Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సామాజిక మాధ్యమము, విడియో ఆటలు మరియు అశ్లీల చిత్రములు
మీ జీవితాన్ని నాశనము చేస్తాయి!

SOCIAL MEDIA, VIDEO GAMES AND PORNOGRAPHY
WILL RUIN YOUR LIFE!
(Telugu)

డాక్టర్ సి. ఎల్. కాగన్ గారిచే పాఠము
బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ఇవ్వబడినది
ప్రభువు దినము మధ్యాహ్నము, మార్చి 18, 2018
A lesson by Dr. C. L. Cagan
given at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Afternoon, March 18, 2018

"వ్యర్ధమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము" (కీర్తనలు 119:37).


"వ్యర్ధము" అను మన పాఠ్యభాగములోని పదమునకు హెబ్రీయ అనువాదమునకు అర్ధము "చెడు, నాశనము, నైతిక పతనము, నిరుపయోగము" (see Strong’s Concordance #7723). "చెడు, నాశనము, నైతిక పతనము, నిరుపయోగమైన వాటి నుండి" తన కన్నులను త్రిప్పి వేయుమని కీర్తన కారుడు దేవునికి ప్రార్ధించాడు. వాటినే యువనస్తులు గంటల తరబడి చూస్తున్నారు – చెడు, నాశనము, నైతిక పతనము, నిరుపయోగమైనవి.

అది ఏంటి? కంప్యూటర్ మీద ఏమి చేస్తున్నారు! కంప్యూటర్ కాని ఐఫోను కాని ఉపయోగించ వద్దని నేను చెప్పలేదు. అవసరమైనప్పుడు పాఠశాలకు గాని పనికి గాని వాడండి. అంతర్జాలమునకు వెళ్ళవద్దని చెప్పడం లేదు. అవసరమైనప్పుడు వెళ్ళండి. గంటల తరబడి సమయమును వ్యర్ధము చేయడంను గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఫేస్ బుక్ మరియు ఇతర సామజిక మాధ్యమాలను గూర్చి మాట్లాడుతున్నాను. విడియో ఆటలను గూర్చి నేను మాట్లాడుతున్నాను. అశ్లీల చిత్రాలను గూర్చి నేను చెప్తున్నాను. ఇవి మీకు మంచివి కాదు. అవి హానిచేయని వినోదము కాదు. అది మిమ్మును గాయపరుస్తాయి. అవన్నీ నిరుపయోగము – సమయము వ్యర్ధము. అవి మిమ్ములను నాశనము చేస్తాయి. అవి మీ జీవితాలను పతనము చేస్తాయి.

మొదటిది, సామజిక మాధ్యమము మీ జీవితాన్ని నాశనము చేస్తుంది. సామాజిక మాధ్యమము అంటే ఏమిటి? దీని ద్వారా అంతర్జాలములో ప్రజలు కలుసుకుంటారు. వారు ఒకరికొకరు సందేశాలు పంపుకుంటారు. చిత్రపఠంను ఒకరినొకరు పంపించుకుంటారు. వారి పరిజ్ఞాన "స్నేహితులకు" ఏమి చేస్తున్నారో చెప్తారు. ఇతరులు ఏమి చేస్తున్నారో చూడాలనుకుంటారు. ఒకరినొకరు వ్యాఖ్యానాలు పంపుకుంటారు. దీనిపై గంటలు గంటలు వెచ్చిస్తారు.

సామాజిక మాధ్యమములో మంచి విషయాలు నేను చూడడము లేదు. వాటిని ప్రజలను గుడికి రమ్మని ఆహ్వానించడం నేనెప్పుడు చూడలేదు. క్రీస్తు కొరకు సాక్ష్యము చెప్పడం ఎప్పుడు చూడలేదు. బైబిలు వచనము నేనెన్నడు చూడలేదు. అదంతా ముచ్చట్లు పనికిరాని దానితో నిండి ఉంది – గుడికి వెళ్లేవారి విషయంలో కూడ!

