Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
సున్నితమైన విపరీతమైన విచారము

A SOFT AND VIOLENT SADNESS
(Telugu)

జాన్ సామ్యూల్ కాగన్ గారిచే
by Mr. John Samuel Cagan

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, ఏప్రిల్ 30, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, April 30, 2017

"అప్పుడు పన్నెండేళ్ళ నుండి, రక్త స్రావ రోగము గల ఒక స్త్రీ, ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఆయన వెనుకకు వచ్చి, ఆయన వస్త్రపు అంచును ముట్టెను: వెంటనే ఆమె రక్తస్రావము [నిలిచిపోయెను]" (లూకా 8:43-44).


ఒక స్త్రీ భయంకరంగా రోగాస్తురాలు. తన రోగ నివారణ నిమిత్తం చేయగలిగిందంతా చేసింది. ఆమె వైద్యుల దగ్గరకు వెళ్ళింది, కాని వారు ఆమెను బాగు చేయలేకపోయారు. తనకు ఈ లోకములో ఉన్నదంతా తన రోగ నివారణ కొరకు ఖర్చు పెట్టింది. తను భరించగల వైద్యాన్ని ప్రయత్నించింది, కాని ఏవి ఆమెను బాగు చేయలేదు. ఆ రోజులలో వైద్యుల సంరక్షణలో, వారిచ్చిన ప్రతి పరిష్కారము ద్వారా తానూ శ్రమ పడింది. తన రోజులలో యూదులచే అపవిత్రురాలిగా ఎంచబడింది. ఆమె మతపర సాంఘీక బహిష్కరణలో జీవించింది. ఆమె ఒంటరిగా ఉంది ఎవరు ఆమెతో మాట్లాడలేదు.

మార్గాలన్నింటి ద్వారా వెళ్ళింది. నిరీక్షణ కోల్పోయింది. యేసును చూసేంత వరకు, నిరీక్షణ లేదు. గుంపులో యేసును చూసింది. యేసు తనను బాగుచేయగలడని బావించింది. యేసు నొద్దకు రావలసి వచ్చింది. యేసును సమీపించగలనా అనుకుంది. ఆయన చాలా దూరంగా ఉన్నట్టు అనిపించింది ఆమె స్వస్తపడడం అసంభవం అనుకుంది. అన్ని ప్రయత్నించింది, ఆమెకు సహాయపడగల వాడు యేసు ఒక్కడే అని గ్రహించింది. గుంపులో తోసుకుంటూ, యేసును చేరుకుంది. యేసును దగ్గరగా చేరలేకపోయింది, ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టగలిగింది. ఆమె క్రీస్తు వస్త్రపు అంచును ముట్టగానే, ఆమె రోగము పోయింది, యేసు ఆమెను పవిత్రులను చేసాడు. ఈ కథ నేరుగా మీకు వర్తిస్తుంది.

I. మొదటిది, మీరు రోగగ్రస్తులు.

మానవాళి అంతా రోగగ్రస్తము. ఒక రోగముతో మానవాళి తాకబడింది అది మానవాళి పైన తిరగబడింది. ఈ రోగము కారణంగా, ప్రజలు ఒకరి నొకరు బంధించుకుంటారు, ఒకరిని బట్టి ఇంకొకరు అదును తీసుకుంటారు, చివరకు, వారిని వారు నాశనము చేసుకుంటారు. రోగము రహస్యం కాదు. సామాన్య శాస్త్రము మరియు చరిత్ర రెండు కూడ ఈ రోగంను చూచిస్తాయి, వాటి ద్వారా వారు వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ రోగాన్ని దేవుడు పాపంగా తెలియచేస్తాడు. పాపము అనేది మానవాళికి చెడును చేస్తుంది. పాపము నిన్ను కూడ ప్రభావితం చేస్తుంది. బైబిలు చెప్తుంది,

"అందరు పాపము చేసి, దేవుడను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు" (రోమా 3:23).

