Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఇద్దరు ఆదాములు –

మనము వినవలసిన ప్రసంగము
ఈనాడు చనిపోవుతున్న మన సంఘాలలో!
(ఆదికాండముపై #90 వ ప్రసంగము)

THE TWO ADAMS –
THE KIND OF SERMON WE NEED TO HEAR
IN OUR DYING CHURCHES TODAY!
(SERMON #90 ON THE BOOK OF GENESIS)
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
గురువారము సాయంకాలము, డిసెంబర్ 4, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, December 4, 2016

"మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును, నీవు నిరభ్యంతరంగా తినవచ్చును: అయితే మంచి చెడ్డల తెలివి నిచ్చు, వృక్ష ఫలమును తినకూడదు: నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను" (ఆదికాండము 2:16-17).


దేవుడు మొదటి మానవుని నేల మట్టి నుండి సృష్టించాడు. యవ్వనస్థునిగా అది నేను నమ్మలేదు. సెప్టెంబర్ నాల్గవ వారము 1961 వరకు, నేను అవతరణ సిద్ధాంతము నమ్మాను. ఆ సంవత్సరము సెప్టెంబర్ 28 న నాలో అకస్మాత్తు మార్పు కలిగింది, జీవితాన్ని మార్చేసిన మార్పు. ఆ వారంలో అంతా మారిపోయింది. ఒక ప్రాముఖ్యమైన మార్పు బైబిలు నందు దృఢ నమ్మకము కలగడం. ఆ క్షణము నుండి అవతరణ తప్పు అని గ్రహించాను, అది సామాన్య శాస్త్ర అంశమని, మోర్మోను పుస్తకము వలే అబద్ధమని, కురాన్ వలే అబద్ధమని గ్రహించాను. నా మార్పులో డార్విన్ నమ్మకము నుండి పూర్తి సమర్పణకు నా మనసు మారింది బైబిలులో ప్రతి హెబ్రీ గ్రీకు పదానికి ప్రభావితుడయ్యాను. అప్పుడు నా ఆత్మలో నాకు తెలుసు "లేఖనాలన్నీ దేవుని ప్రేరేపణచే ఇవ్వబడ్డాయి, అవి ప్రయోజనకరము" (II తిమోతి 3:16). లేఖనాలలోని ప్రతీమాట దేవునిచే ఊదబడింది (తిమోపీ నిష్టన్) బైబిలులో తప్పులేదు – ప్రతీమాటలో ఆదికాండము నుండి – ప్రకటన గ్రంధము వరకు – బైబిలు వ్రాసిన వారికి ఇవ్వబడింది! బైబిలు చెప్తుంది, "దేవుడైన యెహోవా నేలమట్టి నుండి నరుని చేసి, వాని నాసికా రందములలోనికి ఊదగా; అతడు జీవాత్మ ఆయెను" (ఆదికాండము 2:7). నాకు అప్పుడు తెలిసింది, దేవుడు మొదటి మానవుని చేసాడు మానవుడు అవతరించలేదు. నాకు తెలుసు ఆదికాండములో లిఖించబడిన మానవుని సృష్టి అక్షరాలా వాస్తవమని మరియు అవతరణ సాతాను చెప్పిన అబద్ధమని తెలుసు.

తరువాత దేవుడు మానవుని ఒక అందమైన వనంలో ఉంచాడు, అక్కడ అన్ని రకాల ఆరోగ్య కరమైన రుచికరమైన ఫలాలు ఉండేవి. వాటిలో చాలా ఆరోగ్యకర చెట్లు ఫలాలు ఉనికిలో లేవు ఎందుకంటే అవి గొప్ప జల ప్రళయంతో నాశనము చేయబడ్డాయి.

