Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నరకంలో క్రిస్మస్ – 2016

CHRISTMAS IN HELL – 2016
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
గురువారము సాయంకాలము, డిసెంబర్ 18, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, December 18, 2016


నాలో అనుకున్నాను, "నరకంలో క్రిస్మస్" పై ప్రసంగము చేయనా అని. సాతాను అన్నాడు, "ఓ, వద్దు! క్రిస్మస్ రోజు చెప్పే అంత మంచి విషయము కాదది. అది పరుషంగా ఉంది." వాడు అలా చెప్పినప్పుడు నాకు తెలుసు నేను బలహీనమైన సువార్త ప్రకటించడానికి శోధింపబడ్డానని. వాటి బలహీనతకు మనం ఇప్పటికే లోనయ్యాము అది మనలో నుండి బయటికి వెళ్ళాలి. తుడిచి వేయబడాలి, లేనిచో దేవుడు కోరే యోధులుగా మనం ఉండలేము. మనము చాలా పిరికి వరంగా ఉండి ఈ రోజులలో సువార్తిక ఫిలిప్పీయులను జయించలేము.

క్రిస్మస్ సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ క్రిస్మస్ లో నరకంపై బోధించకుండా మనలను సాతాను భయపెట్టనివ్వను. సంవత్సరమంతా నరకముంది. క్రిస్మస్ సమయంలో కూడ దాని ఎందుకు బోధించకూడదు? కాబట్టి, నేను నా శాస్త్రీయ ప్రసంగము ఇస్తున్నాను, "నరకంలో క్రిస్మస్ పై." గత ముప్ఫయి రెండు సంవత్సరాలుగా ఈ ప్రసంగము చాలా సార్లు చేసాను. చాలా మంది చిన్న బోధకులు దాని బోధించకూడదని నాకు చెప్పారు. క్రిస్మస్ నందు నరకంపై బోధించకుంటే, క్రిస్మస్ కు అర్ధము ఏంటి? క్రిస్మస్ కు అర్ధము లేదు నశించు పాపులకు అగ్నితో కూడిన నరకము లేకుండా. బాల యేసు మనకు క్రిస్మస్ చెట్లు వెలుతురు ఇవ్వడానికి బేత్లెహేములో జన్మించలేదు. ఆయన సిలువపై మరణించడానికి, పాపులను నరకము అగ్ని నుండి నిత్యత్వములో రక్షించడానికి బేత్లెహేములో జన్మించాడు. తద్వారా ఆయన పరిశుద్ధ రక్తములో పాపుల పాపాలు కడుగబడతాయి! మీరు క్రిస్మస్ నుండి నరకాన్ని తొలగిస్తే ఒక సెలవు దినమే మిగులుతుంది. కాబట్టి ఈ ఉదయము నా శాస్త్రీయ ప్రసంగము, "నరకంలో క్రిస్మస్" బోధిస్తాను. ఇది చైనీయ సంఘములో బోధించిన చివరి ప్రసంగము అప్పటిలో వారు డాక్టర్ తిమోతి లిన్ బోధలనుండి వైదొలగి ఈనాటి బలహీన, బుద్ధిహీన, ఆదివారము ఉదయము లవొదికియ ప్రసంగాల వైపు వైదొలిగారు. ఈ ప్రసంగము డాక్టర్ లిన్ పెట్టిన ఇద్దరు యవ్వన బోధకులు తిరస్కరించారు. ఈ ప్రసంగాన్ని వారు తిరస్కరించారు 27 మంది యవ్వనస్థులు కన్నీటితో ముందుకు వచ్చినప్పటికినీ. మార్పు నిరీక్షణలో, వారికి రెండు గంటల ఉపదేశము చేసాను. ఆ ప్రసంగీకులు తప్పు ఇప్పుడు కూడ వారు తప్పే, ఆ సంఘము ఏమాత్రము డాక్టర్ లిన్ చే నిర్మింపబడినది కాదు. ఆయన కట్టిన సంఘము ఏనాటికి కాదు ఎందుకంటే అక్కడ బోధించు వారు పిరికి వారు, భయపడే చిన్నవారు, ధైర్యము లేని వారు, కండలేదు, ఎముకలో అగ్ని లేదు, దేవుని నుండి వచ్చు నిజ ప్రసంగము లేదు. అక్కడ డబ్బులు చెల్లించే వృద్ధ స్త్రీలకూ వారు బోధిస్తుంటారు. వారు నిత్య నరకము నుండి యవనులు రక్షింప బడడానికి బోధించరు.

