Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఎత్తబడుట

(ప్రసంగము #3 బైబిలు ప్రవచనముపై)
THE RAPTURE
(SERMON #3 ON BIBLE PROPHECY)
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారం సాయంకాలము, మే 7, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, May 7, 2017

"ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్ధముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును: క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు: ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడును..."
     (I దెస్సలోనీకయులకు 4:16-17).


అది బైబిలులో అద్భుతమైన వాగ్ధానము! యేసు తిరిగి వచ్చుచున్నాడు! ప్రతి క్రైస్తవుడు ఆనందముతో నింపబడాలి ఈ మాటలు వినినప్పుడు, "యేసు మరల వచ్చుచున్నాడు"! దయచేసి ఈ లేఖన భాగమునకు మీ బైబిలు తెరచి ఉంచండి.

యేసు చాలా గంటల సేపు సిలువకు మేకులతో కొట్టబడ్డాడు. చివరకు ఆయన దగ్గర రాయిలా ఉన్నాడు, "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాను" (లూకా 23:46). ఆయన మరణించాడు. వారు ఆయన మృతదేహాన్ని ఒక సమాధిలో ఉంచారు. వారు దానికి ముద్రవేసి ఆ సమాధిని కాపలదారులుగా రోమా సైనికులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి.

మూడవ రోజున ఆయన మృతులలో నుండి లేచాడు. కాని ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు,

"అయితే వారు దిగులుపడి భయా క్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి" (లూకా 24:37).

తరువాత యేసు వారితో అన్నాడు,

"నేనే ఆయనను అనుటకు, నా చేతులను నా పాదములను చూడుడి: నన్ను పట్టి, చూచుడి; నాకున్నట్టుగా మీరు ఎముకలను మాంసమును, భూతమున కుండవని చెప్పెను" (లూకా 24:39).

ఆయన వారిని యేరూషలేము నుండి ఒలీల కొండకు నడిపించాడు. ఆయన వారిలో ప్రపంచమంతటిని సువర్తీకరణ చెయ్యమన్నాడు.

"ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా, ఆయన ఆరోహానమాయెను; అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా, వారు ఆకాశము వైపు తేరిచూచు చుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకోనిన ఇద్దరు మనష్యులు వారి యెద్దకు వచ్చిరి; వారు నిలిచి, గలిలయ మనష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యెద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట, మీరు చూచితినో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి" (అపోస్తలుల కార్యములు 1:9-11).

"ఈ యేసే" "పరలోకమునకు" చేర్చుకొనబడిన వాడు తిరిగి వచ్చుచున్నాడు. ఆయన పైకి వెళ్ళాడు! ఆయన దిగి వస్తాడు! ఆయన తిరిగి వచ్చుచున్నాడు!

ఆయన తిరిగి వచ్చుచున్నాడు, ఆయన తిరిగి వచ్చుచున్నాడు,
ఆ యేసే, మనష్యులచే తృణీకరించబడినవాడు;
ఆయన తిరిగి వచ్చుచున్నాడు
, ఆయన తిరిగి వచ్చుచున్నాడు,
శక్తితోను గొప్ప మహిమతోను, ఆయన తిరిగి వచ్చుచున్నాడు!
("ఆయన తిరిగి వచ్చుచున్నాడు" మాబెల్ జాన్ స్టన్ కెంప్ చే, 1871-1937).
   (“He is Coming Again” by Mabel Johnston Camp, 1871-1937).

బైబిలు మనకు చెప్తుంది ఆయన రెండు భాగాలుగా, రెండు విడతలలో వస్తాడని. అయన రాకడలో రెండవ భాగము ఆయన ఒలీవల కొండ మీదకి వెయ్యి సంవత్సరాల పరిపాలనకు దిగి రావడం. కాని మన పాఠ్యభాగము ఆయన రాకడలో మొదటి భాగమును గూర్చి మాట్లాడుతుంది. మళ్ళీ చూడండి మన పాఠ్య భాగములో I దెస్సలోనీకయులకు 4:16-17. ఆ పాఠ్య భాగము నుండి ఈ సంఘటనలో మూడు విషయాలు గమనించండి.

