Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
డాక్టర్ హైమర్స్ గారు పరిచర్యలో తన 60 వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతున్నారు
"నా జీవితంలోని ఆశీర్వాదములు"

DR. HYMERS SPEAKS ON HIS 60TH ANNIVERSARY IN MINISTRY
"THE BLESSINGS OF MY LIFE"
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెన్సియల్ లైబ్రరీలో బోధింపబడిన ప్రసంగము,
యోర్భా లిండా, కాలిఫోర్నియా
ప్రభువు దినము సాయంకాలము, ఏప్రిల్ 8, 2018
A sermon preached at the Richard Nixon Presidential Library,
Yorba Linda, California
Lord’s Day Evening, April 8, 2018


నా జీవిత వచనము చదువుచుండగా దయచేసి నిలబడండి.

"నన్ను బలపరచు క్రీస్తు నందే నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్ఫీయులకు 4:13).

కూర్చోండి.

పరిచర్యలో నా అరవైవ వార్షికోత్సవము జరుపుకోవడానికి నేను నిక్సన్ లైబ్రరీని ఎందుకు ఎన్నుకున్ననా అని మీకు ఆశ్చర్యము కలగవచ్చు. నా జీవిత చరిత్రను మీరు చదివితే నా జీవితపు వచనాన్ని అధ్యక్షుడు నిక్సన్ నుండి నేను ఎలా పొందుకున్నానో మీరు కనుకొంటారు.

"నన్ను బలపరచు క్రీస్తు నందే నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్పీయులకు 4:13).

రెండేళ్ళ వయసులో నా తండ్రి నన్ను వదిలేసాడు. నేను మళ్ళీ ఆయనతో కలిసి జీవించలేదు. 12 సంవత్సరాల వరకు నా తల్లితో జీవించాను. తరువాత ఒక స్థలము నుండి మరియొక స్థలమునకు తిరుగుతూ, నేనంటే ఇష్టము లేని బంధువులతో జీవించాను. ఉన్నత పాఠశాల నుండి పట్ట భద్రుడనవకముందు 22 పాఠశాలలు హాజరయ్యాను. నేనెప్పుడు "క్రొత్త వాడినే." నేను అనాధను. తండ్రి లేకుండా ఎదగడం గొప్ప నష్టము. ఎలాంటి సహాయము ఊతము లేకుండా, నాకు నేనుగా ఉన్నాను. అన్నింటికంటే దారుణము, మాదిరిగా ఉండే తండ్రి నాకు లేడు. కాబట్టి చారిత్రాత్మక వ్యక్తులను చూసి మనిషి అంటే ఎలా ఉండాలో రూపొందించుకొనే వాడిని. వీరు నాకు నాయకులయ్యారు.

నేను వారిని సామాజిక మార్గ దర్శకులుగా క్రైస్తవ మార్గ దర్శకులుగా విభజించారు. నా నాయకులందరూ గొప్ప కష్టాలను ఎదుర్కొని జయించిన వారు. నా క్రైస్తవ నాయకులు అబ్రహాము లింకన్, జాన్ వెస్లీ, రిచర్డ్ వర్మ్ బ్రాండ్ మరియు జాన్ ఆర్. రైస్. నా సామాజిక నాయకులు విన్ స్టన్ చర్చిల్ మరియు రిచర్డ్ నిక్సన్. నిక్సన్ చరిత్ర వ్రాసిన వారు అన్నారు, "ఆయన బహిరంగ వాది విషయాలలో అంతరంగ వాది. అద్భుతంగా విజయవంత రాజకీయ నాయకుడయ్యాడు. బిడియము పుస్తక పురుగు అయినా, అతనికి తెలుసు కొట్టబడతాడని, లెక్కింపబడడని, అయినను – ఎలాంటి అడ్డంకు ఉన్నా – తిరిగి లేచాడు." కాదు, అతడు క్రైస్తవుడు కాదు. అయినను, అవును, అతడు పోరాడడానికి తిరిగి వచ్చాడు. ఫిలిప్ఫీయులకు 4:13 నిక్సన్ కు ఇష్టమైన బైబిలు వచనము.