"నరకంలో క్రిస్మస్" పాతకాలంలో నేను బోధించిన వాటన్నింటిలో శ్రేష్ఠమైనదిగా నేను భావిస్తాను. కాబట్టి నేరుగా మీకు ఇస్తున్నాను! మిళితము లేకుండా! నా పాఠ్య భాగము లూకా 16:25. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1099 పేజీలో ఉంది. నిలబడి లూకా 16:25 లోని మొదటి రెండు పదాలు చూడండి.

"కుమారుడా, జ్ఞాపకము చేసికొనుము" (లూకా 16:25).

కూర్చోండి.

ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు. వెంటనే తన ఆత్మ నరకాగ్నిలోనికి వెళ్ళిపోయింది, "పాతాళంలో బాధపడుచు, కన్నులెత్తి చూచెను" (లూకా 16:23). ధనవంతుడు పరలోకంలో "మార్గము నుండి" అబ్రాహామును చూచెను. "[తన] నాలుకను చల్లార్చుటకు నీళ్ల కొరకు బతిమాలుచున్నాడు; [అతడు] అగ్ని [జ్వాలలలో] యాతన పడుచున్నాడు" (లూకా 16:24). అబ్రాహాము అతనితో మాట్లాడాడు,

"కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీ కిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము: ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు" (లూకా 16:25).

ప్రభువైన యేసు క్రీస్తు ఈ వివరాన్ని ఇచ్చాడు. నరకము గూర్చి నశించు పాపులను హెచ్చరించడానికి ఆయన ఇది చెప్పాడు.

స్పర్జన్ అన్ని కాలములో అతి గొప్ప బాప్టిస్టు సంఘ కాపరి. స్పర్జన్ అన్నాడు తన మరణ అనంతరము నరకముపై బోధించడానికి భయపడుతారని. విలియం బూట్ సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడు. ఈ 19 వ శతాబ్దపు ఇద్దరు గొప్ప బోధకులు 20 వ శతాబ్దంలో నరకముపై బోధ ఉండదని ఊహించారు. వారు సరియే – ఈనాడు ఇంకా ధారుణమయింది! బూత్ ను అడిగారు ఇరవై శతాబ్దంలో ప్రమాదమేమిటి అని. అతనన్నాడు, "నరకము లేని పరలోకము" (యుద్ధ కేక, జనవరి 1901 , పేజీ 7). బూత్ ఊహ నిజమైంది. ఈనాడు నరకముపై బోధ వినబడడం లేదు. అలా జరగకూడదు. డాక్టర్ జె. ఐ. పేకర్ ప్రసిద్ధ వేదాంతి. అతనన్నాడు,

క్రైస్తవ సువార్తికులు నరకముపై [మాట్లాడాలి]: అది వారి పనిలో భాగము... యేసు మరియు శిష్యులు ప్రకారము, శారీరక మరణము తరువాత వ్యక్తిగత జీవితము కొనసాగుతుంది, లోకములో క్రీస్తు లేని వారి జీవితము అది భయంకరం, అది ప్రతి ఒక్కరికి తెలియ పరచబడాలి (J. I. Packer, Ph.D., foreword to Whatever Happened to Hell? by John Blanchard, D.D., Evangelical Press, 2005 edition, p. 9).

నేను వృద్ధుడను. నేనెక్కువ కాలముండను. నేను చనిపోయిన తరువాత బోధించు వారు నరకమును గూర్చి బోధించడానికి భయపడతారు. మధుర మాటలు చెప్పు పాపులను రక్షింపవచ్చని వారు నమ్ముతారు. నేనింకా బ్రతికి ఉండగానే ఈ వృద్ధుని మాటలు మీరు వినడం మంచిది!

