Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




నరకపు ద్వారములపై దాడిచేయుట!

STORMING THE GATES OF HELL!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడినది
ప్రభువుదినము ఉదయము, జూలై 8, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, July 8, 2018


దయచేసి బైబిలులో మత్తయి 16:18 లోని, రెండవ భాగము చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1021 పుటలో ఉంది. యేసు చెప్పాడు,

"ఈ బండమీద నా సంఘమును కట్టుదును; పాతాళ లోక ద్వారములు దాని యెదుట నిలువ నేరవని నేను నీతో చెప్పు చున్నాను" (మత్తయి 16:18బి).

వ్యాఖ్యాన కర్త ఆర్. సి. హెచ్ లెన్ స్కీ అన్నాడు, "దీనిలోని గూడార్దము నరకపు ద్వారములు తన [దెయ్యములను] క్రీస్తు సంఘమును ద్వేషించడానికి పంపిస్తాయి, కాని సంఘము తోసివేయబడదు" (లెన్ స్కీ, మత్తయి 16:18బి పై గమనిక). ఇది నిజ సంఘమును గూర్చి చెప్తుంది, అంతే కాని అంత్య దినములలోని స్వధర్మత సంఘమును గూర్చి కాదు. స్వధర్మత సంఘము ఇప్పటికే దురాత్మలతో నడిపించబడుతున్నాయి. బైబిలు దీనిని ముందుగానే ఊహించింది,

"అయితే కడవరి దినములలో, [మనము జీవించుచున్న, అంత్య దినములు] కొందరు అబద్ధికుల వేషధారణ వలన, మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు" (I తిమోతి 4:1).

దేవునిచే ఇయ్యబడిన బైబిలులో ఉన్న విశ్వాసము నుండి "తొలగిపోయేటట్టు" సాతాను వాని అనుచరులు సంఘముపై ప్రభావము తీసుకొని వస్తాయి.

ఇది II తిమోతి 3:1-8 లో వివరించబడిన, "అంత్య దినములలోని" అబద్ధపు సంఘమును తయారు చేస్తుంది

"ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు; పైకి [బయటికి] భక్తిగల వారి వలే ఉండియు, దాని శక్తిని ఆశ్రయింపని వారునై యున్నారు: ఇట్టి వారికి విముఖుడవై యుండుము" (II తిమోతి 3:4, 5).

అలా బైబిలులో మనం చూస్తాం ఈనాడు రెండు సంఘాలు ఉన్నాయి – అబద్ధపు సంఘము, నిజమైన సంఘము. నిజ సంఘానికి మాత్రమే యేసు ఈ వాగ్ధానము ఇస్తున్నాడు,

"ఈ బండమీద నా సంఘమును కట్టుదును; పాతాలలోక ద్వారములు దాని యెదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను" (మత్తయి 16:18బి).

ఈనాడు అమెరికాలో అబద్ధపు సంఘాలు మన చుట్టూ ఉన్నాయి. అబద్ధపు సంఘములు అనగా లవొదికయ సంఘము లాంటిది, దానిని గూర్చి స్కోఫీల్డ్ గమనిక చెప్తుంది "స్వధర్మతలో చివరి ఘట్టము." ఈనాడు చాలా సంఘాలలో ఉన్న లవోదికయ సంఘమును గూర్చి క్రీస్తు ఇలా వివరిస్తున్నాడు:

"నీవు దౌర్భాగ్యుడవు, నేను ధనవంతుడను, మరియు మంచిపనులతో పెరిగిన వాడను, మరియు నాకు ఏమి అవసరం లేదు; మరియు నేను దిక్కు మాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడవునై యున్నానని యెరుగక, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు" (ప్రకటన 3:17).

"నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను" (ప్రకటన 3:16).

దెయ్యపు బోధలు వినుట వలన (I తిమోతి 4:1) మరియు బాహ్యంగా క్రైస్తవ్యమును కలిగియుండుట వలన (II తిమోతి 3:4, 5) చాలా ఎక్కువ సువార్తిక సంఘములు అంత్య దినములలో స్వధర్మతను కలిగి ఉంటున్నాయి. డాక్టర్ జాన్ మెక్ అర్ధర్ సరిగా చెప్పాడు, ఈ సంఘ సభ్యులకు ఉత్సాహము లేదు, వారు "నులివెచ్చగా, వేశాదారులుగా, క్రీస్తును ఎరిగినట్లు చెప్తున్నారు, కాని ఆయనకు చెందినవారు కారు...తమ్మును తాము మోసపుచ్చుకొను [విసుగు పుట్టించు] వేషధారులు." డాక్టర్ మెక్ ఆర్డర్ క్రీస్తు రక్తమును గూర్చి తప్పు చెప్పాడు, కాని చాలామటుకు సువార్తిక క్రైస్తవులు "తమ్మును తాము మోసపరచుకొను వేషధారులు" అని సరిగా చెప్పాడు.

