Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఉజ్జీవంలో ప్రార్ధన యొక్క పోరాటము!

THE BATTLE OF PRAYER IN REVIVAL!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్
ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, జూలై 9, 2017 బోధింపబడిన ప్రసంగము
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, July 9, 2017


నేను నా పాటల పుస్తకము చూచినప్పుడు పోరాటము జరిపే సంఘాన్ని గూర్చి ఒక్క పాట కూడ కనుగొనలేదు – కాని ఒకటి. ఒకే ఒకటి సంఘ పోరాటానికి సంబందించినది, ఆ పాటలో ఒక వచనము మాత్రమే! "భద్రతపై" పదిహేను పాటలున్నాయి. "స్తుతిపై" ముప్పై రెండు పాటలున్నాయి. "పిల్లలకు" సంబంధించి ఇరవై పాటలున్నాయి. "ఆరాధన" పై ఇరవై ఒక పాటలున్నాయి. కాని ఒకే పాట ఉంది సంఘ "పోరాటముపై" – సంఘము యుద్దములో! ఆ పాటలో ఒక వచనము మాత్రమే, అది మనకు చెప్పదు యుద్ధము ఎలా జరపాలో! ఇక్కడ ఒకే వచనము ఉంది పుస్తక మంతటిలో మనకు తెలియ పరుస్తుంది మనము సాతాను వాని అనుచరులతో యుద్ధములో ఉన్నామని! గ్రిఫిత్ గారు ఇప్పుడే ఆ వచనము పాడారు.

సాతాను విజయము పతనము అయ్యే సూచన కనబడినప్పుడు;
అప్పుడు, క్రైస్తవ సైనికులు, విజయము వైపు కదులుతారు!
నరకపు పునాదులు వణుకుతాయి స్తుతి కేకతో;
సోదరులారా, మీ స్వరాలు పైకెత్తండి, మీ గీతాలాపన పెద్ద చెయ్యండి!
కదలండి, క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి కదిలినట్టు,
యేసు సిలువ మీ ముందు వెళ్ళుచుండగా.
("కదలండి, క్రైస్తవ సైనికులారా" సెబైన్ బేరింగ్ గోల్డ్ చే, 1834-1924).
   (“Onward, Christian Soldiers” by Sabine Baring-Gould, 1834-1924).

ఈ పాటలో ఈ ఒక్క వచనము చెప్తుంది మనము సాతాను అతని అనుచరులతో మనము యుద్ధములో ఉన్నామని! ఆ ఒక్క వచనాన్ని ఆధునిక పుస్తకాల నుండి తొలగించారు! 1957లో ఆ వచనము తొలగింప బడింది. ఇంకా దరిద్రం, పాట మొత్తము అన్ని ఆధునిక పుస్తకాల నుండి తొలగింపబడింది! పాశ్చాత్య ప్రపంచంలో క్రైస్తవులకు అసలు తెలియదు ఒక పోరాటము జరుగుతుందని. మనము నిద్రపోతున్నాము. దక్షిణ బాప్టిస్టులు ప్రతి సంవత్సరము వారి సంఘముల నుండి పది లక్షలలో ఒక వంతు ప్రజలను కోల్పోతున్నారు. వెయ్యి సంఘాలు ప్రతి సంవత్సరము నిత్యానికి వాటి తలంపులు మూసేస్తున్నాయి! బిబిఎఫ్ఐ (BBFI) సంఘాలు కూడ ఉన్నాయి. ప్రార్ధనా కూటాలు బైబిలు పఠనాలుగా మారిపోయాయి లేక పూర్తిగా తుడిచి పెట్టబడ్డాయి. ఆదివారము రాత్రి ఆరాధనలు పాశ్చాత్య ప్రపంచంలో మన సంఘాలలో మూతపడుతున్నాయి. బిబిఎఫ్ఐ (BBFI) సంఘాలు కూడ ఉన్నాయి. "భోదించడం" ఎండబారిన బైబిలు వివరణగా మారింది. నిజమైన సువర్తీకరణ బోధ మృతమైయింది. నాకు తెలియదు ఏ సంఘ కాపరికైనా తెలుసా సువర్తీకరణ ప్రసంగము ఎలా సిద్ధ పడాలో – చాలా తక్కువ సిద్ధపాటు! ఈనాడు సువర్తీకరణ బోధ మన సంఘాలలో జరుగుతున్నట్టు నాకు తెలియదు. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ –జోన్స్ ఇరవైవ శతాభ్దపు గొప్ప ప్రసంగీకులలో ఆయన ఒకరు. ఆయనన్నాడు,

