Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
శిష్యులను తయారు చేయడంలో క్రీస్తు యొక్క పద్ధతి

CHRIST’S METHOD OF MAKING DISCIPLES
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడినది
ప్రభువుదినము సాయంకాలము, జూలై 15, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, July 15, 2018


దయచేసి మత్తయి సువార్త 10:1 చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1008 పుటలో ఉంది. 1 వ వచనంలో మొదటి సగ భాగము చూడండి.

"ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి..."

గ్రీకు పదము "మేథేటేస్" నుండి "శిష్యుడు" అనే పదము అనువదింపబడినది. నూతన నిబంధన గ్రంథములో ఈ పదము ఒక వ్యక్తి బోధకుని నుండి నేర్చుకుని ఆ బోధకుని వెంబడించుటను సూచించుచున్నది. యేసును వెంబడించిన పన్నెండు మందికి ఇది వర్తిస్తుంది.

క్రీస్తు ఎలా ఈ పన్నెండు మందిని పిలిచాడు, వారు తిరిగి జన్మించక ముందు వారికి ఎలా తర్ఫీదు ఇచ్చాడు అనేది మీకు చూపించడమే నా ఉద్దేశము. ఈనాటి చాలా సంఘాలలో ఈ విధముగా జరగడం లేదు. భాషలలో మాట్లాడే పెంతేకోస్తుల నుండి ప్రాధమిక బైబిలు బోధకుల వరకు – నాకు తెలిసిన వాళ్ళంతా ఈ పద్ధతి నుండి వైదొలగారు. వారు సాధారణంగా ఒక కొత్త వ్యక్తిని కనుగొని ఇలా అంటారు, "నీవు పరలోకమునకు వెళ్ళాలనుకుంటున్నావా?" కొత్త వ్యక్తిని, "అవును, నేనా అలా చేస్తాను" అని చేప్పే వరకు ఒత్తిడి చేస్తారు. అప్పుడు ఆత్మల సంపాదకుడు అంటాడు, "నాతో ఈ మాటలు ప్రార్ధించు." ఆ కొత్త వ్యక్తి "ఆత్మల సంపాదకుడు" మాటలు చెప్పినట్టే చెప్తాడు – తరువాత అతడు ప్రసంగాల చివర జోయిల్ ఓస్టీన్ చెప్పినట్టు చెప్తాడు, "మేము నమ్ముతున్నాము, మీరు ఆ ప్రార్ధన చెప్తే, మీరు ఇప్పుడే తిరిగి జన్మించారు." మంచి సంఘాలలో వారు ఎవరితో ప్రార్ధించారో వారి పేరు ఫోను నంబరు తీసుకుంటారు – మరియు తరువాత, కొన్ని రోజుల తరువాత, వారు ఆ విధంగా మారి వ్యక్తిని "ప్రోత్సహించడానికి" ఒకరిని పంపిస్తారు. నా అనుభవములో చూసాను ఆ పద్దతి నిజ క్రైస్తవుని తయారు చేయలేదు! వారు ఎవరితో ప్రార్ధించారో ఆ వ్యక్తి మారినవాడు కాదు. వారు తరుచు "ఆత్మల సంపాదకుని" నుండి దాగుకుంటారు, లేక "వెళ్లి పొమ్మని" అరుస్తారు! మీరు వారిని "కలుసుకొని" ప్రయత్నించినప్పుడు వారు సరిగా స్పందించరు!

ఈ పద్దతిలో ఉన్న తప్పు ఏమిటి? ఇది సాధారణంగా పనిచేయదు! వాస్తవానికి ఎప్పుడు పనిచేయదు. నేను అరవై సంవత్సరాలుగా బాప్టిస్టు బోడకుడను అది నా అనుభవము. అది ఎందుకు "పనిచేయదు"? అది ఎందుకు శిష్యులను తయారు చేయదు? ఎందుకంటే మనలో చాలా మంది యేసు శిష్యులను ఎలా తయారు చేసాడో అనే విషయంపై కావలసిన ఆలోచన పెట్టడం లేదు! అందుకే!

