Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
విడుదల కేవలము అసంతృప్తి దారులకు మాత్రమే

DELIVERANCE IS ONLY FOR THE DISSATISFIED
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే వ్రాయబడిన,
మరియు జాన్ సామ్యూల్ కాగన్ గారిచే బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్
లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, మే 14, 2017 బోధింపబడిన ప్రసంగము
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Mr. John Samuel Cagan
at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, May 14, 2017

"అందుకు యేసు రోగులకు గాని ఆరోగ్యము గల వారికి వైధ్యుడక్కర లేదు; కానీ రోగులకు అక్కరలేదు. వారి మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని, నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను" (లూకా 5:31-32).


యేసు బయలు వెళ్లి లేవి అను సుంకరిని చూచెను. ఇది మత్తయికి మరియొక పేరు. యేసు తనను వెంబడించమని మత్తయిని పిలిచెను,

"అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి ఆయనను వెంబడించెను" (లూకా 5:28).

మత్తయి సుంకరి, రోమాకు పన్ను వసూలు చేయువాడు. యూదులు సుంకరులను అసహ్యించు కొనేవారు, ఎందుకంటే వారు రోమాచే అనుమతింపబడేవారు చట్టపరము కంటే ఎక్కువ పన్ను యూదుల నుండి వసూలు చెయ్యడానికి. వారు వసూలు చేసిన దానిలో, కొంత వారి కొరకు దాచుకునేవారు. అందుకు, చాలా మంది సుంకరులు చాలా ధనికులు, ఇతర యూదులు వారిని అసహ్యించేవారూ. యూదులచే వారు పాపులుగా ఎంచబడే వారు మత్తయి యేసును వెంబడించినప్పుడు.

మత్తయి యేసును అనుసరించినప్పుడు, "అతడు సమస్తము విడిచి పెట్టాడు," అంటే లాభదాయకమైన పన్ను వసూలు వ్యాపారాన్ని విడిచిపెట్టి, "ఆయనను వెంబడించాడు."

మత్తయి తన ఇంటిలో విందు ఏర్పాటు చేసాడు. ఎక్కువ గుంపులో ఇతర పన్ను వసూలు చేసేవారు, సమస్త పాపులు, ఈ గొప్ప ఎందుకు వచ్చారు. వారు అతి చెడ్డవారు. జెనో, అనే కవి, అన్నాడు, "సుంకరులందరు దొంగలే." పరిశయ్యలకు ఈ సుంకరులతో గాని, వారి స్నేహితులతో గాని పనిలేదు, పరిశయ్యలు వారిని "పాపులు" అని పిలిచేవారు.

ఆ విందులో ఈ గొప్ప సుంకరుల పాపుల గుంపు ఇంటిలో కూడుకున్నప్పుడు, పరిశయ్యలు సణగడం గొణగడం చేశారు. వారు శిష్యులతో అన్నారు,

"సుంకరులతోను పాపులతోను మీరెలా తిని త్రాగుచున్నారు?" (లూకా 5:30).

యేసు పరిశయ్యలకు జవాబివ్వడానికి విందు నుండి లేచి వెళ్ళాడు,

"అందుకు యేసు రోగులకు గాని [ఆరోగ్యము గల వారికి] వైధ్యుడక్కర లేదు; కానీ రోగులకు అక్కరలేదు. వారి మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని, నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను" (లూకా 5:31-32).

యేసు పరిశయ్యలకు విందుకు పాపులను పిలవడానికి తన కారణము చెప్పాడు. ఆయన చెప్పాడు మంచి ఆరోగ్యము గలవారిని వైద్యుడు అక్కర లేదు. రోగముగల వారికే అతడు కావాలి. వారి ఉద్దేశములో, శాస్త్రులు పరిశయ్యలు పాపరోగము నుండి విముక్తి పొందినవారు. శాస్త్రులు పరిశయ్యలు ధర్మశాస్త్రమును గైకొంటారు కాబట్టి, వారిని రోగులుగా, పాపులుగా పరిగణించుకోరు. పరిశయ్యలు ఆనాటి చాదస్తపు యూదులు. శాస్త్రులు బైబిలు కాపీలు రాసేసి బైబిలును బోధించేవారు. గొప్ప వైద్యుడు యేసు, వారికి అక్కర లేదనుకున్నారు. వారనుకున్నారు

"తామే నీతిమంతులమని తమ్మునమ్ముకొని, ఇతరులను తృణీ కరించేవారు" (లూకా 18:9).

