Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
"అలా అవక పోయినను కాని" – బబులోనులో దేవుని మనష్యులు

“BUT IF NOT” – GOD’S MEN IN BABYLON
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, డిసెంబర్ 3, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, December 3, 2017

"షడ్రకును, మేషాకును, అబెద్నేగోయు, రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నేజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలేనన్న చింతమాకు లేదు. మేము సేవించుచున్న, దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములో నుండి, మమ్మును తప్పించి రక్షించుటకు సమర్ధుడు, మరియు నీవశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ, ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలబెట్టించిన, బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసుకొనుము" (దానియేలు 3:16-18).


వారు ఇంటి నుండి 1,500 మైళ్ళ దూరములో ఉన్నారు. వారు కేవలము యుక్త వయస్కులు. పట్టణము అబద్ధపు మతము, మధ్యము పాపముతో నిండియున్నది. వారి తల్లిదండ్రులకు తెలియకుండా వారు ఏమైనా చేసియుండగలరు! కాని దేవుడు చూస్తున్నాడని వారు ఎరుగుదురు.

నెబుకద్నేజరు యేరూషలేమును ఆక్రమించినప్పుడు వారు వారి గృహముల నుండి చెర పట్టబడ్డారు. వారు నలుగురు. వారి ఇతర అబ్బాయిలా లేరు. వారు బలముగా తెలివిగా ఉన్నారు. వారి శ్రేష్టులలో – అతి శ్రేష్ఠులు. వారు ఆటగాళ్ళు. కాని వారు "ఏ" కోవకు చెందిన విద్యార్ధులు. జ్ఞానులుగా తర్ఫీదు అవడానికి రాజు వారిని ఎన్నుకున్నాడు. వారు పట్ట భద్రులైన తరువాత వారు రాజుకు ప్రత్యేక సలహాదారులుగా ఉంటారు.

వారు మంచి యవనస్తులు. విద్యావేత్తలు ఆ నలుగురిని యుక్త వయస్కులుగా అంచనా వేసారు – 17 నుండి 18 సంవత్సరాల మధ్యవారు. వారు రాజు విశ్వ విద్యాలయములో, విశాల భూభాగములో, ఇంటి నుండి 1,500 మైళ్ళ దూరములో ఉన్నారు.

ఈనాడు ఆ స్థితిలో ఉన్న యవనస్తులు వేరుగా జీవిస్తారు! వారు త్రాగుతారు. వారు విపరీత సందడిలలో హాజరవుతారు. వారు విశ్వ విద్యాలయములో నేర్చుకున్న దానిని దేవుని ఉనికిని కాదనడానికి ఉపయోగించుకుంటారు. లోతు దినములలో వలే, వారు సందడి జంతువులయి పోతారు. వారు వారి జీవితాల నుండి దేవుని విడిచి పెట్టి ఉండే వారు, లోతుకూడా సొదోమో వాతావరణములో ప్రవేశించినప్పుడు అలాగే చేసాడు. తప్పిపోయిన కుమారుడు చేసినట్టు "పాప భూఇష్ట జీవనముతో" – వారి జీవితాలను వ్యర్ధము చేసుకొని ఉండేవారు. నశించు వారిని స్నేహితులుగా చేసుకొని వస్తు భూఇష్ట జీవన విధానములో పట్టబడి వారి దారి కోల్పోయేవారు, చాల్దీస్ లోని ఉర్ లో అబ్రహాము చేసినట్టు. వారు దారి తప్పి పౌలు స్నేహితుడు దేమా వలే, వారి ఆత్మలను కోల్పోయి ఉండేవారు, "దేమా ఈ లోకమును స్నేహించి, నన్ను విడిచిపెట్టెను" (II తిమోతి 4:10).

కాని ఈ యూదా యువకులు, ఇంటి నుండి దూరముగా ఉన్ననూ, బబులోను విశ్వ విద్యాలయములో, ఎన్నడు పడిపోలేదు తప్పిపోలేదు! వారు మోషే నిబంధనలో ఉండి, నిష్టగా ఉన్నారు. రాజు మధ్యముతో గాని రాజ భోజనముతో కాని వారు తమ్మును తాము అపవిత్ర పరచుకోలేదు. ఇంటి వద్ద నేర్చుకున్న మత బోధలకు దేవునికి నమ్మకంగా ఉన్నారు. వారు చైనాలోని, తల్లిదండ్రులు తమ పిల్లలను దూరముగా పంపిన, వారి వలే ఉన్నారు. వారిలో కొందరు గుడికి వచ్చి రక్షింపబడుతున్నారు దేవునికి వందనాలు. అప్పుడు మీరు బబులోనులో బంధీలుగా ఉన్న యూదా యువకుల వలే ఉంటారు.

