Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
కడుగుకొని శుద్ధుడవు కమ్ము! – మార్పు యొక్క విధానము

WASH AND BE CLEAN! – THE TYPOLOGY OF CONVERSION
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, అక్టోబర్ 15, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, October 15, 2017

"నీవు యోర్ధాను నదీకి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరల బాగై, నీవు శుద్ధుడవగుదువు" (II రాజులు 5:10).


ఇది సామాన్యమైన కథ. కాని లోతైన అర్ధము ఉంది. మీరు ఇంకా రక్షింపబడకపోతే జాగ్రత్తగా వినండి. మీరు స్పందించాలి. అది మీరు నిజముగా రక్షింపబడడానికి ఒకే ఒక మార్గము చూపిస్తుంది.

ఇది సామాన్యమైన కథ. నిజ క్రైస్తవుడవడానికి రక్షింపబడడానికున్న ఒకే ఒక మార్గాన్ని చూపించడానికి ఇది బైబిలులో ఇవ్వబడింది.

నామాను ఒక గొప్ప వ్యక్తి. అతడు సిరియా సైన్యానికి, సాధారణ, సైన్యాధిపతి. అతడు గొప్ప సైనికుడు. అతడు రాజుచే గౌరవింపబడ్డాడు, అతడు చాలా గర్విష్టి. కాని అతడు భయంకరమైన కుష్టు రోగముచే బ్రతికుండగా తిని వేయబడుచున్నాడు. అతడు కుష్టు రోగముతో చనిపోతాడని అతనికి తెలుసు. అన్ని విధాలుగా ప్రయత్నించాడు, కాని ఏదీ అతని కుష్టు రోగమును బాగు చేయలేదు. ఒక యవ్వన హెబ్రీయ అమ్మాయి నామాను ఇంట్లో పనిచేస్తుంది. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త అతని కుష్టు రోగమును నయము చేయగలడని ఆమె అతనితో చెప్పింది. అతడు అన్ని విధాలుగా ప్రయత్నించాడు, కాని ఏదియు అతని రోగమును స్వస్థ పరచలేదు. చివరకు నామాను అనుకున్నాడు, "బహుశా ఈ ప్రవక్త నన్ను స్వస్థ పరచగలడు అని." అది అతని ఆఖరి అవకాశము, కనుక అతడు దేవుని ప్రవక్త అయిన, ఏలీషాను చూడవచ్చాడు.

కాని ఆప్రవక్త నిజమైన దైవజనుడు. ఒకవేళ అతడు తనయింటినుండి బయటికి వచ్చి నయమాను కొఱకు ప్రార్థిస్తే, ప్రవక్తే. తనను స్వస్థ పరిచాడు అనుకుంటాడు. దేవుడు మాత్రమే స్వస్థ పరచగలడు, ప్రవక్త కాదు అనే విషయాన్ని నయమాను తెలుసుకోవాలని ప్రవక్త ఆశించాడు. కనుక నయమాన తన రథములో ప్రవక్త యింటి ద్వారము దగ్గరకు వచ్చాడు కాని ప్రవక్త తనతో మాట్లాడడానికి బయటికి రాలేదు. దానికి బదులు నయమానుకు ఒక సమాచారము పంపించాడు,

"నీవు యోర్ధాను [నదీకి] [పోయి] యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరల బాగై, నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను" (II రాజులు 5:10).

అది నయమానుకు నిజంగా కోపము రప్పించింది. "ఎందుకు, ఈ ప్రవక్త నన్ను చూడడానికి కనీసము బయటికి రాలేదు! తనను గూర్చి, ఏమనుకుంటున్నాడు?" అతడనుకున్నాడు ప్రవక్త తన దగ్గరకు వచ్చి "తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి, కుష్ట రోగమును మాన్పును అనుకున్నాడు." అతననుకున్నాడు ప్రవక్త బెన్నీ హిన్ లా ఉంటాడని. అతడు దాని నుండి ఒక ప్రదర్శన చూపించి, అతడు ఒక గొప్ప విశ్వాసముతో స్వస్థపరచువానిగా అతడు అనుకుంటాడు అని భావించాడు. కాని ఆ ప్రవక్త మహిమ అంతా దేవునికే ఇవ్వాలనుకున్నాడు. అతడు ఒక సమాచారము నయమానుకు పంపించాడు,

"నీవు యోర్ధాను [నదీకి] [పోయి] యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరల బాగై, నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను" (II రాజులు 5:10).

నయమానుకు చాలా కోపము వచ్చింది. కోపముతో అక్కడ నుండి వెనుదిరిగాడు!

