Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
"కృప యొక్క పద్దతి" జార్జి వైట్ ఫీల్డ్ చే,
ఆధునిక ఆంగ్లమునకు కుదింపబడి మార్చబడినది

“THE METHOD OF GRACE” BY GEORGE WHITEFIELD,
CONDENSED AND ADAPTED TO MODERN ENGLISH
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

జాన్ సామ్యూల్ కాగన్ గారిచే బోధింపబడిన ప్రసంగము
బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
శనివారము సాయంకాలము, జనవరి 8, 2017
A sermon preached by Mr. John Samuel Cagan
at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, January 8, 2017

"సమాధానము లేని, సమయమున, సమాధానము, సమాధానమని చెప్పుచు; నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు" (యిర్మియా 6:14).


ఉపోద్ఘాతము: జార్జి వైట్ ఫీల్డ్ 1714 లో ఇంగ్లాండ్ లోని, గ్లౌసెస్టర్ నందు జన్మించారు. అతడు టవేర్న్ ఓనర్ కుమారుడు. ఈ పరిస్థితిలో చిన్న బిడ్డగా కొంత క్రైస్తవ ప్రభావము అతనిపై ఉంది, కాని పాఠశాలలో అతనికి అసాధారణ సమర్ధత ఉండేది. అతడు ఆక్స్ ఫర్డ్ విశ్వవిధ్యాలయమునకు హాజరై అక్కడ జాన్ మరియు చార్లెస్ వేస్లీలకు స్నేహితుడై వారి ప్రార్ధన మరియు బైబిలు పఠన గుంపులో భాగమయ్యాడు.

ఆక్స్ ఫర్డ్ లో విద్యార్ధిగా ఉన్నప్పుడు అతడు మార్పును అనుభవించాడు. తరువాత కొంతకాలానికి ఇంగ్లాండ్ సంఘములో అభిషేకింపబడ్డాడు. నూతన జన్మ అత్యవసరతపై అతడు చేసిన బోధలు సంఘములు అతనికి ద్వారములు మూసేలా చేసాయి, ఎందుకంటే నూతన జన్మ అవసరతపై అతడు చేసిన బోధలు వారిపై అధికారులకు కోపము రాపిస్తాయని లోకరిత్యా ఉండే కాపరులు భయపడ్డారు. అలా, ఆయన సంఘాల నుండి బలవంతంగా బయటకు నెట్టబడ్డాడు, బహిరంగ ప్రదేశాలలో బోధించాడు, అందులో ఆయన ప్రసిద్ధిగాంచాడు.

వైట్ ఫీల్డ్ 1738 లో అమెరికాకు ప్రయాణంమై ఒక అనాధ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తరువాత అతడు అమెరికా వీధులన్నింటిలోను గ్రేట్ బ్రిటన్ లోను ప్రయాణించి బోధిస్తూ అనాధలకు సహాయ పడడానికి నిధులను సేకరించాడు. అతడు స్పెయిన్, హాలెండ్, జర్మనీ, ప్రాన్స్, ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ లలో బోధించి, అమెరికాలో బోధించడానికి అట్లాంటిక్ అంతా పదమూడు సార్లు చుట్టూ ముట్టాడు.

అతడు బెంజమిన్ ప్రాంక్లిన్, జోనాతాన్ ఎడ్వర్డ్స్ మరియు జాన్ వెస్లీలతో సన్నిహిత స్నేహితునిగా ఉండి, అతడు చేసినట్టు, వేస్లీని మైదానాలలో బోధించమని ప్రోత్సహించాడు. బెంజమిన్ ప్రాంక్లిన్ ఒకసారి లెక్క కట్టాడు వైట్ ఫీల్డ్ ముప్పై వేల మందికి ఒకసారి బోధించాడని. అతని బహిరంగ కూటములు తరుచు 25,000 మందిని మించి జరిగేవి. అతడు ఒకసారి స్కాట్లాండ్ లోని, గ్లాస్గో దగ్గర 100,000 మందికి పైగా ఉన్న కూటములలో బోధించాడు – మైకులు లేని ఆ రోజులలో! ఆ కూటములో పదివేల మంది మార్చబడ్డారు.

అతడు చాలామంది చరిత్రకారులచే అతి పెద్ద ఆంగ్లములో బోధించే సువర్తకునిగా ఎంచబడ్డాడు. బిల్లి గ్రేహం విద్యుత్తు మైకులతో వేలాది మందితో మాట్లాడినప్పటికినీ, వైట్ ఫీల్డ్ సంస్కృతిపై ఆయన వేసిన ముద్ర చాలా గొప్పది ప్రశ్నింప లేనిది.

