Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు
లోకమునకు వెలుగై ఉన్నారు!

YOU ARE THE SALT OF THE EARTH
AND THE LIGHT OF THE WORLD!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, ఫిబ్రవరి 26, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, February 26, 2017

"మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు: ఉప్పు నిస్సారమైతే, అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనష్యుల చేత తొక్కబడుటకె, గాని మరి దేనికిని, పనికి రాదు. మీరు లోకమునకు వెలుగై యున్నారు. కొండమీద నుండు పట్టణము మరుగై యుండనేరదు. మనష్యులు దీపము వెలిగించి, కుంచము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండు వారికందరికి వెలుగు ఇచ్చుటకై; దీప స్థంభము మీదనే పెట్టుదురు. మనష్యులు మీ సత్ర్కియలను చూచి, పరలోక మందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు, వారి యెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" (మత్తయి 5:13-16).


యేసు గలిలియ సముద్ర తీరాన్న నడుస్తున్నాడు. ఆయన పేతురును అతని సహోదరుడు ఆంద్రేయను చూసాడు. వారు జాలరులు కనుక, సముద్రంలో వల వేస్తున్నారు. యేసు వారితో చెప్పాడు, "నన్ను వెంబడించుడి, నేను మిమ్ములను మనష్యులను పట్టు జాలరులుగా చేయుదును." వెంటనే వారు తమ వలలు విడిచి పెట్టి ఆయనను వెంబడించిరి. కొంచెము ముందుకు వెళ్లి యేసు ఇద్దరు సహోదరులు, యాకోబును యోహానును చూసాడు. వారు తమ వలలను బాగు చేసుకుంటున్నారు. ఆయన వారిని పిలువగా వారు తమ ఓడను విడిచి ఆయనను వెంబడించారు. యేసు చేసేది వారిని ఉత్సాహ భరితులను చేసింది. యేసు భోధించుచు ప్రజలలో సమస్త రోగములను బాగు చేయుచుండెను. పెద్ద గుంపులు యేసును వెంబడించాయి. ఆయన గొప్ప సమూహమును చూచి, కొండపైకి వెళ్ళాడు. ఆయన కూర్చున్నప్పుడు తన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. యేసు తన శిష్యులకు బోధింప ఆరంభించాడు. ఆయన ధన్యతలను వారికిచ్చాడు. వారు నిజ క్రైస్తవుని అంతర్గత లక్షణాలు వివరించి భవిష్యత్తులో ఆయన దీవెనలు కోరారు. అప్పుడు ఆయన తన శిష్యులతో వారు లోకమునకు ఉప్పు వెలుగై యున్నారని చెప్పాడు. యేసు చెప్పినది ప్రతి నిజ క్రైస్తవుని విషయంలో సత్యము.

"మీరు లోకములో ఉప్పయి ఉన్నారు: ఉప్పు నిస్సారమైతే అది దేనివలన, సారము పొందును? అది బయట పారవేయబడి మనష్యుల చేత తొక్క బడుటకై, గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై యున్నారు. కొండమీద నుండు పట్టణము మరుగై యుండనేరదు. మనష్యులు దీపము వెలిగించి, కుంచము క్రింద పెట్టరు, కాని అది ఇంటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై; దీప స్థంభము మీదనే పెట్టుదురు. మనష్యులు మీ సత్ర్కియలను చూచి, పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు, వారి యెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" (మత్తయి 5:13-16).

I. మొదటిది, మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు.

యేసు చెప్పాడు, "మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు." ఆ రోజులలో ఉప్పు ఉపయోగము భద్ర పరచడం. వారు ఉప్పును మాంసముపై ఉంచితే నెలల తరబడి పాడవకుండా ఉంటుంది. ఉప్పు పాడవకుండా ఉంచుతుంది. ఆదాము పాపము చేసినప్పుడు మరణము పాడవడం లోకములోనికి తెచ్చాడు. మొదటి పాపి ఆదాము నుండి, మానవాళి అంతా మరణమును సంక్రమించుకుంది. క్రీస్తు తప్ప ఆ మరణాన్ని ఏదీ ఆపలేదు. ఆయన శిష్యులతో చెప్పాడు వారు ఉప్పుగా ఉండాలని, ప్రజలను పతనము మరణము నుండి భద్ర పరచడానికి. అపోస్తలుడైన యాకోబు అన్నాడు, "పాపిని తన తప్ప మార్గము నుండి మళ్ళించు వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును..." (యాకోబు 5:20).

