Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




వారి మధ్య నుండి బయలు వెడలుడి!

COME OUT FROM AMONG THEM!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, నవంబర్ 13, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, November 13, 2016

"కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకు, అని ప్రభువు చెప్పుచున్నాడు; మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు అయి యుందురని, సర్వ శక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు" (II కొరింధీయులకు 6:17-18).


"వారి మధ్య నుండి బయలు వెడలుడి." అంటే పాపములో జీవించుచున్న వారిని విడిచి పెట్టుట అని అర్ధము. "ఎడబాటు" అంటే అదే అర్ధము, అంటే "వారి మధ్య నుండి బయలు వెడలుడి." ఎడబాటు అనేది బైబిలులో అతి ప్రాముఖ్యమైన బోధ. ఎడబాటు చాలా ప్రాముఖ్యము అది లేకుండా మీరు క్రైస్తవులు కాలేరు. ఎడబాటు ప్రాముఖ్యము ఎందుకంటే అది లేకుండా నిజ జీవితమూ మీరు జీవింప లేరు. ఎడబాటు లేకుండా జయించే జీవితమూ జీవింపలేరు. ఎడబాటు అంటే అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుండుట. ఎడబాటు అంటే లోకమును ప్రేమించకుండుట. బైబిలు చెప్తుంది, "ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల, [దేవుని] ప్రేమ తనలో ఉండదు" (I యోహాను 2:15). మళ్ళీ అది చెప్తుంది, "ఎవడైతే...లోకానికి స్నేహితుడో వాడు దేవుని శత్రువు" (యాకోబు 4:4). ఒకరున్నారు యేసు నాకు, నన్ను సరిదిద్దడానికి, "మీరు ఒకరి నొకరు ప్రేమించిన యెడల, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలుసుకొందురు" (యోహాను 13:35). కానీ అతడు అంటే ఎవరు? అవిశ్వాసులకు కాదు. ఒకరినొకరు ప్రేమించు శిష్యులను గూర్చి ఆయన మాటలాడుచున్నాడు. సేక్స్ ఫియర్ అన్నాడు, "సాతాను తన కొరకు లేఖనాలు చెప్పగలడు." మన పాఠ్యభాగము దానిని తేట పరుస్తుంది,

"మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, ప్రత్యేకంగా ఉండుడని, ప్రభువు చెప్పుచున్నాడు" (II కొరింధీయులకు 6:17).

నశించు వారి నుండి ఎడబాటు ఎందుకు అంత ప్రాముఖ్యము?

I. మొదటిది, ఎడబాటు ప్రాముఖ్యము ఎందుకంటే బైబిలు అంతా అది బోధింపబడినది.

లోతు భార్య సొదొమ పట్టణములోని తన పాపపు స్నేహితులను విడిచిపెట్ట లేదు కనుక తన ఆత్మను నశింప చేసుకుంది. ఆ పట్టణాన్ని నాశనము చేస్తానని దేవుడు లోతుతో చెప్తాడు. ఆయన నాశనము చేద్దామని ఎందుకనుకున్నాడంటే ప్రజలు పాపులై లోకరీత్యా ఉన్నారు. దేవుడు లోతుతో చెప్పాడు, "లెండి ఈ చోటును విడిచి పెట్టండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడు" (ఆదికాండము 19:14). సోదోమేను వదిలి పెట్టాలని లోతు తన భార్యకు చెప్పాడు. ఆమె తన భర్తను వెంబడించింది. కానీ తన పాపపు స్నేహితులను తాను విడిచి పెట్టాలనుకోలేదు. తన భర్తతో పాటు బయలుదేరింది. కానీ "అతని భార్య వెనుకకు చూచి, ఉప్పు స్థంభమాయెను" (ఆదికాండము 19:26). డాక్టర్ చార్లెస్ సి. రైరీ అన్నాడు, "తన హృదయము ఇంకను సొదొమలో ఉంది. తన పాప స్నేహితులను విడవాలనుకోవడం లేదు. తాను వెనుకను తిరిగి తన పాత స్నేహితుల దగ్గరకు వెళ్లాలనుకుంది. తన పాప స్నేహితులను కలవడానికి వెనుకకు తిరిగినప్పుడు 'ఉప్పు స్తంభమయింది.'" సొదొమపై దేవుడు పంపిన అగ్ని గంధకము ఆమెను కప్పింది. మండుచున్న గంధకము ఆమెను కప్పింది. తన శరీరముపై దేవుడు గంధకము క్రుమ్మరించాడు. స్తంభముగా మారిపోయింది. ఆమె సజీవ దహనం అయింది ఎందుకంటే సొదొమలో తన పాపపు స్నేహితుల నుండి ఎడబాటు నిష్ఠ పడలేదు. తన ఆత్మను కోల్పోయి నరకానికి వెళ్ళింది. యేసు చెప్పాడు,

