Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




క్రీస్తు యొక్క శోధన
సాతాను పడిపోవుట!

THE TEMPTATION OF CHRIST
AND THE FALL OF SATAN!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే,
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము ఉదయము, జూలై 29, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, July 29, 2018


ప్రభువైన యేసు క్రీస్తు సాతానుచే ఎదుర్కొనబడ్డాడు. మత్తయి 4:1 చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 997 వ పుటలో ఉంది.

"అప్పుడు యేసు అపవాది [చేత] శోధింప బడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనపోబడెను" (మత్తయి 4:1).

చూడండి. సాతాను మొదటి పేరు "అపవాది" అని ఇవ్వబడినది. దాని గ్రీకు పదము "డయాబోలోస్" దాని అర్ధము "మార్చువాడు" లేక "అపవాదకుడు." అతడు యేసును శోధించాడు "ఆయనను అపవాదమునకు" లోను చెయ్యడానికి. ఇప్పుడు వచనము మూడు చూడండి,

"ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, అతడు అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనేను" (మత్తయి 4:3).

సాతాను కున్న రెండవ పేరు "శోధకుడు." గ్రీకు పదము "పేరేజో" దాని అర్ధము "శోధించు" లేక "పరీక్షించు." యేసు బైబిలులోని, ద్వితీయోపదేశకాండము 8:3 ను ప్రస్తావించాడు, "మనష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును" (మత్తయి 4:4).

ఇప్పుడు, సాతాను లేఖనాలు పలుకుతున్నాడు. షేక్స్ ఫియర్ సరిగ్గా చెప్పాడు ఇలా, "సాతాను తన ఉద్దేశము నిమిత్తము లేఖనము ప్రస్తావించగలదు." సాతాను కీర్తనలు 91:11:12 ప్రస్తావించినది, సరిగ్గా చెప్పలేకపోయినను. తెగలు యెహోవా సాక్షులు మెర్మోనులు కొన్ని బైబిలు వచనాలు పలుకుతారు, కాని కచ్చితముగా చెప్పలేరు. యేసు నిక్కచ్చిగా సాతానుకు జవాబు ఇచ్చాడు,

"అందుకు యేసు ప్రభువైన నీవు, నీ దేవుని నీవు శోధింపవలదని, మరియొక చోట వ్రాయబడి యున్నదని వానితో చెప్పెను," ద్వితీయోప దేశకాండము 6:16 (మత్తయి 4:7).

తరువాత సాతాను యేసును మూడవసారి శోధించింది, యేసు తనను ఆరాధిస్తే లోక రాజ్యములన్నియు ఆయనకు ఇస్తానంది. ఇప్పుడు మత్తయి 4:10 చూడండి,

"యేసు వానితో చెప్పెను, పొమ్ము, సాతాను: ప్రభువైన నీవు, దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింప వలెను, అని వ్రాయబడి యున్నదనెను," ద్వితీయోప దేశకాండము 6:13 మరియు 10:20 ఇక్కడ ప్రస్తావింపబడ్డాయి (మత్తయి 4:10).

డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "ప్రభువు సాతానును ప్రతిసారి వాక్యము నుండి [బైబిలు] జవాబు ఇచ్చాడు. సాతానుకు అనిపించింది [బైబిలు] మంచి జవాబులు ఇచ్చిందని ఎందుకంటే తరువాత వచనములో మనము చదువుతాము, ‘అప్పుడు అపవాది ఆయనను విడిచి పోయెను’ (మత్తయి 4:11)" (J. Vernon McGee, Thru the Bible, notes on Matthew 4:1-11).

