Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




అపవాదిని జయించుట ఎలా

HOW TO OVERCOME THE DEVIL
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, నవంబర్ 6, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, November 6, 2016

"వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి యున్నారు గాని; మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు" (ప్రకటన 12:11).


సాతాను అతని దెయ్యపు దూతలు పరలోకము నుండి వెళ్ళ గొట్టబడ్డాయి. అవి ఇంకను వాయు మండలంలో ఉన్నాయి. సాతాను "వాయు మండల సంబంధమైన అధిపతి" (ఎఫెస్సీయులకు 2:2) గా పిలవ బడుచున్నాడు. దెయ్యములు ఇంకను "[పరలోకపు] స్థలాలకు" వెళ్ళ గలుగుచున్నాయి (ఎఫెస్సీయులకు 6:12) – కొన్ని సార్లు "పరలోక ప్రదేశములోనికి" వెళ్ళ గలుగుచున్నాయి. అందుకే యోబు 1:6 లో చెప్పబడింది దెయ్యములు "ప్రభువు ముందు ప్రత్యక్షమవడానికి వాటికవే వచ్చాయి, వాటితో పాటు సాతాను కూడ ఉన్నాడు." కానీ శ్రమల కాలపు మొదటి 3 1/2 సంవత్సరంలో అవి అలా చెయ్యలేవు. అంత్య క్రీస్తు వచ్చినప్పుడు శ్రమల కాలము ఏడూ సంవత్సరాల కాలము ఇశ్రాయేలీయులకు క్రైస్తవులకు గొప్ప శ్రమల కాలము. అంత్య క్రీస్తు ఇశ్రాయేలుతో ఒక నిబంధన సంతకము చేసిన తరువాత శ్రమల కాలము ప్రారంభమవుతుంది (దానియేలు 9:27).

ఏడూ సంవత్సరాల శ్రమల కాలములో సాతాను అతని దయ్యములు పరలోకపు స్థలాల నుండి బహిష్కరింపబడతాయి భూమిపైకి పడద్రోయ బడతాయి! మనం చదువుతాము,

"అంతటా పరలోకము నందు యుద్ధము జరిగెను: దానియేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా; ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని, గెలువ లేకపోయిరి; గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వ లోకమును మోసపుచ్చుచు, అపవాదియని, సాతానని పేరు గల ఆది సర్పమైన, ఆ మహా ఘట సర్పము, పడ ద్రోయబడెను: అది మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడ పడ ద్రోయబడిరి" (ప్రకటన 12:7-9).

దీనిపై సాతాను బహు ఆగ్రహముగా ఉన్నాడు. మనకు చెప్పబడింది "అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని, బహు క్రోధము గలవాడై, మీ యొద్దకు దిగి వచ్చుయున్నాడని చెప్పెను" (ప్రకటన 12:12).

దయ్యము ఇప్పుడు కూడ బహు ఆగ్రహముతో ఉన్నది. వాడికి తెలుసు ఇశ్రాయేలు పునర్జన్మ అంతమునకు సూచన అని. చాలామంది బోధకులు వేదాంత అధ్యాపకుల కంటే అంతము యొక్క సూచనలు వాడికి బాగా తెలుసు. అందుకే "సాతాను కుతంత్రములను" క్రైస్తవులు బాగా ఎరిగి యుండాలి. అందుకే మనం "పోరాడాలి" ఎక్కువగా వానికి వాని దయ్యములు వ్యతిరేకంగా యుగాంతము సమీపించింది కాబట్టి. అందుకే మనం హెచ్చరింపబడ్డాం, "అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును" (II తిమోతి 3:1). దయ్యానికి ఇప్పటికే తెలుసు "తనకు సమయము తక్కువగా ఉందని" (ప్రకటన 12:12).

ఇప్పుడు మనకు ఉజ్జీవము ఉండదని కొంతమంది బోధిస్తుంటారు. సాతాను శక్తి చాలా ఎక్కువ కనుక మన సంఘాలకు దేవుడు ఉజ్జీవము పంపడు అని వారు చెప్తారు.