"లోతు భార్య జ్ఞాపకము చేసికొనుడి" (లూకా 17:32).

మీరు సంఘాన్ని విడిచి మీ పాపపు స్నేహితులతో వెళ్తే మీకు అదే జరుగుతుంది. మీరు దేవుని తీర్పు అగ్నిలో నశించి పోతారు!

"లోతు భార్య జ్ఞాపకము చేసికొనుడి."

జాన్ బన్యన్, మన బాప్టిస్టు పితరుడు, అలాంటి కథే చెప్పాడు. ఒక వ్యక్తి నాశనపు పట్టణాన్ని విడిచి పెట్టాడు. క్రీస్తు వెనుక పరుగెడుతూ వెనుకకు చూడలేదు. రక్షింపబడని ఇద్దరు స్నేహితులు అతని వెంట పరుగెత్తారు. నాశన పట్టణానికి తిరిగి వెళ్ళమని చెప్పారు. అతడు వారి మాట వినలేదు. నశించు స్నేహితుల వద్దకు రమ్మన్నారు. అతడలా చెయ్యలేదు. నశించు స్నేహితులను విడిచి వేరుపడ్డాడు (యాత్రికుని ప్రయాణము నుండి తీసుకొనబడినది జాన్ బన్యన్ చే).

మీరు సంఘానికి వస్తూ రక్షింపబడాలనుకుంటే అదే మీకు జరుగుతుంది. మీ నశించు స్నేహితులు బంధువులు సామాన్యంగా మిమ్మును తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటారు. పాపపు జీవితానికి వెళ్ళడానికి. బనియన్ స్నేహితులు చెప్పారు, "నీవు నీ లోక స్నేహితులందరిని విడిచి పెడతావా?" "అవును," బునియన్ చెప్పాడు, "అవును, వారందరిని విడిచి పెడతాను, దీని ద్వారానే నేను క్రీస్తులో రక్షణ కనుగొనగలను." ఇది లోతు భార్య విషయంలో నిజము. ఆమె తన పాపపు స్నేహితుల వెంట వెళ్లి దేవుని తీర్పులో అగ్నిలో సజీవ దహనం అయింది. బూనియన్ జీవితంలో కూడ అది వాస్తవమే. ఈనాడు కూడ అది నిజమే! పాపపు స్నేహితుల నుండి ఎడబాటు రక్షింప బడడానికి ఒకే మార్గము. గుడికి రాకుండా ఆపే మీపాపపు స్నేహితులను విడిచి పెట్టండి. వారిని విడిచి యేసు నొద్దకు రండి. నిజ క్రైస్తవుడవడానికి అదే దారి.

"కావున మీరువారి మధ్య నుండి బయలు వెడలి, ప్రత్యేకంగా ఉండుడి, అని ప్రభువు చెప్పుచున్నాడు... మరియు [నేను] మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలుగా ఉందురని, సర్వ శక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు" (II కొరింధీయులకు 6:17-18).

