Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ప్రతి వ్యక్తి సువార్త చెప్పుచున్నప్పుడు!

EVERY PERSON EVANGELIZING!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, సెప్టెంబర్ 17, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, September 17, 2017

"వారు వెళ్ళుచుండగా, శుద్ధులైరి" (లూకా 17:14).


యేసు సమరయ గలిలయ ప్రాంతాల మీదుగా ప్రయాణించి చిన్న పట్టణానికి వచ్చాడు. పట్టణ గవిని ప్రాంతములో పదిమంది కుష్టు రోగులున్నారు. వారు ఆయనకు "దూరంగా నిలబడిరి" (17:12). పాత నిబంధన చట్టము ప్రకారము కుష్టు రోగులు ఆ రోగము ఇతరులకు రాకుండా ప్రజలకు దూరంగా ఉండాలి.

"ఆ కుష్టు రోగి...పై పెదవిని కప్పుకొని, అపవిత్రుడను, అపవిత్రుడను… అని బిగ్గరగా పలకవలెను; వాడు ప్రత్యేకంగా నివసించవలెను" (లేవియ కాండము 13:45-46).

ఈ పదిమంది కుష్టు రోగులు యేసు అద్భుతాలు చేస్తాడని విన్నారు. కనుక, దూరము నుండి, వారు, "యేసు, యజమానుడా, మమ్ములను కరుణింపుము" (లూకా 17:13). వెంటనే యేసు వారి కుష్టు రోగమును బాగు చేయలేదు, కాని యేరూష లేములోని దేవాలయమునకు వెళ్లి తమమును తాము కనుపరుచు కొనుమని చెప్పాడు. రెండు కారణాలను బట్టి యేసు అలా చేసాడు: పాత నిబంధన చట్టాన్ని నెరవేర్చడానికి, అది, లేవియ కాండము 14:1-20 లో చెప్పబడింది, యాజకులు మాత్రమే కుష్టు రోగి స్వస్థ పరచబడ్డాడో లేదో నిర్ధారించగలడు. రెండవ కారణము "ఒక సాక్ష్యము, ఒక రుజువు, యాజకులు ఇతర యూదులు ఆయనకు స్వస్థత పరిచే శక్తి ఉందని తెలుసుకోడానికి" (Thomas Hale, The Applied New Testament, Chariot Victor Publishing, 1996, p. 236).

పదిమంది కుష్టు రోగులు క్రీస్తుకు లోబడి యేరూషలేము దేవాలయము వైపు వెళ్ళుచున్నారు. ఇది వారికి కొంత విశ్వాసము ఉందని చూపిస్తుంది, లేనిచో వారు ఆయన మాటకు లోబడే వారు కాదు. కాని, మనం చూస్తాం, అది రక్షించే విశ్వాసము కాదు. వారు క్రీస్తుకు బాహ్యంగా లోబడ్డారు,

"వారు, బయట నుండి, వెళ్ళుచుండగా, శుద్ధులైరి" (లూకా 17:14).

వారు గలిలియ దక్షిణ ప్రాంతానికి ప్రయాణమై పోవుచుండగా, యేరూషలేము లోని దేవాలయమునకు వారి శరీరములు స్వస్థత పొందుకున్నాయి.

కాని వారిలో ఒకడు తన శుద్దుడైనప్పుడు తిరిగి యేసు ఉన్న చోటికి వచ్చాడు.

"వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, ఆయనకు [యేసు] కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు, ఆయన పాదముల వద్ద సాగిలపడెను..." (లూకా 17:15-16).

"అంతట [యేసు] నీవు లేచి, ఆ దారిలో, పొమ్ము: నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచెనని వారితో చెప్పెను" (లూకా 17:19).

ఇప్పుడు, ఈ పాఠ్యభాగములో చాలా పాఠములు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. వాటన్నిటిని ఇవ్వడం లేదు, కాని మూడింటిని నేను గమనించాను.