అధ్యక్షుడు నిక్సన్ కు ఆ వచనము ఎందుకు అంత ఇష్టమో తెలిసాక, ఆయనను ఇష్ట పడకుండా ఉండలేకపోయాను. ఆయన చాలా అడ్డంకులు అధిగమించాడు. నా జీవితంలో అంధకార, ఘడియలలో నేను తరచూ అనుకున్నాను, "రిచర్డ్ నిక్సన్ కష్టాల ద్వారా వెళ్తే, నేను కూడ వెళ్ళగలను." వార్తకుడు వాల్ట్ క్రోన్ కైట్ అన్నాడు, "నీవు గాని నేను గాని రిచర్డ్ నిక్సన్ అయి ఉంటే, మనము చనిపోయి ఉండేవారము." నాకు ఆయన పట్టుదల ఇచ్చినవాడు. నిక్సన్ అన్నాడు, "ఒక వ్యక్తి ఓడిపోయినప్పుడు అది అతనికి ముగింపు కాదు. ఒదిలిపెడితే అది అతనికి ముగింపు." ఏదీ అతనిని ఆపలేదు. 1960 అధ్యక్ష ఎన్నికలలో అతడు జాన్ ఎఫ్. కెన్నెడీ పై ఓడిపోయాడు. 1962 లో కాలిఫోర్నియాలో గవర్నరు పందెములో ఓడిపోయాడు. 1968 లో అధ్యక్ష పదవి పొందాడు. సమస్యలతో అతడు పదవి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. కాని మళ్ళీ తిరిగి వచ్చాడు. అందుకే, అతడు క్రైస్తవుడు కానప్పటికినీ, అతడు నా సామాజిక నాయకుడు.

అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"నన్ను బలపరచు క్రీస్తు నందే నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్ఫీయులకు 4:13).

నా తలపై జుట్టు పెరుగుతుందని దాని అర్ధము కాదు! నేను ఎగురుతానని దాని అర్ధము కాదు! నేను లెక్కలు బాగా చేస్తానని దాని అర్ధము కాదు! అపోస్తలుడు ఉద్దేశము అతడు శ్రమలు తట్టుకోగలడు, భాద్యతలు నిర్వర్తించగలడు, అడ్డంకులు అధిగమించగలడు – తనను బలపరచు క్రీస్తు నందు. నా విషయంలో కూడ ఇది నిజమని నేను కనుగొన్నాను. ఈ వచనాన్ని బట్టి నేను దేవునికి వందనస్థుడను. దానికంటే ఎక్కువగా నన్ను బలపరచడానికి నాకు క్రీస్తును ఇచ్చినందుకు దేవునికి ఇంకా వందనస్థుడను! కళాశాలలో విఫలుడనయ్యాను, కాని క్రీస్తు మూడు డాక్టరేటు పట్టాలు పొందుకోవడానికి నాకు శక్తి నిచ్చాడు. ఒక మిస్సెనరీ నవడంలో విఫలుడనయ్యాను, కాని మన వెబ్ సైట్ ద్వారా ప్రపంచమంతటా ఉన్న ప్రజలను బలపరచడానికి క్రీస్తు నన్ను ఒక పనిముట్టుగా చేసాడు.

నా పుస్తకము మీరు చదువుచున్నప్పుడు, ఇప్పుడే గ్రిఫిత్ గారు పాడిన పాట నాకు ఎందుకు ఇష్టమో మీరు చూస్తారు.

యజమానుడు మనలను పిలిచాడు; మార్గము భయంకరంగా ఉండవచ్చు
   మార్గముపై ప్రమాదాలు విచారాలు ఉండవచ్చు;
కాని దేవుని పరిశుద్దాత్మ అలిసిన వారిని ఆదరిస్తుంది;
   మనము రక్షకుని వెంబడిస్తాం మనము వెనుదిరగలేము;
యజమానుడు మనలను పిలిచాడు, సందేహము శోధన
   మన ప్రయాణంలో ఎదురైనప్పటికినీ, మనం నవ్వుతూ పాడతా:
"ముందుకు సాగుదాం, పైకి చూద్దాం," భయంకర శ్రమల ద్వారా;
   సియోను పిల్లలు వారి రాజును వెంబడించాలి.
("యజమానుడు వచ్చాడు" శారా డౌడ్ నీచే, 1841-1926).
(“The Master Hath Come” by Sarah Doudney, 1841-1926).

రోబర్ట్ నా కుమారుడు నాతో చెప్పాడు కాబట్టి నా స్వీయ చరిత్ర వ్రాసాను. అదే వ్రాసేటప్పుడు నేను సంతోషించలేదు ఎందుకంటే నా జీవితము ప్రతికూలత, పోరాటము బాధతో నిండుకొని ఉంది. చాలాసార్లు ప్రతులు పారేద్దామనుకున్నాను ఎందుకంటే అది చాలా నిరాశాజనకంగా ఉంది. కాని జాన్ సామ్యూల్ కాగన్ అన్నాడు, "డాక్టర్ హైమర్స్, వాటిని పారవేయవద్దు. ఇంకొక అధ్యాయము వ్రాయవలసి ఉంది. ఏ సమయంలో మీ తల్లి ‘నీ ఆశీర్వాదాలు లెక్కించు’" అని చెప్పారో దాని గూర్చి చెప్పండి. జాన్ చెప్పింది విని ఆఖరి అధ్యాయము వ్రాసాను, దానిని ఇప్పుడు మీకు సంక్షిప్తంగా ఇస్తాను.