ఈ యవనస్తులకు దానియేలు నాయకుడు. నలుగురిలో యితడు చిన్నవాడు. కాని అతడు సహజ నాయకుడు. మిగిలిన ముగ్గురిని నడిపించాడు. జాన్ కాగన్ వలే అతనికి నాయకత్వ సమర్ధత ఉంది. అందుకే జాన్ కాపరి అవుతాడు అనిపించింది. జాన్ నాయకుడు కాబట్టి అతని కంటే పెద్ద వారు అతనిని వెంబడిస్తారు. దానియేలు ప్రార్ధనాపరుడు. దేవుని యందు విశ్వాసము కలిగి ఒక ఉద్దేశము కలిగిన వ్యక్తి దానియేలు. దానియేలు ఒక ప్రవక్త. అతడు రాజైన నెబుకద్నేజరుకు బోధించాడు రాజు సముఖము నందు అందరికి సాక్ష్యముగా నిలిచాడు. రాజుకు దానియేలు నందు గొప్ప నమ్మకము ఉండేది. ఇరవై సంవత్సరాలకే అతడు దానియేలును గొప్ప వ్యక్తిగా చేసాడు. కాని దానియేలు తన ముగ్గురు స్నేహితులను మర్చిపోలేదు. వారి పేర్లు పద్రకు, మేషాకు మరియు అబెద్నేగో. బబులోను ప్రభుత్వములో అతని ముగ్గురు హెబ్రీయ స్నేహితులకు మంచి పెద్ద స్థానము ఇవ్వాలని దానియేలు మనవి చేసాడు.

ఈ ముగ్గురు యువకులు దేవుని పట్ల నమ్మకత్వములో అన్ని పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. వారి నమ్మకత్వాన్ని బట్టి పెద్ద స్థానాలు వారికి ఇవ్వబడ్డాయి. దేవునికి మొదటి స్థానమిచ్చినప్పుడు, దేవుడు ఎక్కువ ప్రాముఖ్యమైన పని అప్పగిస్తాడు. వారు నాకు నోవా, జాక్ మరియు ఆరెన్ లను గుర్తు చేస్తున్నారు. వారు చిన్నవారు, కాని వారు పరిచారకులుగా అభిషిక్తులయ్యారు ఎందుకంటే వారు దేవుని పనులు చెయ్యగలరని మాకు తెలుసు. దీవునికు తెలుసు వారు కష్ట తరమైన పరీక్షల ద్వారా వెళ్ళగలుగు తారని.

రాజైన నెబుకద్నేజరు చాలా శక్తిమంతుడుగా అహంకారిగా తయారయ్యాడు. అహంకారముతో పెద్ద తన విగ్రహాన్ని చేయించుకున్నాడు. తొంభై అడుగుల ఎత్తు, అది బంగారముతో, చేయబడినది. నెబుకద్నేజరు తనదైన భారీ విగ్రహాన్ని "దూరాయనుది మైదానంలో" నిలబెట్టాడు (దానియేలు 3:1). ఇప్పుడు దానియేలు 3:4-6 వినండి.

"ఇట్లుండగా ఒక దూత చాటించినది, ఏమనగా, జనులారా, దేశాస్తులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను, ఏమనగా, బాకా పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సుంఫోనియ వీణె, విపంచిక, సకల విధములగు వాద్య ధ్వనులు, మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నేజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ యెదుట సాగిలపడి నమస్కరించుడి: సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్ని గుండములో తక్షణమే వేయబడును" (దానియేలు 3:4-6).

ఈ అనుభవము యొక్క అనువాదము ఏమిటంటే బబులోను పట్టబడినప్పుడు తన నిబంధన ప్రజలైన ఇశ్రాయెలీయులను దేవుడు కాపాడుతాడు. ఇది అనువాదము ముఖ్య అన్వయింపు. ఇంకొక అన్వయింపు కూడ ఉంది. II తిమోతి 3:16-17 చెప్తుంది "లేఖనములన్నియు దైవావేశముచే ఇవ్వబడినవి, అవి ప్రయోజనకరము" ఈనాటి క్రైస్తవులకు. దానియేలులోని ఈ పాఠ్యభాగము క్రైస్తవులు అంటే అన్వయింపు అని చెప్తుంది. బబులోనులో మిగిలిన వారందరితోపాటు ఈ ముగ్గురు హెబ్రీయులు కూడ బంగారు ప్రతిమకు మొక్కాలని చెప్పారు. అలా చేయాలని బలవంతము చేసారు, గుంపుతో పాటు వెళ్ళమన్నారు, "రాజు ఏర్పాటు చేసిన బంగారు ప్రతిమ [కు] సాగిలపడ మన్నారు" (దానియేలు 3:5).