I. మొదటిది, క్రీస్తుకు బాహ్య విధేయత ద్వారా పార్శ్వ శుభ్రత వస్తుంది.

ఈ పదిమంది బాహ్య కుష్టు రోగము నుండి స్వస్థత పొందారు. అయినను వారందరూ యేసు ముట్టిన వెంటనే స్వస్థత పొందలేదు. యేరూషలేము దేవాలయమునకు వెళ్ళు మార్గములో వారు పార్శ్వముగా స్వస్థత పొందారు. కాని వారి ఆత్మలు ఇంకను స్వస్థత పొందలేదు. యేసు అన్నాడు,

"ఆయన వారిని చూచి. మీరు వెళ్లి, మిమ్మును, యాజకులకు కనుపరచు కొనుడని వారితో చెప్పెను, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి" (లూకా 17:14).

క్రీస్తుకు బాహ్యముగా విధేయులైన వారు చాలా ఉపద్రవముల నుండి కడుగ బడ్డారు పూర్తిగా విధేయత చూపని వారితో పోలిస్తే. గుడికి వచ్చేవారు, క్రైస్తవ్యానికి సంబందించిన విధులు బాహ్యముగా గైకొనేవారు, వారి జీవితాలు ఎక్కువగా క్రమ పరచబడినట్లు, పాఠశాలలో వారి చదువు అలవాట్లు మంచి ఫలితాలు ఇచ్చినట్టు కనుగొన్నారు. వారి భావోద్రేకాలు క్రమపరచబడ్డాయి. సాధారణముగా, వారు వారి జీవితాలలో ఎక్కువగా విజయవంతులయ్యారు ఆధునిక సమాజపు తికమక "వ్యవహారాలకు" లోనైన వారితో పోలిస్తే (ఎఫెస్సీయులకు 4:14).

"లోకము"లోని ప్రజలు తరుచు అనుకుంటారు గుడికి రావడం వారి జీవితాలకు హాని కలిగిస్తుంది, వారి ఉద్యోగము నుండి పాఠశాల నుండి ఎక్కువ సమయాన్ని తీసుకుంటుందని. క్రైస్తవ తల్లిదండ్రులు కానీ వారు అలా ఆలోచిస్తారు. వారనుకుంటారు గుడికి రావడం ద్వారా వారి పిల్లలకు ఇచ్చే సమయము ఎక్కువ వ్యర్ధమవుతుందని, తద్వారా వారు పాఠశాలలో గాని పని స్థలములో గాని బాగా రాణించలేరని. కాని దానికి వ్యతిరేకమయినది నిజమని చాలా మార్లు గ్రహింపబడినది. యవనస్తులు సంఘ ఆరాధనలకు హాజరు అవుతున్నప్పుడు, మినహాయింపు లేకుండా, వారు వాస్తవానికి మంచి విధ్యార్దులుగా మంచి ఉద్యోగులుగా మారడం, మేము కనుగొన్నాము. వారు చదువును క్రమపరచుకోవడం నేర్చుకుంటారు, "సమయమును సద్వినియోగము చేసుకోవడం ద్వారా" (ఎఫెస్సీయులకు 5:16; కొలస్సయులకు 4:5). సంఘ నాయకుల ప్రోద్భలము ద్వారా, సంఘ సభ్యుల మాదిరి ద్వారా, వారు పని స్థలములోను పాఠశాలలోను పట్టుదల ప్రాముఖ్యతను వారు నేర్చుకుంటారు. "ఇటు అటు మోసపోకుండా" లోకములోని పిల్లలు చేసినట్టు కాకుండా, వారు వారికి అందుబాటులో ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని, కష్టపడి పని చేస్తారు కష్టపడి చదువుతారు.