కాని తోట మధ్యలో రెండు ప్రాముఖ్య చెట్లు ఉన్నాయి – అవి జీవ వృక్షము మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు. దేవుడు ఆదాముకు ఒకే ఒక నియమావళి ఇచ్చాడు, "మంచి చెడుల తెలివినిచ్చు, జీవ వృక్షము ఫలములను నీవు భుజింప కూడదు: నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవు" (ఆదికాండము 2:17). పదము "తెలివి" ఆదికాండము 2:17 లో చెప్పబడినది మూల పదము "యూద" నుండి వచ్చినది. దాని అర్ధము "అల్లుకొనిపోవుట, ఒక పరిచయ మిత్రుని వలే" (బలమైన). నిషిద్ధమైన ఫలము తింటే దానికి భానిసలవుతారు. వివాహేతర లైంగిక అనుభవము మనసులో ఎప్పుడు ఉండిపోతుంది ఎందుకంటే అది చేసిన వ్యక్తి దానిని అలవాటు అయిపోతాడు. మత్తు పదార్ధాలతో ఒకటి రెండు అనుభవాలు వ్యక్తికి బానిసయ్యే అనుభూతి నిస్తుంది. అతని సున్నితత్వము పూర్తిగా నశిస్తుంది. మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు ఫలము తింటే, అది మానవుని సున్నితత్వాన్ని నాశనము చేసి ఆత్మీయ మరణము చివరకు శారీరక మరణానికి దారి తీస్తుంది.

దెయ్యానికి అది బాగా తెలుసు. అందుకే నిషేధింపబడిన ఫలాన్ని తినేలా మానవుని శోధించాడు. వాడికి తెలుసు మానవుడు సున్నితత్వము కోల్పోయి నిత్యము పాపిగా మారిపోతాడని. ఈ శోధనకు లోబడడం మానవుని మనస్సాక్షిని నాశనం చేస్తుంది. అతడు నిత్య పాపిగా ఉండిపోతాడు. నిషేదింపబడిన ఫలము భుజించిన వెంటనే అతని మనస్సాక్షి చనిపోతుంది. దేవుని నుండి అతడు దాగుకుంటాడు. అతని ఆత్మ "అపరాధముల వలన పాపముల వలన చనిపోతుంది" (ఎఫెస్సీయులకు 2:1). అతడు "పాపములతో చనిపోతాడు" (ఎఫెస్సీయులకు 2:5). అతనికి శారీరక స్వభావము నుండి దేవుని శత్రువుగా చూస్తాడు (రోమా 8:7). అతడు ఆత్మీయము గానే కాకుండా, అతని శరీరము కూడ చనిపోతుంది. చనిపోయిన వ్యక్తిగా అతడు "దేవుని ఆత్మీయ విషయాలు పొండుకోలేదు"... ప్రస్తుతము దేవుని సత్యాలు "వానికి బుద్ధి హీనంగా ఉంటాయి" (I కొరిందీయులకు 2:14).

కాని ఇంకా చెడ్డది, అతని నాశన స్వభావము ఆత్మీయ మరణము అతని వారసులకు కూడ సంక్రమిస్తుంది, భూమి మీద అందరికీ, "ఆదాము అవిధేయత [అది] చాలామందిని పాపులుగా చేసింది" (రోమా 5:19; కేజేవి, ఇ ఎస్ వి). "కాబట్టి...ఒకని తప్పిదాన్ని బట్టి [ఆదాము] తీర్పు అందరి పైకి వచ్చింది" (రోమా 5:18). "ఆదాము మూల పాపమనగా ఆ పాప భూ ఇష్టత ప్రతి ఒక్కరిని పుట్టుక నుండి పాపము పట్ల మమకారము గల వానిగా చేస్తుంది... ఈ అంతర్గత పాప భూ ఇష్టత మిగిలిన పాపాలన్నీటికీ మూలము; ఇది ఆదాము నుండి మనకు ప్రాప్తిస్తుంది [సంక్రమిస్తుంది]... మనం పాపం చేస్తున్నాం కాబట్టి పాపులం కాదు, మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్నాము, పాప భూ ఇష్టమైన స్వభావంతో జన్మించాం" (The Reformation Study Bible; note on page 781). "మానవుడు...పాపముతో చచ్చినవాడు తన స్వశక్తితో తనను మార్చుకోలేడు" (వెస్ట్ మినిస్టర్ ఒప్పుకోలు, IX, 3).