రాజగు నేబుకద్నేజరు సాతానుకు సాదృశ్యముగా ఉన్నాడు. నూతన నిబంధన సాతానును "ఈలోక దేవత" అని పిలుస్తుంది (II కొరింధీయులకు 4:4). వంగి తనను పూజించాలని సాతాను చెప్తుంది. కాని క్రీస్తు వేరుగా ఉండాలని పిలుచుచున్నాడు. క్రీస్తు చెప్పాడు,

"ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు...మీరు దేవునికి (సిరికిని) దాసులుగా నుండనేరరు" (మత్తయి 6:24).

మీరు ఎన్నుకోవాలి. సాతాను భౌతిక వాదానికి నమస్కరించమంటుంది. దేవుడు ఆయనకు మాత్రమే మొక్కలంటాడు. దేవుడు చెప్తున్నాడు, "నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు" (నిర్గమ కాండము 20:3). అది పది ఆజ్ఞలలో ఒకటి.

ఈ ముగ్గురు హెబ్రీయులు షద్రకు, మేషకు మరియు అబెద్నేగోలు, ఎన్నుకోవలసి వచ్చింది. వారు బంగారు ప్రతిమకు మొక్కుతారా? లేక ఆ బంగారు ప్రతిమకు మొక్కడానికి నిరాకరిస్తారా? ఈ యవనస్తులకు చాలా మార్గాలున్నాయి. వారనవచ్చు, "పౌరులుగా రాజుకు మొక్కి లోబడడం మా విధియని." లేక వారనవచ్చు, "ఇది ఒక ఆకారము మాత్రమే. మా హృదయాలలో దేవుని ప్రేమిస్తున్నామని ఆయనకు తెలుసు, మేము విగ్రహాన్ని మొక్కినప్పటికినీ." వారి మొక్కి శ్రమ నుండి తప్పించుకునే వారు. బైబిలు చెప్తుంది, "మీరు ఎవరిని సేవించెదరో నేడు ఎన్నుకోండి" (యెహోషువా 24:15).

మనము "సెలవులకు" సమీపిస్తున్నప్పుడు, మీలో ప్రతి ఒక్కరు ఎన్నిక చేసుకోవాలి. మీరు సాతానుకు లోబడతారా, లేక దేవునితో సత్యంగా ఉంటారా? క్రిస్మస్ రోజు గుడిలో ఉంటారా, లేక లాస్ వేగాస్ కు పారిపోతారా? కొత్త సంవత్సరము రోజు గుడిలో ఉంటారా, లేక సందడికి పారిపోతారా? అమెరికా భౌతిక వాదము అనే బంగారు ప్రతిమకు మొక్కుటారా, లేక దేవుని ప్రజలతో గుడిలో ఉంటారా? ఇలా చెప్పినందుకు బలహీన నూతన సువర్తికులచే చాలా ఎక్కువగా విమర్శింప బడ్డాను. నేను చాలా కచ్చితంగా ఉన్నానని వారన్నారు. వారన్నారు దేవునికిని సిరికిని మధ్య ఎన్నుకోవడం న్యాయ బద్ధమైనది అని. దాని గూర్చి నేను మాట్లాడడం లేదని వారు మరచిపోయారు. ఆ వేర్పాటు నేను సృష్టించలేదు. క్రీస్తు చేసాడు! యేసు క్రీస్తు ప్రభువు ఇలా అన్నాడు, "ఎవడును ఇద్దరు యజమానులను సేవింప నేరడు." క్రీస్తు అన్నాడు, "మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరదు" (మత్తయి 6:24). క్రీస్తు ఇలా అన్నాడు,

"మీరు దేవుని రాజ్యమును, నీతిని మొదట వెదకుడి" (మత్తయి 6:33).

మత్తయి 6:33 ను గూర్చి సంస్కరణ పఠన బైబిలు ఇలా చెప్తుంది, "మనము దేవుని సర్వాధికారానికి ఒప్పుకొని ఆయనతో మంచి సంబంధము కలిగి ఆయనకు జీవితంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి...ఆయన కొరకు తెగించు వారికి దేవుడు వారి అవసరాలన్నీ తీరుస్తాడు" (గమనిక మత్తయి 6:33).

మీ కుటుంబము మీ నశించు స్నేహితులు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరములో మీరు ఉండకుండా లాగుతూ ఉంటారు. లాస్ వేగాస్ కో, శాన్ ప్రాన్సిస్కో, లేదా ఇంకెక్కడికో వెళ్ళకుండా, ఆ సమయంలో గుడిలో ఉంటే వారు మిమ్ములను "వెఱ్ఱివారు" లేదా "పిచ్చివారు" అని పిలుస్తారు! వారి విగ్రహాలకు తలవంచాలో – లేక గుడిలో దేవుని సేవించాలో మీరే నిర్ణయించుకోవాలి! మీరే నిర్ణయించుకోవాలి!

