Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




శిష్యరికమునకు పిలుపు!

THE CALL TO DISCIPLESHIP
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడినది
ప్రభువుదినము సాయంత్రము, జూలై 1, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, July 1, 2018

"మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును: నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, దానిని రక్షించుకొనును" (లూకా 9:23-24).


ఇది క్రీస్తు ఎవరికీ చెప్పడం? ఆయన ఇక్కడ తన 12 మంది శిష్యులకు చెప్పాడు. కాని సమాంతర వాక్య భాగము మార్కు 8:34 లో ఆయన అందరి ప్రజలకు ఈ విషయము చెప్పాడు,

"అంతట ఆయన తన శిష్యులను జన సమూహమును, తన వద్దకు పిలిచి, నన్ను వెంబడించగోరువాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తుకొని, నన్ను వెంబడించవలెను" (మార్కు 8:34).

కనుక యేసు తన పన్నెండు మంది శిష్యులకు కాబోవు తన అనుచరులకు ఈ విషయము చెప్పినట్టు – తేటతెల్లము అవుతుంది. యేసు శిష్యుడు కావాలంటే మీరందరూ మిమ్ములను మీరు ఉపేక్షించుకొని, మీ సిలువను ఎత్తుకొని, ఆయనను వెంబడించాలి. మీరు అలా చెయ్యకపోతే, మీరు నిజ క్రైస్తవులు కానేరరు – బలహీన నూతన సువార్తికులుగా, నామమాత్రపు క్రైస్తవులుగా ఉంటారు! యేసు చెప్పాడు, "మీరు నన్ను అనుసరించాలను కుంటున్నారా? అప్పుడు మీరు తప్పనిసరిగా మిమ్ములను ఉపేక్షించుకొని, మీ సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడించాలి."

మీరు అలా చేయడానికి తిరస్కరిస్తే ఏమి సంభవిస్తుంది? ఈ పాఠ్యభాగము దానిని తేట పరుస్తుంది. 24 వ వచనము చదవండి,

"తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును: నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, దానిని రక్షించుకొనును" (లూకా 9:24).

రెండు రకాల ప్రజలు మన సంఘమునకు వస్తుంటారు. నేను వారిని "తీసుకొనువారు" మరియు "ఇచ్చువారు" అని పిలుస్తారు. "తీసుకొనువారు" గుడి నుండి ఏదో కొంత "పొందుకుంటారు." "ఇచ్చువారు" క్రీస్తు శిష్యులుగా ఉండడానికి తమమును తాము ఇచ్చుకుంటారు. స్వార్ధ పరులతో మీరు వంద కుర్చీలు నింపవచ్చు. దాని వలన ఏమి జరుగుతుంది? ఈ గుడి ఆ వంద మందితోనే ఉండి చంపబడతుంది! వారు ఆదివారము సాయంకాలపు ఆరాధనకు కూడ రారు! వారు సువార్తిక "తీసుకొనువారు." అస్తమాను తీసుకునేవారు గుడికి దొంగిలిస్తారు – గుడికి ఎన్నడు సహాయపడరు. వారు ఎన్నటికి క్రీస్తు శిష్యులు కానేరరు! వారు గుడిని నాశనము చేస్తారు! అలాంటి స్వార్ధ పరులను తీసుకొని రావడానికి ధైర్యము చెయ్యవద్దు! "ఎక్కువ మంది కంటే తక్కువమంది మేలు."

"తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును: నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, దానిని రక్షించుకొనును" (లూకా 9:24).

ఎవరైనా చెప్పండి, "వదిలి పెట్టేది చాలా ఉంది – పోగొట్టుకొనేది చాలా ఉంది." కనుక, అతడు అంతా పోగొట్టుకుంటాడు, కనుక, అతడు నరకానికి పోతాడు! యేసును నమ్మడానికి, వేరే దేనిని మీరు నమ్మకూడదు. యేసు క్రీస్తును తప్ప దేనిని నమ్మినా, మీరు సమస్తము పోగొట్టుకుంటారు!

"తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును: నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, దానిని రక్షించుకొనును" (లూకా 9:24).

పదిహేడేళ్ళ వయసులో "బోధించడానికి సమర్పించుకున్నాడు." నాకు ఆ పాతకాలపు పదము, "బోధించుటకు సమర్పించుకొనడం" నాకు ఇష్టము. అది నాకు ఇప్పుడు వినపించడం లేదు. అది ఎప్పటికి నిజమే. నిజమైన బోధకుడు బోధించడానికి "సమర్పించుకోవాలి." అది ఎంత సులభము కాదని అతనికి తెలుసు. అతనికి తెలుసు దానితో ఎక్కువ డబ్బు సంపాదించలేడని. లోకములో మెప్పు ఉండదని అతనికి తెలుసు. తను వెళ్ళవలసిన కష్టము శ్రమ అతనికి తెలుసు. శ్రేష్టమైన బోధకులకు ఈ విషయాలు తెలుసు. చాలా సంవత్సరాల చదువు చదవాలని వారికి తెలుసు – ఎక్కువ జీతము రాని ఉద్యోగమూ కొరకు – ఆ ఉద్యోగమూ నిరుపయోగమని లోకము అనుకుంటుంది – ఆ ఉద్యోగములో అతడు లోకములో చాలా మందిచే అపహసింపబడి పోట్లాడబడతాడు.

17 సంవత్సరాల తరువాత ఈ విషయాలన్నీ నాకు తెలుసు. రాత్రి కళాశాల పట్టాకు నాకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది (పగలు ఎనిమిది గంటలు పనిచేసి రాత్రి కళాశాలకు వెళ్ళేవాడిని). రోజుకు 16 గంటలు పనిచేసాను, వారానికి ఏడూ రోజుల చొప్పున, రాత్రి కళాశాలకు చెల్లించడానికి. నేను అసహ్యించుకున్న సెమినరీ నుండి, ఉన్నత పట్టా పొందడానికి, నాకు మూడు సంవత్సరాలు పట్టింది. ఇలాంటి సంఘము పొందుకోడానికి నాకు నలభై సంవత్సరాలు పట్టింది. ఇదంతా మళ్ళీ చేయగలరా? ఓ, అవును! దాని గూర్చి ప్రశ్న లేదు!

నేనెందుకు అలా చేసాను? బోధించడానికి సమర్పించుకున్నాను. అంతా అంత సామాన్యము. నాకు 17 సంవత్సరాలయితే నేను మళ్ళీ అది చేయగలనా? ఓ, అవును! తప్పకుండా చేస్తాను! దాని గూర్చి సందేహము లేదు! దానిలో గొప్ప సంతృప్తి ఉంది – ఈ స్వధర్మత కాలములో దేవునిచే పిలువబడిన బోధకునిగా ఉండడం! ప్రపంచములో ఎవైన ఉద్యోగమూ ఎన్నుకునే అవకాశము ఉంటే – అమెరికా అధ్యక్షుని నుండి అవార్డు గ్రహిత అయిన నటుడు వరకు, నేను నిస్సందేహముగా సంఘ కాపరిగా ఉండడానికే ఎన్నుకుంటాను. నేను మీకు సత్యమే చెప్తున్నానని దేవునికి తెలుసు! నా కుమారుడు, రోబర్ట్ కి కూడ తెలుసు.

