Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
శిక్షించుట, అవమానపరచుట మరియు ఉమ్మివేయుట

THE SCOURGING, SHAME AND SPITTING
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, మార్చి 26, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 26, 2017

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికిని నా ముఖము దాసుకోనలేదు" (యెషయా 50:6).


ఇతియోపీయుడైన నపుంసకుని మనము అడగవచ్చు, "ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరోకని గూర్చియా?" (అపోస్తలుల కార్యములు 8:34). 53 వ అధ్యాయములో, యెషయా ప్రభువైన యేసు క్రీస్తు గూర్చి చెప్పాడనడంలో సందేహము లేదు. నిజంగా ఇది ఒక ప్రవచనము యేసు చెప్పినది యేరూష లేముకు వెళ్ళినప్పుడు తన శిష్యులతో చెప్పాడు,

"ఇదిగో, యేరూష లేమునకు వేళ్ళుచున్నాము, మనష్యు కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నేరవేర్చబడును. ఆయన అన్య జనుల కప్పగింప బడును, మరియు వారు ఆయనను అపహసించి, మరియు అవమాన పరచి, ఆయన మీద ఉమ్మివేసిరి: మరియు ఆయనను కొరడాలతో కొట్టి, చంపుదురు: మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను" (లూకా 18:31-33).

యేసు వారితో చెప్పాడు అన్య జనులు ఆయనను అపహసించి, అవమానపరచి, శిక్షించి, చంపుతారని. ఆయన చెప్పాడు ఇదంతా "ప్రవక్తలచే" ముందుగా చెప్పబడిందని. కనుక మన పాఠ్యభాగము ఆయన చెప్పిన వచనాలకు సంబంధించినదే,

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికిని నా ముఖము దాసుకోనలేదు" (యెషయా 50:6).

చూడండి ఎంత వాస్తవంగా ఆ ప్రవచనము నెరవేరిందో. పొంతుపిలాతు, రోమ గవర్నరు, ఆయనను శిక్షించాడు. అప్పుడు రోమా సైనికులు

"...ముండ్ల కిరీటమును, ఆయన తలమీద పెట్టి, యూదుల రాజా, నీకు శుభమని చెప్పి, వందనము చేయసాగిరి! మరియు రెల్లుతో ఆయన తలమీద కొట్టి, ఆయన మీద ఉమ్మివేసి మొకాల్లని ఆయనకు నమస్కారము చేసిరి..." (మార్కు 15:17-19).

కాబట్టి నేను ఒప్పింపబడ్డాను ఆయన నజరేయుడైన యేసు, మన విమోచకుడు, ఆ ప్రవచన మాటలను నెరవేర్చాడు,

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికిని నా ముఖము దాసుకోనలేదు" (యెషయా 50:6).

జోసప్ హార్ట్ ఆ దృశ్యాన్ని వర్ణించాడు,

చూడు యేసు ఎంత ఓర్పుతో నిలబడ్డాడో,
   భయంకర స్థలములో అవమాన పరచబడ్డాడు!
పాపులు శక్తిమంతుని చేతులను బంధించారు,
   వారి సృష్టి కర్త ముఖముపై ఉమ్మివేసాడు.

ముళ్ళతో ఆయన తల గుచ్చబడి రక్తము చిందింది,
   ప్రతి అవయవము నుండి రక్తము ప్రవహించింది;
ఆయన వీపు కొరడాలతో కొట్టబడింది,
   కాని పదునైన దెబ్బలు ఆయన హృదయాన్ని చింపేసాయి.
("ఆయన తపన" జోసఫ్ హార్ట్ చే, 1712-1768; కాపరిచే మార్చబడినది).
       (“His Passion” by Joseph Hart, 1712-1768; altered by the Pastor).

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికిని నా ముఖము దాసుకోనలేదు" (యెషయా 50:6).

ఈ రాత్రి శ్రమ పడుచున్న రక్షకుని మీ ముందుంచుతాను. నేను పిలాతుతో పాటు అంటాను, "ఇదిగో ఆ మనష్యుడు." మీ హృదయాలను తిప్పి ఆయన తపనతో ఆయనను చూడండి. ఆయన ఎవరో, ఆయన ఏ మాదిరి ఉంచాడో, నిత్యాగ్ని నుండి నశించు పాపులను రక్షించడానికి ఆయన ఏమి చేసాడో చూడండి.