18 వ శతాబ్దపు మద్యలో మొదటి గొప్ప మేల్కొలుపులో, అమెరికా గుణశీలతనే మార్చేసిన తీవ్రమైన ఉజ్జీవములలో వైట్ ఫీల్డ్ ప్రముఖమైన వ్యక్తి. అతడు బోధించినప్పుడు మన దేశములోని ప్రాంతములు ఉజ్జీవముతో మండింపబడ్డాయి. 1740 లో న్యూ ఇంగ్లాండ్ లో వైట్ ఫీల్డ్ ఆరువారాల ప్రయాణంలో ఉజ్జీవము ఉన్నత స్థితికి చేరుకుంది. కేవలము నలభై ఐదు రోజులలో అతడు వేలాది మందికి నూట డభై ఐదు ప్రసంగాలు బోధించాడు, తద్వారా ఆత్మీయ కలవరము ఆ ప్రాంతమంతా కలిగింది, అమెరికా క్రైస్తవత్వములో అది ఎన్నదగిన కాలముగా నిలిచింది.

ఆయన మరణ సమయానికి అతడు మంచి ప్రశంశ పొంది ఆంగ్ల భాష మాట్లాడే ప్రపంచపు దృష్టిని తనపై తిప్పుకున్నాడు. ప్రిన్సిటన్ విశ్వ విద్యాలయము, డార్ట్ మౌత్ కళాశాల, పెన్సిల్వేనియా విశ్వ విద్యాలయము స్థాపనలో అతడు కారకుడుగా ఉన్నాడు. అమెరికా విప్లవమునకు ఆరు సంవత్సరములకు ముందు 1770 లో ముస్సాచు సెట్స్ లోని, న్యూ బరీ పోర్ట్ లో, అతడు చనిపోవక ముందు బోధించాడు. మన దేశమునకు జార్జి వాషింగ్ టన్ తండ్రి, కాని జార్జి వైట్ ఫీల్డ్ మన దేశమునకు తాత.

వైట్ ఫీల్డ్ ఇచ్చిన ప్రసంగము ఆధునిక ఆంగ్లములో క్రింద ఇవ్వబడినది. ఇది అతని అసలు ప్రసంగము, కాని మనం అర్ధం చేసుకోవడానికి వీలుగా నేను పదాలను మార్చాను.

"సమాధానము లేని, సమయమున, సమాధానము, సమాధానమని చెప్పుచు; నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు" (యిర్మియా 6:14).

ప్రసంగము: మంచి నమ్మకస్తులైన బోధకులను ఒక దేశానికి దేవుడు పంపించడం ఒక గొప్ప ఆశీర్వాదము. కాని ఒక దేశానికి దేవుడు పంపించే గొప్ప శాపము డబ్బు సంపాదనపైన ధ్యాస ఉన్న నశించిన బోధకులను సంఘాలను నడపడానికి అనుమతించడం. అయిన ప్రతి సమయములో సుతిమెత్తని ప్రసంగాలు చేసే అబద్ధపు బోధకులు ఉన్నారు. చాలా మంది ఇలాంటి సేవకులు బైబిలును వక్రీకరించి మార్చి చెప్పి ప్రజలను మోసగించే వారున్నారు.

యిర్మియా దినాలలో కూడ ఇది స్థితి ఉంది. యిర్మియా దేవునికి నమ్మకత్వముతో లోబడి వారికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయన తన నోరు విప్పి ఈ శారీరక బోధకులతో మాట్లాడాడు. మీరు అతని గ్రంథము చదివితే, అబద్ధపు బోధకులకు వ్యతిరేకంగా యిర్మియా మాట్లాడినట్టు ఎవ్వరు ఎన్నడు మాట్లాడలేదు. అతడు చాల తీవ్రంగా వారికి వ్యతిరేకంగా మాట్లాడాడు ఈ అధ్యాయములో మన పాఠ్య భాగము అందులో ఉంది.

"సమాధానము లేని, సమయమున, సమాధానము, సమాధానమని చెప్పుచు; నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు" (యిర్మియా 6:14).

డబ్బు కొరకే వారు బోధిస్తారని యిర్మియా చెప్పాడు. పదమూడవ వచనములో, యిర్మియా అన్నాడు,

"అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు; ప్రవక్త లేమి యాజకులేమి అందరు వంచకులు" (యిర్మియా 6:13).

వారు దురాశ కలిగి అబద్ధముగా బోధిస్తారు.

మన పాఠ్యభాగములో, వారు అబద్ధముగా బోధిస్తున్నారని ఒక మార్గమును యిర్మియా చూపించాడు. నశించు ఆత్మలతో వారు మోసపుచ్చు మార్గములో వెళ్తున్నారని ప్రవక్త చూపించాడు:

"సమాధానము లేని, సమయమున, సమాధానము, సమాధానమని చెప్పుచు; నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు" (యిర్మియా 6:14).

