Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




కొట్టబడుట, పెరికి వేయబడుట, అవమానము మరియు ఉమ్మివేయబడుట

THE SMITING, PLUCKING, SHAME AND SPITTING
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము సాయంకాలము, మార్చి 25, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 25, 2018

"కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికి నా ముఖము దాచుకొనలేదు" (యెషయా 50:6).


యెషయాలోని ఏడూ పాఠ్యభాగాలలో క్రీస్తు శ్రమలను గూర్చి ప్రవచింపబడిన మూడవది ఇది. ఆయన శిష్యులకు, ఇతరులకు చెప్తున్నప్పుడు, యేసు ఈ పాఠ్యభాగాన్ని ప్రస్తావించాడు,

"ఇదిగో, యేరూషలేమునకు వెళ్లుచున్నాము, మనష్యు కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్య జనులకు అప్పగించబడును, వారు ఆయనను అపహసించి, అవమాన పరచి, ఆయన మీద ఉమ్మివేసిరి: ఆయనను కొరడాలతో కొట్టి, చంపుదురు: మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను" (లూకా 18:31-33).

యెషయా 50:6 లో ఉన్న అద్భుత ప్రవచనము యేసును గూర్చి ప్రస్తావింప బడింది. అది ప్రభువైన యేసు క్రీస్తుచే వాస్తవంగా నెరవేర్చబడింది.

"కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికి నా ముఖము దాచుకొనలేదు" (యెషయా 50:6).

ఈ రాత్రి ఈ పాఠ్య భాగము నుండి మూడు గొప్ప సత్యాలు నేను తీసుకొని వస్తాను.

I. మొదటిది, యేసు తానే ఆ శ్రమలకు "అప్పగించుకున్నాడు"!

డాక్టర్ స్ట్రాంగ్ (సంఖ్య 5414) మనకు చెప్తుంది హెబ్రీ పదము "నాతన్" అర్ధము "ఇచ్చుట." నిజంగా, యేసు కొట్టు వారికి తన వీపును "అప్పగించాడు." వెంట్రుకలు పెరికి వేయువారికి తన చెంపలను "అప్పగించుకున్నాడు." "అవమానమునకు ఉమ్మి వేయబడడానికి" తన ముఖమును "అప్పగించుకున్నాడు." యేసు అన్నాడు,

"నేను నా ప్రాణము పెట్టుచున్నాను... ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను" (యోహాను 10:17-18).

మళ్ళీ, గెత్సమనే వనములో, వారు ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు, యేసు పేతురుతో అన్నాడు,

"ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన యెడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నా వద్దకు పంపడని నీవనుకొనుచున్నవా? నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగవలెనని, లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పెను?" (మత్తయి 26:53-54).

సైనికులు వచ్చి ఆయనను లాగబోయిన, దానిని ఆపడానికి యేసు 72,000 మంది దూతలను పిలిచి ఉండేవాడు. కాని ఆయన బుద్ధి పూర్వకంగా అలా చేయడానికి నిరాకరించాడు. అవును, రక్షకుడు తన వీపును తన చెంపలను తన ముఖమును "కొట్టువారికి" "అప్పగించుకున్నాడు." ఆయన తనను ఆ శ్రమలకు "అప్పగించుకున్నాడు" ఈ భూమి మీదకి రావడానికి, తన ఉద్దేశమును నేరవేర్చడానికి, ఆయన ప్రజలను రక్షించడానికి, ఆయన యొద్దకు వచ్చు వారిని విమోచించడానికి. ఆయన,

"ఈయన అందరి కొరకు విమోచన క్రియా ధనముగా తన్ను తానే సమర్పించుకొనెను" (I తిమోతి 2:6).

ఆయన,

"క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింప వలెనని, మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను" (గలతీయులకు 1:4).

ఆయన,

"ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించుటకు, తన్ను తనే మన కొరకు అప్పగించు కొనెను" (తీతుకు 2:14).

ఆయన అన్నాడు,

"నేను నా ప్రాణము పెట్టుచున్నాను... ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను" (యోహాను 10:17-18).

