Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




నిస్సహాయులకు రక్షణ

SALVATION FOR THE HELPLESS
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారం సాయంకాలము, జూన్ 3, 2017 బోధింపబడిన ప్రసంగము
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Saturday Evening, June 3, 2017


మనం లేచి నిలబడదాం, దయచేసి మీ బైబిలు తెరవండి మార్కు సువార్తలోని పాఠ్యభాగమునకు. అది మార్కు 9:26-27,

"అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిలాడించి, వదిలిపోయెను: అంతటా వాడు చచ్చిన వానివలె ఉండెను; గనుక అనేకులు, వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి, వానిని లేవనెత్తగా; వాడు నిలబడెను" (మార్కు 9:26-27).

యేసు ఈ బాలుని దెయ్యపు శక్తి నుండి రక్షించాడు. ఒక కారణానికి ఈ కథ ఇవ్వబడినది. ఎలా యేసు ఒక నశించిన నిస్సహాయ ఆత్మను ఈనాడు ఎలా రక్షించగలడో చూపించడానికి ఇది ఇవ్వబడింది. ఇలాంటి కథలు నాలుగు సువార్తలు, మత్తయి, మార్కు, లూకా యోహానులలో, ఉన్నాయి. నిస్సహాయ ఆత్మలు ఎలా రక్షింపబడ్డాయి అవి చూపిస్తున్నాయి. ఈ కథలు రక్షణ వివిధ కోణాలను గూర్చి చెప్తున్నాయి. వాటిని చదవడం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

ఈ బాలుడు దెయ్యము పట్టినవాడు. ఆ దెయ్యము బాలుని చెవిటి మూగవానిగా చేసింది. అతడు వినలేదు మాట్లాడలేదు. రక్షింపబడక మునుపు ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. రక్షింపబడక మునుపు దేవుడు చెప్పేది మీరు వినలేరు. దానిని గూర్చి మాట్లాడలేరు.

కానీ క్రీస్తు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. క్రీస్తు దెయ్యము కంటే బలవంతుడు. అందుకే క్రీస్తు మిమ్మును రక్షింపగలడు! ఆయన ఈ బాలుని రక్షించాడు మిమ్మును కూడ రక్షింపగలడు! క్రీస్తు ఎవరినైనా రక్షింపగలడు, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికినీ! క్రీస్తు దెయ్యము నుండి మిమ్మును విడిపించగలడు! ఈ కథ నుండి రక్షణను గూర్చి మూడు గొప్ప సత్యాలు మీరు నేర్చుకోవచ్చు.

I. మొదటిది, నీవు చచ్చిన వానివలే ఉన్నావు.

వాక్యభాగము చెప్తుంది,

"వాడు చచ్చినవాని వలే ఉండెను; కనుక అనేకులు, వాడు చనిపోయెననిరి" (మార్కు 9:26).

రక్షింపబడక మునుపు ప్రతి ఒక్కరి స్థితి ఇలాగే ఉంటుంది. బైబిలు బోధిస్తుంది మానవాళి అంటా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉందని. నీవు ఆత్మీయంగా చచ్చినవాడవు! బైబిలు చెప్తుంది,

"ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపమూ ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో; ఆలాగుననే మనుష్యులందరు పాపమూ చేసినందున మరణము అందరికిని సంప్రాప్తము ఆయెను..." (రోమా 5:12).

మన ఆదిమ తల్లిదండ్రులు దేవునికి వ్యతిరేకముగా పాపమూ చేశారు – వారు ఆత్మీయంగా చచ్చినవారు. ఆదాము దేవుని నుండి తొలగించబడ్డాడు, ఆత్మీయ చచ్చిన స్థితిలో దేవుని నుండి వేరైపోయాడు. ఆ ఆత్మీయ మరణము మానవాళి అందరికి సంక్రమించింది. అందుకే చాలా మతాలూ ఉన్నాయి. ఆత్మీయ చీకటి మరణమును బట్టి, మానవాళి చాలా మతాలూ సృష్టించింది. కానీ మానవాళి నిజమైన సజీవుడైన దేవుని కనుగొనలేరు.