వారి మధ్య నుండి బయలు వెడలుడి! ఎడబాటు అవసరము. పాపమూ నుండి నరకము నుండి రక్షింప బడాలంటే మీరు పాపపు స్నేహితులను విడిచి పెట్టాలి. యేసుచే మీరు నిజముగా రక్షింపబడాలనుకుంటే మీరు పాపపు బంధువులను నశించు స్నేహితులను విడిచి పెట్టాలి. బైబిలు చెప్తుంది,

"మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి: నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?" (II కొరింధీయులకు 6:14).

డాక్టర్ జాన్ ఆర్. రైస్ ఈ వ్యాఖ్యానము చెప్పాడు. అతడన్నాడు,

బైబిలులోని ఒక తేటమైన సిద్ధాంతము క్రైస్తవుని వేర్పాటు సిద్ధాంతము. ఆ బోధ దేవుడు అనుదినము, మళ్ళీ మళ్ళీ, నిత్యత్వములో చెప్పాడు, యూదుల విషయంలో... హెబ్రియా వ్యవసాయకుడు తన గుంపును ఏర్పాటు చేసుకున్నప్పుడు, తన హృదయంలో అనుకున్నాడు, "దేవా వివిధ గుంపులతో దున్న కుండునట్లు నన్ను ఆజ్ఞాపించు. నేను రెండు ఎద్దులతో గాని రెండు గాడిదలతో గాని దున్నగలను; కానీ రెంటిని కలిపి కాదు. వాటిని కలప లేను ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు గుర్తుంచుకోమని నేను దేవుని ప్రజలు కానీ వారితో కలవకూడదని" (Dr. John R. Rice, The Unequal Yoke, Sword of the Lord, 1946, pp. 4-5).

అవిశ్వాసులతో స్నేహము కుదరదని బైబిలు ఈ చివర నుండి ఆ చివర వరకు బోధింప బడింది.

"మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి: నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?" (II కొరింధీయులకు 6:14).

II. రెండవది, ఎడబాటు మిమ్ములను లోక సహవాసము నుండి స్థానిక సంఘ సహవాసములోనికి నడిపిస్తుంది.

యోహాను 15:19 లో యేసు చెప్పినది వినండి. యేసు అన్నాడు,

"మీరు లోక సంబంధులైన యెడల, లోకము తన వారిని స్నేహించును: అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించు చున్నది" (యోహాను 15:19).

ఆ మాటలపై దృష్టి ఉంచండి, "నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొంటిని." ఈ మాటలు గట్టిగా చెప్పండి, "నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొంటిని."

యోహాను 17:6 లో, యేసు మళ్ళీ చెప్పాడు,

"లోకము నుండి నీవు నాకనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరచితిని..."

"లోకము" నకు గ్రీకు పదము ఈ రెండు వచనాలలో నశించు మానవాళిని సూచించు చున్నది. యేసు అన్నాడు,

"నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొంటిని"
       (యోహాను 15:19).

దీని అర్ధము ఎడబాటు. మనము "లోకములో నుండి" ఎన్నిక చేయబడితిమి.

కొత్త నిబంధనలో "సంఘము" నకు గ్రీకు పదము "ఎక్లీషియా" అని అనువదింపబడింది. దాని అర్ధము "పిలువబడిన వారు," "ఏక్" నుండి, "కాలియో" పిలుచుట (వైన్). కనుక, పదము "సంఘము" అంటే "పిలువబడిన వారు" అని అర్ధము (స్కోఫీల్డ్, గమనిక మత్తయి 16:18).

అపొస్తలుల కార్యములు 2:47 వినండి. ఇక్కడ యెరూషలేము స్థానిక సంఘములో ఏమి జరిగిందో వివరింపబడింది. అది చెప్తుంది,

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను" (అపొస్తలుల కార్యములు 2:47).

యేసు అన్నాడు,

"నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొంటిని"
        (యోహాను 15:19).

ఆధునిక ఆంగ్లములో అది చాలా తేటగా ఉంది,

"ప్రభువు [పిలవబడిన వారిని] సంఘములో చేర్చుచుండెను" (అపొస్తలుల కార్యములు 2:47).