ఇటీవల ఎటార్నీ జె సేకులో అన్నాడు, "ఇరాక్ సిరియాలలో క్రైస్తవులకు ఇది అంతిమ సమయము. వారు సజీవ దహనం చేయబడుతున్నారు, సిలువ వేయబడి శిరచ్చేదనము గావించి బడుతున్నారు. ఇప్పుడు ఐసిస్ రసాయనిక ఆయుధాలు వాడుతున్నారు. మారణ హోమం భరింపరానిది." అయినను ఎన్నడూ లేని గొప్ప ఉజ్జీవాలు ఇరాన్, ఇరాక్ మరియు సిరియాలలో చోటు చేసుకుంటున్నాయి. సేకులో చెప్తున్నాడు ముస్లీము ఉగ్రవాదులను ఆపడానికి తనకు డబ్బు పంపమంటున్నాడు. అది బుద్ధిహీనత! అబద్దపు మాట! వారికి డబ్బు అవసరము లేదు! ఉజ్జీవము దిగి వచ్చునట్లుగా మనం ప్రార్ధించడం వారికి అవసరం! అందుకే ప్రార్ధించే క్రైస్తవులు వారికి అవసరము,

"గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు [వరుసగా] తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియ చేయుటకై అగ్ని గచ్ఛ పొదలను కాల్చు రీతిగాను... అగ్ని నీళ్లను పొంగా చేయు రీతిగాను, నీవు దిగి వచ్చెదవు గాక!" (యెషయా 64:1-2).

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఉజ్జీవమునకు సంబంధించి ప్రార్ధన ప్రాముఖ్యము!...ప్రత్యేక, అత్యవసర ప్రార్ధన ఉజ్జీవములో దేవుని ఆత్మ దర్శించునట్లు. ఈ [ప్రార్ధన] ను వ్యక్తము చేసే వేరే మెరుగైన పదము లేదు కౌపర్ పాటలో ఉన్న పదము కంటే, 'ఓ పరలోకము తెరచి, త్వరగా దిగి వచ్చి, వేలాది హృదయాలు మీ సవంతము చేసుకో'...ఇశ్రాయేలు జనాంగము...శత్రు దేశాలను కలుస్తాయి, శత్రువులు వారిని చుట్టూ ముడుతారు, కానీ ఏమి వారికి జరగదు? పర్వతములను కదలింప గల దేవుడున్నాడు అలా మనము [తప్పనిసరిగా] ప్రార్ధించగలగాలి" (Lloyd-Jones, Revival, Crossway Books, 1994 edition, pp. 305, 307).

క్రైస్తవులకు ముస్లీములు చేయు భయంకర విషయాలను గూర్చి మీరు చదువునప్పుడు, అమెరికాలో ఎవ్వరికి మీరు డబ్బు పంపవద్దు! అతడు గాని, భూమి మీద ఎవరైనా కానీ, వారికి సహాయము చేయగలరు? వారు ఇప్పటికే ఉజ్జీవాన్ని అనుభవిస్తున్నారు, వందలాది ముస్లీములు ప్రభువైన యేసు క్రీస్తు వైపు తిరుగుచున్నారు. డబ్బు పంపవద్దు. వారు వారికి సహాయము చెయ్యరు! శక్తి గల దేవునికి బలమైన ప్రార్ధనలు పంపండి. ఆయన ఆయన మాత్రమే వారిని రక్షింపగలడు. ఈ నూతన క్రైస్తవులు సజీవ దహనమై సిలువ వేయబడి, శిరచ్చేదనము గావించి బడుతున్నప్పుడు – దేవుడు తన బాహువులు విప్పి పరలోకపు నిత్యా ఆనందములోనికి వారికి చేర్చుకుంటాడు. ఈ హత సాక్ష్యులు, వారి శ్రమల ద్వారా, ఎక్కువ ముస్లీములను ప్రేరేపిస్తారు తద్వారా వారు ఉగ్రవాదం విడిచి వారి ఆత్మలను రక్షించడానికి, సిలువ వేయబడి సిలువపై మరణించిన క్రీస్తు వైపు తిరుగుతారు. రెండవ శతాబ్దపు ఆదిమ క్రైస్తవులను గూర్చి టెర్ టుల్లియన్ చెప్పాడు, అన్య రోమీయులచే వారు హింసింప బడుచున్నప్పుడు, "హత సాక్షుల రక్తము సంఘమునకు విత్తనము." మనం నివేదికలు వింటున్నాం ముస్లీము నాయకులు ఇప్పటికే భయపడుతున్నారు ఎందుకంటే వారి ప్రజలు చాలామంది ప్రభువైన యేసు క్రీస్తు వైపు మరులుతున్నారు. తన రోజులలో హింసింపబడు క్రైస్తవులను గూర్చి గొప్ప సంస్కర్త లూథర్ ఒక పాట వ్రాసాడు. పాటల కాగితములో 7 వ సంఖ్య పాట.

