Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మంచి వ్యక్తి నశించిపోయాడు చెడ్డ వ్యక్తి రక్షింపబడ్డాడు!

A GOOD MAN LOST AND A BAD MAN SAVED!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, మార్చి 5, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 5, 2017

"తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీ కరించు కొందరితో, ఆయన ఈ ఉపమానము చెప్పెను: ప్రార్ధన చేయుటకై ఇద్దరు మనష్యులు దేవాలయమునకు వెళ్ళిరి; వారిలో ఒకడు పరిశయ్యడు, ఒకడు సుంకరి. పరిశయ్యడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్థులను, వ్యభిచారులునైన, ఇతర మనష్యుల వలెనైనను, ఈ సుంకరి వలనైనను, ఉండనందున నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు చున్నాను. వారమునకు, రెండు మూడులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటితో పదవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్ధించు చుండెను. అయితే సుంకరి, దూరంగా నిలచుండి, ఆకాశము వైపు కన్ను లేత్తుటకైనను, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన, నన్ను కరుణించుమనెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను: తన్ను తానూ హెచ్చించు కొనువాడు తగ్గింప బడుననియు; తన్ను తానూ తగ్గించు కొనువాడు హెచ్చింప బడుననియు చెప్పెను" (లూకా 18:9-14).


ఇది ఒక ఉపమానము. ఒక గొప్ప సత్యము చెప్పడానికి యేసు ఈ కథను చెప్పాడు. యేసు ఈ కథను ధైర్యంగా ఉండేవారికి, వారి మంచితనాన్ని నమ్ముకునే వారికి, వేరే వారిని తక్కువగా చూసే వారికి చెప్పాడు.

డాక్టర్ ఆర్. ఏ. టోరీ గొప్ప సువార్తికుడు. ఆయన తరుచు ఈ వచనాలపై బోధించాడు. అతడు ఈ ప్రసంగాన్ని, "మంచి వ్యక్తి నశించి పోయాడు చెడ్డ వ్యక్తి రక్షింపబడ్డాడు" అని చెప్పాడు. డాక్టర్ టోరీ అన్నాడు, "నేను విషయాన్ని తారుమారు చేసానని మీలో కొందరు అనవచ్చు. అది ఇలా ఉండాలి 'మంచివాడు రక్షింపబడ్డాడు చెడ్డవాడు నశించి పోయాడు.' కాని మీరు తప్పు. విషయము తేటగా ఉంది, 'మంచి వ్యక్తి నశించి పోయాడు చెడ్డ వ్యక్తి రక్షింపబడ్డాడు.'" క్రీస్తు ఈ కథను మనకు ఇచ్చాడు. క్రీస్తు ఒక మంచి వ్యక్తిని గూర్చి చెడ్డ వ్యక్తిని గూర్చి మాట్లాడాడు. క్రీస్తు చెప్పాడు మంచివాడు నశించి పోయాడని చెడ్డవాడు రక్షింపబడ్డాడని.

పరిశయ్యాలు మంచివారు. వారు మత పరమైన వారు. వారు మంచి జీవితాలు జీవించారు. సుంకరులు పన్ను వసూలు చేసేవారు. వసూలు చెయ్యగలిగినంత వసూలు చేసేవారు. వారు గుంపు నాయకులు. ఎక్కువ డబ్బు ఇవ్వాలని వారు ప్రజలను బలవంత పెట్టేవారు. రోమీయులకు వారు పెద్ద మొత్తము కూడ బెట్టారు. మిగిలినది వారి కొరకు ఉంచుకున్నారు. యూదులు వారిని ద్వేషించారు. వారిని నమ్మక ద్రోహులుగా, చెడ్డవారిగా పరిగణించారు. పాపులందరిలో సుంకరులు బహు చెడ్డవారు. వారు దుష్టులు దొంగలు. ఈ ఉపమానంలో యేసు మొత్తము మానవ జాతిని విభజిస్తున్నాడు. ఆయన ఆరిని రెండు రకాల ప్రజలుగా విభజించాడు – స్వనీతిపరులు నశించిన వారు, పాపులమని తెలుసుకున్న వారు రక్షింప బడినవారు. నశించిన వారు రక్షింపబడిన వారు. తిరస్కరింపబడినవారు ఎన్నుకోనబడినవారు. గురుగులు గోధుమలు. వీరు విశాల మార్గములో నరకము వైపు వెళ్తున్నారు, ఇతరులు ఇరుకు మార్గములో రక్షణ మార్గములో ఉన్నారు. యేసు మనవ జాతిని విభజించాడు, ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక గుంపులో ఉన్నవారే. ఈ రాత్రి నీవు ఏ గుంపులో ఉన్నావు? యేసు అన్నాడు, "ఇద్దరు ప్రార్ధించడానికి దేవాలయమునకు వెళ్ళారు; ఒకడు పరిశయ్యడు, ఒకడు సుంకరి." మంచివాడు చెడ్డవాడు. అందులో నీవెవరవు?

