Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
క్రీస్తును అప్పగించుట బంధించుట

THE BETRAYAL AND ARREST OF CHRIST
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువుదినము సాయంకాలము, ఫిబ్రవరి 25, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, February 25, 2018

"ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేననియు, వేడుకొనిన యెడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడనియు నీవను కొనుచున్నవా?" (మత్తయి 26:53).


గెత్సమనేలో యేసు మూడవసారి ప్రార్ధించిన తరువాత, నిద్రించుచున్న శిష్యుల దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు,

"లెండి, వెళ్ళుదము: ఇదిగో, నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను" (మత్తయి 26:46).

తరువాత, అంధకారములో, 300 మందికి పైగా సైనికులు సమీపించారు,

"…కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిశయ్యలు పంపిన బంట్రోతును వెంట బెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోనూ అక్కడికి [వస్తున్న] వచ్చెను" (యోహాను 18:3).

యూదా వారిని ఇక్కడికి నడిపించాడు ఎందుకంటే

"యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళు చుండువాడు గనుక: ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను" (యోహాను 18:2).

యూదా యేసును ముద్దుపెట్టుకొని, యేసు ఎవరో సైనికులకు చూపించాడు. అతడు ముద్దు పెట్టి క్రీస్తును అప్పగించాడు.

యేసు సైనికులతో అన్నాడు, "మీరు ఎవరి కొరకు చూచుచున్నారు?" వారన్నారు, "నజరేయుడైన యేసును." యేసు అన్నాడు, "నేనే ఆయనను." వారు అది వినగానే వెనుకకు తగ్గి "నేలమీద పడిరి." ఇది దేవుని కుమారునిగా తన శక్తిని చూపిస్తుంది. యేసు అన్నాడు, "నేనే ఆయనను అని మీతో చెప్పితిని: గనుక మీరు నన్ను వెదుకుచున్న యెడల, వీరిని పోనియ్యడని చెప్పెను" (యోహాను 18:8).

ఆ సమయంలో పేతురు లేచి, కత్తిని దూసి, వెంటనే చర్య మొదలెట్టెను. ప్రధాన యాజకుని దాసుని కొట్టి, అతని కుడి చెవి తెగ నరికెను. యేసు "అతని చెవిని ముట్టి, తనను స్వస్థ పరిచెను" (లూకా 22:51). తరువాత యేసు పేతురుతో ఇలా మాట్లాడాడు.

"యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము: కత్తి పట్టుకొనువారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన యెడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?" (మత్తయి 26:52-53).

ఈ పాఠ్యభాగము నుండి రెండు సామాన్య పాఠాలు తెలియ చేస్తాను.

I. మొదటిది, క్రీస్తు తనను రక్షించడానికి వేలకొలది దూతలను పిలిచియుండేవాడు.

రోమా వ్యూహములో 6,000 మంది సైనికులు ఉంటారు. తండ్రి దేవునికి మోరపెడితే, ఆ క్షణంలో పన్నెండు వ్యూహములు దూతలను పంపియుండేవాడు. ఆ సైనికుల చేతుల నుండి తనను రక్షించుకోవాలనుకుంటే, ఆయన దేవునికి చెప్పేవాడు, మరియు 72,000 మంది దూతలు అందుబాటులో ఉండేవారు. డాక్టర్ జాన్ గిల్ అన్నాడు "ఒక దేవదూత ఒక రాత్రి లక్ష, ఎనభై, ఐదు వేల మందిని హతము చేసెను, 2 రాజులు 19:35. కాబట్టి ఆ అపాయము నుండి తప్పించుకోవాలని క్రీస్తును అనిపించి ఉంటే, ఆయన నిలబడేవాడు పేతురు కత్తి అవసరత లేకుండానే" (Dr. John Gill, An Exposition of the New Testament, The Baptist Standard Bearer, 1989 reprint, volume I, p. 340).

ఆ పరిస్థితి అంతా ఆయన అదుపులో ఉన్నట్టుగా క్రీస్తు మాటలు క్రియలు తెలియచేస్తున్నాయి. ఆయన "ఆయనను నేనే," అన్నప్పుడు, దేవుని శక్తిచే సైనికులు వెనుకకు పడిపోయారు. పేతురు ప్రధాన యాజకుని దాసుడు మల్కు, చెవి తెగ నరికినప్పుడు, క్రీస్తు కనికరముతో అతని గాయమును తాకి స్వస్థ పరిచాడు. ఆయన విడుదల కొరకు ప్రార్ధిస్తే వేలకొలది శక్తి గల దూతలను పంపించి ఆయనను తండ్రి విడుదల చేసి ఉండేవాడని క్రీస్తు నెమ్మదిగా పెతురుకు చెప్పాడు. కాని తప్పింపబడడానికి ఆయన ప్రార్ధించలేదు.