చైనీయ సంఘములో నూతన సంవత్సరము దినమున సహోదరి సహోదరులతో ఉండడానికి ప్రయత్నిస్తే నా తండ్రి పిచ్చిగా నా మీద అరిచేవాడు. అతనరిచేవాడు, "నీ కుటుంబముతో కాకుండా ఆ చైనీయ వారితో నూతన సంవత్సర దినాన ఎందుకు గడుపుతావు?" నేను వాదించే వాడిని కాదు. క్రిస్మస్ నూతన సంవత్సర దినాలలో గుడిలోనే ఉంటూ ఉండేవాడిని. నాతో గుడికి రావాలని అతనిని ఆహ్వానించే వాడిని. అతడు తిరస్కరించినప్పుడు నాలో నేననుకునే వాడిని, "నీవే కుటుంబాన్ని విడదీస్తున్నావు! నీవే నాతో గుడికి రావడానికి నిరాకరిస్తున్నావు!"

చూడండి, ఆ వైఖరి నామకార్ధాపు క్రైస్తవునికి నిజమైన క్రైస్తవునికి మధ్య తేడా తెలియచేస్తుంది! మీతో నూతన సువర్తికులకు పరిచయాలు ఉంటే, వారి మతము ఒక రాజీ అని తెలుస్తుంది – సాతానుతో రాజీ! మా గుడిలో ఉండే యవ్వనులైన అసలైన క్రైస్తవులను మీరు పెళ్లి చేసుకోవడం అసాధ్యము. వారు అయినా తీవ్రత నుండి రాజీ అవాలి – లేక మీరైనా రాజీపడి నిజ క్రైస్తవులవాలి – నామకార్ధ (నామకహా) సువర్తికుల బదులు! మనము రాజీ పడం! కనుక, మీరు అలవాటు పడాలి – అది లేక, ఇంకొక గుడికి వెళ్ళడం! సి. ఎస్. లూయిస్ అన్నాడు, "నేను అపోస్తలత్వ పురిటనుల మధ్య, జీవించే మారిన వ్యక్తిని." కిప్లింగ్ అన్నాడు, "తూర్పు తూర్పే పడమర పడమరే, రెండు కలవవు." సువర్తీకరణ సువర్తీకరణే, ప్రాధమికత్వము ప్రాధమికత్వమే, ఆ రెండు ఎన్నడు కలవవు. మాతో వచ్చి నిజ క్రైస్తవులవండి! నూతన సువర్తీకరణము అనే మృతమైన నిరుపయోగ మతమును విడిచిపెట్టండి! విడిచిపెట్టండి! మాతోరండి నిజ క్రైస్తవులవండి.

మీకు తెలుసా, నూతన సువర్తీకరణ ఒక వ్యక్తిని నాశనము చేయడానికి ఎక్కువ సమయము పట్టదు. కొన్ని నెలలు వారితో వెళ్ళండి – వారి పాఠశాలకు వారి గుడికి – మాతో తిరిగి రావడం దేవుని అద్భుతం అవుతుంది! మాలా ఆలోచించడం ఒక మార్పు అధ్బుతం అవుతుంది! జార్జి బెర్ నార్డ్ షా అన్నాడు చిన్న మోతాదు క్రైస్తవ్యము కలిగిన వారు నిజ విషయము పొందుకోలేరు. డాక్టర్ కర్టిస్ హాట్ సన్ ఒక చిన్న పుస్తకము వ్రాసాడు, దాని పేరు "నూతన సువర్తీకరణము, ప్రాధమికత్వానికి శత్రువు." అతడు సరియే. వారు మనకు శత్రువులు. మనము వారితో మంచిగా ఉంటాం – కాని వారు మనపై దాడి చేస్తారు! ఎందుకు? ఎందుకంటే తీవ్ర క్రైస్తవ్యము, వారికి ఇష్టం ఉండదు, అందుకే! అపోస్తలత్వ నూతన సువర్తికుల మధ్య ఉన్న, మారిన వ్యక్తిని నేను! సంవత్సరాలుగా వారు, నా విశ్వాసాన్ని అఇష్ట పడి, నాకు వ్యతిరేకంగా మాట్లాడడం చూసాను! మీరు అది కూడ నేర్చుకోవాలి – నిజ మార్పు అనుభవం కావాలంటే, నిజ క్రైస్తవుడవాలంటే!