మన సంఘ పతన సమయములో ఇక్కడ ఉండిపోయిన, గొప్ప క్రైస్తవులను చూడండి. వారు ఈ సంఘాన్ని కాపాడారు. మనము వారిని "ముప్ఫై తొమ్మిది మంది" అని పిలుస్తాము. వారి స్నేహితులంతా వెళ్ళిపోయారు. సంఘ చీలికలో – వారి స్నేహితులను కోల్పోయారు! అది సులువు అని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసిన క్రైస్తవులందరి కంటే వారు చాలా కష్టపడి పని చేసారు – యవనులైన మీకంటే కూడ. వారు దశమ భాగమును మించి – వెల డాలర్లు ఇచ్చారు. వారు ప్రతి కూటానికి వచ్చారు రాత్రి వరకు పనిచేసారు – గుడిని రక్షించడానికి. వారిలో చాలామంది పిల్లలు, తిరిగి లోకములోనికి వెళ్ళిపోయారు. యేసు నిమిత్తము ఈ సంఘమును కాపాడడానికి వారు చాలా నష్టపోయారు.

యేసు నిమిత్తము వారు అంతా ఇచ్చినందుకు విచారపడ్డారేమో అడగండి! వారిని అడగండి! వారిని అడగండి! యేసు క్రీస్తు కొరకు ఈ సంఘమును రక్షించడానికి వారి జీవితాలనే త్యాగము చేసారు. వారు తప్పు చేసారేమో అడగండి! వారు మళ్ళీ చేస్తారేమో అడగండి. వారిని, అడగండి!

ప్రుధోమ్ గారిని అడగండి. ఈతకొలను ఉన్న ఇళ్ళు కోల్పోయాడు. ఆమె తీసుకుంది. రాత్రంతా అతనివి అరిచింది. అతనికి నరకములో ఉన్నట్టు అనిపించింది. ఆమె అతని జీవితాన్ని నాశనము చేసింది! ఎవరో తెలుసా. ప్రుధోమ్ గారు తప్పు చేసాడా? అంత కోల్పోయినందుకు అతడు విచారించాడా? తన సిలువను ఎత్తుకొని యేసును వెంబడించకుండా విచారములో వెనుదిరిగి చూసాడా? లేదు, అతడు అలా చెయ్యలేదు! నేను ఇలా చెప్తానని అతనికి చెప్పలేదు. అతనికి చెప్పనవసరము లేదు. హృదయాంత రంగములో, అతనికి తెలుసు, "నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, దానిని రక్షించుకొనును" (లూకా 9:24). శ్రీమతి సాలాజర్ ను అడగండి! వెళ్లి, ఆమెను అడగండి. ఆమె భర్త చనిపోయాడు. పిల్లలు వెళ్ళిపోయారు. ఆమె విచారిస్తున్నారేమో అడగండి తన సిలువను ఎత్తుకొని యేసును వెంబడిస్తున్నారు. ఇది చెప్పవచ్చా అని ఆమెను అడగలేదు. ఆమెను అడగనక్కర లేదు. ఆమె అలానే చేస్తారని నాకు తెలుసు. ఆమెకు తెలుసు "నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, దానిని రక్షించుకొనును." శ్రీమతి హైమర్స్ ను అడగండి. నన్ను పెళ్లి చేసుకొని ఆమె ఏమి పొందుకోలేదు! మాకు ఏమి లేదు. మేము ఒక గది భవన సముదాయములో ఉన్నాము. మాకు చెక్క సామాన్లు లేవు. టివి లేదు. నేలమీద కూర్చునే వాళ్ళము. నాకు చాలా తక్కువ జీతము ఉండేది. ప్రతి ఒక్కరు మాపై దాడి చేసారు. ఆమె నన్ను భరించారు – చాలాసార్లు నాలో నేను లోపల చీల్చబడ్డాను గుడి చీలికల వలన. ఏ యవనస్తురాలు నా భార్యల శ్రమలు పొంద ఇష్ట పడరు ఈ రాత్రి మనకు ఇంత గొప్ప సంఘము ఉంది. ఆమె తప్పు చేసిందేమో అడగండి. మళ్ళీ అలా చేస్తారేమో అడగండి. నేను ఇలా చెప్పాలా అని ఆమెను అడగలేదు. నేను ఆమెను అడగ నక్కరలేదు! యేసు నిమిత్తము అదంతా ఆమె చేసారని నాకు తెలుసు! లీ గారిని అడగండి. ఆయన తన సిలువను ఎత్తుకొని యేసును వెంబడించినందుకు తన తల్లిదండ్రులు అతనికి వ్యతిరేకులు అయ్యారు. యేసును వెంబడించడానికి తన జీవితాన్ని ధారపోసినందు తప్పు చేసాడేమో అతనిని అడగండి. సణుగు కొనకుండా ఫిర్యాదు చెయ్యకుండా, అతడు అలా మళ్ళీ చేస్తాడని నాకు తెలుసు. మాట్సు సాకు గారిని అడగండి. అతడు పోలీస్ ఉద్యోగానికి వెళ్లి ఉండే వాడు. వారు అతని కోరుకున్నారు. కాని అలా అయితే ఆయన సంఘానికి సహాయ పడలేక పోయేవాడు. మన సంఘమును రక్షించడానికి ఆయన పోలీస్ ఉద్యోగమూ విడిచి పెట్టారు. "ముప్ఫై తొమ్మిది మందిలో" ఉండడానికి ఆయన ఎలా తనను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకున్నాడో నాకు గుర్తుంది. ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించు గాక! నీవు చేసినది నేను ఎన్నడు మర్చిపోలేను – దేవుని కూడ! మీ మాదిరి ద్వారా జాన్ సామ్యూల్ కాగన్ రక్షింపబడ్డాడు. నీవు ఎంతో ఇచ్చావు, సంఘానికి తరువాత కాపరిగా నీవు ఉన్నావు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు "పుచ్చుకొనువానిగా," కాక "ఇచ్చు వానిగా" ఉన్న దానిలో అన్న ఆనందము నీకు తెలుస్తుంది! నీవు నిరంతరము ఆయన రాజ్యములో క్రీస్తుతో పాటు ఏలుతావు! జిమ్ ఎలియట్ హత సాక్షిగా చంపబడ్డారు, అతడు అన్య జాతి ప్రజలకు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు. జిమ్ ఎలియట్ ఇలా అన్నాడు,

