Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




హేరోదు మరియు యోహాను

HEROD AND JOHN
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, నవంబర్ 12, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, November 12, 2017

"యోహాను నీతిమంతుడను పరిశుద్ధుడునగు, మనష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను: మరియు అతన మాటలు వినినప్పుడు, ఏమి చేయను తోచక పోయినను, సంతోషముతో విను చుండెను" (మార్కు 6:20).


బైబిలులో చరిత్రలో రాజైన హేరోదు మరియు బాప్తిస్మమిచ్చు యోహానుల కథ ఎంతో విషాద నీయమయినది. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రేరేపిత యవ్వన సువార్తికుడు. సంకుచిత, బలహీన మనస్సుగల, సార్వ భౌముడైన రాజైన హేరోదుపై – అతడు జాలిపడ్డాడు. అతడు యోహానుకు విధేయుడవాలనుకున్నాడు. దేవునితో సమాధానము కలిగి ఉండాలనుకున్నాడు. కాని అతని బలహీనత అనిశ్చత అతని నాశనానికి నడిపించాయి – బాప్తిస్మ మిచ్చు యోహాను మరణానికి కూడ, ఎందుకంటే చివరిలో హేరోదు యోహాను తలను తెగ నరికించాడు!

రాజైన హేరోదును గూర్చి చదివినప్పుడు అతని గూర్చి నేను చింతిస్తాను. అతని మీద కోపము వస్తుంది. అతడు అలాంటి అవివేకి. రక్షింప బడడానికి చాలా సమీపంగా వచ్చాడు. అయినను రక్షింప బడలేదు. మార్పు నొందడానికి చాలా సమీపంగా వచ్చాడు. అయినను అతడు నరకానికి వెళ్ళిపోయాడు. నేను హేరోదును గూర్చి ఆలోచించేటప్పుడు గ్రిఫిత్ పాడిన పాట నాకు గుర్తుకు వస్తుంది,

నమ్మడానికి చాలా ప్రయత్నించాను;
పొందుకోవడానికి క్రీస్తును వెదికాను;
చాలా అనేది పొందుకోలేదు, చాలా అనేది విఫలమవుతుంది!
విచారము, విచారము ఆ విలాపము, చాలా వరకు కాని నశించాను!
("చాలా ప్రయత్నించాను" ఫిలిప్ పి. బ్లిస్ చే, 1838-1876).

చాలా ప్రయత్నించాను! విచారము, విచారము ఆ విలాపము –
చాలా వరకు కాని నశించాను!

హేరోదు బాప్తిస్మమిచ్చు యోహానుల కథ చాలా గొప్ప క్రైస్తవ సత్యాలను చూపిస్తుంది.

మొదటిది, రక్షణ సువార్త నీవు ఒక నిర్ణయము తీసుకోవాలని పిలుస్తుంది. మనకు "నిర్ణయము" అనే పదము చెడుగా అనిపిస్తుంది – "నిర్ణయత్వముగా." కాని "నిర్ణయత్వము" చెడ్డది ఎందుకంటే చాలా మంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు! హేరోదు సరియైన నిర్ణయము తీసుకోవలసి ఉంది. కాని అతడు ఊగిసలాడాడు – బాప్తిస్మమిచ్చు యోహాను బోధించిన సత్యానికి నిలువ బడలేక పోయాడు. యోహాను బోధలో అతి విశిష్ట విషయము నిర్ణయము తీసుకొనడం. అతడు పశ్చాత్తాపమును గూర్చి బోధించాడు అతని బోధ విన్నవారు ఒక నిర్ణయము తీసుకోవాలని చెప్పాడు. అతడు చాలా శక్తివంతముగా బోధించడం వలన ప్రజలు, "మేము ఏమి చెయ్యాలి?" అని మోర పెట్టారు (లూకా 3:10). క్రీస్తు వచ్చినప్పుడు కూడ ఆ ప్రకారమే బోధించాడు. అతడు ప్రజలకు రెండు ఎంపికలు ఇచ్చాడు. పరలోకము లేక నరకము, నాశనానికి విశాల మార్గము జీవానికి ఇరుకు మార్గము. ఇసుక మీద కట్టబడిన ఇల్లు బండమీద కట్టబడిన ఇల్లు. దేవుడు లేక పిశాచి. ప్రజలు ఎంచుకోవాలి, క్రీస్తు కొరకు లేక ఆయనకు వ్యతిరేకముగా. ఆయన కొరకు లేక ఆయనకు వ్యతిరేకముగా నిర్ణయము తీసుకోవాలని క్రీస్తు బోధించాడు. అదేవిధంగా పేతురు పెంతెకోస్తు దినాన బోధించిన విధంగా ఉంది. వారు ఒక నిర్ణయము తీసుకోవాలని పేతురు నొక్కి చెప్పాడు. ప్రజలు స్పందించారు, "మేమేమి చేయవలెను?" (అపోస్తలుల కార్యములు 2:37) అని అడిగారు. అపోస్తలుల కార్యములు ఆఖరి అధ్యాయములో పౌలు బోధ ప్రజలను రెండు గుంపులుగా విడదీసింది. "మాట్లాడినవి కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు" (అపోస్తలుల కార్యములు 28:24). వారు ఒక నిర్ణయము తీసుకోవాలి! క్రైస్తవ చరిత్ర అంతటిలో ప్రతి ఉజ్జీవములో దైవ జనులు అలాగే బోధించారు. అది విన్నవారు ఒక నిర్ణయము తీసుకోవాలి!