గొప్ప ఆశ్రయ దుర్గము మన దేవుడు, ఎన్నడూ విఫలము కానీ కేడెము,
   ఆయన మన సహాయకుడు, శారీరక అస్వస్థతల ప్రవాహాల మధ్యలో.
మన ఆది శత్రువు మనకు వ్యతిరేకంగా పనిచేయ తలపెట్టినను;
   ఆయన శక్తి సమర్ధతలు గొప్పవి, మరియు, భయంకర ద్వేషము,
భూమిపై ఆయనకు తగదు.

మన స్వశక్తికి తావిస్తే, మన శ్రమ నిరర్ధక మవుతుంది,
   మనవైపు మనము మంచివారముగా కాదు, దేవునిచే ఎన్నిక చేయబడిన వ్యక్తిగా.
ఆయన ఎవరిని అడుగుతారా? క్రీస్తు యేసు, అది ఆయనే;
   ప్రభు సైన్యము ఆయన పేరు, తరతరాల నుండి మారానివాడు,
ఆయనే యుద్ధము జయించాలి.
("గొప్ప ఆశ్రయ దుర్గము మన దేవుడు" మార్టిన్ లూథర్ చే, టిహెచ్.డి., 1483-1546).
      (“A Mighty Fortress Is Our God” by Martin Luther, Th.D., 1483-1546).

అదే చైనాలో సంభవించింది. కమ్యూనిస్టు నియంత మయేత్సేసంగ్ చే విదేశీ మిస్సేనరీలు వెళ్లగొట్టబడ్డారు. సాంస్కృతిక విప్లవ సమయంలో, గుడులు కాల్చి వేయబడ్డాయి. కాపరులు చెరసాలలో పెట్టబడ్డారు. వేలకొలది చైనీయ క్రైస్తవులు హింసింపబడి, చంపబడి చెరసాలలో వేయబడ్డారు. కానీ దేవుడు వారితో ఉన్నాడు. గొప్ప క్రైస్తవ్య ఉజ్జీవము ప్రారంభమయింది. కమ్యూనిస్టు క్రైస్తవ్యము వ్యాపించకుండా చేయగలినదంతా చేశారు. కానీ వారు విఫలులయ్యారు. ఇప్పుడు చైనాలో 150 మిలియన్ల క్రైస్తవులున్నారు. ఈనాడు అమెరికా, కెనడా, యూరపుల కంటే చైనాలో ఎక్కువ మంది సంఘములో ఉన్నారు! దేవుడు అది కమ్యూనిస్టు చైనాలో చేసాడు – అదే దేవుడు మిడిల్ ఈస్ట్ లో కూడ చేయగలడు! వాస్తవానికి, ఆయన అది చేస్తున్నాడు! ఆ ముస్లీము ప్రదేశాలలో దేవుడు వేలమంది క్రైస్తవులను లేపినట్లు ప్రార్ధించండి! మార్టిన్ లూథర్ చెప్పాడు,

సామగ్రి సంబంధితాలు పోనిమ్ము, ఈ అనిత్య జీవితమూ కూడ;
   వారు ఈ శరీరాన్ని చంపవచ్చు: దేవుని సత్యము నిత్యమూ నిలుస్తుంది,
ఆయన రాజ్యము నిరంతర ముండును.

రాబోవు గొప్ప శ్రమ కాలములో నిజ క్రైస్తవులకు అదే జరగబోతుంది. సాతాను వారిని భయంకరంగా దాడి చేస్తుంది.

క్రీస్తు విరోధులు వచ్చి వేలకొలది క్రైస్తవులను జైలు పాలు చేసి శిరచ్చేదనము చేస్తారు. కానీ వారు సాతాను జయిస్తారు! ఎలా?

"వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి యున్నారు గాని; మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు" ( ప్రకటన 12:11).

