Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
పోరాడే క్రైస్తవునిగా ఉండడానికి ధైర్యము చెయ్యండి!

DARE TO BE A FIGHTING CHRISTIAN!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, డిసెంబర్ 10, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, December 10, 2017


ఇటీవల ప్రపంచ పత్రికలో ఒక ఆసక్తికరమైన వ్యాసము చదివాను. అందులోని విషయము చైనీయ విద్యార్థులు అమెరికాలో చదువుచున్నప్పుడు సువార్తికులుగా మారడం, వారిలో చాలామంది తిరిగి చైనాకు వెళ్లిన తరువాత గృహ సంఘాలలో ఇమడలేక పోవడం. ఒక అమ్మాయి సువార్తికురాలై తిరిగి చైనాకు వెళ్ళాక వారికుండే సమస్యను వివరించింది. ఆమె చెప్పింది, "నేను ఒక గృహ సంఘాన్ని దర్శించాను. వారితో నా అనుభవాలు పంచుకోవడం చాలా కష్టమైంది. వారు గ్రహింప లేక పోయారు. నేను చాలా ఒంటరిగా భారముగా ఉన్నట్టు అనిపించింది." ఆ పత్రిక చెప్పింది ఆమె అనుభవము క్లిష్టమైనదని. అమెరికాలో సువార్తికులు అయిన వారు అక్కడ గృహ సంఘాలలో ఉండడానికి సిద్ధంగా లేరు – కుటుంబ ఒత్తుడులు, పని వేళలు, చాలా వేరైనా సంఘ సంస్కృతి. "రెండు సంవత్సరాల తరువాత 80 శాతము విద్యార్థులు సువార్తికులుగా మారిన వారు గుడికి హాజరు కారు" (ప్రపంచ పత్రిక, సెప్టెంబర్ 30, 2017, పేజీ 48). "చైనా సంఘాలోనికి అడుగుపెట్టినప్పుడు వారి వారి ఊహాగానాలు తొక్కివేయబడుతున్నాయి – కొన్నింటిలో గాలి నియంత్రణ ఉండదు లేక గుడి కట్టడము ఉండదు – వారి అవసరాలు తీర్చేవారుండరు."

అలానే చైనా సంఘ కాపరులు ఏమి కనుగొన్నారంటే తిరిగి వచ్చే యవ్వనస్థులు ఫిర్యాదు చేస్తే సంఘ అధికారాన్ని సవాలు చేస్తున్నారని. వారు అమెరికాలో హాజరయ్యే గుడులులా చైనీయ గృహ సంఘాలు కూడ ఉండాలని కోరుతున్నారు.

ఇది నాకు చాలా ఆసక్తికరమనిపించింది ఎందుకంటే మన సంఘములో చైనీయ గృహ సంఘాలను గూర్చి చాలా గొప్పగా భావిస్తాం. సంవత్సరాలుగా ఈ చైనీయ క్రైస్తవులు కమ్యూనిష్టులు పెట్టె హింసను తట్టుకున్నారు. చాలా చైనీయ గృహ సంఘాలలో నిజమైన ఉజ్జీవము ఉంది. మనకనిపిస్తుంది కోపంగా ఉజ్జీవము మనస్సు కలిగిన చైనీయ పిల్లలు వారి గృహ సంఘాలలో అమెరికా సంఘపు పిల్లలను ప్రేమింప ఇష్టపడే వారిని! కానీ అలా కాదు, అమెరికా సువార్తికులు గృహ సంఘాల్లో ఉండే తీవ్ర ఆత్మీయ చైనీయ పిల్లలను "వారితో కలుపుకోలేరు"! "రెండు సంవత్సరాల తరువాత సుమారు 80 శాతము అమెరికా సువార్తికులు గుడికి ఇక హాజరు కారు!"

ఎందుకు? వాయు నిబద్ధత లేదు! పాపము! మంచి గుడి కట్టడము లేదు! చాలా, చాలా పాపము! ఎవరు వారి అవసరాలు తీర్చరు! ఓ నేను! ఓ నాకు! పాపము! చాలా పాపము జాలేస్తుంది మనకు అంతా కావాలి – అమెరికాలోని సువార్తికుల వలే! మనము ఫిర్యాదు చేస్తాము! మనము సంఘ నాయకులు అధికారాన్ని సవాలు చేస్తాము – పాడైనా అమెరికాను సువార్తికుల వలే! మనకు తీవ్ర ప్రార్ధనా కూటముల యందు ఆశక్తి లేదు! వారు ఎందుకు అంత ఎక్కువగా ప్రార్ధించాలి – అంత బిగ్గరగా! వారు ఎందుకు అంత కష్టముగా, గట్టిగా బోధించాలి? వారు ఎందుకు మధుర చిన్న బైబిలు పఠనాలు ఇవ్వకూడదు వారి అమెరికాలో చేసినట్టు?

