Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నోవాహు ఓడచే చిత్రీకరింపబడిన సువార్త

THE GOSPEL PICTURED BY THE ARK OF NOAH
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, జూన్ 18, 2017 బోధింపబడిన ప్రసంగము
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, June 18, 2017

"మన ముఖములను ఆయన నుండి త్రిప్పికొని యున్నాము; అతడు తృనీకరింపబడిన వాడు, గనుక మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి" (యెషయా 53:3).


మీరు మార్పు నొందకపోతే ఇలాగే చేస్తారు. క్రీస్తు నుండి ముఖము త్రిప్పుకుంటారు. క్రీస్తును తృనీకరిస్తారు. క్రీస్తును ఎన్నిక చేయరు. ఇలా క్రీస్తును గూర్చి ఆలోచిస్తారు. నేను కాదు అని మీరు అనవచ్చు. యేసును గూర్చి ఇలా ఆలోచించాను అనవచ్చు. మీరు యేసును ప్రేమిస్తున్నమనుకుంటారు, కాని మీరు మోసపుచ్చుకుంటున్నారు. ప్రవక్త యిర్మియా అన్నాడు, "హృదయము అన్నింటికన్నా మోసకరమైనది" (యిర్మియా 17:9). యేసును ప్రేమిస్తున్నావు అని నీ హృదయము చెప్పినప్పుడు నీ హృదయం బాగానే ఉందనుకుంటావు. నీ హృదయము సత్యపూరిత మనుకుంటావు, కాని నీది తప్పు. అది "అన్నింటికంటే" మోసకరమైనది. నీ స్వంత హృదయము కంటే మోసకరమైనది ఇంకొకటి లేదు. అది బ్రాంతి, అది నిజాయితీ ద్వందత్వముతో నిండుకొని ఉంది. నీ హృదయము "అన్నింటికంటే" నిజాయితీ లేనిది. నీ హృదయాన్ని మించిన మోసకరమైనది ఇంకొకటి లేదు.

ఇతరులకంటే నీ హృదయము యదార్ధత లేనిదని నీ హృదయాన్ని గూర్చి ఆలోచిస్తూ నిన్ను నీవు ఆదరించుకుంటావు. నీవు సరియే. ఒక విధంగా అది సత్యమే. కాని ఒక సత్యము నీవు ఆలోచించ లేదు ప్రతి ఒక్కరి హృదయము మూల పాపము ద్వారా కలుషితమవుతుంది. డబ్భై ఐదేళ్లుగా ఇంకొక కారణమూ నేను చూసాను. మూలపాపానికి బలవంతముగా వస్తున్నాను, ఎలా వివరించాలో నాకు తెలియదు ఎందుకు నాకు తెలిసిన ప్రతివ్యక్తి ఎందుకు "ఆయన నుండి ముఖము దాచుకుంటాడో" ఏదేను వనములో అవతార క్రీస్తు నుండి ఆదాము ముఖము దాచుకున్నట్టు.

"మన ముఖములను ఆయన నుండి త్రిప్పికొని యున్నాము; అతడు తృణీ కరింపబడినవాడు, కనుక మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి" (యెషయా 53:3).

నీవు యేసును లెక్క చెయ్యవు. యేసు ప్రాముఖ్యమని అనుకోవు.

ఈ వచనము తప్పనే బ్రాంతిలో జీవిస్తావు – యేసు నిజంగా ప్రేమిస్తున్నా వనుకుంటావు, ఆయనను ఎన్నిక చేస్తున్నావు అనుకుంటావు. కాని విషపూరిత, పాప భూఇష్ట , పాప హృదయాన్ని అంగీకరించే బదులు – నీ హృదయ అంచనాను సందేహించాలి.

క్రీస్తు ఒంటరి తనాన్ని గూర్చిన అంతరంగిక తలంపులు నీకున్నాయా? నీవు చెప్పగలవా? విని నిన్ను నీవు అడుగుకో నిజాయితీ చెప్పగాలవేమో (నిజాయితీగా) – నీవు చెప్పగలవా, "సువార్త, మునుపు నీరసంగా నిర్జీవంగా ఉండేది, కాని ఇప్పుడు యేసును గూర్చి వింటే ఉత్సాహంగా ఉంది?" నీవు నిజాయితీగా అలా చెప్పగలవా? లేకపోతే, ఇది నిరూపిస్తుంది నీవు ఏమి జలగలా యేసును ఎన్నిక చెయ్యడం లేదని!