ఆయన ప్రార్ధించిన తోటలో వారు యేసు చేతులను బంధించారు,
అవమానముతో ఆయనను వీదులలో నడిపించారు.
పవిత్రుడు పాప రహితుడైన రక్షకునిపై, వారు ఉమ్మివేసారు,
వారు అన్నారు, "ఆయనను సిలువ వేయుడి; ఆయనపై నింద మోపాలి."
ఆయన పదివేలమంది దూతలను పిలిచియుండేవాడు
లోకాన్ని నశింప చేయడానికి ఆయనను విడిపించుకోవడానికి.
ఆయన పదివేలమంది దూతలను పిలిచి యుండేవాడు,
కాని ఆయన ఒంటరిగా మరణించాడు, నీ కొరకు నా కొరకు.
   ("పదివేలమంది దూతలు" రే ఓవర్ హాల్ట్ చే, 1959).
   (“Ten Thousand Angels” by Ray Overholt, 1959).

II. రెండవది, క్రీస్తు సిలువకు ఇష్ట పూర్వకంగా వెళ్ళాడు.

తోటలో అకస్మాత్తుగా క్రీస్తు బంధింపబడ్డాడని మనము ఎప్పుడు అనుకోకూడదు. ఆ రాత్రి ఆయన బంధింపబడకమునుపే ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు.

శిష్యులను యేరూషలేమునకు తీసుకొని వెళ్ళే కొన్ని రోజుల ముందే, ఏమి జరుగబోతుందో ఆయన వారికి చెప్పాడు. ఆయనను బంధించే ముందు, ఆ సమయంలో యేసు ఏమి చెప్పాడో లూకా వ్రాసి ఉంచాడు,

"ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, ఇదిగో, యేరూషలేమునకు వెళ్లుచున్నాము. మనష్యు కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును, ఆయన అన్య జనుల కప్పగింపబడును, వారు ఆయనను అపహసించి, అవమాన పరిచి, మరియు ఆయన మీద ఉమ్మివేసిరి: ఆయనను అపహసించి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు: మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను" (లూకా 18:31-33).

వారు యేరూషలేమునకు వెళ్ళినప్పుడు ఏమి జరుగబోతుందో ఆయనకు పూర్తిగా తెలుసు. అయినను ఆయన వెళ్ళాడు. ఒక ఉద్దేశముతో శ్రమలను అనుభవించి సిలువ వేయబడ్డాడు, ఇష్టపూర్వకంగా.

ఆ ఘడియలో ఈ ఉద్దేశముతో ఆయన వచ్చాడని, రెండు సార్లు యేసు చెప్పాడు. ఆయన తన శిష్యులతో అన్నాడు,

"ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనే మందును? తండ్రి, ఈ గడియ తటస్థింప కుండ నన్ను తప్పించుము: అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని" (యోహాను 12:27).

మరల, రోమా గవర్నరు పొంతిపిలాతు ముందు, ఆయన నిలబడినప్పుడు, ఇలా అన్నాడు, "ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టితిని" (యోహాను 18:37).

ఈ పని నిమిత్తమే తాను పుట్టానని తెలుసు కనుక క్రీస్తు ఇష్టపూర్వకంగా సైనికులతో సిలువకు వెళ్ళాడు – సిలువపై మరణించడానికి మానవాళి పాప ప్రాయశ్చిత్తము చెల్లించడానికి. ఆయనను బంధించడం అనుకోకుండా కాదు లేదా పొరపాటుగా కాదు. తన జీవితంలో అది జరుగుతుందని ఆయనకు తెలుసు. "ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని" (యోహాను 12:27). "ఇందు నిమిత్తమే నేను పుట్టితిని" (యోహాను 18:37).

ఆయన జీవితమూ పట్ల దేవుని ప్రణాళికకు విధేయుడై, క్రీస్తు హింసింపబడుటకు, సిలువ వేయబడుటకు ఇష్ట పూర్వకంగా సైనికులతో వెళ్ళాడు. క్రీస్తు

"మనష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను: మరియు ఆయన ఆకరమందు మనష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, తన్ను తాను తగ్గించుకొనెను" (ఫిలిప్పీయులకు 2:7-8).

"ఆయన కుమారుడై యుండియు, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను; మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై, తనకు విధేయులైన వారికందరిని నిత్య రక్షణకు కారకుడాయెను" (హెబ్రీయులకు 5:8-9).

గెత్సమనే తోటలో సైనికులు ఆయనను బంధించినప్పుడు, ఆయన వారితో తన తండ్రియైన దేవునికి లోబడి, నిరాకరించకుండా మౌనముగా వెళ్ళాడు.

"అతడు దౌర్జన్యము నొందెను, బాధింప బడినను, అతడు నోరు తెరువలేదు: వధకు తెబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు, అతడు నోరు తెరువలేదు" (యెషయా 53:7).