రానున్న యుద్ధాన్ని ప్రజలను హెచ్చరించమని యిర్మీయాకు దేవుడు చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వారి ఇళ్ళు నాశనం చేస్తాడని వారికి చెప్పాలని కోరుకున్నాడు – ఆ యుద్ధం వస్తోంది (యిర్మీయా 6:11-12 చూడండి).

యిర్మీయా ఆశ్చర్యకరమైన సందేశాన్ని ఇచ్చాడు. ఇది చాలామంది భయపడినట్లు మరియు పశ్చాత్తాప పట్టానికి వారిని తీసుకురావాలి. కానీ అబద్ధపు ప్రవక్తలు మరియు యాజకులు ప్రజలను తప్పుడు సౌకర్యం కోసం ఇచ్చారు. యిర్మీయా కేవలం ఒక అడవి మోజు మాత్రమేనని వారు చెప్పారు. ఏ యుద్ధమూ ఉండదని వారు చెప్పారు. వారు సమాధానమిచ్చే ప్రజలకు చెప్పారు, యిర్మీయా చెప్పినప్పుడు ఎలాంటి శాంతి ఉండదని చెప్పారు.

"సమాధానము లేని, సమయమున, సమాధానము, సమాధానమని చెప్పుచు; నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు" (యిర్మియా 6:14).

బాహ్యపు సమాధానమును గూర్చి మన పాఠ్యభాగములోని మాటలు చెప్తున్నాయి. కాని ఆత్మను గూర్చి తరువాత చెప్పబడింది. ఆ మాటలు అబద్ధపు ప్రవక్తలను సూచిస్తున్నాయి వారు ప్రజలతో వారు బాగున్నారని చెప్తారు, వారు తిరిగి జన్మించక పోయినను. మారని ప్రజలు ఇలాంటి బోధను ప్రేమిస్తారు. మానవుని హృదయము దుష్టమైనది మోసకరమైనది. మానవుని హృదయము ఎంత నీచమైనది దేవునికి తెలుసు.

మీలో చాలామంది అంటారు దేవునితో మీకు సమాధనముందని, నిజంగా సమాధానము లేనప్పటికినీ! మీలో చాలామంది క్రైస్తవుల మనుకుంటారు, కాని కాదు. సాతాను మీకు అబద్ధపు సమాధానము ఇచ్చింది. ఈ "సమాధానమును" దేవుడు ఇవ్వలేదు. ఇది మానవ అవగాహనను మించినది కాదు. మీకున్నది అబద్ధపు సమాధానము.

మీకు దేవునితో నిజమైన సమాధానము ఉందో లేదో తెలుసుకొనడం చాలా ప్రాముఖ్యము. ప్రతి ఒక్కరికి సమాధానము కావాలి. సమాధానము గొప్ప ఆశీర్వాదము. కాబట్టి దేవునితో నిజమైన సమాధానము ఎలా కనుగోనాలో నేను మీకు తప్పక చెప్పాలి. మీ రక్తము నుండి నేను విడుదల అవ్వాలి. మొత్తము దేవుని ఉపదేశమును నేను మీకు ప్రకటించాలి. పాఠ్యభాగపు మాటల నుండి, మీకు ఏమి సంభవించాలో చూపించడానికి ప్రయత్నిస్తాను, మీలో ఏమి మారాలో దేవునితో నిజమైన సమాధానము పొందడానికి చెప్తాను.

I. మొదటిది, దేవునితో మీరు సమాధానము కలిగియుండే ముందు, దేవుని ధర్మ శాస్త్రమునకు మీరు వ్యతిరేకంగా చేసిన వాస్తవ పాపాలను మీరు చూడాలి, గ్రహించాలి, దుఃఖ పడాలి, వాటిని బట్టి నిట్టూర్పు విడవాలి.

బైబిలు చెప్తుంది, "పాపము చేయువాడెవడో, వాడే మరణము నొందును" (యేహెజ్కేలు 18:4). దేవుని ధర్మ శాస్త్రములో ఉన్న వాటిని చేయని వాడు శాపగ్రస్తుడు.

మీరు కొన్ని పనులు చెయ్యాలి, అన్ని చెయ్యాలి లేనిచో మీరు శపించ బడనవారు:

"ధర్మ శాస్త్ర గ్రంధమందు వ్రాయబడిన, విదులన్నియు చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి యున్నది" (గలతీయులకు 3:10).