అపొస్తలులైన పౌలు ఏదెనులో, ఒక గుంపుతో మాట్లాడుతూ ఇలా అన్నాడు,

"నేను సంచరించుచు, మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా, ఒక బలిపీఠము నాకు కనబడెను, దానిమీద తెలియబడన దేవునికి అని వ్రాయబడి యున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగియున్నారో, దానినే నేను మీకు ప్రచుర పరచుచున్నాను" (అపొస్తలుల కార్యములు 17:23).

వారికి చాలా విగ్రహాలు దేవుళ్ళు ఉన్నాయి. నిజ దేవుడు వారికి తెలియలేదు. అతని వారు, "తెలియని దేవుడు" అన్నాడు.

ఈ రాత్రి దేవుడు మీకు తెలియదు. ఆయన "తెలియని దేవునిగా" మీకు ఉన్నాడు. దేవుడు మీకు వాస్తవమనిపించడు. దేవుని విషయాలలో మీరు చచ్చినవారు. మీరు ఆత్మీయగా చచ్చినవారు. మన కథలోని బాలుని వలే ఉన్నారు.

"వాడు చచ్చిన వానివలే ఉండెను; కనుక అనేకులు, వాడు చనిపోయెననిరి" (మార్కు 9:26).

బైబిలు చెప్తుంది,

"మీరు, మీ పాపముల వలన చచ్చిన వారై యున్నారు" (కొలస్సయులకు 2:13).

బైబిలు చెప్తుంది మీరు

"అపరాధముల వలనను పాపముల వలనను చచ్చిన వారు " (ఎఫెస్సీయులకు 2:1).

తప్పిపోయిన కుమారుని తండ్రి అన్నాడు,

"నా కుమారుడు చనిపోయెను" (లూకా 15:24).

అతడు తప్పిపోయిన వాని సహోదరునితో అన్నాడు,

"నీ తమ్ముడు చనిపోయెను" (లూకా 15:32).

రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఒకప్పుడు ఇలాగే ఉన్నాడు. పాపములో మనమందరము చచ్చినవారము. దేవుడు మనకు తెలియదు. దేవుని గూర్చి మనము ఎరుగము. బైబిలు ఒక కట్టు కథలా అనిపిస్తుంది, మనం ఆత్మీయంగా చక్కునిపోయాడు కాబట్టి.

"వారైతే అందమైన మనస్సుగలవాడై, తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత, దేవుని వలన కలుగు జీవము నుండి వేరు పరచబడ్డారు" (ఎఫెస్సీయులకు 4:18).

మనం రక్షింపబడకముందు మన అందరి వివరణ ఇలాగే ఉంటుంది! మీరు యేసుచే రక్షింపబడాలి. యేసు మాత్రమే మిమ్ములను ఆత్మీయ మరణము నుండి రక్షింపగలడు.

II. రెండవది, మీరు యేసు "చేతితో తీసుకొనబడ్డారు."

మన పాఠ్య భాగము చెప్తుంది,

"వాడు చచ్చిన వానివలే ఉండెను; గనుక అనేకులు, వాడు చనిపోయెననిరి. కానీ యేసు వాని చెయ్యి పట్టుకొనెను..." (మార్కు 9:26-27).

అది అద్భుతమైన వచనము! "కానీ యేసు వాని చెయ్యి పట్టుకొనెను"! మేల్కొల్పునకు అది దృష్టాంతము. అది అత్యంత కృప చిత్రము. ఇది మన రక్షణను గూర్చిన కథ. నిస్సహాయులకు రక్షణ!

"మీరు వాటిని చేయుచు వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి [సాతాను] అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మమూ చొప్పున మునుపు నడుచుకొంటిరి: వారితో కలిసి మనమందరమును శరీరమును యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు... మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారి వలెనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయినను దేవుడు, కరుణా సంపన్నుడై యుండి, మనము అపరాధముల చేత చచ్చిన వారమై యుండినప్పుడు, సయితము మన యెడల చూసిన తన మహా ప్రేమ చేత, మనలను క్రీస్తుతో కూడ బ్రతికించెను, (కృప చేత మీరు రక్షింపబడియున్నారు;) క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, అత్యధికమైన తన కృపా మహా దైశ్వవ్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడ లేపి పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండ బెట్టెను...మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు: ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే: అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలులేదు" (ఎఫెస్సీయులకు 2:2-9).

ఇది కృప ద్వారా రక్షణ! అది క్రీస్తుచే రక్షణ! అది పరలోకానికి మార్గము! అది ఒకేఒక మార్గము!