"ఇవ్వలేనిది ఇచ్చి పోగొట్టుకోలేనిది పొందుకునే వాడు అవివేకి కాదు."

ఆమెన్.

ఒక యవనస్తుడు మన గుడిలో డాక్టర్ కాగన్ తో చెప్పాడు, "నేను వృత్తి ఉద్యోగిని. నేను సంఘములో రెండు గంటల కంటే ఎక్కువగా పని చేయలేను." డాక్టర్ కాగన్ అన్నాడు, "డాక్టర్ చాన్ సంగతేంటి? అతడు వైద్యుడు. అతడు వృత్తి ఉద్యోగి! అతడు గుడిలో లెక్కింపలేని గంటలు పనిచేస్తాడు – మరియు లెక్కలేనన్ని గంటలు కళాశాలలలో సువార్త పనిచేస్తాడు, మిగిలిన వారందరి కంటే ఎక్కువగా." అవును, డాక్టర్ చాన్ ను చూడండి! ఆయనకు తెలుసు యేసు సరిగా చెప్పారని – "ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడించవలెను" (లూకా 9:23). తరువాత డాక్టర్ కాగన్ ను చూడండి. వారు అతనికి చాలా ఎక్కువ జీతముతో ఇతర గొప్ప ప్రయోజనాలతో ఉద్యోగమూ ఇస్తానన్నారు – ఒకసారి కాదు, నాలుగు సార్లు. అతడు అన్ని కాదన్నాడు. ఎందుకు? ఎందుకంటే అతడు లాస్ ఎంజిలాస్ విడిచి న్యూయార్క్ గాని, వాషింగ్టన్ డి.సి. కి గాని వెళ్ళాల్సి వస్తుంది. ఆయన అన్ని కాదన్నాడు – వందల వెల డాలర్లు – ఈ సంఘములో ఉండడానికి సంఘ చీలిక సమయములో సంఘమును కాపాడడానికి. అతడు అవివేకా? జిమ్ ఎలికాట్ చెప్పింది వినండి, అతడు క్రీస్తు కొరకు హతసాక్షిగా తన జీవితాన్ని ఇచ్చాడు. అతడు చెప్పినది మీ బైబిలులో మొదటిలో రాసుకోండి.