I. మొదటిది, దేవుని అవతారముగా ఆయనను చూడండి.

దేవుడు మనవ శరీరంలో భూమిపై మనష్యుల మధ్యలో జీవించడానికి దిగి వచ్చాడు. ఆయన యెషయా 50:2 లో చెప్పాడు, "నేను వచ్చాను." దైవ కుమారుడు పరము నుండి క్రిందికి "వచ్చి" మన మధ్య నివసించెను.

"వాక్యము దేవుడై యుండెను... ఆ వాక్యము శరీర ధారియై, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, (తండ్రి వలన కలిగిన, అద్వితీయ కుమారుని మహిమ వలే,) మనము ఆయన మహిమను కనుగొంటిమి" (యోహాను 1:1, 14).

"దేవుడు శరీరుడుగా ప్రత్యక్ష మయ్యెను" (I తిమోతి 3:16).

ఆది క్రైస్తవులు యేసును సరిగా పిలిచారు, "దేవాది దేవుడు, వెలుగుకు వెలుగు, నిజ దేవులకు నిజ దేవుడు, అద్వితీయుడు తయారు చేయబడిన వాడు కాదు."

ఇది ఆలోచించండి మీరు చూస్తారు ఈ ప్రశంశ నీయ సిద్ధాంతము ఎన్నడు మానవుని మనసులో ప్రవేశింప లేదు. స్పర్జన్ అన్నాడు,

ఇది పూర్తిగా ప్రశంశ నీయము, అనంత దేవుడు అన్ని చేసినవాడు, ఆయన ఎన్నడు, ఉన్నవాడు రాబోవు వాడు, సర్వ శక్తి మంతుడు, అద్వితీయుడు, సర్వాంతర్యామి, వాస్తవానికి మన మట్టి శరీరములో ఉండడానికి తన్ను తానూ కుదించుకున్నాడు. ఆయన సమస్తాన్ని సృష్టించాడు, అయినను ఆయన ఒక శరీరంలో ఉన్న మానవుని తనతో మమేక మవడానికి సిద్ధమయ్యాడు...మన ప్రభువు శరీరత్వము అవస్తము కాదు...మానవ ఆకృతిలో కనబడడం మాత్రమే కాదు: నిస్సందేహంగా "వాక్యము శరీర ధారియై మన మధ్య నివసించెను." "నన్ను తాకి చూడండి," అని ఆయన అన్నాడు, "ఆత్మకు మీరు చూచినట్లు శరీరము ఎముకలు ఉండవు" (C. H. Spurgeon, “The Great Mystery of Godliness,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1979 reprint, volume 28, p.698).

యేసు శరీరధారియైన దేవుడు, ఏకత్వమున్న వాడు. ఆయన దేవుని అవతారము కలవాడు, పరిశుద్ధ త్రిత్వములో రెండవ వ్యక్తి, వాక్యము శరీరదారి ఆయెను!

మన పాఠ్యభాగము మనవ జ్ఞానానికి అతీతమని తెలియ చేస్తుంది! ఇక్కడ దేవుడు శరీర ధారియై తక్కువగా చూడడానికి హింసింప బడడానికి అనుమతించు కుంటున్నాడు! దైవ అవతారి చెప్పేది మానవ తలంపుకు మించినది,

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికిని నా ముఖము దాసుకోనలేదు" (యెషయా 50:6).

ఇక్కడ సృష్టి కర్త, సమస్తమునకు ఆది సంభూతుడు, పాపులు ఆయన వీపును కొట్టడానికి ఆయన గెడ్డము లాగడానికి అనుమతిస్తున్నాడు! నా దేవుడు తన పరిశుద్ధ ముఖముపై పాపులు ఉమ్మివేయుటకు అంగీకరించాడు! వారు దేవుని ముఖముపై ఉమ్మివేసారు!

చూడు యేసు ఎంత ఓర్పుతో నిలబడ్డాడో,
   భయంకర స్థలములో అవమాన పరచబడ్డాడు!
పాపులు శక్తివంతుని చేతులను బంధించాడు,
   వారి సృష్టి కర్త ముఖముపై ఉమ్మివేసారు.
("ఆయన తపన" జోసఫ్ హార్ట్ చే).
(“His Passion” by Joseph Hart).