మన సంఘములో అమెరికాలోని ఎక్కువ శాతము కళాశాల విద్యార్ధులు కళాశాల పట్ట భద్రులు ఉన్నారని నేను నమ్ముచున్నాను. నేననుకుంటాను ఇది ఒక రుజువు యేసుకు లోబడితే వారు "శుద్ధి చేయబడతారు" వారు ఎదుర్కొంటున్న బాహ్యపు సమస్యల నుండి స్థానిక సంఘ సహవాసము లోనికి రాకుండా, కూటములకు హాజరు కాకుండా ఉన్న వారితో పోల్చి చూస్తే. సంవత్సరాల గమనిక ఇది నిజమని మళ్ళీ మళ్ళీ రుజువు చేసింది.

II. రెండవది, మీరు క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు పూర్తి రక్షణను అనుభవిస్తారు.

వీరిలో తొమ్మిది మంది స్వస్థత పొందినప్పుడు, శారీరకంగా కుష్టు రోగము నుండి కడుగబడినప్పుడు దానితో తృప్తి చెందారు. కాని వారిలో ఒకడు బాహ్యపు విధేయతతో తృప్తి చెందలేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో తన హృదయము ఉప్పొంగింది. అతడు వెనుదిరిగి యేసు ఉన్న చోటికి తిరిగి వచ్చాడు. ఆయన పాదాలపై పడ్డాడు, "ఆయనకు వందనాలు చెప్పుతూ" (లూకా 17:16). ఇంకొక మాటలలో, ఇతడు క్రీస్తు దగ్గరకు వచ్చాడు! అతడు క్రీస్తు నొద్దకు వచ్చి, శారీరకంగా స్వస్థత మాత్రమే కాదు, రక్షకునిలో పూర్తి రక్షణ కనుగొని, ఆయన పాదములపై పడ్డాడు.

మీరు మన గుడికి వస్తూ ఉంటే, కూటములకు క్రమముగా వస్తూ ఉంటే, అది మంచిదే. మీ జీవితంలో పనిలో అది పని చేస్తుంది. కాని మంచి జీవితం జీవించడం కాదు నిజ క్రైస్తవ్యములో ఇంకా చాలా ఉంది! చాలా విజయవంతమైన జీవితమూ జీవిస్తున్న తనతో, యేసు ఇలా చెప్పాడు,

"మీరు కొత్తగా జన్మింప వలెనని, నేను నీతో చెప్పినందుకు [ఆశ్చర్యం లేదు] పడవద్దు" (యోహాను 3:7).

క్రీస్తు నొద్దకు వచ్చిన కుష్టు రోగికి అదే సంభవించింది. యేసుకు లోబడడం ద్వారా శారీరకంగా స్వస్థ పడిన తరువాత, అతడు యేసు నొద్దకు వచ్చాడు, ఆయన పాదాలపై పడ్డాడు, అంతరంగములో మార్పు చెందాడు. మరియు క్రీస్తు అతనితో అన్నాడు,

"నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరచెను" (లూకా 17:19).

నేను అన్వయింపు నూతన నిబంధనతో ఏకీభవిస్తాను. కింగ్ జేమ్స్ బైబిలులో ఉన్న దానిని ఇది నిర్ధారిస్తూ, యేసు నొద్దకు వచ్చిన కుష్టు రోగికి ఏమి సంభవించిందో వివరించింది. "నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచెను," అని యేసు అతనితో చెప్పినప్పుడు, ఆ వ్యాఖ్యానము చెప్తుంది "అతని శరీరము బాగు పరచబడడమే కాకుండా, అతని ఆత్మ కూడ బాగు చేయబడింది. అతడు రక్షణ పొందుకున్నాడు" (ఐబిఐడి., పేజి 341).

మీలో కొంతమంది సంఘానికి వస్తూ ఉన్నారు. అది మిమ్ములను ఆశీర్వదించి మంచిగా చేసింది. మేము దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. కాని ఇప్పుడు మేము మిమ్మును అడుగుతున్నాము ఒక అడుగు ముందుకు వేసి పూర్తి రక్షణ పూర్తి, మార్పు పొందుకోవాలని, విశ్వాసము ద్వారా యేసు నొద్దకు వచ్చుట ద్వారా, ఆయన యెదుట సాగిలపడుట ద్వారా, పూర్తిగా ఆయనను అమ్ముట ద్వారా.