లేక ఇలా చెప్తావా: "యేసు నా కొరకు సిలువ వేయబడ్డాడు, నేను ఆయనకు శత్రువుగా ఉన్నప్పుడు, నేను ఆయనకు లోబడలేదు. ఈ తలంపు నన్ను కదిలించింది. క్రీస్తు తన ప్రాణాన్ని నాకిచ్చాడు, దానిని బట్టి నా సమస్తము ఆయనకు ఇస్తాడు... యేసు నా విమోచకుడు, నా విశ్రాంతి, నా సంరక్షకుడు. క్రీస్తుకు ఎక్కువ చేయలేను. యేసును సేవించుటకు నాకు ఆనందము"? నిజాయితీగా నా ఈ మాటలు చెప్పగలవా – జాన్ కాగన్ చెప్పినట్టు? సంకోచిస్తే, నీవు యేసు నుండి దాగుకుంటున్నావని, యేసును గూర్చి ఎక్కువ ఆలోచించడం లేదని తెలుసా?

పాపపు ఒప్పుకోలు మరియొక పరీక్ష యేసు పట్ల నీ ప్రేమ విషయంలో. యేసును తిరస్కరించినందుకు పాపినని నీకనిపించే వరకు, యేసు క్రీస్తును నీవు ఎన్నిక చెయ్యవు! యేసు అన్నాడు,

"[పరిశుద్ధాత్మ] వచ్చినప్పుడు, పాపమును గూర్చి లోకమును ఒప్పుకొనచేయును...పాపమును గూర్చి, లోకులు నా యందు విశ్వాస ముంచలేదు" (యోహాను 16:8, 9).

యేసును తిరస్కరించినందుకు నీవు పాపపు ఒప్పుకోలు పొందకపోతే, అది కచ్చితమైన సూచన "నీవు ఆయనను ఎన్నిక చేయలేదని." డాక్టర్ డబ్ల్యూ. జి. టి. షెడ్ మనకు చెప్పాడు, "పరిశుద్దాత్మ పాపపు ఒప్పుకోలు లేకపోతే ఒక వ్యక్తిని పునరుద్దరింపదు." నేరారోపణ ప్రభువు ద్వారా ఒక వ్యక్తిని విడుదల చేస్తుంది.

క్రీస్తు ఎంత విలువైన వాడో నీవు చూడవు    ఆటలు ఆడుకుంటూ.
      మరణమును గూర్చి భయపడుతూ.
         విడిచిపెట్టేయడం.
            పాపపు ఒప్పుకోలు లేకుండా.

ఎవరైనా అనవచ్చు, "అవి కష్టతర సిద్ధ పాట్లు అని." కాని ఈ సిద్ధపాటు నీకు అవసరము!

బైబిలు అంతటిలో యేసు గొప్ప శీర్షిక. యేసు ఇద్దరు శిష్యులను కలిపినప్పుడు, వివరంగా వారితో మాట్లాడుతాడు. లూకా 24:25-27 చూడండి. అది స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1112 పుటములో ఉంది. నేను చదువు చుండగా నిలబడండి.

"అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటిని నమ్మని మందమతురాలా. క్రీస్తు ఈలాగు శ్రమపడి, తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? అని వారితో చెప్పి మోషేయ సమస్త ప్రవక్తలను మొదలుకొని, లేఖనములన్నింటిలో [వివరించబడిన] తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను" (లూకా 24:25-27).

యేసు ఇదంతా బోధించడానికి కొన్ని గంటలు గడిపాడు. పాత నిబంధన సుదీర్ఘము, కింగ్ జేమ్స్ తర్జుమాలో 984 పేజీలు . యేసు ఆదికాండము 6వ, 7వ మరియు 8వ అధ్యాయములకు వెళ్ళినప్పుడు, ఆయన నోవాహు ఓడ ఆయనను గూర్చి ఎలా చెప్పిందో వివరించి ఉంటాడు. నోవాహు వివరణకు వచ్చినప్పుడు, గొప్ప ప్రళయము, ఓడ, "ఆయనను గూర్చిన విషయాలు" చూపించి ఉంటాడు (లూకా 24:27). ఆదికాండములోని ఈ అధ్యాయాలు చాలా ప్రాముఖ్యము వ్యాఖ్యానము లేకుండా వాటిని వివరించలేదు.