చూడండి, నూతన సువర్తికులు బైబిలు నిజంగా నమ్మరు. వారి హృదయాలు "మోసకరమైన వని దుష్టమైనవని" వారు నిజానికి నమ్మరు – అంటే యిర్మియా 17:9 నమ్మరు. ఇతరులంతా చెడ్డవారు కాదని, కనుక పరలోకానికి వెళ్తామని వారనుకుంటారు. దీని అర్ధము వారు బైబిలు నమ్మరని, "తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును" (లూకా 18:14); "దేవా, నన్ను పరిశోధించి, నా హృదయమును తెలుసుకొనుము: నన్ను పరీక్షించి, నా ఆలోచనలను తెలుసుకొనుము: నీకాయసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము" (కీర్తనలు 139:23, 24). నూతన సువార్తికులు పాపపు ఒప్పుకోలు పొందరు, ఎందుకంటే బైబిలును తీవ్రంగా తీసుకోరు. వారిని వారు క్షమించుకుంటారు; కాబట్టి మారరు. వారు కేవలము అపోస్తలత్వ పురిటన్లుగా ఉంటారు. డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ అన్నాడు, "లోకములో అతి వాస్తవ గ్రంధము బైబిలు. దేవుడు వాస్తవము, పాపము మరణము నరకము కూడ వాస్తవము, పాపమే వాటి వైపు నడిపిస్తుంది" (అర్ధరాత్రి తరువాత పుట్టుక).

ఈ యవనస్తులు నూతన సువర్తికులు కాదు. వారు అబద్ధపు, దేవుని పట్ల అవాస్తవికతల వలన విషపూరితులవలేదు. షడ్రకు, మేషాకు మరియు అబెద్నేగోలు బైబిలును నమ్మే, సిసలైన ప్రాధమికులు. దేవుని భయముతో వణికారు. దేవునికి అవిధేయులై రాజు ప్రతిమకు వంగేకంటే దేవునికి భయపడి సజీవ దహనం అవడానికి ఇష్టపడ్డారు. బైబిలు చెప్తుంది, "దేవుని యందు భయభక్తులు కలిగి యుండుట జ్ఞానమునకు మూలము" (సామెతలు 1:7). కాని నూతన సువర్తికులు దేవునికి భయపడరు. బైబిలు చెప్తుంది, "వారి కళ్ళముందు దైవ భయము లేదు" (రోమా 3:18). మీరు పరీక్ష పెట్టుకోండి. ఈ యవనస్తుల వలే దేవునికి భయపడుతున్నారా? లేక "మీ కళ్ళ ముందు దైవ భయము లేదా?" దైవ భయము లేకపోతే, మీరు కొత్త సువార్తికులు. మీరు దేవునికి భయపడాలి! బైబిలు చెప్తుంది మీరు నశించారని! అది మిమ్మును తొందర పెడుతుందా? అది రాత్రులు మిమ్మును మేల్కొలుపుతుందా, నరక భయముందా? అలా కాకపొతే మీరు నూతన సువర్తికులచే విషపూరితులయ్యారు. అది విషము! అది విషము! అది విషము! దేవుని ఉగ్రతకు భయపడాలి!

రాజు వారితో అన్నాడు, "మీరు నా బంగారు ప్రతిమకు నమస్కరింపకపొతే, అగ్ని గుండములో పడ ద్రోయ బడతారు – ఏ దేవుడు మిమ్ములను విడిపిస్తాడో చూస్తాను?" (దానియేలు 13:15).

ఈ ముగ్గురు యవనస్తులు మారిన వారు. వారు ప్రభువుకు భయపడ్డారు. ప్రభువును విశ్వసించారు. బబులోనియుల పాపానికి లోనుకా కూడదని చాలా సంవత్సరాల ముందే నేర్చుకున్నారు. దేవుని ముందు ఒంటరిగా నిలబడడం నేర్చుకున్నారు!

దానియేలు వలే ధైర్యంగా ఉండండి,
   ఒంటరిగా నిలబడడానికి ధైర్యము చెయ్యండి!
కచ్చిత ఉద్దేశము కలిగియుండ ధైర్యము కలిగి యుండండి!
   అది తెలియ పరచ ధైర్యముగా ఉండండి!
("దానియేలు వలే ధైర్యముగా ఉండండి" ఫిలిప్ పి. బ్లిస్ చే, 1838-1876).
(“Dare to be a Daniel” by Philip P. Bliss, 1838-1876).

నిలబడి పాడండి!

దానియేలు వలే ధైర్యంగా ఉండండి,
   ఒంటరిగా నిలబడడానికి ధైర్యము చెయ్యండి!
కచ్చిత ఉద్దేశము కలిగియుండ ధైర్యము కలిగి యుండండి!
   అది తెలియ పరచ ధైర్యముగా ఉండండి!