ఈనాడు మనం వేరే రకము బోధ వింటున్నాము. నొక్కి చెప్పడం లేదు. కొంతమంది బోధకులు ప్రజలను స్వస్థపడాలని తియ్యగా చెప్తారు. కొంతమంది చక్కని ఆదరించే కథలు చెప్తారు. కొంతమంది రక్త నెరవేర్పు లేని నిర్జీవ బైబిలు వివరణలు ఇస్తుంటారు. అగ్ని ఎక్కడ ఉంది? సవాలు ఎక్కడ ఉంది? అందుకే యవనస్తులు మన సంఘాలు విడిచి వెళ్ళిపోతున్నారు! నేటిబోధ బకెట్ లో వేయబడిన ఉమ్మిలా ఉంది – వేరే సందర్భములో ఉపాధ్యక్షుడు జాన్ నాన్స్ గార్నర్ (1933 – 1941) ఇలా చెప్పాడు. అలాంటి నిరుపయోగ బోధను హేరోదు బాప్తిస్మమిచ్చు యోహానుల కథ చూపిస్తుంది. ఒక నిర్ణయము తీసుకోవాలని క్రీస్తు పిలుస్తున్నాడని ఇది గుర్తు చేస్తుంది. అవునట్టు, నీవు ఒక నిర్ణయము తీసుకున్నావా? అది నీ జీవితాన్ని ప్రభావితం చేసిందా? అది నిన్ను మార్చిందా?

హేరోదు "అతను చెప్పింది సంతోషంగా విన్నాడు." హేరోదు బోధకుని ఇష్టపడ్డాడు. ఆయన బోధను ఇష్టపడి విన్నాడు. కాని అది అతనిపై ప్రభావము చూపలేదు. నేను బాగా బోధించాను అని ప్రజలు చెప్పడం నాకు ఇష్టము ఉండదు. అందులో నాకు ఏమాత్రము ఆనందము లేదు. పాపమును బట్టి పశ్చాత్తాప పడి యేసు కృపపై ఆధారపడిన వారిని చూస్తే నేను సంతోషిస్తాను. యేసును నమ్మాలని కచ్చితమైన నిర్ణయము తీసుకొని జీవితములో మార్పు నొందిన వారిని చూస్తే నేను సంతృప్తి పడతాను. దేవుడు నా బోధను దీవించాడు అనడానికి అది ఒక పరీక్ష! మీరు ఆనందిస్తున్నారా అది కాదు. మీరు కలవరపడుతున్నారా అది కూడ కాదు, మీరు నన్ను ఇష్టపడ్డారా నా బోధ ఇష్టపడ్డారా అది కూడ కాదు. ఇది పరీక్ష – ఒక నిర్ణయానికి అది నన్ను నడిపించిందా, నీ హృదయ మంతటితో నీ జీవితమంతా క్రీస్తును నమ్మడం అనే నిర్దిష్ట నిర్ణయము తీసుకోవడం? ఒకతనన్నాడు, "వారికి ఇంకేమి కావాలి?" మీ జీవితమంతా క్రీస్తు కోరుతున్నాడు – జీవితమంతా!