అప్పుడు నయమాను దాసుడు అతనితో అన్నాడు, "ఒక వేళ ప్రవక్త ఒక గొప్ప పని చేయమంటే, నీకు చేయకుందువా? అతడు చెప్పినట్లు ఎందుకు చేయకూడదు, ‘కడుగుకొని శుద్ధుడవు కమ్ము’?" అప్పుడు నయమాను అనుకున్నాడు, "సరే, ప్రవక్త చెప్పినట్లు చేస్తాను." అతడు యోర్ధాను నదికి పోయి నీటిలో ఏడు మారులు మునిగాడు, "అతని దేహము పసిపిల్ల దేహము [వలెనై], అతడు శుద్ధుడాయెను" (II రాజులు 5:14 ).

ఈ లేఖన భాగముపై గొప్ప ప్రసంగాలు చెయ్యబడ్డాయి. స్పర్జన్ లాంటి, గొప్ప ప్రసంగీకులు, సరిగానే చెప్పారు నయమాను కుష్టరోగము కడుగబడుట సిలువపై యేసు కార్చిన రక్తముచే నీ పాపము కడుగబడుటను చిత్రీకరిస్తుంది. నయమాను కథ మీరు ఏలా రక్షింపబడాలో మీ పాపము నుండి ఎలా శుద్ధిచేయబడాలో ఈ ఉదయము తెలియజేస్తుంది అది వినండి!

I. మొదటిది, అతనికి కుష్టు రోగము కలదు.

"అతడు కుష్టు రోగి" (II రాజులు 5:1).

మీరు కూడ అంతే. మీరు పూర్తిగా పాపము కుష్టు రోగములో నిండి ఉన్నారు! మొదటి పాపి, ఆదాము నుండి పాపపు కుష్టు రోగము మీకు ప్రాప్తించింది. అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"ఒక మనష్యుడు [ఆదాము] ద్వారా పాపము మరణము లోకములో ఎలాగు ప్రవేశించునో, అలాగుననే మనష్యు లందరూ పాపము చేసినందున; మరణము అందరికినీ సంప్రాప్త మాయెను" (రోమా 5:12).

ఈ ఉదయము మీ గురించి వివరణ ఇది! డాక్టర్ వాట్స్ మీ స్థితిని ఒక పాటలో చూపించాడు,

ప్రభూ, నేను అపవిత్రుడను, పాపములో పుట్టినవాడను,
   అపరిశుద్దునిగా అపవిత్రునిగా జన్మించాను;
నేరారోపణ కలిగిన వ్యక్తి నుండి ఉద్భవించాను
   అతడు జాతిని కల్మషము చేసాడు, మా అందరిని మోసగించాడు.

ఇదిగో, మీ ముఖము ముందు నేను సాష్టాంగ పడుతున్నాను,
   మీ కృప మాత్రమే నా ఏకైక ఆశ్రయము;
బాహ్య విషయాలు నన్ను శుద్ధి చేయలేవు;
   కుష్టు రోగము లోతుగా అంతరంగములో ఉంది.

(డాక్టర్ ఐజాక్ వాట్స్, 1674-1748)
   (Dr. Isaac Watts, 1674-1748).

పాపము అనే కుష్టు రోగము "లోపల పాతుకుని" నీలో ఉంది! ఈ ఉదయాన్న అది మిమ్మును వివరించి చెప్తుంది! "పాపము అనే కుష్టు రోగము మీ లోపల పాతుకొని ఉంది"! యేసు అన్నాడు,

"లోపలి నుండి, అనగా మనష్యుల హృదయములో నుండి, దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, క్రతిమమును, కామ వికారమును, మత్సరము, దేవదూషణము, అహంభావము, అవివేకమును వచ్చును: ఈ చెడ్డవన్ని లోపలి నుండి బయలు వెళ్లి మనష్యుని అపవిత్రపరచును…" (మార్కు 7:21-23).

అది మీ హృదయపు చిత్రపటము, దురాలోచనలతో నిండి ఉంది. పాపపు కుష్టు రోగముతో మీ హృదయము నిండుకొని ఉంది!

బాహ్యపు విషయాలు [మిమ్మును] శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము లోలోపల పేరుకొని ఉంది –

కాదా? కాదా? మీకు తెలుసు! మరియు "బాహ్యపు విషయాలు [బాహ్యపు క్రియలు] మిమ్మును శుద్ధి చేయలేవు! నిర్ణయాలు ప్రార్ధనలు మిమ్మును శుద్ధి చేయలేవు! మీ కనిపించింది మీరు నేర్చుకున్నవే మిమ్ములను శుద్ధి చెయ్యలేదు! మరియు అది మీకు తెలుసు! "కుష్టు రోగము [పాపము] లోలోపల ఉంది" మీ హృదయములో! అది మీకు తెలుసు –తెలియదా?