ఆసుపత్రిలో నా తల్లి ప్రక్క నేను కూర్చున్నాను. కృతజ్ఞతకు కొన్ని వారముల తరువాత. అభిమాన ప్రజలను గూర్చి మాట్లాడుకుంటున్నాం, అబ్రహాము లింకన్, ఎలా అధ్యక్షుడు లింకన్ కృతజ్ఞత పండుగను ఎలా జాతీయ సెలవు దినంగా చేసాడో. కృతజ్ఞత పండుగ దినమున ఈ పాట పాడాము.

జీవిత తరంగాలలో నీవు విసిరి వేయబడినప్పుడు,
నీవు నిరుత్సాహపడినప్పుడు, అంతా పోయింది అనుకున్నప్పుడు,
నీ చాలా ఆశీర్వాదాలు లెక్కించు, ఒకదాని తరువాత ఒకటి,
ప్రభువు నీకు చేసిన దానిని బట్టి అది నిన్ను ఆశ్చర్య పరుస్తుంది.
నీ ఆశీర్వాదాలు లెక్కించు, ఒకదాని తరువాత ఒకటి,
నీ ఆశీర్వాదాలు లెక్కించు, దేవుడు నీకు ఏమి చేసాడో చూడు!
నీ ఆశీర్వాదాలు లెక్కించు, ఒకదాని తరువాత ఒకటి,
నీ చాలా ఆశీర్వాదాలు లెక్కించు, దేవుడు నీకు ఏమి చేసాడో చూడు.
("నీ ఆశీర్వాదాలు లెక్కించు" జాన్ సన్ ఓట్ మాన్ చే, జూనియర్, 1856-1922).
(“Count Your Blessings” by Johnson Oatman, Jr., 1856-1922).

మేము పాట ముగించిన తరువాత, అమ్మ చెప్పింది, "ఓ, రోబర్ట్, మనకు చాలా ఉంది మన జీవితాలలో కృతజ్ఞత చెప్పుకోడానికి." అప్పుడు మా ఆశీర్వాదాలు లెక్కింప మొదలు పెట్టాము "ఒకదాని తరువాత ఒకటి." ఆమె మా అబ్బాయిలు రోబర్ట్, జాన్ లను బట్టి వందనాలు చెప్పారు. నా భార్య, ఇలియానాను బట్టి ఆమె కృతజ్ఞత చెప్పారు. "ఆమె నాతో చాలా మంచిగా ఉంది, రోబర్ట్, ఆమె మంచి తల్లి మంచి భార్య." ఆమె మా ఇంటిలో ఉంటున్నందుకు ఆమె దేవునికి వందనాలు చెల్లించింది. మన సంఘమును బట్టి ఆమె దేవునికి వందనాలు చెప్పింది. మన సంఘ సభ్యులు, "ఒకరి తరువాత మరియొకరు" గూర్చి ఆమె వందనాలు చెప్పారు. ఏయే విషయాలలో వందనాలు చెప్పాలో చెప్పాను. మేము మళ్ళీ పల్లవి పాడాము.

నీ ఆశీర్వాదాలు లెక్కించు, ఒకదాని తరువాత ఒకటి,
నీ చాలా ఆశీర్వాదాలు లెక్కించు, దేవుడు నీకు ఏమి చేసాడో చూడు.

రాత్రి చాలా ఆలస్యమయింది. నేను ఆమెను ముద్దు పెట్టుకున్నాను, నేను గదినుండి బయటకు వస్తున్నప్పుడు ఆమె నాతో చెప్పిన విషయము నేను బ్రతికి ఉన్నంత కాలము మర్చిపోలేను. ఆమె చెప్పింది, "రోబర్ట్, నా జీవితంలో నీవు అతి శ్రేష్టమైన వాడవు." నా కళ్ళు కన్నీటితో నిండిపోయాయి గది విడిచి వస్తున్నప్పుడు, ఆసుపత్రి నుండి బయటకు వచ్చేసాను. అది ఆమెతో నా చివరి సంభాషణ. ఆ రాత్రి ఆమె తీవ్ర గుండెపోటుతో మరణించారు.

"డాక్టర్ హైమర్స్, మీ పుస్తకము విసిరి వేయకండి. ఇంకొక అధ్యాయము అంతే రాయాలి. నీ ‘ఆశీర్వాదాలు లెక్కించు’" అని మీ తల్లి చెప్పిన సమయాన్ని గూర్చి చెప్పండి. కనుక ఇవి నా జీవిత యాత్రలో దేవుడు ఇచ్చిన అద్భుత ఆశీర్వాదాలు.