కాని హేరోదు లాంటి వారిలో ఒక విచార విషయము ఉంది. చాలా వరకు నిర్ణయించు కున్నాడు. అతడు క్రీస్తును వెంబడించి నిజ క్రైస్తవుడవాలని ఆశించాడు. హేరోదు లాంటి వారి విషయము ఎంత విచారము దుర్భరము. మీరు గుడికి వస్తారు. మా బోధ వింటారు. మీరు భావోద్రేకులవుతారు. యేసును విశ్వసించాలనుకుంటారు. ఆయనను నమ్మలనుకుంటున్నాము అని చెప్తారు. కాని అలా చెయ్యనే చెయ్యరు. యేసును విశ్వసించే బదులు అలాంటి భావము పొంద ప్రయత్నిస్తారు. అది ఎన్నడు జరగదు! ఎన్నడు! ఎన్నడు! ఎందుకు జరగదు? ఆయనను నమ్మకుండా ముందు ఆయనను నమ్మాము అనే "భావన" అది ఎలా మీకు కలుగుతుంది? అది పిచ్చితనము! ఒక భావన కాకుండా ఆయనను నమ్మడం ఒకటే మార్గము. యేసును నమ్మడానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. కాని మీరు ఎన్నడు చెయ్యరు. మీరు వింతైన వారు. ప్రతి ఆదివారము వస్తారు. కాని రక్షకుని నమ్మడానికి నిరాకరిస్తారు. ఆరాధన తరువాత మమ్ములను కలుస్తారు కూడ – అని ఆయనను విశ్వసించే ఉద్దేశము మీకు ఉండదు. నేనడుగుతాను, "మీరు ఆయనను నమ్మరా?" మీరంటారు, "లేదు" అని. "లేదు" అని గట్టిగా చెప్తారు – కచ్చితంగా మీకు చాలా తెలిసినట్టు. మీరెందుకు అంత కచ్చితంగా ఉన్నారు? ఎందుకంటే ఒక బావము కొరకు మీరు చూస్తున్నారు! అది కారణము! కాని నన్ను మీతో యదార్ధంగా ఉండనివ్వండి. మీరు కోరుకునే "భావన" ఒక దెయ్యము! మీ మనసు ముందు సాతాను ఆ దెయ్యాన్ని ఉంచుతుంది. "ఆ భావన నాకు తప్పక కావాలి! అది ఎలాగైనా కావాలి! భావన అనే దెయ్యము లేకుండా నేను ఎన్నడు తృప్తి చెందలేను!" నీవు దెయ్యము ఆధీనంలో ఉన్నప్పుడు, దానిని కట్టడలో ఉన్నప్పుడు – వాడు నీకు ఒక భావన మాత్రము ఇస్తాడు! దాని ఆకర్షణలో పడి నీవు ఎన్నడు రక్షింప బడలేవు! "భావన" అనే దెయ్యము నీ మధుర హృదయము గాను, నీ ప్రేమికుని గాను, నీ విగ్రహములాగా ఉంటుంది. అది నీకు సంభవించినప్పుడు, నిన్ను రక్షించడానికి శిలువపైన మరణించిన, నిజమైన యేసును నమ్మలేవు అనే బలమైన ఉద్దేశములో ఉండిపోతావు! "భావన" అనే దెయ్యము నిన్ను క్రిందికి, బందీగా, బానిసగా, నరకములోనికి లాగుతుంది. "భావన" అనే దయ్యము నిన్ను చూచి నవ్వుతున్నట్టు నేను వింటున్నాను! "నిన్ను పొందుకున్నాను! నిన్ను పొందుకున్నాను! నీవు నిత్యమూ నరకములో నా బానిసగా ఉంటావు!" నవ్వకండి. లక్షలాది మంది వారిలో పరిశుద్ధాత్మ ఉందనుకుంటారు – కాని నిజానికి వారిలో దయ్యము ఉంటుంది. ఆత్మతో నింపబడే బదులు, దయ్యము పట్టిన వారవుతారు! మీరు రక్షింపబడ్డారని భావన కలిగిన వారిని నేను హెచ్చరిస్తున్నాను – నేను మిమ్మును హెచ్చరిస్తున్నాను! రహస్యమైన దానితో మీరు ఆటలాడుతున్నారు! అగ్నితో చెలగాట మాడుతున్నారు! "భావన" దెయ్యాన్ని వదిలించుకోండి యేసుపై ఆనుకోండి, యేసు దైవ కుమారుడు, ఆయన నిన్ను రక్షించడానికి రక్తము కార్చి సిలువపై మరణించాడు!