పాపము రోగముతో ప్రతి ఒక్కరు తాకబడ్డారు. జీవిత కాలమంతా పాపము సాధన చేయబడుచున్నప్పటికినీ, పాపమును నేర్చుకొననవసరం లేదు. పాపము సహజముగా ఎదిగి మీలో నాటబడి ఉంటుంది. పాపము మీరు చేసే ప్రతి దానిని తాకుతుంది. మీరు నిజాయితీగా లేకుంటే, పాపపు రోగము ఉందని రుజుఫు. మీరు పాపులు కనుక, అశ్లీల చిత్రాలు చూస్తారు. తప్పుడు పనులు చేయడం ద్వారా మీరు పాపులుగా మారరు. మీ పాపపు రోగము స్వాస్థముగా ఉండేది. మీరు పుట్టుక పాపులు. మీరు పాపులు, మీరు పాపులు కనుక, మీరు తప్పుడు పనులు చేస్తున్నారు. పాపము మీ హృదయాన్ని పాడు చేసింది. మీ మౌన తలంపులలో, చాలా భయంకర పనులు చేయాలనుకుంటారు. కాని చెయ్యరు అలా ఉంటే మీరు ఇంకా చెడ్డవారు. మీ హృదయాలు అబద్దాలు ఊహిస్తాయి మీ ఊపిరితిత్తులు ఊపిరి పీల్చినట్టు. మీ హృదయము భయంకర విషయాలు కోరుతూ ఉంటుంది అదే సమయంలో మీరు మంచి వ్యక్తులుగా అనుకుంటారు. మీరు పాపముచే తాకబడ్డారు, పాపము ప్రజలను స్వార్ధ పరులుగా, మోసకులుగా, అసహ్యంగా మారుస్తుంది. బైబిలు చెప్తుంది,

"మేమందరమూ అపవిత్రుల వంటి వారమైతిమి, మానీతిక్రియలన్ని మురికి గుడ్డ వలే ఆయెను; మేమందరమూ ఆకు వలే వాడిపోతిమి; గాలివాన కొట్టుకొని పోవునట్లుగా, మా దోషములు, మమ్మును కొట్టుకొని పోయెను" (యెషయా 64:6).

పాపము ఒక రోగము. పాపానికి సూచనలు దుష్ట్రభాలు ఉంటాయి. పాపము కారణంగా, ప్రజలు తరుచు వారి జీవితాల్లో లోతుగా ఆనంద హీనులుగా ఉంటారు. పాపము కారణంగా ప్రజలు సిగ్గుమాలి, మనస్తాపము నొంది, బాధ పడుతూ ఉంటారు. ప్రతి బింబ క్షణాలలో, మీలో అంధకారాన్ని గమనిస్తారు. పదే పదే, లోలోపల సున్నితత్వాన్ని కోల్పోతారు. మీ జీవితమూ సూన్య భావనతో నింపబడుతుంది అది వివరించ లేదు. పాపపు సూచనలు మీరు గమనిస్తారు. కొన్నిసార్లు, లోలోపల, మీ పరిస్థితి తీవ్రతను అనుభవిస్తారు, సున్నిత విపరీత విచారముతో నింప బడతారు. కొన్ని క్షణాలు ఇలా అనుకుంటారు, కాని చాలాకాలము అలా జీవించలేరని మీకు తెలుసు. ఏదో స్పందిస్తున్నట్టు, వైద్యము కొరకు ప్రయత్నిస్తారు. మిగిలిన ప్రపంచము వలే, ఈ లోకములో దొరికే వైద్యుల కొరకు ప్రయత్నించ ఆరంభిస్తారు.

"అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగము గల ఒక స్త్రీ, ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఆయన వెనుకకు వచ్చెను" (లూకా 8:43).

II. రెండవది, మీ రోగము కొరకు మీరు వైద్యులు వెదికారు.

పాపపు సూచనలకు చాలా రకాల వైద్యులు ఇవ్వబడ్డాయి. పాపపు సూచనల నుండి సుఖానుభావాన్ని ప్రేమిస్తూ మునిగిపోవడం నేర్చుకున్నారు. ప్రపంచమంతటా, పాపపు సూచనలను తప్పించుకొనడానికి మత్తు పదార్ధాలు తీసుకుంటారు. జీవించడం అసంతృప్తిగా ఉండి, ఒక మాత్రో, సూదో, ఒక సిసాయో, అదంతా పోయేటట్టు చేస్తుందనుకుంటారు. మీరు సుఖములో కొట్టుకుపోతారు, పాప సూచనల నుండి తప్పించుకోవడానికి. మీ ఎన్నిక మత్తు పదార్దమో, మాదక ద్రవ్యమో కావచ్చు, అది ఏదైనా అది వైద్యము, బానిసత్వము.