మొదటిగా, నా తల్లి చివరకు రక్షింపబడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. ఆమెకు ఎనభై సంవత్సరాలు ఆమె మారదనుకున్నాను. న్యూయార్క్ లో ఇలియానాతో మా అబ్బాయిలతో ఉన్నాను, చాలా సంఘాలలో బోదిస్తున్నాను. నా గదిలో ఇటు అటు తిరుగుతూ, నా తల్లి రక్షణను గూర్చి ప్రార్ధించాను. అప్పుడు, అకస్మాత్తుగా, ఆమె రక్షింప బడుతుందని నాకు తెలుసు. పాతకాలములో వలే "ప్రార్ధిస్తూ ఉన్నాను" డాక్టర్ కాగన్ కు ఫోను చేసి తల్లిని క్రీస్తులోనికి నడిపించుమన్నాను. ఆమె మునుపెన్నడూ అతని మాటలు వినలేదు. కాని ఇప్పుడు ఆమె యేసును విశ్వసించింది. అది అద్భుతము, నిజ మార్పు. ఆ రోజు పొగత్రాగడం మద్యం సేవించడం మానేసింది. డాక్టర్ లు నాకు చెప్పారు మద్యము సేవించడం అకస్మాత్తుగా ఆపేస్తే మూర్ఛ రోగము వస్తుందని చెప్పారు. కాని ఆమె తీసుకోలేదు. అది అద్భుతము. ఇంకా ఎప్పుడు సిగరెట్టు కాల్చలేదు మందు తీసుకోలేదు. ఆమె చాలా సార్లు బైబిలు చదివింది వారానికి నాలుగుసార్లు నాతోపాటు గుడికి వస్తుంది. తన కిష్టమైన సెలవు రోజు జులై 4 న, నేను ఆమెకు బాప్తిస్మము ఇచ్చాను. తల్లి మార్పును బట్టి నేను దేవునికి వందనస్తుడను.

రెండవది, నా అద్భుత భార్య అయిన ఇలియానాను బట్టి, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను చేస్తున్న ఒక పెళ్ళికి ఆమె వచ్చింది. పెళ్ళికి ముందు యోహాను 3:16 పై ఒక చిన్న ప్రసంగము చెప్పాను. ప్రొటెస్టెంట్ సంఘములో ఆమె విన్న తొలి ప్రసంగము అది. ఆహ్వానానికి స్పందించి వెంటనే రక్షింపబడింది! మొదటిసారి పెళ్లి చేసుకో అని అడిగినప్పుడు, ఆమె, "లేదు" అని చెప్పింది. నా హృదయము పగిలిపోయింది. ఒర్ లెండో ఐరీన్ వాజ్ క్విజ్ (ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు) వారితోపాటు ప్యూరిటీ రికోకు ఆహ్వానించారు. నేను వెళ్లాను, కాని లియానా గురించి ఆలోచిస్తున్నాను. ఆమె నన్ను గూర్చి ఆలోచిస్తుంది, కూడ. ఆమె చెప్పింది, "అతడు నన్ను మళ్ళీ అడుగుతాడని నేను నిరీక్షిస్తున్నాను." నేను అడిగాను, ఈసారి ఆమె, "సరే" అని చెప్పింది. మాకు పెళ్ళయి ముప్ఫై ఐదు సంవత్సరాలు అయింది. ప్రతి రోజు నా మధుర భార్యను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తాను! ఆమె నాకు ఒక చీటీ వ్రాసింది, "రోబర్ట్, నేను నా హృదయమంతటితో నా మనసంతటితో నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పుడు ప్రేమిస్తాను, లియానా." సామెతలు 31 లో ఉన్న గుణవతియైన స్త్రీ లాంటిది నా భార్య. మీరు ఆ అధ్యాయము చదివితే అది నా మధుర హృదయము, లియానాను వర్ణిస్తుంది. నేను ఎన్నటికి నా హృదయంలో ఉంచుకుంటాను. ఈ రాత్రి ఆమె తండ్రి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండడానికి ఆయన గౌటెమాల నుండి వచ్చారు. సెల్లార్ గారు, వందనాలు! ఆమె సహోదరుని కుటుంబము కూడ ఇక్కడ ఉంది. ఎర్విన్, వందనాలు!

మూడవది, నా ఇద్దరు కుమారులు రోబర్ట్, జాన్ లను బట్టి దేవునికి వందనాలు. వారు కవలలు, వారి వయస్సు ముప్ఫై నాలుగు సంవత్సరాలు. నార్త్ రిడ్జ్ లోని కాలిఫోర్నియా రాష్ట్ర విశ్వ విద్యాలయములో వారిద్దరూ పట్టభద్రులు. రోబర్ట్ జిన్ అనే అందమైన కొరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు, ఆమె సహోదరుడు భార్య. వారు వచ్చినందుకు వందనాలు! రోబర్ట్ జిన్ లకు హన్నా శారా అను, ఇద్దరు అమ్మాయిలు. అంత అందమైన మనవరాళ్ళను ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.