కొంతమంది బోధకులు బానిసత్వానికి మూల కారకులవుతారు. నాకు తెలుసు కొంతమంది బోధకులు ప్రజలను ఆకట్టుకొని, రక్షణ వాగ్దానమిచ్చి, దెయ్యము పట్టిన వారుగా ఉంటారు. వారు క్రీస్తుకు కాక వారికి అనుచరులుగా చేసుకుంటారు. నేను ఎట్టి పరిస్థితులలోను బాప్తిస్మమిచ్చు యోహానును వారి జాబితాలో పెట్టను.

హేరోదు యోహానును చెరసాలలో వేయించాడు, ఎందుకంటే అతని భార్య హేరోదుయ తనను వ్యభిచారుని అన్నాడని యోహానును అసహ్యించుకుంది. బైబిలు చెప్తుంది "యోహాను నీతిమంతుడు, పరిశుద్దుడు అని ఎరిగి హేరోదు అతనికి భయపడ్డాడు." అతడు యోహానును పరిశుద్ధినిగా చూసాడు. అందుకు హేరోదు యోహానును చూడడానికి పదే పదే జైలుకు వెళ్ళాడు. వాక్య భాగము చెప్తుంది "అతనికి భయపడ్డాడని." అంటే హేరోదు "జాగ్రత్తపడ్డాడు." యోహాను పరిశుద్ధుడు అతడు వేరు అని హేరోదుకు తెలుసు. అతడు "[యోహాను] చెప్పింది సంతోషంగా విన్నాడు." పరిశుద్ధుని ఆరాధించు వారి వలే అతడన్నాడు. సెయింట్ అగస్టీన్ వలే పరిశుద్ధుడు, దైవజనునికి వారికి తెలుసు. వారు పరిశుద్ధిని మాటలు చదివి ధ్యానిస్తారు, కాని క్రీస్తును నమ్మరు, అగస్టీన్ లాంటి వారు చెప్పినప్పటికినీ. కేథలిక్కులు పరిశుద్ధుని చూచినట్టు హేరోదు యోహానును చూసాడు. "అతడు తానూ చెప్పినది సంతోషంగా విన్నాడు." కాని అది అతనికి సహాయపడలేదు!

హేరోదు చెరసాలలో యోహానును చూడడానికి వెళ్ళేవాడు. ఇది తన భార్యకు ఇష్టము ఉండదని తెలుసు. అయినను వెళ్ళేవాడు. అక్కడికి చేరేవాడు. ఏదో కాదనలేదు, తనను అక్కడికి నడిపించేది. యోహాను దగ్గరకు వెళ్ళినప్పుడు, "అతడు చెప్పింది సంతోషంగా వినేవాడు." ప్రవక్త చెప్పేది వినడానికి పరిశుద్ధాత్మ అతనిని నడిపించేది. అదే కారణముతో చాలామంది గుడికి వస్తుంటారు. గుడికి ఉండడానికి ఇష్టపడతారు, ప్రసంగము వారిని ఖండిస్తున్నా సరే. కాని వారు క్రీస్తుకు లోబడరు. హేరోదు మార్పు చేరువకు వచ్చాడు. కాని ఎన్నడు మారలేదు. తరువాత ఎందుకు హేరోదు బాప్తిస్మమిచ్చు యోహాను తల తెగ కొట్టించాడు? ఈ మనష్యుడు, హేరోదును మనం ఎలా అర్ధం చేసుకోగలము?