మీరనుకోవచ్చు నేను "ప్రభుత్వపు రక్షణను" గూర్చి బోధిస్తున్నానని, కాని నేను అలా చెయ్యడం లేదు. జాన్ మెక్ ఆర్డరు పాల్ వాషర్ బోధించినది నేను బోధించడము లేదు. "ప్రభుత్వపు రక్షణను" నేను ఎందుకు తిరస్కరిస్తానో తెలుసుకోవడానికి, దయచేసి చనిపోవుచున్న దేశానికి బోధించుట అనే పుస్తకములోని, పుటలు 117-119 చదవండి. మా వెబ్ సైట్, www.sermonsfortheworld.com లో పుస్తకమంతా మీరు ఉచితముగా చదవవచ్చు. రక్షణ అనేది యేసును విశ్వసించడం ద్వారా ఆయన రక్తముచే కడుగబడడం ద్వారా వస్తుంది.

కాని నాలుగు సువార్తలలో ఒక భాగము నాకు చూపించండి యేసు ప్రజలను "పాపి ప్రార్ధన" చెయ్యమని నడిపించినట్టు గాని, తరువాత వారిని వెంబడిపడినట్టు గాని ఉందేమో చెప్పండి. యేసు క్రీస్తు అలా చేసినట్టుగా మీరు కనీసము ఒక్క భాగము కూడ నాకు చూపించలేదు! ఆయన "వెంటపడడం" ముందు చేసాడు. వారు దేనిలోనికి రాబోతున్నారు అనే విషయము ముందుగా వారికి నేరుగా తెలియ పరచేవాడు!

ఈ విధంగా యేసు క్రీస్తు తన మనుష్యులను మార్చుకున్నాడు! శిష్యరికములో ఉన్న నగ్న సత్యాలను ముందుగా వారు వినాలని ఆయనకు తెలుసు – వారు నిజంగా ఆయనను విశ్వసించి రక్షింపబడే ముందు!

"కాని," ఒకరు అనవచ్చు, "నగ్న సత్యాలు వారిని భయపెడతాయని." నిజమే! నగ్న సత్యాలు వారిలో చాలామందిని భయ పెడతాయి! క్రీస్తు శిష్యులు చాలామంది ఆయనను విడిచి వెళ్ళిపోయారు. వారిని ఉండమని ఆయన బ్రతిమాలలేదు. పన్నెండు మందితో ఆయన అన్నాడు, "మీరు కూడ వెళ్ళి పోతారా?" (యోహాను 6:67). అందరు వెళ్ళిపోరు! ఉండిపోయి నేర్చుకున్నవారు క్రీస్తు కొరకు బండలాంటి శిష్యులుగా, సిలువ యోధులుగా ఉంటారు!

18 వ శతాభ్దములోని పాతకాలపు సువార్తికులతో డాక్టర్ ఐజాక్ వాట్స్ ఇలా చెప్పాడు. ఐజాక్ వాట్స్ అన్నాడు,

నేను సిలువ యోధుడను, గొర్రెపిల్లను వెంబడించువాడను,
ఆయన నిమిత్తము నేను భయపడతానా, ఆయన నామమును గూర్చి మాట్లాడడానికి సిగ్గుపడతానా?

నేను తప్పక పోరాడాలి, నేను పరిపాలించాలంటే; నా ధైర్యమును పెంపొందించు, ప్రభూ.
మీ వాక్కు సహాయముతో, నేను హింస భరిస్తాను, నొప్పి సహిస్తాను.
   ("నేను సిలువ యోధుడను?" డాక్టర్ ఐజాక్ వాట్స్, 1674-1748).
      (“Am I a Soldier of the Cross?” by Dr. Isaac Watts, 1674-1748).

క్రీస్తు యుద్ధ భూమిలోనికి దూకడానికి కొత్తవారు సిద్ధంగా ఉంటారని మనము అనుకొనలేము. అలా వారు చేస్తే అది సామాన్యము. కాని నేను అలా క్రైస్తవుడను కాలేదు. సిలువను ఎత్తుకునే క్రైస్తవుడు నిజ క్రైస్తవుడని నేను ముందుగా నేర్చుకున్నాను. నేను యేసును విశ్వసించే ముందు నేను సిలువ యోధుడను అయే ముందు నేను కఠిన శిష్యరికము ద్వారా వెళ్ళాను. మీరు కూడ అంతే!

