడ నేర్పించబడ లేదు!!!

నేను "అప్పుడు యేసు వచ్చాడు" మాటలు చదువబోవుచున్నాను, ఇవి ఆస్వాల్డ్ జే. స్మిత్ చే వ్రాయబడ్డాయి హోమర్ రోడే హీవార్ సంగీతము సమకూర్చారు. యేసు నీ జీవితములోనికి వచ్చునప్పుడు, ఆయన రక్తము సమస్త పాపము నుండి నిన్ను కడుగుతుంది; సిలువపై ఆయన కార్చిన రక్తము మీ పాపము అడగడానికి ఇంకా అందుబాటులో ఉంది. యేసు మృతులలో నుండి లేచాడు మీకు నిత్య జీవము ఇవ్వడానికి. యేసును విశ్వచించు ఆయన మీ పాపమును క్షమించి నిత్యజీవము అనుగ్రహిస్తాడు. మీరు తిరిగి వచ్చి మాతోపాటు ఈ రాత్రి 6:15 గంటలకు భోజనము చేస్తారని నిరీక్షిస్తున్నాను. డాక్టర్ హైమర్స్ సువార్తిక ప్రసంగము బోధిస్తారు దాని శీర్షిక, "యేసుచే స్వస్థ పరచబడిన గ్రుడ్డివాడు." తిరిగి ఈ రాత్రి 6:15 గంటలకు వచ్చి డాక్టర్ హైమర్స్ మాట్లాడిన తరువాత భోజనానికి ఉండండి.

ఒక వ్యక్తి ప్రధాన మార్గములో బిక్ష మడుగుచూ ఒంటరిగా కూర్చున్నాడు,
అతని కళ్ళు గ్రుడ్డివి, వెలుగు అతడు చూడలేడు.
అతడు చిరిగిన బట్టలు కట్టుకుంటాడు నీడలలో వణుకుచున్నాడు
అప్పుడు యేసు వచ్చి తన అంధకారాన్ని వెళ్ళగొట్టాడు.
యేసు వచ్చినప్పుడు, శోధకుని శక్తి కూలిపోతుంది;
యేసు వచ్చినప్పుడు, కన్నీళ్లు తుడవబడతాయి,
ఆయన మసగను తొలగించి జీవితాన్ని మహిమతో నింపుతాడు,
అంతా మారిపోతుంది యేసు నివసించడానికి వచ్చినప్పుడు.

ఇంటి నుండి స్నేహితుల నుండి దురాత్మలు అతనిని వెల్లగొట్టాయి,
సమాధులలో దుర్భర స్థితిలో అతడు నివసిస్తున్నాడు;
సాతాను శక్తులు అతనిని ఆవహించాయి కాబట్టి తనను కోసుకుంటున్నాడు,
అప్పుడు యేసు వచ్చాడు బంధీని విడుదల చేసాడు.
యేసు వచ్చునప్పుడు, శోధకుని శక్తి కూలిపోతుంది;
యేసు వచ్చునప్పుడు, కన్నీళ్లు తుడవబడతాయి,
ఆయన మసగను తొలగించి జీవితాన్ని మహిమతో నింపుతారు,
అంతా మారిపోతుంది యేసు నివసించడానికి వచ్చునప్పుడు.

కనుక ఈరోజు మనష్యులు సమర్దుడైన రక్షకుని కనుగొన్నాడు,
వారు తపన, కామము మరియు పాపమును జయించలేకపోయారు;
వారి విరిగిన హృదయాలు విచారములో ఒంటరితనములో వారిని విడిచిపెట్టాయి,
అప్పుడు యేసు వచ్చాడు, ఆయనే, లోపల నివసించాడు.
యేసు వచ్చినప్పుడు, శోధకుని శక్తి కూలిపోతుంది;
యేసు వచ్చునప్పుడు, కన్నీళ్లు తుడవబడతాయి,
ఆయన మసగను తొలగించి జీవితాన్ని మహిమతో నింపుతాడు,
అంతా మారిపోతుంది యేసు నివసించడానికి వచ్చినప్పుడు.
("అప్పుడు యేసు వచ్చాడు" డాక్టర్ ఒస్వాల్డ్ జే. స్మిత్ చే, 1889-1986;
      సంగీతము హోమర్ రోడే హీవర్ చే, 1880-1955).
      (“Then Jesus Came” by Dr. Oswald J. Smith, 1889-1986;
         music by Homer Rodeheaver, 1880-1955).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"అప్పుడు యేసు వచ్చాడు" (డాక్టర్ ఒస్వాల్డ్ జే. స్మిత్ చే, 1889-1986;
సంగీతము హోమర్ రోడే హీవర్ చే, 1880-1955).
“Then Jesus Came” (by Dr. Oswald J. Smith, 1889-1986;
music by Homer Rodeheaver, 1880-1955).ద అవుట్ లైన్ ఆఫ్

ఒక ఆత్మను క్రీస్తు నొద్దకు నడిపించుట ఎలా –
మార్పిడిల కొరకు ఉపదేశము!

HOW TO LEAD A SOUL TO CHRIST –
COUNSELING FOR CONVERSIONS!

డాక్టర్ సి. ఎల్. కాగన్ చే వ్రాయబడిన ప్రసంగము
మరియు రెవరెండ్ జాన్ సామ్యూల్ కాగన్ చే బోధింపబడినది
A sermon written by Dr. C. L. Cagan
and preached by Rev. John Samuel Cagan

"మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని... పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను"
(మత్తయి 18:3).

(యోహాను 3:3, 7; II కొరింధీయులకు 5:17)

1. మొదటిది, సంఘ కాపరులు పాపులు చెప్పేది తప్పక వినాలి.

2. రెండవది, పాపులు యేసు క్రీస్తును గూర్చి తప్పిదములు చేస్తారు, రోమా 8:34;
లూకా 24:37-43.

3. మూడవది, పాపులు రక్షణ విషయములో పొరపాట్లు చేస్తారు, తీతుకు 3:5;
యాకోబు 2:19; ఎఫెస్సీయులకు 2:20

4. నాల్గవది, వారి హృదయముల పాపమును గూర్చి ఒప్పుకోలు పాపులకు అవసరము, యిర్మియా 17:9; యోహాను 6:44; యోనా 2:9; యెషయా 6:5.

5. ఐదవది, పాపి ఒకవేళ తన హృదయ పాపమును గూర్చి ఒప్పించబడితే, అతనిని క్రీస్తు నొద్దకు నడిపించప్రయత్నించాలి, యెషయా 6:5; లూకా 23:42, 43.

6. ఆరవది, మీరు పాపితో మాట్లాడిన తరువాత, అతనిని కొన్ని సామాన్య ప్రశ్నలు అడగండి.

7. ఏడవది, ఉపదేశపు పరిచర్య నిజ పరీక్షను జ్ఞాపకము ఉంచుకోండి, యోహాను 12:43.