నిజంగా, ఆదికాండము ఆరు, ఏడూ, ఎనిమిది అధ్యాయాలు దృష్టాంతములు, విధములు క్రీస్తు చిత్రములను కలిగియున్నవి. మోషే రచనలతో ప్రారంభించాడు, కనుక, అక్కడ వివరించాడు "ఆయనను గూర్చిన లేఖన భాగములు" (లూకా 24:27), నిస్సందేహంగా ఓడ ఆయనను గూర్చి ఏమి మాట్లాడిందో వారికి చెప్పి ఉంటాడు.

అవును, బైబిలు అంతటిలో యేసు గొప్ప శీర్షిక, ఓడను గూర్చి చదవడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. ఇక్కడ సువార్తలోని చాలా విషయాలున్నాయి యేసు నిస్సందేహంగా చెప్పి ఉంటాడు "ఆయనను గూర్చిన లేఖన భాగములను వివరించాడు" (లూకా 24:27).

I. మొదటిది, ఓడ క్రీస్తును ఆకర్షణ లేనివానిగా చిత్రీకరిస్తుంది.

నేను చెప్పినట్టు, నోవాహు ఓడ అందమైన రంగులతో కూడినది కాదు, సబ్బాతు బడిలో కొందరు అవివేక ఉపాధ్యాయులు చూపించినట్టు. కాదు! కాదు! ఓడ నల్లని చెక్కతో చేయబడిన పెద్ద నిర్మాణము. లోపల బయటా, నల్లరంగుతో నిండి ఉంది. దేవుడు చెప్పాడు:

"చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసికొనుము; అరలు పెట్టి ఆ ఓడను చేసి, లోపలను బయటను దానికి కీలు పూయవలెను" (ఆదికాండము 6:14).

ఓడ కఠిక నల్లని పెట్టె క్రింద బల్ల పరుపుగా ఉంది. అది సుమారు 500 అడుగుల పొడవు. 90 అడుగుల వెడల్పు 60 అడుగుల ఎత్తు కలదు. అది తేలియాడడానికి నిర్మింపబడింది, మునిగిపోవడానికి కాదు. అది లోపల బయట అందవిహీనమైన, నల్లని, పరికరము. దానిలో అందము లేదు. ఇది యేసు క్రీస్తును గూర్చిన చిత్రము. క్రీస్తును గూర్చి బైబిలు ఇలా చెప్తుంది:

"అతనికి సరూపమైన సొగసైనను [ఘనమైనది] లేదు; మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతని యందు సరూపము లేదు. అతడు తృణీకరింప బడిన వాడు ఆయెను...ఆయన నుండి మన ముఖములను త్రిప్పికొంటిమి; అతడు తృణీకరింపబడిన వాడు, కనుక అతనిని ఎన్నిక చేయకపోతిమి" (యెషయా 53:2-3).

ఇలానే చాలామంది ఓడను చూచి ఉంటారు కదా, అది భూమి మీద ఉన్నప్పుడు, జల ప్రళయము రాకపునుపు? దానికి సరూపము సొగసు లేదు. దానిని కోరుకోలేదు. యేసు వలే అది కూడ మనష్యులచే తృణీకరింపబడి, తిరస్కరించబడింది. యేసు నుండి ముఖము తిప్పుకున్నట్టే, ఓడ నుండి కూడ వారు ముఖాలు దాచుకున్నారు. ఓడ తృణీకరింపబడింది ఎన్నిక చేయబడలేదు. అందుకే అందులో ప్రవేశించడానికి వారు నిరాకరించారు, యేసు నొద్దకు రావడానికి తిరస్కరించినట్టు.

"ఈ నల్లని మ్రాను, మనలను ఎలా రక్షిస్తుంది?" వారనుకొని ఉంటారు. ఈనాడు చాలామంది క్రీస్తు నొద్దకు వచ్చి రక్షింపబడడానికి నిరాకరిస్తున్నారు. వారనుకుంటారు, "మనమెందుకు మన అనుదిన జీవితమూ, సంతోషము సుఖ భోగాలు వదులుకొని, అందవిహీన నల్లని దానిలో, ప్రవేశించాలి?" మత్తయి ఇరవై నాలుగు, ముప్పై ఏడూ ఇలా చెప్తుంది:

"నోవాహు దినములు ఎలాగుండెనో [నోవాహు], మనష్యు కుమారుని రాకడ అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లి కిచ్చుచు నుండి జల ప్రళయము [నోవాహు] వచ్చు వరకు, అందరిని కొట్టుకొని పోవు వరకు, ఎరుగకపోయిరి: అలాగునే మనష్యు కుమారుని రాకడ ఉండును" (మత్తయి 24:37-39).