నేను ఒక యవనస్తుడను. నేను ఒంటరి వాడను! నాకు డబ్బులేదు! నాకు దన్నులేదు! డాక్టర్ గ్రీన్ నన్ను చూచి అన్నాడు, "బైబిలు తిరస్కరించే అధ్యాపకులకు జవాబు చెప్పడం ఆపకపోతే, నీవు కాపరిగా ఉండడానికి దక్షిణ బాప్టిస్టు గుడిని పొందుకోలేవు!" నేను దేవుని కొరకు ఒంటరిగా నిలబడడం నేర్చుకున్నాను. కళాశాల ముగించాను. నేను రోజుకు 16 గంటలు పని చేసాను, వారానికి ఏడు రోజులు – కళాశాలకు సెమినరీకి డబ్బు కట్టడానికి. మనష్యుల కంటే దేవునికి భయపడడం నేర్చుకున్నాను. డాక్టర్ గ్రీన్ అన్నాడు, "అధ్యాపకులకు జవాబు చెప్పడం ఆపకపోతే, నీవు కాపరిగా ఉండడానికి దక్షిణ బాప్టిస్టు గుడిని పొందుకోలేవు."

అతని కళ్ళల్లోకి సూటిగా చూచి అన్నాను, "అది అంత కష్టమైతే అది నాకు వద్దు!" నాకు అది వద్దు అంత కష్టమైతే! నాకు అది వద్దు!

దానియేలు వలే ధైర్యంగా ఉండండి,
   ఒంటరిగా నిలబడడానికి ధైర్యము చెయ్యండి!
కచ్చిత ఉద్దేశము కలిగియుండ ధైర్యము కలిగి యుండండి!
   అది తెలియ పరచ ధైర్యముగా ఉండండి!

నాకు భద్రత లేదు! నా భవిష్యత్తుకు ముగింపు అనుకున్నాను. నాలుగు సంవత్సరాల కళాశాల మూడు సంవత్సరాల సెమినరీ వ్యర్ధ పరిచానను కున్నాను. కాని నేను లెక్క చెయ్యలేదు. బైబిలు నిమిత్తము నిలబడ్డాను! కాపరిగా ఒక సంఘము దొరకక పోయినా పర్వాలేదు అనుకున్నాను! నన్ను అగ్ని గుండములో పడవేసినా, పరవాలేదు! గుడి దొరకకపోయినా పరవాలేదు!

అది అంత కష్టమైతేనాకు అది వద్దు! నేను భయపడ్డానా? అవును భయపడ్డాను! కాని నా జీవిత గాథ వ్రాయడం గతవారం ముగించాను. ఇది నా పుస్తకము శీర్షిక – అన్ని భయాలకు వ్యతిరేకంగా!

చాలామంది గొప్ప ప్రముఖ బోధకులు నా పుస్తకాన్ని సిఫారసు చేసారు. వారి మాటలు కవరుపై ఉన్నాయి! బాప్టిస్టు బైబిలు సహవాసము, గత అధ్యక్షుడు డాక్టర్ బిల్ మోన్ రో, అన్నాడు, "హైమర్స్ ఆధునిక బబులోనులో ఆధునిక దానియేలు – డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్. అతని కథ చదవండి, నా వలే ఆశీర్వాదింపబడండి!"

లూసియానా బాప్టిస్టు యూనివర్శిటి అధ్యక్షుడు, డాక్టర్ నీల్ వీవర్ అన్నాడు, – "[అతని] ఒప్పుకోలు కొరకు పోరాడా భయపడడు. అతడు డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, నా స్నేహితుడు."

రాలింగ్స్ వ్యవస్థ అధినేత, డాక్టర్ జాన్ రాలింగ్స్ కుమారుడు, డాక్టర్ హెర్ బెర్ట్ యం. రాలింగ్స్ అన్నాడు, "హైమర్స్ సిసలైన అమెరికను! దర్శన కారుడు! క్రీస్తు నిమిత్తము ఇతరులను ఉత్తేజ పరచడం అతని తపనను చూపిస్తుంది."

సాంటా ఆనా, కాలిఫోర్నియా కాపరి, డాక్టర్ చాన్ డేవిడ్ సన్, అన్నాడు, "డాక్టర్ హైమర్స్ మార్గములో ఎదురైనా అడ్డంకులు... చాలామందిని పరిచర్య నుండి దూరపరచి ఉండేవి – కాని డాక్టర్ హైమర్స్ వాటన్నింటిని అధిగమించాడు!"

రెవరెండ్ రోజర్ హాఫ్ మాన్ వ్రాసాడు, "నేను ఈ పుస్తకాన్ని చాలా ఎక్కువగా సిఫారసు చేస్తున్నాను. మీరు బోధకుడైనా కాకపోయినా, ఇది మిమ్మును ప్రేరేపించి మీ విశ్వాసాన్ని పెంచుతుంది."