యేసు జవాబు ఆ గర్వపు, స్వార్ధ పర పరిశయ్యలకు ఒక గద్ధింపు,

"అందుకు యేసు రోగులకు గాని [ఆరోగ్యము గల వారికి] వైధ్యుడక్కర లేదు; కానీ రోగులకు అక్కరలేదు. వారి మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని, నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను" (లూకా 5:31-32).

మీరు బాగున్నారనుకుంటే, యేసు అవసరత మీరు చూడరు. మీరు నాశనము చేయబడి పాప స్థితిలో చనిపోతుంటే, యేసు మీకు ప్రాముఖ్యము, మీరు ఆయనను వెదకుతారు నీ ఆత్మను స్వస్థ పరచడానికి మీ పాప పరిణామాల నుండి రక్షించడానికి. మీరు పాప భావన, నిరీక్షణ లేని స్థితి, అసంపూర్ణత కలిగి ఉంటారు – లేనిచో క్రీస్తు అవసరత మీకు అనిపించదు.

"రోగులకు గాని ఆరోగ్యము గలవారిని వైద్యుడు అక్కరలేదు; కానీ వారు రోగులు" (లూకా 5:31).

I. మొదటిది, వారి జీవిత విధానానితో సంతృప్తి పడేవారికి యేసు అవసరత అనిపించదు.

మీరు గమనిస్తారు, సువార్తలు చదువుతున్నప్పుడు, యేసు తరుచు పాపులతో కలిసి భోజనము చేశారు. పాపులు వారి జీవన శైలితో అసంతృప్తి చెందారు. పాపులు భావించారు వారి జీవితంలో ఘోరమైన తప్ప జరిగిందని. దీని నుండి కొంత నేర్చుకోవచ్చు. ఆ నశించు ప్రజలు యేసు వైపు ఆకర్షింప బడ్డారు ఆయన వారితో స్నేహంగా ఉన్నారు కాబట్టి. చాలామంది రక్షింప బడ్డారు కూడ.

వారు వారి జీవన శైలిచే అసంతృప్తి చెందారు కాబట్టి క్రీస్తు వైపు తిరిగారు. సుంకర అయినా మత్తయి అలా చేసాడు, లూకా ఐదవ అధ్యాయములో అది చూస్తాము. సుంకరి అయినా జక్కయ్య అలా చేసాడు, లూకా పందొమ్మిదవ అధ్యాయములో చూస్తాము. యేసు అతనితో చెప్పాడు,

"యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము; నేడు నేను నీ ఇంటయుండవలసియున్నాడని అతనితో చెప్పగా. అతడు త్వరగా, దిగి సంతోషముతో, ఆయనను చేర్చుకొనెను. అందరు అది చూచి, ఈయన పాపియైన మనుష్యుని యొద్ద, బస చేయవలెనని, చాలా సణుగు కొనిరి...జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, ఈరోజు ఈ ఇంటికి మోక్షం వస్తుంది...దేవుని కుమారుని వెదకడం కొరకు మరియు కోల్పోయిన దానిని రక్షించడం కొరకు" (లూకా 19:5-10).

గర్విష్టులైన శాస్త్రులు పరిశయ్యలకు క్రీస్తు అవసరత అనిపించలేదు; వారి జీవన శైలితో వారు తృప్తి చెందారు. కానీ సుంకరులను పాపులను ఆయన యొద్దకు వచ్చి రక్షింపబడ్డారు.

"అందుకు యేసు రోగులకు గాని; ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు " (లూకా 5:31).

వారి జీవన శైలితో తృప్తి నొందువారు యేసు అవసరత ఎరుగరు. కానీ వారి జీవన శైలితో విసిగిన వారు ఆయన యొద్దకు వచ్చి రక్షింపబడతారు.

మీ సంగతేంటి? నా అనుభవము ద్వారా నాకు తెలుసు మీలో చాలామంది విషయంలో ఇది నిజము. మీ జీవన శైలితో తృప్తిపడితే, మీరు యేసు అవసరత చూడలేదు, మీరు రక్షింపబడలేరు. మీ జీవితంలో మీరు ఆనందంగా ఉంటే, క్రీస్తు వచ్చి అంతా మార్చివేయాలని మీకు అనిపించదు.

"రోగులకు గాని ఆరోగ్యము గలవారికి, వైద్యుడు అక్కరలేదు" (మత్తయి 9:12).