యోహాను బోధ ద్వారా హేరోదు దేవుని సన్నిధిని శక్తిని అనుభవించాడు. యోహాను సరియే అని అతనికి తెలుసు. అయినను క్రీస్తుకు లోబడలేదు. యోహాను తనకు బోధిస్తున్నది అర్ధం చేసుకున్నాడు. అయినను అతడు క్రీస్తును నమ్మలేదు. అతడు నేర్చుకుంటూ ఉన్నాడు, కాని యేసును నమ్మాలని నిర్ణయించు కోలేదు. తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. చెడ్డ స్త్రీ అయిన హీరోదియ నుండి అతడు వేరు అవాలి. జీవితంలో కొన్ని విషయాలు మార్చుకోవాలి. చాలామంది యవనస్తులు అలానే ఉన్నారు. వారు గుడికి రావడానికి తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు, కాని మేము బోధించే దానితో పూర్తిగా ఏకీభవించరు. మేము చాలా కచ్చితంగా ఉన్నామని వారనుకుంటారు. వారి పిల్లలు గుడికి వస్తారు – కాని వారు లాగబడతారు. మీ విషయంలో కూడ అది నిజమా? మేము చాలా కచ్చితమని మీ తల్లిదండ్రులు భావిస్తున్నారా? వారు రాణిస్తారు, కాని మేము మీతో మాట్లాడితే వారు విమర్శిస్తారు. గుడిలో ఎక్కువ సమయము గడప కూడదని చెప్తారు. వారంటారు, "ఇక్కడ ఇంతసేపు ఉండాలా?" కనుక మీరు మీ తల్లిదండ్రులకు ఈ గుడికి మధ్య నలిగిపోతున్నారు. మేము సరి అని మీకు తెలుసు, కాని మీ తల్లిదండ్రులను సంతోష పరచాలనుకుంటారు. మీ క్రైస్తవేతర తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, మాతో నిలబడడానికి మీరు భయపడతారు. యేసు చెప్పినది వారు మర్చిపోతారు, "నాకంటే తన తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించు వాడు నాకు యోగ్యుడు కాదు" (మత్తయి 10:37). హేరోదు క్రైస్తవుడవాలనుకున్నాడు, కాని హేరోదును సంతోష పెట్టాలనుకున్నాడు. బైబిలు చెప్తుంది, "ద్విమనస్కుడు అన్ని విషయాలలో అస్థిరుడుగా ఉంటాడు" (యాకోబు 1:8). డాక్టర్ చార్లెస్ సి. రైరీ అన్నాడు, "ద్వి మనస్కుడు విడదీయబడిన మనసు [కలవాడు]" (రైరీ పఠన బైబిలు). హేరోదుది అదే తప్పు కాదా? అతడు క్రైస్తవుడవాలనుకున్నాడు, హీరోదియను సంతోష పెట్టాలనుకున్నాడు. అతడు ద్విమనస్కుడు. కనుక నిజ క్రైస్తవుడు కాలేకపోయాడు.