డాక్టర్ రోబర్ట్ ఎల్. సమ్మర్ అన్నాడు, "సత్యానికి నిలబడ ఇష్ట పడ్డ వ్యక్తిని అభినందిస్తున్నాను, అన్ని ప్రతికూలంగా ఉన్న. రోబర్ట్ లెస్లీ హైమర్స్, జూనియర్ నిలబడ్డాడు, అతడలాంటి క్రైస్తవుడు."

సౌత్ వెస్ట్ [దక్షిణ] బాప్టిస్టు వేదాంత కళాశాల అధ్యక్షుడు, డాక్టర్ పైగ్ పేటర్ సన్ వ్రాసాడు, "భయాలన్నింటికి వ్యతిరేకంగా అనేది రోబర్ట్ ఎల్. హైమర్స్ జూనియర్ అద్భుత కథ., అతడు నమ్మకస్తుడైన సువార్త బోధకుడు. ఈ పుస్తకము చదవండి మీరు ఆశీర్వదింపబడతారు."

బాబ్ జోన్స్ యూనివర్సిటీ చాన్సలర్, డాక్టర్ బాబ్ జోన్స్ III, వ్రాసాడు, "అతని స్వీయ చరిత్ర తనను...పాత నిబంధన ప్రవక్తలా చూపిస్తుంది...నేను నా తండ్రి, డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, స్నేహితులని గర్వంగా చెప్పుకుంటున్నాం."

డాక్టర్ క్రైటన్ ఎల్. చాన్ వ్రాసాడు, "ఈ పుస్తకము చదవండి మీ విఫల భయాలు కిటికిలోనుండి ఎగిరిపోతాయి! డాక్టర్ హైమర్స్ జీవితమూ నుండి మీకు శక్తి వస్తుంది. ఈ పుస్తకము చదవండి! ఇది మిమ్మును ప్రేరేపిస్తుంది."

ఇండోనేషియా డాక్టర్ ఎడి పుర్వాన్ టో వ్రాసాడు, "దేవుడు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు అతడు ఎప్పుడు ఓడిపోడు. డాక్టర్ హైమర్స్ భయంకర యుద్ధాల నుండి బయటపడి జీవించిన నాయకుడు."

ఇలా నేను చదువుచు వెళ్ళవచ్చు, కాని ఇక చాలు. నేను నాయకుడను కాను. నేను కేవలము ఒక మనిషిని, మనిషిని, షడ్రకు, మేషాకు మరియు అబెద్నేగోల వలే. దేవునికి భయపడని మనిషిని బైబిలు తిరస్కరించే స్వతంత్రులకు తలవంచలేదు, హాలీఉడ్ కు తలవంచలేదు అది యేసుపై దాడి చేసినప్పుడు, నేను కేవలము మనిషిని రిచార్డ్ ఆలివాస్ కు గాని, లాస్ ఎంజిలాస్ టైమ్స్ కు గాని, అమెరికాలోని ఏటివి వార్తా కార్యక్రమానికి గాని భయపడను. షడ్రకు, మేషాకు మరియు అబెగ్నేగోల వలే, ఒక మనిషిని మాత్రమే!

మేము మీకు ప్రత్యుత్తరమియ్య పనిలేదు. కనుక, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్ని గుండము నుండి విడిపించగల సమర్ధుడు, రాజా, నీ చేతి నుండి తప్పించగలడు. కాకపోయినను (హ! హ! – అంతే!). "అయినను, ఓ రాజా, మేము, మీ దేవతలను పూజింపము, నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు సాగిలపడము." మాన్యుల్ మెన్సియా ఒక పలక ఇచ్చాడు, గుడిలో ఆఫీస్ లో బల్ల మీద ఉంది. దానిపై మన బబులోను నాయకులను గూర్చి మెన్సియా ఈ మాటలు చెప్పాడు, అవకపోయినను! దేవుడు మమ్ములను విడిపించగలడు. అవకపోయినను – ఒకవేళ మేము కాల్చబడినను, "మీ దేవతలను పూజింపము, నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు సాగిలపడము."

నా ప్రియ యవ్వన స్నేహితులారా, చాలాసార్లు నా బోధ మీరు విన్నారు. మిమ్మును బట్టి గర్వ పడుతున్నాను! నేనెక్కడికి వెళ్ళినా రక్షింప బడిన మిమ్మును బట్టి నేను హర్షిస్తున్నాను. కాని మీలో కొందరు ఇంకా రక్షింప బడలేదు. మీరు నూతన సువర్తికత్వపు గొలుసులు విసిరివేయాలి! మీరు యేసు నొద్దకు రావాలి. మీ కొరకు మరణించిన రక్షకునిపై ఆనుకోవాలి. యేసుపై ఆనుకోవాలి. ఆయన మిమ్మును రక్షిస్తాడు. ఆయన మీ పాపము క్షమించి నిత్య జీవము అనుగ్రహిస్తాడు. మీరనవచ్చు, "ఆయన నన్ను రక్షింపక పోవచ్చు." మీ యవన హెబ్రీయ నాయకుల మాటలతో జవాబిస్తున్నాను, "అవకపోయినను, తెలియనివ్వండి, సాతానుకు, మేము మీ దేవతలను పూజింపము, మమ్ములను శోధించడానికి నీవు నిలబెట్టిన భౌతిక శాస్త్ర బంగారు ప్రతిమకు మేము సాగిలపడము!"