"గొర్రె పిల్ల రక్తమును బట్టి." యేసు క్రీస్తు రక్తము వారిని నిత్యములో భద్ర పరుస్తుంది. ఈరోజు కూడ, సాతాను మిమ్మును ఎదుర్కొనినప్పుడు, మిమ్మును విచారంగా నిరీక్షణ లేని వారుగా చేసినప్పుడు, క్రీస్తు రక్తమును జ్ఞాపకము చేసుకోండి. మీరు రక్షకుని రక్తమును చూచినప్పుడు, మీరు స్వదయ భయము నుండి బయలు పడతారు, శ్రమ కాలములో క్రైస్తవులకు జరుగునట్లు. మీరు దేవుని గొర్రె పిల్ల రక్తము ద్వారా సాతానును జయిస్తారు అది పాపమంతటిని విచారమును తీసివేస్తుంది.


మరియు వారు సాతానును జయిస్తారు

"వారి సాక్ష్యము ద్వారా." వారి రక్షకుడైన యేసును గూర్చి వారు సాక్ష్యమిస్తారు. హత సాక్ష్యత సాతానుపై గొప్ప విజయము. "హత సాక్ష్యులు రక్తము [నిజముగా] సంఘమునకు విత్తనము." కాపరి సామ్యూల్ లెంబ్ చైనీయ చెరసాలలో చాలాసార్లు పెట్టబడ్డాడు. చివరకు ఆయన చెప్పాడు, "కమ్యూనిస్టులు నన్ను బంధించడం ఆపేసారు. వారు నన్ను బంధించడం ఎందుకు ఆపారంటే నన్ను చెరసాలలో పెట్టినప్పుడల్లా, మన సంఘము అభివృద్ధి పొందింది. ఎక్కువ హింసలు అంటే ఎక్కువ ఆశీర్వాదాలు!"


నిలబడి పాటల కాగితములో 8 వ సంఖ్య పాట పాడండి.

మన తండ్రుల విశ్వాసము! ఇంకను జీవిస్తుంది,
   చెరసాలలో, అగ్నిలో, మరియు ఖడ్గముతో:
ఓ, ఆనందముతో మన హృదయాలు కొట్టుకుంటున్నాయి
   ఆ మహిమాయుక్త మాట వినినప్పుడల్లా!
మన తండ్రుల విశ్వాసము, పరిశుద్ధ విశ్వాసము!
   మరణ పర్వాంతము మేము నిజాయితీగా ఉంటాము!
("మన తండ్రుల విశ్వాసం" ఫ్రెడరిక్ డబ్ల్యు. ఫాబెర్, 1814-1863).
       (“Faith of Our Fathers” by Frederick W. Faber, 1814-1863).

మరియు ప్రతి క్రైస్తవులు క్రీస్తు కోసం చనిపోయే వారి అంగీకారం ద్వారా సాతాను అధిగమించడానికి ఉంటుంది. "మరియు వారు మరణాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు." వారు క్రీస్తు కొరకు మరణించడం వారి జీవితాల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆవిధంగా వారు సాతానును అధిగమిస్తారు! లేచి నిలబడి 8 వ పాటను మరల పాడండి,

మన తండ్రుల విశ్వాసము! ఇంకను జీవిస్తుంది,
   చెరసాలలో, అగ్నిలో, మరియు ఖడ్గముతో:
ఓ, ఆనందముతో మన హృదయాలు కొట్టుకుంటున్నాయి
   ఆ మహిమాయుక్త మాట వినినప్పుడల్లా!
మన తండ్రుల విశ్వాసము, పరిశుద్ధ విశ్వాసము!
   మరణ పర్వాంతము మేము నిజాయితీగా ఉంటాము!

మన తండ్రులు, అంధకార చెరసాలలో బంధింప బడ్డారు,
   హృదయము మనస్సాక్షి విషయంలో తేటగా ఉన్నారు;
వారి పిల్లల భవిష్యత్తు ఎంత మధురంగా ఉంటుంది,
   వారు, వారి వలే, మీ కొరకు మరణిస్తే!
మన తండ్రుల విశ్వాసము, పరిశుద్ధ విశ్వాసము!
   మరణ పర్వాంతము మేము నిజాయితీగా ఉంటాము!

"వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి యున్నారు గాని; మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు" ( ప్రకటన 12:11).