II. రెండవది, ఆయనను మనకు మాదిరిగా చూడండి.

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికిని నా ముఖము దాసుకోనలేదు" (యెషయా 50:6).

దైవ సేవకునిగా, యేసు పాపులను తన వీపుపై కొట్టడానికి, తన తల వెంట్రుకలు లాగడానికి, ఆయన ముఖముపై ఉమ్మివేయడానికి అనుమతించాడు. కోరా వలే వారి క్రింద భూమి తెరుచుకోడానికి, ఏలీయ చేసినట్టు, అగ్ని వారిని దహించి వేయునట్లు ఆయన చేయవచ్చును. కాని "వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యెదుట, గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు" (యెషయా 53:7). మరియు అపోస్తలుడైన పేతురు చెప్పాడు,

"క్రీస్తు కూడ మీ కొరకు భాదపడి: మీరు తన అడుగు జాడల యందు, నడుచు కొనునట్లు, మీకు మాదిరి యుంచి పోయెను: ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు: ఎవరు, ఆయన దూశించ బడిన, బదులు దూషించలేదు; ఆయన శ్రమ పెట్టబడినప్పటికీ, బెదిరింపక బడలేదు; కాని న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానూ అప్పగించు కొనెను" (I పేతురు 2:21-23).

మనము మన జీవితాలు ద్రవ్యము దేవునికివ్వడానికి ఇష్ట పడవచ్చు, కాని మనము తిట్టబడినప్పుడు వధింపబడేటప్పుడు వెనుకకు మరలుదా మనుకుంటాము. కాని యేసు మాత్రము అపహసించ బడడానికి అత్యంత పాపులచే హింసింపబడడానికి ఇష్టపడ్డాడు ఆయనను సమర్ధించు కోకుండా. స్నేహితులు చుట్టాలు మనలను వేష దారులన్నప్పుడు, క్రైస్తవులమైనందుకు మనలను గూర్చి చెడ్డగా మాట్లాడినప్పుడు మనమేమంటాము? మనం గుర్చుంచు కోవాలి యేసు "శాంతిగా ఉన్నాడు," ఆయన సిలువ వేయబడక మునుపు రాత్రి అబద్ద సాక్ష్యాలు చెప్పబడినప్పుడు ఏమి మాట్లాడలేదు (మత్తయి 26:63). పిలాతు ఆయనతో ఇలా అన్నప్పుడు, "నీ మీద వీరెన్ని నేరములు మోపు చున్నారో నీకు వినబడలేదా?" యేసు "ఒక్క మాటయైనను అతనికి ఉత్తర మియ్యలేదు; కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను" (మత్తయి 27:13-14).

గొప్ప కష్టం మీద నేను ఈ గుణపాఠము నేర్చుకున్నాను నేను యేసును సమర్ధించినప్పుడు దేవా దూషణ చేసే సినిమా "క్రీస్తు ఆఖరి శోధన" కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసినప్పుడు. తప్పుడు సాక్ష్యాలు వచ్చాయి నన్ను నిందించడానికి. ఇది పూర్తిగా తప్పు. నేను యూదులను ఇశ్రాయేలు దేశాన్ని, హృదయ పూర్వకంగా ప్రేమిస్తాను. కాని ఆ తిట్లన్నీ భరించడం నేర్చుకున్నాను మౌనంగా యేసును సమర్ధించినందుకు స్నేహితులు నాకు వ్యతిరేకమైనప్పుడు. ఇరవై సంవత్సరాలు తక్కువ మాట్లాడాను. ఇటీవల నేను ఒక ప్రకటన చేసాను ఈ అబద్ద నిందితులు మన సంఘ సాక్ష్యానికి వ్యతిరేకమైనప్పుడు. యేసు చెప్పాడు,

"మనష్యు కుమారుడు, నిమిత్తము మనష్యులు, మిమ్మును ద్వేషించి, వెలివేసి నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టి వేయునప్పుడు, మీరు ధన్యులు. ఆ దినమందు, మీరు సంతోషించి గంతులు వేయుడి: ఇదిగో, మీ ఫలము, పరలోకమందు గొప్పదై యుండును: వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి" (లూకా 6:22-23).