I. మొదటిది, "మంచి" వ్యక్తి నశించిపోయాడు.

"పరిశయ్యకు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్థులను వ్యభిచారులునైనా, ఇతర మనుష్యుల వలేనైనను, ఈ సుంకరి [దొంగలను] వలెనైనను ఉండనందున, నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాను – లేదా ఈవిధమైన పన్ను వసూలు చేసేవారి వలే. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు, నా సంపాదన అంతటిలో పదవవంతు చెల్లించుచున్నానని తనలో తానూ ప్రార్ధించు చుండెను" (లూకా 18:11-12).

ప్రపంచము దృష్టిలో అతడు నిజంగా "మంచి" వ్యక్తి. అతడు నీతిమంతుడు. అతడు మంచి జీవితమూ జీవిస్తున్నాడు. అతడు మతపరమైన వాడు. అతడు ఉదార స్వభావము గలవాడు. అతడు గౌరవనీయుడు. అతడు రక్షింప బడక మునుపు నాలాగే ఉన్నాడు. నేను సూటు వేసుకొని నా పినతండ్రి గదిలో తిరుగుతున్నాను. ఇతరులు తాగి ఉన్నారు. వారు నేలమీద పడుకున్నారు. నాకు 18 సంవత్సరాలు. నేననుకున్నాను, "నేను వారిలా ఉండను." నేను మంచి బాలుడను. నేను మత్తు పదార్ధాలు తీసుకోలేదు. త్రాగలేదు. పొగ త్రాగడం ఆపేసాను. నేను మంచి బాలుడను. బాప్టిస్టు సేవకునిగా బోధించడానికి సమర్పించు కున్నాను. నేను చాలా మంచివాడను. కాని నశించి పోయాను! ఇతరులు చేసే పనులు చెయ్యడం లేదని నేను గర్విస్తూ ఉండేవాడిని. నాలో గర్వము ఉండేది. నాలో తప్పు లేదనుకున్నాను. కాని నాకు మంచిగా అనిపించలేదు. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, "దేవునికి ఇంకేమి కావాలి?" నేను గుడికి వెళ్లాను. నేను ప్రతి ఆదివారము ఉదయము సాయంకాలము గుడికి వెళ్ళేవాడిని. ప్రతి ఆదివారము మధ్యాహ్నము రేడియోలో బిల్లి గ్రేహము బోధలు వినేవాడిని. ప్రతి ఆదివారము రాత్రి యవ్వన సంగీత బృందములో పాడేవాడిని. నేను జీవితాన్ని బోధకునిగా, దేవునికి సమర్పించుకున్నాను. అయినను నా హృదయ అంతరంగములో సమాధానము లేదు. బైబిలు చెప్తుంది, "శాంతి లేదు, దేవుడు చెప్తున్నాడు, దుష్టులతో" (యెషయా 57:21). ఇంకా దేవునికి ఏమి కావాలి? నేను పరిశయ్యునిలా ఉన్నాను!