"వాడు చచ్చినవాని వలే ఉండెను; గనుక అనేకులు, వాడు చనిపోయెననిరి. కానీ యేసు వాని చెయ్యి పట్టి వానిని లేవలేత్తెను..." (మార్కు 9:26-27).

యేసు రాకముందు, మీరు పట్టించుకొనని మేల్కొల్పు లేని స్థితిలో ఉన్నారు. మీ ఆత్మకు ఏమి సంభవిస్తుందో మీరు పట్టించుకోలేదు. మార్కు తొమ్మిదిలోని బాలుని వలే ఉన్నారు.

"జన సమూహంలో ఒకడు, బోధకుడు, మూగ దయ్యము పట్టిన నా కుమారుని, నీ యొద్దకు తీసుకొని వచ్చితిని" (మార్కు 9:17).

నేను అలాగే ఉన్నాను. పక్కింటి వారు నన్ను బాప్టిస్టు గుడికి తీసుకెళ్లారు. యితడు తన కుమారుని యేసు వద్దకు తెచ్చినట్టు, వారు నన్ను గుడికి తీసుకెళ్లారు. నాకేమి తెలియదు దేవుని గూర్చి, క్రీస్తును గూర్చి, బైబిలును గూర్చి. నేనెన్నడూ బైబిలు చదవలేదు. మత్తయి సువార్త ఎక్కడ ఉందొ తెలియదు. ఆదికాండము నుండి, చూడడం మొదలు పెట్టాను. మత్తయి సువార్త కనుగొనే సరికి ప్రసంగము అయిపొయింది! వారు నన్ను గుడికి తెచ్చారు. దేవుడు క్రైస్తవులను సాక్ష్యమివ్వడానికి క్రీస్తు నొద్దకు తేవడానికి వాడుకుంటాడు, ఈ వ్యక్తి చేసినట్టు, తన కుమారుని యేసు వద్దకు తెచ్చినట్టు.

అప్పుడు మీరు మేల్కొలుపు అనుభవిస్తారు. అది త్వరగా జరగొచ్చు, లేక ఎక్కువ సమయము పట్టవచ్చు. ప్రజలు వేరుగా ఉంటారు. కానీ మేల్కొలుపు భయంకరమైనది. పౌలు నేలమీదికి త్రోయబడ్డాడు. పెంతే కోస్తులో ప్రజలు హృదయములో నొచ్చుకున్నారు. సిలువపై దొంగ తన తప్పు చూసాడు. అది భయంకరం. జాన్ కాగన్ అన్నాడు, "చనిపోవాలనిపించింది. నవ్వలేదు. శాంతి లేదు. చిత్ర హింసలు తప్పించుకోలేదు. దానిని ఏ మాత్రమూ తీసుకోలేకపోయాను." పరిశుద్ధాత్మ పాపపు ఒప్పుకోలు కలిగించింది. ఏమి జబలాగా అన్నాడు, "పరిశుద్ధాత్మ పాపపు ఒప్పుకోలు కలిగించింది. నేను విసిగి సిగ్గు నొందాను. దేవుడు నా పాపాలన్నీ చూశాడని నాకు తెలుసు. నేను మంచి క్రైస్తవుల మధ్య చిరుతల అనిపించింది." జాక్ జ్ఞాన్ అన్నాడు, "నేను చేసిన భయంకర పాపమూ జ్ఞాపక మొచ్చింది – నేను భయంకర పాపిని."

"వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి: దెయ్యము ఆయనను చూడగానే, వానిని విలవిలా ఆడించెను; గనుక వాడు నేలపడి, నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను" (మార్కు 9:20).

మొదటి మేల్కొలుపు లూయిస్ ద్వీపపు ఉజ్జీవంలో ఇదే సంభవించింది. వారిలో చాలామంది ఏడ్చి క్రిందపడి పాపపు ఒప్పుకోలు పొందారు. ఒక రోజున అమెరికాలో అది జరగవచ్చు. అది "నవ్వే ఉజ్జీవము" కాదు! మార్కు తొమ్మిదిలో బాలుడు నవ్వ లేదు! నిజ ఉజ్జీవము పాపపు ఒప్పుకోలు కలిగిస్తుంది, నవ్వుకాదు!!! గొప్ప ఉజ్జీవాలలో ప్రజలు కొన్నిసార్లు పాప భయంతో పడిపోతారు. చైనాలో తరుచుగా ఇండియాలో ఇప్పుడు జరుగుతుంది – వారు అనుభవించు ఉజ్జీవాలలో.