      దేవునికి తెలుసు క్రైస్తవ సంఘము చాలా సంవత్సరాలుగా అరణ్య వాసములో ఉండి పోయిందని. సంఘ చరిత్రను గూర్చి 1840 ముందు స్థితి మీరు చదివితే మీరు కనుగొంటారు చాలా దేశాలలో క్రమముగా ఉజ్జీవాలు వచ్చేవని...ప్రతి పది సంవత్సరాలకు. అలా లేదు. 1859 తరువాత ఒక పెద్ద ఉజ్జీవము మాత్రమే వచ్చింది... మనము సంఘ సుదీర్ఘ చరిత్రలో ఎండబారిన [నిర్జీవ] స్థితి ద్వారా వెళ్ళాము...ఇంకా కొనసాగుతూనే ఉంది... [ఎవరైనా] అందులో నుండి తప్పింప బడ్డామని చెప్పితే, నమ్మవద్దు. సంఘము అరణ్య వాసములో ఉంది (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1992 edition, p. 129).

మన సంఘాలు ఎందుకు మృతి స్థితిలో ఉన్నాయి? నలభై నిమిషాలు పాటలు పాడుతూ జీవింప ప్రయత్నిస్తున్నాము! మనము ప్రజలు భావోద్రేకాలను వాయిద్యాలతో గిటారులతో రేకేత్తిస్తున్నాము. కాని అది సహాయ పడలేదు! చేసిందేదో మనకు సహాయము చెయ్యలేదు – ఏదీ కూడ బాప్టిస్టులకు కాని ఆకర్షనీయులకు గాని దేవుడు పంపిన ఉజ్జీవము అనుభవించడానికి సహాయము చెయ్యలేదు. నేను మళ్ళీ చెప్తాను – మనకు ఏదీ సహాయము చెయ్యలేదు!

జవాబు ఏంటి? మనం పోరాడుతున్నామని మనకు తెలియదు! మనము పోరాటంలో ఉన్నామని కూడ మనకు తెలియదు! స్కోఫీల్డ్ పఠన బైబిలు 1255 పేజీ చూడండి. అది ఎఫెస్సీయులకు 6:11 మరియు 12. దయచేసి నిలబడండి నేను 11 మరియు 12 వచనాలు చదువుతున్నప్పుడు.

"మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి వంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోనూ, ఆకాశ మండల మందున్న దురత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము" ("ఎఫెస్సీయులకు 6:11, 12).

కూర్చోండి. కొత్త అమెరికను ప్రామాణిక బైబిలు 12 వ వచనాన్ని ఇలా అనువదిస్తుంది,

"మన పోరాటము శరీరము రక్తముతో కాదు [మానవ శత్రువు], కాని పరిపాలకులు, శక్తులు, ఉన్నత స్థానములో ఉన్న దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:12 ఎన్ఏఎస్ బి).

డాక్టర్ చార్లీ రైరీ అన్నాడు, "ఒక విశ్వాసి శత్రువులు సాతాను సమూహాలు, అవి శారీరక శ్రమ కలిగించడానికి కూడుకుంటాయి" (ఎఫెస్సీయులకు పై గమనిక 6:12). ఇది కనిపించని పోరాటము – సాతానుతో ఆత్మీయ పోరాటము. సాతాను వాని దయ్యాలతో పోరాడడానికి మనకు శక్తి కాని ఉత్సాహము కానిలేదు. వాటితో పోరాడాలని కూడ మనకు తెలియదు! సాతాను మనలను నిద్రలో ముంచింది! ఆ పల్లవి "కదలండి, క్రైస్తవ సైనికులారా" కూడ తప్పే. అది చెప్తుంది, "నరకపు పునాదులు స్తుతి కేకతో కదులుతాయని!" కాదు – అలా జరగదు! మన "స్తుతి కేకలకు" దెయ్యాలు భయపడవు! "స్తుతి కేకలకు" అవి నవ్వుతాయి! బాప్టిస్టులు పాటలు పాడుతుంటే అవి నవ్వుతాయి! వాయిద్యాలతో! విద్యుత్తు గిటారులతో! ఆకర్షణీయ కేకలకు అవి నవ్వుతాయి! శబ్దాలు చేసి వాయిద్యాలు వాయించి వాటిని భయపెట్ట వచ్చని మనం అనుకుంటే అవి మనలను చూచి నవ్వుతాయి!