తరువాత, మీకు కేవలము మంచి జీవితమూ ఇవ్వడానికి క్రీస్తు శ్రమ పడి సిలువపై మరణించలేదు. ఇంకా చాల ఎక్కువ కొరకు! మీ పాపములు క్షమింపబడడానికి, ఆయన ప్రశస్త రక్తములో కడుగబడడానికి ఆయన సిలువపై మరణించాడు. ఆయన మృతుల లోనుండి లేచి, మీకు నిత్య జీవితము ఇవ్వడానికి, తండ్రి దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడైయున్నాడు. సామాన్య విశ్వాసము ద్వారా మీరు యేసు నొద్దకు వస్తే, ఈ వ్యక్తి చేసేనట్టు, మీరు కూడ మారతారు, తిరిగి జన్మిస్తారు, నిత్యత్వములో. మార్పు వాస్తవికత మీకు త్వరలో అనుగ్రహింపబడును గాక! కాని నేను నమ్ముతాను ఈ లేఖన భాగములో మూడవ పాఠము కూడ ఉంది, ప్రతి వ్యక్తి సువార్త చెప్పుచున్నప్పుడు.

III. మూడవది, సువర్తీకరణ వెనువెంటనే ప్రారంభము కావాలి, మీరు ఇంకా మార్పు నొందక మునుపే.

గమనించండి యేసు ఈ పదిమంది కడుగబడని (మారని) మనష్యులకు ఇలా చెప్పాడు

"ఆయన వారిని చూచి. మీరు వెళ్లి, మిమ్మును, యాజకులకు కనుపరచుకొనుమని వారితో చెప్పెను, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి" (లూకా 17:14).

వారు "ఒక సాక్ష్యముగా, రుజువుగా, యాజకుల దగ్గరకు ఇతర యూదుల దగ్గరకు," యేసుచే పంపబడ్డారు, యేసును గూర్చి వారికి చెప్పడానికి (అన్వయింపు నూతన నిబంధన, ఐబిఐడి., పేజి 236). వారు కడుగబడక మునుపు మారమునుపు సాక్షులుగా పంపబడ్డారు!

ఇది, అద్భుతము కాదా? ఈనాడు, చాలామంది సువర్తికులు అనుకుంటారు మీరు బలమైన క్రైస్తవునిగా ఉండాలి, విశ్వాసములో స్థిరపడి ఉండాలి, బైబిలు జ్ఞానముతో, మీరు బయటకు వెళ్లి సువార్త చెప్పడానికి. ఇది అర్ధము లేనిది అంటాను! ఇది హాస్యాస్పదము ఒకరు గుడిలోనికి కూటాలకు రావాలంటే బలమైన క్రైస్తవునిగా ఉండాలని చెప్పడం! అయినను నేను గ్రహించాను, కొంతమంది అవివేకులు అలా ఆలోచిస్తారు! కాని బైబిలు అది బోధించడం లేదు. పన్నెండు మంది శిష్యులు యేసుచే పంపబడ్డారు బయట మంచి సువార్త ప్రకటించడానికి. అస్సార్స్ క్రమావళి ప్రకారము, శిష్యులు యేసు వారిని ఆయనను వెంబడించమని చెప్పిన సంవత్సరములోనే బయటకు వెళ్లి సువార్త చెప్పారు. వారు ఆయనను వెంబడించు వారిగా ఉంటూ ఉన్నారు

"ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్దకు పిలిచి... వారిని ఇద్దరిద్దరిగా పంపు చుండగా, వారు మారు మనస్సు పొందవలెనని ప్రకటించు చుండిరి" (మార్కు 6:7, 12).