సుఖాల వైద్యాలు చాలా మారు దేశాలలో ఉంటాయి. ఈనాడు ప్రజలు లోక సుఖాలకు లోనవుతున్నారు. బిజినెస్ ఇన్ సైడర్ లో ఇటీవల పఠన ద్వారా తెలిసింది సగటు మానవుడు తన ఫోనును ప్రతి రోజు 2,000 నుండి 5,000 సార్లు ముట్టుకుంటాడు. ప్రజలు సమాచారం తెలుసుకోవడానికి, దానిని పంచుకోవడానికి, మరియు టెక్నాలజీని పెంచుకొని దాని ద్వారా లబ్ది పొందడానికి అలవాటు పడ్డాడు. వారు ఎక్కువగా డేటాతో మమేకం అవుతున్నారు, అందుకే వారు ఎన్నడు కూడ ఆలోచించరు – పాపము లక్షణాల గూర్చి ఆలోచించరు.

మీ జేబుల్లో ఫోన్లు ఉన్నాయి. ప్రతి క్షణం ఫోనులో మునిగిపోతారు, మీరు మీ ఫోనులో పోగొట్టుకోబడ్డారు. బుద్ధి పూర్వకంగా, అనుకోకుండా మీ జేబుల్లో నుండి తీస్తారు. తప్పించుకోవడానికి ఒక మార్గము ఉంది. ఒక వైద్యము ఉంది. పాపపు సూచనలకు వైద్యం చేస్తున్నారు, కాని వాటిని బాగు చేయలేరు.

"అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగము గల ఒక స్త్రీ, ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఆయన వెనుకకు వచ్చెను" (లూకా 8:43).

పరిజ్ఞానము మిమ్మును వేరే లోకానికి తీసుకెళ్తుంది. పరిజ్ఞానము ఒక లోకము కనుగొనేటట్టు చేస్తుంది మీ ఆశలకు తగినట్టుగా. ప్రజలు గంటల తరబడి సామాజిక మధ్యమాలపై ఉంటారు. ప్రజలు పది పదిహేను ఇరవై ఫోటోలు తీసుకుంటారు, వాస్తవానికి దగ్గరగా ఉండే పరిపూర్ణ పటము కొరకు. వారిని వారు చాలా చక్కగా అందంగా, వారిని వారే నమ్మలేని విధంగా నమ్మలేని వాటిని బహిర్గతము చేసుకుంటారు. మీరు జాగ్రత్తగా ప్రతి ఫోటోను తీర్చిదిద్ది, వారెవరో లోకము తెలుసుకునేలా చేస్తారు.

మీకు ఫేస్ బుక్ ఖాతా ఉంది. ఇస్టాగ్రామ్ ఖాతా ఉంది. మీరు శ్రేష్టమైన భంగిమలలో, ఫోటోలు ఎంచుకొని, లోకమునకు మీ అసలు రంగు తెలియకుండా చేస్తారు. మీరు సరిగ్గా చేస్తారు, మీరు అందంగా, మంచిగా ఉన్నాడని, లోకము నమ్మాలని మీరు పాపపు సూచనలతో బాదపడుతున్నారు. వైద్యం చేయించుకున్నారు, కాని స్వస్థత పొందలేరు.

"అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగము గల ఒక స్త్రీ, ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఆయన వెనుకకు వచ్చెను" (లూకా 8:43).