నా విమర్శ డాక్టర్ పాకర్ నరకముపై బోధించే పనిని "క్రైస్తవ సువార్తికులకు" మాత్రమే అప్పగించాడు. కానీ అపొస్తలుడైన పౌలు అన్నాడు, సంఘ కాపరి "సువార్తికుని పని కూడ చెయ్యాలి" (II తిమోతి 4:5). కాపరులు కూడ "నరకముపై [మాట్లాడాలి]; అది వారి పనిలో భాగము" (పాకర్, ఐడిబిఐ.). నా నిరీక్షణ నా పార్ధన నన్ను వెంబడించు యవనష్టులు నేను చనిపోయిన తరువాత పాపమూ, నరకము తీర్పులపై బోధించాలి నేను గత యాభై సంవత్సరాలుగా చేస్తున్నట్టుగా!

యేసు మనకు మాదిరి, "మనకు మాదిరిగా ఉన్నాడు, ఆయన అడుగులలో నడుచునట్లుగా" (I పేతురు 2:21). యేసు తరుచు నరకమును గూర్చి బోధించాడు, ఆయన మనకు ఉదాహరణ. క్రీస్తులో నిజంగా చెప్పాలంటే, ప్రతి సంఘ కాపరి కొన్నిసార్లు నరకముపై బోధించాలి, తేటగా ముక్కుసూటిగా, క్రీస్తు బోధించినట్టు "ధనవంతుడు లాజరుపై." క్రీస్తు అన్నాడు మానవుడు చనిపోయి నరకానికి నేరుగా వెళ్ళాడు అక్కడ అగ్నిలో యాతన పట్టాడు. ఆ మనుష్యుడు అబ్రాహామును నీళ్ల బొట్టులా కొరకు అడిగాడు. అబ్రాహాము అన్నాడు,

"కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీ కిష్టమైన సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము: ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు" (లూకా 16:25).

నేను పాఠ్యభాగములో మొదటి రెండు మాటలను ఎట్టి చూపిస్తున్నాను,

"కుమారుడా, జ్ఞాపకము చేసికొనుము" (లూకా 16:25).

ఇది క్రిస్మస్ సమయము. మన సంఘము అందంగా అలంకరింప బడింది. మనము గొప్ప పాత క్రిస్మస్ గీతాలను ఆలపిస్తూ ఉన్నాము. ఈ రాత్రి అద్భుత క్రిస్మస్ వేడుక చేసుకోబోతున్నాము. క్రిస్మస్ సందర్భంగా వచ్చే శనివారం, రాత్రి 8:00 గంటలకు, మన సంఘములో క్రిస్మస్ ఆతిధ్యము ఉండబోతుంది. కానీ ఈ అందమైన అర్ధవంతమైన క్రీస్తు జనన సంబరాలలో, నరకాన్ని గూర్చి మనము మర్చిపోవద్దు. పాప కారణమూ నరకము. యేసు సిలువపై మరణించాడు పాపమూ నుండి నిన్ను రక్షించడానికి, తద్వారా నీవు నరకాగ్నిలో పడవేయబడకుండా ఉండడానికి అందుకే ఆయన జన్మించాడు. అపొస్తలుడైన పౌలు అన్నాడు,

"క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చెను" (I తిమోతి 1:15).

ప్రభువు దూత యేసేపునకు చెప్పింది,

"ఆయన యేసు అని పిలువబడును: ఆయన తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును" (మత్తయి 1:21).

సరిగ్గా అదే కదా క్రిస్మస్ నిజ అర్ధము? క్రిస్మస్ నిజ సందేశము యేసు పరలోకము నుండి దిగి వచ్చాడు అనే కదా? ఆయన సిలువపై మరణించడానికి దిగి వచ్చాడు, నీ పాపమునకు వెల చెల్లించడానికి, నీలాంటి పాపులను నరకము నుండి రక్షించడానికి కదా?