గమనించండి యేసు అపవాదికి మూడవ పేరు ఇచ్చాడు, "సాతానా, పొమ్ము..." గ్రీకు పదము, "సాతానాస్," దాని అర్ధము "నిందించువాడు." ఆయన పడిపోలేదని రుజువు చేయడానికి ఆయన పరీక్షింపబడ్డాడు. నాకు తెలుసు మీరు నేను యేసు క్రీస్తు ప్రభువు అంత శక్తి గల వారముకాము. కాని మనము ఆయన ఉదాహరణను వెంబడించాలి మనము ఆయన సైనికుల వలే శిష్యుల వలే తర్ఫీదు పొందాలి! గమనించండి ప్రతి శోధనకు క్రీస్తు బైబిలును ప్రస్తావించడం ద్వారా జవాబు ఇచ్చాడు, అదే దేవుని వాక్యము. ఆయన, "సరే, నేను ఇలా అనుకుంటున్నాను లేక అలా" అని అనలేదు, లేక "సరే, ఇంకొక మంచి మార్గముందని నేను అనుకుంటున్నాను అని అనలేదు." యేసు అపవాదికి జవాబుగా సరియైన బైబిలు వచనము చెప్పాడు. నా ఉన్నత విద్య కొరకు నేను ఒక స్వతంత్ర, బైబిలును తిరస్కరించే వేదాంత విద్యా కళాశాలలో చదివాను. నేను అక్కడకు ఎందుకు వెళ్లవలసిందంటే నాకు సరిపడ్డ డబ్బులేదు జాన్ కాగన్ హాజరవుతున్న మంచి సెమినరీలో చదవడానికి. కాని ఆ చెడ్డ సెమినరీలో ఒక విషయము నేర్చుకున్నాను. బైబిలు వాక్యాలు పలుకుట ద్వారా అధ్యాపకులకు జవాబివ్వడం నేర్చుకున్నాను. వారు నన్ను సంకుచిత స్వభావము గల ప్రాధమికునిగా పిలిచారు. అది నన్ను ఏమాత్రము భాద పెట్టలేదు! నేను యేసును వెంబడిస్తూన్నాను. నేను ఆయన శిష్యుడను – వారికి కాదు!

అందుకే మీరు ఇక్కడకు వచ్చి బైబిలు నేర్చుకోవడం అంత ప్రాముఖ్యము. వేరే గుడికి గాని బైబిలు పఠనమునకు గాని పారిపోవద్దు. ఆ గుంపును నడిపించే వాడికి బైబిలు ఎక్కువగా తెలియక పోవచ్చు, కనుక వారు మిమ్ములను క్రీస్తు శిష్యునిగా తర్భీదు చెయ్యలేరు. మీరు ఇక్కడకు వస్తూ ఉంటే, మేము మీకు స్వచ్చమైన దేవుని వాక్యము బోధిస్తాము, చాలా ముఖ్య వచనమును కంఠత పటిస్తాము. ఈ వచనము ఈరోజు మీరు కంఠస్తము చెయ్యాలి.

"నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను" (కీర్తనలు 119:11).

సాతాను ఎక్కడ నుండి వచ్చాడో బైబిలులో, దేవుని వాక్యములో, మీరు చూడాలని నేను ఆశ పడుచున్నాను. కొంతమంది బలహీన సువార్తికులు మీతో చెప్తారు సాతాను గూర్చి తెలుసుకోవడం అంత ప్రాముఖ్యము కాదని. మీరు క్రీస్తు శిష్యులు కావాలనుకుంటే మీరు తప్పక దెయ్యమును గూర్చి తెలుసుకోవాలి! యెషయా 14:12-15 చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో ఇది 726 పుటలో ఉన్నది. దయచేసి నిలబడి మౌనంగా చదవండి నేను గట్టిగా చదువుతాను.

"తేజో నక్షత్రము వేకువ చుక్కా, ఓ లూసిఫర్, నీవెట్లు ఆకాశము నుండి పడితివి! జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు, ఎట్లు నరకబడితివి! నేను ఆకాశమున కెక్కి పోయెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును, ఉత్తర దిక్కున నున్న సభా పర్వతము మీద కూర్చుందును: మేఘ మండలము మీదికేక్కుదును; మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును. [నేను దేవుడిని] అని నీవు మనస్సులో అనుకొంటివి గదా, నీవు పాతాళ మునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే" (యెషయా 14:12-15).