ఆ కారణమును బట్టి సువార్తిక సంఘములు వారి యవనస్తులందరినీ కోల్పోవుచున్నారు. జోనాతాన్ ఎస్. డిక్కేర్ సన్ ఒక పుస్తకము వ్రాసాడు, గొప్ప సువార్తిక తగ్గుదల (బేకర్ బుక్స్). ఆయన సరియైన గణాంకాలు ఇచ్చాడు. ఈనాడు కేవలము 7 శాతము యవనస్తులు మాత్రమే క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. యవన సువార్తికులు 7 శాతము నుండి "4 శాతము అంతకంటే తక్కువకు పడిపోయారు – కొత్త శిష్యులు సృష్టించబడకపోతే" (డికెర్ సన్, పేజీ 144).

ఈనాడు సంఘములో ఎందుకు ఎక్కువ సంఖ్యలో యవనస్తులు తగ్గిపోతున్నారు? దానికి ముఖ్య కారణము చాలామంది సంఘ సభ్యులు "తమ్మును తాము మోస పుచ్చుకొని వేషదారులుగా ఉంటున్నారు," జాన్ మెక్ ఆర్డర్ అదే చెప్పాడు. పాతసంఘ సభ్యులు బలహీనంగా శక్తిహీనంగా ఉండి, వారి చుట్టూ ఉన్న పాపలోకాన్ని ఎదుర్కోలేకపోతున్నారు, అందుకే! తత్వవేత్త డాక్టర్ డేవిడ్ ఎఫ్. వేల్స్ కూడ ఇదే గమనించాడు. అందుకే అతడు ఈ పుస్తకము వ్రాసాడు, సత్యమునకు స్థానము లేదు: లేక సువార్తిక వేదాంతమునకు ఏమి జరిగినను? (ఎర్ధమాన్స్, 1993). ప్రసిద్ధ వేదాంతి డాక్టర్ కార్ల్ ఎఫ్. హెచ్. హెన్రీ కూడ అది గమనించాడు. అతనన్నాడు,

"తరము మొత్తము పునర్జన్మ [నూతన జన్మ] ను గూర్చిన అవగాహన లేకుండా పెరిగిపోతుంది. అంతరించిపోతున్న నాగరికతలో క్రూరులు ఉన్నారు నిస్సత్తువ సంఘపు చాయలు ఉన్నాయి" (Twilight of a Great Civilization, Crossway Books, pp. 15-17).

"వికలాంగ సంఘము" డాక్టర్ కార్ల్ ఎఫ్. హెచ్. హెన్రీ సువార్తిక సంఘాన్ని ఇలా పిలిచాడు! "వికలాంగ సంఘము." గొప్ప బోధకుడు డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ ఇలా మాట్లాడాడు "గత వంద సంవత్సరాలుగా సంఘములో భయంకర స్వధర్మత బాగా పెరిగింది" (Revival, Crossway Books, p. 57).

సంఘాలలో యవనస్తులను మనము స్పష్టముగా పోగొట్టు కుంటున్నాం. మనము పూర్తిగా విఫలులవుతున్నాం "కొత్త శిష్యులను తయారు చేయడంలో." డాక్టర్ వేల్స్ అన్నాడు, "సువార్తిక [సంఘము] తన విప్లవాత్మకతను పోగొట్టుకొంది." సువార్తిక సంఘాలు సుతిమెత్తగా, బలహీనంగా, అంతర్గితంగా స్వార్ధపూరితంగా ఉంటాయి – విప్లవాత్మక శిష్యరికమును ఆహ్వానించడానికి గాని దాని గూర్చి మాట్లాడడానికి గాని భయపడతాయి. యవనస్తులు ఆసక్తి చూపకపోవడంలో ఆశ్చర్యము లేదు!

