Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు?

(ఆదికాండముపై 89 వ ప్రసంగము)
ADAM, WHERE ART THOU?
(SERMON #89 ON THE BOOK OF GENESIS)

(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు గురువారము సాయంకాలము, నవంబర్ 27, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, November 27, 2016

"మరియు దేవుడైన యెహోవా ఈతోటలో ఉన్న, ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును: అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు, వృక్ష ఫలమును తినకూడదు: నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను" (ఆదికాండము 2:16-17).


మొదటి నరుడు ఆదాము పరిపూర్ణ అమాయకత్వముతో దేవునిచే సృష్టించబడ్డాడు. అతడు అందమైన వనంలో ఉంచబడ్డాడు. ఆ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఆహారమునకు మంచిది. ఆదాము రుచికర ఆహారము తెంచుకోవచ్చు. ఆ అందమైన తోటలో అతనికి చింతలు లేవు శత్రువులు లేరు. జంతువులు పక్షులు అన్ని శాఖాహారులు. మానవునికి హాని చెయ్యడానికి బాధపెట్టడానికి ఎవరు లేరు. మానవుడు శాకాహారి, కనుక అతనికి జంతువులను చంపి వాటి మాంసము తినే అవసరము లేదు. ఏదేను వనములో అంతా ప్రశాంతంగా ఉండేది. తుఫానులు లేవు కనుక దాచుకునే అవసరము అతనికి లేదు, ఎన్నడు వర్షము కురువలేదు. "అయితే ఆవిరి భూమి నుండి లేచి, నెల అంతటిని తడిపెను" (ఆదికాండము 2:6). మానవునికి చింతపడే అవసరమే లేదు. అతడు రోగి అవడానికి అతనికి జబ్బులు లేవు. పోరాడడానికి అతనికి శత్రువులు లేరు, భయపడడానికి జంతువులు లేవు. అది పరిపూర్ణ పరదైసు.

మరియు ఆదామును తొందర పెట్టడానికి పాపము లేదు. అతనిలో పాపపు స్వభావము లేదు, అతని బంధించడానికి మానసిక సమస్యలు లేవు. ఆదాము సమాధానము తనలో కలిగియున్నాడు. ఆదాము దేవునితో సమాధానము కలిగి యున్నాడు. అది పరిపూర్ణ పరదైసు. ఒక స్నేహితురాలిని కనుగొనే విషయంలో కూడ అతనికి చింతించే అవసరము లేదు. దేవుడు పరిపూర్ణ, అందమైన, సంతోష పరిచే అమ్మాయిని అతనిని ఆదరించడానికి భార్యగా సహాయ పడడానికి తయారు చేసాడు. కనుక అతడు ఎప్పుడు ఒంటరిగా లేడు. ఆమె పరిపూర్ణురాలు కాబట్టి, ఆమె అతని హృదయాన్ని గాయపరిచే అవకాశము లేదు, అతని విడిచిపెట్టే అవకాశము లేదు, ఆమె అతనిని ప్రేమించకుండా ఉండడం అతని విడిచిపెట్టడానికి అవకాశము లేదు. పాపము లేదు కాబట్టి ఆమె అతని ప్రతీ లైంగిక వాంఛను తీర్చింది దేవుని సంతోష పెట్టకుండా. అది పరిపూర్ణ పరదైసు.

దేవుడు ప్రతి రోజు పరిపూర్ణ సామరస్యముతో అతనితో మాట్లాడాడు. అతడు ఎన్నడు శోధింపబడలేదు. దేవుని ఉగ్రత పాలవడానికి అతడు ఏమి చేయనవసరము లేకున్నది, ఎందుకంటే ఉగ్రతకు గురికావడం లేదు. అతని ప్రేమించే అందమైన స్త్రీతో జీవించాడు. రుచికర భోజనముందే వనములో జీవించాడు. దేవునితో సమాధానము కలిగి యున్నాడు. అది పరిపూర్ణ పరదైసు.