I. మొదటిది, ప్రభువైన యేసు భూమిపై ఉన్న ఉపరితలానికి దిగి వస్తాడు.

I దెస్సలోనీకయులకు 4:16 గమనించండి.

"ప్రభువు పరలోకము నుండి తనకుతానే ఆర్భాటముతోను దూత శబ్ధముతోను దిగి వచ్చును..." (I దెస్సలోనీకయులకు 4:16).

"క్రీస్తే" తనకుతానే "పరలోకము" నుండి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ కాదు. వాస్తవానికి, ఆత్మ కానేకాదు. "ఆ యేసే, ఆకాశమునకు పైకి ఎత్తబడిన [వాడు]... వస్తాడు (అపోస్తలుల కార్యములు 1:11). "ఆ యేసే" పరలోకము నుండి దిగి వస్తాడు.

"ప్రభువు పరలోకము నుండి తనకుతానే ఆర్భాటముతోను దూత శబ్ధముతోను దిగి వచ్చును..." (I దెస్సలోనీకయులకు 4:16).

తిరిగి లేచిన క్రీస్తు అన్నాడు,

"నేనే ఆయనను అనుటకు, నా చేతులను చూడుడి; నన్ను పట్టి చూచుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును, భూతము నకుండవని చెప్పెను" (లూకా 24:39).

ఆయన తిరిగి వచ్చుచున్నాడు, ఆయన తిరిగి వచ్చుచున్నాడు,
ఆ యేసే, మనష్యులచే తృణీకరించబడినవాడు;
ఆయన తిరిగి వచ్చుచున్నాడు
, ఆయన తిరిగి వచ్చుచున్నాడు,
శక్తితోను గొప్ప మహిమతోను, ఆయన తిరిగి వచ్చుచున్నాడు!
("ఆయన తిరిగి వచ్చుచున్నాడు" మాబెల్ జాన్ స్టన్ కెంప్ చే, 1871-1937).
   (“He is Coming Again” by Mabel Johnston Camp, 1871-1937).

యోహాను 14:3 లో యేసు చెప్పాడు,

"నేను మరల వచ్చెదను" (యోహాను 14:3).

మీరు గమనించాలి మన పాఠ్యభాగములో ఆయన భూమి మీదకి రాడు. ఆయన భూమిపైకి రావడం పూర్తిగా వేరు సంఘటన, అది తరువాత సంభవిస్తుంది. గమనించండి మన పాఠ్యభాగములో ఆయన భూమిపైకి రాడు. 17 వ వచనము చూడండి. నిలబడి చదవండి.

"ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము వారితో కూడ మమేకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు, మేఘముల మీద కొనిపోబడుదుము..."
     (I దెస్సలోనీకయులకు 4:17).

కూర్చోండి.

క్రీస్తు "ఎత్తబడినప్పుడు" ఆకాశములో నుండి వచ్చును. ఆయన భూమిపైకి తరువాత వస్తాడు. ఈ రెండు వేర్వేరు సంఘటనలని తేటగా బైబిలు చెప్తుంది. ప్రభువైన యేసు ఆకాశము నుండి దిగి వస్తాడు, కాని భూమిపై, "గాలిలో" ఉండిపోతాడు. "ఎత్తబడుట" అనగా తరలింపబడుట – ఆనందములో మునగడానికి! శూన్యములో గాలి ఉండదు, కనుక ఇది తెలియ చేస్తుంది ఆయన భూమిపై వాతావరణ ప్రాంతములో ఆగిపోతాడు.

"ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడ ఏకముగా...ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడును" (I దెస్సలోనీకయులకు 4:17).

II. రెండవది, క్రీస్తు నుండి మృతులైన వారు లేతురు.

16 వ వచనములో పాఠ్యభాగము చెప్తుంది,

"ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్ధముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును: క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు..." (I దెస్సలోనీకయులకు 4:16).

కూర్చోండి. "క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు." డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ చెప్పాడు,

ఆయన "గొప్ప కేక" ఆకాశము నుండి దిగి వస్తాడు. ఇది ఆజ్ఞా పూరిత స్వరము. అదే స్వరముతో ఆయన లాజరు సమాధి వద్ద నిలబడి పలికాడు, "లాజరు, బయటకు రమ్ము" (J. Vernon McGee, Th.D,. Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume V, p. 398).