అలాంటి అమ్మాయిని ఈ మధ్య చూసాము. ఆమె తన క్రైస్తవేతర తల్లిదండ్రులను సంతోష పెట్టాలనుకుంది. క్రైస్తవురాలిగా ఉండాలనుకుంది కూడ. తానూ పూర్తిగా యేసు నొద్దకు రావాలి అనుకునే వరకు తానూ నలిగిపోతుంది. ఆమె తల్లిదండ్రులకు వ్యతిరేకంగా క్రీస్తు వైపుకు వచ్చింది. అలా చేసిన మారు క్షణమే తానూ మార్పు నొందింది. ఆమె యేసును తన జీవితానికి ప్రభువుగా చేసుకుంది. తికమక అంతా పోయి ఇప్పుడు ఆమె మంచి క్రైస్తవురాలు. కానీ హేరోదు బాప్తిస్మమిచ్చు యోహాను హేరోదియల మధ్య నిర్ణయించు కోలేక పోయాడు. కాబట్టి నిజ క్రైస్తవుడు కాలేకపోయాడు. చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. బైబిలు చెప్తుంది, "మీరు ఎవరిని సేవించాలో ఈరోజు ఎన్నుకోండి" (యోహోషువ 24:15). మీరు నశించిన తల్లిదండ్రులు క్రీస్తు మధ్య ఎన్నిక చేసుకోవాలి. మీ నశించు స్నేహితులు క్రీస్తు మధ్య ఎన్నిక చేసుకోవాలి. రక్షింపబడడానికి క్రీస్తు కొరకు తేటయైన సాక్ష్యము కలిగి యుండడానికి వేరే మార్గము లేదు. హేరోదు వలే ఊగిసలాడకండి. క్రీస్తును సంఘమును ఎన్నుకోండి. తేటయైన నిర్ణయము తీసుకోండి. "ఎవరిని సేవించాలో ఈ దినము ఎన్నిక చేసుకోండి." "ద్వి మనస్కుడు అన్ని విషయాలలో అస్థిరుడుగా ఉంటాడు" (యాకోబు 1:8). యేసు అన్నాడు, "తన తల్లిదండ్రులను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాదు" (మత్తయి 10:37).

యోహాను బోధ హేరోదు విన్నాడు "అతనిది విని, చాలా విషయాలు చేసాడు." అవును, చాలా విషయాలు చేసాడు. అవును, అన్ని కాని ఒక విషయము చాలా ప్రాముఖ్యము. సందేహము లేదు అతడు కొన్ని పాపాలు విడిచి పెట్టాడు. అవును, "అతడు చాలా విషయాలు చేసాడు," కాని యోహాను చెప్పిన ఒక పని చెయ్యలేదు. అతడు క్రీస్తును విశ్వసించలేదు! నీకు క్రైస్తవుడ వడానికి అది కారణము కాదా? చాలా వరకు, కాని నశించి పోవడం! "చాలా విషయాలు" సరిపోవు. ఒక యవన స్త్రీ చెప్పింది, "వారికీ ఇంకా ఏమి కావాలి?" ఆమె ఇలా అని ఉండాల్సింది, "ఇంకా దేవునికి ఏమి కావాలి?" డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ ఈ ప్రసంగము చేసాడు, దానిని నేను తీసుకొన్నాను. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఏది మిమ్మును వెనుకకు నెట్టుతుంది? పరీక్షించుకోండి. జ్ఞానవంతలుగా ఉండండి! ‘చాలా విషయాలు’ [సరిపోదు]. దేవుడు మీ పూర్తి సమర్పణ కోరుతున్నాడు, [కేవలం] కొన్ని పాపాలు విడిచి పెట్టడం కాదు మీ పూర్తి ఇష్టాన్ని ఇవ్వాలి," మీ జీవితమంతా క్రీస్తుకు సమర్పించాలి! (D. Martyn Lloyd-Jones, M.D., “Missing the Mark”).

ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను. 24వ వచనంలో, హీరోదియ బాప్తిస్మమిచ్చు యోహాను తల కావాలని తన కుమార్తెతో చెప్పింది. హేరోదు చాలా విచార పడ్డాడు, కాని "తనతో కూర్చున్న వారి నిమిత్తము, ఆమెను తిరస్కరింప లేకపోయాడు" (మార్కు 6:26). ఓ, ఇక్కడ ఉంది – తన పరువు ఇతరుల మంచి అభిప్రాయము. వీరు తప్పని తన హృదయములో తెలుసు. ఇంకొక వైపు, అతడు యోహానును పోగుడుతున్నాడు అతడు సరియే అని. అయినను పాపులను పట్టించుకోని యోహాను బోధను తిరస్కరించాడు. అతడు నిత్య రక్షణను విడిచి నరకానికి పోయాడు ఎందుకంటే ప్రజలు ఏమి అనుకుంటారో అని భయపడ్డాడు. ఓ, అది పిచ్చి తనము! ప్రపంచమంతా నవ్వి మిమ్మును పరిహసించినా, మీ కుటుంబమంతా మీకు మత పిచ్చి ఉందని చెప్పనా, ప్రతి ఒక్కరు మిమ్ములను బుద్ధిహీనుడని పిలిచినా ఏదీ తేడా చూపిస్తుంది – మీరు దేవునిచే అంగీకరింపబడితే చాలు? ఆయన మాత్రమే తీర్పు తీర్చువాడు!