ఫేస్ బుక్ ను గూర్చి నేను మాట్లాడుచున్నాను. ఇన్ స్టాగ్రామ్ స్నాప్ చాట్ ను గూర్చి నేను చెప్తున్నాను. ట్విట్టర్ ను గూర్చి మాట్లాడుతున్నాను – పక్షి అరుపులు పంపడం వేరే వారి పక్షి అరుపులు వినడం! మీరు ఎలా సమయము వ్యర్ధం చేసుకుంటున్నారో నేను చెప్తున్నాను.

సగటు వ్యక్తి రోజుకు రెండు గంటలకు పైగా సామాజిక మాధ్యమముపై సమయము వెచ్చిస్తున్నాడు. అది అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా! (చూడండి గణాంకాలు, అడ్విక్ మరియు సామాజిక మాధ్యమము ఈనాడు. విషయాలు చదవడానికి లింక్ లపైన క్లిక్ చెయ్యండి.) సగటుగా రోజుకు రెండు గంటలు. కొంతమంది రోజుకు ఐదు ఆరు గంటలు వ్యర్ధ పరుస్తున్నారు. కాని రోజుకు రెండు గంటలను గూర్చి ఆలోచిద్దాం. మీ జీవిత కాలములో, అది ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ!

సామాజిక మాధ్యమముపై సమయము వ్యర్ధ పరచకుండ ఆ రెండు గంటలు చదివితే మీరు మంచి శ్రేణులతో ఉత్తీర్ణులవుతారు. రోజుకు రెండు గంటల ద్వారా మీ ఉద్యోగమూ ఇంకా బాగా చెయ్యవచ్చును. మీరు ప్రజలతో మాట్లాడి నిజమైన స్నేహితులను పొందవచ్చు. మీరు తిరిగి మనిషిగా ఉండవచ్చు!

ఇంకా ఘోరమేమిటంటే, సామాజిక మాధ్యమము వ్యసనానికి దారి తీస్తుంది. మీరు ఫేస్ బుక్ ఇతర సామజిక మాధ్యమాలను పొద్దున్న లేచిన వెంటనే – రోజు మధ్యలో – పడుకునే ముందు చూసుకోరా? అది లేకుండా మీరు ఉండగలరా? ఒకవారము? ఒక సంవత్సరము? ఉండలేకపోతే, మీరు బానిసలై పోయినట్టే.

ఫాక్స్ వార్తా పత్రిక (12/29/2017, ఇక్కడ క్లిక్ చెయ్యండి) చూపిస్తుంది కొకైన్ ఒపియాడ్స్ లాంటి మత్తు పదార్ధాలకు బానిస అయినట్టే ఫేస్ బుక్ కు కూడ బానిస అవవచ్చు. న్యూయార్క్ విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ టారా అన్నాడు, "ఫేస్ బుక్ ‘ఇష్టాలు’ మరియు వ్యాఖ్యానాలు ఒపియోడ్స్ ఏ మెదడు భాగాలను ప్రభావితము చేస్తాయే ఆభాగాలను ప్రభావితం చేస్తాయి... మెదడు యొక్క భావాలు / అనుభవాలు... కొకైన్ ద్వారా వచ్చిన ఫలితాలకు సమానము."

సీన్ పార్కర్ ఫేస్ బుక్ ను కనుగొన్న వారిలో ఒకడు. అతడు ఫేస్ బుక్ కు అధ్యక్షుడు. పార్కర్ అన్నాడు, "ఇది సమాజముతో, ఒకరితో ఒకరికి ఉన్న సంబంధాలను మార్చేస్తుంది ...అది ఉత్పాదకతతో [పని చేయించుకోవడం] విచిత్ర మార్గాల ద్వారా జోక్యము చేసుకుంటుంది... అది మన పిల్లల మెదడులకు ఏమి చేస్తుందో దేవునికే తెలుసు" (ఫాక్స్ వార్తలు, ఐబిఐడి.). సామాజిక మాధ్యమము సృష్టి కర్తలకు తెలుసు వారు ఏమి చేస్తున్నారో అయినా అది బుద్ధి పూర్వకంగా చేసారు! పార్కర్ అన్నాడు,