ఈనాడు చాలా సంఘాలలో నేను ఇప్పుడు చెప్పినది! సాధన చేయడము లేదు, ఇది సత్యము. "తప్పకుండా నేను పోరాడాలి, నేను పరిపాలించాలంటే, నా ధైర్యమును పెంచు, ప్రభూ." ఈ విషయాన్నే 18 వ శతాభ్దపు గొప్ప సువార్తిక పాటల రచయిత వ్రాసాడు. ఇదే వందల వేలమంది లోతైన మంచులో నిలబడి జార్జి వైట్ ఫీల్డ్ లేక జాన్ వెస్లీ బోధించేటప్పుడు పాడేవారు! కాని ఈనాటి చాలా ఆరాధనలలో మీరు ఈ పాట వినరు! నేననుకుంటాను అందుకే మనము ఉపయోగిస్తున్న పాటల పుస్తకాలలో "క్రైస్తవ యుద్ధభూమిపై" చాలా తక్కువ పాటలు ఉంటాయి. క్రైస్తవ యుద్ధభూమి మీద కఠిన శిష్యరికముపై ఉన్న పాటలు అంత ప్రసిద్ధి కాంచలేదు 18 వ శతాభ్ధముతో పోలిస్తే ఆ రోజులలో ఐజాక్ వాట్స్ "నేను క్రీస్తు యోధుడను" అనే పాట వ్రాసాడు?"

అది మనలను సువార్త సందేశానికి తీసుకొని వస్తుంది. ఎప్పుడు యేసు ఆయన శిష్యులకు సువార్త బోధించడం ప్రారంభించాడు? I కొరింధీయులకు 15:3, 4 లలో సువార్తను గూర్చిన ప్రాధమిక వాస్తవాలు చెప్పబడ్డాయి:

"నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను; సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను" (I కొరింధీయులకు 15:3, 4).

ఆయనను వెంబడించడం ప్రారంభించిన సంవత్సరము తరువాత యేసు తన శిష్యులకు సువార్త చెప్పడం ప్రారంభించాడు. అది మత్తయి 16:21, 22 లలో వ్రాయబడింది,

"అప్పటి నుండి తాను యేరూషలేమునకు వెళ్లి, పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను, అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేసెను. అది మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు, దూరమగు గాక: అది నీకెన్నడు కలుగదని ఆయనను గద్దింపసాగెను" (మత్తయి 16:21, 22).

పేతురు ఒక సంవత్సర కాలము నుండి యేసును వెంబడిస్తున్నాడు. అయినను పేతురు యేసును గద్దింప సాగాడు ఆయన ఇలా చెప్పినప్పుడు "చంపబడి, మూడవ దినమున లేచుట ఆగత్యము అని" (మత్తయి 16:21). యేసు శిష్యుడై సంవత్సరమైనను పేతురు సువార్తను గ్రహించలేదనే సంగతి తేట తెల్లము అవుతుంది.

తరువాత ఆ సంవత్సరాంతన యేసు శిష్యులకు మరల సువార్తను ఇచ్చాడు,

"వారు గలిలయలో సంచరించుచుండగా, యేసు మనష్యుకుమారుడు మనష్యుల చేతికి, అప్పగింప బడబోవుచున్నాడు: వారాయనను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పెను. మరియు అలా చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి" (మత్తయి 17:22, 33).

గమనించండి యేసు రూపాంతరము వారు అప్పటికే చూసారు. యేసు రూపాంతరము చూసిన తరువాత కూడ వారు ఒక యవనస్తుని నుండి దెయ్యములను వెల్లగొట్టుడంలో విఫలులయ్యారు. వారు దయ్యమును ఎందుకు వెళ్ళగొట్ట లేక పోతిమని యేసును అడిగినప్పుడు, యేసు అన్నాడు, "మీ అల్ప విశ్వాసము వలెనే" (మత్తయి 17: 20). యేసు మరల వారికి సువార్త చెప్పాడు, "వారాయనను [యేసును] చంపుదురు, మూడవ దినమున ఆయన [యేసు] మరల లేచును. మరియు [శిష్యులు] బహుగా దుఃఖపడిరి" (మత్తయి 17:23 ఎన్ కెజేవి (NKJV)). శిష్యులు ఇంకను సువార్తను అర్ధము చేసుకోలేదు!