అమెరికాలో తర్ఫీదు పొందిన చైనీయ సువార్తికులలో తేటగా సువార్తను చెప్పలేరు? పదిమందిలో ఎనిమిది మంది తేటగా సువార్తను చెప్పలేరు – 10 మందిలో 8 మందికి తేటగా సువార్త తెలియదు! 10 మందిలో 8 మందికి సువార్త తెలియదు! అమెరికాలోని సువార్తిక సంఘాలలో వారు మార్పుచెందలేదు! ఈ అమెరికాను సువార్తికులలో అదే పొరపాటు ఉంది. 10 మందిలో 8 మంది నిజ క్రైస్తవులు కాదు! చైనీయ గృహ సంఘాలలో ఉండే నిజ క్రైస్తవులను వారు ఇష్టపడరు! రెండవది, వారికి దేవునితో వ్యక్తిగత సంబంధము లేదు, ఇతర సంఘ సభ్యులతో మాత్రమే ఉంది. మీరు స్నేహము కొరకు గుడికి వెళ్ళితే, మీరు ఎక్కువ కాలము నిలవరు! యేసు క్రీస్తుతో మీకు నిజమైన సంబంధము లేకపోతే, మీరు త్వరలో గుడి వదిలేస్తారు! మూడవది, గుడిలో వారు దేవుని సేవించాలని లేర్పలేరు. వారు ప్రజలను సేవించకున్నా వారిని క్రీస్తు కొరకు సంపాదించకున్న వారిని మాత్రమూ పట్టించుకోవాలి!

ఇదంతా ఏమి చూపిస్తుందంటే, అమెరికను సువార్తికులు యవ్వనస్థులను మార్చి, క్రీసు కొరకు పని చేయడాన్ని ప్రేమించడంలో, పూర్తి వైఫల్యతను చూపిస్తుంది! మనకు అది ముందే తెలుసు, కదా? అమెరికను సువార్తికులంటారు, "నేను గొప్పవాడను, వస్తువులు చాలా ఉన్నాయి, ఏ లోటు లేదు; కానీ వారికి తెలియదు మీరు దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, దరిద్రులు, గుడ్డివారు, దిగంబరులు...నీవు వెచ్చగానైనను, చల్లగా నైనను ఉండక నులి వెచ్చనగా ఉన్నావు, గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను" (ప్రకటన 3:16, 17). ఈ గర్వపు అమెరికను విద్యార్థులతో, క్రీస్తు చెప్తున్నాడు, "నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించు చున్నాను!" (నిజముగా). అది మనలను దానియేలు గ్రంథములోని నలుగురు యవ్వనస్థుల దగ్గరకు తీసుకొని వెళ్తుంది. దానియేలు, షద్రకు, మేషాకు, మరియు అబేద్నెగో ఇంటి నుండి 1,500 మైళ్ళ దూరములో ఉన్నారు. ఈ యవ్వనస్థులు యుక్త వయస్కులు, ఇంటి నుండి దూరంగా ఉన్నారు, బబులోను పట్టణములో. వారు చైనాకు తిరిగి వచ్చే బలహీన నూతన సువార్తికులాల ఉంటారా?

ఈ నలుగురు యువకులే హెబ్రీయులు బందీలుగా కొనిపోబడిన వారు. దయచేసి దానియేలు 1:3 చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 898 వ పుటములో ఉంది. నేను చదువుచుండగా దయచేసి నిలబడండి.

"రాజు అప్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి, అతనికీలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీయుల రాజా వంశములలో [కొందరిని] ముఖ్యులై, రాజనగరునందు, నిలవదగిన కొందరు బాలురను రప్పింపుము" (దానియేలు 1:3).

ఇప్పుడు 6 వ వచనము చూడండి.

"యూదులలో నుండి, దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి" (దానియేలు 1:6).