ఆయన ప్రశస్త తలపై వారు ముళ్ళ కిరీటము పెట్టారు,
వారు పరిహసించి, "ఇదిగో రాజు" అన్నారు.
వారు ఆయనను కొట్టి ఆయనను శపించారు,
ఆయన పరిశుద్ధ నామాన్ని అపహసించారు.
ఆయన ఒంటరిగా అంతా భరించాడు.
ఆయన పదివేలమంది దూతలను పిలిచి యుండేవాడు
లోకాన్ని నశింప చేయడానికి ఆయనను విడిపించు కోవడానికి.
ఆయన పదివేలమంది దూతలను పిలిచి ఉండేవాడు,
కాని ఆయన ఒంటరిగా మరణించాడు, నీ కొరకు నా కొరకు.

దేవునికి విధేయుడై సిలువపై ఇష్ట పూర్వకంగా, క్రీస్తు ఆవేదన అనుభవించాడు. "ఆయన వధకు తేబడిన గొర్రె పిల్ల వలే ఆయెను" (యెషయా 53:7).

ఆ రోజు రాత్రి "వధకు తేబడిన గొర్రె పిల్ల" వలే క్రీస్తు సైనికులతో వెళ్లి ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో ఆలోచించండి. ఆయన దూతల సమూహాన్ని రప్పించుకొని, సిలువను తప్పించుకొని ఉంటే ఏమై ఉండేది? మీకు నాకు ఏమి జరిగి ఉండేది?

మొదటిది, సిలువపై మన పాపాల నిమిత్తము వెల చెల్లించడానికి ఎవరు ఉండకుండా ఉండేవారు. మన పాపము నిమిత్తము మనకు బదులుగా, చనిపోవడానికి ఎవరు ఉండేవారు కాదు. నిజంగా అది మనలను భయంకరమైన పరిస్థితిలోనికి నెట్టి ఉండేది. నిత్యత్వములో అంధకారములో మన పాపము నిమిత్తము మనము శిక్షింపబడి ఉండేవారము.

రెండవది, "వధకు తెబడు గొర్రె పిల్ల వలే" క్రీస్తు ఆ సైనికులతో వెళ్ళకుండా ఉంటే, మనకు పరిశుద్ధ నీతిమంతుడైన దేవునికి మధ్య మధ్యవర్తి ఉండకపోయేవాడు. దేవునితో మన కొరకు విజ్ఞాపన చేయువారు ఎవరు లేక ఆఖరి తీర్పులో మనము దేవుని ఎదుర్కొనవలసి వచ్చేది,

"దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు" (I తిమోతి 2:5).

క్రీస్తు బంధింపబడినప్పుడు సైనికులతో సిలువకు వెళ్ళకపోతే, మనకు మధ్యవర్తి ఉండకపోయేవాడు. ఒక వివాదము పరిష్కరించడానికి ఇద్దరి మధ్య ఒక వ్యక్తి ఉండడం అన్నమాట. దేవునికి పాపులకు మధ్య సమాధానాన్ని పునరుద్ధరించడానికి యేసు క్రీస్తు మాత్రమే మధ్యవర్తి. దైవ కుమారుడు మాత్రమే తండ్రి దేవుని పాపియైన మానవుని కలుపగలడు. సిలువ వేయబడడానికి యేసు సైనికులతో వెళ్లకపోయి ఉంటే, పరిశుద్ధ దేవునితో మనలను శాంతియుత సంబంధములో కలపడానికి మనకు ఎవరు ఉండేవారు కాదు.

మూడవది, "వధకు తేబడు గొర్రె పిల్ల వలే" క్రీస్తు సైనికులతో వెళ్లియుండకపోతే మనము నిత్య జీవములోనికి ప్రవేశించి ఉండే వారము కాదు. బైబిలులో సుపరిచిత వచన భాగము,

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసమును ఉంచిన ప్రతివాడును నశింపక, నిత్య జీవము పొందునట్లు, ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16).

వారు ఆయనను బంధించినప్పుడు ఆయన సైనికులతో వెళ్లి యుండకపోతే, యోహాను 3:16 నిజమయేది కాదు, మీకు నిత్య జీవము పొందే నిరీక్షణ ఉండేదికాదు.

నాల్గవది, "వధకు తేబడు గొర్రె పిల్ల వలే," క్రీస్తు సైనికులతో వెళ్లకపొతే, మరునాడు ఆయన సిలువపై కార్చిన రక్తము మీకు అందుబాటులో ఉండేది కాదు – మీ పాపాలు కడగడానికి. ఆయన దేవునికి అవిధేయుడై, సిలువను తప్పించుకుంటే, మీ పాపాలు కడగడానికి కార్చబడిన రక్తము ఉండేది కాదు. కాని ఆ రాత్రి క్రీస్తు వారితో వెళ్ళాడు, మీ పాపాల కొరకు సిలువ వేయబడడానికి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ధైర్యంగా చెప్తాడు,

"కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు" (రోమా 3:24-25).