కానీ క్రిస్మస్ ముందు నీవు చనిపోతే ఏంటి? ఇక్కడ ఒకరు ఉండొచ్చు ఈ ఉదయము కొన్ని రోజుల్లో చనిపోవచ్చు. డిసెంబర్ 25 న అది నీకు సంభవిస్తే, నీ మొదటి క్రిస్మస్ నరకంలో జరుపుకుంటావు. అది నీ విషయంలో విచారము, ఆ ధనవంతుని వలే,

"కుమారుడా, జ్ఞాపకము చేసికొనుము" (లూకా 16:25).

నీ పాపములో కొనసాగితే, ఈ క్రిస్మస్ కాకపోయినా, ఒకరోజు, నీవనుకున్న దానికంటే ముందే, నీవు మొదటి క్రిస్మస్ ను ఆ నరక యాతనలో గడుపుతావు. నీ మొదటి క్రిస్మస్ ను నరకంలో గడిపేటప్పుడు ఏమి జ్ఞాపకము చేసుకుంటావు?

I. మొదటిది, నీవు నిర్లక్షం చేసిన ప్రసంగాలు జ్ఞాపకము చేసుకుంటావు.

నీ మనసును ఎలా తిప్పుకోవాలో అనే దానిపై నేర్చుకున్నది నీవు జ్ఞాపకము చేసుకుంటావు. ప్రసంగాలు ఎలా ప్రక్కకు నెట్టావో. అది ఎలా సాధన చేసావో జ్ఞాపకము చేసుకుంటావు. మొదట్లో ప్రసంగాలు మిమ్మును కలవరపెట్టాయి. నిత్య విషయాలను గూర్చి నిన్ను ఆలోచింప చేశాయి. కానీ, కాల ప్రవాహంలో, సాతానుకు సుళువై పోయింది నీ హృదయములో నుండి ప్రసంగాలను "ఎత్తికొని పోవడం" (మత్తయి 13:19 చూడండి). యేసు అన్నాడు,

"తోవ ప్రక్క నుండు వారు, వారు విను వారు గాని నమ్మి రక్షణ పొందుకుండునట్లు, అపవాది వచ్చి వారి హృదయములోనుండి వాక్యం ఎత్తికొని పోవును" (లూకా 8:12).

మొదట్లో అలా చేయడం సాతానుకు కష్టము. కానీ నెలలు గడిచే కొలది నీవు ఈ సాతాను కుతంత్రానికి లోనయి దేని గురించి పట్టించుకోవు, ప్రతీ ప్రసంగము సమయంలోను మరణ నిద్రలోకి వెళ్ళిపోతావు. చివరకు నీ మనస్సాక్షి బాగా కఠినము అయి, నీ హృదయము కఠినము అయిపోతుంది, క్రీస్తు అన్నాడు,

"మీరు నా మాటలు గ్రహింప కున్నారు" (యోహాను 8:43).

మీరు వినడానికి మనసు లేని వారవుతారు, దేవుని వాక్యము పేద చెవిని పెడతారు, మీ గురించి చెప్పబడవచ్చు, "దేవుడు భ్రష్ట మనస్సుకు [వారి] నప్పగించెను" (రోమా 1:28).

"కుమారుడా, జ్ఞాపకము చేసికొనుము" (లూకా 16:25).

కుమార్తె, జ్ఞాపకము ఉంచుకో! నరకములో నీవు చాలా ప్రసంగాలు జ్ఞాపకము చేసుకుంటావు. నీవు నీ మొదటి క్రిస్మస్ ఆ మండు అగ్నిలో గడుపుచున్నప్పుడు నిస్సందేహంగా ఈ ప్రసంగాన్ని జ్ణాపకం చేసుకుంటావు! నరకంలో నీవు నిర్లక్ష్యము చేసిన ప్రసంగాలను జ్ఞాపకము చేసుకుంటావు. నీరు అరుస్తావు, "ఓ దేవా, ఆ వృద్ధ బోధకుని మాట ఎందుకు వినలేదు? ఓ దేవా, ఇప్పుడు చాలా ఆలస్యము అయిపోయింది! ఎన్నటెన్నటికి – చాలా ఆలస్యమయింది. నేను నరకంలో కాలిపోవు చున్నాను. ఎందుకు, ఓ ఎందుకు, ఎందుకు ఆ పాతకాలపు బోధకుని మాట వినలేదు అతడు నన్ను హెచ్చరిస్తున్నప్పుడు?"