అలా, మనము లోకము నుండి పిలువబడి సంఘము లోనికి వచ్చియున్నాము.

"కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, ప్రత్యేకంగా ఉండుడి, అని ప్రభువు చెప్పుచున్నాడు..."
        (II కొరింధీయులకు 6:17).

బైబిలు పర ఎడబాటు లోక సహవాసము నుండి మిమ్మును బయటికి తీసుకొని వస్తుంది. ఎడబాటు స్థానిక సంఘ సహవాసములోనికి మిమ్మును నడిపిస్తుంది. మీరు లోకాన్ని వెనుకకు నెట్టి, సంఘములో కొత్త స్నేహితులను పొందుకుంటారు.

III. మూడవది, ఎడబాటు హృదయానికి సంబంధించినది.

యాకోబు 4:4 దయచేసి చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1309 వ పేజీలో ఉంది. నిలబడి గట్టిగా చదువుదాం,

"వ్యభిచారుణులారా, ఈలోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వారు దేవునికి శత్రువగును" (యాకోబు 4:4).

ఇది తేటయైన విషయము! "ఎవరైతే ఈలోక స్నేహితులవుతారో వారు దేవునికి శత్రువులవుతారు." కూర్చోండి.

నశించు వారి పట్ల యేసు దయ చూపాడు. ఆయన సుంకరుల తోనూ పాపులతోను కలిసి భోజనము చేసాడు. ఆయన సన్నిహిత స్నేహితులు శిష్యులు, మరియు మార్త, లాజరు. ఆయన స్నేహితులు నిజ క్రైస్తవులు –ఆయనను వెంబడించాలని ఆయన పిలుస్తున్నాడు. మీ సన్నిహిత స్నేహితులు అంతా నిజ క్రైస్తవులుగా ఉండేటట్టు చూసుకోండి! నిజ క్రైస్తవులు కానీ వారిని విడిచిపెట్టండి. అదే బైబిలు బోధిస్తుంది!

"కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకు, అని ప్రభువు చెప్పుచున్నాడు; మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు అయి యుందురని, సర్వ శక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు" (II కొరింధీయులకు 6:17-18).

ఆల్ బర్ట్ బార్నస్ ఈ విషయాలు చెప్పాడు, బైబిలు మాటలు ఆధారంగా. అతనన్నాడు,

      [క్రైస్తవులవానకున్న వారు] తమ్మును లోకము నుండి ఎడబాటు చేసుకోవడానికి నిర్ణయించుకోవాలి. [క్రైస్తవ్యము] అలాంటి ఎడబాటు లేకుండా ఉనికి ఉండదు, [నమ్మని] సహచరులను వదలడానికి ఇష్టపడకపోతే... దేవుని ప్రజల మధ్యన వారి నిజ స్నేహితులను పొందడానికి [వారు నిజ క్రైస్తవులు కాలేరు]... దేవుని స్నేహితులకు పాపమూ స్నేహితులకు మధ్య ఒక గీత ఉండాలి...ఇరుగు పొరుగు వారీగా పౌరులుగా కలవడానికి నిరాకరించాలి...మన స్నేహాలు దేవుని ప్రజలతో ఉండాలి. అందుకు, దేవుని స్నేహితులు మన స్నేహితులుగా ఉండాలి; మన సంతోషము వారితో ఉండాలి, లోకము చూడాలి [క్రీస్తు] స్నేహితులనే మనము ఎన్నుకుంటామని, కామము, అత్యాశ పాపమూ స్నేహితులను కాదని (Albert Barnes, Notes on the New Testament, II Corinthians, Baker Book House, 1985 reprint, p. 162).

లోకము చూడాలి వారు కోరుకునేది మనం కోరుకోమని!

బార్నస్ మనకు చెప్పాడు, "లోకము నుండి వేరుగా ఉండడానికి మనం నిర్ణయించుకోవాలి... దేవుని ప్రజలతో సన్నిహిత స్నేహితులను కలిగి యుండాలి" (ఐబిఐడి.).