అతడు తననే నమ్ముకున్నాడు. ఇతరులను తృణీకరించాడు. పాపినని ఒప్పుకోలేదు. తన పాపపు దయాన్ని గమనించలేదు. అతడు ప్రార్ధించాడు "తనలో" దేవునితో బదులు. తన స్వనీతిని బట్టి తనను తానూ అభినందించు కున్నాడు. నీవు కూడ ఈ రాత్రి అలాగే ఉన్నావు! నీవు మంచిగా ఉన్నావనుకుంటున్నావు. నిన్ను నీవు మోసపరచుకున్నావు. సాతాను మాట విన్నావు. అతనిచే మోసపోయావు. నీవు యదార్ధంగా నీతిగా ఉన్నావు బాహ్యంగా. కాని నీ హృదయము పాప భూ ఇష్టమైనది. బైబిలు చెప్తుంది నీ "హృదయము అన్నింటి కంటే మోసకరమైనది, బహు దుస్టమైనది" (యిర్మియా 17:9). నేను అది బోధిస్తే, మీకు ఇష్టము ఉండదు. మీకు అసౌకర్యంగా ఉంటుంది. మీ హృదయాన్ని పరీక్షించుకోవడం మీకు ఇష్టం ఉండదు. ఆదాము వలే, దేవుని నుండి దాచుకోవాలనుకున్నాడు. ఆదాము వలే, నీ పాపాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావు. ఆదాము వలే, ఇతరులపై నింద మోపాలనుకుంటున్నావు. నీవు ఆదాము వలే, దేవునిచే శపించబడినవాడవు! నీవు నశించి పోయావు. నీవు మతం మరియు నీతిలో ఓడిపోతావు. నీకు నీవుగా మోసపోతావు. తప్పుడు నిరీక్షణలో ఉంటావు. నీవు ఉన్నట్టే చనిపోతే, నీవు నిత్యత్వంలో నశించిపోతావు.

నిత్యత్వము, నిత్యత్వము,
నిత్యత్వంలో నశించిపోవడం.
నిత్యత్వము, నిత్యత్వము,
నిత్యత్వంలో నశించిపోవడం!
("నిత్యత్వము" ఎలీషా ఏ. హాఫ్ మాన్ చే, 1839-1929).
   (“Eternity” by Elisha A. Hoffman, 1839-1929).

నన్ను నేను అడుగుకుంటాను, "దేవునికి ఇంకా ఏమి కావాలి?" ఏదీ సరిపోదు! ప్రతిరోజు ప్రతి రాత్రి అసౌకర్యంగా ఉండేది –మరియు నీకు కూడ! నీవు అలా ఆనందంగా ఉండలేవు! నీకు ఇలా శాంతి ఉండదు! "దుష్టులకు, శాంతి ఉండదు, దేవుడు చెప్తున్నాడు" (యెషయా 57:21). నీవు ధనిక యువనుని వలే ఉన్నావు. నీవు బయటకు దేవుని న్యాయ శాస్త్రాన్ని అనుసరిస్తావు, కాని నీవు నీ హృదయ పాప స్థితిని గూర్చి నీకు ఆలోచన లేదు. దేవుని ఆత్మీయ ధర్మ శాస్త్ర అవగాహన లేదు. దేవుని ధర్మ శాస్త్రము నీ హృదయ స్వల్ప కామాన్ని కూడ ఖండిస్తుంది! నీ ఉద్దేశంలో నీవు మంచి వ్యక్తివి. నీవు దేవుని దృష్టిలో నిరుపయోగ పాపివి! నీవు ఇలా చనిపోతే నేరుగా నిత్యత్వ అగ్ని గుండములోనికి పోతావు!

నిత్యత్వము, నిత్యత్వము,
నిత్యత్వములో నశించిపోవడం.