మూడవసారి యేసు శిష్యులకు సువార్త అందచేసాడు అది మత్తయి 20:17-19 లో ఇవ్వబడింది. దాని సమాంతర భాగము లూకా 18:31-34.

"ఆయన తన పన్నెండు మంది, శిష్యులను పిలిచి, ఇదిగో, యేరూషలేమునకు వెళ్లు చున్నాము, మనష్యుకుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనుల కప్పగించబడును, వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసిరి: ఆయనను కొరడాలతో కొట్టి, చంపుదురు: మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహించలేదు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు" (లూకా 18:31-34).

రెండు సంవత్సరాలుగా యేసు వారికి బోధించుచున్నప్పటికి నీ శిష్యులకు సువార్త అర్ధము కాలేదు,

"వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు" (లూకా 18:34).

సువార్త చాలాసార్లు వినినప్పటికినీ, యేసు దేని గూర్చి మాట్లాడుచున్నాడో శిష్యులకు అర్ధము కాలేదు!

కాని యేసు మరల వారికి చెప్పాడు, "రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనష్యు కుమారుడు [యేసు] సిలువ వేయబడుటకై అప్పగింప బడుననియు మీకు తేలియునని చెప్పెను" (మత్తయి 26:2).

ఇప్పుడు, సువార్తను పదే పదే వినినప్పటికినీ, ఒక శిష్యుడు, యూదా, ప్రధాన యాజకులకు యేసును అప్పగించాలని నిర్ణయించుకున్నాడు! (మత్తయి 26:14, 15).

ఇంకొకసారి యేసు వారికి సువార్త అందచేసాడు (మత్తయి 26:31, 32). పేతురు ఇతర శిష్యులు గెత్సమనే వనములో నిద్రపోతున్నారు. కావలి వారు యేసును బంధించడానికి వచ్చినప్పుడు, పేతురు కత్తి తీసుకొని కావలి వారిని చంప ప్రయత్నించాడు. "అప్పుడు శిష్యులందరు ఆయనను [యేసు] విడిచి, పారిపోయిరి" (మత్తయి 26:56).

ఇప్పుడు, చివరకు, మనము పదకొండుమంది శిష్యుల, నూతన జన్మ మార్పునకు వస్తున్నాము. యూదా ఇప్పటికే ఉరి తీసుకొని నూతన జన్మ అనుభవమును ఎన్నటికి పొందలేకపోయాడు. పునరుత్తానుడైన యేసు ఇతర శిష్యులను కలిసాడు. ఆయన తన గాయాలను వారికి చూపించాడు,

"అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను" (లూకా 24:45).

నూతన జన్మ ప్రారంభము ఇక్కడ సంభవించింది, యేసు "అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా, ఆయన వారి మనస్సుకు తెరచెను" సువార్తకు సంబంధించి (లూకా 24:46).

ఇప్పుడు యోహాను 20:21-22 చూడండి. ఇది శిష్యుల నూతన జన్మ. పునరుత్థానుడైన యేసు వారి దగ్గరకు వచ్చాడు,

"అప్పుడు యేసు మరల మీకు సమాధానము, కలుగును గాక: తండ్రి నన్ను పంపిన ప్రకారము, నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి, వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, అనెను" (యోహాను 20:21, 22).

వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, చివరకు వారు తిరిగి జన్మించారు!

పాత వ్యాఖ్యానాలు దానితో ఏకీభవిస్తున్నాయి. మేత్యూ హెన్రీ, ముఖ్యముగా జాన్ చార్లెస్ ఎలికాట్ లూకా 24:45 పై చెప్పిన దానిని చదవాలి. డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "నేను వ్యక్తిగతంగా నమ్ముతాను మన ప్రభువు వారి మీద ఊది అన్నాడు, 'పరిశుద్ధాత్మను స్వీకరించండి', ఈ పురుషులు పునరుత్థానం [మరల జన్మించారు] చేయబడ్డారు. ఈ ముందు వారు దేవుని ఆత్మ ద్వారా నివసించలేదు... యేసు క్రీస్తు వారిని నిత్య జీవమును ఊదాడు" (J. Vernon McGee, Thru the Bible, note on John 20:22).