మేల్కొలుపు పొందినవాడు పాపపు నేరారోపణ పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ మీ పాపమూ మీకు బయలు పరుస్తుంది.

"ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చియు, తీర్పును గూర్చి, లోకమును ఒప్పుకొనచేయును: ఎందుకనగా, వారు నా యందు విశ్వసము ఉంచలేదు" (యోహాను 16:8-9).

మీకు పాపపు గ్రహింపు ఉందా? మీ పాపమును గూర్చి విచారిస్తున్నారు? మీ పాపమును గూర్చి మీ మనస్సాక్షి బాధిస్తోందా? యేసుచే రక్షింపబడాలని మీకు అనిపిస్తుందా? ఇంకా ఎక్కువ ఒప్పుకోలుకు వేచి యుండవద్దు! ఒప్పుకోలు మిమ్ములను రక్షింపదు! ఎంత ఒప్పుకోలైనా మిమ్మును క్షమించదు! దైవకుమారుని యొద్దకు తక్షణమే రమ్ము! ఇప్పుడే రండి! పాపపు ఒప్పుకోలు యేసు నొద్దకు మిమ్మును నడిపించాలి. యేసు మాత్రమే మీ ఒప్పుకోలు నుండి ఉపశమనము ఇస్తాడు!

రండి, అలసిన, భారమైన, నలిగి విరుగగొట్టబడిన వారలారా;
మంచిగా అయ్యే వరకు వేచియుంటే, మీరు రానేరరు.
("రండి, పాపులారా, దీన భయంకరులారా" (జోసెఫ్ హార్ట్ చే, 1712-1768).
      (“Come, Ye Sinners, Poor and Wretched” by Joseph Hart, 1712-1768).

వచ్చి ఇప్పుడే యేసును నమ్మండి, ఒప్పింపబడలేదు అనుకున్నా – ఆయన మిమ్మును రక్షిస్తాడు! "మంచిగా అయ్యే వరకు వేచియుంటే, మీరు రానే రారు." ఇప్పుడే రండి! యేసును నమ్మండి, దైవ కుమారుని! ఇప్పుడే ఆయన మిమ్మును రక్షిస్తాడు!

క్రీస్తు మీ పాప పరిహారార్ధం సిలువపై మరణించాడు. ఆయన రక్తము మీ పాపాన్ని కడిగివేస్తుంది. క్రీస్తు మృతులలో నుండి లేచాడు. పరలోకము క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున – ఆశీనుడై యున్నాడు. క్రీస్తు నొద్దకు రండి! క్రీస్తు నొద్దకు రండి! క్రీస్తు నొద్దకు రండి! క్రీస్తును విశ్వసించండి! క్రీస్తును విశ్వసించండి! క్రీస్తును విశ్వసించండి రక్షింపబడతారు!

III. మూడవది, క్రీస్తును ఎదుర్కోడానికి మీరు లేపబడ్డారు.

"అయితే యేసు వాని చెయ్యిపెట్టి, లేవనెత్తగా; వాడు నిలబడెను" (మార్కు 9:27).

యేసు నొద్దకు ఎలా రావాలో మీకు తెలియనక్కర లేదు – ఎలాగూ లేవాలో ఈ బాలునికి కూడ తెలియదు. "యేసు బాలుని చెయ్యి పట్టుకొని, లేవనెత్తాడు." క్రీస్తు నొద్దకు రావాలనుకుంటే, బాలుని ఎత్తిన శక్తియే మిమ్ములను క్రీస్తు నొద్దకు తీసుకొని వస్తుంది. యేసు అలా చెప్పాడు! యేసు అన్నాడు,

"తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వస్తారు; నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమూ బయటికి త్రోసివేయను" (యోహాను 6:37).