కాని ఈ వ్యక్తిని గూర్చి ఇంకొక విషయము మీకు చూపిస్తాను. అతడు నేరస్థుడని; పూర్తిగా తప్పు అని తన ప్రార్ధన తెలియ చేస్తుంది. దేవుని ద్యాస ఏమాత్రము లేదు. అతని "ప్రార్ధన" కల్పితము తప్పు. ఒక వ్యక్తి ప్రార్ధన చూపిస్తుంది వారు మారలేరని. వారి ప్రార్ధనలు తప్పుడు శబ్దము నిస్తాయి. అవి యాంత్రిక ప్రార్ధనలు. నటనతో కూడినవి. అవి ప్రార్ధనలే కాదు! ఇతరులను మెప్పించడానికి అవి బూటకపు మాటలు లేక నిన్ను మోస పరచుకోవడానికి – అతడు ప్రార్దనే చెయ్యలేదు. వారు అందరి కొరకు ప్రార్ధన చేయలేరు! తన "మంచితనానికి" అతడు అభినందించుకున్నాడు – "దేవా, ఇతరుల వలే నేను లేను, వందనాలు." ఎంత పిచ్చి! అతడు ఎంత అబద్దమో దేవుడు చూస్తున్నాడని తెలుసా? అబద్దపు మాటలు! నిజంగా దేవుని నమ్ముతున్నాడు? కానేకాదు. దేవుని కంటే ఒక తలంపు, వ్యక్తిగత నిజ దేవుడు కాదు – సజీవుడు కానేకాదు. నాకు ఎలా తెలుసు? ఎందుకంటే "అతడు లేచి తనతో ప్రార్ధించుకున్నాడు" (లూకా 18:11). ఇంకా ఇలా అనువదింపవచ్చు, "తనకు ప్రార్ధించుకున్నాడు" (ఎన్ఐవి, గమనిక). వాస్తవానికి, ఇతడు దేవునికి ప్రార్ధించలేదు. అతడు తన మంచి తనాన్ని పోగుడుకున్నాడు. తనకు ప్రార్ధించుకున్నాడు, దేవునికి కాదు! నీవు కూడ, అలానే ప్రార్దిస్తున్నావు కదా? నీతో నీవే ప్రార్ధించుకున్నట్టు అనిపిస్తుంది కదా? ప్రార్ధన కూటాలలో గట్టిగా ప్రార్ధించడానికి భయపడుతున్నావు కదా? నీ ప్రార్ధనలు అబద్ధములని ఇతరులకు తెలుస్తుందని కదా? చూపించుకోవడానికి ప్రార్దిస్తున్నావు కదా? నీవు నశించిన వాడవని చూపిస్తుంది కదా, నశించు వాడు దేవునికి నిజంగా ప్రార్ధించ లేడు కదా? 14 వ వచనంలో యేసు చెప్పాడు ఈ "మంచి" వ్యక్తి "నీతిమంతునిగా" తీర్చబడలేదు. అతడు రక్షింప బడలేదు! అతడు నశించినవాడు. అతడు మతపరమైన వాడు కాని నశించిన వాడు. అతడు నిత్యత్వంలో నరకానికి వెళ్తున్నాడు!

నిత్యత్వము, నిత్యత్వము,
నిత్యత్వములో నశించిపోవడం!

ఆ వ్యక్తి వేషధారి – నీవు కూడ! దేవునికి ప్రార్దిస్తున్నట్టు నటించాడు – నీవు కూడ అంతే! ఒక రోజు నీ "మంచితనము" నీకు సహాయ పడదు. అందరి వలే, నీకు కూడ ఒక దినాన భయంకరమైనది సంభవిస్తుంది. కాని ఆ భయంకర వేషధారణ దినాన నీకు మంచి జరగదు. బైబిలు చెప్తుంది, "భయము వేషదారులను ఆశ్చర్యపరుస్తుంది" (యెషయా 33:14). నీవు చనిపోయి దేవుని ముందు నిలబడతావు, దేవుడు అంటాడు, "నేను నిన్ను ఎన్నడు ఎరుగను: నా నుండి తొలగి పొమ్ము" (మత్తయి 7:23). నీ అబద్దపు మతము నీకు మంచి చేయదు. నీలాంటి వేషదారులను దేవుడు అగ్ని గుండములో పడవేస్తాడు. అతడు లోకపు దృష్టిలో మంచివాడు. కాని దేవుని దృష్టిలో నశించిన వాడు! లోకము దృష్టిలో నీవు మంచివాడవు. దేవుని దృష్టిలో నీవు నశించిన వాడవు.

II. రెండవది, చెడ్డ వ్యక్తి రక్షింపబడ్డాడు.

"అయితే సుంకరి [పన్ను వసూలు చేసేవాడు], దూరంగా నిలబడి, ఆకాశము వైపు కన్ను లేత్తుటకైనను, ధైర్యము చాలక [రొమ్ము కొట్టుకొనుచు], దేవా, పాపినైన నన్ను కరుణించు మనెను" (లూకా 18:13).