మీ జీవితం ఎంత త్వరితంగా ఉందో గమనించండి. అలా నిజ రూపం చూడడానికి సమయము పడుతుంది. కాబట్టి మీ నిజ స్థితి నుండి తప్పించుకోవడానికి, మీ కాలపట్టి వేసుకుంటారు. మీ ఉచిత సమయము కూడ ఉచితంగా కాదు. మీ మనస్సాక్షి దృష్టి మరలడంతో నిండిపోయింది. విడియో ఆటలలో గంటల తరబడి ఉంటారు. మీ లోకము నిజ రూపాన్ని చూపిస్తుంది. తరగతిలో ఉన్నప్పుడు, వారిలో ఉన్నప్పుడు, ప్రసంగ సమయములో, ఇంటికి వెళ్ళాలనుకుంటారు, విడియో ఆటలు ఆడాలని, ఇంకా ఎక్కువగా. మీ జీవితపు సున్నిత విపరీత విచారాన్ని అనుభవించే సమయము లేదు. మీ పరిస్థితి నిజ రూపాన్ని గ్రహించే సమయము మీకు లేదు.

కంప్యూటర్ తెరముందు మీ రోజులన్నీ వ్యర్ధం చేసారు. ఒంటరిగా ఉండనిష్టపడక, అంతర్జాలము స్నేహాన్ని కోరుతారు. ఒక్క క్షణం కూడ ఆపి ఉండలేరు. సంగీతము, విడియో ఆటలు, అంతర్జాలము, సుఖానుభావాలు కోరుకుంటారు, జీవిత వాస్తవ్యము తప్ప. మీతో చెప్పుకుంటారు, పాపపు సూచనలంటే భయము లేడని. మీరు అన్ని చేస్తారు బోరుకొట్టడం వలన. ఇవన్ని చేస్తారు, పరిహాసానికి, అవసరము లేకున్నా. అయినను, పరిహాసానికి తాపత్రయము ఆపేస్తే, జీవితపు పరుగు గుర్తొస్తుంది. చింతించడానికి పట్టించుకోవడానికి సమయము ఉండదు, ఎందుకంటే జీవితాన్ని బిజీగా రూపు దిద్దుకున్నావు. బైబిలు చెప్తుంది,

"శ్రమను గాలికైన యత్నములను రెండు చేతుల నిండ నుండుట కంటే ఒక చేతినిండ నెమ్మది కలిగి యుండుట మేలు" (ప్రసంగి 4:6).

మీతో చెప్పుకుంటారు మీకు సహాయము చేసుకోలేరని. మీరు మధ్యస్థము, ఒక పని, ఒక ఉద్యోగమూ ఉంటుంది. ఇది మారదు. ఎప్పుడు పనిలో ఉంటారు. ఇలా జీవితం ఉండాలని కోరుకుంటారు. మీరు నమ్ముతారు, భవిష్యత్తులో జీవితంలో ఎలాంటి మార్పు ఉండకూడదని. మీరు ఒక గ్రాడ్యుయేట్ అని నమ్ముతారు, మీరు డబ్బు సంపాదించడం మొదలు పెడతారు, మరియు మీరు చివరగా గర్వపడేలా చేస్తారు. కాని మీరు ఎక్కడ గ్రాడ్యుయేట్ అయ్యారో అవసరం లేదు, మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో అవసరం లేదు, మీరు సంతృప్తి పొందలేరు, మరియు మీరు ఎప్పుడు సరిపోదు. బైబిలు చెప్తుంది,

"వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో, ఆ ప్రకారము గానే తానూ వచ్చినట్టు గానే, దిగంబరిగానే మరల పోవును, తానూ ప్రయాస పడి చేసుకొనిన దానిలో ఏ దైనను చేతపట్టు కొనిపోడు" (ప్రసంగి 5:15).

మీ నిరీక్షణలు మీకు ఏమి కావు. డబ్బు కాని, పరిపూర్ణ ఉద్యోగమూ కాని అకస్మాత్తుగా పరిపూర్ణ జీవిత అనుభవము ఇవ్వడు మీరు తృష్ణ గొనినట్లుగా. మీ జీవితమూ ఎన్నడు తృప్తి పరచదు. మీరు సంతోషంగా ఉండరు. మీరు పాపపు సూచనలతో ఉన్నారు, మీరు వైద్యము అందిస్తున్నారు. పాప సూచనలకు వైద్యమిస్తున్నారు, కాని నివారణ పొందుకోలేరు.

"అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగము గల ఒక స్త్రీ, ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఆయన వెనుకకు వచ్చెను" (లూకా 8:43).