మీ సువార్త పని ప్రార్ధన నిరుపయోగమనిపించవచ్చు. కాని అలా సాతాను మీతో మాట్లాడుతుంది. సువార్త పనిమీద బయటికి వెళ్లి పాపులను క్రీస్తు నొద్దకు తెచ్చువాడు లోకములో అతి ప్రాముఖ్య వ్యక్తి. మీరు లోకమునకు ఉప్పై యున్నారు! భూమిపై మీరు చాలా ప్రాముఖ్యమైన పని చేస్తున్నారు! మీరు ప్రముఖులని తలంచకపోతే, ఒక యవనస్థుడు చెప్పింది వినండి, "నేను గుడికి ద్వేశాముతో తోచక వచ్చాను... నేను దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. చాలామంది నా స్నేహితులు కుటుంబము నన్ను దిగ జార్చింది. నా చుట్టూ ప్రపంచం అస్తవ్యస్త మనిపించింది. బ్రతకడానికి కారణము కనబడలేదు. ఏమి చెయ్యడానికి ఏమి కారణము లేదు ఎందుకంటే చాలా అవినీతి పతనము ఉంది. నేను పుట్టకపోతే బాగుండు అనిపించింది, ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. నేను తికమకలో ఉండి దేవుని నమ్మలేదు."

సువార్త వినడానికి ఆ యవనస్తుని గుడిలో ఒకరు తీసుకొని వచ్చారు. అతని తేవడానికి వెళ్ళకపోతే, అతడు క్రీస్తును ఎరిగి ఉండేవాడు కాదు. మీలో ఎవరు తెచ్చారో నాకు తెలియదు. వివరాలు తెలియదు. కాని మీలో ఒకరు తెచ్చారు. మీలో మిగిలిన వారు మన గుడిలో తనకు ఊరట కలిగించారు. ఆ యవనస్తుని జీవితమూ రక్షించడానికి దేవుడు మిమ్మును ఉపయోగించుకున్నాడు. అతని ఆత్మను నరకము నుండి నిస్సహాయత నుండి రక్షించడానికి, దేవుడు మిమ్మును వాడుకున్నాడు. అందుకే యేసు చెప్పాడు, "మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు"! మీరు లేకుండా అతడు రక్షింపబడి ఉండేవాడు కాదు.