మనకు సులభమైన పని ఉందని మనం అనుకోకూడదు. సాతాను యొక్క గొప్ప పరికరము ఏంటంటే చాలా సులువుగా దేవుని సన్నిధిలో ఉజ్జీవము వస్తుందని మనము అనుకునేలా చెయ్యడం, "మనము పోరాడునది శరీరము రక్తముతో కాదు." మనము అంధకార సంబంధమగు, దురాత్మల సమూహముతో పోరాడడానికి పిలువబడ్డాము.

ఈ అంధకారా శక్తులతో పోరాడడం సులభమని మనం అనుకోకూడదు! మొదటిగా, వాటితో అదుపు చేయబడుతున్న సంస్కృతిలో మనము జీవిస్తున్నాము. నేను గమనించాను పాశ్చాత్య ప్రపంచములో కంటే అన్య భాగాలలో ఉజ్జీవము ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మనము అమెరికాలో పాశ్చాత్య శక్తివంతమైన దుష్ట శక్తులతో అదుపు చేయబడుచున్న సంస్కృతిలో జీవిస్తూ ఉన్నాము. ఈలోకపు అంధకార శక్తులతో మనము పోరాటము జరిపించాలి. డాక్టర్ అంగర్ అనువదించినట్టు, "ఈ అందకారపు ప్రపంచ పరిపాలకులకు వ్యతిరేకంగా." డాక్టర్ రైరీ అన్నాడు, "చెడ్డ దూతలు దేశాలను పారిపాలిస్తుంటాయి...మంచి దూతలకు చెడు దూతలకు దేశాలను అదుపులో ఉంచడంలో కొనసాగుతూనే ఉంటుంది" (Ryrie Study Bible, note on Daniel 10:13). డాక్టర్ అంగర్ వాటిని "లోకపు అంధకార దుష్ట శకుల పరిపాలకులు" (Biblical Demonology, Kregel, 1994, p. 196). దానియేలు 10:13 లో పరిపాలించే దెయ్యము, "పెర్షియా రాజ్యపు రాజు" గా పిలువబడుతుంది." ఈనాడు "పాశ్చాత్య రాజు" అమెరికాను ఇతర దేశాలను అదుపు చేస్తున్నాయి. పరిపాలించే దెయ్యము భౌతిక వాదానికి మన ప్రజలను బానిసలుగా చేసే శక్తి కలిగి ఉండడానికి అనుమతింప బడింది. భౌతిక వాదం అనే దయ్యము అమెరికా ఇతర దేశాలను అదుపు చేస్తుంది. భౌతిక వాదము అనే దయ్యము మన ప్రార్ధనలను అడ్డుకుంటుంది, ప్రజలను బానిసలుగా చేస్తుంది, ఉజ్జీవాలు ఆపేస్తుంది. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ జోన్స్ దానిని అర్ధం చేసుకొన్న బోధకులలో ఒకరు. అతనన్నాడు ఈ దెయ్యము క్రైస్తవేతరుల మనసులకు గ్రుడ్డితనము కలుగచేసి మన సంఘాలను కూలగొడుతుంది. అతనన్నాడు, "దేవుని పూర్తి అభిప్రాయము పూర్తిగా పోయింది...దేవుని గూర్చిన నమ్మకము మతము రక్షణ [అవి] రద్దు చేయబడి మరచిపోబడ్డాయి" (ఉజ్జీవము, ఐబిఐడి., పేజి 13). ఇది భౌతిక వాదం అనే గొప్ప దెయ్యము వలన సంభవించింది, ఆ దెయ్యాన్ని నేను "పాశ్చాత్య రాజు" అంటాను.