II. రెండవది, నీవు తిరస్కరించిన దేవుని ఆత్మను జంపకము చేసుకుంటావు.

నరకంలో నీ మొదటి క్రిస్మస్ రోజున, నీకు పాపపు ఒప్పుకోలు కలిగించిన పరిశుద్ధాత్మను జ్ఞాపకము చేసుకుంటావు. యేసు అన్నాడు,

"ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకునచేయును" (యోహాను 16:8).

నీకు మొదటి క్రిస్మస్ ను నరకంలో గడుపుతున్నప్పుడు, దేవుని ఆత్మ నీ హృదయాన్ని ఎప్పుడు లేతగా చేసిందో జంపకము చేసుకుంటావు. అతని ఆత్మ భయపడినప్పుడు మీకు గుర్తుకు వస్తుంది. మీరు గుర్తుంచుకుంటారు మీ కంటి నుండి ఏవిధంగా కన్నీరు వస్తుందో. కానీ మీరు ఇంకా జ్ఞాపకము చేసుకుంటారు ఎలా మీరు ఆయన ఒప్పుకోలును నిరాకరించారో, ఎలా క్రీస్తును త్రోసి పుచ్చారో ఎలా పరిశుద్ధాత్మ మీ నుండి వెళ్లిపోయిందో, దేవుడు మిమ్మును గూర్చి చెప్తున్నాడు,

"[అతడు] విగ్రహములను కలుసుకొనెను: వానిని ఆలాగుననే ఉండనిమ్ము" (యెషయా 4:17).

డాక్టర్ జాన్ ఆర్. రైస్ ఇలా చెప్పాడు,

అప్పుడు తీర్పు ఎదుర్కోవడం ఎంత విచారము, కృప లేకుండా పిలువబడతావు
   ఆత్మకొనిపో బడే వరకు నీవు కొట్టి మిట్టాడతావు,
ఏమి నిట్టూర్పు అంగలార్పు, మరణము నిన్ను నిరీక్షణ లేని వానిగా చేసినప్పుడు,
   కొట్టి మిట్టాడుతూ చాలా ఎక్కువ కనిపెట్టావు!
("ఎక్కువ నీవు కొట్టి మిట్టాడితే" డాక్టర్ జాన్ ఆర్. రైస్, 1895-1980).
(“If You Linger Too Long” by Dr. John R. Rice, 1895-1980).

"కుమారుడా, జ్ఞాపకము చేసికొనుము" (లూకా 16:25).

నీవు నరకములో మొదటి క్రిస్మస్ జరుపుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ ఒప్పుకోలును ఎలా ఎదిరించావో జ్ఞాపకము చేసుకుంటావు, నీవు "ఎలా కొట్టిమిట్టాడావో ఆత్మ విడిచి వెళ్లిపోయే వరకు" (రైస్, ఐబిఐడి.).

"కుమారుడా, జ్ఞాపకము చేసికొనుము!" (లూకా 16:25).

కుమార్తె, జ్ఞాపకము ఉంచుకొనుము! తేరా దిగివచ్చినప్పుడు, వెలుతురు పోయినప్పుడు, నీ ఆత్మ నరకాగ్నిలో కాల్చబడుచున్నప్పుడు – కుమారుడా, జ్ఞాపకము చేసికొనుము! కుమార్తె, జ్ఞాపకము చేసికొనుము! నీవు నిర్లక్ష్యము చేసిన ప్రసంగాలు నీవు జ్ఞాపకము చేసుకుంటావు. నీవు తిరస్కరించిన దేవుని ఆత్మను జ్ఞాపకము చేసుకుంటావు.