ఆదాము పాపము తన వంశానికి అందచేయబడింది (మానవజాతి అంతటికి). నిజము నిరూపించబడింది. అది ఎలా నిరూపించబడిందంటే మొదటి బిడ్డ ఆదాముకు కయీను, తన స్వంత సహోదరుని చంపాడు (ఆదికాండము 4:8). చూడండి అలా మీరు ఆదాము బిడ్డ. స్వాభావికంగా మీరు పాపులు. నువ్వు చెప్పేది చేసేది నిన్ను రక్షించ నేరదు. నువ్వు చేసేది నీవు రక్షింపబడడానికి సహాయ పడదు. స్వాభావికంగా నీవు పాపివి. గుడికి రావడం నిన్ను రక్షించలేదు. నీ ప్రార్ధనలు నిన్ను రక్షింప లేవు. మంచివానిగా ఉండడం నిన్ను రక్షింప లేదు. ఏదీ కూడ – మళ్ళీ చెప్తాను – ఏదీ కూడ చెప్పేది చేసేది నిన్ను రక్షించ లేవు. నీవు నశించిన పాపివి. బోధించు వారు నాకు తెలిసి భయంకర పాపులు – వారు ప్రతి రోజు బైబిలు చదువుతారు. అవిదేయులైన పాపులు క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించడం నాకు తెలుసు, కానీ వారు పెరిగిన దాని వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, సంఘములో వారు నేర్చుకున్న ప్రతిదానికి వ్యతిరేకంగా ఉంటారు. బైబిలు వారికి బాగా తెలుసు, కాని దానికి వ్యతిరేకంగా తిరగబడతారు. బైబిలు బోధిస్తున్న కాపరిపై తిరగబడతారు. వారి హృదయంలో సత్యమును అసహ్యించుకుంటారు కాబట్టి తిరగబడతారు. "సంఘ పిల్లలు" నాకు తెలుసు వారు దెయ్యమంత దుష్టులు. సంఘములో ఎదిగే అమ్మాయిలు శృంగారానికి అబ్బాయిలను ప్రేరేపిస్తారు. తరువాత ఆదివారము చిన్న దూతల వలే పాటలు పాడతారు, కాని వారు భయంకర పాపులు. "సంఘ పిల్లలు" నాకు తెలుసు వారు ఆ అమ్మాయిలతో శృంగారములో పాల్గొంటారు అది చిన్న పిల్లలతో పంచుకుంటారు, అలా చిన్న వారి మనసులో కామాన్ని ప్రేరేపించి నశింప చేస్తారు.

నీవంటావు, "అది నేనెప్పుడు చెయ్యలేదు!" కాని చెయ్యాలని ఆలోచించవు. పాపపు పనులు నీ మనసులో చేసావు, కదా? యేసు అన్నాడు అలా చేస్తే పాపపు చేసినట్టే అని!

దేవుని ప్రేమిస్తున్నానని చెప్పావు, కాని ఆయనకు విధేయుడవు తున్నావా? మీ హృదయమంతటినీ దేవుని ప్రేమిస్తున్నావా? ప్రతి రోజు బైబిలు చదవ ఇష్టపడుతున్నావా? ప్రతిరోజు ప్రార్ధనలో ఒంటరిగా దేవునితో గడప ఇష్టపడుతున్నావా? లేక విడియో గేములు ఆడడం టివిలో ఆటలు చూడడంలో సమయము గడుపుతున్నవా – అంత సమయము ప్రార్ధనలో కాని బైబిలు పఠనంలో కాని గడపకుండా? నేనంటాను నీవు దేవుని ప్రేమించుట లేదని – నిజంగా – దేవుని ప్రేమించుటను గూర్చి మాట్లాడుతున్నావు. కాని నిజంగా దేవుని విడిచి పెడుతున్నావు. నిజంగా నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావు. ఆలోచించు! అది నిజము కాదా? నిజంగా దేవుని విడిచిన పాపివి కాదా? కాపరికి భయపడుచున్నావా? నాకు భయపడుచున్నావా? ఎందుకంటే నేను నిన్ను దేవుని గూర్చి పాపమును గూర్చి ఆలోచింప చేస్తున్నాను కాబట్టి? అందుకే నేనంటే నీకు భయము కదా?