మీరు కూర్చోండి. ఇశ్రాయేలు నుండి ఇంకా చాలామంది యవ్వనస్థులు బందీలుగా తేబడినట్టు ఈ వచనాలలో చూస్తున్నాము. కానీ ఈ యవ్వనస్థులు చాలా శ్రేష్ఠులు. మూడు సంవత్సరాల తర్ఫీదు తరువాత వారు బబులోను రాజైన నెబుకద్నెజారుకు, జ్ఞానులుగా సలహాదారులుగా ఉంటారు. వారిలో దానియేలు ఒకడు, మిగిలిన ముగ్గురు షెద్రకు, మేషాకు, అబేద్నెగో. వారు సకల విద్యా ప్రవీణతయు కలిగి, శాస్త్ర జ్ఞానము కలిగి, తత్వ జ్ఞానము, తెలిసినవారు.

కానీ ఈ నలుగురు విషయంలో మరియొక విషయము ఉంది. వారు రాజు భుజించు ఆహారమును పానము చేయు ద్రాక్షారసమును తీసుకో దలచుకోలేదు. భోజనము పానము విషయములలో మోషే ధర్మ శాత్రమును గైకొనాలనుకున్నారు. వారు ఉరి తీయబడి ఉండేవారు. ఈ అన్య న్యాయ స్థానములో వారు దేవుని కొరకు కష్టతర నిర్ణయము తీసుకున్నారు. 8 వ వచనము చూడండి. అది ఇలా చెప్తుంది, "రాజు భుజించు [భోజనమును], పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొన కూడదని దానియేలు ఉద్దేశించుకొనెను." మిగిలిన ముగ్గురు అలాగే చేశారు. వారు దేవుని కొరకు కష్టతర నిర్ణయము తీసుకున్నారు. చూడండి, రాజ సేవకులు వారికి తర్భీదు ఇవ్వడం లేదు. దేవుడే వారికి తర్భీడు ఇస్తున్నాడు సిగ్గు పడకుండా ఆయన కొరకు నిలబడడానికి. మీరు భోజనము చేయునప్పుడల్లా తలవంచి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారా? క్రైస్తవేతరుల మధ్య ఉన్నప్పుడు కూడ అలా చేయగలుగుతున్నారా? ఒక హోటల్ లో గుంపులో ఉన్నప్పుడు అలా చేస్తున్నారా? క్రిస్మస్ రోజున, భోజన గదిలో మీరు ఉంటారా? లేక పాప స్థలములో ఉండడానికి క్రిస్మస్ రోజున గుడి మానేస్తారా? నూతన సంవత్సర రోజున మీరు మాతో గుడిలో ఉంటారా? లేక ఒక వేడుకలో ఉంటారా? ఆ యవ్వనస్థులు చేసినట్టు నిలబడడానికి విశ్వాసము ధైర్యము కావాలి! పాటలో ఒక పదము మార్చాను.

దానియేలు వలే ధైర్యముగా ఉండండి,
   ఒంటరిగా ధైర్యముగా నిలబడండి!
ఒక స్థిర ఉద్దేశము కలిగియుండ ధైర్యము కలిగియుండండి!
   అది ధైర్యముగా తెలియ పరచండి!

లేచి నిలబడి పాడండి!

దానియేలు వలే ధైర్యముగా ఉండండి,
   ఒంటరిగా ధైర్యముగా నిలబడండి!
ఒక స్థిర ఉద్దేశము కలిగియుండ ధైర్యము కలిగియుండండి!
   అది ధైర్యముగా తెలియ పరచండి!

మీరు కూర్చోండి.

ఈ నలుగురు అబ్బాయిలు అమెరికను చైనీయ అబ్బాయిలు లాంటివారు కాదు వారు చైనాలోని మంచి సంఘాలు అమెరికా సువార్తికుల వలే మృదువైన రాజీపడే వారు కావాలని కోరుకున్నారు. కాదు! కాదు! ఇతరులకు నచ్చినా నచ్చకపోయినా దేవునికి లోబడాలనుకున్నారు! అలాంటి పిల్లలను దేవుడు ఘన పరుస్తాడు! ఆయన వారిని ఘన పరిచాడు మరియు మీరు ఆ అబ్బాయి వలే తీవ్రంగా ఉంటే మిమ్మును కూడ ఘన పరుస్తాడు!

