Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
శిష్యులు మరియు దెయ్యములు

DISCIPLES AND DEMONS
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే వ్రాయబడినది,
మరియు డాక్టర్ రెవరెండ్ జాన్ సామ్యూల్ కాగన్ గారిచే లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడినది
ప్రభువుదినము ఉదయము, జూలై 22, 2018
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Rev. John Samuel Cagan
at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, July 22, 2018


క్రీస్తు తన శిష్యులకు తర్ఫీదు ఇవ్వడము అనే అంశముపై ఇది మేము మీకు ఇచ్చుచున్న మూడవ పఠనము. యేసు వారిని తర్భీదు చేయడం మనము గమనిస్తే, ఈనాడు శిష్యులకు ఎలా తర్ఫీదు ఇవ్వాలో మనము నేర్చుకుంటాం.

ఈనాడు మన సంఘాలు యవనస్తులకు తర్ఫీదు ఇచ్చేటట్టు యేసు తన శిష్యులకు తర్భీదు ఇవ్వలేదు. యేసు శిష్యులను తయారు చేసిన విధానాన్ని మనము చాలా జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఆయన చాలా జయశీలుడుగా ఉన్నాడు, మన సంఘాలు సామాన్యంగా విఫలమవుతున్నాయి. ఈనాటి ఒక పొరపాటు ఏంటంటే శిష్యులనుగా ఉండమని వారికి బోధించే ముందు మన శిష్యులను మార్చడానికి ప్రయత్నించడం. కాని యేసు తన శిష్యులకు మూడు సంవత్సరాలు బోధిస్తూ వచ్చాడు, వారు తిరిగి జన్మించక మునుపు (యోహాను 20:22; జే. వెర్నోన్ మెక్ గీ మరియు థామస్ హేల్ చెప్పినది చూడండి). యేసు చేసిన దానికి మనము చేస్తున్న దానికి, అది ముఖ్యమైన తేడా.

ఇంకొక ప్రాముఖ్యమైన తేడా క్రీస్తు వారికి బోధించిన విషయాలు. ఆరంభములోనే యేసు వారిని పిలిచి వారితో అన్నాడు, "నేను మిమ్మును మనష్యులను పట్టు జాలరులనుగా చేయుదును" (మార్కు 1:17). ఒక ప్రధాన ఉద్దేశముతో కూడిన వారికి తర్ఫీదు ఇచ్చాడు – ఇతరులు శిష్యులు అయ్యేటట్టు చేయడానికి వారికి సమర్ధత కలుగచేయడం. ప్రారంభములో అది ఆయన గురి అని యేసు వారికి చెప్పాడు. నా గురి కూడ అదే. ఈనాడు సబ్బాతు బడిలో చేస్తున్నట్టు, మీకు బైబిలు కథలు చెప్పడానికి నేను ఇక్కడ లేను. నా గురి ఏమిటంటే మీరు ఆత్మల సంపాదకులుగా చేయడం, ఇతరులు క్రీస్తును వెంబడించేటట్టుగా చేయడం నశించు ఆత్మలను సంపాదించడం. అది క్రీస్తు ప్రారంభములోనే వారికి చెప్పాడు (మార్కు 1:16-20 చూడండి).

రెండవ విషయము క్రీస్తు వారికి బోధించినది సాతానుతోను అతని అనుచరులతోను ఎలా ఉండాలి. మార్కు 1:21-27 చూడండి.

"వారు కపెర్న హూములోనికి వెళ్ళిరి; వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరము లోనికి పోయి, బోధించెను. ఆయన శాస్త్రుల వలే గాక అధికారము గలవాని వలే వారికి బోధించెను: గనుక వారు ఆయన బోధకు, ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్ర ఆత్మ పట్టిన మనష్యు ఒకడుండెను; వాడు ఏడుస్తూ, అన్నా, మేము ఒంటరి వారము; వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? నమ్ము నశింప చేయుటకు వచ్చితివా? నీ వెవడవో నాకు తెలియును, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము, వారిని విడిచి, పొమ్మని, దానిని గద్దించాడు. ఆ అపవిత్రాత్మ వానిని విలవిల లాడించి, పెద్ద కేక వేసి, వాని విడిచి పోయెను. అందరును విశ్మయ మొంది, ఇదేమిటో ఇది కొత్త బోదగా ఉన్నదే, అని, ఇది ఏమిటి అనెను? ఇది ఏమి వింత? ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగా, అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి" (మార్కు 1:21-27).