ఎలా తేదీ ఇవ్వాలో అనే జాన్ కాగన్ ప్రసంగము నిజంగా నీకు నచ్చిందా? నిటారుగా కూర్చొని జాగ్రత్తగా విన్నారు. నేను పాపము, రక్షణ క్రీస్తును గూర్చి బోధించేటప్పుడు అలా వినరు! ఇతరులతో తేది నిర్ణయించుకోవడం మీకు చాలా ఆసక్తి కరంగా ఉంది క్రీస్తును గూర్చిన భోధకంటే – నీ పాపము నుండి రక్షించడానికి సిలువపై ఆయన మరణము. అలా ఐతే, నేను సరియే, అది నిరూపిస్తుంది నీవు తిరగబడే పాపివి నీ హృదయంలో క్రీస్తు పట్ల నిజమైన ప్రేమ లేదని. ఒప్పుకోండి. నీవు తప్పక ఒప్పుకోవాలి నీవు నశించిన పాపివని నీకు అనిపించాలి. అది అంగీకరించాలి లేనిచో నీకు నిరీక్షణ లేదు. నిరీక్షణ లేనేలేదు!

"అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు: వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును" (సామెతలు 28:13).

నీ పాప హృదయపు అంతరంగిక పాపాన్ని ఇప్పుడే ఒప్పుకోండి, లేనిచో నిత్యత్వంలో నరకాగ్నిలో ఉంటారు! ఇది నిజము. ఒక పెద్దలా మీతో మాట్లాడుతున్నాను. ఇది తీపియైన సబ్బాతు బడి పాఠము కాదు. ఇది తీపియైన జోయిల్ ఆస్టీన్ మాట కాదు. జాన్ మెక్ ఆర్డర్ లా వచనము తరువాత వచనము వివరణ కాదు. ఇది మిమ్మును లేపడానికి మంచి పాతకాలపు ప్రసంగము. పాత పాఠశాల సువార్తిక ప్రసంగము ఇది. ఈ ప్రసంగము దేవుడు మిమ్మును మేల్కొల్పి, నీకు పాపపు హృదయము పాపములో చచ్చిన హృదయము ఉందని చెప్పడానికి. నేను మీతో ప్రతి బోధకుని వలే మాట్లాడుచున్నాను. మీ డబ్బు నాకు వద్దు! మీ డబ్బు అవసరం లేదు. మీ ఆత్మ నాకు కావాలి. యేసుచే మీరు రక్షింపబడడం నేను చూడాలి. మీ పాపపు హృదయాన్ని దేవుడు మార్చడం, క్రీస్తు రక్తములో అది కడగ బడడం నేను చూడాలి. అది నేను కోరుకునేది. సంతోష క్రైస్తవుడవాలని వేషదారివి కాకూడదని నేను కోరుచున్నాను! వేషధారి క్రైస్తవునిలా కనిపిస్తాడు, కాని లోపల హృదయము "మృత ఎముకలతోను, అపవిత్రత తోను నిండుకొని ఉంటుంది...బాహ్యంగా నీతిమంతునిగా కనిపిస్తారు, కాని లోపల పూర్తీ వేషధారణ అతిక్రమములతో నిండి ఉంటుంది" (మత్తయి 23:27, 28). మీరు ఉండేటట్టు ఉంటారు. మీ హృదయము పాప భూ ఇష్టత కనుక మీరు క్రైస్తవునిలా కనిపించేలా ప్రయత్నిస్తారు – కాని మీ హృదయాన్ని చూడండి! మీ హృదయము పాప భరితమైపోయింది, కామము అపనమ్మకముతో నిండి ఉంది. కయీను హృదయము వలే మీ హృదయము తిరుగుబాటుతో కూడినది.