దేవుని ధర్మ శాస్త్రమును గైకోనకపోతే, తలంపులో గాని, మాటలలో గాని, క్రియలో గాని, నిత్య శిక్షకు మిమ్ములను పాత్రులను చేస్తుంది, దేవుని ధర్మ శాస్త్రము ప్రకారము. ఒక చెడు తలంపు, ఒక చెడ్డ మాట, ఒక చెడు కార్యము నిత్య శిక్షకు పాత్రుని చేస్తే, మీరు నరకము నుండి ఎలాగు తప్పించుకుంటారు? మీ హృదయములో నిజ సమాదానము కలిగి ఉండే ముందు, మీరు దేవుని ధర్మ శాస్త్రమునకు వ్యతిరేకంగా పాపము చేయడం ఎంత భయంకరమో చూడాలి.

మీ హృదయమును పరీక్షించుకోండి. నన్నడగ నివ్వండి – ఎప్పుడైనా మీ పాపాలను జ్ఞాపకము చేసుకొనడం మీకు బాధ కలిగించిందా? మీ పాపపు భారము భరించలేనిదిగా మీకు అనిపించిందా? మీరెప్పుడైనా చూసారా దేవుని ఉగ్రత మీపై ఉందని, మీరు ధర్మ శాస్త్రమును అతిక్రమించారు కాబట్టి? మీ పాపములను బట్టి అంతరంగములో విచారించారా? మీరెప్పుడైన చెప్పారా, "నా పాపములు మోయలేనంత బరువుగా ఉన్నాయి అని?" ఇలాంటిది ఎప్పుడైనా అనుభవించారా? లేనిచో, నీవు క్రైస్తవుడవని పిలుచుకోవద్దు! మీరనవచ్చు మీకు సమాధానము ఉందని, కాని మీకు నిజమైన సమాధానము లేదు. దేవుడు మిమ్మును మేల్కొల్పును గాక! దేవుడు మిమ్మును మార్చును గాక!

II. రెండవది, మీరు దేవునితో సమాధానము కలిగియుండే ముందు, ఒప్పుకోలు లోతుగా వెళ్ళాలి; మీ స్వంత పాపపు స్వభావాన్ని బట్టి ఒప్పుకోవాలి, మీ ఆత్మ పూర్తి దుస్థితి.

మీ వాస్తవ పాపాలను బట్టి మీరు ఒప్పింపబడాలి. వాటి విషయంలో మీరు ఒణకాలి. కాని ఒప్పుకోలు ఇంకా లోతుగా వెళ్ళాలి. దేవుని ధర్మ శాస్త్రమును ఉల్లంఘిస్తున్నందుకు మీరు ఒప్పింపబడాలి. దానికంటే ఎక్కువగా, నీ మూల పాపము, నీ హృదయంలో ఉన్నది, నిన్ను నరకానికి పంపించే దానిని నీవు గ్రహించాలి.

తెలివి గలవారమనుకునే చాలా మంది మూలపాపము అనేది లేదు అని అంటారు. వారనుకుంటారు ఆదాము పాపాన్ని సంక్రమించు కున్నారు కనుక నరకానికి దేవుడు పంపడం అన్యాయము అని అంటారు. మేము పాపములో పుట్టలేదని వారంటారు. తిరిగి జన్మించనవసరం లేదంటారు. అయినా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. మానవాళికి దేవుడు వాగ్ధానము చేసిన పరదైసేనా అది? కాదు! లోకములో ఉన్నదంతా క్రమము తప్పింది! ఎందుకంటే మానవ జాతిలోనే ఏదో తప్పు ఉంది. మూలపాపము ప్రపంచాన్ని నాశనము చేసింది.

మీరు ఎంత బలముగా దీనిని కాదనినప్పటికినీ, మీరు మేల్కొనినప్పుడు, మీరు చూస్తారు జీవితములోని పాపము మీ స్వంత దుష్ట హృదయము నుండి వచ్చిందని – ఆ హృదయము మూల పాపముచే విషపూరితమైనది.

మీరు మనస్సు నొందని వ్యక్తి మొదట మేల్కొనినప్పుడు, అతడు ఆశ్చర్య పడతాడు, "ఇంత దుష్టునిగా నేను ఎలా అయిపోయాను?" దేవుని ఆత్మ అప్పుడు అతనికి చూపిస్తుంది తన స్వభావంలో మంచిలేదని. అతడు పూర్తిగా పాప భూఇష్టుడని చూస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి చివరకు చూస్తాడు దేవుడు అతనిని శిక్షింపవచ్చునని. అతడు చూస్తాడు తను తన స్వభావములో విష పూరితుడని తిరుగుబాటు దారుడని దేవుడు తనను శిక్షించడం సరియేనని, తన పూర్తి జీవిత కాలములో ఒక్క బహ్యపు పాపము చేయనప్పటికినీ.