ఈ అబ్బాయిలకు మరియొక పరీక్ష ఇవ్వబడింది. అపవిత్రమైన ఆహారము భుజింపకుండా మొదటి పరీక్షలో నెగ్గారు. ఇప్పుడు దేవుడు వారికి ఇంకొక పరీక్ష ఇచ్చాడు – ప్రార్ధనా పరీక్ష. రాజు కలగన్నాడు దాని అర్ధము తెలుసుకోవాలనుకున్నాడు. తన కల ఏమిటో జ్ఞానులకు చెప్పలేదు. కళ ఏమిటో ముందు చెప్పి తరువాత దాని భావము చెప్పాలని శాసించాడు. వారు చెప్పలేకపోతే వారు ముక్కలుగా చేయబడతారు. రాజు చెప్పాడు, "కళ చెప్పి దాని భావము చెప్పండి" (2:6). జ్ఞానులు అన్నారు అతడు అడిగిన దానిని ఏ నరుడు చేయలేడు అన్నారు. ఇది రాజుకు కోపము రప్పించింది బబులోనులోని జ్ఞానులనందరిని నశింప చేయాలన్నారు. రాజ శాసనము బయలు వెళ్ళింది వారు ఇతర జ్ఞానులతో పాటు దానియేలు తన ముగ్గురు స్నేహితుల కొరకు సంహరింప వెదికారు. దానియేలు రాజు నొద్దకు వెళ్లి జవాబు చెప్పడానికి కొంత సమయము అడిగాడు. దానియేలు ఏమి చేసాడు? అతడు తన ముగ్గురు స్నేహితులు షద్రకు, మేషాకు మరియు అబేద్నెగోలను, పట్టుకున్నాడు. ఈ నలుగురు ప్రార్ధన కూటము పెట్టుకున్నారు. వారు నాకు జాన్, జాక్, నోవా మరియు యారోనులను గుర్తు చేస్తున్నారు, వారు ప్రార్ధన కొరకు నన్ను కలిశారు. పరలోక దేవుని నుండి కృప కొరకు అడిగారు. వారు రహస్య కళ భావము కొరకు దేవుని ప్రార్ధించారు. దానియేలు 2:19 చూడండి, "అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలు పరచబడెను. గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను." దానియేలు 2:23 చూడండి. దానియేలు అన్నాడు, "మా పితరుల దేవా, నీవు వివేకమును, బలమును, నాకనుగ్రహించియున్నావు, మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియ చేసియున్నావు: రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసియున్నావు." చూడండి. రాజు అన్నాడు, "మీరు కళను దాని భావమును చెప్పగలరా?" దానియేలు చెప్పాడు, "మీరు అడిగిన మర్మము జ్ఞానులు చెప్పలేరు. ‘అయితే మర్మమును బయలు పరచగల దేవుడు పరలోకమందున్నాడు’... ఇది మీ కళ మరియు దాని భావము." తరువాత దానియేలు తన ముగ్గురు స్నేహితులు రాజునకు కళ మర్మము దాని భావము చెప్పారు. ఇప్పుడు 47 వ వచనము చూడండి, "మరియు రాజు, నీ దేవుడు, దేవతలకు, దేవుడును రాజులకు, ప్రభువును మర్మములు, బయలు పరచు వాడునై యున్నాడని, దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను." ఇప్పుడు చూడండి. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానముల నిచ్చి అతనిని బబులోను జ్ఞానులందరిలో, ప్రధానునిగా నియమించెను. రాజు షద్రకు, మేషాకు మరియు అబేద్నెగోలను ఉన్నత పదవులలో ఉంచెను, కానీ ఈ యవ్వనుడైన దానియేలు బబులోను రాజ్యమంతటికి ప్రధాన మంత్రి అయ్యాడు!

అబ్బాయిలు రాజ భోజనము పానమును తీసుకొని తమ్మును తాము అపవిత్ర పరచుకొనరాదు అనే పరీక్షలో నెగ్గారు. వారు దేవుని మొదటి స్థానములో ఉంచారు మొదటి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు!

ఇప్పుడు అబ్బాయిలు రెండవ పరీక్ష నెగ్గారు. వారు రాజు కళను బయలు పరచమని కలిసి దేవునికి ప్రార్ధించారు. వారు దేవునిపై ఆధారపడి రెండవ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు!

ఇది చాలా ప్రాముఖ్యము కాబట్టి సమయము తీసుకొని ఇది చూపించాను. క్రైస్తవునిగా గొప్ప శక్తి పొందుకుంటామని కొన్ని సార్లు మనము అనుకుంటాము. కాని దేవుడు గొప్ప శక్తిని మీరు "చేరుకోలేరు." మీరు దానిలోనికి ఎదుగుతారు. మీరు రక్షింపబడండి అప్పుడు మీరు ఎదుగుతారు! యేసు అన్నాడు,

"మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును: మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును" (లూకా 16:10).