మీరు కూర్చోండి.

12 వ వచనములో సాతాను "లూసిఫర్" అని పిలువబడింది. లూసిఫర్ అనగా హెబ్రీలో "తేజోనక్షత్రము" అని అర్ధము. సాతాను పేరు "తేజో నక్షత్రము" అని తెలుసుకుంటే అది తరువాత మీకు సహాయ పడుతుంది. కొన్ని తెగలలోను పెంతేకోస్తుల గుంపులలోను ప్రజలు "తేజో నక్షత్రము" చూచి అది పరిశుద్ధాత్మ అనుకుంటారు. కాదు! కాదు! అది సాతాను! అది లూసీఫర్! II కొరింధీయులకు 11:14 లో, బైబిలు చెప్తుంది, "ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు." ఎవరి తలపైనైనా మీరు వెలుగు చూస్తే, అది సాతాను! అది దేవుడు కాదు! అది పరిశుద్ధాత్మ కాదు. అది సాతాను, "వెలుగు దూతగా మార్చబడ్డాడు." ఈనాడు ప్రసిద్ధ పుస్తకాలు ఉన్నాయి అవి చెప్తాయి ప్రజలు చనిపోయి, పరలోకమునకు వెళ్లి, తిరిగి భూమికి వచ్చినట్టు. వారు ఎప్పుడు పరలోకములో "వెలుగు" చూచినట్టు చెప్తారు. ప్రతి విషయములో వారు సాతానుచే మోసగింప బడుచున్నారు – వారు సాతానును చూచి దేవుడు అనుకుంటున్నారు! కాని అది సాధ్యము కాదు. క్రీస్తు మనకు చెప్పాడు,

"ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు" (యోహాను 1:18).

వారు నిజముగా "వెలుగును" చూస్తే అది దేవుడు కాదు! అది లూసిఫర్ (సాతాను) కావచ్చు లేక అతని దెయ్యములు కావచ్చు! దేవుడు కానేకాదు!

యెషయా 14:12 కు వద్దాం. లూసిఫర్ పరలోకము నుండి భూమిపైకి త్రోయబడినప్పుడు అతడు "రాజ్యమును బలహీన పరిచాడు." లూసిఫర్ ఆదిలో పరలోకములో గొప్ప దూత. కాని లూసిఫర్ పరలోకము నుండి త్రోసివేయబడింది ఎందుకంటే వాడు శక్తిగల దేవుని స్థానమును తీసుకోవాలనుకున్నాడు. యెషయా 14:13-15 చూడండి, నేను చదువు చుండగా. దయచేసి నిలబడింది.

"నేను ఆకాశమున కెక్కి పోయెదను, దేవుని నక్షత్రములకు పైగా, నా సింహాసనమును హెచ్చింతును: ఉత్తర దిక్కున ఉన్న, సభా పర్వతము మీద కూర్చుందును: మేఘ మండలము మీదికేక్కుదును; మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును. నీవు మనసులో దేవునితో సమానం అనుకొంటివి గదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితిదే" (యెషయా 14:13-15).

స్కోఫీల్డ్ 726 పుటలో క్రింద గమనిక చూడండి. అది చెప్తుంది, "వచనము 12-14 సాతానుకు సంబందించినది...ఈ పాఠ్యభాగము విశ్వములో పాపము ఆరంభమును తెలియ పరుస్తుంది. ఎప్పుడైతే లూసిఫర్, ‘నేను చూస్తాను,’ అని చెప్పాడో పాపము ప్రారంభమయింది." ఇప్పుడు ప్రకటన 12:9 చూద్దాం. బైబిలు చివరిలో 1341 వ పుటలో ఉంది. చదువుచుండగా నన్ను వెంబడించండి.

"కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాది యనియు, సాతాననియు పేరుగల, ఆది సర్పమైన, ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను: అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి" (ప్రకటన 12:9).