II. రెండవది, వారి స్వంత దైవతముతో తృప్తి చెందే వారికి యేసు అవసరత అనిపించదు.

మన పట్టణము చూడండి. అందులో ఉన్న ప్రజలను గూర్చి ఆలోచించండి. వారిలో చాలామంది దేవుని గూర్చి తీవ్రంగా ఆలోచిస్తారా? కాదని మీకు తెలుసు. బైబిలు చెప్తుంది,

"దేవుని వెదకువాడెవడును లేదు" (రోమా 3:11).

పరిశుద్ధాత్మ కార్యము ద్వారా దేవుని కృప మీకు రాకపోతే, మీరు దేవునిలో ఉన్న క్రీస్తును మీరు చూడనేరదు. దేవుడు లేకుండా బ్రతికి చనిపోవడంతో మీరు తృప్తి పడతారు, దేవుడు లేని స్థితిలో.

కానీ దేవుని కృప మీ హృదయంలో పనిచేయడం ప్రారంభిస్తే, మీ జీవితముతో మీరు అసంతృప్తి పరులవుతారు. అంతా వేరుగా చూస్తారు. మీరు గుంపులో ఉండి ఇలా ఆలోచిస్తారు, "దేని కొరకు మీరు జీవిస్తున్నారు? దేవుని గూర్చి ఎందుకు పట్టించుకోరు?" మీ జీవితమూ మీ మరణమును గూర్చి ఆలోచింప ప్రారంభిస్తారు. మీ మతము అవాస్తవముగా, సహాయపడనిదిగా ఉంటుంది. ఇతరులు ఎలాంటి సాకులు చెప్పినా, ఆ సాకులు మీకు సరిపడవు. మీకు అనిపిస్తుంది తినడం, నిద్రపోవడం, చదవడం, ఆడడం కంటే జీవితంలో ఇంకా చాలా ఉందని.

దేవుని కృప మీ జీవితంలో పనిచేయడం ఆరంభించినప్పుడు నీ దైవత్వమును గూర్చిన ద్యాస కలిగి యుంటావు. మీకు ఇలా అనిపిస్తుంది

"దేవుని వలన కలుగు జీవమునుండి వేరు పరచబడి" (ఎఫెస్సీయులకు 4:18).

మీకు దేవుడు కొత్త వ్యక్తిగా అనిపిస్తుంది, ఆయన లేకుండా మీరు భయంకర పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది,

"నిరీక్షణ లేనివారును, లోకము నందు దేవుడు లేనివారినై యున్నారు" (ఎఫెస్సీయులకు 2:12).

అందుకు నేను మిమ్ములను అడుగుతున్నాను, మీ జీవితంలో మీరు పూర్తిగా సంతృప్తులై యున్నారా? అలా అయితే, క్రీస్తు నొద్దకు రావడానికి తక్కువ నిరీక్షణ ఉంటుంది. ఉన్నట్టుగానే వెళ్ళిపోతారు – జీవించడం చనిపోవడం వ్యక్తిగతంగా దేవుని తెలుసుకోకుండా.

"అందుకు యేసు రోగులకు గాని; ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర లేదు" (లూకా 5:31).

దేవుడు లేని జీవితంలో మీరు తృప్తి చెందితే యేసు అవసరత మీకు అనిపించదు.

ఒక అవకాశముంది, ప్రాముఖ్యముగా యవ్వనస్థుల మధ్య, మతము విషయంలో ఆసక్తి కలిగియుండడం బలహీనతకు సూచన అని. నిజ క్రైస్తవులు కానీ వారు ఆలోచించే అవకాశముంది దేవుని యందు ఎక్కువగా ఆసక్తి గలవారు విపరీతపరులు, తేడాగా ఉంటారు, సామాన్యముగా ఉండరు అని.

అది సామాన్యంగా మాట్లాడుతారు. ప్రజలు అలా చెప్పరు, "అతడు తేడాగా ఉన్నాడు. అతడు వెళ్లి తన కొరకే ప్రార్ధిస్తూ ఉంటాడు." ఒక నియమావళిగా చెప్పరు. కానీ అనుకుంటారు. నీ క్రైస్తవేతర స్నేహితులు అలా ఆలోచిస్తారు. వారు ఇలా అంటారు, "ఎక్కువ మతపరమవకూడదు. పిచ్చివాడు అవ్వకూడదు" – అలా. దీనికి కారణము మానవులు పాపపు స్థితిలో ఉన్నారు.

"శరీరానుసారమైన మనస్సు [దేవునికి విరోధమై యున్నది] " (రోమా 8:7).

రక్షింపబడని స్థితిలో, మానవులంతా

"స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి" (ఎఫెస్సీయులకు 2:3).