మీరు చిన్న విషయాలైన క్రిస్మస్ రోజున నూతన సంవత్సర దినాన గుడిలో ఉంటే, తరువాత, పెద్ద విషయాలలో కూడ నమ్మకముగా ఉంటారు!

వారు తినేదాని విషయంలో ఈ అబ్బాయిలు నమ్మకంగా ఉన్నారు. ఆ పరీక్షలో నెగ్గారు. ప్రార్ధనలో నమ్మకంగా ఉన్నారు. ఆ పరీక్షలో కూడ ఉత్తీర్ణులయ్యారు.

తరువాత ఇంకా పెద్ద పరీక్ష వచ్చింది. వారు రాజు బంగారు ప్రతిమకు నమస్కరించి మొక్కుతారా, లేక మొక్కనందుకు అగ్ని గుండములో సజీవంగా దహనమవుతారా? చిన్న పరీక్షలు వారు నెగ్గారు. తరువాత వారు ధైర్యముగా చెప్పగలరు,

"మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్ధుడు, మరియు నీ వశమును పడకుండా, ఆయన మమ్మును రక్షించును" (దానియేలు 3:17).

వారు చిన్న పరీక్షల ద్వారా నేర్చుకున్నారు అగ్ని గుండము అనే పెద్ద పరీక్ష నుండి దేవుడు వారిని విడిపించగలడని!

తీవ్ర ప్రార్ధన ద్వారా రాజు వారిని సంహరించకుండా తప్పింప బడ్డారు. తరువాత, రాజు దానియేలును గర్జించు సింహముల బోనులో పడవేస్తానన్నప్పుడు, దానియేలు క్షేమంగా ఉన్నాడు, దేవుడు దూతను పంపి సింహముల నోళ్లను మూయించాడు! యేసు వారితో అగ్ని గుండములో ఉండి వారిని రక్షించాడు. యేసు ఆ దూత. దానియేలు పడ ద్రోయబడినప్పుడు యేసు తనతో సింహపు బోనులో ఉన్నాడు. సాతానుకు వ్యతిరేకంగా నిలవడానికి అతడు విశ్వాసము కలిగియున్నాడు. బైబిలు చెప్తుంది, "మీ దేవుని ఎదుర్కొన సిద్ధము కండి." మీరు సిద్ధంగా లేకపోతే, సాతాను కప్పగించుకొని ప్రభువును తిరస్కరిస్తావు!

నిలబడి లెక్కింపబడడానికి ఇప్పుడు మీరు తర్భీదు పొందాలి. దానియేలు అలా చేసాడు. మీరు కూడ అలాగే చెయ్యాలి, అగ్నిని తప్పించుకోవాలంటే!

అందుకే ఇప్పుడే తర్భీదు పొందాలి! తరువాత కాదు, ఇప్పుడే! అకస్మాత్తుగా గొప్ప విశ్వాసపు వ్యక్తివి కాలేవు! కాదు! సాధన అవసరము! నా భార్య శ్రీమతి హైమర్స్ ను గూర్చి, డాక్టర్ చాన్ ఏమి చెప్పాడో వినండి. డాక్టర్ చాన్ అన్నాడు, "శ్రీమతి హైమర్స్ ఒక్కరాత్రిలో గొప్ప క్రైస్తవురాలు కాలేదు. చాలా సంవత్సరాలు నమ్మకంగా ప్రభువుని సేవించి ఆమె పరిపక్వత పొందుకుంది. యవనురాలిగా సంఘ పరిచర్యకు తన జీవితాన్ని అప్పగించి తిరిగి ఏమి ఉంచుకోలేదు. దీనిని బట్టి దేవుడు ఆమెను గొప్పగా వాడుకున్నాడు." 16 సంవత్సరాల వయస్సులో గుడికి శ్రేష్టమైనది చేసింది. ఇప్పుడు, చాలా సంవత్సరాల తరువాత, ఆమె విశ్వాస వీరురాలు. ఇప్పుడు మీ తీవ్రంగా నమ్మకంగా లేకపోతే, చిన్న పనులతో, అకస్మాత్తుగా మీరు గొప్ప ఆత్మల సంపాదకునిగా భవిష్యత్తులో ప్రార్ధనా యోధునిగా కాలేరు.