బలహీన, స్వార్ధపూరిత సువర్తీకరణకు తేవడానికి మేము ఇక్కడలేదు. యేసు క్రీస్తుకు విప్లవాత్మక శిష్యునిగా మీరు కావాలని పిలుపు నివ్వడానికి మేము ఇక్కడ ఉన్నాము! సంఘముగా అది మా లక్ష్యము. క్రీస్తులో పూర్తి స్థాయిని యవనస్తులు అందుకునేటట్టు వారిని ప్రేరేపించడమే మా లక్ష్యము. యేసు క్రీస్తు కొరకు ఆయన రాజ్యము కొరకు మీరు బంగారు పతకము పొందేలా మిమ్మును ప్రేరేపించడానికి మేము ఇక్కడ ఉన్నాము! యవనస్తులారా, మీరు ఎన్నిక చేయబడిన వారు, విప్లవాత్మక ప్రొటెస్టెంట్ క్రైస్తవ్యము సవాలును ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉండాలి. శక్తివంతమైన కేల్వినీయ క్రైస్తవ్యము సవాలు ఎదుర్కొనడానికి సిద్ధంగా లేకపోతే వారు బయటకు త్రోసివేయబడతారు! యేసు చెప్పినది గుర్తుంచుకోండి, "అనేకులు పిలువబడ్డారు, కాని ఏర్పరచబడిన వారు కొందరే."

సువార్తీకరణ విషయంలో నెమ్మదిగా ఉండడానికి సమయము లేదు. గతరాత్రి భోజనము తరువాత మేము గుడిలో "పౌలు, క్రీస్తు అపోస్తలుడు" చూసాము. "పౌలు, క్రీస్తు అపోస్తలుడు" మొదటి శతాభ్దపు క్రైస్తవులు క్రీస్తు నిజ శిష్యులుగా ఉండడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో చూపించింది. ఈ మధ్యాహ్నము మిగిలిన యవనస్తులు విప్లవాత్మక శిష్యులుగా తయారయేటట్లు చేయడానికి మేము బయటికి వెళ్తున్నాము. క్రీస్తుకు విధేయులవుట ద్వారా, మనము మంచి సమయము కలిగి ఉంటాము. క్రీస్తు అన్నాడు, "మీరు సంత వీధులలోనికి రహదారులకు వెళ్లి వారు, లోపలికి వచ్చునట్లు వారిని బలవంతము చేయుడి." మనలను రక్షించడానికి యేసు క్రీస్తు సిలువపై మరణించాడు. మనకు జీవము నివ్వడానికి, యేసు క్రీస్తు శారీరకంగా, శరీరము ఎముకలతో తిరిగి లేచాడు!

యేసు క్రీస్తు మృతులలో నుండి లేచాడని నాకు తెలుసు. ఈస్టరు సమయములోనే కాదు, ప్రతిరోజూ. నేను రాత్రి నిద్రపోయేటప్పుడు అది నాకు తెలుసు. ఉదయము, రోజంతా అది నాకు తెలుసు. "ఆయన ఇక్కడ లేదు – ఆయన మృతులలో నుండి లేచియున్నాడు!" దేవుని వాక్యము ఇలా చెప్తుంది కాబట్టి క్రీస్తు మృతులలో నుండి లేచి యున్నాడని నాకు తెలుసు! ఈ వృద్ధుని పెదవుల ద్వారా ఆయన ఈ ఉదయము మీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఆయన మీతో చెప్తున్నాడు – "నేను నిరంతరము జీవించువాడను." యేసు జీవిస్తున్నాడు కాబట్టి ఆయన ఏమి చేయగలడో నాకు తెలుసు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మీరు కూడ జీవించవచ్చు. ఆయన నిరంతరము జీవిస్తాడు కాబట్టి, ఆయన కృప ద్వారా మీరు కూడ నిరంతరము జీవించవచ్చును. క్రీస్తు నిజ శిష్యునికి అంతము లేదు. వచ్చి మాతో పాటు రండి యేసుతో పాటు నిత్య జీవములో ఉండడానికి. ఆయన మిమ్మును విఫలము చేయడు! రండి, ఈ సంఘాన్ని ఒక సైనిక శిబిరంగా, క్రీస్తు నిమిత్తము ఆయన రాజ్యము కొరకు గొప్ప సైన్యముగా చేయడానికి మీరు మాకు సహాయము చెయ్యండి!