పైకి చూడండి. ఆయన తన మొదటి నలుగురు శిష్యులకు బోధించిన విషయము సాతాను దాని దయ్యములపై ఆయన కున్న శక్తి. సంస్కరణ పఠన బైబిలు (పుట 290) ఇలా చెప్తుంది,

దయ్యములు పడిపోయిన...సాతానును సేవించే దేవదూతలు. సాతాను తిరుగుబాటులో అది కలిసినందుకు, పరలోకము నుండి పడవేయబడ్డాయి... సాతాను దెయ్యముల సమూహము [ఉపయోగించుకున్నాయి] చాలా విధాలుగా మోసము నిరుత్సాహము కలిగిస్తాయి. వాటిని ఎదిరించడానికి ఆత్మీయ యుద్ధ పోరాటము జరిగించాలి (ఎఫెస్సీయులకు 6:10-18).

ఒక కొత్త శిష్యునిగా, సాతాను వాని దెయ్యములను గూర్చి నీవు తెలుసుకోవాలని యేసు కోరుతున్నారు. దెయ్యము పట్టిన వానిని యేసు సంధించాడు. కింగ్ జేమ్స్ బైబిలులో గ్రీకు పదము అపవిత్రాత్మలకు "దయ్యము" అని అనువాదము చేయబడింది. మార్కు 1:39 చూడండి,

"ఆయన [యేసు] గలిలయ యందంతట వారి సమాజ మందిరములలో ప్రకటించుచు, దయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను" (మార్కు 1:39).

మీరు యేసు శిష్యులుగా అవుచున్నప్పుడు, మీ చుట్టూ ఉన్న అపవిత్రాత్మలను గూర్చి మీరు తెలుసుకొని ఉండాలి. బైబిలులో ఉన్న సత్యమును తెలుసుకోకుండా అపవిత్రాత్మలు ప్రజలకు అంధత్వము కలిస్తాయి. అపవిత్రాత్మలు మిమ్ములను భయపెట్టి గుడికి రాకుండా చేస్తాయి. మీరు క్రైస్తవులవకుండా అపవిత్రాత్మలు ప్రయత్నిస్తాయి. డాక్టర్ థామస్ హేల్ అన్నాడు,

అపవిత్రాత్మలు పట్టడం అనేది మానసిక రోగము కాదని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. దయ్యములు అపవిత్రాత్మలు, ప్రధాన దయ్యమైన సాతానుకు, సేవకులు. అవి చెడు కార్యములు చేస్తాయి. అవి ఒక మనష్యునిలో ప్రవేశించినప్పుడు, అవి వారిని ఒక బందీగా సాతానుకు బానిసగా చేస్తాయి. యేసు శక్తి చేత మాత్రమే ఈ దయ్యములు జయించ బడతాయి మానవునికి స్వాతంత్రము వస్తుంది (Thomas Hale, M.D., The Applied New Testament Commentary; note on Mark 1:21-28).

మత్తు పదార్ధాల ద్వారా, తెగల ద్వారా, దేవునిపై తిరుగుబాటు చేయడం ద్వారా ప్రజలు దయ్యము పట్టిన వారవుతారు.

"మంచిది," ఒకరన్నారు, "నేను మత్తు పదార్ధాలు తీసుకోలేదు, తెగలులో పాల్గొనలేదు, ఈ పనులేమి చేయలేదు." పాపములో మీరు ఇంత దూరము పోనందుకు నేను ఆనందిస్తున్నాను. కాని అలా అయితే, మీ మనస్సు (ప్రభావితము అవుతుంది) "ఆకాశ మండలములోని దురాత్మల సమూహములతో" (సాతాను; ఎఫెస్సీయులకు 2:2). కనుక మీ మారని మనస్సు సాతానుచే ఉపయోగించబడుతుంది, "వాయుమండల సంబంధమైన అధిపతి."

సాతాను చేసే రెండవ పని మిమ్ములను సత్యమును చూడకుండా గుడ్డితనము కలుగ చేస్తుంది. II కొరింధీయులకు 4:3-4 వినండి.

"మా సువార్త మరుగు చేయబడిన యెడల, నశించు చున్న వారి విషయములోనే మరుగు చేయబడి యున్నది: దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను కనుపరచు, సువార్త ప్రకాశము వారికి ప్రకాశించ కుండ, నిమిత్తము ఈయుగ సంబంధమైన దేవత, అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు గుడ్డితనము కలుగచేసేను" (II కొరింధీయులకు 4:3-4).