ఇది చూపిస్తుంది వారు విన్తులలో తినడం త్రాగడం ఆపడం ఇష్టం లేదు. వారు విలాసవంతమైన దీర్ఘ వివాహాలకు హాజరు అవడం ఆపడం వారికి ఇష్టము లేదు ఆరోజులలో ప్రజలు వాటికీ బానిసలై పోయారు. ఎందుకు, వారి వినోదాలు వదులుకోవాలి, వారి "కలవడాలు" నాట్యమాడడం త్రాగడం –వినోదము – వారనుకున్నారు నల్ల ఓడలో ప్రవేశిస్తే అలాంటి "వినోదము" లాంటివి, ఉండదనుకున్నారు.

కాని వారు తప్పు. లోకములో ఒకే స్థలము "వినోదము" ఉన్నది జల ప్రళయము సమయములో సంతోషము ఉంది కేవలము ఓడలోనే. నోవాహు అతని కుటుంబము గొప్ప సహవాసము కలిగి యున్నారు వారు కలిసి పనిచేస్తూ ఆ సమయంలో భూమి నీటితో నిండియున్నప్పుడు వారు జంతువులకు ఆహారము పెట్టారు.

భయంకర జల ప్రళయ సమయంలో ప్రపంచములో ఓడ మాత్రమే ఒక సంఘము. ఆ సమయంలో నోవాహు తన ఏడుగురు కుటుంబ సభ్యులు ఒకే ఒక సంఘము, వారు అద్భుత సహవాసము, ప్రేమతో కూడిన ఆరాధన, దైవ ఆనందము ఓడలో వారు కలిగియున్నారు.

కాని స్థానిక సంఘాన్ని మారని ప్రజలు అలా చూడగలుగుతున్నారా? చాలామంది నశించు తల్లిదండ్రులు అంటారు, "ఎందుకు యవనస్తులు గుడిలో అంత ఎక్కువగా ఉంటారు? వారిని ఏమి ఆకర్షిస్తుంది? వారికి త్రాగుడు, మత్తు పదార్ధాలు, గుడిలో సంబరాలు లేవు. ఆ గుడిలో చట్ట విరుద్ధ లైంగిక సంబంధాలు ఉండవు. కాని అక్కడే ఉండాలనుకుంటారు. ఆ అందవిహీన, పాత గుడి భవనములో ఏముంది, నా కొడుకు కూతురు అక్కడ ఎక్కువగా ఉండిపోవడానికి?"

మంచిది, మీరు నమ్మని కుటుంబముతో స్నేహితులతో ఇలా జవాబివ్వవచ్చు: "ఆ గుడి మా ఓడ. అది మమ్మును కాలిన, ఒంటరి జీవితాల నుండి రక్షిస్తుంది. ఇప్పుడు మేము ఈ స్థానిక బాప్టిస్టు సంఘములో జీవిస్తున్నాము. ఇక్కడ మాకు ఎక్కడ లేని ఊహించని, మంచి పవిత్ర వినోదముంది! ఎందుకు ఒంటరిగా ఉండడం? ఇంటికి రండి – సంఘానికి రండి! ఈ అందవిహీన, పాత గుడి భవంతిలో, మేము చల్లబడిన ఒంటరి లోకం నుండి ఆశ్రయము కనుగొన్నాము. మీరు వచ్చి ఆనందము, సహవాసము చూచి, సజీవ దేవుని ఇంటిలోనికి ఎందుకు రాకూడదు? దయచేసి క్రమముగా ఈ ఓడలోనికి రండి, ఈ గుడికి మాకున్న ఆనందము, మీరు కూడ కనుగొనవచ్చు."