నా ఇంకొక కుమారుడు జాన్ వెస్లీ, గొప్ప ఆంగ్ల బోధకుని పేరు అది. రోబర్ట్ జాన్ మన గుడిలో ప్రతికూటమి హాజరు అవుతారు. వెస్లీ ప్రార్ధనా పరుడు. గంటల తరబడి అతడు ప్రార్ధించి, బైబిలు చదువుతాడు. అతడు మంచి క్రైస్తవుడు నా స్నేహితుడు. నా ఇద్దరు కొడుకులు నాకు ఇష్టము. వారు నాకు నా భార్యకు అద్భుత ఆశీర్వాదము.

డాక్టర్ క్రిష్టాఫర్ కాగన్ బట్టి నేను దేవునికి వందనస్థుడను. ఆయన నాకు సహోదరుడు. నాకు మంచి స్నేహితుడు సన్నిహితుడు. మేము ఎంతగా గౌరవించుకుంటాం అంటే మా పేరులతో పిలుచుకోం. ఒంటరిగా ఉన్నప్పుడు కూడ నేను అతనిని డాక్టర్ కాగన్ అని పిలుస్తాను అతడు నన్ను డాక్టర్ హైమర్స్ అని పిలుస్తాడు. అంత జ్ఞానుడైన నమ్మకమైన స్నేహితుని ఇచ్చినందుకు నేను దేవునికి వందనస్థుడను. మేము ఒకరినొకరము అర్ధం చేసుకుంటాం. మేము అంతరంగికులము, చాలా సమయము ఒంటరిగా బైబిలు పఠనములో ప్రార్ధనలోను గడుపుతాము. ఆయన ఆలోచనలో శాస్త్రీయంగా లెక్కగా ఉంటాడు. నేను ఆధ్యాత్మికంగా సహజంగా ఉంటాను. మేమిద్దరం కలిసి పరిపూర్ణంగా పనిచేస్తాం. మేము భాగస్వామ్యులము, హోమ్స్ మరియు వాట్సన్ వలే, జాన్సన్ మరియు బోస్ వెల్ ల వలే (ఎవరో కలిపారు, "లారెల్ హార్డీల వలే లేక అబ్బోట్ మరియు కోస్టేల్లో వలే," పాతకాలపు హాస్య నటులు).

నేను కనిపెట్టే వాడిని అతడు సమకూర్చే వాడు. నేను సాహితీ వేత్తను. అతడు లెక్కల మనిషి. అతడు నన్ను నాయకునిగా భావిస్తాడు. నేను అతనిని తెలివైన వానిగా భావిస్తాను. మా భాగస్వామ్యము మా ఇద్దరికీ ఆశీర్వాదకరము. డాక్టర్ క్రిష్టాఫర్ కాగన్ ను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.

జాన్ సామ్యూల్ కాగన్ బట్టి నేను దేవునికి వందనస్థుడను. అతడు కాగన్ భార్యాభర్తల పెద్ద కుమారుడు. ఈ ఆరాధనను యవనుడైన జాను నడిపిస్తున్నాడు. నిన్న బాప్టిస్టు బోధకునిగా అతడు అభిషేకింపబడ్డాడు. కనుక ఇప్పుడు అతడు రెవరెండ్ జాన్ శామ్యూల్ కాగన్! అతడు చాలామంది ప్రసంగీకుడు ఉపదేశకుడు. పరిచర్యలో నేను జాన్ ను నా "కుమారుడు" గా లేక్కిస్తాను. బయోలా విశ్వ విద్యాలయములో రెండవ సంవత్సరము చదువుతున్నాడు. అతడు చాలా తెలివైన వాడు. ఆశ్చర్యం లేదు, అతని తండ్రికి రెండు పిహెచ్.డి.లు ఉన్నాయి మరియు అతని తల్లి జూడీ వైద్యురాలు. జాన్ నేరుగా విద్యార్ధి. వేదాంత విద్యలో పి హెచ్.డి. పొందాలనుకుంటున్నాడు. 24 వ ఏట జాన్ ఇండియా, డొమినికన్ రిపబ్లిక్, ఆఫ్రికాలో మూడు దేశాలలో సువార్త కూటాలలో బోధించాడు. ప్రతి ఆదివారము ఉదయము మన గుడిలో బోధిస్తాడు. ప్రతి లక్ష్మి వారము మధ్యాహ్నము మేము కలిగి కడుపుతాం, వేదాంతము గురించి సేవా పరిచర్య గురించి మాట్లాడుకుంటాం. జాన్ ను బట్టి దేవునికి వందనాలు. మన సంఘానికి నా తరువాత అతడే సంఘ కాపరి. అతడు నా స్నేహితుడు. అది అంత సామాన్యము.