ఇప్పుడు సాతానును జయించిన వారు ఆ మాటల ద్వారా ఈరోజు జీవించిన వారు. 42 సంవత్సరాలు ప్రార్ధించాము మన సంఘానికి దేవుడు ఉజ్జీవము పంపాలని. కానీ ఉజ్జీవము రాలేదు. కారణమూ నాకు తేటగా ఉంది. ప్రజలు వచ్చి తిరిగి పాపమూ తట్టు మరలారు. అలాంటి మారని వారు ఎలా ఉజ్జీవాన్ని అనుభవిస్తారు? అది సాధ్యము కాదు. సంవత్సరము వెంబడి సంవత్సరము వారు పాప భూ యిష్ట, స్వార్ధ పూరిత జీవితాలు జీవిస్తున్నారు. వదిలేయడం ఆపేసారు. చివరకు కొంతమంది మన పిల్లలు నిజంగా మార్పు నొందారు. తరువాత, క్రమేణా కొంతమంది వచ్చి నిజంగా మార్చబడ్డారు. చివరకు నలుగురు లేక ఐదుగురు "సంఘ" పిల్లలు మారకుండా ఉండిపోయారు. అప్పుడు దేవుడు చివరకు మన ప్రార్థనలకు జవాబిచ్చాడు. దుష్టులు బయటికి వెళ్ళినప్పుడు, దేవుడు ఉజ్జీవాన్ని మనకు పంపించాడు.

ఒక అమ్మాయి నిజమైన హృదయ పూర్వక ప్రార్ధనలు, ఉజ్జీవము కొరకు చేసింది. ఒక స్త్రీ దుఃఖించి కన్నీళ్లతో ఉజ్జీవము కొరకు ప్రార్ధించింది. అదే సమయంలో ముగ్గురు యవ్వనస్థులు నా ఇంటికి వచ్చి ఉజ్జీవము కొరకు ప్రార్ధించారు. చివరకు, లోకరీత్యా ఉన్న నశించిన వారు వెళ్ళిపోయాక, మన ప్రార్థనలకు జవాబు దొరికింది. 24 మంది కొన్ని వారాలలో మార్పు చెందారు! వారు లోతైన పాపపు ఒప్పుకోలు క్రింద వచ్చారు. యేసు నొద్దకు వచ్చి ఏడ్చి మోర పెట్టారు. ఇద్దరు 80 సంవత్సరాలపైబడిన వారు, ఇది ఈనాడు అసాధారణము. పదమూడు మంది కళాశాల కెళ్లే యవ్వనస్థులు. ఒకతడు నశించిన దక్షిణ బాప్టిస్టు వ్యక్తి. అతడు ఇప్పటికే రక్షింపబడ్డాడని కొన్ని నెలలు నాతో వాదించాడు. కానీ నిజానికి అతడు ఈ సంవత్సరము ఉజ్జీవములో రక్షింపబడ్డాడు! అంత తక్కువ కాలములో 24 మంది మారడం మేమెప్పుడూ చూడలేదు. కూటాలలో దేవుని సన్నిధిని మేమందరము చూసాము. కొన్ని వారాలలో సగము మందికి నేను బాప్తిస్మము ఇస్తాను.

ఇది చాలా సంతోషకర సమయము, దేవునికి కృతజ్ఞత చెప్పడానికి పరిశుద్ధాత్మ నింపుదల నిమిత్తము, ఈ ప్రజలను క్రీస్తు నొద్దకు నడిపించినందుకు సిలువపై కార్చిన ఆయన రక్తముతో పాపమును కడిగినందుకు. దేవుడు మీకు చేసినది సాక్ష్యము చెప్పడానికి వచ్చే శనివారం రాత్రి సిద్ధంగా ఉండండి!

ఈ సంవత్సరంలోపు కొన్ని మార్పిడిలు జరగవచ్చు బహుశా. గతరాత్రి ఒకటి జరిగింది. ఈ సంవత్సరము 2016 ను మనము ఎప్పుడు జ్ఞాపక ముంచుకొంటాం దేవుడు తొలిసారిగా ఉజ్జీవము పంపిన సంవత్సరంగా.