అతడు మంచి వ్యక్తి కాదు. నీతిమంతుడు కాదు. ఎంత పాపియో అతడు చూడ లేదు. పరిశుద్ధాత్మ చూపించింది అతడు నిజంగా నశించిన పాపియని. దేవుడ్ని నుండి శిక్షకు పాత్రుడని తనకనిపించింది. కీర్తన కారుకు చెప్పినట్టు అనిపించింది, "నా పాపము నా యెదుట నున్నది" (కీర్తనలు 51:3). డాక్టర్ జాన్ గిల్ అన్నాడు, "పైకి చూడలేక పోయాడు; అవమానముతో నింప బడ్డాడు; విచారంతో [తన తల] దించుకున్నాడు; [దేవుని] భయము ఉగ్రత, అసంతృప్తి ఉన్నందున; [దేవుని కృపకు] అయోగ్యుడని గుర్తించాడు. అతడు రొమ్ము కొట్టుకున్నాడు....తన ఆత్మను బలపరచుకోవడానికి దేవునికి మోర పెట్టాడు..అతని ఆత్మ, దేవుని ప్రార్ధిస్తూ... అన్నాడు, ‘పాపినైన నన్ను కరుణించుము’! అది అతని ప్రార్ధన; చిన్నది, కాని సంపూర్ణము... పాపినని ఒప్పుకోలు ఉంది, ఆడాములో పాపము, ఆదాము నుండి పాపపు స్వభావాన్ని [పొందుకున్నాడు] కలిగి యున్నాడు, పాపములో జన్మించాడు; జీవితములో పాపి, చాలా అతిక్రమములు చేసాడు; చెడ్డ పాపి – దేవుని ఉగ్రతకు పాత్రుడు, [కొంతభాగం] నరక పాత్రుడు:.. దేవునికి వ్యతిరేకంగా ప్రార్ధించాడు" (గమనిక లూకా 18:13).

పాపపు ఒప్పుకోలు ఉన్న రక్షింపబడక పోవచ్చు. పాపపు ఒప్పుకోలు కన్నీరు నేను ప్రజల ముఖాలలో చూసాను. కాని వారు రక్షింపబడలేదు, పాపాన్ని బట్టి ఎడ్చినప్పటికిని. చాలా విషాదము ద్వారా ప్రజలు వెళ్ళడం చూసాను. కాని వారు మారలేదు. "నేను తప్పు పాపిని" అని, అనడం విన్నాను. కన్నీటితో వారు అలా అనడం విన్నాను – కాని వారు రక్షింపబడలేదు! అది ఎలా? నన్ను తేట పరచనివ్వండి. పాపపు ఒప్పుకోలు పాపము నుండి మార్పు కాదు. పాపపు ఒప్పుకోలు ఉన్న యేసుచే రక్షింపబడక పోవచ్చు. మళ్ళీ మళ్ళీ ప్రజలు ఏడవడం చూసాను – అయినను ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించ లేదు. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అర్ధం చేసుకున్నాడు. అతనన్నాడు, "క్రైస్తవుడవడం క్లిష్టమైనది, కష్టమైనది, కొత్త నిబంధన దానిని కొత్త జన్మ, నూతన సృష్టి అంటుంది... ఇంకా ఎక్కువగా, దేవుడు [చేసిన] అసాధారణ క్రియ, చనిపోయిన ఆత్మ జీవించడం..." ఆ క్లిష్ట స్థితిలో దేవుడు నీ దుష్ట హృదయాన్ని ద్వేశించేటట్టు చేస్తాడు. దేవుడు క్లిష్ట తను నీలో సృష్టిస్తాడు. ఒప్పుకోలు ఉపశమనాన్ని ఇస్తుంది. జాన్ బన్యన్ ఏడూ సంవత్సరాలుగా పాపపు ఒప్పుకోలులో ఉన్నాడు. భూమి మీద ఏడూ సంవత్సరాల నరకము. అనుభవము ద్వారా నాకు తెలుసు పాపపు ఒప్పుకోలు పాపము నుండి మార్పు కాదు.

కళ్ళలో నీళ్ళు చూచి, ఆధునిక సువర్తికులనుకుంటారు వారు రక్షింపబడ్డారని! కాని వారు లోతైన ఆవేదనలో లేరు. కన్నీరు చూచి క్రీస్తును నమ్మమని చెప్తారు కాని అలా జరగదు యేసు వారిని రక్షించేటట్టు. వారు ఇంకా విరుగ గొట్టబడలేదు. అందుకే వారు తరచు చెప్తారు, "అప్పుడు నేను యేసును విశ్వసించాను." వారిని గూర్చి వ్రాసుకుంటారు. కాని ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి కొంచెము చెప్తారు. తరువాత, కొన్ని వారాల తరువాత, ప్రశ్నిస్తే వారంటారు, "అది నా కొరకు చనిపోయిన యేసును నమ్మాను." "ఆ" చూపిస్తుంది వారు సిద్ధాంతాన్ని నమ్మారు, యేసును కాదు. నశించు పాపి యేసును ఆయనగా నమ్మడు. నిరుత్సాహ పడేవరకు. భాద నుండి ఆవేదన నుండి తప్పించుకునే మార్గము లేడని తెలుసుకునే వరకు. కొన్నిసార్లు అది త్వరగా జరుగుతుంది. కాని సామాన్యంగా చాలా అబద్ధపు మార్పిడులు ద్వారా నీవు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అపోస్తలునితో నీవు చెప్పగలవు, "నేను దౌర్భాగ్యుడను! ఈ [మరణ శరీరము] నుండి ఎవరు నన్ను విడిపించ గలరు?" (రోమా 7:24). అప్పుడు మాత్రమే సుంకరి చేసినట్టు దేవుని కృప కొరకు మోర పెడతావు! అప్పుడు మాత్రమే దేవుడు జవాబు దయచేసి యేసు దరికి చేరుస్తాడు!