"ఇవ్వలేనిది ఇచ్చి పోగొట్టుకోలేనిది పొందుకునే వాడు అవివేకి కాదు." (జిమ్ ఎలియట్, క్రీస్తు కొరకు హతసాక్షి)

ఈ విధంగా నేను, "ముప్ఫై తొమ్మిది" మందిలో సిలువను ఎత్తుకొని త్యాగము చేసిన ప్రతి ఒక్కరిని గూర్చి చెప్పుకుంటూ పోగలను – సాంగ్ గారు, మెన్సియా గారు, గ్రిఫిత్ గారు – అతడు కాన్సరు శాస్త్ర చికిత్స అయిన తరువాత తన శరీరానికి వేలాడుతున్న గొట్టము తెంపుకొని గుడికి వచ్చాడు. నేను అతని తెల్లని ముఖము నొసటిపై చెమట చూడగలను, మూర్చపోకుండా ప్రసంగ వేదికపై ఆనుకొని – ఇలా పాడతాడు

వెండి బంగారముల కంటే నేను యేసును కలిగియుండుట మేలు,
   చెప్పనశక్యము కాని ఐశ్వర్యము కంటే ఆయన వాడనై యుండుట నాకు మేలు;
దేనికన్నా నేను యేసును కలిగియుండుట మేలు
   ఈలోకము ఇచ్చు వాటికంటే.

గ్రిఫిత్ గారు మూర్ఖుడా?

"ఇవ్వలేనిది ఇచ్చి పోగొట్టుకోలేనిది పొందుకునే వాడు అవివేకి కాదు."

ఈవిధంగా నేను "ముప్ఫై తొమ్మిది" మందిలో ప్రతి స్త్రీ, పురుషుని గూర్చి చెప్పగలను – వారు వారిని వారు ఉపేక్షించుకొని అనుదినము వారి సిలువను ఎత్తుకొని యేసు క్రీస్తును వెంబడించారు, మరియు ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము సజీవ సంఘముగా ఉన్నారు.

మనము ఈ భవనముపై తాకట్టు పెట్టినప్పుడు యవనులైన మీతో ఆగి ఆలోచించమని చెప్పాను. త్వరలో వెళ్లిపోతాము. ఎవరు శ్రీమతి రూప్ స్థానములో ఆర్గాన్ వాయిస్తారు? ద్వార పాలకుడుగా ఉన్న రూప్ గారి స్థానము ఎవరు తీసుకుంటారు? మీలో ఎవరు పగలు, రాత్రులు బాధ్యతలు తీసుకుంటారు – మీలో ఎవరు మిమ్ములను మీరు ఉపేక్షించుకొని రిచర్డ్ రోనాల్డ్ బ్లాండిన్ స్థానాలు తీసుకుంటారు? ఎవరు తన ప్రాణమును పోగొట్టుకుంటాడు, ప్రతి గంటా, ప్రతి రోజు, ఈ లోకపు బహుమానము లేకుండా, వారి వెళ్ళిపోయినప్పుడు వారి స్థానాలు తీసుకుంటారు? – మేమంతా "ముప్ఫై తొమ్మిది మందిలో" వారము త్వరలో వెళ్లిపోతాము – యవనస్తులు ఆలోచింపకమునుపే. ఎవరు వంట గదిలో శ్రీమతి కుక్ ను భర్తీ చేస్తారు? ఎవరు విల్లీ డిక్సన్ ను పూడుస్తారు? వారి భోజనము తింటారు. కాని నేననుకుంటాను మీలో కనీసం ఒక్కరు కూడ ఎనభై సంవత్సరాల వయసున్న, డిక్సన్ గారిని భర్తీ చేయలేరు. ఆ ప్రియ వృద్ధుని ఎవరు భర్తీ చేస్తారో నాకు కనబడడం లేదు! ఆయన ఏమి చేస్తాడో మీకు తెలుసా? మీకు భోజనము పెట్టడానికి పగలు, చాలా రాత్రులు సమయము గడపడానికి, అతడు మూర్ఖుడా? అతడు మూర్ఖుడా?