ఆయన మిమ్ములను ప్రేమిస్తున్నాడు కాబట్టి హింసింపబడుటకు, అవమాన పడుటకు సిలువ వేయబడుటకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు! ఆయన అన్నాడు,

"తన స్నేహితుల కొరకు, తన ప్రాణము పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమగల వాడు ఎవడును లేడు" (యోహాను 15:13).

ఈ ఉద్దేశము నిమిత్తము పరలోకపు సింహాసనము నుండి దిగి యేసు క్రిందకు వచ్చాడు: ఆయన మనము జీవించునట్లు ఆ శ్రమలకు తన్ను తాను అప్పగించుకున్నాడు! ఓ, ఎలాంటి తలంపు! ఆయన అన్నాడు, "నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను కనుక కొట్టువారికి నా వీపును అప్పగించితిని. మిమ్ములను విమోచించడానికి ఇదొక్కటే మార్గము కాబట్టి వెంట్రుకలు పెరికి వేయువాడికి నా చెంపలను అప్పగించితిని. చివరి తీర్పులో మీ ముఖములను అవమానము నుండి తప్పించడానికి అవమానమునకు ఉమ్మి వేయబడుటకు నా ముఖమును అప్పగించితిని!" ఆయన మిమ్ములను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మీ స్నేహితుడు కనుక ఆ భయంకర పరిస్థితిలో ఆయన తన ప్రాణమును ధారపోసాడు! "యేసు పాపుల స్నేహితుడు!" లేచి పాడండి!

యేసు పాపుల స్నేహితుడు,
   పాపుల స్నేహితుడు, పాపుల స్నేహితుడు;
యేసు పాపుల స్నేహితుడు,
   ఆయన మిమ్మును విమోచింపగలడు!
("యేసు పాపుల స్నేహితుడు," జాన్ డబ్ల్యూ. పీటర్ సన్ చే, 1921-2006).
       (“Jesus is the Friend of Sinners,” by John W. Peterson, 1921-2006).

"కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికి నా ముఖము దాచుకొనలేదు" (యెషయా 50:6).

II. రెండవది, యేసు మీ పాపపు ఆత్మను స్వస్థ పరచడానికి తానే ఆ శ్రమలకు "అప్పగించుకున్నాడు"!

ఆయన "కొట్టువారికి [తన] వీపును అప్పగించాడు." దానిని తేలికగా తీసుకోవద్దు! బైబిలు చెప్తుంది,

"అప్పుడు పిలాతు యేసును పట్టుకొని, ఆయనను కొరడాలతో కొట్టించెను" (యోహాను 19:1).

స్పర్జన్ అన్నాడు,

పిలాతు, గవర్నరు, భయంకరంగా కొరడా దెబ్బలు కొట్టుటకు ఆయనను అప్పగించెను... కొరడా... ఎద్దునాడితో చేయబడింది...వాటిలో గొర్రెల నాడాలు మెలిపెట్టి ఉంటాయి, తద్వారా ప్రతి దెబ్బ శరీరము నుండి మాంసమును పెకిలించడానికి, భయంకరమైన దెబ్బలతో, కొరడాలతో కొట్టడం అనే శిక్ష మరణము కంటే అతి భయంకరమైనది. మరియు నిజంగా, చాలామంది మధ్యలోనే భరిస్తూ, చనిపోతారు, లేక తరువాత చనిపోతారు. మన ఆశీర్వాదపు విమోచకుడు కొట్టువారికి తన వీపును అప్పగించాడు, [అవి] ఆయనకు లోతైన [గాయాలు] చేసాయి. ఓ భయంకర దృశ్యము! దానిని చూచి ఎలా భరించగలము? (C. H. Spurgeon, “The Shame and Spitting,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1972 reprint, volume XXV, p. 422).

"కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికి నా ముఖము దాచుకొనలేదు" (యెషయా 50:6).