దేవుడు అతనికి ఒక న్యాయశాస్త్రము ఇచ్చాడు. అది గైకొనడానికి చాలా సులువైనది. విదేయుడవడానికి ఒకేఒక చాలా సులువైన ఆజ్ఞ. దేవుడతనితో చెప్పాడు, "ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును: అయితే మంచిచెడ్డల తెలివినిచ్చు, వృక్ష ఫలమును తినకూడదు: నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను" (ఆదికాండము 2:16-17). అతని దగ్గర నుండి దేవుడు అదే కోరుకున్నాడు. అతడు చేయవలసిందల్లా మంచి చెడ్డల తెలివి నిచ్చు వృక్ష ఫలములను తినకుండా ఉండడం. అది చేయడానికి చాలా సులువైనది. అది పరిపూర్ణ పరదైసు.

అయితే, వనములో మరియొక వ్యక్తి ఉన్నాడు. సాతాను ఉన్నాడు. పరలోక దూతలలో అతడు ఒకడు. కాని అతడు దేవునిపై తిరుగుబాటు చేసినందున భూమిపైకి త్రోసి వేయబడ్డాడు. సాతాను దేవుని శత్రువు. కాని అతని నుండి ప్రభువు ఆదామును కాపాడాడు. దేవుని హృదయాన్ని గాయ పరచడానికి సాతానుకున్న ఒకేఒక మార్గము ఆదాము దేవునిపై తిరగబడేటట్టు చేయడం.

వనములో చాలా ప్రాముఖ్యమైన రెండు వృక్షాలున్నాయి. ఒకటి జీవ వృక్షము. ఆ చెట్టు యొక్క ఫలము ఆదాము భుజిస్తూ ఉంటే, ఏదేను పరదైసులో అతడు నిరంతరము జీవించి ఉండేవాడు (ఆదికాండము 3:22). కాని మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తింటే అతడు చనిపోతాడు. అది పరిపూర్ణ పరదైసు – ఒకే నియమము పాటించాలి – జీవ వృక్ష ఫలము తిని నిరంతరము జీవించడం. అది న్యాయ శాస్త్రము యొక్క సానుకూలము వైపు విషయము. మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తింటే నీవు చనిపొతావు. అది న్యాయ శాస్త్రము యొక్క ప్రతికూలపు వైపు విషయము. అది చాలా సామాన్య న్యాయ శాస్త్రము – గైకొనడం సులభం. ఒక చెట్టు నుండి తిని నిరంతరం జీవించడం. ఇంకొక చెట్టు నుండి తిని నీవు చనిపోవడం. అది పరిపూర్ణ పరదైసు గైకొనడానికి, మరియు ఒకేఒక, సులువైన న్యాయశాస్త్రముతో – చాలా, చాలా సులువైన నియమముతో గైకొనడానికి.

ఇప్పుడు, దేవుడు ఆదామును తన భార్యను కాపాడాడు కనుక, సాతాను వారికి హాని చెయ్యలేకపోయింది. వారిని శోధించడానికి, ఆ సామాన్య నియమాన్ని ఉల్లంఘించేలా చేసింది. సాతాను పాము కాదు. అది తరువాత జరిగింది దేవుడు వానిని సర్పమును శపించినప్పుడు. కాని, ఇప్పుడు, సాతాను తోటలో ఒక చరములో ప్రవేశించింది. తరువాత వాడు వాని దయ్యాలు క్రీస్తు ఆజ్ఞను బట్టి పందులలో ప్రవేశించాయి. ఇక్కడ, వాడు, "వెలుగు దూత" లా ప్రత్యక్షమయ్యాడు (II కొరిందీయులకు 11:14).