"ఇవ్వలేనిది ఇచ్చి పోగొట్టుకోలేనిది పొందుకునే వాడు అవివేకి కాదు."

యవనస్తులైన మీలో ఎవరు సమస్తమును త్యాగము చేసి ఇంకొక ముప్ఫై నలభై సంవత్సరాలు ఈ సంఘమును బలపరుస్తారు? డాక్టర్ కాగన్ వెళ్ళిపోతారు. ఆయనను ఎవరు భర్తీ చేస్తారు? డాక్టర్ చాన్ గారు వెళ్ళిపోతారు. అతని స్థానాన్ని ఎవరు తీసుకుంటారు? మీలో చాలామంది డిక్సన్ గారిని లేక రిక్ గారిని గాని మరియు రాన్ బ్లాండిన్ గారిని గారి భర్తీ చేయలేరు! వారు ప్రాముఖ్యులు కాదనుకుంటున్నారు, కాని మీరు వారిని భర్తీ చేయలేరు! దానికి త్యాగశీలత అవసరము. సిలువ ఎత్తుకొనుట అవసరము. యేసు చెప్పాడు,

"ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును: నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, దానిని రక్షించుకొనును" (లూకా 9:23-24).

డాక్టర్ కాగన్ కు దేవుడు పిలిచినప్పుడు అతడు సంఘ కాపరి వర్మ్ బ్రాండ్ వ్రాసిన పుస్తకము క్రీస్తు కొరకు చిత్ర హింస చదివాడు. సంఘ కాపరి వర్మ్ బ్రాండ్ ను యితడు సహజంగా ప్రేమించాడు ఎందుకంటే అతడు యూదుడు కాబట్టి. అతడు "క్రీస్తు కొరకు చిత్ర హింసను" చదివినప్పుడు, డాక్టర్ కాగన్ అనుకున్నాడు వర్మ్ బ్రాండ్ బోధించిన త్యాగ పూరిత విలువలు కలిగిన సంఘమును కనుగొనాలనుకున్నాడు. యుసిఎల్ఏ (UCLA) దగ్గర వీధిలో నేను బోధించడం డాక్టర్ కాగన్ చూసాడు. ప్రజలు కేకలు వేసి నాపై వస్తువులు విసరడం అతడు చూసాడు. డాక్టర్ కాగన్ అనుకున్నాడు, "ఈ బోధకుడి బోదే వినాలనుకుంటున్నాను." కనుక మా సంఘము ఎక్కడ ఉందో కనుగొని అతడు వచ్చాడు. మొన్న రాత్రి డాక్టర్ కాగన్ నాతో అన్నాడు నేను ఇలా చెప్పడం విన్నాడని, "దేని కొరకో కాలిపోవాలనుకుంటున్నావు. క్రీస్తు కొరకు ఎందుకు కాలిపోకూడదు?"