రక్షకుని ఆ మాటలు శ్రమలలో నాకు ఆదరణ నిచ్చాయి. మనము తొందరగా సమర్ధించు కోకూడదు యేసు నిమిత్తము లోకము మనలను దూషించినప్పుడు. "ఆఖరి శోధన" ప్రదర్శన సమయంలో ఒకడు నా ముఖముపై ఉమ్మివేసాడు. ఉమ్మి నా మీద పడుతున్నప్పుడు ఎన్నో కెమెరాల ముందు నిలబడ్డాను. యేసు నుండి నేర్చుకున్నాను తిరగబడకూడదని, ఆయన "అవమానము ఉమ్మివేయడం" నుండి ఆయన ముఖాన్ని దాచుకోనలేదు. ఇతని పట్ల దయతో ఉండాలని చాలా ప్రయత్నించాను. పాపము! అతడు హత్య చేయబడ్డాడు. నేను ఎంత విచారపడ్డానో తన కొరకు కుటుంబము కొరకు ఎంత కన్నీరు కార్చానో దేవునికి తెలుసు.

ఒక ప్రసంగములో స్పర్జన్ మన పాఠ్య భాగముపై చెప్పాడు, "మీరు బాగా తగ్గించుకోవాలి, తక్కువ, మీరు మనష్యుల చేత తృణీకరింపబడి తిరస్కరింప బడినప్పుడు, నిత్య మహిమ ఇదే మార్గము" (“The Shame and Spitting,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1972 reprint, volume 25, p. 431).

మనమందరము యేసు మాదిరి జ్ఞాపకముంచుకోవాలి ప్రజలను మనలను అపహసించి నప్పుడు ఈ చెడ్డ దినాలలో ఆయన అనుచరులుగా ఉన్నందుకు మనకు వ్యతిరేకంగా వారు మాట్లాడినప్పుడు. స్పర్జన్ అన్నాడు,

మీరు నొప్పులతో బాధలతో ఉన్నారా...? వాటిని గూర్చి యేసుకు తెలుసు, ఆయన "తన వీపును పాపులకు అప్పగించాడు." మీరు బాధపడుతున్నారా...అపహసింప బడుచున్నారా? "అవమానము నుండి ఉమ్మి వేయబడడం నుండి ఆయన తన ముఖము దాచుకొనలేదు." మీరు వేధింప బడుచున్నారా...? మీ దైవత్వమును బట్టి నిర్ణయము గేలి చేయుచున్నారా? యేసు మీ పట్ల సానుభూతి చూపిస్తాడు, వారు ఆయనను ఎంత అపవిత్ర పరిచారో మీ రెరుగుదురు. మీ ప్రతి హృదయ వేదనలో మీ ప్రభువు తనభాగము పంచుకుంటాడు... (స్పర్జన్ ఐబిఐడి.).

చూడు యేసు ఎంత ఓర్పుతో నిలబడ్డాడో,
   భయంకర స్థలములో అవమాన పరచబడ్డాడు!
పాపులు శక్తివంతుని చేతులను బంధించాడు,
   వారి సృష్టి కర్త ముఖముపై ఉమ్మివేసారు.

III. మూడవది, పాపులకు ప్రత్యామ్నాయంగా ఆయనను చూడండి.

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికిని నా ముఖము దాసుకోనలేదు" (యెషయా 50:6).

గుర్తుంచుకోండి యేసు తన పాపమును బట్టి శ్రమ పడలేదు, ఆయనలో ఏ పాపమును లేదు.

"మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచ బడెను, మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను: మన సమాధనార్ధమైన శిక్ష అతని మీద పడెను; అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