అసలైన సర్పము ఎలా ఉండేదో మనకు తెలియదు. దానికి కాళ్ళున్నాయని మనకు తెలుసు. మనకు తెలుసు ఆ ప్రాకేదాన్ని ఏదేను వనంలో తరుచు చూసి ఉండేవారు, కనుక దానికి హవ్వ బయపడలేదు. మనకు ఇంకా తెలుసు సాతాను ఈ జంతువులో ప్రవేశించి దాని నోటి ద్వారా ఆదాము భార్యతో మాట్లాడింది. అది ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఆశ్చర్య పడలేదు. ఆమె బహుశా దానితో చాలా సార్లు మాట్లాడి ఉండి ఉండేది దానితో మాట్లాడడానికి అలవాటు పడింది. ఈనాడు కూడ వాడు అదే చేస్తున్నాడు. వాడు పాపులతో వారి మనసులతో మాట్లాడుతాడు, వారు తనకు అలవాటు పడేవరకు, తను అంటే భయం లేనట్టు చేస్తాడు.

ఒకరోజు హవ్వ తోటలో ఒంటరిగా ఉంది. ఆదాము వేరే చోట ఉన్నాడు "దానిని సేద్య పరచుచూ కాచుచూ ఉన్నాడు" (ఆదికాండము 2:15). హవ్వ తోట మద్యలో ఉండి, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును చూస్తుంది. అప్పుడు సాతాను ఆమె వద్దకు వచ్చింది. అప్పుడు సర్పము, "ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా?" (ఆదికాండము 3:1). అప్పుడు సర్పము దేవుని వాక్కును ప్రశ్నించింది. ఈనాడు కూడ సాతాను అదే చేస్తుంది. బైబిలులోని దేవుని వాక్యమును మనం నమ్మకూడదని వాడు శోధిస్తాడు. దేవుడు చెప్పేది నమ్మకూడదని వాడు శోధిస్తాడు. సంఘ కాపరి దేవుని వాక్యము మనకు బోధించేటప్పుడు ఆయన చెప్పేది నమ్మకూడదని వాడు శోధిస్తాడు. కాని, అంతకంటే ఎక్కువగా, సాతాను దేవుని వాక్యాన్ని వక్రీకరించి ఆ మృతమైన చెట్టు నుండి వచ్చే దానిని తినవచ్చు అనిపించేలా చేస్తుంది, దేవుడు చెప్పాడు కాబట్టి, "ఈతోటలో ఉన్న ఏచెట్టు ఫలము నైనను తినవచ్చును." షేక్స్ ఫియర్ అన్నాడు, "దెయ్యము తన ఉద్ద్దేశము నిమిత్తము లేఖనాలు చెప్పగలడు." ఇక్కడ దెయ్యము దేవుని సందేశంలోని రెండవ భాగాన్ని వదిలేసింది, "అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు, వృక్ష ఫలమును తినకూడదు: నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవు" (ఆదికాండము 2:17). సర్పము దేవుని వాక్యములోని ఆ భాగాన్ని వదిలేసింది. బైబిలులోని రెండుసార్లు మనము హెచ్చరింపబడ్డాం లేఖనాలలో ఏ పదమును విడిచి పెట్టకూడదని, ద్వితియోప దేశకాండము 12:32 లోను మరియు ప్రకటన గ్రంధము 22:19 లోను, ఇలా వ్రాయబడింది, "ఈ ప్రవచన గ్రంధమందున్న వక్యములలో ఎవడైనను ఏదైనను తీసివేసిన యెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములలోను పరిశుద్ధ పట్టణంలోను, వానికి పాలు లేకుండా చేయును..." ప్రపంచంలో ప్రతీ స్వతంత్ర సెమినరీలో ఈ చెడు బోధించబడుతుంది. యవనస్తులు బైబిలులోని కొన్ని భాగాలు నిజాలు కావని ఆలోచిస్తారు. నేను హాజరయిన స్వతంత్ర సెమినరీలో నాకు నేర్పబడింది. ఇది ఒక వ్యక్తి పరిచర్యను నాశనము చేస్తుంది ఈ చెడు బోధను అతడు నమ్మితే. అపోస్తలుడైన పౌలు అన్నాడు, "లేఖనములన్నియు దేవుని ప్రేరేపణచే ఇవ్వబడ్డాయి, అవి ప్రయోజనకరము..." (II తిమోతి 3:16). ప్రతీ లేఖనములలోని మాటలు ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో దేవునిచే ప్రేరేపించబడ్డాయి. అందుకే నేను కింగ్ జేమ్స్ బైబిలుకు కచ్చితంగా పరిమితమవుతాను. ఆధునిక బైబిలు పదాలు వదిలేస్తాయి "మరియు ఉపవాసము" మార్కు 9:29, లేక "కన్యక" ను "యవన స్త్రీ" గా మారుస్తాయి యెషయా 7:14. ఈ మార్పులు లేఖనాల పాత కాపీలపై ఆధారపడి ఉన్నాయి, ఇవి యోగా పర రచయితచే మార్చబడ్డాయి.