కాని ఈనాడు సంఘాలు అతనికి సహాయపడలేక పోతున్నాయి. మన సంఘాలు చల్లదనము స్వధర్మతతో నిండుకున్నాయి! డాక్టర్ కార్ల్ ఎఫ్. హెచ్. హెన్రీ (1913-2003). ప్రముఖ వేదాంతి. అతడు వ్రాసిన ఆఖరి పుస్తకము గొప్ప నాగరికత చిత్రం: విగ్రహారాధన పట్ల మక్కువ. అతనన్నాడు ఈనాటి మన సంఘములో ఏదో తప్పు జరుగుతుంది. అతనన్నాడు, "సమగ్ర క్రైస్తవ్యముపై అపోహ భాధాకరం; దానిని సంఘ హాజరు తగ్గడంలో గమనించవచ్చు... క్రూరులు చక్కని నాగరికతను పాడు చేస్తున్నారు ఇప్పటికే అవిటి సంఘ నీడలో [దాగుకుంటున్నారు]" (పేజి 17). అతడు సరియే. ఇతర సంఘాల విషయము నాకు తెలియదు కాని లాస్ ఏంజిలాస్ లోని మన సంఘము ఆవరణలు పట్టణ భవన సముదాయాలలోని నశించు యువకులను కలుసుకుంటుంది. దక్షిణ బాప్టిస్టులు ఇప్పుడు ప్రతి యేటా రెండున్నర లక్షల మందిని కోల్పోతున్నారు. ఇతర తేగల వారు కూడ అంతే. మొదట ప్రార్ధన కూటాలు మూసేస్తారు. తరువాత ఆదివారం సాయంకాలం ఆరాధన మూసేస్తారు. ఆదివారం ఉదయం ఆరాధనలు కూడ కుంటుపడుతున్నాయి. యేసు చెప్పాడు, "ఉప్పు సారమును కోల్పోయిన యెడల దేని వలన దానికి [సారము] కలుగును? మనష్యుల చేత తొక్క బడుటకు తప్ప దేనికి పనికిరాదు" (మత్తయి 5:13 కేజేవి, ఎన్ఏఎస్ వి). డాక్టర్ హెన్రీ చెప్పినట్టు సంఘాలు "కుంటుపడుతున్నాయి." అవి యవనులను మార్చలేక పోతున్నాయి. అది ఎందుకు నిజం? ఎందుకంటే ఉప్పుసారాన్ని కోల్పోయింది! వచనము వెంబడి వచన బోధ మృత సంఘాన్ని బాగు చెయ్యలేదు! సుతి మెత్తని బోధ జీవితాన్ని ఉత్పత్తి చెయ్యలేదు. కేవలం బలమైన సువార్త బోధ మాత్రమే అది చెయ్యగలదు. మనకు "సారవంతమైన" బోధ, పాపము నరకముపై బోధ, క్రీస్తు రక్తముపై బోధ, ఆత్మల రక్షణపై బోధ కావాలి. ఆత్మల సంపాదన మాత్రమే గుడిలో "సారమును" ఉంచుతుంది. బలమైన ప్రార్దన కూటాలు మాత్రమే గుడిలో "సారమును" ఉంచుతాయి. డాక్టర్ జాన్ ఆర్. రైస్ సరిగ్గా చెప్పాడు, "కేవలము పూర్తి ప్రయత్నము నూతన నిబంధన ఆత్మల సంపాదనకు సరితూగుతుంది" (ఎందుకు మన సంఘాలు ఆత్మలు సంపాదించలేవు, పేజి 149).

మన సంఘము చనిపోకుండా ఉండాలంటే మనము పనిచేసి ప్రార్ధిస్తూ ఉండాలి, నశించు యవనస్తులను సువార్త వినడానికి తేవడానికి సాయ శక్తులా పనిచెయ్యాలి! యేసు అన్నాడు, "మీరు వీదులలోనికి రాజ మార్గములోనికి వెళ్లి, నా గృహము నిండునట్లు, బలవంతపెట్టి తెండి" (లూకా 14:23). ఆత్మల సంపాదన మన జీవితాలలో మొదటిదిగా చేసుకోవాలి లేనిచో మన సంఘము జీవితాన్ని పరిరక్షించే "ఉప్పును" కోల్పోతుంది. అది చెయ్యలేకపోతే, మన సంఘము "ఎందుకు పనికిరాదు, త్రోయబడి, మనష్యులతో తోక్కబడుతుంది" (మత్తయి 5:13). మన సంఘాన్ని చనిపోనివ్వవద్దు! యేసును గూర్చి విని ఆయనచే రక్షింపబడునట్లు మీరు వెళ్లి పాపులను తీసుకొని రండి!