డాక్టర్ కాగన్ అప్పటిలో, ఇరవై సంవత్సరాల యువకుడు. ఎంత మంచి తలంపు అతనికి ఉంది! "మీరు దేని కొరకో కాలిపోవాలనుకుంటున్నారు." బహుశా! ప్రతి ఒక్కరు త్వరగానో ఆలస్యము గానో "కాలిపోతారు"! మీ జుట్టు ఊడిపోతుంది. ముఖముపై గీతాలు వస్తాయి. జీవితమూ చాలా కష్టముగా ఉంటుంది. ముసలి వారై పోతున్నట్టు తెలుస్తుంది. అప్పుడు మీరు కాలిపోయి చనిపోతారు. "దేనికో కాలిపోవాలనుకుంటున్నారు." అవును, నిజంగా, అది మన అందరికి జరుగుతుంది. మీరు కాలిపోతారు!

కాని ఇంకా లోతైన తలంపు – "ఎందుకు క్రీస్తు కొరకు కాలిపోకూడదు?" తరాలుగా గొప్ప క్రైస్తవులందరూ అలాగే ఆలోచించారు – "మీరు దేనికో కాలిపోతున్నారు. క్రీస్తు కొరకు ఎందుకు కాలిపోకూడదు?" హెన్రీ మార్టిన్ (1781-1812) ను గూర్చి మీరు ఎలా చదువుతారో నాకు తెలియదు అతడు "కాలిపోదలుచుకోలేదు" 31 సంవత్సరాల వయసులో. రోబర్ట్ మెక్కిన్ (1813-1843) జీవితాన్ని మీరు ఎలా చదువుతారో తెలియదు 29 సంవత్సరాలలో క్రీస్తు కొరకు "కాలిపోవాలనుకున్నాడు." మీలో కొందరు వారిని గూర్చి చదవడానికి భయపడతారు వికిపీడియాలో కూడ చూడరు. వారు మిమ్మును ప్రభావితము చేస్తారని భయపడుతున్నారా? హెన్రీ మార్టిన్ రోబర్ట్ మెక్కిన్ లాంటి వారు ఎక్కడ ఉన్నారు? గ్లాడిన్ ఆయిల్ వాల్డ్ లాంటి యవ్వన స్త్రీలు ఎక్కడ ఉన్నారు? వారికి మార్గము చూపించడానికి శిష్యులము కాకుండా, యవనస్తులను శిష్యులవమని ప్రేరేపించే సంఘముగా మనము ఉండలేము!

మన శ్రీమతి కుక్ గారు ఇరవై సంవత్సరాల క్రితము చనిపోయిన వృద్దునితో ప్రేమలో పడింది. అతడు చాలా గొప్ప కుటుంబములో పుట్టి డబ్బు అంతటిని పొందుకున్నాడు. అతడు ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు. అప్పుడు అతడు యేసు శిష్యుడయ్యాడు. అతడు తన డబ్బు అంతటిని చాలా జాగ్రత్తగా బుద్ధి పూర్వకంగా ఇచ్చేసాడు. తరువాత మిస్సెనరీగా, చైనా దిగువ ప్రాంతానికి వెళ్ళాడు. పదునాలుగు సంవత్సరాలు అన్యులకు సువార్త బోధించడానికి భార్యకు బిడ్డగా దూరంగా ఉన్నాడు. తరువాత ఆఫ్రికాకు వెళ్లి, కొత్త పరిచర్య ప్రారంభించాడు. చివరగా అతను ఆఫ్రికాలోని అంతర్భాగంలో, మరణించాడు. అతని జీవితమూ అదృష్టము – క్రీస్తు కొరకు వాడబడ్డాయి. అతని ఇళ్ళు అతని కుటుంబ జీవితమూ కూడ వెళ్ళిపోయాయి. చివరిలో, ఈ అద్భుత వృద్ధుడు అన్నాడు, "ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము త్యాగము చెయ్యడానికి ఏమి మిగలలేదు." మన శ్రీమతి కుక్ గారు ఆమె పుట్టడానికి ముందు ఇరవై సంవత్సరాల ముందే చనిపోయిన అతనితో ప్రేమలో పడ్డారు. ఆమె అలా చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. ఆమె అతనిని ప్రేమించకపోతే ఆయనచే ప్రభావితము చేయబడకపోతే, ఆమె కూడ ఒక స్వార్ధ పూరిత తెల్ల స్త్రీగా ఉండి, శాన్ ప్రాన్సిస్కో లోయలో కుక్కలను పెంచుకుంటూ ఉండేవారు. ఆమె సి. టి. స్టడ్ చే ప్రభావితం చెందింది, కాబట్టి ఆమె లాస్ ఎంజిలాస్ లో యవనులైన మిమ్ములను పట్టించుకుంటూ భోజనము పెడుతూ వందల గంటలు గడుపుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితము శ్రీమతి కుక్ తన నాయకుడు, చార్లెస్ స్టడ్, మాటలతో ఒక చిన్న పటము చేసి నాకిచ్చారు. నేను ప్రతి రోజు దానిని చూస్తాను. దానిలో ఇలా ఉంది,