III. మూడవది, నీవు అగౌరవ పరచిన రక్షకుని నీవు జ్ఞాపకము చేసుకుంటావు.

కాదు! నీవు రక్షకుని గౌరవిస్తావని నాకు చెప్పవద్దు! దాని విషయం నాతో అబద్ధము చెప్పవద్దు! నీకు ఆయన పట్ల గౌరవము లేదు! లేనే లేదు! బైబిలు చెప్తుంది నీవు క్రీస్తును తృణీకరించావు తిరస్కరించావు. బైబిలు చెప్తుంది,

"అతడు తృణీకరింపబడిన వాడు ఆయెను... మనుష్యుల వలన విసర్జింప బడినవాడును… వ్యాధిననుభవించిన వాడుగా మనుష్యులు చూడనొల్లని వాని గాను ఉండెను: అతడు తృణీ కరింపబడిన వాడు, కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి" (యెషయా 53:3).

నీకు క్రీస్తు అంటే గౌరవము ఉంటే ఆయన కొరకు వెదుకుతావు. నీకు క్రీస్తు అంటే గౌరవము ఉంటే నీవు "[నీ శక్తి అంతటితో కష్ట పడతావు] ఆయనను చేరుకోవడానికి" (లూకా 13:24). నీవు ఏమి శ్రమ పడ్డావు? లూథర్ వలే ప్రార్ధించావా? బన్యన్ వలే వేదన ద్వారా వెళ్ళావా? వైట్ ఫీల్డ్ వలే వారాలు ఉపవాసము చేసావా? వెస్లీ వలే నడిపింపబడ్డావా? స్పర్జన్ వలే మంచు తుఫానులో క్రీస్తును కనుగోగలిగావా? నేను చెప్తున్నాను నీవు జ్ఞాపకము చేసుకుంటావు! మరియు ఏదోఒక రోజు, మీరు నరకంలో ఉన్నప్పుడు, మీరు గుర్తుంచుకుంటారు మీరు క్రీస్తును కనుగొనడంలో ఎంత సోమరిగా ఉన్నారో!

"కుమారుడా, జ్ఞాపకము చేసికొనుము" (లూకా 16:25).

కుమార్తె, జ్ఞాపకముంచుకొ! నరకంలో అది నీవు జ్ఞాపకము చేసుకుంటావు! యేసు క్రీస్తు కొరకు చాలా తక్కువ గౌరవము కలిగి ఉన్నవని ఆశతో ఆయనను వెదకలేదని నీవు జ్ఞాపకము చేసుకుంటావు. యేసు చెప్పాడు,

"మీరు నన్ను వెదికిన యెడల, ఎప్పుడైతే పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు" (యిర్మీయా 29:13).

కుమారుడా, జ్ఞాపకము ముంచుకో! కుమార్తె, జ్ఞాపకముంచుకొ! నీవు యేసును ఎలా అగౌరవ పరిచావో, ఆయనిచ్చు రక్షణను మీ తిరస్కరించావో, నిత్య అగ్నిలో నీవు జ్ఞాపకము చేసుకుంటావు. ఇలా బోధించినందుకు నీవు ఎలా నన్ను ద్వేషించావో. ఎలా మీరు ఈ అందమైన యువకులతో తియ్యని బైబిలు పఠనలు చెప్పించుకోవాలనుకున్నారో మీరు వారి వైపు ఆకర్షింప బడేటట్టు మీ పాపాలను ఒప్పుకొని క్రీస్తు నొద్దకు మీరు వచ్చేటట్టు వారు మిమ్మును ఆజ్ఞాపింపకుండా! అవును, నాకు తెలుసు, నేను చనిపోయినప్పుడు మీలో కొందరు సంతోషిస్తారు. కానీ మీరు నరకానికి వెళ్తారు, మిమ్ములను హెచ్చరించడానికి నేను ఇక్కడ లేనప్పటికినీ. గొప్ప డాక్టర్ జాన్ ఆర్. రైస్ చెప్పింది వినండి,