దేవుడు చెప్పింది చెయ్యండి. ఆయన కుమారుడైన యేసును నమ్మండి. మీ కుటుంబానికి స్నేహితులకు, ప్రపంచానికి చూపించండి, మీరు ఈ మాలిన ప్రపంచము నుండి తిరిగి పోయారని – మీ పూర్తి జీవితాన్ని యేసు క్రీస్తుకు సమర్పించారని!

ఒక్కసారి క్రీస్తు సరి అని నిజమని తెలుసుకుంటే ఆయనకు పూర్తిగా సమర్పించుకుంటే తప్ప నీకు మనశ్శాంతి ఉండదు. పాపం హేరోదు! యోహాను తల తెగ నరికించిన తరువాత అతని జీవితం ఎంత భయంకరమైనది! యోహాను వెంటాడి తన జీవితాన్ని చిత్రహింసలు పెట్టాడు. హేరోదు యేసును గూర్చి విన్నప్పుడు, అతడు మృతులలో నుండి లేచిన, యోహానును అనుకున్నాడు. యోహాను కలలలో అతనిని కలవార పెట్టాడు! యోహాను తల ఉంచబడిన పల్లెము తన ముందుకు రావడం అతడు కలలో చూసాడు. మీరు నిజమను తిరస్కరించినా అది మీ నుండి వెళ్ళిపోదు. అది నిత్యమూ మిమ్ములను వెంటాడుతూ ఉంటుంది. అది మీకు విశ్రాంతి నెమ్మది ఇవ్వదు. హేరోదు యోహానును గూర్చి భయంకర కలలు కన్నాడు – "ఓ, యోహాను, నేను నీ మాట ఎందుకు వినలేదు? ఓ, యోహాను, నేను నా ఆత్మను ఎందుకు పారవేసుకున్నాను? ఓ, యోహాను, వారు నా గురించి ఏదో అనుకుంటారని ఎందుకు భయపడ్డాను? ఓ, యోహాను, నేను ఎంత అవివేకిని."

యోహను తల నరికించిన తరువాత హేరోదు జీవితమూ ఊహించండి. అది నీ జీవితంగా ఉంటుంది, ఇంకా ఘోరంగా నీవు లోకమును విడిచి యేసు క్రీస్తును నమ్మి, నిన్ను ఆయనకు సమర్పించుకో. నేను మిమ్మును భయపెడుతున్నాను అని అనినా లెక్క చెయ్యను. నేను తప్పక మిమ్ములను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. క్రీస్తు అద్భుత ప్రేమ మిమ్ములను ఆకర్షించకపోతే నేను క్రీస్తు లేని నిత్యత్వమును గూర్చి మిమ్ములను భయపెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. నిత్య నేరారోపణ, నిత్య భయంకరత్వము, చెప్పనశక్యము కాని హింస. మీరు సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తును హృదయ పూర్వకంగా హత్తుకొనకపోతే అదే మీ కొరకు వేచి ఉంది. క్రీస్తు మీ పాపము నుండి మిమ్ములను రక్షించాలి, ఆయన చేయ కనిపెడుతున్నాడు. విశ్వాసము ద్వారా క్రీస్తు నొద్దకు రండి ఏది ఏమైనను సరే – అప్పుడు మీరు రక్షింప బడతారు. వేరే మార్గము లేదు. ఆమెన్. జాన్ కాగన్, కొందరు వారి పూర్తి జీవితాలను యేసుకు ఇచ్సునట్లు దయచేసి వచ్చి ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"చాలా వరకు ప్రయత్నించాను" (ఫిలిప్ పి. బ్లిస్ చే, 1838-1876).
“Almost Persuaded” (by Philip P. Bliss, 1838-1876).