రక్తముతో నింపబడిన ప్రవాహము ఉంది
   ఇమ్మానుయేలు నరముల నుండి ప్రవహించినది;
ఆ ప్రవాహములో, మునిగిన పాపులు,
   వారి నేరపు మరకలన్ని పోగొట్టుకుంటారు.
("ప్రవాహము ఉన్నది" విలియమ్ కౌపర్ చే, 1731-1800).
(“There Is a Fountain” by William Cowper, 1731-1800).

మీరు వచ్చి క్రీస్తు నమ్ముతారా? ఆయన మీ పాపాల నిమిత్తము ధర చెల్లిస్తాడు. దేవుని దయను పొందేలా, ఆయన మీకు మధ్యవర్తిగా ఉంటాడు. మీకు నిత్య జీవము కలుగుతుంది. మీ పాపములు దేవుని గ్రంథము నుండి తుడిచివేయబడి, క్రీస్తు ప్రశస్త రక్తములో నిత్యత్వములో కడిగి వేయబడతాయి.

వనములో ఆ రాత్ర్రి బంధింప బడినప్పుడు యేసు తండ్రి దేవునికి లోబడి నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన వారితో పాటు అవమానము, శ్రమ, సిలువకు వెళ్లి ఉండకపోతే, ఆ ప్రశస్త విషయాలు నేను మీకు ఇవ్వగలిగేవాడను కాను.

ఆ అపహసించు గుంపుకు ఆయన లొంగిపోయాడు,
ఆయన కృప కొరకు మోర పెట్టలేదు.
సిలువ అవమానాన్ని ఆయన ఒంటరిగా భరించాడు.
"సమాప్తమైనది" అని, ఆయన కేక పెట్టినప్పుడు,
ఆయన మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు;
రక్షణ అద్భుత ప్రణాళిక పూర్తి చేయబడింది.
ఆయన పదివేలమంది దూతలను పిలిచి యుండేవాడు
లోకాన్ని నశింప చేయడానికి ఆయనను విడిపించడానికి.
ఆయన పదివేలమంది దూతలను పిలిచి యుండేవాడు,
కాని ఆయన ఒంటరిగా మరణించాడు, నీ కొరకు నా కొరకు.

నేను ఇప్పుడు మిమ్మును అడుగుతున్నాను, లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లను మీరు నమ్ముతారా? ఇంతకాలము ఆయనను త్రోసి పుచ్చారు. చాలాసార్లు రక్షకునికి వ్యతిరేకంగా మీ హృదయాలను కఠిన పరచుకున్నారు. ఈ రాత్రి, ఆయనకు లోబడతారా?

ఓ, ఆయనను వెక్కిరించిన క్రూర సైనికుల వలే మీరు ఉండవద్దు! ఆయనను తిరస్కరించిన అహంకార కఠిన ప్రధాన యాజకుని వలే గాని, ఆయనను నమ్మకుండా ఆయన ముఖముపై ఉమ్మివేసిన పరిశయ్యల వలే గాని మీరు ఉండకండి! వారి వలే ఉండవద్దని మిమ్ములను బతిమాలుచున్నాను! చాలాకాలము, చాలాకాలముగా వారి వలే మీరు ఉన్నారు! సామాన్య విశ్వాసముతో యేసుకు మీ హృదయాలు ఇవ్వండి. "లోక పాపములను మోసుకొనిపోవు, దేవుని గొర్రె పిల్లను," మీరు విశ్వసిస్తారా? (యోహాను 1:29).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"పదివేలమంది దూతలు" (రే ఓవర్ హోల్ట్ చే, 1959).
“Ten Thousand Angels” (by Ray Overholt, 1959).ద అవుట్ లైన్ ఆఫ్

క్రీస్తును అప్పగించుట బంధించుట

THE BETRAYAL AND ARREST OF CHRIST

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేననియు, వేడుకొనిన యెడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడనియు నీవను కొనుచున్నవా?" (మత్తయి 26:53).

(మత్తయి 26:46; యోహాను 18:3, 2, 8; లూకా 22:51)

I.   మొదటిది, క్రీస్తు తనను రక్షించడానికి వేలకొలది దూతలను పిలిచియుండేవాడు,
II రాజులు 19:35.

II.  రెండవది, క్రీస్తు సిలువకు ఇష్ట పూర్వకంగా వెళ్ళాడు, లూకా 18:31-33;
యోహాను 12:27; 18:37; ఫిలిప్పీయులకు 2:7-8; హెబ్రీయులకు 5:8-9;
యెషయా 53:7; I తిమోతి 2:5; యోహాను 3:16; రోమా 3:24-25; యోహాను 1:29.