నోవాసాంగ్ బట్టి దేవునికి వందనస్థుడను. అతడు ఇంకొక "బోధించే అబ్బాయి." నోవా కళాశాల పని ముగించుకొని తరువాత సెమినరీకి వెళ్తాడు. అతడు జాన్ కాగన్ మంచి జతగా ఉండి, వారు భవిష్యత్తులో మన సంఘాన్ని నడిపిస్తారు.

నోవా, ఆరోన్ యాన్సి జాక్ గ్నాన్ బట్టి నేను దేవునికి వందనస్థుడను. వారు కొత్తగా అభిషేకింపబడిన పరిచారకులు. ఆరోన్ నాకు ప్రియుడు. ఒక కోడి పిల్ల ఉన్న కోడిలా నన్ను చూస్తారు. అతడు నా సన్నిహిత స్నేహితుడు. జాక్ గ్నాన్ వివాహమై ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక్కడ మీకు తెలియనిది ఒకటి ఉంది. నేను ఇంకా ముగించలేదు! వచ్చే సంవత్సరము నేను ఒక కొత్త చైనీయ గుడిని జాక్ గ్నాన్ గృహములో ప్రారంభిస్తాను.

జాన్ కాగన్, నోవాసాంగ్, యారోన్ యాన్సీ, జాక్ గ్నాన్ మరియు బెన్ గ్రిఫిత్ లు నా ప్రార్ధనా భాగస్వాములు. మేము ప్రతి బుధవారము రాత్రి నా గృహములో ప్రార్ధనకు కూడతాం. వీరిని బట్టి దేవునికి వందనాలు. వారు కొన్ని ప్రత్యేక కష్ట సమయాల్లో నాకు సహాయ పడ్డారు, ముఖ్యంగా కేన్సరు వైధ్యము సమయంలో.

డాక్టర్ చాన్, శ్రీమతి సాలాజర్ మరియు "39" మందిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. డాక్టర్ చాన్ మన సహాయక సంఘ కాపరి, అతడు సువర్తీకరణ టెలిఫోన్ పరిచార్యకు ప్రతినిధి. శ్రీమతి సాలాజర్ మన స్పేనిష్ పరిచార్యకు అధికారి. "39" మంది విశ్వాసులై మన సంఘాన్ని గొప్ప చీలిక సమయంలో దివాలా నుండి కాపాడారు. వారందరినీ బట్టి దేవునికి వందనాలు. ఏబెల్ ప్రుదోమ్ బట్టి దేవునికి వందనాలు. అతడు సంఘ చీలికను ఆపాడు. విర్జెల్ మరియు బెవేర్లీ నికిల్ బట్టి దేవునికి వందనాలు. ఈ జంట మన గుడి భవనము కొనడంలో చాలా ధన సహాయము చేసారు. మనకు మద్దతు ఇవ్వడంలో వారు ఊగిసలాడలేదు. వారు ఇప్పుడు మన సంఘ గౌరవ సభ్యులుగా ఉన్నారు.

మన సంఘములో యాభై శాతము యవనస్తులు ముప్ఫై లోపు వారు ఉన్నారు. యవనస్తులకు కాపరిగా ఉండడం నాకు ఇష్టము. ఇప్పుడు ఉన్న గుంపు చాలా శ్రేష్టమైనది. మనకు అద్భుత పరిచారకులు ఉన్నారు. ఎనిమిది మంది అభిషేకింపబడిన పరిచారకులు, రెండేళ్ళకొకసారి వారిని మారుస్తాము. యారోన్ యాన్సీ పరిచారకులకు నిత్య అధికారిగా వ్యవహరిస్తాడు, అతనికి మార్పు ఉండదు. వీరిని బట్టి దేవునికి వందనాలు.

వృద్ధులు మనం చేసేదానికి గొప్ప మద్దతు ఇస్తున్నారు. ప్రతికూటమి హాజరు అవుతున్నారు. చాలా బాగా ప్రార్ధిస్తారు, మన సంఘాన్ని కట్టడానికి చాలా కష్ట పడతారు. ఆదివారము ఉదయపు ఆరాధన జాన్ కాగన్ అతని తండ్రి చేతిలో ఉంచడానికి నాకు భయము లేదు, నేను నూతన చైనీయ సంఘాన్ని మాంటేబెల్లో ప్రారంభించడానికి వెళ్ళేటప్పుడు. నేను వారిని పూర్తిగా నమ్ముతాను. తల్లి సంఘములో బోధించడానికి ప్రతి ఆదివారము రాత్రి నేను తిరిగి వస్తాను.

మన సంఘస్తుల మధ్య నా జీవితమంతా తిరుగుతూ ఉంటుంది. వారు నాకు "అతి ప్రియులు." అంతమంచి అద్భుత కుటుంబాలకు పితురు డయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యేసు చెప్పాడు,

"మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగల వారైన యెడల దీనిని బట్టి, మీరు నా శిష్యుల్ని అందరును తెలుసు కొందురనేను" (యోహాను 13:35).