మూడవ ప్రపంచ దేశాలలో భౌతిక వాదం అనే దెయ్యమునకు మన సంస్కృతిలో ఉన్నంత శక్తిలేదు. లక్షలాది మంది యవనస్తులు చైనా, ఆఫ్రికా, ఇండోచైనా, ముస్లీము దేశాలలో కూడ – లక్షలాది మంది క్రైస్తవులుగా మార్చబడుతున్నారు.

కాని అమెరికా దాని కూడలిలోని దేశాలలో లక్షలాది మంది యవనస్తులు సంఘాలను విడిచిపెట్టుచున్నారు. పోల్ స్టర్ జార్జి బర్నా మనకు చెప్తున్నాడు 88% గుడిలో పెంచబడిన వారు మన సంఘాలను విడిచి పెడుతున్నారు 25 సంవత్సరాల వయస్సులో, "వారు తిరిగి రావడం లేదు."

ఈ గొప్ప భౌతిక వాదం అనే దెయ్యము వారిని ఎలా అదుపు చేస్తుంది? వారు అశ్లీల చిత్రాల ద్వారా అదుపు చేయబడుతున్నారు, అంతర్జాలములో గంటల తరబడి చూస్తారు. ప్రార్ధన అంటే నవ్వుతారు, కాని గంటల తరబడి సామాజిక మాధ్యమానికి లోనవుతున్నారు. ఉదయము లేచిన వెంటనే వారి ఫోనులు లాక్కుంటారు. రోజుకు 150 సార్ల కంటే ఎక్కువగా ఫోనులు చూసుకుంటూ ఉంటారు, ఒక నివేదిక ప్రకారము. గంజాయి ద్వారా మత్తులోనికి జారుకుంటారు. వారు నిజంగా ఉదయము నుండి రాత్రి వరకు పరికరాలను అంటిపెట్టుకుని ఉంటారు, అవి వారిని భౌతిక వాదం దెయ్యానికి కలుపుతాయి. ప్రతి క్షణము ఫోనులపై చూస్తూ ఉంటారు. ప్రవక్త హోషేయా దినాలలో ఇశ్రాయేలీయులు విగ్రహాలను చూచినట్టు వాటిని చూస్తుంటారు. ఈనాడు యవనస్తులు మనస్సులను హృదయాలను అదుపు చేసే విగ్రహముగా సాంఘీక మాధ్యమాన్ని సాతాను ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాడు! చాలామంది బోధకులు దానిని నిమ్మళము ఆధునికము అనుకుంటున్నారు! వారి దెయ్యపు శక్తులతో వ్యవహరిస్తున్నారని గ్రహించరు, డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ చెప్పినట్టు! ఆశ్చర్యము లేదు మన సంఘాలు లౌక్యముగా బలహీనంగా ఉన్నాయి!

ప్రవక్త హోషేయా దేవుడు తనతో చెప్తాడు, "[ఇశ్రాయేలు] విగ్రహాలతో కలిసిపోయింది: వానిని అలాగే ఉండనిమ్ము" (హోషేయా 4:17). దేవుడు ఆదేశాన్ని విడిచిపెట్టాడు. వారు ఒంటరిగా విడిచి పెట్టబడ్డారు, దెయ్యాల అదుపులో శక్తిలో – దుష్ట శక్తులకు బానిసలు అయిపోయారు!

వారని గుడికి తీసుకొస్తాం. కాని దేవుడు ఇక్కడ ఉండడు. దేవుడు ఇక్కడ లేడని వారికి అనిపిస్తుంది. ప్రవక్త హోషేయా చెప్పాడు వారు వెళ్తారు "ప్రభువును వెదకడానికి; కాని వారు ఆయనను కనుగొనరు; వారి నుండి ఆయన తొలగిపోయాడు" (హోషేయ 5:6). దేవుడు వెళ్ళిపోయాడు! ఆయన మన సంఘాలను విడిచిపెట్టాడు. కొన్ని వారాల క్రితమే ఆయన మన సంఘాన్ని విడిచి పెట్టాడు. ఆయన ఉనికిలో లేడు కాబట్టి ఆయన వెళ్ళిపోలేదు. ఓ, కాదు! ఆయన వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన ఉనికిలో ఉన్నాడు కాబట్టి! అందుకే ఆయన మనలను ఒంటరిగా విడిచి పెట్టాడు. అందుకే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. అందుకే ఆయన మనతో కోపంగా ఉన్నాడు. అందుకే ఆయన మనలను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. అందుకే ఆయన సన్నిధి మన మధ్య లేదు. అందుకే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. అందుకే మనకు ఉజ్జీవము లేదు!