నేను హాజరయిన స్వతంత్ర సెమినరీలో వారు మాకు తరగతికి మార్చబడిన ప్రమాణ బైబిలు తెచ్చుకోమన్నారు. నేను అవిదేయుడనై కింగ్ జేమ్స్ బైబిలే తీసుకు వెళ్ళేవాడిని. "నూతన" తర్జుమాలను నమ్మనే నమ్మను, మీరు కూడ. కొన్నిసార్లు అవి చెప్పుతాయి కింగ్ జేమ్స్ ఆధారంగా, కాని నా వ్యక్తిగత పఠనలో కాని నా ప్రసంగాలలో ప్రధాన భాగాలుగా గాని చదవను. నా జీవిత కాల అలవాటుగా చేసుకున్నాను కింగ్ జేమ్స్ బైబిలును, మీరు కూడ అలాగే చేసుకోండి!

సర్పము స్వచ్చమైన దేవుని వాక్యాన్ని వక్రీకరించింది ఆరోజు వనంలో హవ్వను శోధించినప్పుడు. దేవుడు ఆ జంటకు తేటగా చెప్పాడు నిషేదించబడిన ఫలమును తినకూడదని. కాని కేవలం తినకూడదని మాత్రమే. "ముట్టుట"ను గూర్చి దేవుడేమి చెప్పలేదు. హవ్వ చెప్పింది, "మీరు తినకూడదు, ముట్టకూడదు కూడ, అలా చేస్తే చనిపోతారు" ఆమె దేవుని వాక్యానికి జత చేసింది. ఇది ద్వితీయోప దేశకాండము 12:32 ను ఉల్లంఘిస్తుంది, అక్కడ దేవుడు చెప్పాడు, "నేను ఆజ్ఞాపించునదెల్లా, మీరు చేయుడి: మీరు ఏమియు చేర్చకూడదు..." (ద్వితీయోప దేశకాండము 12:32). ఈ ఆజ్ఞ మళ్ళీ ప్రకటన 22:18 లో ఇవ్వబడింది,

"ఈ గ్రంధమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్య మిచ్చుచున్నది, ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినా యెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయును" (ప్రకటన గ్రంథము 22:18).

స్వతంత్రులు దేవుని వాక్యములోని వదిలిపెట్టే వాటిని వక్రీకరిస్తారు. మొర్మోనులు లాంటి తెగవారు దేవుని వాక్యానికి కలుపుతారు మొర్మోను పుస్తకంలో. అలా శోధన అంటే దేవుని వాక్యము నుండి తీసివేయడం, లేక కలపడం. ఖురాను క్రీస్తు సిలువ వేయబడడాన్ని విడిచి పెట్టింది. తెగవారు దానికి కలిపారు, క్రైస్తవ శాస్త్రవేత్తలు కూడ, మేరి బేకర్ ఎడ్డీ రచనలు కలిపారు. దేవుని వాక్యాన్ని మార్చడమనేది అబద్ద భోధలకు మూలము. అలా కలపడం లేక తీసివేయడం హవ్వకు వచ్చిన శోధనకు కనపరుస్తుంది, ఇది వేర్పాటు వాదుల హృదయాల్లో ఉంది.