అందుకే రక్షింపబడని స్నేహితులు బంధువులు మీరు దేవుని విషయంలో తీవ్రంగా ఉండకూడదని చేయగలిగినంత చేస్తారు. ఇంకొక గుడికి వెళ్లేలా చేస్తారు, లేక "వారి" గుడికి – గుడికి రాకుండా చేస్తారు! ఎందుకు? ఎందుకంటే వారికి తెలుసు "వారి" సంఘము చల్లబడిందని, దేవుడు అక్కడ లేడని. వారి ఉద్దేశము మీరు దేవునికి దూరంగా ఉండడం,

"శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై యున్నది" (రోమా 8:7).

భయంకర స్థితి, మానవాళి దేవునిపై తిరగబడడం. దేవుడు మిమ్ములను పిలిచేటప్పుడు, మీ స్నేహితులు బంధువులు మిమ్మును దేవునికి దూరము చేస్తారు. తల్లిదండ్రులు నశించే స్నేహితులు కూడ అలాగే చెయ్యవచ్చు.

కానీ యేసు చెప్పాడు,

"నిశ్చయంగా, నిశ్చయంగా, నేను చెపుతున్నాను, ఈ వచ్చే గంటలో, మరియు ఇప్పుడు, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది: దానిని విను వారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను" (యోహాను 5:25).

మీరు ఎఫెస్సీయులకు 2:1, 5 ప్రకారము, ఆత్మీయంగా చనిపోయినప్పటికినీ దేవుని కుమారుడు మిమ్ములను పిలువ ఆరంభించాడు. మీ చచ్చిన స్థితిలో, మీరు "దైవ కుమారుని స్వరము వినండి." అది సంభవించినప్పుడు యేసు లేకుండా ఉండే జీవితంతో తృప్తి చెందరు, ఆయన దైవ కుమారుడు. ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. అప్పుడు మీరు యేసు క్రీస్తును వెదకుతారు. కానీ మేల్కొలుపు లేని చచ్చిన స్థితిలో మీరు ఉన్నంత కాలము, క్రీస్తు లేకుండా బ్రతకడం చనిపోవడంతో తృప్తి పడతావు. మీలో ఎదో తప్పు ఉందని పరిశుద్దాత్మ మీకు చూపించినప్పుడు మాత్రమే – దేవుడు లేని హృదయము కలిగి యున్నావని – అప్పుడు మాత్రమే మీలో లోపాన్ని చూచి యేసు క్రీస్తు నందు ఆసక్తిని కలిగియుంటారు.

"రోగులకు గాని ఆరోగ్యము గల వారికి; వైద్యుడు అక్కరలేదు" (లూకా 5:31).

III. మూడవది, వారి హృదయంలోని దుష్టత్వముతో తృప్తి చెందు వారికి యేసు అవసరత అనిపించదు.

దేవుడు సామాన్యంగా ముందు మన భావాలతో మాట్లాడుతాడు. ఒప్పించే పని పరిశుద్ధాత్మ ప్రారంభించినప్పుడు, ఆయన మనము పాపులమని అనిపింప చేస్తాడు.

గమనించండి ఎంత తరుచుగా బైబిలు మనకు చెప్తుంది ప్రజలు మారినప్పుడు భావోద్రేకానికి కదిలిపోతారు. యేసు పాదాలను ముద్దు పెట్టుకొనిన స్త్రీ భావోద్రేకముతో కదిలిపోయింది.

"ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన, ఒక స్త్రీ, యేసు పరిశయ్యని ఇంటి భోజనమునకు కూర్చున్నాడు తెలుసుకొని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, వెనుక తట్టు ఆయన పాదములు యొద్ద నిలబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన వెంట్రులకతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను" (లూకా 7:37-38).

త్వరలో ఆమె యేసు నొద్దకు వచ్చి రక్షింపబడింది.

పెంతే కోస్తూ దినాన, పేతురు బోధను విన్నవారు

"వారు హృదయంలో నొచ్చుకొనిరి" (అపోస్తలుల కార్యములు 2:37).

దీని అర్ధము వాస్తవంగా "వారు హృదయంలో గుచ్చబడ్డారు." భావోద్రేకమును గూర్చి ఇది మాట్లాడుతుంది. ఫిలిప్పు పట్టణములోని జైలు అధికారి

"వణుకుతూ వచ్చెను" (అపోస్తలుల కార్యములు 16:29).

అపొస్తలుడైన పౌలు చెప్పాడు,

"అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవరూ విడిపించును" (రోమా 7:24).