యేసు, కొట్టువానికి మీ వీపును ఎందుకు అప్పగించారు? మళ్ళీ, యెషయా దానికి జవాబు ఇస్తున్నాడు,

"అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

ఆయన వీపుపై దెబ్బల వలన "మన ఆత్మలు" పాపము నుండి స్వస్థ పరచబడతాయి! అపోస్తలుడైన పేతురు దానిని చాలా తేటగా ఇలా చెప్పాడు,

"మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు, మన పాపమును మ్రాను మీద మోసికొనేను: ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి" (I పేతురు 2:24).

యేసు పొందిన గాయముల చేత, పాపముచే నాశనమైన, మన ఆత్మలు స్వస్థ పరచబడతాయి!

తిబెరయ సముద్రము దగ్గర ఉన్నప్పుడు గొప్ప సమూహములు ఆయన దగ్గరకు వచ్చాయి,

"ఆయన వారినందరినీ స్వస్థ పరిచాడు" (మత్తయి 12:15).

ఆయనను స్వస్థ పరిచినట్టు, మీ పాప హృదయాన్ని కూడ ఆయన స్వస్థ పరుస్తాడు, "అతి మోసకరమైనది" (యిర్మియా 17:9). చార్లెస్ వెస్లీ, తన గొప్ప క్రిస్మస్ పాట "దూతల, సమూహాలు పాడుచుండగా," ఆయన చెప్పాడు "ఆయన రెక్కలలో స్వస్థతతో లేచాడు...భూ కుమారుడు లేపడానికి జన్మించాడు, వారికి రెండవ జన్మ ఇవ్వడానికి జన్మించాడు." యేసు నొద్దకు రండి మీ పాపపు ఆత్మ గాయాలు ఆయన దెబ్బలచే స్వస్థ పరచబడతాయి, మరియు మీరు తిరిగి జన్మిస్తారు!

III. మూడవది, యేసు పాపివైన నీకు ప్రతిగా, తానే ఆ శ్రమలకు "అప్పగించుకున్నాడు"

"కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికి నా ముఖము దాచుకొనలేదు" (యెషయా 50:6).

దీని కంటే తేటగా ఇంకేమి లేదు:

"మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను: మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను; అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన మందరము గొర్రెల వలే త్రోవ తప్పిపోతిమి; మనలో ప్రతివాడును తన కిష్టమైన త్రోవకు తొలిగెను; యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను" (యెషయా 53: 5-6).

నరక చిత్ర హింసల నుండి మిమ్ములను రక్షింపడానికి, మీ స్థానములో యేసు ఈ శ్రమల ద్వారా వెళ్ళాడు!

"అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను అరచేతులతో కొట్టిరి" (మత్తయి 26:67).

"కొందరు ఆయన మీద ఉమ్మివేసి, ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచు, ప్రవచింపుమని, ఆయనతో చెప్పసాగిరి: బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనురి" (మార్కు 14:65).

"ఆయన మీద ఉమ్మివేసి, అరెల్లును తీసుకొని దానితో, ఆయనను తల మీద కొట్టిరి" (మత్తయి 27:30).

"మరియు రెల్లుతో ఆయన తలమీద కొట్టి, ఆయన మీద ఉమ్మివేసి, మోకాళ్ళు ఆయనకు నమస్కారము చేసిరి" (మార్కు 15:19).

"యేసును పట్టుకొనిన మనష్యులు ఆయనను అపహసించి, కొట్టిరి. ఆయన ముఖము కప్పి, ఆయనను కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో, ప్రవచింపుమని, ఆయనను, అడిగిరి? ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనము లాడిరి" (లూకా 22:63-65).

"అప్పుడు పిలాతు యేసును పట్టుకొని, ఆయనను కొరడాలతో కొట్టించెను" (యోహాను 19:1).

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచువారికి నా ముఖము దాచుకోలేదు" (యెషయా 50:6).