దానియేలుకు తన ముగ్గురు స్నేహితులకు దగ్గర దారి లేదు – మీకు కూడ దగ్గర దారులు ఉండవు. క్రీస్తులో ప్రవేశించడానికి ఇప్పుడే తీవ్రంగా రోషంతో ప్రయత్నించండి. ప్రారంభములో సోమరిగా ఉంటే, తరువాత మీరు గొప్ప క్రైస్తవులు కానేరరు. మీ శక్తి అంతటితో క్రీస్తు నందు ప్రవేశించడానికి కష్టపడండి. ఒకరన్నారు, "బాగా ప్రారంభిస్తే సగం ముగించినట్టే." శ్రీమతి హైమర్స్ నేను తొలిసారిగా సువార్త చెప్పినప్పుడే ఆమె పాపము నుండి వైదొలగి యేసును విశ్వసించింది! డాక్టర్ జుడిత్ కాగన్ కూడ. క్రైటన్ చాన్ కూడ అంతే. మెలిస్సా సాండర్స్ కూడ. బెన్ గ్రిఫిత్ కూడ. ఇప్పుడు వారు బలమైన క్రైస్తవులు! వారు త్వరగా రక్షింప బడినందుకు ఒక స్త్రీ నన్ను ఆశ్చర్యంగా చూసింది. చాలా సంవత్సరాలు ఆమె నశించిపోయి ఉంది. "వారు అంత త్వరగా ఎలా చేయగలిగారు?" ఆమె అడిగింది. వారు తీవ్రంగా ఉన్నారు నీవు తీవ్రంగా లేవు. అలా అన్నమాట! మీరు అవివేకులై ప్రారంభములో రాజ్యములో ప్రవేశింప కష్టపడకపోతే, మీరు ఎప్పుడు బలహీన కొత్త సువార్తికులుగా ఉంటారు, ఆ చైనీయ పిల్లల వలే, వారు నిస్సార బలహీన, కొత్త సువార్తిక సంఘాలు హాజరు అవుట ద్వారా నాశనమయి పోయారు. బైబిలు చెప్తుంది, "క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే, నాతో కూడ శ్రమను అనుభవించుము" (II తిమోతి 2:3). దానియేలులా ఉండడానికి ధైర్యము చెయ్యండి! పాట పాడండి!

దానియేలు వలే ధైర్యముగా ఉండండి,
   ఒంటరిగా ధైర్యముగా నిలబడండి!
ఒక స్థిర ఉద్దేశము కలిగియుండ ధైర్యము కలిగి యుండుడి!
   అది ధైర్యముగా తెలియ పరచండి!

నేను తప్పక పోరాడాలి, నేను ఎలా అంటే;
   నా ధైర్యమును పెంచండి, ప్రభూ!
నేను హింసను భరిస్తాను, బాధను సాహిస్తాను,
   మీ వాక్యపు మద్దతుతో.
("నేను సిలువ సైనికుడినా?" డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748).
(“Am I a Soldier of the Cross?” by Dr. Isaac Watts, 1674-1748).

"విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము!" (I తిమోతి 6:12).

సోమరి కొత్త సువర్తికులు మంచి సంఘ సభ్యులు కానేరరు! వారి కొత్త సువార్త పని బలహీనమని వారు నమ్మరు! అందుకే కొత్త సువార్తికులు అరుదుగా రక్షింపబడతారు. సువార్త వినిన తొలిసారే వారు రక్షింప బడరు. వారి మతము తప్పు అనివారు ఒప్పుకోవడానికి వారితో చాలా సంవత్సరాలు పోరాడాలి. అందుకే వారు మంచి సంఘ సభ్యులు కానేరరు! ఎన్నడు! ఎన్నడు! ఎన్నడు! క్రీస్తు మార్గము విషయంలో పోరాడడానికి సోమరివైతే, క్రైస్తవ జీవితంలో ఏమంచి దాని కొరకు మీరు పోరాడలేరు! క్రియలతో రక్షణా? కాదు, దాని గూర్చి మాట్లాడడం లేదు. కృప ద్వారా రక్షణను గూర్చి మాట్లాడుతున్నాను, ఆ కృప మీ సందేహాలు భయాలకు వ్యతిరేకంగా పోరాడడానికి మీకు సహాయము చేస్తుంది. నేను విశ్వాసమును గూర్చి మాట్లాడుతున్నాను అది క్రీస్తు మార్గానికి నడిపిస్తుంది, క్రీస్తు సంఘము మంచి నిమిత్తము పోరాడ సహాయ పడుతుంది. డాక్టర్ ఆర్. ఏ. టోరి ప్రసంగము పేరు – "పోరాడే, క్రైస్తవులు కావాలి!" మొదటి నుండి ఒకేలా ఉండాలి! క్రైస్తవుడవడానికి సోమరిగా ఉంటే – జీవితమంతా సోమరిగానే ఉంటావు! "పోరాడేక్రైస్తవులు కావాలి!" ఇక్కడ బాప్టిస్టు టేబర్నేకల్ లో అలాంటి వారే ఉన్నారు. సోమరి క్రైస్తవ్యము కావాలంటే, ఇంకొక గుడికి వెళ్ళండి! చాలా బలహీన మైన కొత్త సువార్తిక సంఘాలు ఉన్నాయి! ఒకదానికి వెళ్ళండి! ఒకదానికి వెళ్ళండి! ఒకదానికి వెళ్ళండి! బయటికి వెళ్లి ఒకదానికి వెళ్ళండి!