"ఒకే ఒక జీవితమూ,
   ‘అది త్వరలో గడిచిపోతుంది;
క్రీస్తు కొరకు చేసింది మాత్రమే
   నిలిచిపోతుంది."
        – సి. టి. స్టడ్.

యేసు మన అందరితో చెప్తున్నాడు,

"ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును: నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, దానిని రక్షించుకొనును" (లూకా 9:23-24).

మన సంఘము క్రీస్తు కొరకు యవ్వన శిష్యులతో నింపబడాలి అప్పుడే మనము కొంతమంది యవనస్తులను రక్షించి యేసు శిష్యులుగా వారికి తర్ఫీదు ఇవ్వవచ్చును! దయచేసి నిలబడి 2 వ పాట పాడండి, "మీ కొరకు ఎక్కువ ప్రేమ."

మీ కొరకు ఎక్కువ ప్రేమ, ఓ క్రీస్తు, మీ కొరకు ఎక్కువ ప్రేమ!
   మోకాళ్ళపై నేను చేస్తున్న ప్రార్ధన మీరు వినండి;
ఇది నా మనసు పూర్వక విన్నపము: ఎక్కువ ప్రేమ, ఓ క్రీస్తు, మీ కొరకు,
   మీ కొరకు ఎక్కువ ప్రేమ, మీ కొరకు ఎక్కువ ప్రేమ!

ఒకప్పుడు ఇహలోక ఆనందము కొరకు తహతహలాడును, శాంతి కొరకు వెదికాను;
   ఇప్పుడు మిమ్ములనే నేను వెదుకుతాను, శ్రేష్టమైనది నాకనుగ్రహించు;
ఇదియే నా ప్రార్ధన: ఎక్కువ ప్రేమ, ఓ క్రీస్తు, మీ కొరకు,
   మీ కొరకు ఎక్కువ ప్రేమ, మీ కొరకు ఎక్కువ ప్రేమ!

నా ఆఖరి ఊపిరి మిమ్ములనే స్తుతిస్తుంది;
   ఈ ఆవేదన నా హృదయము నుండి వస్తుంది;
ఇంకను ఇదేనా ప్రార్ధన: ఎక్కువ ప్రేమ, ఓ క్రీస్తు, మీ కొరకు,
   మీ కొరకు, ఎక్కువ ప్రేమ, మీ కొరకు ఎక్కువ ప్రేమ!
("మీ కొరకు ఎక్కువ ప్రేమ" ఎలిజబెత్ పి. ప్రెస్ టిస్ చే, 1818-1878).
      (“More Love to Thee” by Elizabeth P. Prentiss, 1818-1878).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"మీ కొరకు ఎక్కువ ప్రేమ" (ఎలిజబెత్ పి. ప్రెస్ టిస్ చే, 1818-1878).
“More Love to Thee” (Elizabeth P. Prentiss, 1818-1878).