జాన్ బన్యన్ రక్షణను వెతకని వ్యక్తితో ఇది చెప్తున్నాడు. అతనన్నాడు,

"మీరు నాశన పట్టణము జీవిస్తారు... అక్కడ చనిపోవు వారు అగ్ని గంధకము ఉండే సమాధిలోకి పోతారు. ఒప్పింప బడి, నాతో పాటు క్రీస్తు నొద్దకు రండి." "ఏమిటి!" అన్నాడు [అతని వెంబడించే వ్యక్తి]. "మా స్నేహితులను సౌకర్యాలను విడిచిపెట్టాలా?" "అవును," అన్నాడు [క్రీస్తును వెదికే వ్యక్తి], "నీవు [విడిచి పెట్టేదంతా] సమము కాదు... నేను వెదికే దానితో... నేను క్రీస్తును వెదకుచున్నాను – పాపాన్ని కాదు" (John Bunyan, Pilgrim’s Progress in Today’s English, retold by James H. Thomas, Moody Press, 1964, pp. 13-14).

మీరు లోకము నుండి క్రీస్తు నొద్దకు పిలువబడ్డారు. లోక స్నేహాన్ని సౌకర్యాలను వదలని వాడు క్రీస్తు నొద్దకు రాలేదు. మీరు ఒకేసారి రెండు దిశలలో చూడలేరు! "ద్విమనస్కుడు సమస్త మార్గముల యందు అస్థిరుడు" (యాకోబు 1:8). "ద్వి మనస్కుడు" క్రీస్తు నొద్దకు రానేరడు!

"కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, ప్రత్యేకంగా ఉండుడి... నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుండును..." (II కొరింధీయులకు 6:17-18).

క్రీస్తు మీరు లోకమును బదులు తనను నమ్మమని కోరుచున్నారు. పాతపేట చెప్తుంది,

"మీ హృదయ మిమ్ము," మానవ రక్షకుడు చెప్తున్నాడు,
   కృపలో మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నాడు;
అత్యధిక కృపను మీకు ఇస్తాను,
   నేను నీ కొరకు మరణించలేదా? మీ హృదయ మిమ్ము.
"మీ హృదయమిమ్ము, మీ హృదయమిమ్ము,"
   మృదువైన గుసగుస విను, మీరెక్కడున్నాను;
ఈ అంధకార లోకము నుండి ఆయన మిమ్మును వేరు చేస్తాడు,
   నెమ్మదిగా మాటలాడుచున్నాడు, "మీ హృదయమిమ్ము."
("మీ హృదయమిమ్ము" ఏలీయా ఇ. హెవిట్ చే, 1851-1920).
      (“Give Me Thy Heart” by Eliza E. Hewitt, 1851-1920).