ఇప్పుడు సాతాను హవ్వను ఎంతగా శోధించిందంటే ఆమె తప్పనిసరిగా దేవుని వాక్యముపై సాతాను దాడిని వినవలసి వచ్చింది. వాడు ఆమెతో చెప్పాడు, "నీవు నిశ్చయంగా చావవు" ఆ నిషేధించిన ఫలమును తినిన యెడల.

"స్త్రీ ఈ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచి నప్పుడు, ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని, తిని, తనతోపాటు తన భర్తకు ఇచ్చెను; అతడు కూడ తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవ బడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు; అన్జూరపు ఆకులు కుట్టి, తమకు కచ్చడములను చేసు కొనిరి" (ఆదికాండము 3:6, 7).

వారి దేవుని వాక్యమునకు అవిధేయులయ్యారు. ఇప్పుడు వారికి తెలుసు వారు దిగంబర పాపులని. పశ్చాత్తాప పడి కృప కొరకు దేవుని అడిగే బదులు, "అంజూరపు ఆకులు కుట్టి, తమకు కచ్చడములు చేసుకొనిరి" (ఆదికాండము 3:7). ఈనాటి పాపులు అలాగే చేస్తారు. వారి పాపాలు ఆయారీతులుగా కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు, "మంచి క్రియలు" చేయడం ద్వారా లేక "దైవత్వము కలిగిన వారి వలే" ప్రయత్నించడం ద్వారా (II తిమోతి 3:5).

ఇప్పుడు వారు దేవుడు వారిని పిలుచుట వినినప్పుడు, "ఆదాము అతని భార్య ప్రభువైన దేవుని సన్నిధి నుండి దాగుకున్నారు...ప్రభువైన దేవుడు ఆదామును పిలిచి, అన్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు?" (ఆదికాండము 3:8, 9). డాక్టర్ డబ్ల్యూ. ఏ. క్రీస్ వెల్ అన్నాడు,

దేవుడు పలికిన అతి విచారకర వాక్యమిది, "ఆదాము, ఎక్కడ ఉన్నావు?" [నమ్మిండి] పురుషుడు స్త్రీ పరలోకపు ఆతృతతో ప్రభువును కలిసారు... అది వారితో మాట్లాడడానికి రావడం ఆనందకర, మహిమకర ఘడియ [దేవుడు]. వారికి భయము లేదు. కాని ఇప్పుడు [వారు పాపము చేసారు]. మానవుడు భయము చెందాడు. ఇద్దరు సిగ్గుపడ్డారు. ప్రభువు తన స్వరములో మార్పుతో పిలుస్తున్నాడు, "ఓ ఆదాము, ఎక్కడ ఉన్నాడు, నీవు ఏమి చేసావు?" హృదయ విచారకరమైన ఆ ప్రశ్నకు జవాబు పాపము కృప నేరవేర్పుల కధ (W. A. Criswell, Ph.D., Basic Bible Sermons on the Cross, Broadman Press, 1990, p. 55).

ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు, "ఓ పాపి, నీవెక్కడ ఉన్నావు?"

"ప్రభువైన దేవుడు ఆదామును పిలిచి, అతనితో ఈలాగనెను, నీవు ఎక్కడ ఉన్నావు?" (ఆదికాండము 3:9).

అన్వయింపు

ఇప్పుడు నేను ఈ పాఠ్యభాగము యొక్క అన్వయింపు మీకు చెప్తాను. ఈ రాత్రి నీవు ఎక్కడ ఉన్నావు?

1. నీవు దేవుని నుండి దాగుకుంటున్నావా? పశ్చాత్తాప పడి క్రీస్తు నోద్దకు రావడానికి నిరాకరించే వారు దేవుని నుండి దాచుకుంటున్నారు. అది నీవా? పరిశుద్ధాత్మ క్రీస్తు నొద్దకు పిలుస్తున్నప్పుడు దేవుని నుండి దాచుకుంటున్నావా? ఈ రాత్రి అది నీ పాపమా?