ఈ అన్వయింపులను రూపొందిస్తున్నప్పుడు, వాటి అన్నింటిలో మొట్టమొదటిది అయిన ఫేస్ బుక్... దేనికి సంబంధించినది అంటే: ‘మీ సమయాన్ని మీ ఏకాగ్రతను ఎంత ఎక్కువగా మేము రాబట్టుకోగలము?’ మరియు దాని అర్ధము మేము మీకు కొంత మోతాదు ఇస్తాము [మెదడులో ఒక రసాయనము] చాలా తరుచుగా, ఎందుకంటే వారు ఇష్టపడిన చిత్రముపైన అభిప్రాయముపైన వ్యాఖ్యానము చేస్తూ ఉంటారు. ఇది సామజిక సమాచార కొనసాగింపు ప్రక్రియ, అది మిమ్ములను పొందుకునేలా చేస్తుంది ... ఎక్కువ ఇష్టాలు మరియు వ్యాఖ్యానాలు... ఇది సామాజిక దృవీకరణ ఫీడ్ బ్యాక్ లాంటిది ... మధ్యలో నాలాంటి ముక్కలు చేసేవాడు వస్తాడు, ఎందుకంటే మీరు మానవుని మనస్తత్వములో ఉన్న వైపరిత్యాన్ని చేదిస్తున్నారు.... కనుగొన్నవారు, సృష్టి కర్తలు ... దీనిని మానసికంగా అర్ధం చేసుకున్నారు. మేము మొత్తానికి దానిని తయారు చేసాము. (ఆక్సియోస్ పై నివేదిక – దానిని చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి).

ఈ సామాజిక మాధ్యమాన్ని మీ జీవితమూ నుండి ఎలా ఒదిలించుకోగలరు? మత్తు పదార్ధము విడిచిపెట్టినట్టు గానే ఆపేయండి. ఆపేయండి! మళ్ళీ వెనుకకు వెళ్ళాలనిపిస్తే, అలా చెయ్యవద్దు! రోజులు రెండు గంటలు వృధా చేసే కంటే మీకు కంప్యూటర్ గాని ఐఫోను గాని లేకుండా ఉంటే మంచిది. ముందు వెఱ్ఱి అనిపించవచ్చు, కాని మీరు నిజమైన వ్యక్తులవుతారు. అది మిమ్ములను నాశనము చేసే ముందు సామాజిక మాధ్యమాన్ని మీరు వదిలించుకోండి!

రెండవది, వీడియో ఆటలు మీ జీవితాన్ని నాశనము చేస్తాయి. వేలకొలది విడియో ఆటలు ఉన్నాయి. కొన్ని క్రీడలను గూర్చినవి. మీరు ఫుట్ బాల్ గాని బాస్కెట్ బాల్ గాని ఆడతారు. మీరు ఆటగాళ్ళను నియంత్రిస్తారు. రోజూ ఆడుతూ ఉంటే, మంచిగా ఉంటుంది. కొన్ని ఆటలు కల్పితములు. కల్పిత ప్రపంచంలోనికి వెళ్ళిపోతారు. మీరు కల్పిత పాత్రలో ఉంటారు. మీరు భూతాలు చూస్తారు. మీకు గొప్ప శక్తులు ఉంటాయి. కొంతమందికి నిజ జీవితమూ కంటే కల్పిత జీవతము ఎక్కువగా ఇష్టము. చాలా విడియో ఆటలు యుద్ధము చంపుకోవడానికి సంబంధించినవి. మీరు వందలాది మందిని చంపుతారు. మిమ్ములను మీరు చంపుకోవచ్చు. ఫ్లోరిడాలో 17 మందిని ఉన్నత పాఠశాలలో, చంపిన నికొలాస్ క్రూజ్, రోజూ భయంకర విడియో ఆటలు ఆడేవాడు. అతని పొరుగువాడు చెప్పాడు, "చంపు, చంపు, చంపు, ఏదో పేల్చి ఇంకా కొంతమందిని చంపు, రోజంతా" (Miami Herald, February 18, 2018).

ప్రజలు విడియో ఆటల మీద చాలా సమయము వ్యర్ధము చేస్తారు. ఒక అధ్యయనము చెప్పింది వారానికి సగటు సమయము 6.3 గంటలు (టైమ్, మే 27, 2014, చదవడానికి క్లిక్ చెయ్యండి). అది సగటు. 2014 ఎన్ పిడి (NPD) అధ్యయనము చెప్పింది అమెరికాలో 34 మిలియనుల "ఆడేవారు" ఉన్నారని వారు సగటున వారానికి 22 గంటలు [రోజుకు 3 గంటలకు పైగా] విడియో ఆటలు ఆడతారు (శీర్షిక చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి). ఇది నాలుగు సంవత్సరాల క్రిందట! ఈరోజు నేను తరుచు కలిసే అబ్బాయిలు యవనస్తులు రోజుకు నాలుగు, ఐదు, ఆరు గంటలు విడియో ఆటలు ఆడుతున్నారు.