రెవరెండ్ జాన్ కాగన్ 24 సంవత్సరాలవాడు. అతడు యేసు శిష్యుడు. అతడు సిలువ యోధుడు. అతడు క్రీస్తు రాజ్యము కొరకు బంగారు పతకము గెలిచినవాడు. నేను ప్రసంగము వ్రాసాడు అది అతడు ఈరాత్రి 6:15 కు బోధిస్తాడు. నేను మునుపెన్నడూ చదవని గొప్ప ప్రేరణాత్మక ప్రసంగము అది. రండి జాన్ మిమ్మును ప్రేరేపించనివ్వండి ఈ సంఘమును దేవుని కొరకు రేపు దీపముగా మార్చడానికి, సాతాను శక్తులకు వ్యతిరేకంగా యుద్ధము జరిగించేదిగా!

లెండి, దేవుని జనులారా! చిన్న విషయాలు జరిగించారు;
రాజుల రాజును సేవించడానికి మీ హృదయ ఆత్మ మనసు శక్తి ఇవ్వండి.

లెండి, దేవుని జనులారా! సంఘము మీ కొరకు కనిపెడుతుంది,
ఆమె శక్తి ఆమె పనికి సమము కాదు; లెండి, ఆమెను గొప్ప చెయ్యండి!
   ("లెండి, ఓ దేవుని ప్రజలారా" విలియమ్ పి. మెర్రిల్ చే, 1867-1954;
      సంఘ కాపరిచే మార్చబడినది).
   (“Rise Up, O Men of God” by William P. Merrill, 1867-1954;
      altered by the Pastor).

ఇది పాటల కాగితములో 1 వ పాట. నిలబడి పాడండి!

లెండి, దేవుని జనులారా! చిన్న విషయాలు జరిగించారు;
రాజుల రాజును సేవించడానికి మీ హృదయము ఆత్మ మనసు శక్తి ఇవ్వండి.

లెండి, దేవుని జనులారా! సంఘము మీ కొరకు కనిపెడుతుంది,
ఆమె శక్తి ఆమె పనికి సమము కాదు; లెండి, ఆమెను గొప్ప చెయ్యండి!

కూర్చోండి.

అవును, లవోదికయ వలే సువార్తిక సంఘాలు బలహీనంగా స్వధర్మతతో ఉన్న దినాలలో మనము జీవిస్తున్నాము. అవును, వారు వారి యవనస్తులను కోల్పోతున్నారు. అవును, వారితో కలవడానికి మిగిలిన యవనస్తులను ప్రేరేపించలేరు. అవును, వారు మెత్తగా, అనాసక్తితో ఉంటారు. అవును, నేను మీలాగే యవనునిగా ఉన్నప్పుడు వారు "నన్ను వదిలేయడం" నాకు గుర్తు ఉంది. మార్టిన్ లూథర్ లాంటి తిరుగుబాటు, పరిశుద్ధ తిరుగుబాటు, వారిపై నేను చేసాను. మిగిలిన వారు సంస్కరణము మరచిపోయారు. వారిని నిద్రపోనివ్వండి. మీరు వచ్చి మన సంఘములో నూతన సంస్కరణము రావడంలో మాకు సహాయము చెయ్యండి! సంస్కరణము ఇప్పుడే! సంస్కరణము రేపు! సంస్కరణము నిరంతరము!

లవోదికయ స్వధర్మత మధ్యలో ఫిలదేల్ఫియ లాంటి సంఘము మనము కలిగి ఉండగలమా? ఫిలదేల్ఫియా సంఘముతో క్రీస్తు ఇలా అన్నాడు,

"నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచమై యుండినను: నీవు నా వాక్యమును గైకొని, నా నామము ఎరుగననలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి యున్నాను దానిని ఎవడును వేయనేరడు" (ప్రకటన 3:8).