2. నీవు బైబిలు నమ్మడానికి నిరాకరించడం ద్వారా నీవు దేవుని నుండి దాగుకుంటున్నావా? దేవుని వాక్యము ఒక పాత పుస్తకము అని అనుకునేలా సాతాను చేస్తుందా? అది నీవు నమ్మనవసరం లేదు? పొందుకోవడానికి పరలోకము భయపడడానికి నరకము లేవని వాడు నీతో చెప్పాడా? ఈ రాత్రి అది నీ పాపమా?

3. మంచి నీతి జీవితం జీవిస్తున్నావని నీవనుకొను చున్నావా? నీవు మంచివాడవని, పాపాలు ఒప్పుకోనవసరం లేదని క్రీస్తు నేరవేర్పుతో రక్షింప బడనవసరము లేదని నీవను కుంటున్నావా? నీ మంచి నీతి జీవితం నిన్ను రక్షించడానికి సరిపోతాయా? ఈ అబద్ధము సాతాను నీకు చెప్పిందా? అదే నీవు నమ్ముచున్నావా? ఈ రాత్రి అది నీ పాపమా?

4. ఉజ్జీవములో దేవుడు దిగి వచ్చి నప్పుడు పాపపు ఒప్పుకోలు పొందుకున్నావా, నీ పాపపు మనసును బట్టి దుష్ట హృదయమును బట్టి? పాపములను బట్టి ఏడ్చేవారిని చూచి వారు బలహీనులు అవివేకులు అనుకున్నావా? ఇప్పుడు అలా అనుకుంటున్నావా? ఏడ్చి పశ్చాత్తాప పడే వారు బుద్ధిహీనులు అని అనుకునేలా సాతాను నిన్ను ఆలోచింప చేస్తుందా? ఈ రాత్రి అది నీ పాపమా?

5. నిద్ర పోలేనంతగా జాన్ కాగన్ పాపముతో పోరాటము చేస్తున్న విషయము నీవు విన్నప్పుడు, అది వింతగా నీకు అనిపించిందా? అది అవసరము లేదని, బుద్ధి హీనుడైన అబ్బాయి పాపమును గూర్చి చింతిస్తున్నారని నీవు అనుకున్నావా? జాన్ కాగన్ చాలా భావోద్రేకుడని సాతాను నిన్ను అనుకునేలా చేసిందా? నీ ఆత్మకు ఇలాంటిది అవసరము లేదా? ఈ రాత్రి అలా నీ పాపము?

6. నిజ మార్పులో పాపానికి ఆ విషయంలో విచారము ఉంటుందని నేను చెప్పినప్పుడు, నీవు సాతాను మాట వింటున్నావా? నేను చెప్పే దాన్ని తిరస్కరించి, నీవు భాగానే ఉన్నవని అనుకుంటున్నావా? ఈ రాత్రి అదా నీ పాపము?

7. నేను అలా చెప్పడం విన్నప్పుడు, నీవు చేసిన పాపాలు చిన్నవి నరక పాత్రుని చెయ్యవు అనుకుంటున్నావా? ఆ తలంపు నీ మనసులో పుట్టిన సాతానును నమ్ముతావా? నీ పాపాలు చిన్నవి దేవుడు నిన్ను తీర్పు తీర్చడు అనుకుంటున్నావా? ఈ రాత్రి అది నీ పాపము?

8. నశించు స్నేహితులను కలిగి యుంటావా? క్రైస్తవేతరులు నీకు స్నేహితులుగా ఉన్నా, దేవుడు నిన్ను దీవిస్తాడని రక్షిస్తాడని అనుకుంటావా? బైబిలు ఇలా చెప్తున్నప్పుడు, "ఎవడు... ఈలోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు" (యాకోబు 4:4). లోక స్నేహితులను విడిచి పెడుతున్నవా? లేక వాళ్లతో ఉండడం పర్వాలేదు అనుకుంటున్నావా? నీ హృదయంలో సాతాను ఆ తలంపు పెట్టిందా? ఈ రాత్రి అది నీ పాపము?