కొందరనవచ్చు, "దేవుడు నన్ను క్రీస్తు కిచ్చాడో లేదో నాకు తెలియదు." అది అవివేకపు తలంపు. మీకు తెలియదు, దేవునికే తెలుసు. అలాంటి వేదాంతపు ఊహలతో మీ సమయాన్ని వృధా చెయ్యవచ్చు. ఇతరులు వేదాంతాన్ని గూర్చి తర్కిస్తూ ఉంటే, మీరు క్రీస్తు నొద్దకు రండి! వారు వాదించుకొనుచుండగా మీరు రక్షింప బడతారు! యేసు అన్నాడు,

"నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను" (యోహాను 6:37).

క్రీస్తు మిమ్మును త్రోసివేయడు. చనిపోయి నరకానికి వెళ్ళేటట్టు క్రీస్తు మిమ్మును విడిచిపెట్టడు. క్రీస్తు మీ పాపమును క్షమించి రక్షిస్తాడు, కథలోకి బాలుని రక్షించినట్టు. నేను మిమ్మును బతిమాలుతున్నాను. మిమ్మును బలవంత పెడుతున్నాను. మిమ్మును ప్రేరేపిస్తున్నాను. బ్రతిమాలుతున్నాను. ఆజ్ఞాపిస్తున్నాను. మీ నిత్య ఆత్మ నిమిత్తము, క్రీస్తు నొద్దకు రండి! ప్రశాంతంగా ఉండడానికి వేరే మార్గము లేదు! యేసు మాత్రమే శాంతి ఇస్తాడు మీ పాపాన్ని క్షమిస్తాడు! నోవహు సాంగ్ అన్నాడు,

"నేను క్రీస్తు లేకుండా నిరీక్షణ లేని పాపిని, గుడ్డివాడను దిగంబరిని. నేను ఆయనను ప్రేమిస్తున్నాను ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించాడు... యేసు నా కొరకై సిలువపై రక్తము కార్చాడు, పాపాలు క్షమించడానికి నాపై ఆయన ప్రేమను బట్టి, నేను ఎన్నడూ ఆయనను జ్ఞాపకం ఉంచుకుంటాను. ఆయన నా పాప భ్రష్టత్వము నుండి నన్ను రక్షించాడు."

నా బంధకాల నుండి, విచారము చీకటి నుండి, యేసు, నేను వస్తాను, యేసు, నేను వస్తాను;
మీ స్వతంత్రములోనికి, ఆనందము, వెలుగులోనికి, యేసు, నేను మీ యొద్దకు వస్తాను;
నా రోగము నుండి మీ ఆరోగ్యములోనికి, నా కొదవ నుండి మీ ఐశ్వర్యములోనికి,
నా పాపమూ నుండి మీలోనికి, యేసు, నేను మీ యొద్దకు వస్తాను.
      ("యేసు, నేను వస్తాను" విలియం టి. స్లీపర్ చే, 1819-1904).
      (“Jesus, I Come” by William T. Sleeper, 1819-1904).

యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడడం గూర్చి మీతో మాట్లాడాలనుకుంటున్నారా. ఒక నిమిషంలో మీరు వచ్చి, మొదటి రెండు వరుసలలో కూర్చోండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్: మార్కు 9:17-27.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"అవును, నాకు తెలుసు!" (అన్నా డబ్య్లూ. వాటర్ మాన్ చే, 1920).
“Yes, I Know!” (by Anna W. Waterman, 1920).



ద అవుట్ లైన్ ఆఫ్

నిస్సహాయులకు రక్షణ

SALVATION FOR THE HELPLESS

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిలాడించి, వదిలిపోయెను: అంతటా వాడు చచ్చిన వానివలె ఉండెను; గనుక అనేకులు, వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి, వానిని లేవనెత్తగా; వాడు నిలబడెను" (మార్కు 9:26-27).

I.   మొదటిది, నీవు చచ్చిన వానివలే ఉన్నావు, మార్కు 9:26; రోమా 5:12;
రోమా 17:23; కొలస్సయులకు 2:13; ఎఫెస్సీయులకు 2:1;
లూకా 15:24, 32; ఎఫెస్సీయులకు 4:18.

II.  రెండవది, మీరు యేసు "చేతితో తీసుకొనబడ్డారు", మార్కు 9:27ఎ;
ఎఫెస్సీయులకు 2:2-9; మార్కు 9:17, 20; యోహాను 16:8-9.

III. మూడవది, క్రీస్తును ఎదుర్కోడానికి మీరు లేపబడ్డారు, మార్కు 9:27బి;
యోహాను 6:37.