ఒక శిష్యుడు (యూదా) ఇంకను మార్పు నొంద లేదు. అయినను సువార్త ప్రకటించడానికి వెంటనే పంపబడ్డారు, మారినా మారకపోయినా, విశ్వాసములో బలముగా ఉన్న లేకపోయినా! క్రీస్తు ఆజ్ఞ ప్రకారము – సువార్త నిమిత్తము బయటకు వెళ్ళాలి!

నేను అనుకుంటాను క్రీస్తు విధానంలో నుండి గొప్ప స్థితిని పొందుకోవచ్చు. క్రీస్తు ఆజ్ఞ ప్రకారం సువార్త ప్రకటించడానికి బయటకు వెళ్ళాలి, ఆయన ఆజ్ఞలలో అతి ప్రసిద్ధమైన ఆజ్ఞ:

"మీరు సర్వలోకమునకు వెళ్లి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించ వలెను" (మత్తయి 28:19).

ఆయనకు లోబడే ముందు తర్ఫీదు కొరకు మనము కనిపెట్టాలా? పదిమంది కుష్టు రోగులు యాజకులకు ఇతర యూదులకు సువార్త చెప్పేముందు తర్ఫీదు తీసుకోలేదు. ఎందుకు, మనషులు, వారు ఇంకా రక్షింపబడలేదు! అయినను క్రీస్తు వారితో చెప్పాడు ఆయనకు లోబడి వెళ్లి, యాజకులకు సువార్త చెప్పమని. శిష్యులు కూడ ముడి సరుకుగా, అజ్ఞాన జాలరులుగా ఉన్నారు, కాని యేసు వారిని ఇద్దరిద్దరుగా, సువార్త ప్రకటింప బడడానికి, వెంటనే పంపబడ్డారు.

ఈరోజు అదే పని మనము చెయ్యాలి. యేసు నియమించిన పద్దతి మనం గైకొనాలి. ప్రజలకు మనం బైబిలు తర్ఫీదు ఇవ్వాలి. అవును! వారు పూర్తిగా తర్ఫీదు పొందక మునుపే వెళ్లి సువార్త చెప్పాలి. లేఖనములలోని అన్ని సిద్ధాంతములు వినక మునుపే వారు సువార్త చెప్పాలి!

మీరు ప్రజలకు నిరంతరంగా తర్ఫీదు ఇవ్వవచ్చు కాని వారు సువార్త వినునట్లు ఒక ఆత్మను కూడ గుడికి తీసుకొని రారు. మీరు ప్రజలకు గొప్ప వివరణలు ఇవ్వవచ్చు, వచనము వెంబడి వచనము చెప్పవచ్చు, అయినను మీ ఆరాధనలలో వాక్యము వినడానికి వారు ఒక్క నశించు ఆత్మను కూడ తీసుకొని రాకపోవచ్చును.

ఆలోచించే వ్యక్తికి అది నిజమని పిస్తుంది, అయినను ఏమి చెయ్యాలో తోచదు. కాని ఏమి చెయ్యాలో యేసు మనకు చెప్పాడు – వెంటనే సువార్త కొరకు పంపాడు, తర్ఫీదు ఉన్నా లేకున్నా, మారినా మారకున్నా! గుడిలో ప్రతి ఒక్కరు సువార్త కొరకు వెళ్లాలని నేను నమ్ముతాను. క్రీస్తుకు లోబడి, మన గుడిలో ప్రవేశించి ప్రతి వ్యక్తి సువార్త పని చెయ్యాలి.

వారికి ఎక్కువ తెలియనవసరం లేదు. వారు చెప్పవలసింది "గుడిలో అద్భుతం జరుగుతుంది, మీరు అక్కడ ఉండాలి," అలా విషయాలు సాధారణంగా ఉంటాయి. వారి ఫోను నంబరు తీసుకొని సంఘ నాయకులకు ఇవ్వాలి. ఈ పథకము ద్వారా ప్రతి ఆదివారము చాలామంది సందర్శకులు మన దగ్గరకు వస్తున్నారు. ప్రతి ఆదివారము నేను బోధిస్తాను. సువార్త బోధ అవసరం ప్రతి ఆరాధనలో రక్షింపబడని వారు ఉంటారు కాబట్టి.