9. నీకు తెలిసిన వారితో శృంగారము చేయ్యలనుకుంటున్నావా – గుడిలో ఎవరైనా అలంటి తలంపులు కలిగివున్నా – నీ కామాతురతను తీర్చుకోవచ్చని సాతాను నీతో చెప్పిందా? ఈ రాత్రి అది నీ పాపము?

10. గంటల తరబడి విడియో గేములు ఆడడం పరవాలేదు అనుకుంటున్నావా? అది హానిలేని సరదా అని సాతాను నీతో చెప్పిందా? ఈ రాత్రి అది నీ పాపము?

11. సంఘ కాపరిగా నన్ను గూర్చి భయపడుతున్నావా? నేనంటే ఎందుకు భయం? చాలా కచ్చితంగా ఉంటాను అనా? నేను చెప్పే చేసే వాటిలో ఏదో పొరపాటు కనుగోవడం వలనా? మీరు దేవుని నుండి దాగుకుంటున్నారు కాబట్టి నాకు భయపడేలా సాతాను చేస్తుందా, పరిపూర్ణంగా లేనని అందుకు నన్ను నిందిస్తున్నారా? జాన్ కాగన్ తో పాటు ఈ ఉదయము ప్రసంగంలో చెప్పింది మీరు చెప్పగలరా, "మన కాపరిని బట్టి దేవునికి వందనాలు!"? మీ "ఆత్మను చూసు కుంటున్నందుకు" నీవు నన్ను ప్రేమించగాలవా – లేక నాకు భయపడి, నీ రహస్య జీవము నా నుండి దాచుతున్నావా, ఆదాము తన రహస్య జీవితాన్ని దేవుని నుండి దాచినట్లు గద్దింప బడకుండా? నాకు భయపడేటట్టు సాతాను చేస్తుందా? ఈ రాత్రి అది నీ పాపము? (హెబ్రీయులకు 13:17).

12. ఒక వ్యక్తిని నీ స్నేహితుడి గానో స్నేహితులురాలి గానో ముందు కాపరితో మాట్లాడకుండా ఎన్నిక చేసుకోవాలను కుంటున్నావా? సంఘాన్ని నడిపిస్తున్న కాపరిని నమ్ముతున్నావా, లేక అతని నుండి దాగుకుంటున్నావా, వనంలో ఆదాము చేసినట్లు? ఈ రాత్రి అది నీ పాపము?

13. నీ హృదయములో ఏమైనా చీకటి విషయాలు ఉన్నాయా అది నీ నోరు మూసేస్తుందా మేము నిన్ను అడిగేటప్పుడు, "నీవు క్రీస్తును నమ్ముతావా" అని అడిగినప్పుడు? అదే సాతాను నీతో చెప్పిందా? నీవు ఏమి చెప్పకపోతే యేసును తిరస్కరించి నందుకు నీవు క్షమించ బడతావని వాడు నీతో చెప్పాడా? ఈ రాత్రి అది నీ పాపము?

14. గుడిలో ఎవరిదైనా నీకు అసూయ ఉందా? వారు పొగడబడుతున్నారు నీవు కాదని నీకు అసూయ ఉందా? ఈ రాత్రి అది నీ పాపము?

15. ఆహ్వానము ఇవ్వబడినప్పుడు రావడానికి తిరస్కరిస్తున్నవా? బైబిలు చెప్తున్నా దాన్ని తిరస్కరిస్తున్నవా, "మూర్ఖుని మార్గము వాని దృష్టిలో సరియైనదిగా తోచును: కాని ఉపదేశము మొగ్గు వాడు జ్ఞానవంతుడు"? ప్రసంగము తరువాత ఉపదేశామును తిరస్కరించే బుద్ధిహీనుడవా నీవు? ఈ రాత్రి అది నీ పాపము?