II. రెండవది, మీరు లోకమునకు వెలుగై యున్నారు.

యేసు అన్నాడు, "మీరు లోకమునకు వెలుగై యున్నారు. ఎత్తులో ఉన్న పట్టణము మరుగై యుండనేరదు" (మత్తయి 5:14). డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఆ ప్రకటన ప్రభావము ఇది: ‘మీరు, మీరు మాత్రమే, లోకమునకు వెలుగై యున్నారు,’ – ‘మీరు’ ప్రాముఖ్యము ఆ సలహా వర్తిస్తుంది... కొన్ని గోప్య విషయాలు ఉన్నాయి. మొదటిది లోకము చీకటిలో ఉంది" (కొండపై ప్రసంగము, పేజి 139). ఈ రాత్రి లోకము భయంకర అంధకారములో ఉంది. యేసు చెప్తున్నారు నిజ క్రైస్తవులు మాత్రమే అంధకారము నుండి ఎలా తప్పించుకోవాలో చెప్తారు. ఈ లోకములో వెలుగు లేనేలేదు. నిజ వెలుగు నిజ క్రైస్తవుల నుండి మనలాంటి సంఘము నుండి వస్తుంది. యేసు తన శిష్యుల చిన్న మందను చూసాడు. వారితో ఆయన అన్నాడు, "మీరు, మీరు మాత్రమే, లోకమునకు వెలుగు." దానికి ఇవి కొన్ని ఉదాహరణలు.

మీరు తెచ్చిన యవనస్తుడు అన్నాడు, "బ్రతకడానికి కారణము లేదు...పుట్టకుండా ఉంటే బాగుండేది అనిపించింది, ఆత్మహత్య గురించి ఆలోచించాను...డాక్టర్ హైమర్స్ నన్ను అడిగారు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని. నేను వెంటనే చెప్పాను ‘అవును’ అని. డాక్టర్ హైమర్స్ మళ్ళీ అడిగారు...నేను ‘కాదు’ అన్నాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి...తరువాత డాక్టర్ హైమర్స్ యేసును నమ్ముతావా అని అడిగారు, కాని చెయ్యలేకపోయాను, పాపాన్ని విడిచి పెట్టడానికి భయపడ్డాను. తరువాత వారము నా పాపాన్ని తీవ్రంగా చూసాను. నేను స్నానము గది మూసుకొని, నా పాపాన్ని గూర్చి ఆలోచిస్తూ ఏడ్చాను. బడిలో పని స్థలములో నా పాపము నన్ను వదలలేదు. ఆదివారము వచ్చి క్రీస్తు కొరకు సమస్తం వదిలేద్దామనుకున్నాను. డాక్టర్ హైమర్స్ కలిసి యేసును విశ్వసించాను. విశ్వాసముతో యేసును నమ్మాను. ఆరోజు చాలా సంతోషించి రాత్రి నిద్రపో గలిగాను. తిరుగుబాటు ఉన్నా సిలువ వేయబడిన ప్రేమించే రక్షకుడు నాపై కృప చూపించాడు, అది మర్చిపోలేదు."