కాని ఆగండి! ఇంకా అయిపోలేదు! మీరు నిజంగా వెళ్ళిపోవాలని కాదు. మీరు ఇక్కడ ఉండి రక్షింపబడాలి! ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మీరు రక్షింప బడకపోతే ప్రసంగములో ఇది అతి ప్రాముఖ్యమైన విషయము. ఇప్పుడు చెప్పుచున్న దాని మీద దృష్టి సారించండి. మునుపు ఎన్నడు విననట్టుగా వినండి!

రాజు మండుచుండు అగ్ని గుండములో, ముగ్గురిని పడవేసాడు. వారికి నిరీక్షణ లేదు. మీకు ఇప్పుడు అలా అనిపించడం లేదా? మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మిమ్మును మీరు రక్షించుకోలేరు. నిజానికి, రక్షింపబడడానికి కావలసిన నిరీక్షణ అంతా కోల్పోయారు. "నేను డాక్టర్ చాన్ లేక గ్రిఫిత్ గారు లేక జూడీ కాగన్ లేక శ్రీమతి హైమర్స్ లలా ఉండలేను." మీరు నిస్సహాయులుగా ఉన్నారు. మీకు తెలుసు మీరు నరకములో కాలిపోతారని మిమ్ములను మీరు రక్షించుకోవడానికి ఏమి చెయ్యలేరు! కాని, ఆగండి! రాజు అగ్ని గుండములోనికి చూచినప్పుడు ఆయన ముగ్గురిని చూడలేదు. నలుగురు వ్యక్తులను చూసాడు, "అగ్ని గుండములో నడుస్తున్నారు, కాలిపోలేదు; దైవ కుమారుని పోలిన నాలుగో వ్యక్తి ఉన్నాడు" (దానియేలు 3:25). స్పర్జన్ సరిగా చెప్పాడు. అగ్నిలో నాలుగవ వ్యక్తి యేసు – శరీర దారియైన దైవ కుమారుడు. అగ్నిలో వారితో పాటు యేసు ఉన్నాడు. మంటల నుండి యేసు వారిని రక్షించాడు! బైబిలు చెప్తుంది "వారిని కాల్చడానికి అగ్నికి ఆ శక్తి లేదు" (దానియేలు 3:27). యేసు వారితో ఉన్నాడు యేసు వారిని అగ్ని నుండి నరకము నుండి రక్షించాడు.

నా ప్రియ స్నేహితుడా, యేసు నిన్ను కూడ రక్షిస్తాడు. ఆయనకు నీపై కనికరము ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ విశ్వాసము ఎంత చిన్నదైన, యేసు సర్వ శక్తిమంతుడు. యేసు నీ వైపు ఉన్నాడు! బైబిలు అలా చెప్తుంది! బైబిలు చెప్తుంది, "పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను" (I తిమోతి 1:15).

మీరు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా పరవాలేదు. నిజానికి, మీరు ఎంత నిస్సహాయంగా ఉంటే అంత మంచిది! ఎందుకు? ఎందుకంటే రక్షింప బడడానికి యేసునే అంతా చేయనిస్తారు. మిమ్ములను మీరు రక్షించుకోలేరు. మీకు తెలుసు మీకు వీలు కాదు. మీరు మంచిగా గాని బలముగా గాని ఉండలేరు. మంచిది! మీ అగ్ని గుండములో యేసును నాలుగవ వ్యక్తిగా ఉండనివ్వండి. ఆయనే మిమ్ములను రక్షింప నివ్వండి.