ఎంత సమయము వ్యర్ధము! విడియో ఆటలపై గడిపే ప్రతి గంట చదువుపై, ఉద్యోగముపై, లేక ఇతరులను కలుసుకోవడంలో ఉపయోగించవచ్చు. విడియో ఆటలు విడిచి పెట్టండి! మీ చదువులు శ్రేష్టమవుతాయి. నిజ స్నేహితులు ఉంటారు. మీలో కొంతమందికి, మీ మనస్సును నిర్మలము చేసి సువార్తను అర్ధము చేసుకొని రక్షింపబడడానికి వీలుంటుంది!

విడియో ఆటలు బానిసలు చేస్తాయి. మళ్ళీ మళ్ళీ – వెనుకకు వస్తుంటారు. ప్రతిసారి కొంచెము బాగా అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తారు. బహుమానాలు ఉంటాయి. అందుకే ఆపరు. మీరు ఆపలేరు! మీరు బానిసలు అయిపోయారు. మత్తు మందు లాగానే.

విడియో ఆటలు వ్యసనము పాలు చేయడానికి తయారు చేయబడ్డాయి. సైక్ గైడ్స్.కాం చెప్పింది, "విడియో ఆటలు వ్యసనము అయ్యేలా చేయడానికి కారణము... అవి అలా రూపొందించబడ్డాయి. విడియో ఆటల నిర్మాణికులు, లాభం ఆర్జించడానికి, ఎక్కువ మంది వాళ్ళ ఆటలు ఆడేలా చూస్తారు. ఇది ఎలా నేరవేరుస్తారంటే ఆటను సవాలుగా ఉంచి ఎక్కువ ఆడేలా చేసి మరీ కష్టంగా ఉంచరు విడిచి పెట్టకుండా ఉండడానికి. అంటే, జయము అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా, విడియో ఆట కూడ ఒక వ్యసనమే ఇది కూడ ఒక గుర్తింప బడిన అతిక్రమణము: జూద మాడే వ్యసనము లాంటిది" (శీర్షిక కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి).

విడియో ఆటలు మీ జీవితాలను నాశనము చేస్తాయి. స్మిత్ అండ్ జోన్స్ వ్యసన సలహాదారుల అధికారి, కీత్ బెక్కర్, అన్నాడు, "మనము ఎక్కువ చూసేకొద్దీ, ఆట చిన్న పిల్లల జీవితాలను తీసుకుంటుంది." విడియో ఆట వ్యసనము జీవితాలను నాశనము చేస్తుందని అతడు చెప్పాడు. రోజుకు నాలుగైదు గంటలు ఆడేవారికి కలవడానికి గాని, ఇంటి పని చేసుకోవడానికి కాని, క్రీడలు ఆడడానికి గాని సమయము ఉండదు. "అది సామాన్య సామాజిక అభివృద్ధిని తీసేస్తుంది. 12 సంవత్సరాల భావోద్రేక తెలివి తేటలున్న వాడు 21 సంవత్సరాల తనతో సమానంగా ఉంటాడు. అమ్మాయిలతో మాట్లాడడం నేర్చుకోడు. ఆటలాడడం నేర్చుకోడు." (వెబ్ యండి, శీర్షిక కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి).

విడియో ఆటలు మీ సమయాన్ని వ్యర్ధపరుస్తాయి. మీ మనస్సును తిప్పుతాయి. అవి మీ జీవితాన్ని విరిచే ముందు వాటి నుండి పారిపోండి! విడియో ఆటలు ఆది సమయము గడిపే కంటే కంప్యూటర్ గాని ఐఫోను గాని లేకుండుట మేలు. వాటికి హెరాయిన్ కు అలవాటు పడినట్టు అలవాటు పడ్డారు. నాకు తెలుసు కాని ఆపేయండి. కాని ఆపేయండి. మీకు నవ్వు రావచ్చు, కాని తిరిగి మీ జీవితాన్ని పొందుకుంటారు!