ఆ గొప్ప ఘట సర్పము లూసిఫర్, సాతాను, "ఆ సర్పము, దెయ్యము, మరియు సాతాను." చాలామంది ఆధునిక వేత్తలు చెప్తారు భూమి అంతములో ఇది సాతానును తోలివేయుట. ఇది మనము యెషయా 14 లో చదివిన దానిని అర్ధము చేసుకొనడానికి సహాయ పడుతుంది. ఇలా, సాతాను వచ్చింది. ఇక్కడ 9 వ వచనములో చెప్పబడింది "దాని దూతలు దానితో కూడ పడ ద్రోయబడిరి." ఈ తిరుగుబాటు చేసిన దూతలు బైబిలులో యేసును ఎదుర్కొన్నాయి. ప్రకటన 12:9 లో ఇంకొక పదము ఉంది, "సాతాను, సర్వలోకమును మోసగించిన సాతాను."

విన్ స్టన్ చర్చిల్ గుడికి వెళ్ళే క్రైస్తవుడు కాకపోయినా, దెయ్యము ఉందని అతడు అర్ధము చేసుకున్నాడు. II వ ప్రపంచ యుద్ధములో దెయ్యము హిట్లర్ వెనుక ఉందని చర్చిల్ కు తెలుసు. అందుకే అతడు హిట్లర్ తో సమాధాన పడలేదని అతనికి అర్ధము అయింది. ఇతరులు చాంచెర్ లెయిన్, లార్డ్ హోలీఫాక్స్ మరియు "అప్పీసరులు" అనుకున్నారు వారు హిట్లర్ తో సమాధాన పడగలరని. కాని చర్చిల్ కు తెలుసు ఈలోక దెయ్యపు శక్తులు ఆపబడాలి లేనిచో అంతము వచ్చును, దానిని చర్చిల్ "క్రైస్తవ నాగరికత" అని పిలిచాడు.

క్రీస్తు శిష్యులుగా ఆ పోరాటము మనము చేయాలి. నా సహాయకుడు, రెవరెండ్ జాన్ కాగన్, మన శత్రువైన – సాతానుపై – ఈ రాత్రి 6:15 కు మాట్లాడుతాడు. మనకు వేడి మంచి భోజనము ఉంటుంది, తరువాత పాస్టర్ జాన్ భోదిస్తాడు. ఈరాత్రి తిరిగి 6:15 కు తప్పక రండి!

దయచేసి నిలబడి లూథర్ గొప్ప పాట, "మన దేవుడు గొప్ప దుర్గము" పాడండి. అది పాటల కాగితములో మొదటి పాట. దయచేసి నిలబడి పాడండి!

గొప్ప దుర్గము మన దేవుడు, పైనున్న వాడు ఎన్నడు విఫలుడు కాడు,
   ఆయన మన సహాయకుడు, కొనసాగే వివిధ అనారోగ్యముల మధ్య.
మన ప్రాచీన శత్రువు మనలను పనిలో కొనసాగకుండా ఆపినప్పటికినీ;
   ఆయన నైపుణ్యము శక్తి గొప్పవి, మరియు, భయంకర ద్వేషము,
భూమిపై ఏదియు ఆయనకు సమము కాదు.

మన స్వంత శక్తితో జయిస్తామా, మన శ్రమ ఓడిపోతుంది,
   సరియైన వ్యక్తి మన పక్షమున లేడు, దేవునిచే ఎన్నిక చేయబడిన వ్యక్తి.
ఎవరు అని అడగవద్దు? ఆయన, క్రీస్తు యేసు;
   ప్రభూ సైన్యములు ఆయన పేరు, యుగ యుగములకు మారనివాడు,
ఆయన యుద్ధములో జయించాలి.
      ("మన దేవుడు గొప్ప దుర్గము" మార్టిన్ లూథర్ చే, 1483-1546).
      (“A Mighty Fortress is Our God” by Martin Luther, 1483-1546).


ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"మన దేవుడు గొప్పదుర్గము" (మార్టిన్ లూథర్ గారిచే, 1483-1546).
“A Mighty Fortress Is Our God” (by Martin Luther, 1483-1546).