యేసు సువార్త చెప్పడానికి ప్రజలను పంపిన సామాన్య విషయాన్ని నేను సిఫారసు చేస్తాను. తరువాత, ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి మిగిలిన మార్గాలు సరిగ్గా పనిచేయడం లేదు, కదా? కాని యేసు పద్దతిని అనుకరిస్తే గుడులు నిండి పోతాయి, లోకములో ప్రతి ఆర్దనలో చాలామంది పాల్గొంటారు. డాక్టర్ జాన్ ఆర్. రైస్ తరుచు చెప్పాడు, "అందరు బయటకు వెళ్ళడం నూతన నిబంధన ఆత్మల సంపాదనకు సరి తూగుతుంది" (John R. Rice, D.D., Why Our Churches Do Not Win Souls, Sword of the Lord Publishers, 1966, p. 149). నేను అతనితో పూర్తిగా ఏకీభవిస్తాను!

ఇంకొక విషయము, ప్రజలు సువార్త కొరకు బయటకు పంపబడితే వారు క్రీస్తులో ఎదుగుతారు. ప్రజలు సువార్త చెప్పకపోతే సంవత్సరాలుగా స్థంబించిపోతారు. కాని అనుభవము ద్వారా నాకు తెలుసు ప్రతివారము వారు సువార్తకు బయటకు వెళ్తే వారు బలమైన క్రైస్తవులుగా అవుతారు. క్రైస్తవుని ఎదుగుదలకు మూలము గొప్ప ఆజ్ఞకు లోబడడంలో ఉంది!

"వారు, బయటనుండి, వెళ్ళు చుండగా, శుద్ధులైరి" (లూకా 17:14).

మీరు ఇతరులకు సువార్త చెప్తే మీ జీవితమూ మారుతుంది! తరువాత,బహుశా, మీరు తిరిగి జన్మించాలి! నూతన జన్మ దేవుడు మీ ప్రతి ఒక్కరికి ఇచ్చును గాక, మీరు విశ్వాసము ద్వారా క్రీస్తు నొద్దకు వచ్చుచుండగా. అప్పుడు మీరు నశించు వారికి సువార్త చెప్పడంలో ఇంకా విజయ వంతులుగా ఉంటారు. దేవుడు మీరు సువార్త చెప్పునట్లు, అది త్వరగా ప్రారంభించునట్లు మిమ్మును ప్రేరేపించును గాక. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము డాక్టర్ క్రైటన్ ఎల్. చాన్: లూకా 17:11-19.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"అతి తక్కువ సమయము" (డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే, 1895-1980).
“So Little Time” (by Dr. John R. Rice, 1895-1980).ద అవుట్ లైన్ ఆఫ్

ప్రతి వ్యక్తి సువార్త చెప్పుచున్నప్పుడు!

EVERY PERSON EVANGELIZING!

డాక్టర్ జాన్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"వారు వెళ్ళుచుండగా, శుద్ధులైరి" (లూకా 17:14).

(లూకా 17:12; లేవియకాండము 13:45-46; లూకా 17:13, 14, 15-16, 19)

I.    మొదటిది, క్రీస్తుకు బాహ్య విధేయత ద్వారా పార్శ్వ శుభ్రత వస్తుంది, లూకా 17:14; ఎఫెస్సీయులకు 4:14; 5:16; కొలస్సయులకు 4:5.

II.   రెండవది, మీరు క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు పూర్తి రక్షణను అనుభవిస్తారు,
లూకా 17:16; యోహాను 3:7; లూకా 17:19.

III.  మూడవది, సువర్తీకరణ వెనువెంటనే ప్రారంభము కావాలి, మీరు ఇంకా మార్పు నొందక మునుపే, లూకా 17:14; మార్కు 6:7, 12; మత్తయి 28:19.