"ఈలోక దేవత" అనేదానిని "ఈయుగ సంబంధమైన దేవతగా" అనువదింపబడింది. సాతాను ఈయుగ దేవత. సాతాను "అవిశ్వాసులైన వారి" మనో నేత్రములకు గుడ్డితనము కలుగచేస్తుంది. క్రీస్తు సువార్త ఎందుకు అర్ధము కావడం లేదని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. జవాబు సులువు – ఈయుగ దేవత [సాతాను] మీ మనసుకు అంధకారము కలిగించింది. కాని క్రీస్తు సాతాను కంటే, గొప్ప శక్తి కలిగిన వాడు. అందుకే క్రీస్తు సులభముగా కపెర్నహుములో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. క్రీస్తు అన్నాడు, "వానిలో నుండి బయటకురా" మరియు ఆ దయ్యము "వానిలో నుండి బయటకి వచ్చింది" (మార్కు 1:25, 26).

మీరు నిజ క్రైస్తవునిగా అవాలంటే యేసు శిష్యుడవు కావాలంటే, క్రీస్తు మీ ఆలోచనలపై సాతనుకున్న నియంత్రణను తీసివేయాలి. ఒక హెప్పీ ఒకసారి డాక్టర్ హైమర్స్ కు చెప్పాడు, "నాకు బుర్ర మార్పిడి జరగాలి." అది చాలా విపరీతము. ఆ యవనస్తునికి కావలసినది అతని మనసు యేసుచే కడుగబడాలి. యేసు చాలా సులభంగా అలా చేయగలడు. బైబిలు – దేవుని వాక్యముతో ఆయన నీ మనస్సు కడుగుతాడు. "వాక్యముతో ఉదక స్నానము చేత" అని బైబిలు చెప్తుంది (ఎఫెస్సీయులకు 5:26). కీర్తనలు 119:130 చెప్తుంది,

"నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు గలును; అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును" (కీర్తనలు 119:130).

నీవు యేసు శిష్యుడవాలనుకుంటున్నావా? అలా క్రియాశీలకంగా ప్రారంభించవచ్చు. మీరు నిద్రపోవక ముందు ప్రతిరోజూ రాత్రి డాక్టర్ హైమర్స్ ప్రసంగమును మా వెబ్ సైట్ లో చదవండి. మా వెబ్ సైట్ www.sermonsfortheworld.com. మీరు పడకకు వెళ్ళకమునుపు, ప్రతిరాత్రి డాక్టర్ హైమర్స్ ఒక ప్రసంగము చదివితే బైబిలు వచనములు వ్యాఖ్యానాలు మీ మనసును కడుగుతాయి త్వరలో మీరు యేసును విశ్వసించి రక్షింప బడతారు! దయచేసి నిలబడి పాటల కాగితంలో 5 వ సంఖ్య పాటను పాడండి, "బైబిలు సత్యమని నాకు తెలుసు."

బైబిలు దేవుని నుండి పంపబడిందని నాకు తెలుసు, పాత నిబంధన, కొత్త నిబంధన;
   ప్రేరేపితము పరిశుద్ధము, సజీవ వాక్యము, బైబిలు సత్యమని నాకు తెలుసు.
నాకు తెలుసు, నాకు తెలుసు, బైబిలు సత్యమని నాకు తెలుసు;
   దైవికంగా ప్రేరేపించబడింది మొత్తమంతా, బైబిలు సత్యమని నాకు తెలుసు.

బైబిలు పూర్తిగా సత్యమని నాకు తెలుసు, అది నాలో శాంతిని ఇచ్చింది;
   అది నన్ను కనుగొన్నది, రోజు ఆదరిస్తుంది, పాపముపై నాకు జయమునిస్తుంది.
నాకు తెలుసు, నాకు తెలుసు, బైబిలు సత్యమని నాకు తెలుసు;
   దైవికంగా ప్రేరేపించబడింది మొత్తమంతా, బైబిలు సత్యమని నాకు తెలుసు.

ప్రసంగము పాతదని శత్రువులు ధైర్యముగా తిరస్కరించినా, కాని అది నూతనము,
   చెప్పబడుచున్న ప్రతిసారి సత్యము మధురము, బైబిలు సత్యమనినాకు తెలుసు.
నాకు తెలుసు, నాకు తెలుసు, బైబిలు సత్యమని నాకు తెలుసు;
   దైవికంగా ప్రేరేపించబడింది మొత్తమంతా, బైబిలు సత్యమని నాకు తెలుసు.
      ("బైబిలు సత్యమని నాకు తెలుసు" డాక్టర్ బి. బి. మెకిన్నీగారిచే, 1886-1952).
       (“I Know the Bible is True” by Dr. B. B. McKinney, 1886-1952).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
      "బైబిలు సత్యమని నాకు తెలుసు" (డాక్టర్ బి. బి. మెకిన్నీగారిచే, 1886-1952).
      “I Know the Bible is True” (by Dr. B. B. McKinney, 1886-1952).