వాళ్ళకంత నమ్మకం ఎలా వచ్చింది? వారిని వారు నమ్ముకొని ఉంటే వారు ఎంత బలహీనులో సాతాను వారికి గుర్తు చేసి ఉండేది. కాని వారు వారి శక్తిని గాని సమర్ధతను గాని నమ్మలేదు. వారు క్రీస్తును విశ్వసించారు (ఆయన వారితో పాటు అగ్నిగుండములో ఉన్నాడు). "క్రీస్తును నమ్మండి," మీరనవచ్చు, "అదేనా నాకు అవసరము?" అవును, అదే మీకు అవసరము. నాకు తెలుసు, చాలా సమయాలలో నాకు వేరేదేమి లేదు నమ్మడానికి! నాకు బలహీనంగా నిస్సహాయంగా అనిపించింది. కాని క్రీస్తు ఎల్లప్పుడూ నన్ను రక్షించాడు, నా బలహీనతలో కూడ. ప్రతి బలహీనతలో శోధనలో క్రీస్తు నన్ను భద్ర పరిచాడు. గొప్ప స్పర్జన్ అన్నాడు, "మీరు క్రీస్తును నమ్మి నశించిపోతే, నేను కూడ మీతో పాటు శిక్షింపబడతాను. నా రక్షణా నిరీక్షణ క్రీస్తు నందే ఉంది. నేను యేసును నమ్ముతాను ఆయన నాశక్తి నా రక్షణ." మీరనవచ్చు, "ఆయన నన్ను రక్షింపక పోవచ్చు." అది సాతాను. వాడి మాట వినవద్దు! ఆయన విశ్వసించిన ఏ ఒక్క ఆత్మను యేసు నశింప చేయలేదు. యేసునునమ్ముకున్న ఏ ఒక్క వ్యక్తిని కూడ నశించి పోలేదు! అలా ఆయన ఎన్నడు చేయడు.

ఆయనను విశ్వసించడం అంటే ఏమిటి? అది రాత్రి పడుకోవడం లాంటిది. నన్ను పట్టుకున్న మంచాన్ని నమ్ముతాను. దాని మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటాను. యేసును విశ్వసించడం అదే. క్రీస్తుపై వాలండి. ఆయనను నమ్మండి "ప్రతి తుఫాను పరిస్థితిలో." ఆయనను నమ్మండి "మీ ఆత్మ మార్గాన్ని చూపిస్తున్నప్పుడు." "నేను మధుర ఆకారాన్ని నమ్మడానికి ధైర్యము చెయ్యను, కాని యేసు నామముపై ఆనుకుంటాను." యేసుపై ఆనుకోండి. రాత్రి మంచముపై పండుకొనునట్లు ఆయనపై ఆనుకోండి. ఆ మంచము మిమ్ములను పడవేయదు. యేసు మిమ్ములను ఓడిపోనివ్వడు. రాత్రి మంచమును నమ్మినట్టు ఆయనను నమ్మండి. అతి చెడ్డ సమయాలలో కూడ, ఆయన మీకు ఊతము ఇస్తాడు. అనుభవము ద్వారా నాకు తెలుసు. "అయినను, రాజా, నీకిది తెలియచేస్తున్నాము, మేము మీ దేవతలను పూజింపము, నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు సాగిల పడము." క్రీస్తును విశ్వసించండి! క్రీస్తును విశ్వసించండి! నిన్ను రక్షించడానికి ఆయన శ్రమపడి నీ స్థానములో మరణించాడు. ఆయనను విశ్వసించండి ఆయన మీకు జీవితంలోని "ప్రతి తుఫాను పరిస్థితిలో కూడ" ఊతమును ఇస్తాడు! ప్రతి శోధనలో మరియు భయములో. ప్రతి పరిస్థితిలోను, మరణములో కూడ, యేసు మిమ్ములను ఓడిపోయేలా చేయడు!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"దానియేలు వలే ధైర్యముగా ఉండండి" (ఫిలిప్ పి. బ్లిస్ చే, 1838-1876).
“Dare to be a Daniel” (by Philip P. Bliss, 1838-1876).