డాక్టర్ థామస్ హాలే కూడ దీనిని చాలా తేటగా చెప్పాడు, "శిష్యుల జీవితాలలో పరిశుద్ధాత్మ ఇవ్వబడడం చాలా ప్రాముఖ్యమైన సంఘటన. ఎందుకంటే అప్పుడు వారు తిరిగి జన్మించారు...అప్పుడు మాత్రమే వారు నిజమైన పూర్తి విశ్వాసము పొందుకున్నారు. అప్పుడే వారు ఆత్మీయ జీవితాన్ని పొందుకున్నారు" (Thomas Hale, M.D., The Applied New Testament Commentary, note on John 20:22, p. 448).

రెండు కారణాలను బట్టి క్రీస్తు యొక్క శిష్యుల నూతన జన్మ పఠనమును మీ ముందు ఉంచాను.

1. మొదటిగా అది నూతన జన్మ అభిప్రాయాన్ని సరిదిద్దుతుంది. తరువాత శిష్యరికము. ఈనాడు మన అన్ని సంఘాలలో ఆ సిద్ధాంతము అమలులో ఉంది.

2. ఇది శిష్యులను తయారు చేయడంలో క్రీస్తు అనుసరించిన పద్ధతిని మనకు చూపిస్తుంది: మొదటిగా మీరు వారికి బోధిస్తారు, తరువాత మీరు వారి మార్పును గూర్చి పనిచేస్తారు. ఒక పుస్తకములో ఇవ్వబడిన దానికి ఇది వ్యతిరేకముగా ఉంది, పుస్తకము పేరు శిష్యులను తయారు చేయడంలో నశించిన ప్రవీణత. నా ఉద్దేశములో ఆపుస్తకము తప్పు. వారు తిరిగి జన్మించక మునుపు శిష్యులుగా ఉండాలని యేసు వారికి నేర్పించాడు.


క్రీస్తు "శిష్యులను తయారు చేయుడి" అని మనకు ఆజ్ఞాపించాడు గొప్ప ఆజ్ఞ ద్వారా (మత్తయి 28:19, 20 ఎన్ విఎస్ బి (NASB)).

"కాబట్టి మీరు, వెళ్లి సమస్త జనులను [శిష్యులుగా, ఎన్ఏఎస్ బి] [NASB] శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, వారికి బాప్తిస్మమిచ్చుచు: నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి: ఇదిగో, నేను, యుగ సమాప్తి వరకు, సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. ఆమెన్" (మత్తయి 28:19, 20).

నా పండిత కాపరి, డాక్టర్ తిమోతి లిన్ అన్నాడు,

"కేవలము క్రియ ‘శిష్యులనుగా చేయుడి’ మాత్రము ప్రాముఖ్య స్థానములో ఉంది... ఇంకొక మాటలలో ‘వెళ్లి’ అనేది ఆజ్ఞ కాదు [ఇక్కడ], కాని ‘శిష్యులనుగా చేయుడి’ అనేది ఆజ్ఞ. గొప్ప ఆజ్ఞలో ఇది ప్రాముఖ్యమైన విషయము" (సంఘ ఎదుగుదల రహస్యము, పేజీ 57).

"అన్ని దేశాలకు బోధించాలి" అని క్రీస్తు మనకు ఆజ్ఞాపించాడు – "శిష్యులనుగా చేయుడి" అని నిజానికి అనువదింపబడింది – డబ్ల్యూ. ఏ. క్రీస్ వెల్. వాస్తవానికి నూతన అమెరికను ప్రమాణిక బైబిలు ఇలా అనువదించింది, "శిష్యులనుగా చేయుడి."