వారిని గుడికి తీసుకొస్తాం. పుట్టిన రోజు మంచి భోజనము పెడతాం. ఒక గీచిన బొమ్మ చూపిస్తాం. వారికి అదే మన దగ్గర మొత్తం ఉంది! తెలివిలేని స్నేహితుడులా మనం భావిస్తాం అతనన్నాడు, "అతనికివ్వడానికి నా దగర ఏమి లేదు" (లూకా 11:6). అతని స్నేహితుడొచ్చాడు తన దగ్గర అతనికివ్వడానికి ఏమిలేదు! కొంచెం భోజనము గీచిన బొమ్మ తప్ప. అతనికివ్వడానికి దేవుని నుండి వచ్చినది ఏమిలేదు! ఆ ఉపమానము ఈ మాటలతో ముగుస్తుంది, "మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువానికి మరి ఎక్కువగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును?" (లూకా 11:13).

మనం గత సంవత్సరము చేసిన దానిని చెయ్యడానికి ఇష్టపడం. మన బద్దకముతో కూడిన నిద్ర సోమరితనము పరిశుద్దాత్మ లేని సంఘాన్ని కలిగ యుంటుంది. చేసిందే చేస్తాం. ప్రకంపనము ఎందుకు రావు? ఎందుకు పట్టించుకోం? మత్తులోనే పడుకుందాం. కష్టపడి ప్రార్ధించడం దేవుని సన్నిధి కొరకు ఉపవసించడం చేయడం మనకు ఇష్టము లేదు.

నలభై ఏళ్లలో ఒక్క ఉజ్జీవము కూడ రాలేదు. ఎందుకని? ఉజ్జీవంపై చాలాసార్లు బోధించాను. ఒక్కసారి కూడ రాలేదు. ఉజ్జీవమును గూర్చి నొక్కి వక్కానిస్తుంటే భయంకరమైన ఎదురు దెబ్బ తగులుతుంది. ప్రజలకు కోపము వస్తుంది. జనాలు సంఘాన్ని విడిచిపెట్టారు. ఉజ్జీవమును గూర్చి గట్టిగా చెప్పడానికి నిజానికి భయపడుతున్నాం. ఆశీర్వాదము బదులు శాపము వస్తుంది! అది ఎందుకంటే మన సంఘాలలో చాలామంది మార్పిడి నొందని వారు. చాలా తక్కువ మంది ఉజ్జీవాన్ని కోరుకుంటున్నారు. మారని వారి విషయంలో మనం ఉత్తేజ భరితులమవుతున్నాం. కాని క్రమేనా వారు వెళ్ళిపోయారు. మనలో చాలామంది మార్పిడి నొందిన వారున్నారు. తిరిగి ఉజ్జీవమును గూర్చి ప్రార్ధించాలని నాకనిపిస్తుంది.