మీరు నిరీక్షణతో వేచి యున్నారు, తేలికగా ఆయనను తిరస్కరించారు,
   మీరు భయంకరంగా సుదీర్ఘంగా పాపం చేశారు, మీ హృదయము చాలా తప్పుగా ఉంది;
ఓ, దేవుడు సహనము కోల్పోతే, మధుర ఆత్మ అభ్యంతర పడితే;
   ఆయన మిమ్ములను పిలువకపోతే, ఆయన వెళ్ళినప్పుడు నాశనము మీకు ఉంటుంది.
అప్పుడు తీర్పును ఎదుర్కొనుట ఎంత విచారము, కృప లేకుండా మీరు పిలువబడతావు
   మీరు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆత్మ వెళ్లిపోయే వరకు,
ఎంత నిట్టూర్పు కన్నీరు, మిమ్ములను నిరీక్షణ లేకుండా మరణము కనుగొంటే,
   మీరు కొట్టి మిట్టాడుతూ చాలాకాలము వేచియున్నారు!
("మీరు చాలాకాలము కొట్టిమిట్టాడితే" డాక్టర్ ఆర్. రైస్ గారిచే 1895-1980).
(“If You Linger Too Long” by Dr. John R. Rice, 1895-1980).

ఆహ్వానానికి మీరు ముందుకు వస్తే, నేను ఒక్కమాట కూడ నరకమును గూర్చి చెప్పను. మీరు కేవలము మీ పాపమును గూర్చి యేసును గూర్చి మాట్లాడాలి. మీ పాపాన్ని యేసు మాత్రమే క్షమించగలడు. ఆయన ప్రశస్త రక్తములో యేసు మాత్రమే మీ పాపములు కడుగగలడు. యేసు నొద్దకు రండి మీ పాపములన్నిటి నుండి ఆయన ద్వారా రక్షింపబడండి.

మీరు ముందుకు వస్తుండగా యేసుని గూర్చి ఆలోచింపకపోవడం భయంకరం. నా ప్రసంగంలో దేవుని సమృద్ధి అనిచెప్తే, మీరు సమృద్ధిని గూర్చి మాట్లాడుతారు. నా ప్రసంగంలో ఎన్నిక గూర్చి చెప్తే, ఎన్నికలను గూర్చి మీరు మాట్లాడుతారు. నా ప్రసంగంలో సాతాను అంటే, మీరు సాతాను గూర్చి మాట్లాడతారు. నేను ఆది పాపము లేక పిలుపు పరిణామాలు అంటే, వాటిని గూర్చి మీరు మాట్లాడుతూ ఉంటారు. నేను నరకమును గూర్చి బోధిస్తే, అదే మీరు మాట్లాడుతుంటారు!

నా ప్రసంగంలో యేసునే కేంద్ర బిందువుగా పెట్టుకున్నప్పటికినీ, యేసు క్రీస్తును గూర్చే మాట్లాడలేము. యేసును గూర్చి మిమ్మును ఆలోచింప చెయ్యలేము. మీరు ఆయనను తృణీకరించి తిరస్కరిస్తాను (యెషయా 53:3). అయిననూ ఏ వ్యక్తి పాపము నుండి మిమ్ములను రక్షింపలేడు. జోషఫ్ హార్ట్ (1712-1768) అన్నాడు, "యేసు తప్ప, యేసు తప్ప, ఎవరును నిస్సహాయులైన పాపులను మంచి చెయ్యలేదు" ("రండి, పాపులారా").

గెత్సమనే తోటలో మీ పాపాలు యేసుపై మోపబడ్డాయి. వనంలో మీ పాప భారము వలన ఆయన నలుగగొట్టబడ్డాడు, ఆయన శరీరము నుండి చెమట రక్త బిందువుల వలే ఆయెను. వారు ఆయనను బంధించి ముఖంపై కొట్టారు. ఆయన గెడ్డమును లాగారు. ఫిలాదు ఆయన వీపు దున్నబడే విధంగా కొరడా దెబ్బలు కొట్టించాడు. సిలువపై ఆయన కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడ్డాయి. ఒక సైనికుడు ఈటెతో ఆయన ప్రక్కను పొడవుగా, "వెంటనే రక్తమును నీళ్లును కారును" (యోహాను 19:34). యేసు ఆ భయంకర స్థితి ద్వారా వెళ్లి నొప్పిని ఆవేదను భరించాడు, మీ పాప ప్రాయశ్చిత్తము కొరకు, ఆయన పరిశుద్ధ రక్తములో మీ పాపములను కడుగడానికి! బైబిలు చెప్తుంది, "క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను" (I కొరింధీయులకు 15:3).