మీరెప్పుడైనా ఇది అనుభవించారా? మీరు ఎప్పుడైనా ఇలా గ్రహించారా – దేవుడు మిమ్మును శిక్షించడం సరి అని న్యాయమని? మీరు ఎప్పుడైనా అంగీకరించారా మీ స్వభావ కారణంగా మీరు ఉగ్రతకు పాత్రులని? (ఎఫెస్సీయులకు 2:3).

మీరు నిజంగా తిరిగి జన్మిస్తే, మీకు అలా అనిపిస్తుంది. మీ మూల పాపపు బరువును మీరు గ్రహించకపోతే, మిమ్ములను క్రైస్తవులని పిలుచుకోవద్దు! నిజంగా మారిన వ్యక్తికి మూల పాపము చాలా భారమైన విషయము. నిజంగా తిరిగి జన్మించిన వాడు తన మూల పాపమును బట్టి విషపూరిత స్వభావమును బట్టి దుఃఖ పడతాడు. నిజంగా మారు మనస్సు పొందిన వ్యక్తి తరుచు మొరపెడతాడు, "ఓ, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును, ఈ పాపపు హృదయము నుండి ఎవరు విడిపిస్తారు?" (రెఫ్. రోమా 7:24). ఇది మేల్కొనిన వ్యక్తిని ఎక్కువగా కలవర పెడుతుంది – అతని అంతరంగిక పాపపు హృదయము. మీ అంతరంగిక పాపపు స్వభావమును గూర్చి మీకు గ్రహింపు లేకపోతే, మీ హృదయములో నిజమైన సమాధానము కనుగొనడానికి అవకాశమే లేదు.

III. మూడవది, మీరు దేవునితో నిజ సమాధానము కలిగి యుండేముందు, మీ జీవితములోని పాపములను బట్టి కలవర పడడము మాత్రమే కాకుండా, మీ స్వభావములోని పాపములను బట్టి, మీ శ్రేష్టమైన నిర్ణయములలోని పాపములను బట్టి, పనులను బట్టి, పిలువబడే "క్రైస్తవ జీవితము" ను బట్టి కూడ కలవర పడాలి.

నా స్నేహితుడా, దేవుని దగ్గరకు చేర్చే మతములో ఏముంది? మీరు మీ స్వభావము వలన నీతిమంతులుగా తీర్చబడలేదు మార్పు నొంద లేదు. మీ బాహ్యపు పాపములను బట్టి పదిరెట్లు నరకములో శిక్షింపబడాలి. మీ మత నమ్మకాలు మీకు ఏ మంచి చేస్తాయి? మీరు మార్పు నొంద కుండా ఏ మంచి పని చెయ్యలేరు.

"కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోష పరచనేరరు" (రోమా 8:8).

మార్పు నొందని వ్యక్తికి దేవుని మహిమ కొరకు ఏదైనా చేయడం అసాధ్యము.

మనము మార్పు నొందిన తరువాత కూడ, మనము కొంత మట్టుకు మాత్రమే పునరుద్ధరింపబడ్డాము. పాపములో జీవించడం మనలో కొనసాగుతూనే ఉంటుంది. ఇంకను మన అందరి విధులలోను అవినీతి మిశ్రమము ఉంది. కనుక, మనము మార్పు నొందిన తరువాత, మన "మంచి" కార్యములను బట్టి యేసు క్రీస్తు మనలను అంగీకరించవలసి వస్తే, మన క్రియలు మనలను శిక్షిస్తాయి. మనము ప్రార్ధించ లేము కూడ పాపము లేకుండా, స్వార్ధము, బద్ధకము, నైతిక అపరిపూర్ణత లేకుండా. మీరు ఏమి అనుకుంటున్నారో నాకు తెలియదు, కాని నేను పాపము చెయ్యకుండా ప్రార్ధించలేను. పాపము చెయ్యకుండా మీకు బోధించలేను. పాపము లేకుండా ఏమి చెయ్యలేను. నా పశ్చాత్తాపమునకు పశ్చాత్తాపము కావాలి, నా విమోచకుడైన యేసు క్రీస్తు ప్రశస్త రక్తములో నా కన్నీళ్లు తుడవబడాలి!