ఆదికాండము 5:1, 3 నిరూపిస్తున్నాయి ఆదాము పాపము మానవ జాతిని నిర్మూలము చేసింది. అందుకే హృదయము పాపములో చనిపోయింది. ఆదికాండము 5:1 లో మనం చూస్తాం "దేవుడు మానవుని సృష్టించాడు, దేవుని స్వారూప్యంలో" (ఆదికాండము 5:1). కాని ఆదాము తిరగబడి పాపము చేసాడు. తరువాత మనము చదువుతాం ఆదాము "తన స్వరూప్యంలో, తన ఆకారంలో కుమారుని కన్నాడు" (ఆదికాండము 5:3). ఆదాము అమాయకంగా ఉన్నప్పుడు అతడు దేవుని సారూప్యంలో సృష్టించ బడ్డాడు – దేవుని వలే అమాయకుడుగా! కాని పాపము చేసిన తరువాత "తన రూపంలో కుమారుని కన్నాడు" – పాప ఆరోపణతో, స్వాభావిక పాపిగా! (ఆదికాండము 5:3).

మీరు ఆ సారూప్యంలో జన్మించారు – ఆదాము వలే మీరు కూడ తిరగబడినప్పుడు స్వాభావికంగా పాపులు. మీరు స్వాభావికంగా పాపులు. స్వాభావికంగా మీ తల్లిదండ్రులు పాపులు. ప్రతి ఒక్కరు పాఠశాలలో కానీ పని స్థలములో కానీ స్వాభావిక పాపులు. వారి దుష్ట హృదయాలు మార్చుకోవడానికి పాపులు ఏమి చెయ్యలేరు. "ఏంటి?" మీరంటారు, "మా తల్లికి పాప హృదయము ఉందా?" అవును! ఆమె హృదయము మీ వలే తిరుగుబాటు తనము పాపముతో కూడినది, ఆదాము వారసుని వలే. మానవాళి అంతా నాశనం చెందింది, మరణం అందరికి వస్తుంది. ఆదాము పాపమును బట్టి ఇదంతా వస్తుంది. గమనించండి, అతడు హెచ్చరింపబడ్డాడు. గమనించండి, అవిధేయుడవడానికి అతనికి కారణము లేదు. గమనించండి, అతనికి తెలుసు తానూ చనిపోతాడని తానూ పుట్టబోయే వారందరిని నాశనము చేస్తాడని. గమనించండి, ఆదాము, అంత చక్కని పరిశుద్ధ వ్యక్తి – పాపమూ వలన భూతముగా రూపాంతరము చెందాడు! ప్రతి మంచి వ్యక్తి హిట్లరును ద్వేషిస్తారు ఎందుకంటే అతడు ఆరు మిలియనుల యూదులను చంపాడు. కానీ హిట్లరు ఆదాముతో పోలిస్తే దూతవలే అమాయకుడు. హిట్లర్ ఆరు మిలియనుల మందిని చంపాడు. కానీ ఆదాము మానవ జాతినంతటినీ చంపాడు! బిలియనుల ప్రజలు! ఆదాము నీ హృదయాన్ని నాశనము చేసాడు. ఆదాము నిన్ను ఒక సంఘానికి వెళ్లే వేషధారిగా మార్చాడు – హృదయము మారని వేషధారిగా చేసాడు – నరకానికి వెళ్లే వేషధారి, దానికి పాత్రుడు ఎందుకంటే పాపపు స్వభావము వలన, తనను రక్షించ గలిగిన – ఆఖరి ఆదాము అయినా యేసును, తిరస్కరించినందుకు వలన. మొదటి ఆదాము నీకు తిరుగుబాటు పాపపు హృదయము ఇచ్చాడు. చివరి ఆదాము, క్రీస్తు, ఒకే ఒక్కడు నీకు నూతన హృదయాన్ని ఇవ్వగలడు. క్రీస్తు మాత్రమే నీ రాత్రిగుండెను తీసివేసి "మాంసపు గుండెను ఇవ్వగలడు" (యెహెఙ్కేలు 36:26). అదే పునర్నిర్మాణము. అదే నూతన జన్మ అంటే.