సంఘము ఎప్పడు ఉజ్జీవము స్థితిలో ఉంటుందని మనము అనుకోకూడదు. కొన్ని నెలలు, సంవత్సరాలు కూడ, పట్టవచ్చు దేవుడు అది చెయ్యడానికి. ఈ మధ్యలో ఈ పరిశుద్ధాత్మ క్రుమ్మరింపును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఉజ్జీవపు కొనసాగింపులో జీవింప ప్రయత్నించ కూడదు లేనిచో మనము నిరుత్సాహపడి విచారపడతాము. ఒక సంఘము ఉజ్జీవపు కొనసాగింపులో కొనసాగ లేదు. మనము ఉత్ప్రేరకాలచే ఉజ్జీవింప బడవచ్చు! అది మనలను కాల్చి వేస్తుంది. కనుక, ప్రస్తుతము ఆగి ఆ 24 మార్పులను బట్టి దేవుని స్తుతిద్దాం. సమయ సమయమునకు ఎక్కువ మార్పులు ఉంటాయి. భవిష్యత్తులో, నేను నమ్ముతాను ఇంకొక ఉజ్జీవము వస్తుంది, బాగా గొప్పది. సంవత్సరపు మిగిలిన కాలమంతా, దేవుని శక్తిలో క్రీస్తు రక్తములో మనం ఆనందిద్దాం. ఈ నూతనంగా మారిన వారి కొరకు ప్రార్ధిద్దాం, వారు, శ్రమకాలపు క్రైస్తవుల వలే, "[సాతానును] గొర్రె పిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి యున్నారు; మరియు... కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు" (ప్రకటన 12:11). మనము నిలబడి దేవుడు పంపిన ఉజ్జీవమును గూర్చిన పాటను పాడదాం. పాటల కాగితములో 9 వ సంఖ్య పాట.

నా దృష్టి అంతటిని నింపు, రక్షకా, నేను ప్రార్ధిస్తున్నాను,
   ఈరోజు యేసును మాత్రమే చూడనిమ్ము;
లోయద్వారా నీవు నన్ను నడిపించినప్పటికీ,
   మీ హరించని మహిమ నన్ను ఆవరించును.
నా దృష్టి అంతటిని నింపు, దైవిక రక్షకా,
   నా ఆత్మ నీ మహిమతో ప్రకాశించే వరకు.
నా దృష్టి అంతటిని నింపు, ప్రతి కోరిక
   నీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతి బింబించడం.

నా దృష్టి అంతటిని నింపు, ప్రతి కోరిక
   నీ మహిమార్థమై; నా ఆత్మ ప్రేరేపించే బడుతుంది,
నీ పరిపూర్ణతతో, నీ పరిశుద్ధ ప్రేమతో,
   పై నుండి వచ్చు వెలుగుతో నా మార్గము నింపబడును.
నా దృష్టి అంతటినీ నింపు, దైవిక రక్షకా,
   నా ఆత్మ నీ మహిమతో ప్రకాశించే వరకు.
నా దృష్టి అంతటిని నింపు, అందరు చూసేటట్టుగా
   నీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతి బింబించడం.

నా దృష్టి అంతటిని నింపు, పాపము ఏ మాత్రమూ
   లోపల ప్రకాశించే వెలుగును కమ్ముకుండును.
నన్ను నీ ఆశీర్వాదపు ముఖము నే చూడనిమ్ము,
   నీ అనంత కృపపై నా ఆత్మ ఆనందించుచున్నది.
నా దృష్టి అంతటిని నింపు, దైవిక రక్షకా,
   నా ఆత్మ నీ మహిమతో ప్రకాశించే వరకు.
నా దృష్టి అంతటిని నింపు, అందరు చూసేటట్టుగా
   నీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతి బింబించడం.
("నా దృష్టి అంతటిని నింపు" అవిష్ బర్జ్ సన్ క్రిస్టియాన్ సేన్, 1895-1985).
      (“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

మీరు ఇంకను రక్షింపబడకపోతే పాప పశ్చాత్తాపము పొందాలని మేము అడుగుచున్నాము – క్రీస్తు వైపు తిరిగి ఆయన విశ్వసించుడి, సిలువపై ఆయన కార్చిన రక్తము ద్వారా మీ పాపాలు కడుగుకొండి. మీరు పాపులని భావించాలి. అప్పుడు మీరు యేసును నమ్మాలి ఆయన సిలువపైనా కార్చిన రక్తముతో మీ పాపాలను కడిగివేస్తాడు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము ఏబెల్ ప్రుదోమ్ గారు: ప్రకటన గ్రంధము 12:7-12.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారు:
      "గొప్ప ఆశ్రయ దుర్గం మన దేవుడు" (మార్టిన్ లూథర్ చే, 1483-1546).
“A Mighty Fortress Is Our God” (by Martin Luther, 1483-1546).