క్రీస్తు యొక్క విప్లవాత్మక యవన శిష్యులు ఉండే సంఘముగా మనది ఉండగలదా? మీరు అనవచ్చు అది నశించినదని. అది అసాధ్యము. అధ్యక్షుని ఉపన్యాస రచయిత పాట్రిక్ జె. బుచ్చనన్ చెప్పినది నాకు ఇష్టము, "నశించు కారణాల కొరకు పోరాటము ప్రాముఖ్యము." తిరిగి వచ్చి ఈ రాత్రి 6:15 కు మాతో భోజనము చెయ్యండి. ఈ రాత్రి తిరిగి రండి పాస్టర్ జాన్ కాగన్ మిమ్మును ప్రేరేపించనియ్యండి పోరాటములో చేరడానికి – అది నిజంగా నశించిన కారణము కాదు. అలా నిరూపించవచ్చు, కాని విజయము తధ్యము. క్రీస్తు చెప్పాడు, "ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాలలోక ద్వారములు దాని ముందు నిలువనేరవు." "పాతాలలోక ద్వారాములు దాని ముందు నిలువనేరవు." పాతాలలోక ద్వారములు మరణపు ద్వారములు. మరణపు ద్వారములు మనలను ఆపలేవు ఎందుకంటే మన ప్రభువైన క్రీస్తు మృతులలో నుండి లేచాడు! ఆయన జీవిస్తున్నాడు కాబట్టి "పాతాళలోక ద్వారములు" మనకు వ్యతిరేకంగా నిలువనేరవు"! ఆమెన్. రాత్రి 6:15 కు తిరిగి రండి. పాతాళలోక ద్వారములు మనలను జయించనేరవు!

డాక్టర్ ఫ్రాన్సిస్ ఏ. స్కఫేర్ సవాలుతో కూడిన మాటలతో నేను ముగిస్తాను. డాక్టర్ స్కఫర్ గొప్ప వేదాంతి, మన కాలపు నిజ ప్రవక్త. అతనన్నాడు, "సువార్తిక సంఘము లోకానుసారంగా ఉంది సజీవుడైన క్రీస్తుకు నమ్మకముగా లేదు...నేను మీకు సవాలు విసురుతున్నాను. నేను క్రైస్తవ విప్లవ కారులను పిలుస్తున్నాను, ముఖ్యంగా యవన క్రైస్తవ విప్లవ కారులను, సంఘములో తప్పుగా నాశన పరముగా ఉన్న వాటిని ఖండించడానికి, మన సంస్కృతిని, మన రాష్ట్రమును" (The Great Evangelical Disaster, pp. 38, 151).

నిలబడి 2 వ పాట పాడండి. సంస్కరణముపై మార్టిన్ లూథర్ పాట ఇది! పాట గలిగినంత గట్టిగా పాడండి!

మన దేవుడు గొప్ప కోట, విఫలము కాని కేడెము,
   ఆయన మన సహాయకుడు, అనిత్య అస్వస్థల ప్రవాహముల మధ్య.
మన అనాధి శత్రువు దుఃఖ కార్యములు మన పట్ల చేయుచున్నప్పటికిని;
   ఆయన చేతిపని శక్తి గొప్పవి, మరియు, క్రూర ద్వేషము,
భూమి మీద ఆయనకు సమము కాదు.

ఈ లోకము, సాతానుతో నింపబడి, మనలను భయపెట్టు చున్నప్పటికి,
   మనం భయపడం, ఎందుకనగా సత్యమును మన ద్వారా జయ సంకేతము చేస్తాడు.
అంధకారపు రాజు భయంకరుడు – మనము వానికి భయపడము;
   వాని ఆగ్రహము మనము సహించగలము, ఎందుకంటే! వాని పతనము కచ్చితము,
ఒక చిన్న మాట వాని పడద్రోయును.
ఆ పదము సమస్త భూ శక్తులకు పైగా ఉన్నది – వాటికి వందనము వద్దు – ఉండేవాటికి;
   ఆత్మ మరియు వరములు మనవి ఆయన ద్వారా ఆయన మన పక్షమున ఉన్నాడు.
వస్తువులు సంబంధములు పోనిమ్ము, ఈ అనిత్య జీవితమూ కూడ;
   శరీరమును అవి చంపవచ్చు: దేవుని సత్యము ఇంకను నివసిస్తుంది,
ఆయన రాజ్యము నిరంతరము.
    ("మన దేవుడు గొప్ప కోట" మార్టిన్ లూథర్ చే, 1483-1546).
   (“A Mighty Fortress Is Our God” by Martin Luther, 1483-1546).

పాస్టర్ జాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి భోజనము కొరకు వందనాలు చెల్లించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"మన దేవుడు గొప్ప కోట" (మార్టిన్ లూథర్ చే, 1483-1546).
“A Mighty Fortress Is Our God” (by Martin Luther, 1483-1546).