ఇప్పుడు మనం కఠిన భాగానికి వస్తున్నాం. హృదయము మార్చుకోలేని వ్యక్తి ఎలా రక్షింపబడగలడు? మీరు పునర్ణిర్మాణింపబడాలి. పునర్నిర్మాణము అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతము. దానిపై బోధించే బోధకులది నేను వినను. మన సంఘాలు చనిపోతున్నాయి! "పునర్నిర్మాణము" అంటే దేవుడు హృదయాన్ని మరణము నుండి జీవములోనికి మార్చే ప్రక్రియ. క్రీస్తు అన్నాడు పునర్నిర్మాణము అంటే "తిరిగి జన్మించుట," ఆత్మీయ పరివర్తనం, పరిశుద్ధాత్మ ద్వారా నూతన హృదయ సృష్టి, ఈ క్రియలో ఒక వ్యక్తి ఆదాము కుమారుని నుండి దేవుని కుమారునిగా మారతాడు. పునర్నిర్మాణము దేవుని క్రియ మాత్రమే, దానిలో ఆయన చనిపోయిన హృదయాన్ని, ఆదాము నుండి ప్రాప్టించిన దానిని, జీవింప చేస్తాడు. నూతన జన్మ అవసరం ఎందుకంటే నీ హృదయము మునుపు చనిపోయింది.

జాన్ కాగన్ సాక్ష్యము అతి శ్రేష్ఠమైన యవ్వన వ్యక్తి సాక్ష్యము. దానిని చదివిన ఒక వ్యక్తి నాతో అన్నాడు పదిహేనేళ్ల అబ్బాయి నుండి అలాంటిది రానేరదని. ఈ వ్యక్తి దానిని వ్రాయడం, దానిని సరిదిద్దడం తప్పు పెట్టేవాడు. దానిని జాన్ వేదికపై నాతో పాటు కూర్చున్నాడు. అతడు మీకు కచ్చితంగా చెప్పగలడు అది నేను వ్రాయలేదు లేక మార్చకోలేదు – తన తండ్రి, డాక్టర్ కాగన్ కూడ. కేవలం అది చదవడం ద్వారా వినడం ద్వారా కొంతమంది రక్షింపబడ్డారు.

మొదటి ఆదాము హృదయం తారుమారవ్వాలి, క్రీస్తుచే అది మళ్ళీ జీవింపబడాలి, చివరి ఆదాము. ఇది అపొస్తలుడైన పౌలు తేటగా చెప్పాడు,

"కాబట్టి తీర్పు ఒక్క అపరాధము [ఆదాము] వలన వచ్చిన మనుష్యులందరికి శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణము ఆయనో; అలాగే ఒక్క [క్రీస్తు] పుణ్య కార్యము వలన కృపా దానము మనష్యులందరికినీ జీవ ప్రదమైన నీతి విధింప బడుటకు కారణమాయెను... ఏలయనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా [ఆదాము] ఎలాగూ [వారు] చేయబడిరో, అలాగే ఒకని [క్రీస్తు] విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు" (రోమా 5:18, 19).

మళ్ళీ, అపొస్తలుడు ఆదాము క్రీస్తులకు వ్యత్యాసము చూపుతున్నాడు,

"ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రణమాయెనని వ్రాయబడి యున్నది: కడపటి ఆదాము [క్రీస్తు] జీవింప చేయు [జీవము ఇచ్చు] ఆత్మ ఆయెను" (I కొరింధీయులకు 15:45).