మన శ్రేష్టమైన ప్రతి పాదనలు, మన శ్రేష్టమైన విధులు, మన శ్రేష్టమైన మతము, మన శ్రేష్టమైన నిర్ణయాలు, చాలా పాపములతో నిండినవి. మన మతపర విధులు పాప భూఇష్టమైనవి. మీ హృదయములో సమాధానము కలిగి ఉండేముందు మీరు మీ మూల పాపము మీ బాహ్య పాపములను బట్టి విసిగి పోవడం మాత్రమే కాక, మీ స్వనీతిని బట్టి, విధులు మరియు మత తత్వమును గూర్చి విసిగిపోవాలి. మీ స్వనీతి నుండి బయటకు వచ్చేముందు మీలో లోతైన ఒప్పుకోలు కలగాలి. మీ స్వంత నీతి లేదు అని మీకు ఎన్నడు అనిపించకపోతే, యేసు క్రీస్తుచే మీరు రక్షింపబడలేరు. మీరు ఇంకను మార్పు నొందని వారు మాత్రమే.

ఒకరు అనవచ్చు, "మంచిది, ఇదంతా నేను నమ్ముతాను." కాని "నమ్మడం" నకు "అనిపించడానికి" చాలా తేడా ఉంది. క్రీస్తు లేని స్థితి మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీకు ఎప్పుడైనా అనిపించిందా మీకు మంచి తనము లేదు కాబట్టి మీకు క్రీస్తు అవసరమని? ఇప్పుడు మీరు చెప్పగలరా, "ప్రభువా, నేను చేయగలిగే శ్రేష్టమైన మతక్రియలను బట్టి మమ్ములను శిక్షించవచ్చు." మీ నుండి మీరు ఇలా బయటికి రాకపోతే, దేవునితో నిజ సమాధానము ఉండదు.

IV. నాల్గవది, మీరు దేవునితో సమాధానము కలిగియుండే ముందు, ఒక ప్రత్యేకమైన పాపముంది దానిని బట్టి మీరు ఎక్కువ కలవరము చెందాలి. దానిని గూర్చి కొందరైనా ఆలోచిస్తారో లేదో. ఇది లోకములో అతి ఎక్కువగా శిక్షింప బడే పాపము, అయినను లోకము దానిని పాపముగా ఆలోచించడం లేదు. మీరు అడగండి, "ఆ పాపము ఏమిటని?" ఆ పాపమును గూర్చి మీలో చాలామంది నేరారోపణ కలిగి ఉండరు – అది అవిశ్వాసము అనే పాపము.

మీరు సమాధానము కలిగియుండే ముందు, మీ హృదయములోని అవిశ్వాసమును బట్టి కలవరపడాలి, ప్రభువైన యేసు క్రీస్తు నందు నిజముగా మీరు విశ్వాసము ఉంచకపోవడం.

మీ హృదయానికి విన్నవిస్తున్నాను. క్రీస్తు కంటే సాతాను పట్ల మీకు ఎక్కువ నమ్మకము ఉందనిపిస్తుంది. మీకంటే సాతాను బైబిలును ఎక్కువగా నమ్ముతుందని నేననుకుంటాను. యేసు క్రీస్తు దైవత్వమును వాడు నమ్ముతున్నాడు. వాడు నమ్మి వణుకుతాడు. క్రైస్తవులమని పిలుచుకునే వేలమంది కంటే వాడు ఎక్కువగా వణుకుతాడు.

మీరు బైబిలు నమ్ముతారు కాబట్టి, లేక గుడికి వెళ్తున్నారు కాబట్టి మీకు విశ్వాసముందని మీరనుకుంటారు. క్రీస్తు నందు నిజ విశ్వాసము లేకుండా ఇదంతా మీరు చెయ్యవచ్చు. క్రీస్తు అనే వ్యక్తి ఉన్నాడు అని నమ్మడం మీకు ఏమంచి చెయ్యదు, అది సీజరు లేక అలేగ్జేండరు ద గ్రేట్ అనే వ్యక్తులు ఉన్నారు అని నమ్మడం లాంటిది. బైబిలు దేవుని వాక్యము. మనము దానికి వందనాలు చెల్లించాలి. కాని మీరు దానిని నమ్మవచ్చు, అయినను ప్రభువైన యేసు క్రీస్తు నందు నమ్మిక ఉంచకపోవచ్చు.

నేను ఒకవేళ మిమ్ములను ఎంతకాలము నుండి యేసు క్రీస్తును నమ్ముతున్నారు అని అడిగితే, మీలో చాలామంది నాతో చెప్పవచ్చు మీరు ఇప్పటికే ఆయనను నమ్మియున్నారని. మీరు యేసు క్రీస్తును ఇంకను నమ్మలేదు అనడానికి ఒక రుజువును నాకు ఇవ్వలేరు. నిజంగా క్రీస్తును విశ్వసించే వారికి ఒకప్పుడు ఆయనను నమ్మలేదు అనే విషయము తెలుస్తుంది.