అది నిజము మీకు తెలుసు. పాపమును బాహ్యముగా చేయకమునుపే అది మీకు తెలుసు. అది బుద్ధి పూర్వకంగా చేసారు! మీరు చేసింది మీకు బాగా తెలుసు. అది తప్పు అని తెలిసి ఎందుకు చేసారు? మీ మారని స్థితిలో మీరు చీకటిని ప్రేమించారు. మీరు పాపాన్ని అనుభవించారు. పాపము చేయడంలో సంతోషించారు. దాని రుచిని ప్రేమించారు. అది తప్పని తెలుసి కూడ దానిని ప్రేమించారు! అందుకే మీ పాపపు హృదయమును గూర్చి సత్యము వినడానికి అసహ్యించుకుంటారు! మీ చెడు హృదయాన్ని గూర్చి సత్యము చెప్పుచున్నందుకు నన్ను అసహ్యించుకుంటారు – కాదా? ఇది మిమ్మును ఖండిస్తుంది నిజము వినడం చాలా భయంకరంగా ఉంది! కుష్టు రోగము మీ లోలోపల కూరుకొని ఉంది! మీ హృదయము మెలి పెట్టబడి తప్పు తోవ పట్టింది. మంచి సరియైనది వదిలిపెట్టి మీరు పాపాన్ని అనుభవిస్తున్నారు. అపనమ్మకము దుష్ట హృదయము లోలోపల కుష్టు రోగము దాగి ఉంది! నేను కల్పించలేదు. వైద్యుడు డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ జోన్స్ చెప్పినవి మీకు చెప్తున్నాను, అతనికి మీకున్న పాపపు హృదయములను గూర్చి బాగా తెలుసు!

II. రెండవది, ఎలా కడుగబడాలో చెప్పిన ప్రవక్తను బట్టి అతడు కలవరము చెందాడు.

"వెళ్లి కడుగుకొనుము" అని ప్రవక్త చెప్పినప్పుడు అతడు కోప గించుకున్నాడు. అతనన్నాడు, "నేననుకున్నాను [ప్రవక్త నా కొరకు ప్రార్ధన చేస్తాడని]." "నేననుకున్నాను." మీరు అనుకుంటారు రక్షింపబడడానికి ఏమి చెయ్యాలో మీకు తెలుసని. "నేనుకున్నాను." మీ అబద్ధపు తలంపులను ప్రక్కకు పెట్టండి! రక్షింప బడడం విషయంలో మీరనుకుంటున్న తలంపులను వదిలేయండి. మీకు దానిని గూర్చి ఏమి తెలియదు! మూడీ అన్నాడు,

నయమానుకు తన రోగములున్నాయి – గర్వము మరియు కుష్టు రోగము. కుష్టు రోగము వలే గర్వము కూడ కడుగబడాలి. నయమాను తన గర్వము అనే రధము నుండి క్రిందికి దిగాలి; తరువాత కడుగబడాలి అని చెప్పబడ్డాడు.

అదే ఈ ఉదయాన్న మీకు జరగాలి. మీరు రక్షింపబడాలంటే అదే మీరు తప్పక చెయ్యాలి. "మీరు అనుకుంటున్నది" విడిచి పెట్టండి. మీ గర్వము రక్షింపబడడానికి మీ స్వంత తలంపులు ప్రక్కన పెట్టండి. మీకు చెప్పబడినట్లు మీరు కడుగబడాలి. "వెళ్ళి కడుగుకో...శుద్దుడవుతాడు." నశించిన పాపపు వ్యక్తిగా యేసు నొద్దకు రండి. యేసు నొద్దకు రండి సిలువపై ఆయన కార్చిన రక్తములో మీ పాపపు హృదయాన్ని ఆయన కడుగుతాడు! "ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును" (I యోహాను 1:7). "కడుగుకొని శుద్దుడవుకమ్ము!" అదే దేవుడే మీకు ఇప్పుడు చెప్తున్నాడు! "కడుగుకొని శుద్దువడుకమ్ము"!