ఒక నిజమైన కథ చెప్పి ఈ ప్రసంగాన్ని ముగించడం కంటే వేరే మంచి మార్గము లేదు. మారిం కౌంటిలో ఓపెన్ డోర్ సంఘములో నేను బోధించేటప్పుడు, నేను ఎప్పుడు శాన్ ప్రాన్సిస్కో కు ప్రతి శుక్రవారము శనివారము రాత్రి యవనుల గుంపును తీసుకువెళ్ళేవాడిని. నేను వీధులలో బోధించేవాడిని వారు కర పత్రాలు ఇచ్చేవారు. మేము తరుచు పట్టణపు ఉత్తర సముద్ర ప్రాంతానికి వెళ్ళే వారము. అది అందమైన ప్రదేశము, అక్కడ ప్రజలు మత్తు పదార్ధాలు తీసుకునేవారు, అక్కడ చాలా "సుందర వనాలు" ఉన్నాయి. ఒక సుందర స్థలమైన "ఏదేను వనము" దగ్గర నేను బోధిస్తుండే వాడిని!!!

ఒకరాత్రి కొంతమంది పిల్లలు ఒక యవ్వనుని నా దగ్గరకు తెచ్చారు. అతనన్నాడు చాలా ఖరీదైన హెరాయిన్ అలవాటు ఉందని. అది వదిలించుకోవాలను కుంటున్నానన్నాడు. నేను తనతో మాట్లాడుతున్నప్పుడు అతడు మంచివాడని గ్రహించాను. సాయంకాలమైనప్పుడు నా కారు ఎక్కించుకొని నా ఇంటికి తెచ్చాను. వంటగదిలో అతనిని పెట్టి, నా పడక గది తలుపు తాళము వేసి, వెళ్ళి పడుకున్నాను.

తరువాత చాలా దినములు అతడు చాలా భయంకర పరిస్థితులను వంటగది నేలపై కూర్చొని భరించాడు. చివరకు నిమ్మలపడి ఎవరి దగ్గరైనా గిటారు ఉందా అని అడిగాడు. పిల్లలు తెచ్చి ఇచ్చారు. నేలపై కూర్చొని రెండు రోజులు ప్రయత్నించాడు. పాటల పుస్తకము అడిగాడు. ఒకటి తెచ్చి ఇచ్చాం ఒకపాటకు కొత్త రాగము కట్టడం ప్రారంభించాడు. అబ్బాయి అసలు పేరు మర్చిపోయాను. డిఎ అని పిలిచేవాడని, అంటే మత్తు మందు బానిస!

ఒకరోజు డిఎ అన్నాడు, "ఇది వినండి." గిటారు తీసుకొని, పాటల పుస్తకము తెరచి, ఆల్ బర్ట్ మిడ్ లెన్ (1825-1909) పాట, "మీ పని ఉజ్జీవింపచేయి" తన కొత్త రాగములో పాడాడు. చాలా బాగుంది! ఈనాటికి కూడ మనము ఆ పాట డిఎ రాగములో పాడతాం!

మీ పని ఉజ్జీవింప చేయండి, ఓ ప్రభూ! మీ శక్తిగల హస్తము చాచి;
   మృతులను లేపిన స్వరముతో మాట్లాడండి, మీ ప్రజలు వినునట్లుగా చేయండి.
ఉజ్జీవింపచేయండి! ఉజ్జీవింపచేయండి! సేద తీర్చే జల్లులు ఇవ్వండి;
   మహిమ అంతా మీ స్వంతము; ఆశీర్వాదములు మావి.
("మీ పని ఉజ్జీవింప చేయండి" ఆల్ బెర్ట్ మిడ్ లెన్ చే, 1825-1909).
(“Revive Thy Work” by Albert Midlane, 1825-1909).

నేను లాస్ ఎంజిలాస్ ఇంటికి వచ్చినప్పుడు, నాకు డిఏ తో సంబంధము తెగిపోయింది. జీవితమూ సాగుతుంది చివరకు ఇప్పుడున్న ఈ భవనములో మన సంఘము ఉనికిలో ఉంది. ఒక రాత్రి ఫోను మోగింది. ఆఫీస్ కు వెళ్లి, "హలో" అన్నాను. ఫోనులో స్వరము చెప్పింది, "హలో, డాక్టర్ హైమర్స్ గారు, డిఏను మాట్లాడుతున్నాను." నేనన్నాను, "ఎవరు?" అతనన్నాడు, "డిఏ. మీకు గుర్తుందా, మత్తు బానిసను – డిఏ." నేను పడిపోబోయాను. ముప్ఫై సంవత్సరాలు అతని స్వరము వినలేదు! నేనన్నాను, "నువ్వు ఎక్కడ ఉన్నావు?" అతనన్నాడు, "ఫ్లోరిడాలో. పెళ్లి చేసుకున్నాను. నాకు మంచి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను మా గుడిలో ఆదివారపు బడిలో బోధిస్తాను."