దీనిపై నేను ఎక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే ఇది మోసపూరిత నిర్వీర్య మైపోయే విషయము. చాలామంది దానిలో కొట్టుకుపోతారు – ఇప్పటికే నమ్మాము అనుకోవడం ద్వారా. ఒక వ్యక్తి అన్నాడు పది ఆజ్ఞాలలోని తన పాపాలన్నీ వ్రాసుకొని, ఒక కాపరి దగ్గరకు వచ్చి తనకు ఎందుకు సమాధానము రాలేదు అని అడిగాడట. ఆ సేవకుడు ఆ పట్టి చూచి అడిగాడట, "వెళ్ళిపో! నీ పట్టీలో అవిశ్వాసము అనే పాపమునకు సంబందించిన ఒక్క మాట కూడ నాకు కనబడలేదు." అది దేవుని ఆత్మ యొక్క పని అవిశ్వాసమును గూర్చి మిమ్ములను ఒప్పించడం – నీకు విశ్వాసము లేదు అని చెప్పడం. పరిశుద్ధాత్మను గూర్చి యేసు క్రీస్తు అన్నాడు:

"ఆయన వచ్చి పాపములను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు...లోకమును ఒప్పుకోన చేయును, లోకులు నాయందు విశ్వాసము ఉంచలేదు గనుక" (యోహాను 16:8-9).

ఇప్పుడు, నా ప్రియ స్నేహితులారా, దేవుడు ఎప్పుడైనా మీకు చూపించాడా యేసు నందు మీకు నిజ విశ్వాసము లేదని? అవిశ్వాసపు కఠిన హృదయమును గూర్చి ఎప్పుడైనా విచారించం? ఎప్పుడైనా ప్రార్ధించారా, "ప్రభువా, క్రీస్తు నందు విశ్వాస ముంచడానికి సహాయము చేయుము అని?" క్రీస్తు నొద్దకు రాలేని మీ అసమర్ధతను బట్టి దేవుడు ఎప్పుడైనా మిమ్మును ఒప్పించాడా, తద్వారా క్రీస్తు నందలి విశ్వాసము కొరకు మీరు మోర పెట్టడానికి? అలా కాకపొతే, మీ హృదయములో మీరు సమాధానము కనుగొనరు. దేవుడు మిమ్మును మేల్కొలుపును గాక, యేసు నందు విశ్వాసముంచుట ద్వారా నిజ సమాధాము మీకిచ్చును గాక, చనిపోయి మరియొక అవకాశము లేకుండా పోవకముందే.

V. ఐదవది, మీరు దేవునితో సమాధానము కలిగి యుండేముందు, మీరు క్రీస్తు నీతియందు పూర్తిగా విశ్వాస ముంచాలి.

మీరు మీ వాస్తవ మూల పాపమును బట్టి ఒప్పింపబడడము మాత్రమే కాక, స్వనీతి పాపములు, అవిశ్వాసపు పాపము, మీరు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ నీతియందు విశ్వాస ముంచ గలిగాలి. మీరు క్రీస్తు యొక్క నీతిని అందుకోవాలి. అప్పుడు మీకు సమాధానము ఉంటుంది. యేసు అన్నాడు:

"ప్రయాసపడి, భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును" (మత్తయి 11:28).

ఈ వచనము ప్రయాసపడి భారము మోయు వారికి, ప్రోత్సాహము ఇస్తుంది. అయినను మిగిలిన వాగ్ధానము ప్రభువైన యేసు క్రీస్తు నొద్దకు వచ్చిన వారికి మాత్రమే లభ్యమవుతుంది. దేవునితో మీరు సమాధానము కలిగి యుండే ముందు ప్రభువైన యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి. మీరు క్రీస్తూనే కలిగి యుండాలి, తద్వారా ఆయన నీతి మీ నీతిగా మారుతుంది.

నా ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడైనా క్రీస్తునకు వివాహము చేయబడ్డారా? ఎప్పుడైనా యేసు క్రీస్తు ఆయనకు మీకు ఇచ్చుకున్నాడా? సజీవ విశ్వాసము ద్వారా క్రీస్తు నొద్దకు ఎప్పుడైనా వచ్చారా? నా ప్రార్ధనా దేవునికి క్రీస్తు సమాధానము మీతో మాట్లాడాలని. తిరిగి జన్మించడానికి ఈ విషయాలు మీరు అనుభవించాలి.

ఇప్పుడు నేను ఇంకొక లోకపు అదృశ్య వాస్తవాలను గూర్చి, అంతర్గత క్రైస్తవత్వమును గూర్చి, పాపి హృదయముపై దేవుని కార్యమును గూర్చి మాట్లాడతాను. మీ కొరకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన విషయాలు మాట్లాడతాను. దీనిని మీరు బాగా పట్టించుకోవాలి. మీ ఆత్మకు సంబందించినది. మీ నిత్య రక్షణ దానిపై ఆధారపడి ఉంది.