ఇప్పుడు నిజ క్రైస్తవుల సంఖ్య అబద్దపు మార్పిడి నొందిన వారి కంటే ఎక్కువ. అందుకు ఉజ్జీవము కొరకు ప్రార్ధింప ప్రారంభించాం. దేవుని నమ్మి ఆయన జవాబిస్తాడని అనుకొనే వారు సరిపడినంత మంది ఉన్నారు. జెస్సీ జాక్ మిట్ జిన్ రక్షింపబడింది. మిన్ వ్యూ రక్షింపబడ్డారు. డేనీ కేరల్స్ రక్షింప బడ్డాడు. అయాకో జబలాగా రక్షింపబడ్డారు. తిమోతి చాన్ రక్షింపబడ్డాడు. జోసఫ్ గోంగ్ రక్షింపబడ్డాడు. జూలీ సివిలే రక్షింపబడింది. బయాంగ్ జాంగ్ రక్షింపబడ్డారు. అండ్రూ మట్ సుసాకా రక్షింపబడ్డాడు. అలీసియా జాక్ మిట్ జిన్ రక్షింపబడింది. థామస్ లువాంగ్ రక్షింపబడ్డారు. టామ్ జియా రక్షింప బడ్డాడు. ఎర్విన్ లూ రక్షింపబడ్డారు. జెస్సిక ఇన్ రక్షింపబడింది. రోబర్ట్ వాంగ్ రక్షింపబడ్డాడు. సూసన్ చూ రక్షింపబడింది. విర్ జెల్ నికెల్ రక్షింప బడ్డారు. 17 మంది రక్షింపబడ్డారు. డాక్టర్ చాన్ ఉజ్జీవింపబడ్డాడు. జాన్ సామ్యూల్ కాగన్ సువార్తను బోధించడానికి సమర్పించుకున్నాడు. యారన్ యాన్సీ జాక్ జ్ఞాన్ పరిచారకులయ్యారు. క్రిస్టిన్ గుయన్ శ్రీమతి లీ ప్రార్ధనా యోధులయ్యారు.

కాని సుమారు ప్రతి రాత్రి దెయ్యము తన అనుచరులతో మనం పోరాడాల్సిందే! డాక్టర్ కాగన్ దీనిని ఉజ్జీవపు అనుదిన ఖాతాలో దీనిని రాసాడు. "డాక్టర్ హైమర్స్ ఈ డైరీ చదువుతూ రెండు విషయాలు గమించాడు. మొదటిది, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు హాజరవుతాడో, గొప్ప అద్భుత కార్యాలు సంభవించాయి. రెండవది, దేవుడు హాజరవనప్పుడు, ఏమి సంభవించలేదు." ఉజ్జీవము సమయంలో నాపై దాడి చేసి తన కుటుంబముతో గుడి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకయ్యవన స్త్రీ గుడి విడిచిపెట్టింది. "తెరువబడిన ద్వారము" ప్రజలు లానే వారు స్పందించారు. ఇలాంటివి తేటగా చూపిస్తున్నాయి ఉజ్జీవమును వ్యతిరేకించడంలో సాతాను ముఖాన్ని.

జాక్ జ్ఞాన్ ప్రార్ధనలో సాతానుతో పోరాటాన్ని గూర్చి వ్రాసాడు. జాక్ యారన్ యాన్సీతో కలిసి ప్రార్దిస్తున్నాడు. అతనన్నాడు, "మేము దేవుని సన్నిధి కొరకు ప్రార్ధింప ప్రారంభించాము. నేను నా రెండవ ప్రార్ధన ప్రారంభించాక, తల తిరిగినట్టు అనిపించి మూర్చపోబోయాను. ప్రార్ధనలు సిద్ధ పరచడంలో కష్టమనిపిస్తుంది నేను కొనసాగింపలేనని యారన్ తో చెప్పాను. యారన్ ప్రార్ధించ ప్రారంభించాడు అతడు కూడ ప్రార్ధన చేయడంలో కష్టాన్ని అనుభవించాడు. గొప్ప దెయ్యపు అడ్డంకు ఉన్నట్టు మాకనిపించింది మేము మోకాళ్ళపై ప్రార్ధించ ప్రారంభించాము క్రీస్తు రక్తము కొరకు దెయ్యపు సన్నిధి తొలగి పోవునట్టు. నేను నేలపై సాష్టాంగ పడ్డాను ముఖము నేలపై ఉంచి. మేము మూడవసారి ఈ స్థానములతో ప్రార్ధించ ప్రారంభించాము మాకు అనిపించింది దేవుడు మబ్బును తొలగించి దెయ్యపు సన్నిధిని వెళ్ళగొట్టాడు. మాకు తెలుసు కూటము క్లిష్టమైనదిగా ఉండబోతుందని. ఇది సుమారు సాయంత్రము 4 గంటలకు జరిగింది."