క్రీస్తు మాత్రమే (ఆఖరి ఆదాము) పాపి మృత హృదయాన్ని జీవానికి తేగలడు. క్రీస్తు పాపపు బానిసత్వపు హృదయాన్ని నూతన హృదయంగా, దేవుని ప్రేమించే హృదయంగా మార్చగలడు. దేవుని ఆత్మ మీ పాప పూరిత హృదయాన్ని ఒప్పించినప్పుడు ఈ పని ప్రారంభ మవుతుంది (యోహాను 16:8). అప్పుడు దేవుని ఆత్మ క్రీస్తును మీకు బయలు పరుస్తాడు (యోహాను 16:14, 15). చివరగా దేవుడు నిన్ను క్రీస్తు నొద్దకు చేరుస్తాడు (యోహాను 6:44). పునర్నిర్మాణములోని ఆ మూడు మెట్లు జాన్ కాగన్ సాక్ష్యములు చూపబడ్డాయి. మొదటి భాగంలో జాన్ ఆదాము నుండి వచ్చిన తన చేదు హృదయాన్ని గూర్చి మాట్లాడాడు. రెండవ భాగంలో, జాన్ దేవుడు తనను ఎంతగా ఒప్పించాడో చెప్పాడు. అతనన్నాడు, "నేను నన్ను ద్వేషించడం ఆరంభించాను, నా పాపాన్ని అసహ్యించుకోవడం నాకు అనిపించింది." మూడవ భాగంలో జాన్ తన పాప హృదయము నా బోధను ఎలా ద్వేషించాడో, క్రీస్తును ఎలా తిరస్కరించాడో చెప్పాడు. అది గొప్ప పోరాటం దేవునికి తన పాప హృదయానికి, మధ్య క్రీస్తు నొద్దకు తానూ రాలేని స్థితి. నాల్గవ భాగములో జాన్ మనకు చెప్తాడు ఎలా తానూ పాపమూ నుండి తనను రక్షించడానికి సిలువపై క్రీస్తు శ్రమను ఎలా తానూ ఆలోచించాడో చెప్తాడు. ఈ తలుపు తన మొండి తనాన్ని విరుగగొట్టి చివరకు క్రీస్తులో విశ్రమించాడు. చివరకు, మార్పు తరువాత కాగన్ చెప్తాడు, "క్రీస్తు తన జీవితాన్ని నాకిచ్చాడు దానికి నా సమస్తము ఆయనకిస్తాను...ఆయన నన్ను మార్చినందుకు." చూడండి! అతడు కొంటి యుక్త వయస్కుడు! కానీ ఇప్పుడు అతడు దైవ జనుడు!

వచ్చే నెల జాన్ కాగన్ ఒక వేదాంత కళాశాలలో బాప్టిస్టు బోధకుడవడానికి చేరతాడు.

నీవెవరవైనా – నీవు నశించిన పాపివి, నీ హృదయము చనిపోయింది, ఆదాము పాపములో బంధింపబడ్డాడు కనుక మృతమయింది. నీవాలా ఉంటే, యేసు క్రీస్తు నీ ఒకే ఒక్క నిరీక్షణ – ఆయన మాత్రమే పాపపు శక్తిని "విరిచి బందీని విడుదల చేస్తాడు" చార్లీ వెస్లీ చెప్పినట్టు. క్రీస్తులో శక్తి ఉంది నీ హృదయాన్ని మార్చడానికి ఆయన రక్తముతో కడగడానికి. ఆయనను విశ్వసించు ఆయన నిన్ను రక్షిస్తాడు.

యేసు ద్వారా పాపము నుండి రక్షణ విషయంలో మీరు నాతో మాట్లాడాలనుకుంటే, దయచేసి వచ్చి డాక్టర్ కాగన్, జాన్ కాగన్, నాతో మాట్లాడండి. మీరు వచ్చి మాతో మాట్లాడండి గ్రిఫిత్ గారు ఈ పాట పాడుచుండగా "యేసులో" రెండుసార్లు, అన్ని మూడు చరణాలు.

వెయ్యి విధాలుగా విఫల ప్రయత్నాలు చేసాను
   నా భయాలు తొలగడానికి, నా ఆశలు చిగురించడానికి;
కాని నాకు కావలసింది, బైబిలు చెప్తుంది,
   ఎప్పటికైనా, యేసు మాత్రమే.

నా ఆత్మ రాత్రి, నా హృదయము స్టీలు –
   నేను చూడలేను, నాకు అనుభూతి లేదు;
వెలుగు కొరకు, జీవము కొరకు, నేను ఒప్పుకోవాలి
   యేసు నందు విశ్వాసముంచాలి.

కొందరు నవ్వినా, కొందరు నిందించినా,
   నేను నా నేరారోపణ సిగ్గుతో వెళ్తాను;
ఆయన యొద్దకు వెళ్తాను ఎందుకంటే ఆయన నామము,
   అన్నింటికంటే పై నామము, అది యేసు.
("యేసులో" జేమ్స్ ప్రోక్టర్ చే, 1913).
      (“In Jesus” by James Procter, 1913).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్: రోమా 5:17-19.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసులో" (జేమ్స్ ప్రోక్టర్ చే, 1913).
“In Jesus” (by James Procter, 1913).