జాన్ కాగన్ యుక్త వయస్సులో ఉన్నప్పుడు చేదు సంఘ పిల్లలతో ఉండేవాడు. పిల్లలు గుడికి వచ్చి నేను బోధించే దానిపై నవ్వేవారు. చెడు పరిహాసాలు చేశారు. వారు శృంగారము మారిజునా లాంటి మత్తు పదార్ధాల గూర్చి మాట్లాడేవారు. వారు తప్పు అని జాన్ కాగన్ చూసాడు. అతనికి పాపపు ఒప్పుకోలు కలిగింది. తన పాపమూ నరకానికి లాగుతున్నట్టు అనిపించింది. చివరకు జాన్ ఆ చెడు అబ్బాయిల నుండి దూరమయ్యాడు. వారిని పూర్తిగా విడిచిపెట్టి క్రీస్తుకు తన హృదయాన్ని ఇచ్చాడు. అతడు మన సంఘాములో మంచి క్రైస్తవ యవ్వనస్థులతో స్నేహం ఏర్పరచుకున్నాడు. త్వరలో మార్పు నొందాడు. నా ప్రసంగాల విషయంలో నవ్వినా ఆ చెడు అబ్బాయిలు మన సంఘము నుండి వెళ్లిపోయారు. కానీ జాన్ కాగన్ క్రీస్తును నమ్మి రక్షింపబడ్డాడు. అతడు రక్షింప బడడం మాత్రమే కాదు – ఇప్పుడు సెమినరీకి వెళ్లి కాపరి కాబోతున్నాడు. జాన్ బోధిస్తున్నప్పుడు అతని హృదయము పాపపు వ్యతిరేకతతో నిండుకొని యేసు పట్ల ప్రేమను కలిగియున్నట్టు మనకు అనిపిస్తుంది. అతడు సంఘ చెడు అబ్బాయిలను విడిచి అతని హృదయాన్ని జీవితాన్ని క్రీస్తుకు మాత్రమే ఇచ్చాడు. జాన్ కాగన్ నా అతి ప్రియా స్నేహితుడని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. జాన్ జాలి సివిల్ నాకుటుంబంతో కలిసి భోజనము చేసి గత శుక్రవారం సాయంత్రము మా అబ్బాయిల పుట్టినరోజు జరపడంలో హాజరయ్యారు. చెడు అబ్బాయిలు విడిచినప్పుడు, దేవుడు జాన్ కు నూతన స్నేహితులను ఇచ్చాడు. ఆరోన్ యాన్సీ, జాక్ గాన్, నోవాసాంగ్, ఈ వృద్ధ బోధకుడు లాంటి స్నేహితులు. మేమందరము జాన్ కాగన్ మా స్నేహితుడు అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాం ఎందుకంటే అతడు క్రీస్తు స్నేహితుడు –అతడు ఇక చేదు "సంఘా పిల్లల" స్నేహితుడు కాదు. అతడు క్రీస్తు నొద్దకు వచ్చాడు. అతడు మా దగ్గరకు వచ్చాడు. అతడు ఒకరోజు ఈ సంఘ కాపరి అవడం ఎంత ఆనందము. చేదు సంఘ పిల్లలు నరకాగ్నిలో నిత్యమూ కాలిపోతున్నప్పుడు అతడు ఇక్కడ బోధిస్తూ ఉంటాడు.

పాపపు స్నేహితుల నుండి మీరు దూరంగా వస్తారా? దేవుని కుమారుడైన, యేసును నమ్ముతావా? ఆయన దగ్గరకు వస్తారా, ఆయన రక్తము ద్వారా కడగబడుతారా? జాన్ కాగన్ అతని తండ్రి, నేను మీతో ప్రసంగ వేదిక ముందు మాట్లాడాలనుకుంటున్నాం. మీరు రండి, గ్రాఫిత్ గారు "మీ హృదయమిమ్ము" అనే పాట, పాడుతుండగా. మీరు రండి, ఆయన పాడుచుండగా మీరురండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్ చే: II కొరింధీయులకు 6:14-18.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారు:
"మీ హృదయమిమ్ము" (ఏలీయా ఇ. హెవిట్ చే, 1851-1920).
“Give Me Thy Heart” (by Eliza E. Hewitt, 1851-1920).



ద అవుట్ లైన్ ఆఫ్

వారి మధ్య నుండి బయలు వెడలుడి!

COME OUT FROM AMONG THEM!

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకు, అని ప్రభువు చెప్పుచున్నాడు; మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు అయి యుందురని, సర్వ శక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు" (II కొరింధీయులకు 6:17-18).

(I యోహాను 2:15; యాకోబు 4:4; యోహాను 13:35)

I.   మొదటిది, ఎడబాటు ప్రాముఖ్యము ఎందుకంటే బైబిలు అంతా అది బోధింప బడినది, ఆదికాండము 19:14, 26; లూకా 17:32; II కొరింధీయులకు 6:14.

II.  రెండవది, ఎడబాటు మిమ్ములను లోక సహవాసము నుండి స్థానిక సంఘ సహవాసములోనికి నడిపిస్తుంది; యోహాను 15:19; యోహాను 17:6;
 అపొస్తలుల కార్యములు 2:47.

III. మూడవది, ఎడబాటు హృదయానికి సంబంధించినది, యాకోబు 4:4; 1:8.