యేసు లాజరు సమాధి దగ్గరకు వచ్చి చెప్పాడు,

"రాయి తీయువేయుడని యేసు చెప్పగా. చనిపోయిన వాని సహోదరియైన, మార్త, అతనితో చెప్పెను, ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది: కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను" (యోహాను 11:39).

కాని వారు యేసుకు లోబడ్డారు. వారు సమాధి నుండి రాయి తొలగించారు. మరియు యేసు,

"ఆయన ఆలాగు చెప్పి లాజరు, బయటికి రమ్మని, బిగ్గరగా చెప్పగా. చనిపోయిన వాడు వెలుపలికి వచ్చెను"(యోహాను 1:43-44).

ఇదే ఎత్తబడే సమయంలో క్రీస్తు చేస్తాడు. ఆయన బిగ్గరగా కేక వేస్తాడు, ప్రధాన దూత స్వరము వలే, బూర ధ్వని వలే (మెక్ గీ, ఐబిఐడి.). క్రీస్తు అరచినప్పుడు, లాజరు సమాధి దగ్గర చేసినట్టు, "క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు." నిజ క్రైస్తవుల మృత దేహాలు వారి సమాధులలో నుండి బయటకు వచ్చి మధ్య ఆకాశములో క్రీస్తుకు కలుస్తాయి.

జాన్ కాగన్ బాలుడుగా ఉన్నప్పుడు అతడు రక్షింప బడలేదని తనకు తెలుసు – కాని అతని తల్లిదండ్రులు నిజ క్రైస్తవులు. నేను ఎత్తబడుటను గూర్చి బోధించినప్పుడు రాత్రి అతనికి చింత కలుగ చేసింది. అతడు నాతో చెప్పాడు తను పడకునుట తన తల్లి దండ్రుల పడకకు వెళ్ళేవాడు వారు పైకెత్తబడి తనకు ఇంటిలో ఒంటరిగా విడిచిపెట్టి. అది నిజ భయము. మీరు విడువ బడ్డారేమో అని భయపడడం మంచిది. యేసును విశ్వసించుడి ఆ భయము పోతుంది! బైబిలు చెప్తుంది,

"నా వారి శవములు సజీవములగును, మృతులైన నీ వారు బ్రతుకుదురు. మంటలో పడియున్న వారలారా, మేల్కొని ఉత్సాహించుడి: నీ మంచు ప్రకాశముమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును" (యెషయా 26:19).

యోబు గ్రంథము పాత నిబంధనలో చాలా ప్రాచీనమైనది. మోషే ఆదికాండము వ్రాయడం మునుపు అది వ్రాయబడింది. యోబు ఎత్తబడుటను గూర్చి వ్రాసాడు.

"ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, శరీరముతో నేను దేవుని చూచెదను: నా మట్టకు నేనే చూచెదను, మరి ఎవరను కాదు, నేను కన్నులారా ఆయనను చూచెదను; నాలోనూ అంతరింద్రియములు [నా హృదయము] కృషించి యున్నది" (యోబు 19:26-27).

అపోస్తలుడైన పౌలు కూడ ఎత్తబడుటను గూర్చి ముందుగా చెప్పారు. అతనన్నాడు,

"మనమందరము నిద్రించము, కాని నిమిషంలో ఒక రెప్ప పాటున, కడ బూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము: బూర మ్రోగగానే, మృతులు ఆక్షయముగా లేపబడుదురు..."
      (I కొరింధీయులకు 15:52).

మన పాఠ్యభాగము చెప్తుంది,

"క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు"
      (I దెస్సలోనీకయులకు 4:16).