యెషయా 53 లోని ఈ వచనము మనకు తేటగా చెప్తుంది ఆయన గాయములు దెబ్బలు, ఆయన మరణము పాపులను రక్షించడానికి అవసరము. యేసు మన పాపమును ఆయన మోసాడు. బైబిలు మనకు చెప్తుంది దేవుడు "ఎందుకనగా మనమాయన యందు, దేవుని నీతి అగునట్లు; పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను" (II కొరింధీయులకు 5:21). యేసు శ్రమ పడినప్పుడు, మన పాపముల కొరకు శ్రమపడ్డాడు, ప్రాయాశ్చిత్తము చెల్లించడానికి, మనము రక్షించ బడడానికి. పాపము అతి భయంకరము. పాపము శిక్షార్హము. పాపము ఉమ్మివేయబడాలి. పాపము సిలువ వేయబడాలి. యేసు మన పాపాలను ఆయనపై వేసుకున్నాడు, కనుక శిక్షింప బడ్డాడు. ఉమ్మి వేయబడ్డాడు. అవమానింప బడ్డాడు. దేవుడు పాపమును గూర్చి ఏమి ఆలోచిస్తున్నాడో తెలియాలంటే, ఆయన కుమారుని చూడు, వీపు నలుగ గొట్టబడింది, వెంట్రుకలు పీకబడ్డాయి, సైనికులు ముఖముపై ఉమ్మివేసారు నీ కొరకు నా కొరకు ఆయన పాప అర్పణ అయ్యాడు. నీవు నేను మన పాపముల నిమిత్తము మెత్తబడి లాగబడి ఉమ్మివేయబడితే అందులో ఆశ్చర్యము లేదు. కాని మన పాపాలను భరించింది దైవ కుమారుడు. యేసు మన స్థానంలో నిలబడ్డాడు, "అతనిని నలుగ గొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను: అతడు తన్ను తానే అపరాధ పరిహారార్ధ బలిగా చేయబడెను" (యెషయా 53:10). యేసుపై మన పాపము బలవంతముగా వేయబడిన, అది ఆయనకు లోతైన నొప్పి అవమానము కలిగించింది సిలువపై వెల చెల్లించే ముందు.

గమనించండి మన పాఠ్య భాగము చెప్తుంది, "నేను నా వీపును పాపులకు అప్పగించాను." యేసు ఇష్ట పూర్వకంగా పాపులకు అప్పగించుకున్నాడు, వారు ఆయన గెడ్డముపై వెంట్రుకలు లాగి, ఆయన ముఖముపై ఉమ్మివేసారు. సిలువపై మరణించడానికి అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తము ఎవరు ఆయనను చెయ్యలేదు. ఆయన ఇష్ట పూర్వకంగా చనిపోయాడు. దైవ కుమారుడు ఇష్ట పూర్వకంగా మన కొరకు శాపమయ్యాడు, మనకు ప్రతిగా, పాప పరిహారము చెల్లించాడు – తద్వారా దేవునిచే మనము క్షమింప బడడానికి ఆయన దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడడానికి.

ఇది విని కూడ ఆశ్చర్యము కలగడం లేదా మీకు? మీరు గుర్తుంచుకుంటారా దైవ కుమారుడు కొట్టబడి, లాగబడి, ఉమ్మివేయబడితే, మీకు ఆశ్చర్య ఆనందములు, స్తుతి కలగడం లేదా? ఆకాశములను మేఘములతో కప్పగలవాడు తన ముఖమును సిగ్గు నుండి ఉమ్మి వేయబడడం నుండి దాచుకోలేదు. గొప్ప పర్వతాలను సృష్టించిన ఆయన, తన వీపును దెబ్బల నుండి దాచుకోలేదు. అంతరిక్షాన్ని ఏకరీతిగా కాపాడేవాడు బంధించ బడి ఆయన సృష్టించిన వారిచే కళ్ళకు గంతలు కట్టబడ్డాడు. ఆకాశంలో దేవదూతలు గొప్ప స్తుతి గానము పాడుచున్నప్పుడు, ఆయన సిలువకు మేకులు కొత్తబడలేదా? నేననుకుంటాను ఆ మేకుల గురుతులు ఆయన కాళ్ళలోను చేతులలోను ఎప్పటికి ఉండిపోతాయి, మన కొరకు ఆయన చేసిన దానిని పరలోకములో ఆయన చూచినప్పుడు మర్చిపోకుండా ఉండడానికి. ఆయన ప్రియమైన ముఖమును నేను ఎలా చూడగలను మహిమలో పాపుల వెంట్రుకలు ఆయన గెడ్డము నుండి లాగడం ఆయన ముఖముపై ఉమ్మి కారడం జ్ఞాపకం ఉంచుకోకుండా!

చూడు యేసు ఎంత ఓర్పుతో నిలబడ్డాడో,
   భయంకర స్థలములో అవమాన పరచబడ్డాడు!
పాపులు శక్తివంతుని చేతులను బంధించాడు,
   వారి సృష్టి కర్త ముఖముపై ఉమ్మివేసారు.