అవును, ఓడ అందవిహీన, నల్లని వస్తువు, కాని ఆనందము, స్నేహము ప్రేమ ఉన్న స్థలమిది. ఇంటికి రండి! ఈ తృణీకరింపబడిన స్థానిక సంఘములోనికి రండి. మీరు రక్షింపబడతారు, మాతోపాటు సంతోష భరిత జీవితమూ అనుభవిస్తారు!

II. రెండవది, ఓడ క్రీస్తు రక్తమును చిత్రీకరిస్తుంది.

దయచేసి ఆదికాండము, ఆరవ అధ్యాయము, పద్నాల్గవ వచనము బైబిలులో చూడండి. దేవుడు నోవాహుతో అన్నాడు:

"చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము; అరలు పెట్టి ఆ ఓడను చేసి, లోపలను వెలుపలను దానికి కీలు పూయవలెను" (ఆదికాండము 6:14).

నిర్దిష్ట వ్యాఖ్యాత హెచ్. సి. లిఫోల్డ్ దానిని ఇలా అనువదించాడు, "దానికి లోపల బయటను కీలు పూయవలెను" (Exposition of Genesis, Baker, 1976, volume 1, p. 269).

డాక్టర్ లిఫోర్డ్ ఓడలోని గదులను గూర్చి కీలును గూర్చి ఇలా వివరించాడు.

పదము "కణములు" (క్వినిమ్) "పక్షిగుండు" కు ఉపయోగిస్తారు. తరువాత, ఆ గదులు వివిధ జంతువులకు గదులుగా ఉండడానికి ఏర్పాటు చేయబడ్డాయి...ఇది ఓడ కాదు కాని ఒక పెద్ద తేలియాడే పెట్టె అది ఒక ఓడ అంత కొలతలు గలది. ఈ ఓడ ఓడ ప్రయాణానికి కాదు విహారానికి కాదు. అది తేలియాడడానికి రూపించబడింది. అది లోపల బయట కీలు పూయబడి ఉంది "పిచ్" (కోపర్) (ఐబిఐడి., పేజీలు 270).

డాక్టర్ లిఫోల్డ్ ఇలా వివరించాడు పదములు "కఫార్" "కోఫర్" (ఐబిఐడి.). "కఫార్" హెబ్రీయ పదము బైబిలులో "నెరవేర్పుగా" అనువదింప బడింది. "కఫార్" కు క్రియ "నెరవేర్పు" బైబిలులో పాత నిబంధనలో డబ్భై సార్లు అనువదింప బడింది.

లేవియా కాండము 17:11 ఈ పదానికి అర్ధాన్ని మనకు తెలియ చేస్తుంది.

"రక్తము దేహమునకు ప్రాణము: మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకిచ్చితిని: రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును" (లేవియా కాండము 17:11).

రెండు సార్లు పదము "ప్రాయశ్చిత్తము" అనువాదము "కఫార్," అనుపదమునకు దాని అర్ధము "కప్పుట." యేసు క్రీస్తు రక్తము మన పాపములను "కప్పును." అది నూతన నిబంధనలో ఇలా చెప్పబడింది:

"తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపములకు ప్రయాశ్చిత్తము నొందినవాడు ధన్యుడు" (రోమా 4:7).

ఓడ కీలుచే కప్పబడింది ప్రళయ తీర్పు నుండి రక్షించడానికి. మీరు క్రీస్తులోనికి వచ్చునప్పుడు, ఆయన రక్తముచే కప్పబడుచున్నారు, దేవుని తీర్పు మీకు హాని చేయదు. దేవుడు నోవాహుతో అన్నాడు, "రమ్ము...ఓడలోనికి రమ్ము" (ఆదికాండము 7:1). నోవాహులోనికి వచ్చినప్పుడు, కీలు వేయబడిన గోడలచే కప్పబడ్డాడు. కీలు ఒకరకపు క్రీస్తు రక్తము. మీరు క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు, మీరు ప్రత్యక్షంగా క్రీస్తు రక్తముచే ఆవరింప బడతారు, మరియు "మీ పాపములు కప్పబడును" (రోమా 4:7)!

"అప్పుడు యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును" (I యోహాను 1:7).

అందుకే యేసు సిలువపై మరణించాడు – తద్వారా ఆయన రక్తము మీ అతిక్రమములు తుడిచివేసి మీ పాపములను కప్పును.

"అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపములకు ప్రయాశ్చిత్తము నొందినవాడు ధన్యుడు" (రోమా 4:7).