ఇది మొదటి మూడు వందల సంవత్సరములు జరుపబడింది, కొత్తవారికి వారు బాప్తిస్మము పొందక మునుపు శిష్యురికము నేర్పబడిరి. డాక్టర్ ఫిలిప్ స్చాఫ్, క్రైస్తవ చరిత్ర కారుడు, అన్నాడు, "ఈ సూచన [పొడవు] రెండు సంవత్సరాలుగా నిర్ణయించబడింది, కొన్నిసార్లు మూడు సంవత్సరములు." 217 ఎ.డి. నుండి 235 ఎ.డి. వరకు రోమ్ కు హిప్ఫోలిటస్ బిషప్ గా ఉన్నాడు. హిప్పోలిటస్ అన్నాడు, "[వారిని] మూడు సంవత్సరములు దేవుని వాక్యమును విననివ్వండి" (The Apostolic Tradition of Hippolytus, part II).

బాప్తిస్మమునకు ముందు శిష్యరికము కాలము ఉండేది. అపోస్తలుల కార్యములలో పౌలు బోధలకు కనీసము రెండు ఉదాహరణలు ఉన్నాయి. బర్నబాసు పౌలును అంతియొకయకు తీసుకొని వచ్చాడు.

"వారు కలిసి, ఒక సంవత్సరము అంతయు సంఘములో ఉండి, బహుజనులకు వాక్యమును బోధించిరి" (అపోస్తలుల కార్యములు 11:26).

అదే పని పౌలు లిస్త్ర, ఐకొనియము, మరియు, తరువాత, అంతియొకయలో కూడ అలాగే చేసాడు,

"విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, మరియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింప వలెనని వారిని హెచ్చరించాలి" (అపోస్తలుల కార్యములు 14:22).

డాక్టర్ స్చాఫ్ అన్నాడు, "సంఘము అన్యలోకము మధ్యలో ఉంది... అది [ప్రజలను] బాప్తిస్మము కొరకు సిద్ధ పరచడానికి ప్రత్యేక బోధకుల అవసరతను చూసింది... [తరగతుల] కొరకు...లోకము నుండి సంఘమునకు...ప్రారంభికులను పరుపక్వతలోనికి నడిపించుట. [నేర్చుకునే వారు] అవిశ్వాసులుగా ఎంచబడలేదు, కాని సగ క్రైస్తవులుగా ఎంచబడ్డారు [ఇంకా శిష్యులు కాలేదు]" (క్రైస్తవ సంఘ చరిత్ర, ప్రతి 2, పేజీ 256). డాక్టర్ స్చాఫ్ ఈ పద్ధతి చెప్పాడు "ఇంకా అలాగే ఉండిపోయింది" మిస్సెనరీ స్థలాలలో (ఐబిఐడి., పేజీ 255).

మనము మన ఉదయ కాలపు ఆరాధనను శిష్యరికము తరగతిగా మార్చబోతున్నాము. నేను నమ్ముతాను మన పిల్లలను చూసుకోవడంలో సంఘాలు విఫలమవుతున్నాయి, లోకము నుండి యవనస్తులు తేవడంలో విఫలులవుతున్నాము, ఈనాటి సంఘాలు గ్రహించడం లేదు, నేటి యవనస్తులు అన్యులుగా ఉన్నారని వారు శిష్యులుగా తీర్చి దిద్దబడాలి, వారు నూతన జన్మ క్రైస్తవ జీవితమూ జీవించడం మునుపు. దక్షిణ బాప్టిస్టులు ప్రతి ఏటా 200,000 మంది సభ్యులను పోగొట్టుకొంటున్నాయి వారు "సగము క్రైస్తవులుగా" ఉన్నారు – శిష్యరికము వారికి నేర్పలేదు! జాన్ ఎస్. డిక్కేర్ సన్ అన్నాడు సువార్తిక ఆ జనాభా యవన క్రైస్తవులలో "ప్రస్తుతపు 7 శాతము నుండి 4 శాతము లేక ఇంకా తక్కువకు పడిపోతుంది – కొత్త శిష్యులు ఉద్భావించకపోతే" (గొప్ప సువార్తిక తగ్గుదల, పేజీ 314).