ఇప్పుడు, మీరు ఆశ్చర్య పోవచ్చు ఎలా మృతులైన శరీరములు, నిజ విశ్వాసులు శరీరములు 3,520 సంవత్సరముల క్రితము యోబు విషయములో, ఎలా లేస్తారు. అది ఎలా జరుగుతుంది? అపోస్తలుడైన పౌలు దానిని "మర్మము" అని I కొరింధీయులకు 15:51 లో చెప్తున్నాడు, ఆదిమ గ్రీకులో "మస్తీరియన్" అంటారు, మన మానవ బుర్రలు అర్ధము చేసుకోలేవు. వేరుగా చెప్పాలంటే, అది అద్భుతం. మీరు దేవుని నమ్ముతారు, కదా? మంచిది, మనకు చెప్పబడింది బైబిలు మొదట నుండి చివరకు దేవుడు అద్భుతాలు చేస్తాడని. ఇది దేవుని గొప్ప అద్భుతాలలో ఒకటి,

"క్రీస్తు నందు మృతులైన మీరు మొదట లేతురు"
     (I దెస్సలోనీకయులకు 4:16).

మనం అర్ధం చేసుకోలేము, కాని అది వాస్తవము.

"క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు [చనిపోయిన క్రైస్తవులు]" (I దెస్సలోనీకయులకు 4:16).

III. మూడవది, సజీవులైన క్రైస్తవులు వారితో పాటు కొనిపోబడుదురు.

వచనము 17 చూడండి.

"ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము..." (I దెస్సలోనీకయులకు 4:17).

నిజ క్రైస్తవులు ఆ సమయంలో భూమి మీద ఉండును మృత క్రైస్తవులతో పాటు "కొనిపోబడుదురు" మధ్య ఆకాశములో "ప్రభువును కలుసుకొనుటకు." మొదటిది, మృత క్రైస్తవులు "కొనిపోబాడతారు," తరువాత, రెండవది, సజీవులుగా ఉన్న నిజ క్రైస్తవులు "కొనిపోబడతారు" మధ్య ఆకాశంలో ప్రభువును కలుసుకోవడానికి. ఇదంతా జరుగునని బైబిలు చెప్తుంది

"కనురెప్పపాటులో, ఇదంతా జరుగును" (I కొరింధీయులకు 15:52).

ఇది మీరు రెప్ప వేసేలోగా అంత త్వరగా జరిగిపోతుంది! మృత క్రైస్తవులు తరువాత జీవించుచున్న క్రైస్తవులు, "మధ్య ఆకాశమునకు కొనిపోబాడతారు...ప్రభువును అక్కడ కలుసుకొనుటకు." బైబిలులో ఇది పాత అద్భుత మైన వాగ్ధానము! ఎంత అద్భుతమైన నిరీక్షణ క్రైస్తవులకు!

ఓ, ఆనందము! ఓ, సంతోషము! చనిపోకుండా మనము వెళ్తాము,
రోగము, విచారము, ఎండిన స్థితి అంగలార్పు లేవు.
మన ప్రభువుతో పాటు మహిమలో మేఘముల మీద కొనిపోబడతాం,
యేసు "తన స్వంత వారిని స్వీకరించినప్పుడు."
("క్రీస్తు తిరిగి వస్తాడు" హెచ్. ఎల్. టర్నల్, 1878).
   (“Christ Returneth” by H. L. Turner, 1878).

డాక్టర్ మెక్ గీ అన్నాడు, "కొనిపోబడుట" గ్రీకు పదము "హాల్ పాజీ," నుండి అనువదింపబడింది దాని అర్ధము "త్వరితంగా ఆకర్షించుట, పట్టబడుట, ఎత్తబడుట, లేక పైకెత్త బడుట" (ఐబిఐడి., పేజి 399). తరువాత డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ అన్నాడు,

ఇది ఎంత మహిమాయుక్త, అద్భుత ఆదరణ! మృత [క్రైస్తవులు] శరీరాలు పైకెత్తబడతాయి. తరువాత ఆసమయంలో సజీవులుగా ఉన్నవారు వారితోపాటు మధ్యాకాశములో ప్రభువును కలుసుకుంటారు. కనుక మనము నిరంతరము ప్రభువుతో ఉంటాము. వాస్తవానికి, మనము ఆయనతోపాటు భూమిపైకి తిరిగి వస్తాము ఆయన స్థాపించిన రాజ్యములో ఆయనతోపాటు ఏలడానికి (ఐబిఐడి.).

అద్భుతమైన భవిష్యత్తు ప్రతి నిజ క్రైస్తవునికి ఎదురు చూస్తుంది క్రీస్తు మనలను స్వీకరించడానికి మధ్యాకాశాములోనికి వచ్చినప్పుడు!