III. మూడవది, ఓడ పునరుత్థానమును చిత్రీకరిస్తుంది.

ఓడ ఒకరకమైన పునరుత్థానము. ఓడ అలరాతు పర్వతము మీద నిలిచింది క్రీస్తు మృతులలో నుండి లేచినప్పుడు.

మీరు ఇంకొకటి గమనించాలి. ఆదికాండము, ఎనిమిదవ అధ్యాయము, పద్దెనిమిదవ వచనము వినండి:

"కాబట్టి నోవాహును అతనితో కూడ, అతని కుమారులను, అతని భార్య, అతని కోడళ్ళు బయటికి వచ్చిరి" (ఆదికాండము 8:18).

ఇది యేసు క్రీస్తు పునరుత్థానమును చిత్రీకరిస్తుంది:

"విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత, ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేనే, మరియు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మరియు, ఇదిగో, అప్పుడు మహా భూకంపము కలిగెను: ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి, రాయి పొర్లించి, దాని మీద కూర్చిండెను. ఆ దూత స్వరూపము మెరుపు వలే ఉండెను, అతని రూపం మంచువలే తెల్లగా ఉండెను: అతనికి భయపడుట వలన కావలి వారు, వణికి చచ్చిన వారివలే నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి వారు, భయపడ కుడి: సిలువవేయబడిన యేసును మీరు వెదుకుచున్నారు, అని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు: తాను చెప్పినట్టే, ఆయన లేచి యున్నాడు. రండి, ప్రభువు పండుకొని యున్న స్థలమును చూడుడి" (మత్తయి 28:1-6).

నోవాహు ఓడ నుండి బయటికి వచ్చినప్పుడు, అలాగే క్రీస్తు ఈస్టరు ఉదయము సమాధిలో నుండి బయటికి వచ్చాడు. ఇది చెప్తుంది, "నోవాహు బయటికి వచ్చినప్పుడు, ఆయన కుమారులు, ఆయన భార్య, ఆయన కుమారుల భార్యలు ఆయనతో కూడ ఉండిరి." క్రైస్తవులు ఎత్తబడి, మధ్యాకాశంలో క్రీస్తును కలుసుకుంటారు అనే విషయాన్ని ఇది చూపిస్తుంది (I దెస్సలోనీకయులకు 4:16-17). నోవాహు ఓడ నుండి బయటికి రావడం క్రీస్తు సమాధి నుండి బయటికి రావడం. ఆయన కుటుంబం ఓడ నుండి బయటికి రావడం క్రైస్తవులు ఎత్తబడుటను సూచిస్తుంది.

ఇదంతా సూచన ప్రాయంగా ఉంది. డాక్టర్ జాన్ వార్ విక్ మాంట్ గోమరీ అన్నాడు:

నోవాహు విడుదల – దేవుని కృప ద్వారా నీటిద్వారా [ఓడనుండి] – ఆదిమ సంఘము దీనిఅంతటి నీ నూతన నిబంధనలో ఇవ్వబడిన రక్షణను ముందుగా చూపిస్తుంది. ఓడ సంఘమునకు సూచన (కృపను వెదుకువారు మాత్రమే పాప భూఇష్ట లోక ప్రళయము నుండి తప్పించుకుంటారు); సంఘ నిర్మాణము ఈ ఊహచే ముద్రింపబడింది (ఉదాహరణ., "నావ్" కు లాటిన్ పదము "నావిస్," "ఓడ"). ఆదిమ క్రైస్తవులు [చేర్చబడినవారు] –ఉదాహరణకు – ఓడ సమాధిని సూచించడానికి ఉపయోగింప బడింది, అంత్య దినమున దాని నుండి దేవుడు విశ్వాషిని లేపుతాడు, ఆయన నోవాహును భయంకర ప్రళయం నుండి విడిపించినట్లు (John Warwick Montgomery, Ph.D., The Quest for Noah’s Ark, Bethany, 1972, p. 284).