ఇప్పుడు పవిత్రంగా జీవించే యవన చైనీయ అమ్మాయి మాటలు వినండి. ఆమె చెప్పింది, "నేను గుడిలోనికి నడిచి వచ్చాను నా హృదయము చాలా భారంగా ఉంది. నేను పాపినని దేవుడు మేల్కొలిపాడు. నా చుట్టూ అందరు సంతోషంగా ఉన్నారు, కాని నేను నా నేర మనస్సాక్షిని అణచు కోలేకపోయాను. నా హృదయము హీనంగా, భయంకరంగా, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుందనే విషయాన్ని కాదన లేకపోయాను. నేను మంచి వ్యక్తిని అని నా హృదయము మోసపర్చుకోలేక పోయింది. నేను మంచిగా లేను నాలో మంచితనము లేదు. నేను ప్రసంగము వింటుండగా, కాపరి నాతో నీరుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. నా మరణము గూర్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు నాలో గొప్ప అసౌకర్యము చోటు చేసుకుంది. నేరుగా నరకానికి వెళ్తున్నట్టు అనిపించింది. నేను నరక పాత్రురాలను. నేను పాపిని. ప్రజల నుండి నా పాపాలు దాచిపెట్టినా, దేవుని నుండి దాచలేను. దేవుడు వాటన్నిటిని చూసాడు...నిరాశ్రయత గమనించాను. తరువాత, ప్రసంగము ముగుస్తుండగా, సువార్త మొదటిసారిగా విన్నాను. నా పాపాల నిమిత్తము, క్రీస్తు సిలువపై నా స్థానంలో మరణించాడు. నేరపాపినైన నా కొరకు ఆయన ప్రేమ, సిలువపై మరణించే అంత గొప్పది. పాపుల కొరకు ఆయన రక్తము కార్చాడు. నా కొరకు ఆయన రక్తము కార్చాడు! నాకు యేసు కావాలి! నాలో మంచితనము చూసే బదులు, యేసు వైపు తొలిసారి చూసాడు. ఆ క్షణంలో యేసు నన్ను రక్షించి, ఆయన రక్తముతో నా పాపము కడిగాడు. నేను యేసును విశ్వసించాను ఆయన నన్ను రక్షించాడు. నా మంచి తనమంతా నాలాంటి ఘోర పాపిని రక్షింప లేదు, క్రీస్తు మాత్రమే రక్షింపగలడు! నన్ను పాపానికి బందీ చేసిన గొలుసులను క్రీస్తు విరుగ గొట్టాడు. క్రీస్తు ఆయన రక్తములో నన్ను చుట్టాడు. ఆయన నీతితో కప్పాడు. క్రీస్తులోనే నా విశ్వాసము నిశ్చయత. నేను పాపిని, కాని యేసు క్రీస్తు నన్ను రక్షించాడు!"

ఇప్పుడు ఇంకొక యవ్వన స్త్రీ ఉంది. లోకము దృష్టిలో "మంచి" అమ్మాయి. జీవితమంతా గుడికి వచ్చింది కాని నశించి పోయింది. కాని తన హృదయంలో దేవునితో కోపంగా ఉంది. ఆమె చెప్పేది వినండి. "ఆరాధన కొనసాగుతుండగా నేను ఎక్కువ కలవరము చెందాను. ఇతరులు కరచాలనము చేస్తున్నప్పుడు నేను నవ్వలేకపోయాను. ఓటమి భావన పాప భూ ఇష్టత తిరుగుబాటు నాలో పెరిగాయి. జాన్ కాగన్ బోధించాడు 'దేవుడు సరి, నీది తప్పు.' ప్రతి అంశము చొచ్చి పాప తీవ్రతను చూపించింది. జాన్ బోధిస్తుండగా, దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు గ్రహించాను. జాన్ ప్రసంగము ముగించే సరికి నేను నిరుత్సాహంలో ఉన్నాను. తరువాత డాక్టర్ హైమర్స్ వేదిక మీదికి వచ్చి యేసు వ్యభిచార మందు పట్టుబడిన స్త్రీని క్షమించుటను గూర్చి చెప్పాడు. ఆ కథ మునుపు విన్నప్పటికీ, అంతగా నన్ను తాకలేదు. యేసు ప్రేమ ప్రేరేపించింది. యేసు నొద్దకు రావాలనే బలమైన కోరిక నాలో కలిగింది. డాక్టర్ హైమర్స్ తనతో మాట్లాడమని పిలిచారు. నా మనసు భయంతో నిండుకుంది. డాక్టర్ హైమర్స్ నన్ను చూపించి ఆయనను నమ్ముతావా, అది అడిగితే, నేను 'ఔను' అన్నాను. అలాగే యేసును నమ్మాలని చెప్పారు. 'యేసును నమ్మాలి' అనే మాటను ద్వేషించే వాడను. 'దాని అర్ధం ఏమిటి'? అనుకునే వాడను. 'నేనెలా చెయ్యాలి?' కాని డాక్టర్ హైమర్స్ వివరించినప్పుడు, ఆయనను నమ్మడం అర్ధమైంది, నాకు తెలిసింది. ఆ క్షణంలో నాకు తెలిసింది యేసు నన్ను ప్రేమిస్తున్నాడని. నేనుమోకరించి, యేసు నన్ను ప్రేమిస్తున్నాడని ఎరిగాను. ఆయన నా పాపము క్షమిస్తాడు. నాకు అది కావాలనిపించింది. డాక్టర్ హైమర్స్ నా తలపై చేతులుంచి ఏడ్చి ప్రార్ధించారు. ఆయనను విశ్వశించాలని యేసు చెప్తున్నాడని చెప్పారు. చిన్న విశ్వాసము చాలు. అదే యేసు కోరుకునేది. తరువాత, కొన్ని క్షణాలలో, యేసును విశ్వసించాను. అది ఆయన నన్ను రక్షిస్తాడని నమ్మలేదు. యేసునే నమ్మాను – డాక్టర్ హైమర్స్ పాస్టర్ ను, నమ్మినట్టు. మునుపు యేసును నమ్మే మార్గము గూర్చి, ఆలోచించే వాడను. భావన లేకుండా, నమ్మ ఇష్టపడేవాడను కాదు. తరువాత, విఫలుడనైతే, మనస్తాపముతో స్వజాలితో ఏడ్చేవాడని. తప్పుడు మార్పును గూర్చి కూడ భయపడే వాడిని. పిచ్చివడనవుతానని భయము ఉండేది. అయిననూ, జాగ్రత్తగా ఆలోచించి, లోకము నాకు ఏమి ఇవ్వలేదని గ్రహించాను. ప్రేమ గాని. ఉద్దేశము కాని. నిరీక్షణ కూడ. యేసును విశ్వసించాను. ఆయనే నా నిరీక్షణ. ఆయనను నమ్మమనే కోరుకున్నాడు అని గ్రహించాను. ఆయనను మాత్రమే నమ్మమని కోరాడు, అంతా చేసాడు. నా సాక్ష్యము చాలా చిన్నది. నేను యేసును నమ్మాను. ఆయన నన్ను రక్షించాడు."