మూడవది, అశ్లీల చిత్రాలు మీ జీవితాన్ని నాశనము చేస్తాయి. అశ్లీల చిత్రాలు చూడని ఉన్నత పాఠశాల లేక కళాశాల విద్యార్ధిని ఇప్పటి వరకు చూడలేదు – నగ్న స్త్రీలను చూడడం లేక లైంగిక క్రియ జరిపే మనష్యులను చూడడం. ఇది అన్ని చోట్ల ఉంది. ఎప్పుడు అలా కాదు. అశ్లీలత గూడమైనది. ఇది న్యాయ విరుద్ధము. కాని నేను పుట్టిన సంవత్సరమున హాగ్ హెఫ్ నెర్ ప్లే బాయ్ పత్రిక ప్రారంభించాడు. లక్షలాది మంది బొమ్మలు చూసారు. అశ్లీల విప్లవము దేశమంతా చుట్టుముట్టింది. ప్రతి మూల చిన్న పిల్లలు చూడడానికి వీలుగా అసహ్యపు పత్రికలూ అందుబాటులో ఉన్నాయి. ప్రతి పట్టణములో అశ్లీల హాలులు ఉన్నాయి.

ఇప్పుడు ప్రజలు వారి కంప్యూటర్ లలో అశ్లీలత చూస్తున్నారు – లెక్కలేని లక్షలాది మంది. నలభై మిలియనుల అమెరికనులు క్రమముగా అశ్లీల సైటులు చూస్తారు (see Webroot.com. Click here to read the article). కంప్యూటర్ రక్షణ సంస్థ ఆప్టేనేట్ చెప్పింది "వెబ్ లో 36% అశ్లీలత." (శీర్షిక చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి). అశ్లీలత అన్ని చోట్ల ఉంది.

అశ్లీలత చూడడం పాపము. క్రీస్తు చెప్పాడు, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును" (మత్తయి 5:28). ఓ, మీరు ఎప్పుడు నేలను చూస్తూ ఉండలేరు! స్త్రీలను చూడకుండ ఉండలేరు. వారు మానవ జాతిలో సగము ఉన్నారు. తన తలలో లైంగిక ఆలోచనలు ఒక అబ్బాయిలో ఉండవని నేను చెప్పడం లేదు. యవనస్తుని శరీరములో ఆ కోరిక ఉంటుంది. లైంగిక ఆలోచనలన్నీ తప్పించుకోలేరు. కాని మీరు అశ్లీలత చూడనక్కర లేదు! అశ్లీలత చూస్తూ, మీరు చూసే దానిని గూర్చి ఆలోచించడం, మీ హృదయములో ఆశించడం. అది పాపము!

రాజైన దావీదు అలా చేసాడు. ఒక రాత్రి "దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు: పై నుండి చూచుచుండగా స్నానము చేయు స్త్రీ కనబడెను; ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచెను" (II సమూయేలు 11:2). అది అనుకోకుండా జరగలేదు. అతడు ఆమెను చూచి ఆమెను గూర్చి ఆలోచించాడు. తరువాత "ఆమెను గూర్చి సమాచారము తెలుసుకున్నాడు" (11:3). ఆమెను పిలిపించాడు. ఆమెతో లైంగిక క్రియ జరిగించాడు. అది అతని జీవితాన్ని నాశనము చేసింది! అదంతా ఆ సాయంకాలపు అతని అశ్లీలత అనుభవముతో ప్రారంభమయింది.

నన్ను ఒక "సమర్దవంత ప్రశ్న" అడగనివ్వండి. దానికి మీరు జవాబు ఇవ్వనక్కరలేదు. మీరు చూసింది మీకు గుర్తుందా? చాలా సంవత్సరాల తరువాత కూడ గుర్తుకు వస్తుందా? బహుశా రావచ్చు. దానిని మొదటిలోనే చూడకుండా ఉండాల్సింది. ఒకవేళ చూసి ఉంటే, మళ్ళీ అది చూడకండి. మీ తలలో అది ఉండనక్కరలేదు!