అది మన గమ్యము! మన గురి మన యవనస్తులు క్రీస్తులో అత్యున్నత సమర్ధతలోనికి చేరుకోవడానికి మనం వారికి సహాయపడడం. మేము ఇక్కడ ఉన్నాము మన సంఘమునకు వచ్చు యవనస్తులకు సహాయము చేయడానికి, వారిని యేసు శిష్యులనుగా చేయడం, తిరిగి జన్మించేటట్టు, మరియు మా గురి ఇతరులను మన సంఘమునకు తీసుకొని రావడం వారు యేసు నుండి నేర్చుకునేటట్టు చేయడం, ఆయనను విశ్వసించేటట్టు, చేయడం వారు తిరిగి జన్మించేటట్టు చేయడం!

ఎన్నుకొనబడిన యవనస్తులు, కష్టమైన దాని కొరకు, సవాలుతో కూడిన దానిని ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉంటారు. నిజ క్రైస్తవ్యములోని సవాలును ఎదుర్కొనడానికి ఆసక్తి లేనివారు బయటకు పెరికి వేయబడతారు. వారు అలా అవకూడదని మా ఆశ, కాని వారు అలా అవుతారని మా అనుభవము ద్వారా మాకు తెలుసు! వారు వెల్లిపోయేటప్పుడు మీ హృదయాలు కలవర పడనీయకండి. యేసు చెప్పినది జ్ఞాపకము ఉంచుకోండి, "పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే." తిరిగి జన్మించిన నిజ శిష్యులు మాత్రమే నిలిచి యుంటారు!

మనం కలిసి ముందుకు సాగుదాం లోకానికి నిరూపిద్దాం మన దేవుడు ఇంకా సజీవుడని ఆయన శక్తిమంతుడని. గతములో మనము తప్పులు చేసాం. కాని మనము మన తప్పుల వలన అనుభవాల వలన మేలు పొందుకున్నాము. మన పరాజయాలను విజయాలుగా మార్చుకున్నాం. ఈనాటి స్వధర్మత బలహీనతలో ఉన్న సమాజములో శిష్యులతో నిండిన బలమైన సంఘాన్ని తయారు చేయడంలో గొప్ప విజయము మనము చూడబోతున్నాము. గుర్తుంచుకోండి, మనము ఎన్నడు ఆగిపోము, తిరిగి చూడము, వదిలి పెట్టము. మన మంచి సంఘము గొప్ప సంఘముగా తయారయ్యే వరకు మనము ఆగము – సంఘము యవనస్తులను సవాలు చేసి గొప్ప శిష్య సైన్యము గల సంఘముగా తిరిగి జన్మించిన వారున్న సంఘముగా తీర్చిదిద్దుతాం! నిలబడి పాటల కాగితములో 6 వ సంఖ్య పాట పాడుదాం, "నేను సిలువ యోధుడను?" డాక్టర్ ఐజాక్ వాట్స్ చే వ్రాయబడింది (1674-1748).

నేను సిలువ యోధుడను, గొర్రె పిల్లను వెంబడించువాడను,
ఆయన నామము నిమిత్తము నేను భయపడుదునా, లేక ఆయన నామమును గూర్చి మాట్లాడుటకు సిగ్గు పడుదునా?

పూలపాన్పుపై ఆకాశములలోనికి కొనిపోబడుదును,
బహుమానము కొరకు ఇతరులు పోరాడునప్పుడు, తుఫాను సముద్రాలలో పయనిస్తున్నప్పుడు?

ఎదుర్కొనడానికి నాకు శత్రువులు లేరా? నేను ప్రవాహమును దాటవద్దు?
ఈ చెడ్డలోకము కృప చూపగల స్నేహమా, దేవుని వైపు వెళ్లుటలో నాకు సహాయ పడుతుందా?

తప్పక నేను పోరాడాలి, నేను పరిపాలించాలంటే; నా ధైర్యమును పెంచుము, ప్రభూ.
నేను హింస భరిస్తాను, నొప్పి సహిస్తాను, మీ వాక్యపు సహాయంతో.
   ("నేను సిలువ యోధుడను?" డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748).
      (“Am I a Soldier of the Cross?” by Dr. Isaac Watts, 1674-1748).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"నేను సిలువ యోధుడను?" (డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748).
“Am I a Soldier of the Cross?” (by Dr. Isaac Watts, 1674-1748).