ఆ రాత్రి, రెండు గంటల తరువాత సాయంకాలపు ఆరాధనలో, నేను ఎందుకు అమెరికా పాశ్చాత్య దేశాలలో ఎందుకు ఉజ్జీవము లేదు అనే విషయంపై. ఆ ప్రసంగము జాన్ కాగన్ పూర్తి సాక్ష్యము కలిపి ఉంది. నేను ఆహ్వానము ఇచ్చినప్పుడు నిక్కెల్ ముందుకు వచ్చి కన్నీటితో తాను నశించానని ఒప్పుకున్నారు. డాక్టర్ కాగన్ అతనికి ఉపదేశించాడు అతడు యేసును నమ్మి రక్షింపబడ్డాడు. ఇప్పుడు మనకు తెలుసు ఎందుకు యారన్ జాక్ జ్ఞాన్ సాతానుతో అంత పోరాటం అనుభవించారో రెండు గంటల ముందు!

నూతన సంవత్సరము రోజున నేను ఒక ప్రసంగము, "నరకపు సంవత్సరము – ఉజ్జీవము సంవత్సరము!" అనే అంశముపై బోధించాను నేనన్నాను మనము నిజ నూతన నిబంధన క్రైస్తవ్యము అనుభవాన్ని పొందామని – అదే ఆత్మీయ పోరాటము.

"ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముల తోనూ పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:12).

ప్రార్ధనలో నిజ పోరాటము ద్వారా యుద్ధాన్ని జయించవచ్చు.

మంగళవారము జాన్ సామ్యూల్ మరియు డాక్టర్ కాగన్ భారతదేశము వెళ్తారు అక్కడ జాన్ మూడు వివిధ సువార్తిక కూటాలలో బోధింపబోతున్నారు. మన సంఘములో ప్రతి ఒక్కరిని బుధవారము సాయంకాలము ప్రార్ధన కూటానికి పిలుస్తున్నాను – సువార్త లేదు. ఒక గంట జాన్ కాగన్ కూటాలలో మార్పిడుల కొరకు, ఇంకొక గంట మన సంఘములో దేవుడు ఉజ్జీవములో దిగి వచ్చునట్టు ప్రార్ధిద్దాం. మీరందరినీ నేను అడుగుచున్నాను ఈ ప్రాముఖ్య ప్రార్ధనా కూటానికి బుధవారము రాత్రి 7 గంటలకు ప్రార్ధించడానికి.

ఈ రాత్రి నేను సువార్త బోధింప లేదు. కాని ప్రతి ఆరాధనలో అన్నిసార్లు ఇదే బోధిస్తాను. యేసు సిలువపై నీ పాపముల నిమిత్తము చనిపోయాడు. సమస్త పాపముల నుండి నిన్ను కడుగడానికి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆయన సజీవునిగా దేవుని కుడి పార్శ్వాన్న కూర్చున్నాడు నీ కొరకు ప్రార్ధిస్తూ. యేసు క్రీస్తూనే నమ్ము. ఆయన నీ పాపముల నుండి దేవుని తీర్పు నుండి నిన్ను రక్షిస్తాడు. నీవు త్వరలో యేసును విశ్వసించాలని ప్రార్ధన.

డాక్టర్ కాగన్ మరియు జాన్ కాగన్, దయచేసి వచ్చి వేదిక ముందు ఉన్న కుర్చీలలో కూర్చోండి. వారు మంగళవారము భారతదేశానికి మూడు వారాల కొరకు వెళ్తున్నారు. జాన్ మూడు వేరువేరు పట్టణాలలో సువార్త కూటాలలో బోధింపబోతున్నారు. ఈ గుంపులో ప్రతి ఒక్కరు, దయచేసి ముందుకు వచ్చి వారి కొరకు ప్రార్ధించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము డాక్టర్ సి. ఎల్. కాగన్ గారిచే: ఎఫెస్సీయులకు 6:10-12.
ప్రసంగమునకు ముందు పాట బెంజమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"కదలండి, క్రైస్తవ సైనికులారా" (సబైన్ బేరింగ్-గోల్డ్ గారిచే, 1834-1924).
“Onward, Christian Soldiers” (by Sabine Baring-Gould, 1834-1924).