ఆధునిక సువర్తికులు అంత త్వరగా తేలికగా జరగాలనుకుంటారు. గత సంవత్సరము ఉజ్జీవములో చూసాము. మీలో చాలామంది ఇలా అన్నారు, "అప్పుడు నన్ను రక్షించడానికి యేసును నమ్మాను." లేక "అది అప్పుడు నమ్మాను యేసు నన్ను రక్షించాడు అని." ప్రభువైన యేసు క్రీస్తు పూర్తిగా విడువబడ్డాడు. ఎందుకంటే పాపము ఒప్పుకోలు నీకు లేదు. నీ హృదయ అందకారపు ఒప్పుకోలు. దేవునికి వ్యతిరేకంగా నీ విరోధము. నిన్ను నీవు మార్చుకోలేవని ఒప్పుకోవడం. జాన్ కాగన్ అన్నాడు, "యేసు నొద్దకు రావలసి వచ్చింది, కాని రాలేక పోయాను." "నేను దౌర్భాగ్యుడను, నన్ను ఎవరు విడిపించ గలరు? మేము చెప్తున్నాము యేసు రక్షిస్తాడని నమ్ముతున్నారు అంతే. మీరు భాదపడి ఆత్మీయ నిద్రలోనికి వెళ్తారు. మీలో చాలామంది మార్పిడి నొంద లేరు! మీరు మళ్ళీ పూర్తి ఒప్పుకోలు పొందుకోవాలి. మార్పిడి జీవితంలో జరిగే ప్రాముఖ్య విషయము. యేసు నందలి విశ్వాసాన్ని ఒక్క వాక్యములో చెప్పలేవు. అర్ధ వాక్యములో కాని, ఒక అమ్మాయి చేసినట్టు, ఆ అమ్మాయి నిద్రలోనికి వెళ్ళిపోయింది, ఒప్పుకోలు లేకుండా. కన్నీటితో, పాపపు ఒప్పుకోలు లేకపోతే, ఎందుకు ముందుకు వస్తారు? మేము ఏదో చేస్తామనుకుంటున్నరా? కొన్ని నిమిషాలలో పూర్తి అనుభవము ద్వారా పోనివ్వ గలమా? వేదికపైకి 1,000 సార్లు వచ్చినా మేమేమి చెయ్యలేము. ఏమి మీకు బోధించ లేము. మీకు సహాయము చెయ్యడానికి ఏమి చెప్పలేము! దేవుడు మాత్రమే సహాయము చేయగలడు – వేషధారులకు దేవుడు సహాయము చెయ్యడు. మీరు విశ్వ విధ్యాలయములో లోతైన చదువు నిద్ర లేని రాత్రులు లేకుండా ఒక పట్టా పొందగలరా? వీలు కాదు! కాని పిహెచ్.డి. కంటే యేసు నందు మార్పు చాలా ప్రాముఖ్యము. నిజ మార్పిడి నీ జీవితంలో అతి ప్రాముఖ్య అనుభవము. నశించావని గ్రహించే వరకు మారలేవు. నిస్సహాయత లేకుండా మారలేవు. నీ హృదయ పాపమును ద్వేషించకుండా మారలేవు. "పాపినైన నన్ను కరుణించు" అని, మోర పెట్టె వరకు. లేచి పాటల కాగితంలో 10 వ పాట పాడదాం. "రండి, పాపులారా" జోసఫ్ హార్ట్ చే (1712-1768).