మీ గర్వమును జయించకుండా మీరు కడుగబడలేరు. మీ హృదయము మారాలి. మీరు పశ్చాత్తాపపడకుండా క్షమించబడనేరరు. మీ హృదయము మారాలి. మీ స్వార్ధాన్ని బట్టి మీరు బాధపడాలి. రక్షింప బడాలనే భావన కావాలా. మీకు రక్షణ నిశ్చయత కావాలా. కాని మీకు మార్పు ఇష్టము లేదు. రక్షింపబడాలనుకుంటున్నారు స్వార్ధపూరిత జీవితము జీవిస్తున్నారు.

హృదయము పూర్తిగా మారాలని మార్పు చెప్తుంది. మీ స్వభావము తప్పు. మీ హృదయమే తప్పు. మీ స్వభావము రాటు తేలిపోయింది. మీలో మార్పు విప్లవాత్మకంగా ఉండాలి మిమ్మును మీరు చంపుకొని పూర్తిగా నూతన జీవితంతో తిరిగి జన్మించాలి, ఆ జీవితమూ మిమ్మును కాకుండా దేవుని సంతోష పరచాలి. కొన్ని పాపాలు విడిచి పెట్టడం మీకు సహాయము చేయదు. గుడికి రావడం ప్రార్ధన చెయ్యడం మీకు సహాయపడదు. మీకు నూతన స్వభావము ఉండాలి, పూర్తిగా క్రొత్త జీవితం.

మార్పు విషయంలో జాన్ కాగన్ పడిన కష్టమును గూర్చి వినండి. "నేను పూర్తిగా అలసిపోయాను. పాపపు ఒప్పుకోలు కలుగుచున్నప్పటికి యేసును నేను పొందుకోలేదు. రక్షింపబడడానికి ప్రయత్నిస్తున్నాను. క్రీస్తును విశ్వసింప ప్రయత్నిస్తున్నాను కాని నా వలన కావడం లేదు. క్రైస్తవుడనవడానికి [నిర్ణయం] నిర్ణయించుకోలేకపోవుతున్నాను. అది నన్ను నిస్సహాయుడిని చేసింది. నన్ను పాపము నరకములోనికి నెట్టుచున్నట్లు అనిపించింది అయినను కన్నీళ్లు రాకుండా నా మొండితనము ఆపేస్తుంది. ఈ పోరాటములో ఇరుక్కుపోయాను."

అలా ఈ ఉదయము మీకనిపిస్తుందా? అలా అయితే, ఎందుకలా ఉండి పోయారు? ఎందుకంటే హృదయము మారకుండా రక్షింప బడాలనుకుంటున్నారు. హృదయ మార్పు లేకుండా మిమ్ములను క్రైస్తవులుగా మేము అంగీకరించాలనుకుంటున్నారు. కాని అది సాధ్యము కాదు! మీరు తిరిగి జన్మించాలి. మిమ్మును కంటే దేవుని ఎక్కువగా ప్రేమించే నూతన హృదయము మీకుండాలి. మీరు పశ్చాత్తాప పడాలి. మిమ్ములను మీరు అసహ్యించుకోవాలి! మీరు గర్వము విడిచి పెట్టాలి లేనిచో మీరు పాపములో చచ్చిపోతారు. మీ హృదయము పాపపు కుష్టు రోగముతో నియంత్రించ బడుతుంది. జాక్ గ్నాన్ అన్నాడు, "మిమ్ములను మీరు అసహ్యించుకున్నట్లు దేవుడు చెయ్యాలి."

బాహ్యపు విషయాలు [మిమ్ములను] శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము లోలోపల కూరుకొని ఉంది.

మూడీ సరిగ్గా చెప్పాడు,

నయమానుకు రోగాలున్నాయి – గర్వము మరియు కుష్టురోగము. కుష్టు రోగము వలే గర్వము కూడ కడుగబడాలి. నయమాను తన గర్వమనే రధము నుండి దిగి రావాలి; తరువాత అతడు కడుగబడాలి.

జాన్ కాగన్ అన్నాడు, "నా మీద నేను ఆధార పడలేకపోయాను. నాకు యేసు కావాలి. ఆ క్షణంలో క్రీస్తును తిరస్కరించడం ఆపేసాను. ఆయనను నమ్మడం తప్పదని నాకు తేటగా తెలిసింది; నాకు [గుర్తుంది] నేను కాదు క్రీస్తే నాలో ఉన్నాడు...నా పాపము నుండి వైదొలగి, యేసు వైపు మాత్రమే చూసాను!...యేసు [నా హృదయ పాపములను] తీసివేసాడు నన్ను ప్రేమతో నింపాడు...యేసు నా పాపాలన్నింటిని కడిగి వేసాడు. ఆయన నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు."