జోసఫ్ హార్ట్ ఇలా అన్నాడు,

చూడండి ఎంత ఓర్పుతో యేసు నిలబడ్డాడో,
   అవమాన పరచబడ్డాడు [ఈ దారుణ స్థలములో]!
శర్వ శక్తుని చేతులను పాపులు బంధించారు,
   వారి సృష్టి కర్త ముఖముపై ఉమ్మివేసారు.
("ఆయన తపన" జోసఫ్ హార్ట్, 1712-1768;
   డాక్టర్ హైమర్స్ చే మార్చబడినది).
(“His Passion” by Joseph Hart, 1712-1768; altered by Dr. Hymers).

యేసు ఆ శ్రమ అంతటి ద్వారా వెళ్ళాడు. తరువాత వారు ఆయన కాళ్ళకు చేతులకు సిలువపై మేకులు కొట్టారు! మీకు ప్రతిగా ఆయన ఆ భయంకరమైన నొప్పిని భరించాడు. ఆయన సిలువపై శ్రమపడి నీ స్థానంలో మరణించాడు, మీ పాప ప్రాయశ్చిత్తము చెల్లించడానికి మిమ్ములను స్వస్థ పరిచి, శుద్ధి చేసి, దేవుని దగ్గరకు తీసుకురావడానికి!

"మనలను దేవుని వద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు, నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడెను" (I పేతురు 3:18).

డాక్టర్ ఐజాక్ వాట్స్ అన్నాడు,

చూడు, ఆయన తల నుండి, చేతులు, కాళ్ళ నుండి,
   విచారము ప్రేమ మిళితమై ప్రవహిస్తున్నాయి;
అలాంటి ప్రేమ విచారము ఎప్పుడైనా కలుసుకున్నాయా,
   లేక ముండ్ల కిరీటము అల్లబడిండా?

సర్వ సృష్టి అంతయు నాకు చెందినది,
   అది అతి చిన్నదిగా ఉనికిలో ఉన్నది;
అద్భుతమైన ప్రేమ, చాలా దైవికమైనది,
   నా ఆత్మను, నా జీవితమును, నా సమస్తమును కోరుచున్నది.
("నేను అద్భుత సిలువను గూర్చి తెలుసుకున్నప్పుడు" ఐజాక్ వాట్స్ చే, డి.డి., 1674-1748).
       (“When I Survey the Wondrous Cross” by Isaac Watts, D.D., 1674-1748).

మరియు విలియం విలియమ్స్ అన్నాడు,

మానవాళి నేర భారమంతా,
   రక్షకునిపై మోపబడింది,
దుఃఖముతో నిండిన వస్త్రము వలే, ఆయన
   పాపుల నిమిత్తము అమర్చబడ్డాడు.
పాపుల నిమిత్తము అమర్చబడ్డాడు.
("ఆవేదనలో ప్రేమ" విలియం విలియమ్స్ చే, 1759).
      (“Love In Agony” by William Williams, 1759).

ఎవిలా జబలగ మన సంఘములో జన్మించింది. ప్రతి ఆరాధనకు హాజరయ్యేది. అది ఆమెను క్రైస్తవురాలిగా చెయ్యలేదు. అందరి వలే సహాయంగా ఆమె ఒక పాపి. తన తోనూ తన పాపముతోను చాలా నలిగిపోయింది. కాని ఒకరోజు నా ప్రసంగము తరువాత తాను ముందుకొచ్చింది. మోకాళ్ళు వంచి క్రీస్తును నమ్మింది! ఆమె చెప్పిన దానిని వినండి,