మీరనవచ్చు, "నాకు చాలినంత విశ్వాసము లేదు." నాకు తెలుసు. కాని యేసే మిమ్ములను రక్షిస్తాడు. నిరీక్షణ అంతా కోల్పోయినప్పుడు యేసు నన్ను రక్షించాడు. ఆయన నా దగ్గరకు వచ్చి అనుమానము భయముల అగ్ని గుండము నుండి నన్ను రక్షించాడు. నిన్ను రక్షించడానికి యేసు సిలువపై మరణించాడు. నిన్ను రక్షించడానికి ఆయన మృతులలో నుండి లేచాడు. ఈ రాత్రి యేసు మీ కొరకు ఇక్కడ ఉన్నాడు. ఆయన మీ అనుమానము భయముల అగ్ని గుండములోనికి దిగి వస్తాడు. ఆయన మీకు శాంతి నిరీక్షణ ఇస్తాడు. నాకు తెలుసు అది మీరు నమ్మరని. కాని ఆయనకు కలవండి ఆయన మీ కొరకు ఇక్కడ ఉన్నాడు. మిమ్మును మీరు చూసుకోకండి. ఆయనను చూడండి. చిన్న విశ్వాసముతో, ఆయనను నమ్మండి. ఎక్కువ సమయము పట్టదు! చిన్న విశ్వాసము. ఆయన మీతోపాటు అగ్ని గుండములో ఉన్నాడు. చిన్న విశ్వాసముతో ఆయనను నమ్మండి అంతా మంచిగా ఉంటుంది. మీరు నమ్మే అవసరము కూడ లేదు. నన్ను నమ్మండి. ఆయన మిమ్మును రక్షిస్తాడని నాకు తెలుసు. నా విశ్వాసము మీకు సహాయ పడనివ్వండి. యేసును నమ్మునట్టు నన్ను మీకు సహాయపడనివ్వండి అంతా మంచిగా ఉంటుంది. "యేసు నన్ను రక్షిస్తాడని డాక్టర్ హైమర్స్ నమ్ముతున్నారు, కనుక నేను కాపరిని నమ్ముతాను యేసును కూడ నమ్ముతాను!" ఆయనను నమ్మండి, ఆయనను నమ్మండి, కేవలము ఆయనను నమ్మండి. ఆయన మిమ్మును రక్షిస్తాడు, ఆయన మిమ్మును రక్షిస్తాడు, ఇప్పుడు ఆయన మిమ్మును రక్షిస్తాడు." "కాని," మీరంటారు, "ఆయన మునుపు నన్ను రక్షించడం లేదు" అని. అలా అనిపిస్తుంది, కాని ఆయన ఇప్పుడు మిమ్మును రక్షిస్తాడు.

పాపముచే అణగగొట్టబడిన ప్రతి ఆత్మ, రమ్ము, ప్రభువు నందు కృప ఉంది,
ఆయన మాటలను నమ్మడం ద్వారా ఆయన తప్పక మీకు విశ్రాంతిని ఇస్తాడు.
ఆయనను నమ్మండి, ఆయనను నమ్మండి, ఇప్పుడే ఆయనను నమ్మండి,
ఆయన మిమ్మును రక్షిస్తాడు, ఆయన మిమ్మును రక్షిస్తాడు, ఇప్పుడు మిమ్మును రక్షిస్తాడు.
("ఆయనను నమ్మండి" జాన్ హెచ్. స్టాక్ టన్, 1813-1877).
(“Only Trust Him” by John H. Stockton, 1813-1877).

మీ బలహీన కొత్త సువార్త మతము నుండి వైదొలగండి. ఇప్పుడే దాని నుండి వైదొలగండి! యేసును నమ్మండి ఆయన ద్వారా పాపము నుండి రక్షింప బడండి – సిలువపై ఆయన కార్చిన రక్తము ద్వారా!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"దానియేలు వలే ధైర్యముగా ఉండండి"
(ఫిలిప్ పి. బ్లిస్ చే, 1838-1876; డాక్టర్ హైమర్స్ చే మార్చబడినది).
“Dare to Be Like Daniel” (by Philip P. Bliss, 1838-1876; altered by Dr. Hymers).