నేను సంతోషముతో నవ్వాను! ఆ రాత్రంతా పాడాను! అలాంటివి నన్ను సంతోష పరుస్తాయి 60 సంవత్సరాల క్రిందట పరిచర్యకు వచ్చాను. ఆ శ్రమ బాధ అనుభవించడం సబబే! డిఏ లాంటి, యవనస్తులను సంపాదించడం, నా సంతోషాన్ని పరిపూర్ణము చేస్తుంది!

రక్షింపబడిన యవనస్తులను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు బాధ శ్రమ కరిగిపోతాయి. పరిచర్యలో అరవై సంవత్సరాలు గొప్ప సంతోష సమయాలను ఇచ్చింది. నేను దేని కొరకు పరిచర్యను వదులుకోలేదు!

సువార్త వివరించడానికి, రెండు నిమిషాలు తీసుకోవాలి. ఒక ముఖ్య కారణము కొరకు యేసు పరలోకము నుండి దిగి వచ్చాడు – సిలువపై మరణించడానికి మన పాప ప్రాయశ్చిత్తము చెల్లించడానికి. ఆయన మాంసము, ఎముకలతో, పునరుత్థాన ఆదివారమున శారీరకంగా లేచాడు. సమస్త పాపము నుండి మనలను కడగడానికి తన ప్రశస్త రక్తము కార్చాడు. ఆయనను విశ్వసించమని చెప్పాడు, తద్వారా మనము పాపము నుండి కడగబడతాం.

పరిపూర్ణంగా ఉండడం ద్వారా రక్షణ సంపాదించుకోవాలనుకున్నాను. నేను పరిశయ్యుడను. కాని సెప్టెంబర్ 28, 1961 బయోలా కాలేజిలో, నేను యేసును విశ్వసించాను. ఈ పాట నన్ను క్రీస్తు నొద్దకు నడిపించింది:

బందీగా నా ఆత్మ చాలా కాలము ఉండిపోయింది
   పాపములో బంధింపబడింది సహజ రాత్రిలో.
త్వరిత కిరణాన్ని మీ కన్ను చూపించింది,
   నేను మేల్కొన్నాను, గుండము వెలుగుతో మండుతుంది.
నా బంధకాలు పడిపోయాయి, నా హృదయము తేలిక అయింది,
   నేను లేచి, ముందుకు సాగి, మిమ్ములను వెంబడించాను.
అద్భుత ప్రేమ! ఎలా వీలు అవుతుంది
   నా దేవుడవైన, మీరు, నా కొరకు మరణించడం?
("అది వీలు అవుతుందా?" చార్లెస్ వెస్లీ చే, 1707-1788).
   (“And Can It Be?” by Charles Wesley, 1707-1788).

యేసు నరావతారి. ఆయన నా కొరకు చనిపోయాడు. నేను కొత్త మార్గములో ఆయనను గూర్చి ఆలోచిస్తున్నాను. నేను క్రీస్తును విశ్వసించాను. మీరు యేసును విశ్వసించి రక్షింపబడాలని నా ప్రార్ధన. తరువాత బైబిలును నమ్మే గుడిలో చేరి యేసు క్రీస్తు కొరకు మీ జీవితాలు జీవించండి.

మీ అందరికి నేను చెప్తున్నాను, "దేవుడు నన్ను అన్ని ప్రతికూల పరిస్థితులలో అన్ని భయాలలో దీవించినట్టు మిమ్మును కూడ ఆశీర్వదించును గాక." "నా పిల్లలు సత్యములో నడుచుచున్నారు అని వినుట కంటే మించిన గొప్ప ఆనందము నాకు ఇంకొకటి లేదు" (III యోహాను 4). ఆమెన్.

నేను ఈ కార్యక్రమాన్ని ముగించడానికి, రెవరెండ్ జాన్ కాగన్ కు అప్పగిస్తాను. (జాన్ డాక్టర్ శ్రీమతి హైమర్ల పుట్టిన రోజులు రెండు కేకులతో ప్రకటిస్తారు, మరియు "మీకు జన్మదిన శుభాకాంక్షలు.")

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము జాన్ వెస్లీ హైమర్స్: కీర్తనలు 27:1-14.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసు సిలువను ఒంటరిగానే భరించాలా?" (థామస్ షెఫర్డ్ చే, 1665-1739; మొదటి ఆఖరి చరణాలు) /
"యజమానుడు వచ్చాడు" (సారా డౌడ్నీ చే, 1841-1926; చివరి రెండు చరణాలు).