ఆయన ముఖము! దూతలపై ఎందుకు ఉమ్మి వేయబడలేదు? ఆయన అందమైన ముఖము తప్ప ఉమ్మివేయడానికి మీకు వేరే స్థలము దొరకలేదా? ఆయన ముఖము! దేవుడు సహాయము చెయ్యాలి! ఆయన ముఖము! వారు యేసు పరిశుద్ధ ముఖముపై ఉమ్మివేసారు! స్పర్జన్ అన్నాడు, "ఆ మనిషి సృష్టించ బడకుండా ఉంటే బాగుండేది, లేక అంత...భయంకరమైన పని చెయ్యడానికి జీవించకుండా ఉండాల్సింది" (ఐబిఐడి., పేజి 428). దేవుడు మనకు సహాయము చెయ్యాలి! వారు మన విమోచకుని ముఖముపై ఉమ్మివేసారు!

నీవు నశించకపోతే, ఆయనను నమ్మాలని నిన్ను బ్రతిమాలు చున్నాను. ఆయనను నమ్మితే నీ పాపము ముగుస్తుంది, ఎందుకంటే ఆయన నీ అతిక్రమములను అవమానములను సిలువ వేయబడినప్పుడు భరించాడు. నీ శిక్షకు తొలగించాడు, యేసు అదంతా భరించాడు – ఆయన వీపుపై, ఆయన ముఖముపై, ఆయన చెంపలపై, ఆయన చేతులకు కాళ్ళకు గాయాలయ్యాయి. ఆయనను విశ్వసించు నీ పాప శిక్ష తొలగిపోతుంది, నీవు రక్షింపబడతావు, నీతిమంతుడిగా తీర్చబడతావు నిత్యత్వంలో ఆయన విమోచించే ప్రేమ ద్వారా! దయచేసి నిలబడి ఆరవ పాట పాడండి, "ఓ, ఎలాంటి ప్రవాహము!" డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే.

మనకు కొలవలేనంత ప్రేమను గూర్చిన కథ ఉంది,
   మనం చెప్తాం ఎలా పాపులు క్షమించబడగలరో.
ఉచిత క్షమాపణ ఉంది, యేసు శ్రమపడ్డాడు,
   కల్వరి వృక్షముపై కార్యశుద్ధి కలిగించాడు.
ఓ, ఎంతటి కృపా ప్రవాహము,
   సిలువ వేయబడిన మానవుల రక్షకుని నుండి.
ప్రశస్త రక్తము ఆయన కార్చాడు మనలను విమోచించడానికి,
   మన పాపలన్నింటికి కృప క్షమాపణ.
("ఓ, ఎలాంటి ప్రవాహము!" డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే, 1895-1980).
       (“Oh, What a Fountain!” by Dr. John R. Rice, 1895-1980).

నీవు ఈ రాత్రి యేసును విశ్వసించాలని నా ప్రార్ధన. ఆయన రక్తము నీ పాపములన్నింటి నుండి నిన్ను కడుగును. ఆయనను ఇప్పుడు విశ్వసించు నిత్యత్వములో ఎన్నటికి, నీవు రక్షింప బడతావు.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము డాక్టర్ క్రైట్ ఎల్. చాన్: మార్కు 18:31-33.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"కల్వరికి నన్ను నడిపించు" (జెన్ని ఎవిలిన్ హస్సీచే, 1874-1958).
“Lead Me to Calvary” (by Jennie Evelyn Hussey, 1874-1958).ద అవుట్ లైన్ ఆఫ్

శిక్షించుట, అవమానపరచుట మరియు ఉమ్మివేయుట

THE SCOURGING, SHAME AND SPITTING

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికిని నా ముఖము దాసుకోనలేదు" (యెషయా 50:6).

(అపోస్తలుల కార్యములు 8:34; లూకా 18:31-33; మార్కు 15:17-19)

I.    మొదటిది, దేవుని అవతారముగా ఆయనను చూడండి, యెషయా 50:2;
యోహాను 1:1, 14; I తిమోతి 3:16.

II.   రెండవది, ఆయనను మనకు మాదిరిగా చూడండి, యెషయా 53:7;
I పేతురు 2:21-23; మత్తయి 26:63; 27:13-14; లూకా 6:22-23.

III.  మూడవది, పాపులకు ప్రత్యామ్నాయంగా ఆయనను చూడండి, యెషయా 53:5;
II కొరింధీయులకు 5:21; యెషయా 53:10.