నీవు దానికి సిద్ధంగా ఉన్నావా! నీవు సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు రక్షింపబడిన వారు అప్పుడు మధ్యాకాశములో ప్రభువు కలుసుకోవడానికి ఎత్తబడతారు. నీవు రక్షింపబడ్డావా? యేసు సిలువపై మరణించాడు నీ పాపముల నిమిత్తము. ఆయన మృతులలో నుండి లేచి, రక్తాన్ని పరలోకానికి తీసుకెళ్ళి, నీ పాపములను అన్నింటిని కడిగేస్తాడు. కాని నీవు క్రీస్తుకు లోబడాలి, ఆయనను మాత్రమే విశ్వసించాలి. నీవు సామాన్య విశ్వసములో క్రీస్తును నమ్మితే, ఆయన తన స్వరక్తముతో నీ ప్రతి పాపాన్ని కడిగి, నిన్ను రక్షిస్తాడు, సిద్ధంగా ఉండడానికి

"మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడుతాము" (I దెస్సలోనీకయులకు 4:17).

అప్పుడు వారు మాతో కూడ పాడతారు,

ఓ, ఆనందము! ఓ, సంతోషము! చనిపోకుండా మనము వెళ్తాము,
రోగము, విచారము, ఎండిన స్థితి అంగలార్పు లేవు.
మన ప్రభువుతో పాటు మహిమలో మేఘముల మీద కొనిపోబడతాం,
యేసు "తన స్వంత వారిని స్వీకరించినప్పుడు."
ఓ ప్రభూ యేసు, ఎంతకాలము, ఎంతకాలము,
‘సంతోష గీతము ఎప్పుడు ఆలపిస్తాం,
క్రీస్తు తిరిగి వచ్చును! హల్లెలూయ!
హల్లెలూయ! ఆమెన్. హల్లెలూయ! ఆమెన్.
("క్రీస్తు తిరిగి వచ్చును" హెచ్. ఎల్. టర్నర్ చే, 1878).
(“Christ Returneth” by H. L. Turner, 1878).

తిరిగి వచ్చేవారము సువార్త మళ్ళీ వినడానికి, ఈ గుడికి తప్పకరండి. యేసు మిమ్మును ప్రేమిస్తున్నాడు! ఆయనను విశ్వసించుడి ఆయన మీ పాపములన్నింటిని ఆయన సిలువపై కార్చిన రక్తములో కడిగి వేస్తాడు! ఆమెన్!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్ గారిచే: I కొరింధీయులకు 15:51-54.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసు మరల వచ్చుచున్నాడు" (జాన్ డబ్ల్యూ. పీటర్సన్ చే, 1921-2006)
“Jesus is Coming Again” (by John W. Peterson, 1921-2006).ద అవుట్ లైన్ ఆఫ్

ఎత్తబడుట

(ప్రసంగము #3 బైబిలు ప్రవచనముపై)
THE RAPTURE
(SERMON #3 ON BIBLE PROPHECY)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్ధముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును: క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు: ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడును..." (I దెస్సలోనీకయులకు 4:16-17).

(లూకా 24:37, 39; అపోస్తలుల కార్యములు 1:9-11)

I.   మొదటిది, ప్రభువైన యేసు భూమిపై ఉన్న ఉపరితలానికి దిగి వస్తాడు,
I దెస్సలోనీకయులకు 4:16ఎ; అపోస్తలుల కార్యములు 1:11; లూకా 24:39; యోహాను 14:3; cf. ప్రకటన గ్రంథము 19:11-16; cf. మత్తయి 24:27-31;
cf. జెకర్యా 14:4-5; I దెస్సలోనీకయులకు 4:17.

II.  రెండవది, క్రీస్తు నుండి మృతులైన వారు లేతురు, I దెస్సలోనీకయులకు 4:16బి; యోహాను 11:39, 43-44; యెషయా 26:19; యోబు 19:26-27;
I కొరింధీయులకు 15:52, 51.

III. మూడవది, సజీవులైన క్రైస్తవులు వారితో పాటు కొనిపోబడుదురు,
I దెస్సలోనీకయులకు 4:17; I కొరింధీయులకు 15:52.