"లోతు తెలియని సముద్రము వలే నా పాపము విస్తరించింది. దానిని తీసుకోలేకపోయాను. నాకు క్రీస్తు కావాలి! ఆయన రక్తము నాకు కావాలి! మోకాళ్ళు ఆనించి యేసును విశ్వసించాను. నా అనుభూతుల విగ్రముల నుండి, మానసిక స్థితి నుండి, నాకు విడుదల ఇచ్చి నిశ్చయత కోరిక నాలో పుట్టించాడు. వాటిని విడిచి పెట్టి రక్షకుని చేతులలో ఒరిగి పోయాను. ఇంకొక తప్పుడు మార్పిడిని గూర్చిన భయమును విడిచి, నా వైపు చూసుకొని నా భావోద్రేకాలు పొందడం విడిచిపెట్టి, విశ్వాసముతో క్రీస్తు వైపు చూసాను. సజీవుడైన క్రీస్తు నన్ను రక్షించాడు. ఆయన ప్రశస్త రక్తములో నా పాపము కడిగాడు. పాప భారాన్ని తొలగించి వేసాడు. నన్ను నరకానికి పంపగలిగే దేవుని ఉగ్రతను యేసు తొలగించాడు. ఆయన నా పాపములన్నింటిని క్షమించాడు. ఆయన స్వరక్తముతో "నేరారోపణ లేదు" అనే ముద్ర నాపై వేసాడు. ఆయన నా ఉత్తరవాది, నా విమోచకుడు, నా నాయకుడు, నా ప్రభువు! అపోస్తలుడైన పౌలుతో పాటు చెప్పగలను, "ఉచ్చరింప శక్యము కాని ఆయన బహుమానమునకు దేవునికి వందనాలు – యేసు."

క్రీస్తు నీకు ప్రతినిధి. నీ స్థానంలో ఆయన చనిపోయాడు – నీ పాప ప్రాయశ్చిత్తము చెల్లించడానికి. గొప్ప స్పర్జన్ అన్నాడు, "ఇతరులు వేరేది ఏదో బోధింపవచ్చును, కాని ఈ ప్రసంగ వేదిక, క్రీస్తు ప్రత్యామ్నాయమును గూర్చి మారు మోగుచు ఉంటుంది!"

సిలువపై ఆయన శ్రమలు మరణము ద్వారా యేసు మీ పాపపు అప్పు చెల్లించాడు! యేసు నొద్దకు రండి ఆయన మీ పాపములను క్షమించి మీ ఆత్మలను రక్షిస్తాడు! హృదయమంతటితో మీరు ఇలా చెప్పండి,

నేను వస్తున్నాను, ప్రభూ!
   మీ వద్దకు ఇప్పుడే వస్తున్నాను!
నన్ను కడగండి, రక్తములో శుద్ధి చేయండి
   కల్వరిలో కారిన రక్తములో.
("నేను వస్తున్నాను, ప్రభూ" లూయిస్ హార్ట్ సాగ్ చే, 1828-1919).
       (“I Am Coming, Lord” by Lewis Hartsough, 1828-1919).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"నా యేసు, నేను మిమ్మును ప్రేమిస్తున్నాను" (విలియమ్ ఆర్. ఫెదర్ స్టోన్ చే, 1842-1878).
“My Jesus, I Love Thee” (William R. Featherstone, 1842-1878).



ద అవుట్ లైన్ ఆఫ్

కొట్టబడుట, పెరికి వేయబడుట, అవమానము మరియు ఉమ్మివేయబడుట

THE SMITING, PLUCKING, SHAME AND SPITTING

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికి నా ముఖము దాచుకొనలేదు" (యెషయా 50:6).

(లూకా 18:31-33)

I.    మొదటిది, యేసు తానే ఆ శ్రమలకు "అప్పగించుకున్నాడు"! యోహాను 10:17-18; మత్తయి 26:53-54; I తిమోతి 2:6; గలతీయులకు 1:4; తీతుకు 2:14; యోహాను 15:13.

II.   రెండవది, యేసు మీ పాపపు ఆత్మను స్వస్థ పరచడానికి తానే ఆ శ్రమలకు "అప్పగించుకున్నాడు"! యోహాను 19:1; యెషయా 53:5; I పేతురు 2:24; మత్తయి 12:15; యిర్మియా 17:9.

III.  మూడవది, యేసు పాపివైన నీకు ప్రతిగా, తానే ఆ శ్రమలకు "అప్పగించుకున్నాడు"! యెషయా 53:5-6; మత్తయి 26:67; మార్కు 14:65; మత్తయి 27:30; మార్కు 15:19; లూకా 22:63-65; యోహాను 19:1; I పేతురు 3:18.