అది క్రీస్తు కొరకు ఆత్మల సంపాదనకు చాలామందికి ఉపయోగపడింది. ఒకరు ఫోను చేసారు. డాక్టర్ చాన్ కారు ఏర్పాటు చేసారు. సంఘము బయటను గూర్చి ఏరోన్ యాన్సీ మాటలివి, లోకములో...లోకము వెలితి చల్లదనం ఇస్తుంది. వారి దగ్గర ప్రసంగ ప్రతులు ఉన్నాయి, డాక్టర్ కాగన్ టైపు చేసినవి, ఓలివేక్ తయారు చేసిన, ప్రసంగ విడియోలు వారి దగ్గర ఉన్నాయి. జాన్ కాగన్ సలహా ఉంది. మీరిచ్చిన స్నేహముంది. చివరగా నా ప్రసంగాలు, జాన్ కాగన్ ప్రసంగాలు, నోవాసాంగ్ ప్రసంగాలు ఉన్నాయి. లోపలి పోరాటంతో, నేను వారినడిగాను, "మీరు యేసును విశ్వసిస్తారా?" వారు యేసును విశ్వసించారు. అది సామాన్యము. మన గుడిలో చాలామంది వారిని దేవుని దగ్గరకు నడిపించారు. మనమందరము "వెలుగు" అంధకార లోకములో వారు యేసును కనుగొనడానికి. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "మీరు, మీరే మాత్రమే, లోకమునకు వెలుగు." పాత పాట చెప్పినట్టు,

లోకమంతా పాపపు అంధకారములో నశించిపోయింది;
   లోకమునకు వెలుగు యేసు;
మధ్యాహ్న ప్రకాశము వలే ఆయన మహిమ ప్రకాశిస్తుంది,
   లోకమునకు వెలుగు యేసు.
వెలుగు నొద్దకు రండి, 'అది మీ కొరకు ప్రకాశిస్తుంది;
   మధురంగా ఆ వెలుగు నన్ను ఆవరిస్తుంది;
ఒకప్పుడు గుడ్డివాడను, ఇప్పుడు నేను చూస్తున్నాను;
   లోకమునకు వెలుగు యేసు.
("లోకమునకు వెలుగు యేసు" ఫిలిప్ పి. బ్లిస్ గారిచే, 1838-1876).
       (“The Light of the World is Jesus” by Philip P. Bliss, 1838-1876).