ఇది కాని నేను చెప్పిన ఏ పాపాలైన మీరు క్రీస్తును నమ్మకుండా చేస్తున్నాయా ఈ సంవత్సరం మన సంఘములో ఉజ్జీవము సమయంలో? "ఓ ఆదాము, నీవెక్కడ ఉన్నావు?" నీ పాపమును గూర్చి దేవుని స్వరము విన్నావా? ఆదాముతో పాటు నీవు చెప్తావా, "నీ స్వరము విన్నాను...నేను భయంతో ఉన్నాను...నేను దాగుకొన్నాను"? రెండు లేఖన వచనాలు ఇస్తాను,

"అతి క్రమములు దాచి పెట్టువాడు వర్దిల్లడు: వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును" (సామెతలు 28:13).

"ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, మనమును వెలుగులో నడిచిన యెడల, మనము అన్యోన్య సహవాసము గల వారమై యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును" (I యోహాను 1:7).

దయచేసి నిలబడండి. డాక్టర్ కాగన్, జాన్ కాగన్ మరియు నేను ప్రసంగ వేదిక దగ్గర ఉంటాం ఎవరైనా పాపము నుండి మరలి ప్రభువైన యేసు క్రీస్తును నమ్మితే వారికి ఉపదేశిస్తాం – ఆయన ప్రశస్త రక్తములో పాపములు కడుగుకోండి. 7 వ పాట పాడుచుండగా, మీ స్థలము వదిలి ముందుకు రండి. 7 వ పాట.

నా దృష్టి అంతటినీ నింపు, రక్షకా, నా ప్రార్ధన,
   ఈ రోజు కేవలము యేసునే చూడనిమ్ము;
లోయ ద్వారా నీవు నన్ను నడిపించినను,
   మీ అంతరించని మహిమ నన్ను ఆవరిస్తుంది.
నా దృష్టి అంతటినీ నింపు, దైవిక రక్షకా,
   మీ మహిమతో నా ఆత్మ ప్రకాశించే వరకు.
నా దృష్టి అంతటినీ నింపు, అందరు చూచునట్లు
   మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింభించాలి.

నా దృష్టి అంతటినీ నింపు, ప్రతి కోరిక
   మీ మహిమ నిమిత్తమే; నా ఆత్మ ప్రేరేపించబడాలి,
మీ పరిపూర్ణతతో, మీ పరిశుద్ధ ప్రేమ,
   పైనుండి వచ్చు వెలుగుతో నా మార్గము
       వెలుగుమయమవాలి.
నా దృష్టి అంతటినీ నింపు, దైవిక రక్షకా,
   మీ మహిమతో నా ఆత్మ ప్రకాశించే వరకు.
నా దృష్టి అంతటినీ నింపు, అందరు చూచునట్లు
   మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింభించాలి.

నా దృష్టి అంతటిని నింపు, పాపము లేకుండా
   వెలుతురు నాలో ప్రకాశించునట్లు.
మీ ఆశీర్వదపు ముఖమును మాత్రమే చూడనిమ్ము,
   మీ అనంత కృపలో నా ఆత్మ సంతోశించునట్లు.
నా దృష్టి అంతటినీ నింపు, దైవిక రక్షకా,
   మీ మహిమతో నా ఆత్మ ప్రకాశించే వరకు.
నా దృష్టి అంతటినీ నింపు, అందరు చూచునట్లు
   మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింభించాలి.
("నా దృష్టి అంతటినీ నింపు" ఆవిస్ బర్గ్ సన్ క్రిస్టియాన్ సేన్, 1895-1985).
(“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్: ఆదికాండము 3:8-10.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"నన్ను పరిశోధించు ఓ దేవా" (కీర్తనలు 139:23-24)/
"నేను వచ్చుచున్నాను, ప్రభు" (లూయిస్ హార్ట్ సాట్ చే, 1828-1919; పల్లవి మాత్రమే).
“Search Me, O God” (Psalm 139:23-24)/
“I Am Coming, Lord” (by Lewis Hartsough, 1828-1919; chorus only).