క్రీస్తు లేకుండా మీకు సమాధానమున్నట్టు అనిపించవచ్చు. సాతాను మిమ్ములను నిద్ర పుచ్చి మీకు అబద్ధపు సంరక్షణ ఇవ్వవచ్చు. మిమ్ములను నరకానికి పంపించే వరకు వాడు మిమ్మును నిద్ర పుచ్చడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ మీరు మేల్కొంటారు, కాని అది భయంకర మేల్కొలుపు మీరు అగ్ని మంటలలో ఉంటారు రక్షింపబడడానికి చాలా ఆలస్యమయిపోయింది. నరకంలో నిత్యత్వములో నీటి చుక్క కొరకు మీరు అడుగుతారు మీ నాలుకను చల్ల బరచడానికి, కాని మీకు నీరు ఇవ్వబడదు.

యేసు క్రీస్తు నందు విశ్రమించే వరకు మీ ఆత్మలో మీకు విశ్రాంతి లేకపోవును గాక! నశించు పాపులను రక్షకుని యొద్దకు తెచ్చుట నా ఉద్దేశము. ఓ ఆ దేవుడు మిమ్మును యేసు నొద్దకు తెచ్చును గాక. మీరు పాపాత్ములను పరిశుద్ధాత్మ మిమ్ములను ఒప్పింప జేయును గాక, మీ చెడు మార్గముల నుండి మళ్ళించి యేసు క్రీస్తు నొద్దకు మల్లించుట గాక. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు ప్రార్ధన: నోవాసాంగ్ గారు.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ఓ ప్రభు, నేను ఎంత అపవిత్రుడను" (జాన్ న్యూటన్ చే, 1725-1807).
“O Lord, How Vile Am I” (by John Newton, 1725-1807).ద అవుట్ లైన్ ఆఫ్

"కృప యొక్క పద్దతి" జార్జి వైట్ ఫీల్డ్ చే,
ఆధునిక ఆంగ్లమునకు కుదింపబడి మార్చబడినది

“THE METHOD OF GRACE” BY GEORGE WHITEFIELD,
CONDENSED AND ADAPTED TO MODERN ENGLISH

ప్రసంగము డాక్టర్ జాన్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే వ్రాయబడిన మరియు జాన్ సామ్యూల్ కాగన్ గారిచే బోధింపబడినది
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Mr. John Samuel Cagan

"సమాధానము లేని, సమయమున, సమాధానము, సమాధానమని చెప్పుచు; నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు" (యిర్మియా 6:14).

(యిర్మియా 6:13)

I.    మొదటిది, దేవునితో మీరు సమాధానము కలిగియుండే ముందు, దేవుని ధర్మ శాస్త్రమునకు మీరు వ్యతిరేకంగా చేసిన వాస్తవ పాపాలను మీరు చూడాలి, గ్రహించాలి, దుఃఖ పడాలి, వాటిని బట్టి నిట్టూర్పు విడవాలి, యేహెజ్కేలు 18:4; గలతీయులకు 3:10.

II.   రెండవది, మీరు దేవునితో సమాధానము కలిగియుండే ముందు, ఒప్పుకోలు లోతుగా వెళ్ళాలి; మీ స్వంత పాపపు స్వభావాన్ని బట్టి ఒప్పుకోవాలి, మీ ఆత్మ పూర్తి దుస్థితి, ఎఫెస్సీయులకు 2:3; రోమీయులకు 7:24.

III.  మూడవది, మీరు దేవునితో నిజ సమాధానము కలిగి యుండేముందు, మీ జీవితములోని పాపములను బట్టి కలవర పడడము మాత్రమే కాకుండా, మీ స్వభావములోని పాపములను బట్టి, మీ శ్రేష్టమైన నిర్ణయములలోని పాపములను బట్టి, పనులను బట్టి, పిలువబడే "క్రైస్తవ జీవితము" ను బట్టి కూడ కలవర పడాలి, రోమీయులకు 8:8.

IV.  నాల్గవది, మీరు దేవునితో సమాధానము కలిగియుండే ముందు, యేసు పట్ల అవిశ్వాసము అనే పాపమును బట్టి మీరు కలత చెందాలి, యోహాను 16:8,9.

V.    ఐదవది, మీరు దేవునితో సమాధానము కలిగి యుండేముందు, మీరు క్రీస్తు నీతియందు పూర్తిగా విశ్వాస ముంచాలి, మత్తయి 11:28.