ప్రియ సహోదరీ సహోదరులారా, మీకు నాకు అంధకార లోకానికి యేసు వెలుగు ప్రతిబింబించే గొప్ప ఆధిక్యత ఉంది. క్రీస్తు వెలుగు మనకు ఇచ్చాడు. మన ఉజ్జీవపు మాట దానిని తేటగా వివరిస్తుంది,

నా దృష్టి అంతటిని నింపు, దైవిక రక్షకా,
   నీ మహిమతో నా ఆత్మ ప్రకాశించునట్లు.
నా దృష్టి అంతటిని నింపు, నేను అంతా చూచునట్లుగా
   నీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింబించునట్లు.
("నా దృష్టి అంతటినీ నింపు" ఆవిస్ బర్బిసేన్ క్రిస్టియాన్ సేన్ చే, 1895-1985). (“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

ప్రియ సహోదరీ సహోదరులారా, క్రైస్తవులుగా చేయగానికి మనకు గొప్ప ఉంది. మనము లోకమునకు ఉప్పు. మనము, మనము మాత్రమే, లోకానికి వెలుగు! అంధకార భయపడే లోకానికి క్రీస్తు వెలుగును చూపిద్దాం! ఆత్మల సంపాదన ఆపవద్దు. ఆత్మల సంపాదనలో ఎన్నడు, ఎప్పుడు, నిరుత్సాహ పడవద్దు. యేసు మీతో ఉన్నారు. ఆయన కష్టాలలో ప్రతికూలతలో మీకు సహాయము చేస్తాడు.

ఇప్పుడు, నశించే మీకు నా ఆధిక్యత మీకు చెప్పడానికి యేసు మిమ్మును రక్షిస్తాడని. ఎక్కువ చేసేదేమి లేదు యేసు క్రీస్తును నమ్మడం తప్ప, ఆయన నీ స్థానంలో సిలువపై మరణించాడు, ఆయన మీ పాపలన్నిటిని ఆయన ప్రశస్త రక్తములో కడిగాడు. దాని అంతటిని ఒక పాటలో చెప్పవచ్చు,

ఆయననే నమ్ము, ఆయననే నమ్ము,
   ఆయననే ఇప్పుడు నమ్ము.
ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు,
   ఇప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు.
("ఆయననే నమ్ము" జాన్ హెచ్. స్టాక్ టన్ చే, 1813-1877).
(“Only Trust Him” by John H. Stockton, 1813-1877).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"రక్తము ద్వారా రక్షింపబడ్డారు" (ఎస్. జే. హేండర్ సేన్ చే, 19 వ శతాబ్దము).
“Saved by the Blood” (by S. J. Henderson, 19th century).ద అవుట్ లైన్ ఆఫ్

మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు
లోకమునకు వెలుగై ఉన్నారు!

YOU ARE THE SALT OF THE EARTH
AND THE LIGHT OF THE WORLD!

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు: ఉప్పు నిస్సారమైతే, అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనష్యుల చేత తొక్కబడుటకె, గాని మరి దేనికిని, పనికి రాదు. మీరు లోకమునకు వెలుగై యున్నారు. కొండమీద నుండు పట్టణము మరుగై యుండనేరదు. మనష్యులు దీపము వెలిగించి, కుంచము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండు వారికందరికి వెలుగు ఇచ్చుటకై; దీప స్థంభము మీదనే పెట్టుదురు. మనష్యులు మీ సత్ర్కియలను చూచి, పరలోక మందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు, వారి యెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" (మత్తయి 5:13-16).

I.    మొదటిది, మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు, యాకోబు 5:20;
మత్తయి 5:13; లూకా 14:23.

II.   రెండవది, మీరు లోకమునకు వెలుగై యున్నారు, మత్తయి 5:14.