ఓ, మీ పాపములను గూర్చి ఆలోచించండి! ఓ, యేసును గూర్చి ఆలోచించండి, ఆయన శ్రమపడి, రక్తము కార్చి చనిపోయాడు మీ పాపము నుండి రక్షించడానికి. యేసును గూర్చి ఆలోచించు, ఆయన మాత్రమే క్షమించి నీ అన్ని పాపముల నుండి శుద్ధి చేయగలడు! మీ పాపములను గూర్చి ఆలోచించు! యేసును గూర్చి ఆలోచించు, ఆయన మాత్రమే నిన్ను రక్షింపగలడు! యేసు నొద్దకు రమ్ము. ఇప్పుడే ఆయన దగ్గరకు రమ్ము. "యేసు మాత్రమే, యేసు మాత్రమే, నిస్సహాయ పాపులకు మంచి చేయగలడు; యేసు మాత్రమే, యేసు మాత్రమే, నిస్సహాయ పాపులకు మంచి చేయగలడు."

నా ఉత్సాహము తెలుసుకోనునా,
   నా కన్నీళ్లు నిరంతరమూ కారున్నా,
అదంతా పాప ప్రాయశ్చిత్తము కలిగించదు;
   మీరే రక్షించాలి, మీరు మాత్రమే.
("తరాల బండ, నా కొరకై" ఆగస్టస్ టోప్లడే, 1740-1778).
(“Rock of Ages, Cleft For Me” by Augustus Toplady, 1740-1778).

"యేసు మాత్రమే, యేసు మాత్రమే, నిస్సహాయ పాపులకు మంచి చేయగలడు." సామాన్య విశ్వాసముతో ఆయన దగ్గరకు రమ్ము! ఒక శతాధిపతి సిలువ చెంత నిలబడి తన పాపముల నిమిత్తము యేసు మరణించుట చూసాడు. మోకాళ్లని క్రీస్తును విశ్వసించాడు. యేసును చంపిన వాడు యేసు ద్వారా ఆ క్షణంలో రక్షింపబడ్డాడు! యేసును చంపిన వ్యక్తి గట్టిగా అరిచాడు, "నిజంగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడు" (మార్కు 15:39). సంస్కృతీ చెప్తుంది ఈ వ్యక్తి క్రైస్తవుడయ్యాడని. ఆ వ్యక్తి చేసినట్టు మీరు వచ్చి యేసును విశ్వసిస్తారా? యేసు మిమ్మును ప్రేమిస్తున్నాడు ఆయన మిమ్మును రక్షిస్తాడు.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము ఏబెల్ ప్రుథోమ్ గారు: లూకా 16:19-25.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
      "మీరు దీర్ఘ కాలము తిరుగుతూ ఉంటే" (డాక్టర్ జాన్ ఆర్. రైస్, 1895-1980).
“If You Linger Too Long” (by Dr. John R. Rice, 1895-1980).ద అవుట్ లైన్ ఆఫ్

నరకంలో క్రిస్మస్ – 2016

CHRISTMAS IN HELL – 2016

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"కుమారుడా, జ్ఞాపకము చేసికొనుము" (లూకా 16:25).

(లూకా 16:23, 24, 25; II తిమోతి 4:5; I పేతురు 1:21;
I తిమోతి 1:15; మత్తయి 1:21)

I.   మొదటిది, నీవు నిర్లక్షం చేసిన ప్రసంగాలు జ్ఞాపకము చేసుకుంటావు, మత్తయి 13:19; లూకా 8:12; యోహాను 8:43; రోమా 1:28.

II.  రెండవది, నీవు తిరస్కరించిన దేవుని ఆత్మను జంపకము చేసుకుంటావు, యోహాను 16:8; యెషయా 4:17.

III. మూడవది, నీవు అగౌరవ పరచిన రక్షకుని నీవు జ్ఞాపకము చేసుకుంటావు, యెషయా 53:3; లూకా 13:24; యిర్మీయా 29:13; యోహాను 19:34; I కొరింధీయులకు 15:3; మార్కు 15:39.