అశ్లీలత సమయాన్ని వ్యర్ధ పరుస్తుంది. మీరు వేరేదేమైనా చెయ్యవచ్చు. అది ఇంకా దారుణము. అశ్లీలత బానిసత్వము తెస్తుంది. "అంతర్జాలములో అశ్లీల చిత్రాలు చూచిన వారి నరముల స్థితి మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు, తీసుకున్న వారి మెదడు స్థితి గతిలనే ఉంటుందని అధ్యయనాలు విశ్లీషించాయి... అలా, అశ్లీల చిత్రాలు చూడడం, ముఖ్యంగా సహజంగా బలవంతమైనప్పుడు, మందు మత్తు పదార్ధాలు తీసుకున్నట్లే మెదడును ప్రభావితం చేస్తాయి. ఈ అధ్యయనాలు ప్రగాడ రుజువు కనుపరిచాయి బలవంతంగా క్రమంగా అశ్లీల చిత్రాలు చూస్తే మత్తు పదార్ధాల వాడకమంతా శక్తివంతంగా మెదడుపై పనిచేస్తుంది" (see thedoctorweighsin.com. Click here to read the article). "అంతర్జాల అశ్లీలత దురలవాటు ఇతర దురలవాట్ల పరిధిలోనికి వస్తుంది" (see yourbrainonporn.com. Click here for 39 studies which prove that Internet porn is addictive).

అశ్లీలత ఒక మత్తు మందులాంటిది. మీరు చూసింది – మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. దాన్ని గూర్చి ఆలోచిస్తారు. ఇది ఒక అయస్కాంతంలా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. తిరిగి దాని దగ్గరకు వెళ్తారు. మీ తలలో నుండి అదిపోదు. విడిచి పెట్టలేరు. మళ్ళీ దాని దగ్గరకే వెళ్తారు. లోతుగా వెళ్తారు. మీ మనస్సును వికలము చేస్తుంది. మీ భావోద్రేకాలను తిప్పేస్తాయి. సరిగ్గా ఆలోచింపరు. సాధారణ వివాహము ఉండదు. మీ పాపమును గూర్చి ఆలోచింపరు క్రీస్తు రక్తపు అవసరతను గూర్చి ఆలోచింపరు. అశ్లీలత మీరు రక్షింప బడకుండా చేస్తుంది.

మీ జీవితాన్ని నాశనము చేసేముందు అశ్లీలత నుండి పారిపోండి! అశ్లీల చిత్రాలు చూడడం కంటే మీకు కంప్యూటర్ ఐఫోను లేకుండా ఉంటే మంచిది. హెరాయిన్ కొకెయిన్ లా దానిని విడిచి పెట్టండి. ఆపేసి తిరిగి వెళ్ళకండి! మొదట్లో కొత్తనిపిస్తుంది. చూడాలనిపిస్తుంది. వద్దని మీతో చెప్పుకోండి. ఆపేయండి చూడకండి. మారిజువా తాగరు, కదా? ఎందుకు? మంచిది, మీరు అది చేయకండి, ఇతరులు చేస్తున్నా సరే. కొకైన్ తీసుకోరు, కదా? మీరు అది చేయకండి. అది కూడ అశ్లీలత లాంటిదే. అది చెయ్యకండి, నీకేమనిపించినా సరే. ఆపేయండి తిరిగి దాని వద్దకు పోకండి.

మీ ఆత్మను గూర్చి ఆలోచించడంలో సమయము వెచ్చించండి. గుడిలో ప్రసంగాలు జాగ్రత్తగా వినండి. మేమిస్తున్న ప్రసంగ ప్రతులు చదవండి. మా వెబ్ సైట్ www.sermonsfortheworld.com. లో వాటిని చదవండి. మా వెబ్ సైట్ లో ప్రసంగ విడియోలు చూడండి. మీ పాపాన్ని గూర్చి ఆలోచించండి, ముఖ్యంగా మీ పాపపు స్వభావాన్ని గూర్చి. దేవుడు మిమ్మును క్రీస్తు దరికి చేర్చునట్టు ప్రార్ధించండి, ఆయన రక్తములో మీ పాపములు కడగబడేటట్టు. మీరు త్వరలో యేసును విశ్వసించాలని నా ప్రార్ధన. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.