ఇప్పుడు, యేసును ఈ రాత్రే నమ్మాలని మోర పెడుతున్నాను. పాపపు ఒప్పుకోలు ఉంటే, నిస్సహయుడవైతే, నశించినట్టు అనిపిస్తే, ఇక్కడకు రండి యేసును గూర్చి మాట్లాడతాము. యేసు పరము నుండి భువికి వచ్చాడు. ఆయన నీ స్థానంలో సిలువ వేయబడ్డాడు, నీ పాప ప్రాయశ్చిత్తము కొరకు, తీర్పు నుండి నరకము నుండి రక్షించడానికి. యేసు మృతులలో నుండి లేచి పరలోకానికి ఆరోహనుడయ్యాడు. ఆయనను నమ్మినప్పుడు, పాపము నుండి రక్షిస్తాడు. నిలబడి పాడండి, "రండి, పాపులారా." 10వ సంఖ్య పాట.

రండి, పాపులారా, దౌర్భాగ్యులారా, బలహీన గాయపడిన వారలారా, రోగులారా;
   యేసు రక్షింప సిద్ధంగా ఉన్నాడు, దయతో, ప్రేమతో శక్తితో:
ఆయన సమర్ధుడు, ఆయన సమర్ధుడు, ఆయన ఇష్టపడుతున్నాడు, సందేహ పడవద్దు;
   ఆయన సమర్ధుడు, ఆయన సమర్ధుడు, ఆయన ఇష్టపడుతున్నాడు, సందేహ పడవద్దు.

రండి, అలసి, భారంగా ఉన్న వారలారా, నలిగినా విరిగిన వారలారా;
   మంచిగా అయ్యే వరకు వేచియుంటే, మీరు రానే రారు:
నీతిమంతులు కాదు, నీతిమంతులు కాదు, పాపులను యేసు పిలుచుచున్నాడు;
   నీతిమంతులు కాదు, నీతిమంతులు కాదు, పాపులను యేసు పిలుచుచున్నాడు.

రక్షకుని చూడండి, ఆరోహణమయ్యాడు, ఆయన రక్తము కొరకు ప్రాదేయపడండి;
   పూర్తిగా ఆయనపై ఆనుకోండి, వేరే నమ్మకము రానీయకండి;
యేసు మాత్రమే, యేసు మాత్రమే, నిస్సహాయ పాపులను మంచిగా మార్చగలడు;
   యేసు మాత్రమే, యేసు మాత్రమే, నిస్సహాయ పాపులను మంచిగా మార్చగలడు.
("రండి, పాపులారా" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768; కాపరిచే మార్చబడినది).
   (“Come, Ye Sinners” by Joseph Hart, 1712-1768; altered by the Pastor).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"రండి, పాపులారా" (జోసెఫ్ హార్ట్ చే, 1712-1768).
“Come, Ye Sinners” (by Joseph Hart, 1712-1768).ద అవుట్ లైన్ ఆఫ్

మంచి వ్యక్తి నశించిపోయాడు చెడ్డ వ్యక్తి రక్షింపబడ్డాడు!

A GOOD MAN LOST AND A BAD MAN SAVED!

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీ కరించు కొందరితో, ఆయన ఈ ఉపమానము చెప్పెను: ప్రార్ధన చేయుటకై ఇద్దరు మనష్యులు దేవాలయమునకు వెళ్ళిరి; వారిలో ఒకడు పరిశయ్యడు, ఒకడు సుంకరి. పరిశయ్యడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్థులను, వ్యభిచారులునైన, ఇతర మనష్యుల వలెనైనను, ఈ సుంకరి వలనైనను, ఉండనందున నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు చున్నాను. వారమునకు, రెండు మూడులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటితో పదవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్ధించు చుండెను. అయితే సుంకరి, దూరంగా నిలచుండి, ఆకాశము వైపు కన్ను లేత్తుటకైనను, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన, నన్ను కరుణించుమనెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను: తన్ను తానూ హెచ్చించు కొనువాడు తగ్గింప బడుననియు; తన్ను తానూ తగ్గించు కొనువాడు హెచ్చింప బడుననియు చెప్పెను" (లూకా 18:9-14).

I. మొదటిది, "మంచి" వ్యక్తి నశించిపోయాడు, లూకా 18:11-12; యెషయా 57:21; ఇర్మియా 17:9; యెషయా 33:14; మత్తయి 7:23.

II. రెండవది, చెడ్డ వ్యక్తి రక్షింపబడ్డాడు, లూకా 18:13; కీర్తనలు 51:3; రోమా 7:24.