ఏ వైద్యులు మీ పాపానికి నివారణ ఇవ్వరు. మీ పాప రోగాన్ని ఈ లోకపు సుఖాలు నివారించలేవు. లోకములో ఉన్న డబ్బు అంతా నివారణ కొనలేదు. పాతపాట ఇలా చెప్తుంది,

ఎకరాల వజ్రాలు, బంగారపు కొండలు,
వెండి నదులు, చెప్పలేని ముత్యాలు,
ఇవన్ని కొనలేవు నీ కొరకు నా కొరకు
నిద్రపోయేటప్పుడు శాంతిని, లేక నిర్మల మనస్సాక్షిని.
("ఎకరాల వజ్రాలు" ఆర్డర్ స్మిత్, 1959).
(“Acres of Diamonds,” Arthur Smith, 1959).

మీ పాప రోగానికి ఇంకా వైద్యము అవసరము లేదు. మీ వైద్య ప్రయత్నాలు మీ సూచనలను కప్పిపెడతాయి. మీ వైద్యాలు సూచనలను కప్పుతాయి, కాని రోగాన్ని నివారించదు. మీ జీవితంలో పూర్తిగా అలసిపోయే వరకు మీ వైద్యాలు కొనసాగిస్తారు. ఒకరోజు, అకస్మాత్తుగా, చాలా ఆలస్యమవుతుంది. మీ పాప రోగము ముదిరి పోతుంది, ఇంకా అధ్వాన మవుతుంది. మీ రోగము బాగా భయంకరమవుతుంది, కఠిన మవుతుంది, మరియు చాలా దుర్భరంగా అవుతుంది. ఈ పాప రోగము మిమ్ములను నాశనము చేస్తుంది. బైబిలు చెప్తుంది,

"ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము; అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవము" (రోమా 6:23).

మీ రోగానికి నయము కావాలి. ఉన్న నివారణ మీకు అవసరము. మీకు యేసు క్రీస్తు కావాలి.

III. మూడవది, మీ పాప రోగానికి యేసు నివారణ.

మీరోగ నివారణకు కనబడే వైద్యులు కాకుండా లోతుగా వెళ్ళాలి. మన పాఠ్యభాగములోని స్త్రీ చేసినట్టు, ఈ వైద్యాల నుండి వైదొలగి, యేసు వైపు మరలాలి.

"అప్పుడు పన్నెండేళ్ళ నుండి, రక్త స్రావ రోగము గల ఒక స్త్రీ, ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఆయన వెనుకకు వచ్చి, ఆయన వస్త్రపు అంచును ముట్టెను: వెంటనే ఆమె రక్తస్రావము [నిలిచిపోయెను]" (లూకా 8:43-44).

ఈ స్త్రీ తానూ చేయగలిగిందంతా చేసింది, కాని ఏదీ ఆమె రోగాన్ని నివారించలేక పోయింది, యేసు నొద్దకు మరలే వరకు. చాలామంది ప్రయత్నించినా, ఎవ్వరు ఆమెను బాగు చేయలేకపోయారు. ఆమె యేసు వైపు తిరిగింది నిస్పృహతో, యేసు ఆమెను బాగుచేసాడు. పాప రోగానికి యేసు మాత్రమే నివారణ. మీ పాప రోగాన్ని యేసు మాత్రమే బాగు చేయగలదు, ఎందుకంటే మీ పాపము కొరకు యేసు మాత్రమే చనిపోయాడు. అన్ని విధాలుగా యేసు పరిపూర్ణుడు. యేసు మచ్చలేనివాడు, పాపము లేని గొర్రె పిల్ల వలే సిలువపై ఆయన మన పాపాలను మోసాడు. అతడు మీ పాపముల నిమిత్తము సిలువ వేయబడ్డాడు. క్రీస్తు మన మనపాపముల నిమిత్తము అతని రక్తాన్ని కార్చాడు. బైబిలు చెప్తుంది,

"నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను: అయినను మెత్తబడిన వాని గాను, దేవుని వలన బాదింపబడిన వానిగాను, శ్రమ నొందిన వాణి గాను మనము తనని ఎంచితిమి. మన అత్రిక్రమములను బట్టి, అతడు గాయపరచబడెను: మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను; అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:4-5).

యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇదంతా చేసాడు. యేసు మీ రోగము నయము చేయడానికి మీ పాపముల నిమిత్తము చనిపోయాడు. నీవు పాపివి. వైద్యులు ప్రయత్నించావు. వైద్యాలు మీ పాపాన్ని నయము చేయలేవు. ఏ వైద్య మోతాదు నిన్ను బాగు చేయలేదు. నీవు భయంకర పాపముతో శ్రమపడుతున్నావు. నీవు రోగివని ఒప్పుకోవాలి. నీవు రోగివని ఎరుగకుంటే, నీవు ప్రయత్నిస్తుంటారు నీకు నివారణ అవసరము లేదనిపిస్తుంది. నీకు నివారణ కావాలి. యేసు అన్నాడు,

"రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కర లేదు, కాని వారు రోగులుగానే ఉన్నారు: నేను పాపులనే పిలువ వచ్చితిని గాని, నీతిమంతులను పిలువా రాలేదని వారితో చెప్పెను" (మార్కు 2:17).

నీవు చూడాలి గ్రహించాలి నీ పాప రోగపు వాస్తవాలు. ఒక సారి వాటిని గ్రహించినప్పుడు, ఏ వైద్యము వైపు చూడవద్దు, నివారణ వైపు చూడు. పాపపు సూచనలను కప్పిపెట్టే పనినుండి వైదొలగి, యేసు వైపు తిరుగు. యేసు మాత్రమే నీ పాపము నుండి నిన్ను రక్షిస్తాడు. యేసు ఇచ్చే రక్షణ సంపాదించినది కాదు. ఆ స్త్రీ స్వస్థత పడి, పాప క్షమాపణ పొంది, యేసుచే రక్షింపబడింది. తన నివారణకు ఏమి చెల్లించలేదు. తనను బాగు చెయ్యాలని యేసును ప్రాధేయపడలేదు. ఎలా అనిపించిందంటే యేసును ఆమె చేరుకోలేక పోయింది, కాని ఆమె ఆయనను చేరుకుంది. యేసు వైపు వెళ్లి, ఆయన వస్త్రపు చెంగును ముట్టి, విశ్వాసము ద్వారా రక్షింపబడింది! యేసును నీవు చేరుకోలేనప్పటికి, ఆయనను సమీపించ ప్రయత్నించాలి! యేసును చేరలేవని నీకు అనిపించినా, క్రీస్తుపై విశ్వసముతో ఆయనను సమీపించు, ఆయన నిన్ను రక్షిస్తాడు! విశ్వాసము ద్వారా యేసును నమ్ము, ఆయన నిన్ను రక్షిస్తాడు! యేసును నమ్ము, పాప రోగము నుండి నివారణ పొందు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్ గారిచే: లూకా 8:43-48.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసు వైపు దృష్టి మరల్చు" (హెలిన్ హెచ్. లెమ్మల్ చే, 1863-1961) .
“Turn Your Eyes Upon Jesus” (Helen H. Lemmel, 1863-1961).ద అవుట్ లైన్ ఆఫ్

సున్నితమైన విపరీతమైన విచారము

A SOFT AND VIOLENT SADNESS

జాన్ సామ్యూల్ కాగన్ గారిచే

"అప్పుడు పన్నెండేళ్ళ నుండి, రక్త స్రావ రోగము గల ఒక స్త్రీ, ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఆయన వెనుకకు వచ్చి, ఆయన వస్త్రపు అంచును ముట్టెను: వెంటనే ఆమె రక్తస్రావము [నిలిచిపోయెను]" (లూకా 8:43-44).

I.   మొదటిది, మీరు రోగగ్రస్తులు, రోమా 3:23; యెషయా 64:6.

II.  రెండవది, మీ రోగము కొరకు మీరు వైద్యులు వెదికారు, ప్రసంగి 4:6; 5:15; రోమా 6:23.

III. మూడవది, మీ పాప రోగానికి యేసు నివారణ, యెషయా 53:4-5; మార్కు 2:17.