బైబిలులోని ఈ విషయాలు చూపిస్తున్నాయి దేవుడు సాధారణంగా ఒక వ్యక్తి భావోద్రేకాలు కదిలిస్తాడు తద్వారా అతడు తన దుష్ట హృదయంతో అసంతృప్తి చెందుతాడు. నిజ మార్పులలో ఉండే విషయము, అన్ని మార్పులలో ఉండే విషయము, ఏదనగా – ప్రజలు అంతరంగములో వారిని గూర్చి అసంతృప్తి పరులవుతారు. వారి హృదయాలను అక్కడ ఉన్న పాపాన్ని చూస్తారు. వారిలో ఉన్న దానిని అయిష్ట పడతారు. వారి హృదయాలను అంగీకరించలేరు! వారిని అట్టి వారు అసంతృప్తి పరులుగా ఉంటారు.

యేసు నొద్దకు సుంకరులు పాపులు రావడానికి ఒక కారణముంది –శాస్త్రలు పరిశయ్యలు ఆయనకు వేరుగా ఉన్నారు.

"రోగులకు గాని ఆరోగ్యము గలవారికి; వైద్యుడు అక్కరలేదు" (లూకా 5:31).

ఈ ఉదయము మీకు ప్రశ్న: వారు అసంతృప్తులుగా ఉన్నారా? మీ జీవన శైలితో ఆసంతోషంగా ఉన్నావా? దేవుడు లేని జీవితంతో విసిగిపోయారా? మీ హృదయంతో అసంతృప్తిగా ఉన్నారా? మీ పాపపు ఒప్పుకోలు ఉందా? ఈ విషయంలో అసంతృప్తి పాపపు ఒప్పుకోలు ఉంటే, మీరు గొప్ప వైద్యుడు, యేసు నొద్దకు రావడానికి సిద్ధమే. తరువాత, క్రీస్తు మాత్రమే పాపమూ నుండి మిమ్మును రక్షింప గలడు. ఆయన మీ పాపముల నిమిత్తము చనిపోయాడు. ఆయనే శరీరములో మృతులలో నుండి లేచాడు మీకు జీవము ఇవ్వడానికి. ఆయనే దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు, పరలోకములో, మీ కొరకు ప్రార్ధిస్తూ. ఆయన యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన రక్తములో మీ పాపములను కడుగడానికి సిద్ధంగా ఉన్నావా?

"రోగులకు కానీ ఆరోగ్యవంతులకు; వైద్యుడు అక్కరలేదు" (లూకా 5:31).

క్రీస్తునందలి రక్షణ గూర్చి మాట్లాడాలనుకుంటే, దయచేసి వచ్చి మొదటి రెండు వరుసలలో కూర్చోండి మిగిలిన వారు విందుకు పై అంతస్తుకు వెళ్ళండి. డాక్టర్ హైమర్స్, దయచేసి వచ్చి ఆరాధన ముగించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్: లూకా 5:27-35.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"నేను ఆశ్చర్యపోయాను" (ఏ. హెచ్. ఎక్లి గారిచే, 1887-1960).
“I Am Amazed” (by A. H. Ackley, 1887-1960).ద అవుట్ లైన్ ఆఫ్

విడుదల కేవలము అసంతృప్తి దారులకు మాత్రమే

DELIVERANCE IS ONLY FOR THE DISSATISFIED

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే వ్రాయబడిన,
మరియు జాన్ సామ్యూల్ కాగన్ గారిచే బోధింపబడిన ప్రసంగము
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Mr. John Samuel Cagan

"అందుకు యేసు రోగులకు గాని ఆరోగ్యము గల వారికి వైధ్యుడక్కర లేదు; కానీ రోగులకు అక్కరలేదు. వారి మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని, నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను" (లూకా 5:31-32).

(లూకా 5:28, 30; 18:9)

I.   మొదటిది, వారి జీవిత విధానానితో సంతృప్తి పడేవారికి యేసు అవసరత అనిపించదు, లూకా 19:5-10;
మత్తయి 9:12.

II.  రెండవది, వారి స్వంత దైవతముతో తృప్తి చెందే వారికి యేసు అవసరత అనిపించదు, రోమా 3:11; ఎఫెస్సీయులకు 4:18; 2:12; రోమా 8:7;
ఎఫెస్సీయులకు 2:3; యోహాను 5:25.

III. మూడవది, వారి హృదయంలోని దుష్టత్వముతో తృప్తి చెందు వారికి యేసు అవసరత అనిపించదు,
లూకా 7:37-38; అపొస్తలుల కార్యములు 2:37; 16:29;
రోమా 7:24.