దైవ కుమారుడైన, యేసును విశ్వసించిన వెంటనే, "ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి [మిమ్మును] పవిత్రులుగా చేయును" (I యోహాను 1:7). ప్రతి పాపము! ప్రతి పాపము – మీ హృదయము పాపములు కావచ్చు, లేక మీరు చేసిన పాపములు కావచ్చు – యేసు రక్తములో అన్ని పాపములు కడుగబడాలి – దేవుని కుమారుడైన, యేసు రక్తములో మాత్రమే. మిమ్ములను కడుగడానికి ఆయన సిలువపై రక్తము కార్చాడు. ఆయనెందుకు అలా చేసాడు? ఆయన మిమ్ములను ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన రక్తములో మిమ్ములను కడగాలనుకుంటున్నాడు!

ఏది నా పాపమును కడుగుతుంది?
   యేసు రక్తము మాత్రమే;
నన్ను ఏది శుద్ధినిగా చేస్తుంది?
   యేసు రక్తము మాత్రమే.
ఓ! ప్రశస్త ప్రవాహము
   నన్ను హిమము కంటే తెల్లగా చేస్తుంది;
నాకు తెలిసిన వేరే ప్రవాహము లేదు,
   యేసు రక్తము మాత్రమే.
("రక్తము మాత్రమే" రోబర్ట్ లౌరిచే, 1826-1899).
(“Nothing but the Blood” by Robert Lowry, 1826-1899).

చాలా ఎక్కువగా మీరు పాపములో ఉన్నారు. మీరు అది కడుగుకోండి జాన్ కాగన్ వలే రక్షింపబడతారు. అతనిలా ఉండాలి మీరు. అది అసాధ్యము అనుకుంటారు. మీరు చాలా దుష్టులని అనుకుంటారు. మీరు చాలా పాపాత్ములని అనుకుంటారు. నిరీక్షణ లేదని అనుకుంటారు. కాని మీది తప్పు. యేసు మిమ్ములను ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు మిమ్మును ప్రేమించనంతగా ఆయన మిమ్ములను ప్రేమిస్తున్నారు. మీ హృదయంలోని పాపములు వారికి తెలిస్తే మిమ్ములను ప్రేమించరు. కాని యేసు మిమ్ములను ప్రేమిస్తాడు. యేసు అన్నాడు, "నా యొద్దకు రండి – రక్తముచే కడుగబడండి." యేసు అన్నాడు, "కడుగబడి శుద్ధులుకండి." ఆయన అడిగేదంతా మీ గర్వము నుండి వైదొలగి ఆయనను విశ్వసించాలి. అప్పుడు ఒకరోజు మీరు పరలోకములో పాడతారు,

"[మనలను] ప్రేమించి, తన రక్తము వలన [మన] పాపముల నుండి [మనలను] విడిపించిన వానికి" (ప్రకటన 1:5).

"నన్ను కడిగి శుద్ధిని చేయుము." గ్రిఫిత్ గారు, వచ్చి పాడండి "ఔను, నాకు తెలుసు" మరల.

మీరు శుద్ధులు కావాలనుకుంటే మొదటి స్థానాలలో కూర్చోండి యేసును విశ్వసించడం విషయము మేము మీతో మాట్లాడుతాము.

డాక్టర్ చాన్, దయచేసి వచ్చి వారి కొరకు ప్రార్ధించండి, తరువాత మనకు సహవాసము ఆవరణలో ఇవ్వబడు ఆహారము నిమిత్తము ప్రార్ధించండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"అవును, నాకు తెలుసు!" (అన్నా డబ్ల్యూ. వాటర్ మాన్ చే, 1920).
“Yes, I Know!” (by Anna W. Waterman, 1920).ద అవుట్ లైన్ ఆఫ్

కడుగుకొని శుద్ధుడవు కమ్ము! – మార్పు యొక్క విధానము

WASH AND BE CLEAN! – THE TYPOLOGY OF CONVERSION

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"నీవు యోర్ధాను నదీకి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరల బాగై, నీవు శుద్ధుడవగుదువు" (II రాజులు 5:10).

(II రాజులు 5:14)

I.   మొదటిది, అతనికి కుష్టు రోగము కలదు, II రాజులు 5:1; రోమా 5:12;
మార్కు 7:21-23.

II.  రెండవది, ఎలా కడుగబడాలో చెప్పిన ప్రవక్తను బట్టి అతడు కలవరము చెందాడు,
I యోహాను 1:7; ప్రకటన 1:5.