రెండవ శతాబ్దము మధ్యలో, జస్టిన్ మార్టిన్ అన్నాడు:

నీతిమంతుడైన నోవాహు ఇతరులతో, ఆయన భార్య, ముగ్గురు కుమారులు వారి భార్యలు, మొత్తము ఎనిమిది ఆదినమున సూచనగా ఉంది, శక్తిలో మొదటిది, ఆదినాన క్రీస్తు మృతులలో నుండి లేచాడు. ఇప్పుడు క్రీస్తు, "ప్రతీ సృష్టిలోని తొలిచూలు," ఇంకొక తెగకు అధిపతి అయ్యారు, నీటిద్వారా విశ్వాసము ద్వారా వారు, నూతన జన్మలో ప్రవేశించారు చెక్క సిలువ యొక్క మర్మాలను తెలియచేస్తుంది, చెక్క ఓడ నుండి నోవాహు రక్షింప బడ్డాడు, ఆ ఓడ తన కుటుంబ సభ్యులతో నీటిపై తేలియాడుతూ ఉంది (Justin Martyr, Dialogue with Trypho, cxxxvii, 1-2).

ఆదిమ క్రైస్తవులు ఆచరించినట్లు, సువార్త అంతా కూడ నోవాహు ఓడచే చిత్రీకరింపబడింది. (1) అది అందవిహీన ఓడ, ఆకట్టుకునేటట్టుగా లేదు. కనుక, క్రీస్తు చూడముచ్చటగా లేడు, సువార్త అవివేకముగా అనిపించింది. (2) ఓడ లోపల బయట, చిక్కని కీలుచే పూయబడింది. ఇది క్రీస్తు రక్తమును సూచిస్తుంది మారిన వ్యక్తిని కప్పుతుంది, దేవుడు అతని పాపములను చూడకుండా. (3) ఆ ఓడ అరారాతు పర్వతము మీద నిలించింది, నోవాహు సజీవునిగా బయటికి వచ్చాడు. క్రీస్తు సమాధి నుండి ఈస్టరు ఉదయము, మృతులలో నుండి, పునరుత్థానుడవడంను చూపిస్తుంది.

ఇంకొక విషయము. ఓడ పర్వతము పైన నిలిచింది. క్రీస్తు మూడవ ఆకాశములో, దేవుని పట్టణంలో, సియోను పర్వతమునకు క్రీస్తు ఆరోహణకు డవటాన్ని చూపిస్తుంది. క్రీస్తు ఇప్పుడు, దేవుని కుడి పార్శ్వాన పరలోకంలో ఉన్నాడు. క్రీస్తు నొద్దకు రండి మీరు రక్షింపబడతారు. క్రీస్తు నొద్దకు రండి ఆయన రక్తపు "కీలుచే" మీ పాపములు కప్పబడతాయి. క్రీస్తు నొద్దకు రండి, మీరు పరలోకమునకు వెళ్ళగలరు. నోవాహు తన కుటుంబము ప్రళయము నుండి తప్పించుకున్నట్టు, నరకం నుండి మీరు తప్పించుకుంటారు. మీరు క్రీస్తులోనికి రావాలి, నోవాహు ఓడలోనికి వచ్చినట్టు!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్: మత్తయి 28:1-6.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"రక్తముచే రక్షింపబడుట" (ఎస్. జే. హెండర్ సన్ చే, 19 వ శతాబ్దం).
“Saved by the Blood” (by S. J. Henderson, 19th century).ద అవుట్ లైన్ ఆఫ్

నోవాహు ఓడచే చిత్రీకరింపబడిన సువార్త

THE GOSPEL PICTURED BY THE ARK OF NOAH

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"మన ముఖములను ఆయన నుండి త్రిప్పికొని యున్నాము; అతడు తృనీకరింపబడిన వాడు, గనుక మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి" (యెషయా 53:3).

(యిర్మియా 17:9; యోహాను 16:8, 9; లూకా 24:24-27)

I. మొదటిది, ఓడ క్రీస్తును ఆకర్షణ లేనివానిగా చిత్రీకరిస్తుంది,
ఆదికాండము 6:14; యెషయా 53:2-3; మత్తయి 24:37-39.

II. రెండవది, ఓడ క్రీస్తు రక్తమును చిత్రీకరిస్తుంది, ఆదికాండము 6:14;
లేవియ కాండము 17:11; రోమా 4:7; ఆదికాండము 7:1; I యోహాను 1:7.

III. మూడవది, ఓడ పునరుత్థానమును చిత్రీకరిస్తుంది, ఆదికాండము 8:18;
మత్తయి 28:1-6; I దెస్సలోనీకయులకు 4:16-17.